'ప్లీజ్‌ సీఎస్‌కే.. అతడిని విడిచిపెట్టకండి' | S Badrinath’s huge statement on 2 crore star ahead of IPL 2027 auction | Sakshi
Sakshi News home page

IPL 2027: 'ప్లీజ్‌ సీఎస్‌కే.. అతడిని విడిచిపెట్టకండి'

Nov 14 2026 6:28 PM | Updated on Nov 14 2026 6:45 PM

 S Badrinath’s huge statement on 2 crore star ahead of IPL 2027 auction

ఐపీఎల్‌-2027 సీజ‌న్‌కు సంబంధించి ఫ్రాంచైజీలు త‌మ ఆట‌గాళ్ల రిటెన్ష‌న్ జాబితాను స‌మ‌ర్పించేందుకు గ‌డ‌వు న‌వంబ‌ర్ 17తో ముగ‌య‌నుంది. ఈ నేప‌థ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ మేనెజ్‌మెంట్‌కు టీమిండియా మాజీ క్రికెట‌ర్ సుబ్ర‌మ‌ణ్యం బద్రీనాథ్ కీల‌క సూచ‌న‌లు చేశాడు. 

న్యూజిలాండ్ స్టార్ పేస‌ర్ మాట్ హెన్రీని సీఎస్‌కే క‌చ్చితంగా రిటైన్ చేసుకోవాల‌ని బద్రీనాథ్ అభిప్రాయ‌ప‌డ్డాడు. గ‌త సీజ‌న్ వేలంలో హెన్రీని రూ.2 కోట్ల‌కు చెన్నై కొనుగోలు చేసింది. కానీ ఈ కివీస్ స్పీడ్‌స్టార్ మాత్రం త‌న మార్క్ చూపించ‌లేక‌పోయాడు. అయితే ప్ర‌స్తుతం మాత్రం హెన్రీ అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు.

గురువారం టీమిండియాతో జ‌రిగిన నాలుగో వ‌న్డేలో హెన్రీ అసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఏకంగా 6 వికెట్లు ప‌డ‌గొట్టి మెన్ ఇన్ బ్లూను దెబ్బ‌తీశాడు. ఈ క్ర‌మంలోనే అత‌డిని రిటైన్ చేసుకోవాల‌ని బద్రీనాథ్ సూచించాడు.

నాలుగో వ‌న్డేలో టీమిండియా ఓడిపోయిన‌ప్ప‌టికి.. మాట్ హెన్రీ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బరచ‌డం సీఎస్‌కేకు ఒక పాజిటివ్ అంశమ‌నే చెప్పాలి. అత‌డు 6 వికెట్లు ప‌డ‌గొట్టి భార‌త్ టాపార్డ‌ర్ కాకావికలం చేశాడు. అతడిని ఐపీఎల్ 2027 కోసం రిటైన్ చేసుకోవాలని నేను ఇప్ప‌టికే చాలాసార్లు చెప్పాను.  అతడికి మంచి అనుభవం ఉంది, ముఖ్యంగా పవర్‌ప్లేలో వికెట్లు తీయగల  బౌలర్. సీఎస్కే యాజమాన్యం దయచేసి అతడిని జట్టులోనే ఉంచుకోవాలి అని బద్రీనాథ్ త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో పేర్కొన్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement