ఆసీస్ వెటరన్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత అరుదైన మైలురాయిని తాకాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 750 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. క్రికెట్ చరిత్రలో స్టార్క్‌కు ముందు కేవలం 12 మంది మాత్రమే ఈ ఘనత సాధించారు. ఆసీస్ తరఫున కేవలం ఇద్దరే 750 వికెట్ల మార్కును తాకారు. ఇంగ్లండ్‌తో ఇవాళ ముగిసిన మూడో యాషెస్ టెస్ట్‌లో స్టార్క్ ఈ ఘనత సాధించాడు.
ఫార్మాట్లవారీగా స్టార్క్ ప్రదర్శనలు..
103 టెస్ట్‌ల్లో 424 వికెట్లు
130 మ్యాచ్‌ల్లో 247 వికెట్లు
65 టీ20ల్లో 79 వికెట్లు
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..
మురళీథరన్-1347
షేన్ వార్న్-1001
జిమ్మీ ఆండర్సన్-991
అనిల్ కుంబ్లే-956
గ్లెన్ మెక్‌గ్రాత్-949
వసీం అక్రమ్-916
స్టువర్ట్ బ్రాడ్-847
షాన్ పొల్లాక్-829
వకార్ యూనిస్-789
టిమ్ సౌథీ-776
రవిచంద్రన్ అశ్విన్-765
చమింద వాస్-761
మిచెల్ స్టార్క్-750
అడిలైడ్ వేదికగా ఇవాళ ముగిసిన యాషెస్ మూడో టెస్ట్‌లో స్టార్క్ 4 వికెట్లతో రాణించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తోనూ (54) సత్తా చాటాడు. ఈ సిరీస్ తొలి రెండు టెస్ట్‌ల్లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 10 వికెట్ల ప్రదర్శన (7,3) నమోదు చేసిన అతను.. బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో 8 వికెట్లతో (6,2) సత్తా చాటాడు.
రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో స్టార్క్ బ్యాటింగ్‌లోనూ (77 పరుగులు) రాణించాడు. తొలి రెండు టెస్ట్‌ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన స్టార్క్ ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు.
మూడో టెస్ట్‌లో స్టార్క్‌తో పాటు అలెక్స్ క్యారీ (106, 5 క్యాచ్‌లు, 72, ఓ స్టంప్, ఓ క్యాచ్) విజృంభించడంతో ఆసీస్ ఇంగ్లండ్‌పై 82 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఆసీస్ మరో 2 మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలి రెండు టెస్ట్‌ల్లో కూడా ఆసీసే విజయం సాధించింది. ఈ సిరీస్‌లోని నాలుగో టెస్ట్ మ్యాచ్ మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్ 26న మొదలవుతుంది.
చదవండి: Ashes Series 2025: మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం


