source: IPL X
ఐపీఎల్ 2027 సీజన్‌కు చాలా ముందే ఫ్రాంచైజీల మధ్య ఆసక్తికర ట్రేడింగ్ డీల్స్ జరుగుతున్నాయి. కొద్ది రోజుల కిందట రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్, ఖలీల్ అహ్మద్, నాథన్ ఇల్లిస్, టి నటరాజన్, జీషన్ అన్సారీ స్వాపింగ్ ద్వారా ఫ్రాంచైజీలు మారగా.. తాజాగా హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్ ముంబై నుంచి పంజాబ్ కింగ్స్‌కు పరస్పర బదలీ అయ్యారు.
ఇవే కాక ఇంకా చాలా స్వాపింగ్ డీల్స్ చర్యల్లో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆసక్తికర డీల్‌కు సంబంధించిన వార్త తెరపైకి వచ్చింది.
ఓ స్పోర్ట్స్ జర్నలిస్ట్ కథనం ప్రకారం.. రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను జట్టులోకి తీసుకోవాలని లక్నో సూపర్ జెయింట్స్ ప్రయత్నిస్తుంది. అయితే రాయల్స్ పెట్టిన రెండు కీలక డిమాండ్లతో ఈ డీల్ ముందుకు సాగడం లేదని సమాచారం.
జైస్వాల్ కోసం ఇద్దరు బౌలర్లను అడిగిన రాజస్థాన్
జైస్వాల్ కోసం రాయల్స్ లక్నో కీలక పేసర్లైన మహమ్మద్ షమీ, మొహ్సిన్ ఖాన్‌ను అడిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు లక్నో ప్రస్తుతానికి సిద్దంగా లేదని సమాచారం. మరోవైపు జైస్వాల్ కోసం కేకేఆర్, ముంబై ఇండియన్స్ కూడా పోటీ పడినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
డిసెంబర్ 10 వరకు ట్రేడ్ విండో అందుబాటులో ఉండటంతో ఐపీఎల్ 2027 వేలానికి ముందు మరిన్ని కీలక బదిలీలు జరిగే అవకాశముంది.
ఇదీ చదవండి: ఐపీఎల్‌లో సంచలన ట్రేడ్ పూర్తి


