టీ20 వరల్డ్‌కప్-2026 కోసం టీమిండియా జెర్సీని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రిలీజ్ చేసింది. రాయ్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డే సందర్భంగా ఈ కొత్త జెర్సీని బీసీసీఐ ఆవిష్కరించింది. షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా హాజరయ్యారు.
వీరితో పాటు టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, తిలక్ వర్మలు కూడా పాల్గోన్నారు. వీరిద్దరూ భారత కొత్త జెర్సీ కిట్‌లతో ఫోటోలకు పోజులిచ్చారు. అదేవిధంగా భారత్, శ్రీలంక వేదికలగా జరిగే ఈ మెగా ఈవెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు.
అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. భారత జట్టుకు నా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి చెప్పుకొచ్చాడు. ఈ జెర్సీలో భారత జెండాలోని మొత్తం మూడు రంగులు ఉన్నాయి. ఎక్కువగా ముదురు నీలం రంగు ఉండగా.. ఇరు వైపులా ఆరెంజ్ రంగు ఉంది. కాలర్ దగ్గరలో తెలుపు రంగు ఉంది జెర్సీ మధ్యలో స్పాన్సర్ అపోలో టైర్స్, ఇండియా అని పేరు రాసి ఉంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతోంది.
గ్రూపు-ఎలో భారత్
ఇక ఈ పొట్టి ప్రపంచకప్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ గ్రూపు-ఎలో భారత్ ఉంది. భారత్‌తో పాటు పాక్, నెదర్లాండ్స్, నమీబియా, అమెరికా ఉన్నాయి. టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 7న అమెరికాతో వాంఖడే వేదికగా తలపడనుంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా పాకిస్తాన్-భారత్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
India's jersey for #t20worldcup2026 #TeamIndia #INDvsSA pic.twitter.com/376CAa3eDY
— Aakash Biswas (@aami_aakash) December 3, 2025


