source: X
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026లో ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్‌పై ఐదు వికెట్ల ప్రదర్శన (3-0-14-5) నమోదు చేసిన అతడు.. నిన్న జరిగిన రెండో మ్యాచ్‌లో పంజాబ్‌పై ఇంచుమించు అదే ప్రదర్శనను రిపీట్ చేశాడు. 3 ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ట్రిపుల్ వికెట్ మెయిడిన్ (w,0,w,0,w,0) ఉంది. మయాంక్ చెలరేగడంతో ఢిల్లీ 109 పరుగుల భారీ తేడాతో పంజాబ్‌ను చిత్తు చేసింది.
తొలి బంతి నుంచే విజృంభణ
241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు శుభారంభం లభించింది. అయితే ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన మయాంక్ యాదవ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా విహాన్ మల్హోత్రా, ఉదయ్ సహారన్, అర్జున్ రాజ్‌పుత్‌ను ఔట్ చేశాడు. ఆఖర్లో సుఖ్‌దీప్ బజ్వాను కూడా ఔట్ చేశాడు.
మయాంక్‌తో పాటు దిగ్వేశ్ రాఠీ (3-21), నితీశ్ రాణా (1-5), సిమర్‌జీత్ సింగ్ (1-36) కూడా రాణించడంతో పంజాబ్ ఇన్నింగ్స్ 17.5 ఓవర్లలో 131 పరుగుల వద్దే ముగిసింది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో 33 పరుగులు చేసిన హర్ప్రీత్ బ్రార్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అంతకుముందు ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ ప్రియాన్ష్ ఆర్య (32 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫిఫ్టీతో మెరవగా, యశ్ ధుల్ (40 బంతుల్లో 78 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ అర్థసెంచరీ సాధించాడు.
ఆఖర్లో నితీశ్ రానా (20 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), తేజస్వి దహియా (10 బంతుల్లో 20), హిమ్మత్ సింగ్ (4 బంతుల్లో 13 నాటౌట్; 2 సిక్సర్లు) కూడా రాణించారు. పంజాబ్ బౌలర్లలో సుక్‌దీప్ బజ్వా, సాహిల్ భాస్కర్ చెరో 2 వికెట్లు తీయగా, అర్జున్ రాజ్‌పుత్ ఒక వికెట్ పడగొట్టాడు.
ఇదీ చదవండి: ఐపీఎల్ 2027కు ముందు మరో భారీ ట్రేడ్ డీల్..!


