టీమిండియా వెటరన్ పేసర్ మోహిత్ శర్మ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మోహిత్ తన నిర్ణయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బుధవారం వెల్లడించాడు. భారత్ తరపున 34 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మోహిత్.. ఐపీఎల్‌లో పలు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు.
"హర్యానాకు ప్రాతినిధ్యం వహించడం మొదలు భారత్ జట్టు, ఆపై ఐపీఎల్‌లో ఆడటం వరకు నా ప్రయాణం ఒక అద్భుతం. ఈ రోజు అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. నాకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచిన హర్యానా క్రికెట్ అసోసియేషన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
అలాగే నన్ను సరైన మార్గంలో నడిపించిన అనిరుధ్ సర్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. బీసీసీఐ, కోచ్‌లు, సహచరులు, ఐపీఎల్ ఫ్రాంచైజీలు, సపోర్ట్ సిబ్బంది, అభిమానులందరికి ధన్యవాదాలు ఉంటూ తన రిటైర్మెంట్ నోట్‌లో మోహిత్ రాసుకొచ్చాడు.
ఈ హర్యానా పేసర్ చివరగా భారత తరపున 2015లో ఆడాడు. అప్పటి నుంచి జాతీయ దూరంగా ఉంటున్నాడు. ఐపీఎల్‌లో మాత్రం రెగ్యూలర్‌గా ఆడుతూ వస్తున్నాడు. ఐపీఎల్-2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడాడు. అయితే మినీ వేలానికి ముందు అతడిని గుజరాత్ విడిచిపెట్టింది. అంతలోనే అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు.
భారత్ తరుపున అతడు 26 వన్డేలు, 8 టీ20లు ఆడాడు. వన్డేల్లో 31 వికెట్లు, టీ20ల్లో ఆరు వికెట్లు సాధించాడు. అతడు 2013లో ఎంఎస్ ధోని సారథ్యంలో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో 120 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన మోహిత్ 134 వికెట్లు పడగొట్టాడు.


