ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం నాథన్ లియోన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆస్ట్రేలియా బౌలర్‌గా లియోన్ నిలిచాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో లియోన్ ఈ ఫీట్ సాధించాడు. అతడు ఇప్పటివరకు 141 మ్యాచ్‌లలో 564 వికెట్లు పడగొట్టాడు.
ఇంతకుముందు ఈ అరుదైన రికార్డు లెజెండరీ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్(563) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మెక్‌గ్రాత్‌ను లియోన్ అధిగమించాడు. అగ్రస్దానంలో దివంగత స్పిన్నర్ షేన్ వార్న్(708) ఉన్నాడు. ఇక ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో లియోన్ ఆరో స్ధానానికి ఎగబాకాడు.
ఈ లిస్ట్‌లో ముత్తయ్య మురళీధరన్ (800) టాప్ ప్లేస్‌లో ఉండగా.. షేన్ వార్న్ 708, జేమ్స్ అండర్సన్ 704, అనిల్ కుంబ్లే 619, స్టువర్ట్ బ్రాడ్ 604 తర్వాతి స్ధానాల్లో ఉన్నారు. ఈ దిగ్గజ బౌలర్లు అందరూ రిటైర్డ్ కాగా.. లయన్ ఒక్కడే టెస్టుల్లో కొనసాగుతున్నాడు.
మెక్‌గ్రాత్ రియాక్షన్ వైరల్..!
కాగా తన రికార్డును బ్రేక్ చేసిన సమయంలో గ్లెన్ మెక్‌గ్రాత్ కామెంటరీ బాక్స్‌లో ఉన్నాడు. ఈ సందర్భంగా మెక్‌గ్రాత్ స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లియోన్ వికెట్ తీయగానే.. మెక్‌గ్రాత్ సరదగా ‘కుర్చీని విసిరేస్తున్నట్లు’రియాక్ట్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే ఈ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ నవ్వుతూ లియోన్‌ను అభినందించాడు.
And with that absolute beauty, Nathan Lyon has passed Glenn McGrath for Test wickets! 564 😱#Ashes | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/wTofukUsYD
— cricket.com.au (@cricketcomau) December 18, 2025
చదవండి: IND vs SA: క్రికెట్ వర్సెస్ కాలుష్యం.. నిజంగా ఇది సిగ్గు చేటు!


