శతక్కొట్టిన రుతురాజ్‌, కోహ్లి.. రాహుల్‌ మెరుపు ఇన్నింగ్స్‌ | IND vs SA 2nd ODI: Ruturaj Kohli Centuries Rahul Slams 50 Ind Score | Sakshi
Sakshi News home page

శతక్కొట్టిన రుతురాజ్‌, కోహ్లి.. రాహుల్‌ మెరుపు ఇన్నింగ్స్‌

Dec 3 2025 5:23 PM | Updated on Dec 3 2025 5:43 PM

IND vs SA 2nd ODI: Ruturaj Kohli Centuries Rahul Slams 50 Ind Score

సౌతాఫ్రికాతో రెండో వన్డేలో టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. రాయ్‌పూర్‌ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగులు సాధించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (22), రోహిత్‌ శర్మ (14) విఫలం కాగా.. విరాట్‌ కోహ్లి (102), రుతురాజ్‌ (105) సెంచరీలతో చెలరేగారు.

 

రాహుల్‌ మెరుపు అర్ధ శతకం
తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) అజేయ అర్ధ శతకం (43 బంతుల్లోనే 66)తో అదరగొట్టగా.. ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (1) రనౌట్‌ అయ్యాడు. మిగిలిన వారిలో మరో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్‌ రెండు, నండ్రీ బర్గర్‌, లుంగి ఎంగిడి తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

కాగా స్వదేశంలో సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ (IND vs SA ODIs)లో భాగంగా టీమిండియా రాంచిలో గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉంది. తొలి వన్డేలో 349 పరుగులు చేసిన భారత్‌.. ప్రొటిస్‌పై 17 పరుగుల తేడాతో నెగ్గింది. తాజాగా మరోసారి 358 పరుగుల మేర భారీ స్కోరు సాధించిన టీమిండియా.. సఫారీలకు 359 పరుగుల టార్గెట్‌ విధించింది. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాపై వన్డేల్లో భారత్‌కు ఇది రెండో అత్యధిక స్కోరు.

వన్డేల్లో సౌతాఫ్రికాపై టీమిండియా అత్యధిక స్కోర్లు టాప్‌-5 జాబితా
🏏గ్వాలియర్‌ వేదికగా 2010లో 401/3
🏏రాయ్‌పూర్‌ వేదికగా 2025లో 358/5
🏏రాంచి వేదికగా 2025లో 349/8
🏏కార్డిఫ్‌ వేదికగా చాంపియన్స్‌ ట్రోఫీ 2013లో 331/7
🏏కోల్‌కతా వేదికగా వన్డే వరల్డ్‌కప్‌ 2023లో 326/5.

చదవండి:  చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement