breaking news
Jomel Warrican
-
వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. టీమిండియా భారీ స్కోరు.. డిక్లేర్డ్
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోరు సాధించింది. శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా.. ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)తో పాటు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) శతకంతో చెలరేగడంతో భారత్ ఈ మేర స్కోరు సాధ్యమైంది.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా భారత్ వేదికగా టీమిండియా- వెస్టిండీస్ రెండు మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో తొలుత అహ్మదాబాద్‌లో ఇరుజట్లు తలపడగా.. టీమిండియా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. జైస్వాల్ భారీ శతకంఇక ఢిల్లీలో శుక్రవారం రెండో టెస్టు (IND vs WI 2nd Test) మొదలు కాగా.. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (38) ఊహించని విధంగా స్టంపౌట్ కాగా.. యశస్వి జైస్వాల్ మాత్రం భారీ శతకంతో విరుచుకుపడ్డాడు.తొలి టెస్టు సెంచరీ మిస్మరోవైపు.. వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ (87)కెరీర్లో తొలి టెస్టు సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆటలో రెండు వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసిన టీమిండియా.. శనివారం ఆట మొదలైన కాసేపటికే మూడో వికెట్ కోల్పోయింది.జైసూ రనౌట్175 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యశస్వి జైస్వాల్ రనౌట్ అయి.. డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే, కెప్టెన్ గిల్ నిలకడగా ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి 43, వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ 44 పరుగులు చేసి.. అర్ధ శతకాలు పూర్తి చేసుకోకుండానే వెనుదిరిగారు.𝗚𝗶𝗹𝗹. 𝗚𝗹𝗼𝗿𝘆. 𝗚𝗿𝗲𝗮𝘁𝗻𝗲𝘀𝘀. 🙌@ShubmanGill reaches a brilliant century, guiding #TeamIndia towards a huge total, inching closer to the 500 mark! 🏏💪Catch the LIVE action 👉 https://t.co/tg7ZEVlTSH#INDvWI 👉 2nd Test, Day 2 | Live Now on Star Sports &… pic.twitter.com/vIWGDISIcx— Star Sports (@StarSportsIndia) October 11, 2025గిల్ నిలకడగాఇక గిల్ మొత్తంగా 196 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 129 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో 134.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద ఉన్న వేళ.. టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ జొమెల్ వారికన్ రాహుల్, సాయి, నితీశ్ రెడ్డి వికెట్లు తీయగా.. కెప్టెన్ రోస్టన్ ఛేజ్ జురెల్ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.చదవండి: గిల్‌పై అసహనం!.. తలబాదుకున్న జైస్వాల్.. తప్పు నీదే! -
IND vs WI: వెస్టిండీస్ జట్టు ప్రకటన.. వికెట్ల వీరుడికి చోటు
టీమిండియాతో టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ (West Indies tour of India- 2025) క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. భారత పర్యటనలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టుకు రోస్టన్ ఛేజ్ (Roston Chase) కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది. వారిపై వేటుఇక ఈ టూర్లో భాగంగా మాజీ సారథి క్రెయిగ్ బ్రాత్వెట్పై వేటు వేసిన విండీస్ బోర్డు.. చివరిగా ఆస్ట్రేలియాతో ఆడిన కేసీ కార్టీ, జొహాన్ లేన్, మికైల్ లూయీస్లను కూడా జట్టు నుంచి తప్పించింది.వికెట్ల వీరుడికి చోటుఅదే విధంగా.. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఖారీ పియరికి తొలిసారిగా టెస్టు జట్టులో చోటు ఇచ్చింది. వైస్ కెప్టెన్ జోమెల్ వారికన్తో కలిసి పియరి స్పెషలిస్టు స్పిన్నర్‌గా బరిలో దిగనున్నాడు. ఇటీవల జరిగిన వెస్టిండీస్ చాంపియన్‌షిప్‌లో 41 వికెట్లతో సత్తా చాటినందుకు గానూ పియరీకి ఈ అవకాశం దక్కింది. ఇక అలిక్ అథనాజ్, తగెనరైన్ చందర్‌పాల్‌కు వెస్టిండీస్ సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు.చందర్‌పాల్ రాకతో టాపార్డర్‌లో తమ జట్టు మరింత పటిష్టం అవుతుందని.. అదే విధంగా అథనాజ్ కూడా స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలడని తెలిపారు. కాగా అథనాజ్ చివరిసారిగా జనవరిలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆడాడు. సీమర్ల కోటాలో వీరేఅయితే.. పేసర్ గుడకేశ్ మోటికి మాత్రం విశ్రాంతినిచ్చినట్లు విండీస్ బోర్డు తెలిపింది. పరిమిత ఓవర్ల సిరీస్‌ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఉపఖండ పిచ్‌లపై మ్యాచ్ నేపథ్యంలో స్పిన్ విభాగానికి వారికన్ నాయకత్వం వహించనుండగా.. ఖారీ పియర్రి, రోస్టన్ ఛేజ్ అతడికి సహాయకులుగా ఉండనున్నారు.ఇక సీమర్ల కోటాలో అల్జారీ జోసెఫ్, షమార్ జోసెఫ్, ఆండర్సన్ ఫిలిప్, జేడన్ సీల్స్ స్థానం దక్కించుకున్నారు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా వెస్టిండీస్ టీమిండియాతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. అక్టోబరు 2- 14 వరకు ఇరుజట్ల మధ్య అహ్మదాబాద్, ఢిల్లీ వేదికలుగా ఈ రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి.టీమిండియాతో టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ జట్టురోస్టన్ ఛేజ్ (కెప్టెన్), జోమెల్ వారికన్ (వైస్-కెప్టెన్), కెవ్లాన్ ఆండర్సన్, అలిక్ అథనాజ్, జాన్ కాంప్‌బెల్, తగెనరైన్ చందర్‌పాల్, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, అల్జారీ జోసెఫ్, షమార్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఆండర్సన్ ఫిలిప్, ఖారీ పియర్రి, జేడన్ సీల్స్.చదవండి: మ్యాక్స్‌వెల్ కీలక నిర్ణయం -
వరుణ్ చక్రవర్తికి భంగపాటు
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy)కి నిరాశే మిగిలింది. ప్రతిష్టాత్మక ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు తొలిసారిగా నామినేట్ అయిన అతడికి భంగపాటు తప్పలేదు. వరుణ్ మాదిరే ఇటీవల అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్న వెస్టిండీస్ స్పిన్నర్ జొమెల్ వారికన్(Jomel Warrican) అవార్డును ఎగురేసుకుపోయాడు.ఇదొక చిన్న మైలురాయివరుణ్ చక్రవర్తి, పాకిస్తాన్ స్పిన్నర్ నొమన్ అలీ(Noman Ali)లను వెనక్కినెట్టి జనవరి నెలకు గానూ వారికన్ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘ఈ అవార్డు గెలవడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ఈ ఏడాది టెస్టుల్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడమే నా లక్ష్యంగా ఉండేది. అయితే, ఇంత గొప్పగా దానిని సాధిస్తానని అనుకోలేదు.నా క్రికెట్ ప్రయాణంలో ఇదొక చిన్న మైలురాయి. ఇలాంటివి మరెన్నో సాధించాలని కోరుకుంటున్నా. పాకిస్తాన్‌తో సిరీస్‌లో తప్పక రాణిస్తానని మా కెప్టెన్‌కు మాటిచ్చాను. మా నాన్న కళ్లెదుటే నా నుంచి ఇలాంటి గొప్ప ప్రదర్శన రావడం చాలా చాలా సంతోషంగా ఉంది’’ అని వారికన్ హర్షం వ్యక్తం చేశాడు.పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్లోకాగా ఇటీల పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ జొమెల్ వారికన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. పాక్ గడ్డపై రెండు టెస్టుల్లో కలిపి మొత్తంగా పందొమ్మిది వికెట్లు తీశాడు. ముల్తాన్ వేదికగా తొలి టెస్టు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన ఈ 32 ఏళ్ల స్పిన్నర్.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు వికెట్లు కూల్చాడు.అయితే, ఈ మ్యాచ్‌లో విండీస్ బ్యాటర్ల వైఫల్యం కారణంగా పాకిస్తాన్ చేతిలో 127 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక ముల్తాన్‌లోనే జరిగిన రెండో టెస్టులో వారికన్ వరుసగా నాలుగు, ఐదు వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ పాకిస్తాన్‌ను 120 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ క్రమంలో 2ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ సిరీస్’ అవార్డునూ వారికన్ సొంతం చేసుకున్నాడు.వరుణ్ మాయాజాలంమరోవైపు.. ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టీ20 సిరీస్‌లో వరుణ్ చక్రవర్తి ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 14 వికెట్లు కూల్చిన అతడి ఖాతాలో ఓ ఫైవ్ వికెట్ హాల్ కూడా ఉండటం విశేషం. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలిచిన వరుణ్.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. అయితే, వారికన్తో పోటీలో వెనుకబడి విజేతగా నిలవలేకపోయాడు. విజేతగా బెత్ మూనీఇక మహిళా క్రికెటర్ల విభాగంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ బెత్ మూనీ జనవరి నెలకు గానూ ‘’ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకుంది. ఇటీవల ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌లో భాగంగా తన టెస్టు కెరీర్లో తొలి శతకం బాదిన ఆమె.. అంతకు ముందు టీ20 సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో మూనీ ప్రదర్శనకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక అవార్డు వరించడం విశేషం.వెస్టిండీస్ స్పిన్నర్ కరిష్మా రామ్హరాక్, అండర్-19 ప్రపంచకప్-2025లో అదరగొట్టిన ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ తెలుగమ్మాయి గొంగడి త్రిషలను వెనక్కి నెట్టి మూనీ అవార్డును సొంతం చేసుకుంది. కాగా అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లకు అవార్డులు ఇచ్చే క్రమంలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ పురస్కారాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి నెలా నామినేట్ అయిన ఆటగాళ్లకు వచ్చిన ఓట్ల ఆధారంగా విజేతను నిర్ణయించి.. అవార్డును ప్రదానం చేస్తారు.చదవండి: తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం: మాజీ క్రికెటర్ ఫైర్ -
ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో వరుణ్ చక్రవర్తి
జనవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వివరాలను ఐసీసీ ఇవాళ (ఫిబ్రవరి 6) ప్రకటించింది. పురుషుల విభాగంలో ముగ్గురు స్పిన్నర్లు ఈ అవార్డు కోసం నామినేట్ అయ్యారు. పాక్ వెటరన్ స్పిన్నర్ నోమన్ అలీ, విండీస్ స్పిన్నర్ జోమెల్ వార్రికన్, టీమిండియా మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో నిలిచారు. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా బ్యాటర్ బెత్ మూనీ, విండీస్ స్పిన్నర్ కరిష్మ రామ్హరాక్, భారత యువ సంచలనం గొంగడి త్రిష జనవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు.నోమాన్ అలీ: ఈ పాకిస్తానీ వెటరన్ స్పిన్నర్ జనవరి నెలలో టెస్ట్‌ల్లో అత్యుత్తమంగా రాణించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో నోమాన్ 16 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ 10 వికెట్ల ఘనతతో పాటు హ్యాట్రిక్ ప్రదర్శన ఉంది. నోమాన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ కావడం ఇది రెండోసారి. నోమాన్.. గతేడాది అక్టోబర్‌లో ఈ అవార్డు గెలుచుకున్నాడు.వరుణ్ చక్రవర్తి: ఈ టీమిండియా మిస్టరీ స్పిన్నర్ టీ20ల్లో రీఎంట్రీ ఇచ్చాక చెలరేగిపోతున్నాడు. జనవరి నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వరుణ్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ నెలలో జరిగిన 4 మ్యాచ్‌ల్లో వరుణ్ 12 వికెట్లు తీశాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది. ఈ ప్రదర్శనల తర్వాత వరుణ్ టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబకాడు.జోమెల్ వార్రికన్: 32 ఏళ్ల ఈ కరీబియన్ స్పిన్నర్ జనవరి నెలలో పాక్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ సిరీస్‌లో అతను 19 వికెట్లు తీసి లీడింగ్ వికెట్‌టేకర్‌గా నిలిచాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ సిరీస్‌లో వార్రికన్ బ్యాటింగ్‌లోనూ పర్వాలేదనిపించాడు. రెండో టెస్ట్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో విండీస్ పాక్ గడ్డపై 34 ఏళ్ల తర్వాత విజయం సాధించింది.బెత్ మూనీ: ఈ ఆసీస్ వికెట్‌కీపర్ బ్యాటర్ ఇంగ్లండ్‌తో జరిగిన మల్లీ ఫార్మాట్ యాషెస్ సిరీస్‌లో సత్తా చాటింది. ఈ సిరీస్‌లోని టీ20 మ్యాచ్‌ల్లో మూనీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. టీ20 సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లో మూనీ 75, 44, 94 నాటౌట్ స్కోర్ల సాయంతో 213 పరుగులు చేసింది. ఫలితంగా ఆసీస్ టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ ప్రదర్శనల అనంతరం మూనీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్తానానికి ఎగబాకింది.కరిష్మ రామ్హరాక్: ఈ విండీస్ స్పిన్ బౌలర్ బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సత్తా చాటడంతో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యింది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో కరిష్మ రెండు నాలుగు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసింది. కరిష్మ సత్తా చాటడంతో ఈ సిరీస్‌లో విండీస్ బంగ్లాదేశ్‌పై 2-1 తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్‌లో కరిష్మ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకుంది.గొంగడి త్రిష: ఈ టీమిండియా యువ సంచలనం ఇటీవల ముగిసిన అండర్ 19 టీ20 వరల్డ్‌కప్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఈ టోర్నీలో త్రిష (జనవరిలో) 265 పరుగులు చేయడంతో పాటు 4 వికెట్లు తీసింది. ఈ టోర్నీలో స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన త్రిష.. టోర్నీ చరిత్రలో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. -
PAK Vs WI: పాక్ స్పిన్నర్‌కు ఇచ్చిపడేసిన విండీస్ బౌలర్
వెస్టిండీస్ క్రికెట్ జట్టు 35 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై చారిత్రక విజయం సాధించింది. ముల్తాన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో వెస్టిండీస్ పాక్‌ను 120 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. రెండో టెస్ట్‌లో 9 వికెట్లు తీయడంతో పాటు తొలి మ్యాచ్‌లో 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన విండీస్ స్పిన్నర్ జోమెల్ వార్రికన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.మ్యాచ్ మూడో రోజు ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. విండీస్ స్పిన్నర్ జోమెల్ వార్రికన్ పాక్ ఆటగాడు సాజిద్ ఖాన్‌కు ఇచ్చిపడేశాడు. పాక్ రెండో ఇన్నింగ్స్‌లో సాజిద్‌ను ఔట్ చేయగానే వార్రికన్ ప్రముఖ రెజ్లర్, హాలీవుడ్ నటుడు జాన్ సీనా స్టయిల్లో "యూ కాంట్ సీ మీ" సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అలాగే టీమిండియా గబ్బర్ శిఖర్ ధవన్ తరహాలో తొడ కొట్టి తన ఆనందాన్ని చాటుకున్నాడు.Jomel Warrican has the last laugh over Sajid Khan.📸: Fan Code pic.twitter.com/Y69W3WfY7m— CricTracker (@Cricketracker) January 27, 2025వాస్తవానికి వార్రికన్ ఈ తరహా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి సాజిద్ ఖానే కారణం. విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో వార్రికన్ను ఇబ్బంది పెట్టిన (బౌలింగ్‌తో) సాజిద్ ఖాన్.. ఓ దశలో జాన్ సీనా స్టయిల్లో "యూ కాంట్ సీ మీ" సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అప్పుడే నవ్వుతూ ఊరకుండిపోయిన వార్రికన్.. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో తన టైమ్ రాగానే సాజిద్ ఖాన్‌ను రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశాడు. It was an exceptional Test win for the Windies.pic.twitter.com/hQxrpKEy6S— CricTracker (@Cricketracker) January 27, 2025అప్పుడు సాజిద్ ఖాన్ కేవలం జాన్ సీనా సెలబ్రేషన్స్ మాత్రమే చేసుకుంటే, వార్రికన్ ఇప్పుడు జాన్ సీనా సెలబ్రేషన్స్‌తో పాటు గబ్బర్ "థై ఫైవ్" సెలబ్రేషన్స్ కూడా రిపీట్ చేశాడు.వార్రికన్.. సాజిద్ ఖాన్‌కు "టిట్ ఫర్ టాట్" చెప్పిన విధానం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. వార్రికన్ను క్రికెట్ అభిమానులు కరెక్టే చేశావని సమర్దిస్తున్నారు. ఓవరాక్షన్ చేసిన సాజిద్ ఖాన్‌కు బంతితోనే బుద్ది చెప్పావంటూ కామెంట్స్ చేస్తున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. విండీస్ నిర్దేశించిన 255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పాక్ చతికిలపడింది. 76/4 ఓవర్‌నైట్ స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన పాక్.. మరో 57 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన ఆరు వికెట్లు కోల్పోయింది. మూడో రోజు తొలి గంటలోనే మ్యాచ్ ముగిసింది. వార్రికన్ పాక్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఫలితంగా పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే కుప్పకూలింది.వార్రికన్ 5, కెవిన్ సింక్లెయిర్ 3, గుడకేశ్ మోటీ 2 వికెట్లు తీసి పాకిస్తాన్ పతనాన్ని శాశించారు. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ చేసిన 31 పరుగులే అత్యధికం కాగా.. మొహమ్మద్ రిజ్వాన్ (25), కమ్రాన్ గులామ్ (19), సౌద్ షకీల్ (13), సల్మాన్ అఘా (15) రెండంకెల స్కోర్లు చేశారు.అంతకుముందు విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. బ్రాత్‌వైట్ (52) అర్ద సెంచరీతో రాణించాడు. అమీర్ జాంగూ (30) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. చివరి వరుస బ్యాటర్లు టెవిన్ ఇమ్లాచ్ (35), కెవిన్ సింక్లెయిర్ (28), గుడకేశ్ మోటీ (18), గోమెల్ వార్రికన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్, నౌమన్ అలీ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. కషిఫ్ అలీ, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.తొలి రోజు ఆటలో ఇరు జట్లు తమతమ తొలి ఇన్నింగ్స్‌లను ముగించాయి. బౌలర్లు.. ముఖ్యంగా స్పిన్నర్లు చెలరేగడంతో మొదటి రోజు 20 వికెట్లు నేలకూలాయి. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 163 పరుగులకే ఆలౌట్ కాగా.. పాకిస్తాన్ 154 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో పాక్ స్పిన్నర్ నౌమన్ అలీ హ్యాట్రిక్ (తొలి ఇన్నింగ్స్‌లో) సహా 10 వికెట్లు తీయగా.. విండీస్ స్పిన్నర్ వార్రికన్ 9 వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 5) పడగొట్టాడు. కాగా, తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.