రిటైర్మెంట్ ప్రకటించిన అమెరికా బాక్సర్ టెరెన్స్ క్రాఫోర్డ్
కెరీర్‌లో పోటీపడ్డ 42 బౌట్‌లలోనూ విజయం
న్యూయార్క్: అమెరికా ప్రొఫెషనల్ బాక్సర్ టెరెన్స్ క్రాఫోర్డ్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ప్రొఫెషనల్ కెరీర్‌లో పోటీపడిన 42 బౌట్‌లలోనూ విజయాలు సాధించిన 38 ఏళ్ల క్రాఫోర్డ్... ఈ ఏడాది సెపె్టంబర్‌లో చివరిసారి బరిలోకి దిగాడు. నాలుగు వేర్వేరు విభాగాల్లో టైటిల్స్ నెగ్గిన ఈ అమెరికా బాక్సర్... అపజయమన్నదే లేకుండా బుధవారం కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ‘ప్రతి బాక్సర్‌కు ఇలాంటి ఒక సమయం వస్తుంది. కెరీర్‌లో ఎన్నో సాధించా. ఏమీ లేకుండా రింగ్‌లో అడుగుపెట్టా. ఒక దశలో కేవలం గ్లౌవ్స్ ఉంటే చాలు అనే దగ్గరి నుంచి అన్నీ సమకూరే స్థాయికి చేరుకున్నా.
మొదట్లో కుటుంబం కోసం బాక్సింగ్‌ను ఎంచుకున్నా... ఆ తర్వాత అంచలంచెలుగా ఈ స్థాయికి చేరుకున్నా. బాక్సింగ్ నాకు అన్నీ ఇచ్చింది. ఇప్పుడు వీడ్కోలు పలకాల్సిన సమయం వచి్చంది’ అని క్రాఫోర్డ్ వీడ్కోలు సందేశంలో పేర్కొన్నాడు. 2008లో ప్రొఫెషనల్‌గా మారిన క్రాఫోర్డ్... కెరీర్‌లో 31 నాకౌట్ విజయాలు సాధించడం విశేషం. చివరగా కానెలో అల్వరెజ్‌పై విజయం సాధించిన క్రాఫోర్డ్ కెరీర్‌లో లైట్ వెయిట్, సూపర్ లైట్ వెయిట్, వెల్టర్ వెయిట్, సూపర్ వెల్టర్ వెయిట్ విభాగాల్లో పోటీ పడి విజయాలు సాధించాడు.


