టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రాయ్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ కోహ్లి శతక్కొట్టాడు. కింగ్ కోహ్లి 90 బంతుల్లోనే తన 53వ వన్డే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా విరాట్‌కు ఇది 84వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. మొత్తంగా 93 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఆరంభంలోనే రోహిత్ శర్మ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లి జట్టు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ నాలుగో మూడో వికెట్‌కు 195 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్..
వన్డేల్లో అత్యధిక సార్లు 150కు పైగా పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్న ఆటగాడిగా కోహ్లి రికార్డులెక్కాడు. కోహ్లి ఇప్పటివరకు 32 సార్లు 150కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని మరొక ఆటగాడితో కలిసి నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (31) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సచిన్ వరల్డ్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.
Play it on loop ➿
Just like Virat Kohli 😎💯
Yet another masterful knock! 🫡
Updates ▶️ https://t.co/oBs0Ns6SqR#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/WYbSDLEQRo— BCCI (@BCCI) December 3, 2025


