బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ టెస్ట్, టీ20 క్రికెట్ నుంచి తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. జాతీయ జట్టు తరపున తిరిగి మూడు ఫార్మాట్లలో ఆడాలని భావిస్తున్నట్లు షకీబ్ తెలిపాడు. సొంత ప్రజలు ముందు రిటైర్మెంట్ అవ్వాలనే తన కోరికను అతడు వ్యక్తం చేశాడు.
కాగా గతేడాది భారత పర్యటన తర్వాత టెస్ట్, టీ20లకు షకీబ్ వీడ్కోలు పలికిన షకీబ్.. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతానని చెప్పుకొచ్చాడు. కానీ షకీబ్ వివాదాలలో చిక్కుకోవడంతో వన్డేలకు అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఈ స్టార్ ఆల్‌రౌండర్ ప్రస్తుతం యూకేలో ఉంటున్నాడు.
గతేడాది మే నుంచి ఇప్పటివరకు అతడు ఇప్పటివరకు బంగ్లాదేశ్‌కు తిరిగి రాలేదు. ఓ హత్య కేసులో అతడి పేరిట ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ వివాదంలో అతడు చిక్కుకున్నప్పటికి పాకిస్తాన్, భారత్‌లలో జరిగిన టెస్ట్ సిరీస్‌లలో మాత్రం పాల్గోనున్నాడు.
ఆ తర్వాత అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోవడంతో షకీబ్ విదేశాల్లోనే ఉండిపోయాడు. షకీబ్ ఆ పార్టీ ఎంపీగా పనిచేసిన సంగతి తెలిసిందే. తాజాగా మోయిన్ అలీతో 'బీర్డ్ బిఫోర్ వికెట్' పాడ్‌కాస్ట్‌లో షకీబ్ అల్ హసన్ పాల్గోన్నాడు. ఈ సందర్భంగా తన మనసులోని మాటను అతడు వెల్లడించాడు.
"నేను ఇంకా అన్ని ఫార్మాట్ల నుంచి అధికారికంగా రిటైర్ కాలేదు. ఈ విషయాన్ని మొదటిసారి వెల్లడిస్తున్నా. తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లి పూర్తి స్ధాయిలో వన్డే, టెస్ట్, టీ20 సిరీస్ ఆడి రిటైర్ అవ్వాలనుకుంటున్నాను. సొంత ప్రజల ముందు అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతా. ఫిట్‌గా ఉండేందుకే టీ20 లీగ్స్‌లో ఆడుతున్నా అని షకీబ్ పేర్కొన్నాడు. మరి అతడి కోరికను బంగ్లా క్రికెట్ బోర్డు నెరవేరుస్తుందో లేదో వేచి చూడాలి.
చదవండి: IPL 2026: యువ సంచలనంపై ముంబై కన్ను.. ఎవరీ ముకుల్ చౌదరి?


