ఐపీఎల్ వేలానికి ముందు ఆసీస్‌ ప్లేయర్‌ విధ్వంసం | Jake Fraser McGurk Auditions For IPL Auction With 18 Ball Fifty In Domestic Tournament | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ వేలానికి ముందు ఆసీస్‌ ప్లేయర్‌ విధ్వంసం

Nov 16 2026 2:00 PM | Updated on Nov 16 2026 2:10 PM

Jake Fraser McGurk Auditions For IPL Auction With 18 Ball Fifty In Domestic Tournament

source: IPL X

ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు ఆస్ట్రేలియా యువ బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ చెలరేగిపోయాడు. ఆస్ట్రేలియా దేశవాళీ వన్డే టోర్నీలో న్యూ సౌత్ వేల్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు.

మూడో వేగవంతమైన హాఫ్ సెంచరీ
ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో మెక్‌గర్క్‌ మరో ఘనత కూడా సాధించాడు. టోర్నీ చరిత్రలో సంయుక్తంగా మూడో వేగవంతమైన అర్ధ సెంచరీ నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 20 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 56 పరుగులతో అజేయంగా నిలిచాడు.

మెక్‌గర్క్ విధ్వంసంతో సౌత్ ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. వర్షం కారణంగా న్యూ సౌత్ వేల్స్ లక్ష్యాన్ని 32 ఓవర్లలో 281 పరుగులుగా సవరించారు. అయితే ఆ జట్టు 108 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయం చవిచూసింది.

మెక్‌గర్క్‌ను ఢిల్లీ తిరిగి తీసుకుంటుందా..?
మెక్‌గర్క్ గతంలో ఐపీఎల్‌లో రెండు సీజన్లు ఆడాడు. అరంగేట్ర సీజన్‌లో ఆకట్టుకున్నప్పటికీ.. 2025 సీజన్‌లో మాత్రం నిరాశపరిచాడు. ఆరు మ్యాచ్‌ల్లో కేవలం 55 పరుగులే చేశాడు. అతడికి గతంలో ప్రాతినిధ్యం వహించిన ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ అవకాశం ఇవ్వవచ్చనే ప్రచారం జరుగుతోంది. మెక్‌గర్క్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ సౌరవ్ గంగూలీ ఆసక్తిగా ఉన్నట్లు ఇటీవల ఓ కథనం పేర్కొంది. 

ఇదీ చదవండి: పాటిదార్‌ ఊచకోత.. 13 సిక్సర్లు​, 8 ఫోర్లతో వీరవిహారం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement