breaking news
Ashes 2025-26
-
తొలి శతకంతోనే చరిత్రపుటల్లోకెక్కిన ఇంగ్లండ్ యువ ఆటగాడు
సిడ్నీ వేదికగా జరుగుతున్న యాషెస్ చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ యువ ఆటగాడు జేకబ్ బేతెల్ సెంచరీతో కదంతొక్కాడు. 22 ఏళ్ల బేతెల్‌కు టెస్ట్‌ల్లో ఇది తొలి శతకం. ఈ శతకంతో అతడు రికార్డుపుటల్లోకెక్కాడు. ఆస్ట్రేలియాపై 22 ఏళ్లలోపు శతకం చేసిన తొమ్మిదో ఇంగ్లండ్ బ్యాటర్ అయ్యాడు. ఈ జాబితాలో జానీ బ్రిగ్స్, జాక్ హెర్న్, పటౌడి, కాలిన్ కౌడ్రే, డేవిడ్ గోవర్, మైక్ అథర్టన్, అలిస్టర్ కుక్, బెన్ స్టోక్స్ ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. బేతెల్ తన అద్భుత శతకంతో ఇంగ్లండ్‌ను ఆధిక్యం దిశగా నడిపించాడు. 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఏడు డాట్ బాల్స్ ఆడిన బేతెల్ వెబ్‌స్టర్ బౌలింగ్‌లో బౌండరీ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు (162 బంతుల్లో). బేతెల్ సెంచరీ చేసిన అనంతరం అక్కడే మైదానంలో ఉన్న అతని కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.నాలుగో రోజు చివరి సెషన్ సమయానికి బేతెల్ 131 పరుగుల వద్ద ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా బ్రైడన్ కార్స్ (11) క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసి పోరాడుతుంది. బేతెల్ పుణ్యమా అని ఆ జట్టు 107 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.ఈ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బేతెల్ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. డకెట్, బ్రూక్ తలో 42 పరుగులు చేయగా.. జేమీ స్మిత్ 26, జాక్ క్రాలే 1, రూట్ 6, స్టోక్స్ 1, విల్ జాక్స్ డకౌటయ్యారు. ఆసీస్ బౌలర్లలో వెబ్‌స్టర్ 3 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, బోలాండ్, నెసర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు హెడ్ (163), స్టీవ్ స్మిత్ (138) సెంచరీలతో కదంతొక్కడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 567 పరుగుల భారీ స్కోర్ చేసింది. మిగతా బ్యాటరల్లో వెబ్‌స్టర్ 71 (నాటౌట్), వెదర్లాడ్ 21, లబూషేన్ 48, మైఖేల్ నెసర్ 24, కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న ఉస్మాన్ ఖ్వాజా 17, అలెక్స్ క్యారీ 16, గ్రీన్ 37 , స్టార్క్ 5, బోలాండ్ డకౌయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్, టంగ్ తలో 3, స్టోక్స్ 2, జాక్స్, బేతెల్ తలో వికెట్ తీశారు. దీనికి ముందు జో రూట్ (160) సెంచరీతో సత్తా చాటడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (84) అర్ద సెంచరీతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో నెసర్ 4, స్టార్క్, బోలాండ్ తలో 2, గ్రీన్, లబూషేన్ చెరో వికెట్ తీశారు. కాగా,ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఆసీస్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
స్టీవ్ స్మిత్ అద్భుత శతకం.. పట్టు సాధించిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరో సెంచరీతో మెరిశాడు. యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో (తొలి ఇన్నింగ్స్) ఈ ఫీట్‌ను సాధించాడు. స్టీవ్‌కు టెస్ట్‌ల్లో ఇది 37వ శతకం. ఇంగ్లండ్‌పై 13వది. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్లో 49వది.సిడ్నీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో స్టీవ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 129 పరుగుల వద్ద క్రీజ్‌లో ఉన్నాడు. అతనికి జతగా బ్యూ వెబ్‌స్టర్ (42) ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. ఆసీస్ స్కోర్ 7 వికెట్ల నష్టానికి 518 పరుగులుగా ఉంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌పై ఆసీస్ 134 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.ఆసీస్ ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్ (163) కూడా సెంచరీతో కదంతొక్కాడు. మిగతా బ్యాటరల్లో వెదర్లాడ్ 21, లబూషేన్ 48, మైఖేల్ నెసర్ 24, కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న ఉస్మాన్ ఖ్వాజా 17, అలెక్స్ క్యారీ 16, గ్రీన్ 37 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్ 3, స్టోక్స్ 2, టంగ్, బేతెల్ తలో వికెట్ తీశారు.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులు చేసింది. జో రూట్ అద్భుత శతకంతో కదంతొక్కగా.. హ్యారీ బ్రూక్ (84) అర్ద సెంచరీతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో నెసర్ 4, స్టార్క్, బోలాండ్ తలో 2, గ్రీన్, లబూషేన్ చెరో వికెట్ తీశారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఆసీస్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. -
డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్న ట్రవిస్ హెడ్
యాషెస్ సిరీస్ 2025-26లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ మరో శతకం బాదాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికే మొదటి, మూడు టెస్ట్‌ల్లో సెంచరీలు చేసిన అతడు.. తాజాగా ఐదో టెస్ట్‌లోనూ శతక్కొట్టాడు. ఈ శతకాన్ని హెడ్ మెరుపు వేగంతో (105 బంతుల్లో) పూర్తి చేశాడు.- Hundred in 1st Test.- Hundred in 3rd Test.- Hundred in 5th Test.TRAVIS HEAD IS DOMINATING ALL FORMATS...!!! 🥶🔥 pic.twitter.com/SkgMekTNKQ— Johns. (@CricCrazyJohns) January 6, 2026సెంచరీతో ఆగిపోని హెడ్ మరో 47 బంతుల్లోనే 150 పరుగుల మార్కును కూడా తాకి డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. ఫలితంగా ఆసీస్ ఐదో టెస్ట్‌లో పైచేయి సాధించే దిశగా వెళ్తుంది. మూడో రోజు తొలి సెషన్ సమయానికి ఆసీస్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 268 పరుగులుగా ఉంది. హెడ్ 155, స్టీవ్ స్మిత్ 10 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఆసీస్ ఇంకా 116 పరుగులు మత్రమే వెనుకపడి ఉంది.ఆసీస్ ఇన్నింగ్స్‌లో మిగతా బ్యాటర్లలో జేక్ వెదరాల్డ్ 21, లబూషేన్ 48, నైట్ వాచ్‌మన్ మైఖేల్ నెసర్ 24 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 2, బ్రైడన్ కార్స్ ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులు చేసింది. జో రూట్ అద్భుత శతకంతో కదంతొక్కగా.. హ్యారీ బ్రూక్ (84) అర్ద సెంచరీతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో నెసర్ 4, స్టార్క్, బోలాండ్ తలో 2, గ్రీన్, లబూషేన్ చెరో వికెట్ తీశారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఆసీస్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకుంది.600 పరుగులకు చేరువలోప్రస్తుత యాషెస్ సిరీస్‌లో అరివీర భయంకర ఫామ్‌లో ఉన్న హెడ్ 9 ఇన్నింగ్స్‌ల్లో 599 పరుగులు చేసి, పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ సిరీస్‌లో ఇరు జట్ల తరఫున 500 పరుగులు చేసిన ఏకైక బ్యాటర్ హెడ్ ఒక్కడే. ఐదో టెస్ట్ మూడో రోజు లంచ్ సమయానికి హెడ్ 162 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. -
జో రూట్ 41వ శతకం
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ టెస్ట్ క్రికెట్లో మరో శతకం సాధించాడు. ఇది అతనికి 41వ శతకం. ఓవరాల్‌గా (మూడు ఫార్మాట్లలో కలిపి) 60వ శతకం. ఈ సెంచరీతో రూట్ టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్‌తో కలిసి మూడో స్థానంలో ఉన్నాడు. పాంటింగ్, రూట్ చెరో 41 సెంచరీలు చేశారు. ఈ జాబితాలో సచిన్ (51), సంగక్కర (45) పాంటింగ్, రూట్ కంటే ముందున్నారు.ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న అంతర్జాతీయ క్రికెటర్లలో మూడు ఫార్మాట్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్ రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ (84) ఒక్కడే రూట్ కంటే ముందున్నాడు. గత ఆరేళ్లలో రూట్‌కు ఇది 24 శతకం. ఇంత తక్కువ వ్యవధిలో ఓ ఆటగాడు ఇన్ని శతకాలు చేయడమనేది ఆషామాషీ విషయం కాదు.తాజా శతకంతో రూట్ తన సమకాలీకులు, ఫాబ్-4లో మిగతా ముగ్గురి కంటే మరింత ఎత్తుకు ఎదిగాడు. రూట్ ఖాతాలో 41 సెంచరీలు ఉండగా.. స్టీవ్ స్మిత్ 36, కేన్ విలియమ్సన్ 33, విరాట్ కోహ్లి 30 సెంచరీలు కలిగి ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్ చివరి టెస్ట్‌లో రూట్ తన 41వ శతకాన్ని సాధించాడు. ఈ సిరీస్‌కు ముందు రూట్‌కు ఆసీస్ గడ్డపై ఒక్క సెంచరీ కూడా లేదు. ఇదే సిరీస్‌లోనే ఆసీస్ గడ్డపై తన తొలి సెంచరీ చేశాడు. తాజాగా ఆ సంఖ్యను రెండుకు పెంచుకున్నాడు. ఈ సిరీస్‌లో రూట్ 9 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీల సాయంతో 394 పరుగులు చేశాడు.టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ (15921) కొనసాగుతుండగా.. అతనికి రూట్‌కు (13937) వ్యత్యాసం ఇంకా 1984 పరుగులు మాత్రమే.సిడ్నీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 242 బంతులు ఎదుర్కొన్న రూట్ 15 బౌండరీల సాయంతో 160 పరుగులు చేసి ఔటయ్యాడు. రూట్ సెంచరీతో కదంతొక్కడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (84) సెంచరీకి చేరువలో ఔట్ కాగా.. జేమీ స్మిత్ (46) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఆసీస్ బౌలర్లలో నెసర్ 4, స్టార్క్, బోలాండ్ తలో 2, గ్రీన్, లబూషేన్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ మూడో సెషన్ సమయానికి వికెట నష్టపోకుండా 44 పరుగులు చేసింది. హెడ్ 24, వెదరాల్డ్ 19 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఆసీస్ ఇంకా 340 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఆసీస్ ఇప్పటికే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. -
యాషెస్ చివరి టెస్ట్ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
యాషెస్ సిరీస్ 2025-26 చివరి టెస్ట్ కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (జనవరి 1) ప్రకటించారు. కమిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. తుది జట్టు స్థానాలపై ఇంకా క్లారిటీ రాలేదు. కెమరూన్ గ్రీన్ పేలవ ఫామ్ ( గత 6 ఇన్నింగ్స్‌ల్లో 112 పరుగులు, 3 వికెట్లు) ఆసీస్‌ను కలవరపెడుతుంది. గ్రీన్ స్థానాన్ని మరో ఆల్‌రౌండర్ బ్యూ వెబ్‌స్టర్ భర్తీ చేసే అవకాశం ఉంది. ఓపెనర్లుగా జేక్ వెదరాల్డ్, ట్రవిస్ హెడ్ కొనసాగడం ఖాయం. ఉస్మాన్ ఖ్వాజా మరోసారి మిడిలార్డర్లోనే బ్యాటింగ్‌కు దిగాల్సి రావచ్చు. సిడ్నీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉన్నందున టాడ్ మర్ఫీ తుది జట్టులోకి రావచ్చు. ఐదో టెస్ట్ సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి జరుగుతుంది.కాగా, ఈ ఐదు మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌ను ఆసీస్ ఇదివరకే (3-1) కైవసం చేసుకుంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆసీస్ నాలుగో టెస్ట్‌లో పరాజయంపాలైంది. ఈ టెస్ట్ నెగ్గి ఆధిక్యత 4-1కి పెంచుకోవాలని ఆసీస్.. ఆసీస్ ఆధిక్యాన్ని 3-2కు తగ్గించాలని ఇంగ్లండ్ పట్టుదలగా ఉన్నాయి.ఐదో టెస్ట్‌కు ఆస్ట్రేలియా జట్టు- స్టీవ్ స్మిత్ (కెప్టెన్) - స్కాట్ బోలాండ్ - అలెక్స్ క్యారీ - బ్రెండన్ డాగెట్ - కెమెరూన్ గ్రీన్ - ట్రావిస్ హెడ్ - జోష్ ఇంగ్లిస్ - ఉస్మాన్ ఖవాజా - మార్నస్ లాబుషేన్ - టాడ్ మర్ఫీ - మైఖేల్ నేసర్ - జై రిచర్డ్సన్ - మిచెల్ స్టార్క్ - జేక్ వెదరాల్డ్ - బ్యూ వెబ్‌స్టర్ -
చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. ప్రపంచ రికార్డు బద్దలు
ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (Harry Brook) చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్లో అతి తక్కువ బంతుల్లో 3000 పరుగుల మైలురాయిని తాకిన బ్యాటర్‌గా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేరిట ఉండిన వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు.గిల్‌క్రిస్ట్‌కు 3000 పరుగులు పూర్తి చేసేందుకు 3610 బంతులు అవసరం కాగా.. బ్రూక్ కేవలం 3468 బంతుల్లోనే ఈ మైలురాయిని తాకాడు. ఈ విభాగంలో బ్రూక్, గిల్‌క్రిస్ట్ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్ (4047), రిషబ్ పంత్ (4095), వీరేంద్ర సెహ్వాగ్ (4129) ఉన్నారు. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో యాషెస్ టెస్ట్ తొలి రోజు బ్రూక్ ఈ ఘనత సాధించాడు.ఇన్నింగ్స్‌ల పరంగా చూస్తే.. టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 3000 పరుగుల మైలురాయిని తాకిన ఆటగాళ్ల జాబితాలో బ్రూక్ తన దేశానికే చెందిన డెన్నిస్ కాంప్టన్తో కలిసి సంయుక్తంగా 11వ స్థానంలో నిలిచాడు. బ్రూక్, కాంప్టన్ ఇద్దరూ 57వ ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని తాకారు. ఈ విభాగంలో డాన్ బ్రాడ్‌మన్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ దిగ్గజం కేవలం 33 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.ఇప్పటివరకు 34 టెస్ట్‌లు ఆడిన బ్రూక్ 54.18 సగటున, 10 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీల సాయంతో 3034 పరుగులు చేశాడు. ఇందులో డబుల్, ట్రిపుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.మ్యాచ్ విషయానికొస్తే.. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఇవాళ (డిసెంబర్ 26) యాషెస్ సిరీస్ 2025-26 నాలుగో టెస్ట్ (బాక్సింగ్ డే టెస్ట్) ప్రారంభమైంది. ఈ మ్యాచ్ తొలి రోజే 20 వికెట్లు కుప్పకూలాయి. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాను 152 పరుగులకే ఆలౌట్ చేసింది. జోష్ టంగ్ (11.2-2-45-5), అట్కిన్సన్ (14-4-28-2), బ్రైడన్ కార్స్ (12-3-42-1), స్టోక్స్ (8-1-25-1) ఆసీస్‌ను దెబ్బకొట్టారు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో నంబర్ ఆటగాడు మైఖేల్ నెసర్ (35) టాప్ స్కోరర్ కాగా.. హెడ్ (12), జేక్ వెదరాల్డ్ (10), ఉస్మాన్ ఖ్వాజా (29), అలెక్స్ క్యారీ (20), కెమరూన్ గ్రీన్ (17) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. లబూషేన్ (6), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (9), స్టార్క్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితం కాగా.. బోలాండ్ డకౌటయ్యాడు.అనంతరం ఇంగ్లండ్ సైతం ప్రత్యర్థి బౌలర్ల ధాటికి స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. నెసర్ 4, బోలాండ్ 3, స్టార్క్ 2, గ్రీన్ ఓ వికెట్ తీసి ఇంగ్లండ్‌ను 110 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (41), అట్కిన్సన్ (28), స్టోక్స్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. జాక్ క్రాలే (5), డకెట్ (2), బేతెల్ (1), జేమీ స్మిత్ (2), విల్ జాక్స్ (5), కార్స్ (4) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. రూట్ డకౌటయ్యాడు.కీలకమైన 42 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసి, 46 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఇదివరకే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి మూడు టెస్ట్‌ల్లో గెలిచిన ఆ జట్టు ప్రస్తుతం 3-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
Ashes 4th Test: చెలరేగిన ఇరు జట్ల బౌలర్లు.. తొలి రోజే 20 వికెట్లు
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఇవాళ (డిసెంబర్ 26) యాషెస్ సిరీస్ 2025-26 నాలుగో టెస్ట్ (బాక్సింగ్ డే టెస్ట్) ప్రారంభమైంది. ఈ మ్యాచ్ తొలి రోజే 20 వికెట్లు కుప్పకూలాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తొలుత ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసింది. ఆతర్వాత ఆసీస్ బౌలర్లు కూడా అదే పని చేశారు. మొత్తంగా ఇరు జట్ల బౌలర్లు చెలరేగడంతో తొలి రోజే 20 వికెట్లు పడ్డాయి. ఆసీస్-ఇంగ్లండ్ మధ్య టెస్ట్‌ల్లో తొలి రోజే 20 వికెట్లు పడటం 1909 తర్వాత ఇదే తొలిసారి. చెలరేగిన టంగ్జోష్ టంగ్ (11.2-2-45-5) చెలరేగడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే ఆలౌటైంది. టంగ్‌కు అట్కిన్సన్ (14-4-28-2), బ్రైడన్ కార్స్ (12-3-42-1), స్టోక్స్ (8-1-25-1) సహకరించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో నంబర్ ఆటగాడు మైఖేల్ నెసర్ (35) టాప్ స్కోరర్ కాగా.. హెడ్ (12), జేక్ వెదరాల్డ్ (10), ఉస్మాన్ ఖ్వాజా (29), అలెక్స్ క్యారీ (20), కెమరూన్ గ్రీన్ (17) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. లబూషేన్ (6), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (9), స్టార్క్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితం కాగా.. బోలాండ్ డకౌటయ్యాడు.ఇంగ్లండ్ ఇంకా ఘోరంఅనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ సైతం ప్రత్యర్థి బౌలర్ల ధాటికి కుప్పకూలింగి. నెసర్ 4, బోలాండ్ 3, స్టార్క్ 2, గ్రీన్ ఓ వికెట్ తీసి ఇంగ్లండ్‌ను 110 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (41), అట్కిన్సన్ (28), స్టోక్స్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. జాక్ క్రాలే (5), డకెట్ (2), బేతెల్ (1), జేమీ స్మిత్ (2), విల్ జాక్స్ (5), కార్స్ (4) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. రూట్ డకౌటయ్యాడు.కీలకమైన 42 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసి, 46 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఇదివరకే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి మూడు టెస్ట్‌ల్లో గెలిచిన ఆ జట్టు ప్రస్తుతం 3-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
ఇంగ్లండ్‌కు మరో భారీ ఎదురుదెబ్బ
మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 0-3 తేడాతో యాషెస్ సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎడమ తొడ కండరాల గాయం చివరి రెండు టెస్ట్‌లకు స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధికారికంగా ప్రకటించింది.ఇప్పటికే ఇంగ్లండ్ మరో స్టార్ బౌలర్ మార్క్ వుడ్ సేవలను కూడా కోల్పోయింది. వుడ్ మోకాలి గాయం కారణంగా రెండో టెస్ట్‌కు ముందే తప్పుకున్నాడు. తాజాగా ఆర్చర్ కూడా వైదొలగ డంతో ఇంగ్లండ్ పేస్ విభాగం మరింత బలహీనపడింది. ఆర్చర్ స్థానంలో గస్ అట్కిన్సన్ను నాలుగో టెస్ట్‌కు తుది జట్టులోకి తీసుకుంటున్నట్లు ఈసీబీ ప్రకటించింది.పోప్ ఔట్గాయం కారణంగా ఆర్చర్ సిరీస్ మొత్తానికే దూరం కాగా.. పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న వన్‌డౌన్ బ్యాటర్ ఓలీ పోప్‌ను ఈసీబీ నాలుగో టెస్ట్ నుంచి తప్పించింది. పోప్ గత మూడు టెస్ట్‌ల్లో కేవలం 125 పరుగులే చేశాడు. పోప్ స్థానంలో నాలుగో టెస్ట్‌లో జేకబ్ బేతెల్‌ను ఆడించనున్నట్లు ఈసీబీ తెలిపింది.ఈ రెండు మార్పులు మినహా ఇంగ్లండ్ తుది యాధాతథంగా కొనసాగనుంది. రేపటి నుంచి (డిసెంబర్ 26) మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో నాలుగో యాషెస్ టెస్ట్ ప్రారంభం కానుంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయిన ఇంగ్లండ్ చివరి రెండు టెస్ట్‌లైనా గెలిచి పరువు కాపాడుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే, ఇలాంటి సమయంలో ఆర్చర్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరం కావడం ఇంగ్లండ్ కష్టాలను మరింత తీవ్రం చేసింది.యాషెస్ నాలుగో టెస్ట్‌కు ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, జేకబ్ బేతెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్‌కీపర్), విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్ -
అత్యంత అరుదైన మైలురాయిని తాకిన మిచెల్ స్టార్క్
ఆసీస్ వెటరన్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత అరుదైన మైలురాయిని తాకాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 750 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. క్రికెట్ చరిత్రలో స్టార్క్‌కు ముందు కేవలం 12 మంది మాత్రమే ఈ ఘనత సాధించారు. ఆసీస్ తరఫున కేవలం ఇద్దరే 750 వికెట్ల మార్కును తాకారు. ఇంగ్లండ్‌తో ఇవాళ ముగిసిన మూడో యాషెస్ టెస్ట్‌లో స్టార్క్ ఈ ఘనత సాధించాడు.ఫార్మాట్లవారీగా స్టార్క్ ప్రదర్శనలు..103 టెస్ట్‌ల్లో 424 వికెట్లు130 మ్యాచ్‌ల్లో 247 వికెట్లు65 టీ20ల్లో 79 వికెట్లుఅంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..మురళీథరన్-1347షేన్ వార్న్-1001జిమ్మీ ఆండర్సన్-991అనిల్ కుంబ్లే-956గ్లెన్ మెక్‌గ్రాత్-949వసీం అక్రమ్-916స్టువర్ట్ బ్రాడ్-847షాన్ పొల్లాక్-829వకార్ యూనిస్-789టిమ్ సౌథీ-776రవిచంద్రన్ అశ్విన్-765చమింద వాస్-761మిచెల్ స్టార్క్-750అడిలైడ్ వేదికగా ఇవాళ ముగిసిన యాషెస్ మూడో టెస్ట్‌లో స్టార్క్ 4 వికెట్లతో రాణించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తోనూ (54) సత్తా చాటాడు. ఈ సిరీస్ తొలి రెండు టెస్ట్‌ల్లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 10 వికెట్ల ప్రదర్శన (7,3) నమోదు చేసిన అతను.. బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో 8 వికెట్లతో (6,2) సత్తా చాటాడు.రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో స్టార్క్ బ్యాటింగ్‌లోనూ (77 పరుగులు) రాణించాడు. తొలి రెండు టెస్ట్‌ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన స్టార్క్ ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు.మూడో టెస్ట్‌లో స్టార్క్‌తో పాటు అలెక్స్ క్యారీ (106, 5 క్యాచ్‌లు, 72, ఓ స్టంప్, ఓ క్యాచ్) విజృంభించడంతో ఆసీస్ ఇంగ్లండ్‌పై 82 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఆసీస్ మరో 2 మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలి రెండు టెస్ట్‌ల్లో కూడా ఆసీసే విజయం సాధించింది. ఈ సిరీస్‌లోని నాలుగో టెస్ట్ మ్యాచ్ మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26న మొదలవుతుంది.చదవండి: Ashes Series 2025: మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం -
చాలా చాలా బాధగా ఉంది.. మా కల చెదిరిపోయింది: బెన్ స్టోక్స్
యాషెస్ సిరీస్ 2025-26ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలూండగానే 3-0 తేడాతో ఇంగ్లండ్ కోల్పోయింది. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో 82 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన ఇంగ్లండ్ జట్టు.. ఈ ఘోర పరభావాన్ని మూట కట్టుకుంది. 435 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 352 రన్స్‌కు ఆలౌటైంది.లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే (85) అద్భుతంగా పోరాడినప్పటికీ.. మిడిలార్డర్ నుంచి ఆశించిన సహకారం లభించలేదు. ఆఖరిలో జామీ స్మిత్(60), విల్ జాక్స్(47), కార్స్(39 నాటౌట్) జట్టును గెలిపించేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, లియోన్ తలా మూడు వికెట్లతో ఇంగ్లీష్ జట్టు ఓటమిని శాసించారు."సిరీస్‌ను ఎలాగైనా కాపాడుకోవాలనే లక్ష్యంతో అడిలైడ్‌లో అడుగుపెట్టాము. కానీ మా కల ఇప్పుడు చెదిరిపోయింది. ఈ ఓటమి జట్టులోని ప్రతీ ఒక్కరిని ఎంతో బాధకు గురి చేస్తోంది. చాలా చాలా ఎమోషనల్‌గా ఉన్నారు. ఆస్ట్రేలియాకు కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే. గెలుపు అనేది మూడు విభాగాల్లో రాణించడంపై ఆధారపడి ఉంటుంది.ఈ మ్యాచ్‌లో ఆసీస్ మాకంటే మెరుగైన ప్రదర్శన చేసింది. వారు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడింటిలోనూ మాపై పైచేయి సాధించారు. నాలుగో ఇన్నింగ్స్‌లో మా ముందు భారీ లక్ష్యం ఉన్నప్పటికి మేము ఆఖరివరకు పోరాడాము. విల్ జాక్స్, జేమీ స్మిత్ ఆడిన తీరు చూసి మేము గెలుస్తామని భావించాను. కానీ అది సాధ్యం కాలేదు. టాస్ ఓడినప్పటికి ఆసీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో ఓ మోస్తార్ స్కోర్‌కే కట్టడి చేయడంలో మేము విజయవంతమయ్యాము. అయితే ఆ తర్వాత మేము భారీ స్కోర్ చేయడంలో విఫలమయ్యాము. రెండో ఇన్నింగ్స్‌లో కూడా కేవలం 60 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు పడగొట్టాము. మాకు చాలా సానుకూల ఆంశాలు ఉన్నాయి. ముఖ్యంగా మా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు చూపిన పోరాటపటిమ నిజంగా అద్బుతం. నేను ఆశించిన పట్టుదల వారిలో కన్పించింది. సిరీస్ కోల్పోయినప్పటికి మిగిలిన రెండు టెస్టుల్లో విజయం సాధించించేందుకు ప్రయత్నిస్తాము" అని పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో స్టోక్స్ పేర్కొన్నాడు.చదవండి: సంజూ శాంసన్ కీలక నిర్ణయం -
మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం
అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ మూడో టెస్టులో 82 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలూండగానే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను 3-0 తేడాతో ఆసీస్ సొంతం చేసుకుంది. 435 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 352 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ క్రాలీ (151 బంతుల్లో 85; 8 ఫోర్లు), విల్ జాక్స్(47), బ్రైడన్ కార్స్(39), జేమీ స్మిత్(60) పోరాడినప్పటికి తమ జట్టును ఓటమి నుంచి గట్టెక్కించ లేకపోయారు. రికార్డు లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌కు శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్లోనే ఓపెనర్ బెన్ డకెట్ (4) అవుట్ కాగా... కాసేపటికే ఒలీ పోప్ (17) కూడా వెనుదిరిగాడు. పోరాటానికి మారుపేరైన జో రూట్ (63 బంతుల్లో 39; 5 ఫోర్లు) కీలక దశలో వెనుదిరిగాడు. ఈ మూడు వికెట్లు ఆసీస్ సారథి కమిన్స్ ఖాతాలోకే వెళ్లాయి. అయితే బ్రూక్ (56 బంతుల్లో 30; 2 ఫోర్లు) అండతో క్రాలీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. నాలుగో వికెట్‌కు 68 పరుగులు జోడించాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు ఒక దశలో 177/3తో పటిష్టంగా కనిపించింది. ఇలాంటి దశలో ఆసీస్ స్పిన్నర్ లయన్ ఆ జట్టును దెబ్బ తీశాడు. స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను ఆ్రస్టేలియా వైపు తిప్పాడు. బ్రూక్, స్టోక్స్ (18 బంతుల్లో 5; 1 ఫోర్)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. కాసేపటికే క్రాలీ స్టంపౌట్ అయ్యాడు. దీంతో ఇంగ్లండ్ 194/6తో కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో సహచరుల నుంచి పెద్దగా సహకారం దక్కకపోయినా మొండిగా పోరాడిన కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ సారి అలాంటి ప్రదర్శన కనబర్చలేకపోయాడు. అయితే జేమీ స్మిత్, విల్ జాక్స్ నిలకడగా ఆడి ఇంగ్లండ్ శిబిరంలో ఆశలు రెకెత్తించారు. స్మిత్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కార్స్ కూడా ఆకట్టుకున్నాడు. కానీ జాక్స్ ఔటయ్యాక ఇంగ్లండ్ ఓటమి ఖాయమైంది. కార్స్ నాటౌట్‌గా నిలవగా.. ఆర్చర్, టంగ్ వెంటవెంటనే పెవిలియన్‌కు చేరాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్, నాథన్ లియోన్ తలా మూడేసి వికెట్లు పడగొట్టాడు.హెడ్ భారీ సెంచరీ అంతకుముందు ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 349 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ (219 బంతుల్లో 170; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ సెంచరీతో కదంతొక్కగా... అలెక్స్ కేరీ (128 బంతుల్లో 72; 6 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. మిగిలిన వాళ్లు పెద్దగా తోడ్పాటు అందించలేకపోవడంతో ఆసీస్ జట్టు ఆశించిన స్కోరు కంటే ముందే ఆలౌటైంది. జోష్ ఇన్‌గ్లిస్ (10), కెపె్టన్ ప్యాట్ కమిన్స్(6) విఫలమయ్యారు. ఈ సిరీస్‌లో అటు బ్యాట్‌తోనూ దుమ్మురేపుతున్న స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ 7 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 4 వికెట్లు పడగొట్టగా... బ్రైడన్ కార్స్3 వికెట్లు తీశాడు. -
పోరాడుతున్న ఇంగ్లండ్.. రెండో రోజు ఆసీస్‌దే
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ పోరాడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ బెన్ స్టోక్స్(45), జోఫ్రా ఆర్చర్(30) ఉన్నారు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు 45 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంగ్లండ్ జట్టు ఇంకా 158 పరుగుల వెనకంజలో ఉంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో స్టోక్స్, ఆర్చర్‌తో పాటు హ్యారీ బ్రూక్ (45), బెన్ డకెట్ (29) ఫర్వాలేదన్పించారు. వైస్ కెప్టెన్ పోప్(3), క్రాలీ(9), రూట్(19) తీవ్ర నిరాశపరిచారు.ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. లియోన్, బోలాండ్ తలా రెండు వికెట్లు సాధించారు. మరో వికెట్ గ్రీన్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అంతకుముందు 326/8 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ 371 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (143 బంతుల్లో 106; 8 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా..ఖవాజా(82), స్టార్క్(54) రాణించారు.డీఆర్ఎస్ వివాదం..కాగా ఈ మ్యాచ్‌లో డీఆర్ఎస్ వివాదం చోటు చేసుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ క్యారీ బ్యాటింగ్ చేస్తుండగా బంతి స్పష్టంగా బ్యాట్‌కు తాకినప్పటికి.. స్నికోమీటర్ సాంకేతిక లోపం వల్ల స్పైక్ రాలేదు. ఇంగ్లండ్ రివ్యూ తీసుకున్నప్పటికి స్నికోమీటర్లో స్పైక్ చూపించకపోవడంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించారు. అయితే ఈ విషయంపై ఐసీసీ స్పందించింది. సాంకేతిక అంగీకరిస్తూ.. ఇంగ్లండ్ కోల్పోయిన రివ్యూను తిరిగి ఇచ్చింది -
చరిత్ర సృష్టించిన నాథన్ లియోన్..! మెక్‌గ్రాత్ రియాక్షన్ వైరల్
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం నాథన్ లియోన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆస్ట్రేలియా బౌలర్‌గా లియోన్ నిలిచాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో లియోన్ ఈ ఫీట్ సాధించాడు. అతడు ఇప్పటివరకు 141 మ్యాచ్‌లలో 564 వికెట్లు పడగొట్టాడు.ఇంతకుముందు ఈ అరుదైన రికార్డు లెజెండరీ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్(563) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మెక్‌గ్రాత్‌ను లియోన్ అధిగమించాడు. అగ్రస్దానంలో దివంగత స్పిన్నర్ షేన్ వార్న్(708) ఉన్నాడు. ఇక ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో లియోన్ ఆరో స్ధానానికి ఎగబాకాడు. ఈ లిస్ట్‌లో ముత్తయ్య మురళీధరన్ (800) టాప్ ప్లేస్‌లో ఉండగా.. షేన్ వార్న్ 708, జేమ్స్ అండర్సన్ 704, అనిల్ కుంబ్లే 619, స్టువర్ట్ బ్రాడ్ 604 తర్వాతి స్ధానాల్లో ఉన్నారు. ఈ దిగ్గజ బౌలర్లు అందరూ రిటైర్డ్ కాగా.. లయన్ ఒక్కడే టెస్టుల్లో కొనసాగుతున్నాడు.మెక్‌గ్రాత్ రియాక్షన్ వైరల్..!కాగా తన రికార్డును బ్రేక్ చేసిన సమయంలో గ్లెన్ మెక్‌గ్రాత్ కామెంటరీ బాక్స్‌లో ఉన్నాడు. ఈ సందర్భంగా మెక్‌గ్రాత్ స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లియోన్ వికెట్ తీయగానే.. మెక్‌గ్రాత్ సరదగా ‘కుర్చీని విసిరేస్తున్నట్లు’రియాక్ట్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే ఈ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ నవ్వుతూ లియోన్‌ను అభినందించాడు.And with that absolute beauty, Nathan Lyon has passed Glenn McGrath for Test wickets! 564 😱#Ashes | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/wTofukUsYD— cricket.com.au (@cricketcomau) December 18, 2025చదవండి: IND vs SA: క్రికెట్ వర్సెస్ కాలుష్యం.. నిజంగా ఇది సిగ్గు చేటు! -
ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్
యాషెస్ సిరీస్ 2025-26ను ఆస్ట్రేలియా ఘనంగా ఆరంభించింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఆసీస్ చిత్తు చేసింది. 205 పరుగుల లక్ష్యాన్ని కంగారులు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించారు. ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.లక్ష్య చేధనలో ఇంగ్లీష్ జట్టు బౌలర్లను హెడ్ ఉతికారేశాడు. టీ20 తరహాలో బ్యాటింగ్ చేసిన హెడ్.. కేవలం 69 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 83 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 16 ఫోర్లు, 4 సిక్స్‌లతో 123 పరుగులు చేశాడు.అతడితో పాటు మార్నస్ లబుషేన్(51) అజేయ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో అదరగొట్టిన జోఫ్రా అర్చర్, బెన్ స్టోక్ట్స్ రెండో ఇన్నింగ్స్‌లో తేలిపోయారు.ఇంగ్లండ్ అట్టర్ ప్లాప్..కాగా రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఇంగ్లండ్ బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు. ఆసీస్ స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్(7 వికెట్లు) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే కుప్పకూలిన స్టోక్స్ సేన.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదే తీరును కనబరిచింది. బోలాండ్, స్టార్క్, డాగెట్‌లు నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ 164 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ఆసీస్ ముందు 205 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఉంచింది. అయితే తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్‌లో విఫలమైన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చి ఘన విజయాన్ని అందుకుంది. ఫలితంగా మొదటి టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ కేవలం 132 పరుగులు మాత్రమే చేసింది. ఇక ఓవరాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 10 వికెట్లు పడగొట్టిన స్టార్క్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. రెండో టెస్టు డిసెంబర్ 4 నుంచి గబ్బా వేదికగా ప్రారంభం కానుంది.పెర్త్ టెస్టు సంక్షిప్త సమాచారంఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 172/10టాప్ స్కోరర్ హ్యారీ బ్రూక్ (52)టాప్ బౌలర్ మిచెల్ స్టార్క్ (7/58)ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 132/10టాప్ స్కోరర్ క్యారీ(26)టాప్ బౌలర్ బెన్ స్టోక్స్ (5/23)ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్: 164/10టాప్ స్కోరర్: గస్ అట్కిన్సన్ (37)బెస్ట్ బౌలింగ్: స్కాట్ బోలాండ్ (4 వికెట్లు)ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్: 205/2టాప్ స్కోరర్: ట్రావిస్ హెడ్(123)చదవండి: IPL 2026: ముంబై ఇండియన్స్ మాస్టర్ ప్లాన్.. అర్జున్ స్ధానంలో? -
యాషెస్ సిరీస్‌కు అదిరిపోయే ఆరంభం
2025-26 యాషెస్ సిరీస్‌కు (Ashes Series) అదిరిపోయే ఆరంభం లభించింది. పెర్త్ వేదికగా ఇవాళ (నవంబర్ 21) మొదలైన తొలి మ్యాచ్‌లో (Australia vs England) ఏకంగా 19 వికెట్లు పడ్డాయి. యాషెస్ సిరీస్ చరిత్రలో గడిచిన వందేళ్లలో ఇలా ఎప్పుడూ జరగలేదు. 2001 ట్రెంట్‌బ్రిడ్జ్ టెస్ట్‌లో అత్యధికంగా 17 వికెట్లు పడ్డాయి.యాషెస్ టెస్ట్ తొలి రోజు 18 అంతకంటే ఎక్కువ వికెట్లు పడిన ఏకైక ఉదంతం 1909 ఓల్డ్ ట్రాఫర్డ్ టెస్ట్‌లో చోటు చేసుకుంది. ఆ మ్యాచ్ తొలి రోజు రికార్డు స్థాయిలో 20 వికెట్లు పడ్డాయి. తొలుత ఆస్ట్రేలియా 147, ఆర్వాత ఇంగ్లండ్ 119 పరుగులకు ఆలౌటయ్యాయి.ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఇవాళ మొదలైన యాషెస్ టెస్ట్‌లోనూ పునరావృతమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 172 పరుగులకు ఆలౌట్ కాగా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌పై మిచెల్ స్టార్క్ నిప్పులు చెరిగాడు. ఏకంగా 7 వికెట్లు తీసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను మట్టుబెట్టాడు. అరంగేట్రం పేసర్ బ్రెండన్ డాగ్గెట్ 2, గ్రీన్ ఓ వికెట్ తీశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (52) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఓలీ పోప్ (46), జేమీ స్మిత్ (33), డకెట్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. జాక్ క్రాలే, రూట్, మార్క్ వుడ్ డకౌట్లు కాగా.. స్టోక్స్ 6, అట్కిన్సన్ 1, కార్స్ 6 పరుగులకు ఔటయ్యారు.అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ బౌలర్లు సైతం విరుచుకుపడ్డారు. కెప్టెన్ స్టోక్స్ 5, ఆర్చర్, కార్స్ తలో 2 వికెట్లు తీసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను పతనం అంచుకు తీసుకెళ్లారు. ఇప్పటివరకు ఆసీస్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ క్యారీ (26) టాప్ స్కోరర్ కాగా.. హెడ్ (21), గ్రీన్ (24), స్టీవ్ స్మిత్ (17), స్టార్క్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. అరంగేట్రం బ్యాటర్ వెదరాల్డ్, బోలాండ్ డకౌట్లు కాగా.. లబూషేన్ 9, ఖ్వాజా 2 పరుగులకు ఔటయ్యారు. లియోన్ (3), డగ్గెట్ (0) క్రీజ్‌లో ఉన్నారు. చదవండి: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా భూకంపం.. ఉలిక్కిపడ్డ ప్లేయర్లు -
ఏడేసిన మిచెల్ స్టార్క్.. కుప్పకూలిన ఇంగ్లండ్
పెర్త్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ నిప్పులు చెరిగాడు. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. మొత్తంగా 7 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ జట్టు పతనాన్ని స్టార్క్ శాసించాడు.స్టార్క్ జోరు ముగింట జోష్ హాజిల్‌వుడ్, కమ్మిన్స్ లేని లోటు అస్సలు కన్పించలేదు. అతడి విజృంభణ ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 172 పరుగులకే ఆలౌటైంది. అతడితో పాటు అరంగేట్ర పేసర్ బ్రెండన్ డాగెట్ 2 వికెట్లు, గ్రీన్ ఓ వికెట్ సాధించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్(52) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓలీ పోప్(46), జేమీ స్మిత్(33) ఫర్వాలేదన్పించారు. కెప్టెన్ బెన్ స్టోక్స్(6)తో సహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.తుది జట్లుఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, జేక్ వెదరాల్డ్, మార్నస్ లాబుషేన్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ , మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, బ్రెండన్ డాగెట్, స్కాట్ బోలాండ్ఇంగ్లండ్: బెన్ డకెట్, జాక్ క్రాలే, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ , గస్ అట్కిన్సన్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్చదవండి: Ashes: చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్


