క్రేజ్‌ ఉంది కదా!.. అతడు ముంబై జట్టును వీడాలనుకోవడం లేదు! | Hardik Pandya didnt want to leave MI: Discarded batter IPL 2027 trade rumours | Sakshi
Sakshi News home page

తన విలువేంటో తెలుసు!.. అతడు ముంబై జట్టును వీడాలనుకోవడం లేదు!

Nov 9 2026 6:26 PM | Updated on Nov 9 2026 6:29 PM

Hardik Pandya didnt want to leave MI: Discarded batter IPL 2027 trade rumours

టీమిండియాతో హార్దిక్‌ పాండ్యా (PC: BCCI X)

ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా వచ్చిన నాటి నుంచి టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. దిగ్గజ కెప్టెన్‌ రోహిత్‌ శర్మను తప్పించి పాండ్యాకు పగ్గాలు అప్పగించడాన్ని ముంబై అభిమానులు సైతం జీర్ణించుకోలేకోయారు. అతడిని మైదానం లోపల, వెలుపల ట్రోల్స్‌తో ఏడిపించేశారు.

అందుకు తగ్గట్లుగానే 2024లోనూ ముంబై ఇండియన్స్‌ వరుస వైఫల్యాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇక గతేడాది ప్లే ఆఫ్స్‌ చేరినప్పటికీ.. ఈ ఏడాది మరోసారి పాత కథే పునరావృతమైంది. జట్టులోని రోహిత్‌ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌ వంటి సీనియర్లకు పాండ్యాతో పడటం లేదని.. అందుకే జట్టు రెండుగా చీలిందనే వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో 2027 వేలానికి ముందే హార్దిక్‌ పాండ్యా ముంబైని వీడనున్నాడనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. తొలుత అతడు చెన్నై సూపర్‌ కింగ్స్‌లో చేరతాడనే వార్తలు రాగా.. తర్వాత కోల్‌కతా నైట్‌ రైడర్స్‌లోకి వెళ్తాడనే ప్రచారం జరిగింది. తాజాగా అర్ష్‌దీప్‌ సింగ్‌ను తీసుకుని హార్దిక్‌ను పంజాబ్‌ కింగ్స్‌కు ముంబై ట్రేడ్‌ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విషయంపై టీమిండియాకు దూరమైన క్రికెటర్‌ హనుమ విహారి స్పందించాడు. తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ.. ‘‘మరొక కొత్త వార్త. హార్దిక్‌ పాండ్యా ముంబై ఇండియన్స్‌ను ఈ ఏడాది వీడివెళ్లాలనుకోవడం లేదట. ఎందుకంటే.. వచ్చే ఏడాది తర్వాత ఐపీఎల్‌ మెగా వేలం ఉంటుంది.

అప్పుడు నేరుగా వేలంలోకి వెళ్తే.. తనకున్న లైమ్‌లైట్‌ కారణంగా భారీ ధర పలుకుతాననే నమ్మకంతో అతడు ఉన్నాడట. నిజంగానే హార్దిక్‌ పాండ్యా ఎంతటి విలువైన ఆటగాడో అందరికీ తెలిసిందే. కాబట్టి అతడి కోసం ఫ్రాంఛైజీలు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసేందుకు సిద్ధంగానే ఉంటాయి.

అయితే, ఇటు ముంబై ఇండియన్స్‌ గానీ.. అటు హార్దిక్‌ గానీ ఈ ఊహాగానాలపై నేరుగా స్పందించేంత వరకు ఈ విషయంపై స్పష్టత రాదు. అయితే, అప్పటిదాకా ఈ ఊహాగానాలకు కూడా తెరపడదు. అయితే, ముంబై కోరుకుంటే హార్దిక్‌ పాండ్యా పంజాబ్‌ కింగ్స్‌లో చేరకతప్పదు’’ అని హనుమ విహారి అభిప్రాయపడ్డాడు. కాగా వివిధ గాయాల కారణంగా చాలా కాలంగా హార్దిక్‌ పాండ్యా కాంపిటేటివ్‌ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement