విండీస్ స్పిన్న‌ర్ అరుదైన ఫీట్‌.. బంగ్లాపై టెస్టు సిరీస్ కైవ‌సం | Warrican-100 Wickets-Feat-2nd Test-Draw-WI Won-Test Series 1-0 Vs BAN | Sakshi
Sakshi News home page

విండీస్ స్పిన్న‌ర్ అరుదైన ఫీట్‌.. బంగ్లాపై టెస్టు సిరీస్ కైవ‌సం

Nov 9 2026 5:40 PM | Updated on Nov 9 2026 5:59 PM

Warrican-100 Wickets-Feat-2nd Test-Draw-WI Won-Test Series 1-0 Vs BAN

Photo Credit: Twitter

బంగ్లాదేశ్‌తో జ‌రిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను వెస్టిండీస్ 1-0తో సొంతం చేసుకుంది. ఇరుజ‌ట్ల  మ‌ధ్య సోమ‌వారం ముగిసిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. 369 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన బంగ్లాదేశ్ ఐదోరోజు ఆట ముగిసే స‌మ‌యానికి 4 వికెట్లు కోల్పోయి 184 ప‌రుగులు చేసింది. 

తొలి ఇన్నింగ్స్‌లో డ‌బుల్ సెంచ‌రీతో మెరిసిన తౌహిద్ హృదోయ్ రెండో ఇన్నింగ్స్‌లో 82 ప‌రుగుల‌తో ఆక‌ట్టుకోగా, ముష్ఫిక‌ర్ ర‌హీమ్ (49) రాణించాడు. వెస్టిండీస్ బౌల‌ర్లలో జోమెల్ వ‌ర్రిక‌న్ మూడు వికెట్లు తీయ‌గా, ష‌మ‌ర్ జోసెఫ్ ఒక వికెట్ తీశాడు. అంత‌క‌ముందు వెస్టిండీస్ త‌మ రెండో ఇన్నింగ్స్‌ను 6 వికెట్ల న‌ష్టానికి 398 ప‌రుగుల వ‌ద్ద డిక్లేర్ చేసింది. క‌వెమ్ హ‌డ్జ్ (142) భారీ సెంచ‌రీ సాధించ‌గా, కెవిన్ విక్‌హ‌మ్ (78) అర్థ‌సెంచ‌రీ చేశాడు. ఇక బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 386 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా, విండీస్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 356 ప‌రుగులు చేసింది.

వంద వికెట్ల మార్క్‌..
తొలి ఇన్నింగ్స్‌లో అజేయ డ‌బుల్ సెంచ‌రీ, రెండో ఇన్నింగ్స్‌లో అర్థ‌సెంచ‌రీ సాధించిన తౌహిద్ హృదోయ్ 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌' అవార్డు ద‌క్కించుకోగా, సిరీస్‌లో 16 వికెట్లు ఖాతాలో వేసుకున్న జోమెల్ వర్రిక‌న్ 'ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు గెలుచుకున్నాడు. ఇక టెస్టుల్లో వంద వికెట్ల మార్క్ చేరుకున్న‌ జోమెల్ వ‌ర్రిక‌న్ విండీస్ త‌ర‌ఫున ఈ ఫీట్ సాధించిన ఎనిమిదో స్పిన్న‌ర్‌గా రికార్డుల‌కెక్కాడు. 

వ‌ర్రిక‌న్ కంటే ముందు లాన్స్ గిబ్స్‌, గార్‌ఫీల్డ్ సోబ‌ర్స్‌, సోని రామ్‌దిన్‌, అల్ఫ్ వాలంటైన్‌, దేవేంద్ర బిషువో, కార్ల్ హూప‌ర్‌, రోస్ట‌న్ చేజ్‌లు టెస్టుల్లో వంద వికెట్ల ఫీట్‌ను సాధించారు. అయితే ఎకాన‌మీ ప‌రంగా మాత్రం వ‌ర్రిక‌న్ బెస్ట్ ప్ర‌ద‌ర్శన (27.72) న‌మోదు చేయ‌డం విశేషం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement