
విండీస్ జట్టు (PC: ICC)
టీమిండియాతో టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ (West Indies tour of India- 2025) క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. భారత పర్యటనలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టుకు రోస్టన్ ఛేజ్ (Roston Chase) కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది.
వారిపై వేటు
ఇక ఈ టూర్‌లో భాగంగా మాజీ సారథి క్రెయిగ్ బ్రాత్‌వెట్‌పై వేటు వేసిన విండీస్ బోర్డు.. చివరిగా ఆస్ట్రేలియాతో ఆడిన కేసీ కార్టీ, జొహాన్ లేన్, మికైల్ లూయీస్‌లను కూడా జట్టు నుంచి తప్పించింది.
వికెట్ల వీరుడికి చోటు
అదే విధంగా.. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఖారీ పియరికి తొలిసారిగా టెస్టు జట్టులో చోటు ఇచ్చింది. వైస్ కెప్టెన్ జోమెల్ వారికన్‌తో కలిసి పియరి స్పెషలిస్టు స్పిన్నర్‌గా బరిలో దిగనున్నాడు. ఇటీవల జరిగిన వెస్టిండీస్ చాంపియన్‌షిప్‌లో 41 వికెట్లతో సత్తా చాటినందుకు గానూ పియరీకి ఈ అవకాశం దక్కింది. ఇక అలిక్ అథనాజ్, తగెనరైన్ చందర్‌పాల్‌కు వెస్టిండీస్ సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు.
చందర్‌పాల్ రాకతో టాపార్డర్‌లో తమ జట్టు మరింత పటిష్టం అవుతుందని.. అదే విధంగా అథనాజ్ కూడా స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలడని తెలిపారు. కాగా అథనాజ్ చివరిసారిగా జనవరిలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆడాడు.
సీమర్ల కోటాలో వీరే
అయితే.. పేసర్ గుడకేశ్ మోటికి మాత్రం విశ్రాంతినిచ్చినట్లు విండీస్ బోర్డు తెలిపింది. పరిమిత ఓవర్ల సిరీస్‌ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఉపఖండ పిచ్‌లపై మ్యాచ్ నేపథ్యంలో స్పిన్ విభాగానికి వారికన్ నాయకత్వం వహించనుండగా.. ఖారీ పియర్రి, రోస్టన్ ఛేజ్ అతడికి సహాయకులుగా ఉండనున్నారు.
ఇక సీమర్ల కోటాలో అల్జారీ జోసెఫ్, షమార్ జోసెఫ్, ఆండర్సన్ ఫిలిప్, జేడన్ సీల్స్ స్థానం దక్కించుకున్నారు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా వెస్టిండీస్ టీమిండియాతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. అక్టోబరు 2- 14 వరకు ఇరుజట్ల మధ్య అహ్మదాబాద్, ఢిల్లీ వేదికలుగా ఈ రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి.
టీమిండియాతో టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు
రోస్టన్ ఛేజ్ (కెప్టెన్), జోమెల్ వారికన్ (వైస్-కెప్టెన్), కెవ్లాన్ ఆండర్సన్, అలిక్ అథనాజ్, జాన్ కాంప్‌బెల్, తగెనరైన్ చందర్‌పాల్, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, అల్జారీ జోసెఫ్, షమార్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఆండర్సన్ ఫిలిప్, ఖారీ పియర్రి, జేడన్ సీల్స్.
చదవండి: మ్యాక్స్‌వెల్ కీలక నిర్ణయం