ఐపీఎల్ 2027కు ముందు మరో భారీ ట్రేడ్ డీల్..! | Mohammed Shami Likely To Move To Rajasthan Royals In Stunning IPL Swap says reports | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ 2027కు ముందు మరో భారీ ట్రేడ్ డీల్..!

Nov 17 2026 8:32 AM | Updated on Nov 17 2026 9:16 AM

Mohammed Shami Likely To Move To Rajasthan Royals In Stunning IPL Swap says reports

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు మరో భారీ ట్రేడ్‌ డీల్‌ జరిగిందని తెలుస్తోంది. భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) నుంచి రాజస్థాన్ రాయల్స్ (RR)కు మారనున్నట్లు సమాచారం.

బదులుగా ఇంగ్లండ్ స్టార్‌ ఆల్‌రౌండర్ సామ్‌ కర్రన్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి లక్నోకు మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువు ఇవాల్టితో ముగియనున్న నేపథ్యంలో ఈ భారీ ట్రేడ్ డీల్ వార్త ఆసక్తి రేపుతోంది. 

మరింత బలోపేతం
షమీ రాకతో రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విభాగానికి మరింత బలం చేకూరనుంది. ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌తో కలిసి షమీ కొత్త బంతితో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. పవర్‌ప్లేలో వికెట్లు తీయడంలో షమీకి మంచి రికార్డు ఉంది.

36 ఏళ్ల షమీ ఇటీవలే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ 2026లో లక్నో తరఫున 13 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు పడగొట్టాడు. అయితే 9 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు. ఆ సీజన్‌లో లక్నో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

షమీ గతంలో గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

మరోవైపు సామ్‌ కర్రన్ రాకతో లక్నో జట్టుకు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఉపయోగకరమైన ఆల్‌రౌండర్ లభించనున్నాడు. ఐపీఎల్ 2026లో గజ్జల్లో గాయం కారణంగా కర్రన్‌ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు.

ఇంగ్లండ్ 2022 టీ20 ప్రపంచకప్ గెలవడంలో కరన్ కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా అందుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో పరిస్థితులకు అనుగుణంగా పైకి, కిందికి ఆడటంతో పాటు ఇన్నింగ్స్‌లో వివిధ దశల్లో బౌలింగ్ చేయగల సామర్థ్యం అతడి సొంతం.

ఇదీ చదవండి: భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement