కివీస్‌ను మడతబెట్టిన భారత బౌల‌ర్‌పై ఐసీసీ చర్యలు | IND Bowler-Gurnoor Brar-Reprimanded-Breaching-ICC Code-Of-Conduct | Sakshi
Sakshi News home page

కివీస్‌ను మడతబెట్టిన భారత బౌల‌ర్‌పై ఐసీసీ చర్యలు

Nov 17 2026 4:11 PM | Updated on Nov 17 2026 4:18 PM

IND Bowler-Gurnoor Brar-Reprimanded-Breaching-ICC Code-Of-Conduct

Photo Credit: Twitter

న్యూజిలాండ్‌తో నాలుగో వన్డే సందర్భంగా కంట్రోల్‌ తప్పిన టీమిండియా బౌలర్ గుర్నూర్ బ్రార్‌పై ఐసీసీ చర్యలకు ఉపక్రమించింది. కివీస్ బ్యాటర్ టిమ్ సీఫెర్ట్ ఔటైన తర్వాత అతడి మీదకు దూసుకెళ్లి దూకుడుగా ప్రవర్తించిన గుర్నూర్‌ ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5ను ఆయన ఉల్లంఘించినట్లు మ్యాచ్ రిఫరీ రంజన్ మడుగల్లె నిర్ధారించారు.

గుర్నూర్ బ్రార్‌కు ఎటువంటి జరిమానా విధించడం లేదని, కేవలం మందలింపుతో సరిపెడుతున్నట్లు రిఫరీ తెలిపారు. అయితే క్రమశిక్షణా చర్యల కింద అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను కేటాయిస్తున్నట్లు తెలిపారు. కాగా 24 నెలల కాలంలో గుర్నూర్‌ది రెండో తప్పు కావడం గమనార్హం.

క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించి ఐసీసీ నుంచి మందలింపు ఎదుర్కొన్నప్పటికీ, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో మాత్రం గుర్నూర్ బ్రార్‌ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. నాలుగు మ్యాచ్‌లాడిన గుర్నూర్ 9 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఎగరేసుకుపోయాడు. అంతేకాదు ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లోనూ గుర్నూర్ పురోగతి సాధించాడు. ర్యాంకింగ్స్‌లో గుర్నూర్ బ్రార్ ఏకంగా 60 స్థానాలు ఎగబాకి 48వ స్థానంలో నిలిచాడు.

అసలేం జరిగిందంటే?
కివీస్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ వికెట్ తీసిన ఆనందంలో అతడి ముఖంపై విజయగర్జన చేస్తూ సెలబ్రేట్‌ చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా అతడిని దూషిస్తూ హద్దు మీరాడు. ఒకపక్క విరాట్ కోహ్లి వద్దని వారిస్తున్నా గుర్నూర్ వినకుండా సీఫెర్ట్‌ పైపైకి వెళ్లి మాటల యుద్ధానికి దిగడం కనిపించింది.

అంతకముందు ఓవర్లో ఇదే బ్రార్ బౌలింగ్‌లో సీఫెర్ట్ 14 పరుగులు పిండుకున్నాడు. దీంతో బ్రార్‌.. ఈరోజు నీ అదృష్టం బాగుంది.. అందుకే ఇలా బ్యాటింగ్ ఆడుతున్నావు’ అని పేర్కొన్నాడు. దీనికి సీఫెర్ట్ బదులుగా..‘నువెళ్లి బౌలింగ్ వెయ్యు.. నేను బ్యాటింగ్ ఇలాగే చేస్తా’ అని తెలిపాడు. 

దీంతో కోపంతో రగిలిపోయిన బ్రార్ తన మరుసటి ఓవర్లోనే సీఫెర్ట్‌ను ఔట్ చేయడంతో సంబరాల్లో మునిగిపోయాడు.  అందుకే ‘పెవిలియన్ వెళ్లు’ అంటూ సీఫెర్ట్  ముఖంపై గర్జిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. తప్పు ఎవరిదైనా గుర్నూర్ చర్య క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉంది.

ఇదీ చదవండి: ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన ధోని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement