breaking news
Bangladesh Cricket Board
-
బిగ్ ట్విస్ట్!.. పాకిస్తాన్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్!
టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తామని ప్రకటించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై ఒత్తిడి పెరుగుతోంది. పాక్ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ విషయంలో పునరాలోచన చేయాల్సిందిగా శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) ఇప్పటికే పీసీబీకి లేఖ రాసింది.ఆర్థికంగా నష్టంగతంలో తమ జట్టుపై పాకిస్తాన్లో ఉగ్రదాడి జరిగినా.. తిరిగి తామే మళ్లీ తొలిసారి ఆ దేశంలో పర్యటించిన విషయాన్ని లంక బోర్డు ఈ సందర్భంగా గుర్తు చేసింది. భారత్- పాక్ మ్యాచ్‌కు తాము ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. ఒకవేళ మ్యాచ్ రద్దు చేసుకుంటే తాము ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోతామని పేర్కొంది. ఇకముందు కూడా తాము పీసీబీతో సంబంధాలు కొనసాగించాలనుకున్నామంటూ సుత్తిమెత్తగానే హెచ్చరికలు జారీ చేసింది.యూఏఈ లేఖతాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) క్రికెట్ కూడా పాకిస్తాన్‌కు లేఖ రాసింది. ‘‘ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్‌తో చాలా ఏళ్లుగా బంధం కొనసాగిస్తోంది. గతంలో పాకిస్తాన్ కోసం మా వేదికలు ఇచ్చి టోర్నీలు సజావుగా సాగేలా చూసుకున్నాము.అయితే, టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తామన్న పాక్ నిర్ణయం మాతో పాటు ఇతర సభ్యదేశాలను తీవ్రంగా గాయపరిచింది. ముఖ్యంగా అసోసియేట్ జట్లు ఆర్థికంగా భారీ ఎత్తున నష్టాలు చవిచూడాల్సి ఉంటుంది.పీసీబీ కుటుంబంలో సభ్యులుగా ఈ విషయంలో పునరాలోచన చేయాలని.. సమస్యకు సరైన పరిష్కారం కనుగొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని యూఏఈ బోర్డు ఇ-మెయిల్ పంపింది. బంగ్లాదేశ్ సైతంఇక ఈ వివాదం అంతటికీ మూలకారణమైన బంగ్లాదేశ్ సైతం పీసీబీకి ఇదే సందేశాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా భారత్-శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భాగంగా.. భారత్‌లో తమకు భద్రత ఉండదంటూ బంగ్లాదేశ్ ఐసీసీని ఆశ్రయించిది.తమ వేదికను శ్రీలంకకు మార్చాల్సిందిగా కోరింది. అయితే, ఇందులో వాస్తవం లేదని కొట్టిపారేసిన ఐసీసీ బంగ్లాకు గడువు ఇచ్చింది. అయినా సరే బంగ్లా బోర్డు తమ వైఖరి మార్చుకోలేదు. దీంతో ఐసీసీ ఆ జట్టును టోర్నీ నుంచి తొలగించింది.మొహ్సిన్ నక్వీతో చర్చలుఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఉంటామంటూ పాక్.. మొదట టోర్నీ నుంచే వైదొలుగుతామని బెదిరించింది. అనంతరం టీమిండియాతో మ్యాచ్ మాత్రమే బహిష్కరిస్తామని కొత్త నాటకానికి తెరతీసింది. ఇదే జరిగితే ఐసీసీ ఆర్థికంగా భారీగా నష్టపోతుంది. ఈ ప్రభావం పీసీబీతో పాటు ఇతర సభ్య దేశాల బోర్డు మీదా పడుతుంది.మీ మద్దతుకు ధన్యవాదాలు.. కానీఈ క్రమంలో ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా, బంగ్లా బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం ఆదివారం పాకిస్తాన్‌కు వెళ్లారు. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీతో ఈ విషయం గురించి చర్చించారు. ఈ సందర్భంగా అమినుల్ ఇస్లాం.. తమకు మద్దతుగా నిలిచినందుకు పీసీబీకి ధన్యవాదాలు చెప్పినట్లు సమాచారం.అదే సమయంలో భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ భారత్- పాక్ మ్యాచ్ జరుగకపోతే తమతో పాటు అన్ని బోర్డులు ఆర్థికంగా నష్టపోతాయని అందుకే ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని అమినుల్ నక్వీని కోరిట్లు సమాచారం.ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన నక్వీ.. ప్రధాని షెబాజ్ షరీఫ్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా తటస్థ వేదికైన కొలంబోలో ఫిబ్రవరి 15న భారత్- పాక్ మ్యాచ్‌కు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: ముకేశ్ అంబానీకి నో చెప్పిన రోహిత్ శర్మ! -
ఐపీఎల్ పొమ్మంది.. పీఎస్ఎల్ రమ్మంది! ఎన్ని కోట్లు నష్టమో తెలుసా?
ఐపీఎల్ నుంచి ఉద్వాసనకు గురైన బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో లాహోర్ ఖలందర్స్ తరపున ముస్తాఫిజుర్ ఆడనున్నాడు. పీఎస్ఎల్ వేలానికి ముందు అతడిని రూ. 2.08 కోట్లకు (పీకేర్ 6.44 కోట్లు) లాహోర్ ఒప్పందం కుదుర్చుకుంది.ఈ విషయాన్ని లాహోర్ ఖలందర్స్ ఓనర్ సమీన్ రానా ధ్రువీకరించాడు. "ముస్తాఫిజుర్ లాహోర్ ఖలందర్స్ ఫ్యామిలీలో ఎల్లప్పుడూ భాగమే. అతడు తిరిగి మా జట్టులో చేరినందుకు చాలా సంతోషంగా ఉందని" సమీన్ రానా పేర్కొన్నాడు. ఈ ఫ్రాంచైజీకి ముస్తాఫిజుర్ ప్రాతినిథ్యం వహించడం ఇదే మూడవసారి కావడం గమనార్హం. రూ. 7.12 కోట్ల నష్టంకాగా ఐపీఎల్-2026 మినీ వేలంలో ముస్తాఫిజుర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రూ. 9.20 కోట్లకు దక్కించుకుంది. అయితే బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడుల నేపథ్యంలో అతడిని జనవరి 3న బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ జట్టు నుంచి విడుదల చేసింది. దీంతో అప్పటి నుంచి బంగ్లా-భారత్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తమయ్యాయి.భద్రతా కారణాలను సాకుగా చూపుతూ టీ20 వరల్డ్‌కప్ కోసం భారత్‌లో పర్యటించేందుకు బంగ్లాదేశ్ నిరాకరించింది. దీంతో రంగంలోకి దిగిన ఐసీసీ.. బంగ్లా క్రికెట్ బోర్డును ఒప్పించేందుకు ప్రయత్నించింది. కానీ బీసీబీ మాత్రం తమ పట్టును వీడలేదు. ఫలితంగా ఐసీసీ బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించి, వారి స్థానంలో స్కాట్లాండ్ను చేర్చింది. ఏదేమైనప్పటికి రెండు దేశాల ఉద్రిక్తలకు ముస్తాఫిజుర్ బలైపోయాడు. అతడు ఐపీఎల్లో ఆడి ఉంటే రూ. 9.20 కోట్లు దక్కేవి. కానీ ఇప్పుడు పీఎస్ఎల్ ఒప్పందం కారణంగా ముస్తాఫిజుర్‌కు కేవలం రూ. 2.08 కోట్లు లభించనున్నాయి. దీంతో అతడు దాదాపు రూ. 7.12 కోట్లను కోల్పోవాల్సి వచ్చింది. కాగా ఈ ఏడాది పీఎస్ఎల్ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. -
IND vs PAK: పాక్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్!
భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తామన్న పాకిస్తాన్ ప్రకటనపై బంగ్లాదేశ్ తొలిసారి స్పందించింది. ఇలాంటి నిర్ణయాల వల్ల తాము కూడా నష్టపోయే ప్రమాదం ఉందంటూ.. పాక్‌కు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చింది. అసలేం జరిగిందంటే.. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్- శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.బంగ్లా మొండి వైఖరి.. ఐసీసీ కఠిన చర్యలుఅయితే, భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తమకు భారత్‌లో భద్రత లేదంటూ బంగ్లా ఆరోపించింది. తమ వేదికను లంకకు మార్చాల్సిందిగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి విజ్ఞప్తి చేసింది. అయితే, బంగ్లా క్రికెట్ బోర్డు (BCB) వాదనలో నిజం లేదని కొట్టిపారేసిన ఐసీసీ ఇందుకు నిరాకరించి.. పునరాలోచించుకోవాల్సిందిగా గడువు ఇచ్చింది.పాక్ బోర్డు డ్రామాలుకానీ.. బీసీబీ మాత్రం మొండిపట్టు వీడలేదు. ఫలితంగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించి ఆ స్థానంలో ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్ను చేర్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు తాము మద్దతుగా ఉంటామంటూ పాక్ క్రికెట్ బోర్డు (PCB) డ్రామాకు తెరతీసింది.తొలుత టోర్నీ మొత్తం బహిష్కరిస్తామని.. ఆ తర్వాత భారత్‌తో మ్యాచ్ మాత్రమే బాయ్‌కాట్ చేస్తామని పీసీబీ ఐసీసీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. క్రికెట్ ప్రపంచంలో అత్యంత క్రేజ్ ఉన్న భారత్- పాక్ మ్యాచ్ జరుగకపోతే దాదాపు రెండు వేల కోట్ల రూపాయాలకు పైగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.పాక్ పంతం వీడకపోతే ఈ నష్టం ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇదే జరిగితే ఐసీసీ సభ్య దేశాల ఆదాయంలో కోత పడుతుంది. ముఖ్యంగా చిన్నస్థాయి బోర్డుల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. పాక్‌తో పాటు ఇతర సభ్య దేశాలు ఆర్థిక నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.నష్టపరిచే విధానాలను కోరుకోవడం లేదుఈ నేపథ్యంలో పాక్ ప్రకటనపై బంగ్లాదేశ్ సీనియర్ డైరెక్టర్ ఒకరు స్థానిక మీడియా ప్రథోమ్ ఆలోతో మాట్లాడారు. ‘‘ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ జరుగకపోతే క్రికెట్ ప్రపంచం మొత్తం ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతుంది. ఆదాయంలో మా వాటా కూడా తగ్గిపోతుంది. ఇలాంటి నష్టపరిచే విధానాలను మేము కోరుకోవడం లేదు’’ అని సదరు డైరెక్టర్ స్పష్టం చేశారు. పాక్ వైఖరి ఇతర బోర్డుల పొట్టకొట్టేలా ఉందని అభిప్రాయపడ్డారు.అయితే, అదే సమయంలో.. ‘‘భారత క్రికెట్‌కు గట్టి సందేశం ఇవ్వాలని పాకిస్తాన్ కోరుకుంటున్నట్లు ఉంది. క్రికెట్లో భారత్ ఆధిపత్యాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తోంది. ఆ కోణంలో పాక్ నిర్ణయం ఒక రకంగా సరైందే అయి ఉండవచ్చు’’ అని సదరు డైరెక్టర్ భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు.కాగా ఐసీసీకి దాదాపు తొంభై శాతానికి పైగా ఆదాయం భారత మార్కెట్ల నుంచే వస్తుందని పాక్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రాజా గతంలో వ్యాఖ్యానించాడు. దీనిని బట్టి ఐసీసీకి ప్రధాన ఆదాయ వనరు భారత క్రికెట్ అని చెప్పడంలో సందేహం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.వ్యవస్థ అతలాకుతలంఇలాంటి తరుణంలో పాక్ ఇలా పూటకో నాటకం ఆడుతూ ఇతర బోర్డులకు నష్టం చేకూర్చే విధంగా ప్రవర్తిస్తోందని విమర్శలూ వస్తున్నాయి. బీసీబీకి చెందిన మరో సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ‘‘భారత్- పాక్ మ్యాచ్ వివాదం ఐసీసీ సెంట్రల్ రెవెన్యూ పూల్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. మేము కూడా అందులో భాగమే. కెన్యా, ఉగాండా వంటి జట్లు పెద్దగా నష్టపోవు. ఒకవేళ ఐసీసీ నుంచి వచ్చే ఆదాయం తగ్గితే మా వ్యవస్థ అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉంది’’ అని పేర్కొన్నారు. చదవండి: వరల్డ్‌కప్ టోర్నీకి ముందు టీమిండియాకు మరో షాక్! -
భారత ప్రధాని ఒక్క మాట చెబితే మన ఖేల్ ఖతం: రమీజ్ రాజా
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వైఖరి గురించేప్రధానంగా చర్చ నడుస్తోంది. తమకు అవసరం లేని విషయంలో తలదూర్చి పాక్ కష్టాలు కొని తెచ్చుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నుంచి ఐసీసీ బంగ్లాదేశ్‌ను ఇప్పటికే తప్పించిన విషయం తెలిసిందే.కోరికోరి వివాదాలుభారత్లో తమకు భద్రత ఉండదంటూ ఆరోపణలకు దిగిన బంగ్లా.. మరో వేదికైన శ్రీలంకలో తమ మ్యాచ్‌లు ఆడించాలని ఐసీసీని కోరింది. అయితే, ఈ వాదనలో నిజం లేదంటూ కొట్టిపారేసిన ఐసీసీ.. బంగ్లా అభ్యర్థనను తిరస్కరించింది. అయినప్పటికీ బంగ్లా పట్టువీడకపోవడంతో.. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను తీసుకువచ్చింది.అయితే, బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగిందంటూ తాము కూడా టోర్నీలో పాల్గొనమని బెదిరింపు ధోరణి అవలంబించిన పాకిస్తాన్.. తెగేదాకా లాగితే మొదటికే మోసం వస్తుందనేమో.. కేవలం భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తామని ప్రకటించింది. తటస్థ వేదికల ఏర్పాటుకాగా భారత్- పాక్ మధ్య దైపాక్షిక సిరీస్‌లు జరిగి దశాబ్దకాలానికి పైగా అవుతోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్ టోర్నీలో ముఖాముఖి తలపడుతున్న దాయాదుల మధ్య 2024లో ఐసీసీ ఓ ఒప్పందం కుదిర్చింది.ఇరు దేశాల్లో ఒకటి ఆతిథ్య దేశంగా ఉంటే.. మరో జట్టు కోసం తటస్థ వేదికను ఏర్పాటు చేయాలి. అందుకు అనుగుణంగానే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి పాక్ ఆతిథ్యం ఇవ్వగా.. టీమిండియా దుబాయ్‌లో మ్యాచ్‌లు ఆడింది. ఆ తర్వాత ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 టోర్నీ భారత్‌లో జరుగగా.. పాక్ శ్రీలంకలో తమ మ్యాచ్‌లు ఆడింది. తాజాగా టీ20 వరల్డ్‌కప్‌లోనూ పాక్ పురుషుల జట్టు శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.భారత్‌తో పెట్టుకుంటే అంతేఅయినప్పటికీ బంగ్లాదేశ్ కోసమంటూ పాక్.. భారత్‌ను ఢీకొట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో పీసీబీ మాజీ చైర్మన్ రమీజ్ రాజా.. భారత్‌తో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని గతంలో హెచ్చరించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది.సెనేట్ స్టాండింగ్ కమిటీ ముందు 2021లో పీసీబీ చైర్మన్ హోదాలో మాట్లాడుతూ.. ‘‘నేను చెప్పే విషయాలు భయపెట్టేవని నాకు తెలుసు. ఐసీసీ నుంచి వచ్చే 50 శాతం నిధులతోనే పాక్ బోర్డు తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇతర బోర్డు మెంబర్లతో కలిసి టోర్నమెంట్లు నిర్వహించడం ద్వారా ఐసీసీకి ఆదాయం వస్తుంది.90 శాతం ఆదాయం అక్కడి నుంచేఇక ఐసీసీకి వచ్చే ఆదాయంలో 90 శాతం ఇండియన్ మార్కెట్ల నుంచే వస్తుంది. అంటే ఒకరకంగా.. భారత్‌లోని వ్యాపారం వల్లే పాకిస్తాన్ క్రికెట్ మనుగడ కొనసాగిస్తోంది. ఒకవేళ భవిష్యత్తులో భారత ప్రధాని పాకిస్తాన్ క్రికెట్‌కు ఫండింగ్ ఆపేయమని చెబితే.. పీసీబీ కుప్పకూలుతుంది’’ అని రమీజ్ రాజా వ్యాఖ్యానించాడు. అయితే, ఈ వీడియో ఫేక్ కావొచ్చు అంటూ పాక్ అభిమానులు అంటుండగా... ఏదేమైనా ఈ మాటలు మాత్రం నిజమేనంటూ టీమిండియా ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. చదవండి: ICC vs PCB: పాకిస్తాన్‌కు భారీ షాక్!#WATCH : Throwback Video Of Ramiz Raja Warned PCB Could ‘Collapse’ If India Pulls SupportAn old video of former Ramiz Raja, made during his tenure as chairman of the Pakistan Cricket Board, has resurfaced on social media, drawing renewed attention amid ongoing cricket diplomacy… pic.twitter.com/BCkNgzyI2z— upuknews (@upuknews1) February 3, 2026 -
పాక్ ఓవరాక్షన్.. ఐసీసీ కీలక సమావేశం!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీసుకున్న నిర్ణయం పట్ల అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభానికి సమయం సమీపించిన తరుణంలో భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తున్నామంటూ పాక్ ప్రభుత్వం చేసిన ప్రకటన ఐసీసీకి ఆగ్రహం తెప్పించింది.అత్యవసర సమావేశంఈ నేపథ్యంలో పాక్ వైఖరి పట్ల కఠిన నిర్ణయం తీసుకునేందుకు ఐసీసీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం అత్యవసరంగా బోర్డు సమావేశం ఏర్పాట్లు చేసినట్లు టైమ్స్‌నౌ వెల్లడించింది. పీసీబీ గనుక పట్టువీడకపోతే తగిన విధంగా బుద్ధి చెప్పాలనే యోచనలో ఐసీసీ ఉన్నట్లు సమాచారం.కాగా భారత్- శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7న మొదలయ్యే పురుషుల టీ20 ప్రపంచకప్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ నిర్ణయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా బంగ్లాదేశ్‌కు బాసటగా నిలిచేందుకు ఈ మెగా ఈవెంట్‌నే బహిష్కరిస్తామని బీరాలు పలికిన పాక్ ఇప్పుడు ప్రపంచకప్ ఆడేందుకు సిద్ధమైంది.భారత్‌తో మాత్రం ఆడబోముఅయితే భారత్‌తో మాత్రం మ్యాచ్ ఆడబోమని ప్రకటించింది. నిజానికి జట్లు ఎంపిక, ప్రకటనకు ఐసీసీ ఇచ్చిన తుదిగడువుకు ముందే పీసీబీ తమ జట్టును ప్రకటించింది. కానీ.. తమ ప్రభుత్వం ఆమోదం తెలిపితేనే ప్రపంచకప్ ఆడతామని జట్టును ఎంపిక చేసిన సందర్భంలో తెలిపింది. ప్రపంచకప్‌లో ఆడేందుకు అనుమతి ఇచ్చిన పాకిస్తాన్ ప్రభుత్వం భారత్‌తో జరిగే మ్యాచ్‌ను మాత్రం బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. దాంతో వరల్డ్‌కప్ ఆడతామని ఆదివారం స్పష్టం చేసిన పీసీబీ ఈ నెల 15న కొలంబో (శ్రీలంక) వేదికగా భారత్‌తో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగబోమని తెలిపింది.పెద్ద ఎత్తున నష్టాలుఈ నేపథ్యంలో పీసీబీపై ఐసీసీ తీసుకోబోయే చర్యలు ఎలా ఉండబోతున్నాయంటూ క్రికెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాగా దాయాదుల ‘ప్రపంచ’ సమరం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే, పాక్ ప్రకటన వారికి షాకిచ్చింది. భారత్‌తో ఆడబోమంటూ పాక్ చేసిన ప్రకటన.. ఫ్యాన్స్‌పైనే కాదు దీని తక్షణ ప్రభావం గ్లోబల్ బ్రాడ్కాస్టర్లపై కూడా పడుతుంది. అసలే 20 జట్లు ఆడుతున్న ఈ మెగా టోర్నీలో ఇక ఒక్క మ్యాచ్‌కు కూడా కిక్కిరిసే మైదానం కనబడక... టికెట్ రెవెన్యూ యాడ్ రెవెన్యూ, ఓ ప్రపంచకప్‌కు వీక్షకుల సంఖ్య, ఇలా అన్నింటిపైనా ప్రభావం ఉంటుంది. ఇదే జరిగితే ఐసీసీకి పెద్ద ఎత్తున నష్టాలు వస్తాయి. ఫలితంగా పాక్ బోర్డు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు చవిచూడక తప్పదు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ సైతం భద్రతా కారణాలు అంటూ.. భారత్‌లో మ్యాచ్ ఆడలేమని పట్టుబట్టగా ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించింది ఐసీసీ. ఇపుడు పాక్‌కు కూడా ఇలాంటి భారీ షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.చదవండి: విచారకరం: షాహిద్ ఆఫ్రిది పోస్ట్ వైరల్ -
T20 WC: బంగ్లా అవుట్.. తొలిసారి స్పందించిన శ్రీలంక
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు భారత్‌తో పాటు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్య దేశంగా ఉంది. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లన్నీ లంకలోనే నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, బంగ్లాదేశ్ సైతం శ్రీలంకలో తమ మ్యాచ్‌లు ఆడతామంటూ మొండిపట్టు పట్టి మూల్యం చెల్లించింది.భారత్- బంగ్లాదేశ్ మధ్య గత కొంతకాలంగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. ఐపీఎల్ నుంచి బంగ్లా ఫాస్ట్‌బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ (Mustafizur Rahman)ను బీసీసీఐ తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ జట్టుకు భారత్‌లో భద్రత లేదని.. వరల్డ్‌కప్‌లో తమ మ్యాచ్‌లు భారత్‌లో కాకుండా లంకలో ఆడతామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) పంతం పట్టింది.బంగ్లాదేశ్‌ను తప్పించి..అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మాత్రం ఇందుకు నిరాకరించింది. భారత్‌లో బంగ్లా ఆటగాళ్లు, సిబ్బందికి వచ్చిన ముప్పేమీ లేదని తేల్చి చెప్పగా.. బీసీబీ మాత్రం పట్టువీడలేదు. ఫలితంగా 24 గంటల తుది గడువు తర్వాత.. బంగ్లాదేశ్‌ను తప్పిస్తూ ఆ స్థానంలో స్కాట్లాండ్ను మెగా టోర్నీలో చేర్చింది ఐసీసీ.మాకు స్నేహపూర్వక దేశాలుఈ పరిణామాలపై శ్రీలంక క్రికెట్ బోర్డు తాజాగా స్పందించింది. లంక క్రికెట్ బోర్డు కార్యదర్శి బందులా దిస్సనాయకే AFPతో మాట్లాడుతూ.. "ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వివాదాల విషయంలో మాది తటస్థ వైఖరి. ఈ మూడూ మాకు స్నేహపూర్వక దేశాలు.మా దేశంలో మున్ముందు కూడా ఇలాంటి టోర్నీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాము. ఏ దేశం అడిగినా మేము సానుకూలంగా స్పందిస్తాము’’ అని పేర్కొన్నాడు. మరోవైపు.. బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము కూడా టోర్నీని బహిష్కరిస్తామని ప్రగల్బాలు పలుకుతూ ఓవరాక్షన్ చేసిన పాకిస్తాన్.. ఇప్పటికే లంకకు టికెట్లు బుక్ చేసుకున్నట్లు సమాచారం.ఈ మ్యాచ్ మాకు అత్యంత ముఖ్యంఈ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ సాఫీగా సాగేందుకు తాము ప్రత్యేకమైన, మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు శ్రీలంక క్రీడా శాఖా మంత్రి సునిల్ కుమార గమేజ్ తెలిపారు. ఈ మ్యాచ్ తమకు ప్రథమ ప్రాధాన్యం అని.. ఎలాంటి అవాంతరాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య టీ20 వరల్డ్‌కప్ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: ఆస్ట్రేలియాకు ఊహించని షాకిచ్చిన పాకిస్తాన్ -
ICC: బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగేలా మరో షాక్
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మొండి వైఖరి కారణంగా భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రెండుసార్లు అవకాశం ఇచ్చినా తీరు మార్చుకోని కారణంగా.. బంగ్లా జట్టును టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ నుంచి తప్పించారు.ఆటగాళ్లతో పాటు వారికీ సెగబంగ్లాదేశ్ ప్రభుత్వం, బీసీబీ నిర్ణయాల కారణంగా ప్రపంచకప్ ఆడాలన్న ఆటగాళ్ల కల ఈసారికి దూరమైంది. అంతేకాదు.. ఆ సెగ బంగ్లాదేశ్ జర్నలిస్టులకు కూడా తగిలినట్లు తెలుస్తోంది. భారత్- శ్రీలంక (India- Sri Lanka)వేదికలుగా జరిగే వరల్డ్‌కప్ టోర్నీ కవరేజ్ కోసం వంద మందికి పైగా జర్నలిస్టులు అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.అయితే, ఐసీసీ మాత్రం వీరి దరఖాస్తులు, అభ్యర్థనలను తిరస్కరించినట్లు (Were Denied visa and Accreditation) సమాచారం. దీంతో ఈసారి బంగ్లా జర్నలిస్టులు ఈ టోర్నీని ప్రత్యక్షంగా కవర్ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ విషయం గురించి ఆజ్‌కర్ ప్రతిక స్పోర్ట్స్ ఎడిటర్ రానా అబ్బాస్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు.చాలా బాధగా ఉంది‘‘బంగ్లాదేశ్‌లో ఇంతకు ముందెన్నడూ ఇలాంటి ఘటన జరుగలేదు. 1999లో బంగ్లా జట్టు తొలిసారి ప్రపంచకప్ ఆడేకంటే ముందు నుంచే బంగ్లాదేశీ జర్నలిస్టులు ఈ ఈవెంట్‌ను కవర్ చేస్తున్నారు. భారత్- పాకిస్తాన్ వంటి కీలక మ్యాచ్‌లు.. ముఖ్యంగా భారత్‌లో జరిగిన మ్యాచ్‌లను కూడా కవర్ చేశారు.గతంలో ఎప్పుడూ ఇలా అందరు కరస్పాండెంట్ల దరఖాస్తులను తిరస్కరించిన దాఖలాలు లేవు. ఇదొక దురదృష్టకర ఘటన. నాకైతే చాలా బాధగా ఉంది’’ అని రానా అబ్బాస్ విచారం వ్యక్తం చేశాడు.దెబ్బ అదుర్స్ కదూ!ఈ నేపథ్యంలో ఎన్డీటీవీ ఐసీసీ అధికారి స్పందన కోరగా.. బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు. ‘‘భారత్‌లో తమ వాళ్లకు రక్షణ ఉండదని బంగ్లాదేశ్ ప్రభుత్వం పదే పదే వాదించింది. అందుకే వాళ్లకు వీసాలు, అక్రిడేషన్లు ఇవ్వలేదు’’ అంటూ ఇచ్చిపడేశారు సదరు అధికారి. అయితే, నిబంధనల ప్రకారం నలభై మందికి మించకుండా అక్రిడేషన్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం.చెప్పినా వినలేదుకాగా తమ ఆటగాళ్లకు భారత్ సురక్షితం కాదని.. వేదికను శ్రీలంకకు మార్చాలంటూ బీసీబీ.. ఐసీసీని ఆశ్రయించింది. అయితే, పరిశీలనా బృందం నివేదిక మేరకు భారత్‌లో బంగ్లా జట్టుకు వచ్చిన ముప్పేమీ లేదని తేల్చింది ఐసీసీ. అయితే, బీసీబీ మాత్రం పట్టువీడలేదు. వేదిక మార్చకుంటే టోర్నీ నుంచి వైదొలుగుతామని బెదిరించింది.ఈ నేపథ్యంలో ఆఖరి అవకాశం ఇచ్చినా బీసీబీ తీరు మారకపోవడంతో.. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించింది ఐసీసీ. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను చేర్చించింది. తాజాగా బీసీబీ చెప్పిన సాకునే కారణంగా చూపుతూ జర్నలిస్టులకు వీసాలు నిరాకరించినట్లు సమాచారం.చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్! -
T20 WC: పాపం బంగ్లాదేశ్.. స్కాట్లాండ్ సానుభూతి
అనూహ్య పరిస్థితుల్లో స్కాట్లాండ్ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. భద్రతా కారణాలు చూపుతూ బంగ్లాదేశ్ తీసుకున్న నిర్ణయం స్కాట్లాండ్ పాలిట వరంగా మారింది. ర్యాంకుల ఆధారంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఈ జట్టును ప్రపంచకప్ టోర్నీలో చేర్చింది.రిచీ బెరింగ్టన్ సారథ్యంలోఈ నేపథ్యంలో స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు వరల్డ్‌కప్ టోర్నీ కోసం పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. రిచీ బెరింగ్టన్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. జైనుల్లా ఎహ్సాన్కు తొలిసారి జట్టులో చోటు దక్కింది. అఫ్గనిస్తాన్‌లో జన్మించిన ఈ ఫాస్ట్‌బౌలర్ ఇటీవలే స్కాట్లాండ్ తరఫున ఆడేందుకు అర్హత సాధించాడు.న్యూజిలాండ్ మాజీ ఆటగాడు సైతంఅంతేకాకుండా న్యూజిలాండ్ మాజీ ఆటగాడు టామ్ బ్రూస్ కూడా ఈ జట్టులో స్థానం సంపాదించాడు. అతడి రాకతో స్కాటిష్ జట్టు బ్యాటింగ్ లైనప్ బలపడినట్లయింది. 34 ఏళ్ల టామ్ న్యూజిలాండ్ తరఫున 17 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.ఇదిలా ఉంటే.. స్కాట్లాండ్ టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగం కానుండటం ఇది ఏడోసారి. అయితే, ఈసారి ఈ యూరోపియన్ జట్టు నేరుగా అర్హత సాధించకుండా.. బంగ్లాదేశ్‌ను ఐసీసీ తొలగించడం ద్వారా తమ ర్యాంకు ఆధారంగా క్వాలిఫై అయింది.బంగ్లాదేశ్ ఆటగాళ్ల పట్ల సానుభూతిఈ విషయంపై క్రికెట్ స్కాట్లాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రూడీ లిండ్బ్లేడ్ స్పందించారు. బంగ్లాదేశ్ జట్టు పట్ల తమకు సానుభూతి ఉందని ఆమె తెలిపారు. ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘ఈ విధంగా వరల్డ్‌కప్ టోర్నీలో పాల్గొనాలని మేము అనుకోలేదు.క్వాలిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసి ఈవెంట్లో అడుగుపెట్టాలని భావించాము. అయితే, అనుకోని విధంగా మాకు ఆహ్వానం వచ్చింది. ఏదేమైనా బంగ్లాదేశ్ ఆటగాళ్ల పట్ల మాకు సానుభూతి ఉంది. వారి విషయంలో జరిగిన దానికి మేము చింతిస్తున్నాం’’ అని ట్రూడీ తెలిపారు.మేమేమీ తక్కువ కాదుఅయితే, తమ జట్టు కూడా తక్కువేమీ కాదని.. ప్రపంచంలో తాము పద్నాలుగో ర్యాంకులో ఉన్నట్లు ట్రూడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కష్టం లేకుండానే తాము టీ20 వరల్డ్‌కప్ ఆడబోతున్నామంటూ వస్తున్న విమర్శలు సరికావని.. గత కొన్నేళ్లుగా తాము అద్భుత విజయాలు సాధిస్తూ ఈ స్థాయికి చేరుకున్నామని తెలిపారు.కాగా భారత్‌తో తమకు భద్రత లేదంటూ.. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాల్సిందిగా బంగ్లాదేశ్ పట్టు పట్టింది. ఇందుకు నిరాకరించిన ఐసీసీ.. బంగ్లాను టోర్నీ నుంచి తొలగించి స్కాట్లాండ్తో ఆ స్థానాన్ని భర్తీ చేసింది. ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు భారత్- శ్రీలంక వేదికలుగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీ జరుగనుంది.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి స్కాట్లాండ్ జట్టురిచీ బెరింగ్టన్ (కెప్టెన్), టామ్ బ్రూస్, మాథ్యూ క్రాస్, బ్రాడ్లీ క్యూరీ, ఆలివర్ డేవిడ్సన్, క్రిస్ గ్రీవ్స్, జైనుల్లా ఎహ్సాన్, మైకేల్ జోన్స్, మైకేల్ లీస్క్, ఫిన్లే మెక్‌క్రీత్, బ్రాండన్ మెకల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, బ్రాడ్లీ వీల్.ట్రావెలింగ్ రిజర్వ్‌లు: జాస్పర్ డేవిడ్సన్, జాక్ జార్విస్నాన్-ట్రావెలింగ్ రిజర్వ్‌లు: మెకెంజీ జోన్స్, క్రిస్ మెక్‌బ్రైడ్, చార్లీ టియర్.చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్! -
ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పొట్టి క్రికెట్ మజాను ఆస్వాదించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, అంతకంటే ముందుగానే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB).. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)ల మధ్య వ్యవహారం ఈ ఐసీసీ ఈవెంట్‌పై మరింత చర్చకు దారితీసింది.భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు వరల్డ్‌కప్ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తమ ఆటగాళ్లను భారత్‌కు పంపబోమని.. తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడించాలని బీసీబీ ఐసీసీకి విజ్ఞప్తి చేసింది.బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించిన ఐసీసీఅయితే, భారత్‌లో బంగ్లా జట్టుకు వచ్చిన ఇబ్బందేమీ లేదని చెప్పిన ఐసీసీ.. తుది నిర్ణయం తీసుకోవాల్సిందిగా బీసీబీకి గడువు ఇచ్చింది. అయితే, బీసీబీ మాత్రం మొండిపట్టు పట్టింది. తమ ప్రభుత్వం చెప్పినట్లుగానే తమ ఆటగాళ్లను భారత్‌కు పంపబోమని స్పష్టం చేసింది. ఇందుకు స్పందనగా బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించి ఆ స్థానంలో స్కాట్లాండ్ను చేరుస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.పీసీబీ ఓవరాక్షన్ఈ ఎపిసోడ్ మొత్తంలో బీసీబీ కంటే కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అతి చేసింది. బంగ్లాదేశ్‌కు ఐసీసీ అన్యాయం చేసిందంటూ.. బోర్డు మొత్తం ఒకవైపు ఉంటే.. పాక్ మాత్రం బంగ్లాకు అనుకూలంగా ఓటు వేసింది. అంతేకాదు బంగ్లాదేశ్‌ను ఆడించకపోతే తామూ టోర్నీ బహిష్కరిస్తామంటూ బెదిరింపులకు దిగింది. నిజానికి ముందుగా అనుకున్న ఒప్పందం (భారత్- పాక్ వేదికల హైబ్రిడ్ మోడల్) ప్రకారం.. పాక్‌కు ఇప్పటికే తటస్థ వేదికగా శ్రీలంకను ఏర్పాటు చేసింది ఐసీసీ.అయినప్పటికీ బంగ్లాదేశ్‌కు వత్తాసు పలుకుతూ భారత్ మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తోందని పాక్ బోర్డుపై ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తమ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం.. ఈ శుక్రవారం లేదంటే వచ్చే సోమవారం నాటికి టోర్నీలో ఆడే విషయంపై నిర్ణయం వెల్లడిస్తామంటూ పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ సోమవారం ట్వీట్ చేశాడు.ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ పాక్ టోర్నీ నుంచి తప్పుకొంటే.. ఆ స్థానంలో బంగ్లాదేశ్ రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. హిందుస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం..ఊహించని ట్విస్టు‘‘ఒకవేళ పాకిస్తాన్ టోర్నీ నుంచి వైదొలగాలని భావిస్తే.. గ్రూప్-ఎలో ఆ జట్టు స్థానాన్ని బంగ్లాదేశ్ భర్తీ చేసే అవకాశం ఉంది. పాక్ తప్పుకొంటే... బీసీబీ ముందు నుంచి కోరినట్లుగా పాక్ స్థానంలో బంగ్లాదేశ్ శ్రీలంకలో తమ మ్యాచ్‌లు ఆడేందుకు వీలు కలుగుతుంది. అయితే, ఈ ప్రక్రియలో కొన్ని సమస్యలు తలెత్తినా అంతిమంగా ఓ పరిష్కారం అయితే దొరుకుతుంది’’ అని ఐసీసీ సన్నిహిత వర్గాలు విశ్లేషించాయి.ఒప్పందం అతిక్రమిస్తే.అంతేకాదు.. ‘‘ఇప్పటికే భారత్- పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల మ్యాచ్‌లకు తటస్థ వేదికలను ఐసీసీ ఏర్పాటు చేస్తోంది. ఇప్పుడు కూడా టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్‌కు బదులు శ్రీలంకలో పాక్ తమ మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ సిద్ధం చేశారు.అయినప్పటికీ పాక్ తప్పుకొంటే.. ఒప్పందాన్ని పాక్ బోర్డు ఉల్లంఘించినట్లే అవుతుంది. కాబట్టి వారికి మున్ముందు మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఏదో చేయబోతే ఇంకేదో అయింది అన్నట్లు.. బీసీసీఐ మీదకు బంగ్లాదేశ్‌ను రెచ్చగొట్టే ప్రయత్నంలో తమ నెత్తి మీద తామే పిడుగు వేసుకున్నట్లు పాక్ పరిస్థితి మారిందని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. బీసీబీ- పీసీబీ.. ఈ రెండింటిలో భస్మాసురహస్తం ఎవరిదో అంటూ నెటిజన్లు జోకులు వేస్తున్నారు. మరోవైపు.. పాక్‌ది మేకపోతు గాంభీర్యం మాత్రమేనని.. ఏదో ఓవరాక్షన్ చేసినా అంతిమంగా టోర్నీలో ఆడేందుకు మొగ్గు చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చదవండి: ICC: వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్.. ఆ పని చేయబోముICC vs Bangladesh: అసలేం జరిగింది.. కథనాల కోసం క్లిక్ చేయండి -
అలా అయితే వరల్డ్‌కప్ ఆడే ప్రసక్తే లేదు: పాకిస్తాన్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరోసారి ధిక్కార స్వరం వినిపించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చెప్పినట్లు తాము నడుచుకోమని.. ప్రభుత్వం చెప్పినట్లు మాత్రమే వింటామంటూ అతి చేసింది. ఈ నేపథ్యంలో అసలు తమకు సంబంధం లేని అంశంలో తలదూర్చడమే కాకుండా.. ఐసీసీని కావాలనే చికాకు పెట్టే చర్యలకు పూనుకుంటోందని ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే, భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బంగ్లా బోర్డు (BCB) తాము భారత్‌లో ఆడలేమని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. కానీ ఐసీసీ ఇందుకు నిరాకరించింది. భారత్‌లో తమకు భద్రత లేదన్న బంగ్లా వాదనను కొట్టిపారేసింది. అంతేకాదు తుది నిర్ణయం తీసుకునేందుకు అవకాశాలు కూడా ఇచ్చింది.బంగ్లాదేశ్‌కు అండగా పాక్అయితే, బంగ్లాదేశ్ మాత్రం తమ ప్రభుత్వం నిర్ణయానుగుణంగా టోర్నీ నుంచి వైదొలిగేందుకే మొగ్గుచూపింది. ఈ వ్యవహారంలో బంగ్లాదేశ్‌కు అండగా నిలిచిన పాక్.. తాము కూడా టోర్నీ నుంచి తప్పుకొంటామని బెదిరింపు ధోరణి అవలంబించింది. నిజానికి భారత్- పాక్ ఉద్రిక్తతల కారణంగానే తటస్థ వేదికలపై ఇరు దేశాల జట్లు ఐసీసీ ఈవెంట్లలో ముఖాముఖి తలపడుతున్నాయి.ఈసారి టీ20 వరల్డ్‌కప్‌లోనూ పాకిస్తాన్ (Pakistan)కు శ్రీలంకను తటస్థ వేదికగా నిర్ణయించారు. తమకు అనుకూలంగానే నిర్ణయం ఉన్నా.. బంగ్లాదేశ్ కోసమంటూ పాకిస్తాన్ కొత్త రాగం ఎత్తుకుంది. ఈ క్రమంలోనే బంగ్లా మాదిరే పాక్‌ను కూడా టోర్నీ నుంచి తప్పించేందుకు ఐసీసీ సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆదివారం పాక్ తమ వరల్డ్‌కప్ జట్టును ప్రకటించింది.వరల్డ్‌కప్‌లో ఆడతామని చెప్పలేదుఫలితంగా ఈ ఐసీసీ (ICC) ఈవెంట్లో పాక్ పాల్గొంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ స్పందిస్తూ.. తాము జట్టును ప్రకటించినంత మాత్రాన వరల్డ్‌కప్‌లో ఆడతామని చెప్పినట్లు కాదని ఓవరాక్షన్ చేశాడు."ఈ విషయం గురించి మా ఆటగాళ్లతో చర్చించాము. బోర్డు, ప్రభుత్వ నిర్ణయమే తమకు శిరోదాఢ్యమని మా ఆటగాళ్లు కుండబద్దలు కొట్టారు. టోర్నీలో పాల్గొనే విషయంలో ప్రభుత్వ సలహా కోసమే మేము ఎదురుచూస్తున్నాం.అలా అయితే బహిష్కరిస్తాంప్రభుత్వం ఎలా చెబితే అలా నడుచుకుంటాము. ఒకవేళ వారు మమ్మల్ని వరల్డ్‌కప్ టోర్నీలో ఆడవద్దని చెబితే అలాగే చేస్తాము’’ అని పాక్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ పేర్కొన్నాడు. కాగా ఇప్పటికే టీమిండియా మాదిరే తమకూ వెసలుబాటు కావాలని పాక్ కోరినట్లుగా ఐసీసీ శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసింది. అయినప్పటికీ పీసీబీ బంగ్లాదేశ్ విషయంలో రాద్దాంతం చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ సైతం పాక్ పట్ల కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. కాగా బంగ్లాదేశ్ మొండివైఖరి నేపథ్యంలో ఆ జట్టును తప్పించిన ఐసీసీ.. స్కాట్లాండ్ను టోర్నీలో చేర్చింది. మొత్తం 20 జట్లు వరల్డ్‌కప్ టోర్నీలో పాల్గొననున్నాయి. చదవండి: ICC: వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్.. ఆ పని చేయబోము -
T20 WC 2026: వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్
టీ20 ప్రపంచకప్-2026 నుంచి తమ జట్టును తప్పించడంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) సవాలు చేయబోవడం లేదు. ఈ మేరకు బీసీబీ మీడియా కమిటీ చైర్మన్ అంజాద్ హుస్సేన్ ఒక ప్రకటన విడుదల చేశారు. డీఆర్సీని సంప్రదించినా..వచ్చే నెల 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆతిథ్య భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు నిరాకరించడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బంగ్లాదేశ్‌ను తప్పించింది. బంగ్లాదేశ్ స్థానంలో ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్ జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీనిపై బంగ్లా బోర్డు ఐసీసీ వివాద పరిష్కారాల కమిటీ (డీఆర్సీ)ని సంప్రదించినా ఫలితం లేకపోయింది. అంగీకరిస్తున్నాంఈ క్రమంలో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్ (CAS)కు వెళ్లాలని ముందు అనుకున్న బీసీబీ... ప్రస్తుతం అలాంటి ప్రయత్నాలు విరమించుకుంది. ‘ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాం. ముందు నుంచి భారత్‌లో ఆడబోమని చెబుతూనే ఉన్నాం. అయినా మా వాదన వినిపించుకోలేదు. దీనిపై ఆర్బిట్రేషన్‌కు వెళ్లే ఉద్దేశం లేదు’ అని అంజాద్ అన్నారు. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొనే భారత్‌లో మ్యాచ్‌లు ఆడకూడదని నిర్ణయించుకున్నామని... ఇది తమ ప్రభుత్వ నిర్ణయమని పేర్కొన్నారు. ‘ఐసీసీ బోర్డు మీటింగ్ జరిగిన తర్వాత మంత్రివర్గ భేటీలో వరల్డ్‌కప్ మ్యాచ్‌ల కోసం భారత్‌లో పర్యటించే అంశంపై చర్చ జరిగింది. భారత్‌లో ఆడేందుకు క్యాబినెట్ అంగీకరించలేదు. అదే విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లాం’ అని అంజాద్ వివరించారు. ICC vs Bangladesh: అసలేం జరిగింది.. కథనాల కోసం క్లిక్ చేయండి చదవండి: హరీస్ రవూఫ్‌పై వేటు -
టీ20 వరల్డ్‌కప్ నుంచి పాకిస్తాన్ కూడా ఔట్?
అంతా ఊహించిందే జరిగింది. టీ20 వరల్డ్‌కప్-2026 నుంచి బంగ్లాదేశ్ వైదొలిగింది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. దీంతో బంగ్లా స్ధానంలో ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం స్కాట్లాండ్కు అవకాశం లభించింది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ బాటలోనే పాకిస్తాన్ కూడా నడవబోతున్నట్లు తెలుస్తోంది.పొట్టి ప్రపంచకప్‌ను బహిష్కరించే అవకాశం ఉందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ హింట్ ఇచ్చాడు. తమ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో మాట్లాడిన తర్వాత టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనడంపై పీసీబీ నిర్ణయం తీసుకుంటుందని నఖ్వీ తెలిపాడు. బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగిందని, ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని నఖ్వీ ఆరోపించాడు.కాగా భద్రత కారణాలను సాకుగా చూపుతూ ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరకారించింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని బంగ్లా క్రికెట్ బోర్డు కోరింది. అయితే ఆ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. భారత్‌లో బంగ్లా ఆటగాళ్లకు, ఇతర సిబ్బందికి అన్ని రకాలుగా భద్రతాపరమైన ఏర్పాటు చేస్తామని ఐసీసీ హామీ ఇచ్చింది.అయినా బీసీబీ మొండి పట్టు వీడలేదు. దీంతో చేసేదేమి లేక వరల్డ్‌కప్ నుంచి బంగ్లాను ఐసీసీ తప్పించింది. అయితే ఈ వివాదం ఆరంభం నుంచి బంగ్లాకు పీసీబీ మద్దతుగా నిలుస్తోంది. బంగ్లాను తప్పించాలనే ప్రతిపాదనపై ఐసీసీ బోర్డు సమావేశంలో 14 దేశాల ప్రతినిధులు అనుకూలంగా ఓటు వేయగా...కేవలం పాకిస్తాన్ మాత్రం ఆ జట్టుకు సపోర్ట్‌గా నిలిచింది. అంతకుముందు బంగ్లా మ్యాచ్‌లను ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్దమేనని పీసీబీ ప్రకటించింది. కానీ ఐసీసీ మాత్రం పీసీబీ ఆఫర్‌ను పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు మరోసారి బంగ్లా దేశ్ పట్ల పీసీబీ కపట ప్రేమ ఒలకపోస్తోంది."బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ అనుసరించిన తీరు సరికాదు. ఇదే విషయాన్ని నేను ఐసీసీ బోర్డు సమావేశంలో కూడా చెప్పాను. ద్వంద్వ ప్రమాణాలు పాటించకూడదు. అందరికి ఒకే న్యాయం ఉండాలి. బంగ్లాదేశ్ లాంటి ప్రధాన వాటాదారుకు అన్యాయం జరిగితే మేము సైలెంట్‌గా ఉండలేము.పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే మేం వరల్డ్ కప్‌లో ఆడటం ఆధారపడి ఉంటుంది. మా పీఎం దేశంలో లేరు. ఆయన తిరిగొచ్చాకే దీనిపై తుది నిర్ణయం ప్రకటిస్తాం. ఐసీసీ ఆదేశాలను కాకుండా మేం ప్రభుత్వ నిర్ణయాన్ని పాటిస్తాం" అని నఖ్వీ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. -
బంగ్లాదేశ్ ఖేల్ ఖతం!
దుబాయ్: టి20 వరల్డ్ కప్‌లో భాగంగా తమ మ్యాచ్‌లను భారత్‌లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్య తీసుకుంది. బంగ్లా టీమ్‌ను వరల్డ్ కప్‌నుంచి తప్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. జట్టు ఆటగాళ్లు, ఇతర సిబ్బంది భద్రతకు హామీ ఇస్తూ ఎన్నో విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తమ మంకు పట్టు వీడలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీమ్‌పై ఐసీసీ వేటు వేసింది. ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం తర్వాతి స్థానంలో ఉన్న స్కాట్లాండ్ ఈ టోర్నమెంట్లో బంగ్లా స్థానంలో బరిలోకి దిగుతుంది. బంగ్లాను తప్పించాలనే ప్రతిపాదనపై ఐసీసీ బోర్డు సమావేశంలో 14 దేశాల ప్రతినిధులు అనుకూలంగా ఓటు వేయగా...కేవలం పాకిస్తాన్ మాత్రం ఆ జట్టుకు మద్దతు పలికింది. దాంతో వేటు లాంఛనంగానే మారింది. టీమ్‌ను వరల్డ్ కప్‌ను తొలగిస్తూ తాము తీసుకున్న నిర్ణయాన్ని ఐసీసీ శుక్రవారం బీసీబీకి తెలియజేసింది. ఐసీసీలోని ఇతర సభ్య దేశాలకు కూడా ఈ సమాచారం అందించింది. టోర్నీకి దూరం కావడం బంగ్లా బోర్డుపై ఆరి్థ కపరంగా కూడా తీవ్ర ప్రభావం చూపించనుంది. వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు ఇచ్చే 5 లక్షల డాలర్లతో పాటు ఐసీసీనుంచి ప్రతీ ఏటా అందే 27 మిలియన్ డాలర్లు కోల్పోనుంది. బంగ్లా నిష్క్రమణ నేపథ్యమిదీ... తాజా పరిణామాలను బట్టి చూస్తే వరల్డ్ కప్‌కు దూరం కావడం బంగ్లా స్వయంకృతమే. ఐపీఎల్ వేలంలో బంగ్లా పేసర్ ముస్తఫిజుర్ రహమాన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ. 9.50 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి ఆటగాడిని ఐపీఎల్లో ఆడించాలనే ఆలోచనపై భారత్‌లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. వీటికి స్పందిస్తూ కేకేఆర్ యాజమాన్యం ముస్తఫిజుర్‌ను లీగ్ నుంచి తప్పించింది. తమ ఆటగాడిని అర్ధాంతరంగా తొలగించడం బీసీబీకి నచ్చలేదు. దీనిని ఆ దేశ బోర్డు ఒక రకమైన అవమానంగా భావించింది. దాంతో భారత్‌లో తమ ఆటగాళ్లకు భద్రత లేదంటూ కొత్త విషయాన్ని ముందుకు తెచ్చింది. టి20 వరల్డ్ కప్‌లో తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చింది. ఈ అంశంపై స్పందించిన ఐసీసీ బంగ్లాకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. టోర్నీకి చాలా తక్కువ సమయం ఉండటంతో ఇప్పుడు షెడ్యూల్ మార్పు సాధ్యం కాదని స్పష్టం చేసింది. భారత్‌లో ఆ దేశపు ఆటగాళ్లు, మీడియా, ఇతర సిబ్బందికి ఎలాంటి సమస్య రాకుండా అన్ని రకాలుగా భద్రతాపరమైన ఏర్పాట్లు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే బీసీబీ మాత్రం వెనక్కి తగ్గలేదు. -
ICC: బై.. బై.. బంగ్లాదేశ్.. స్కాట్లాండ్ వచ్చేసింది
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్‌కు ఉద్వాసన తప్పలేదు. భారత్‌లో తమ మ్యాచ్‌లు ఆడలేమంటూ పంతం పట్టిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) గట్టిషాకిచ్చింది. ఈ మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించి ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను చేర్చింది. ప్రస్తుత టీ20 టీమ్ ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్కు ఐసీసీ ఈ అవకాశం ఇచ్చింది.కాగా గత కొంతకాలంగా భారత్- బంగ్లాదేశ్ (IND vs BAN) మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అక్కడి నుంచి మొదలుఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రహమాన్‌ను (Mustafizur Rahman) ఐపీఎల్ నుంచి తొలగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనను కూడా నిరవధికంగా వాయిదా వేసింది.ఈ పరిణామాల క్రమంలో టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌లో తమ మ్యాచ్‌లు ఆడలేమని బీసీబీ.. ఐసీసీకి తెలియజేసింది. భద్రతాపరమైన ముప్పులు ఉన్నందున తమ వేదికను శ్రీలంకకు మార్చాలని విజ్ఞప్తి చేసింది. అయితే, పరిశీలనా బృందం నుంచి వివరాలు తీసుకున్న ఐసీసీ. భారత్‌లో బంగ్లా జట్టుకు వచ్చిన ముప్పేమీలేదని తేల్చింది.మొండి వైఖరి అయితే, బీసీబీ మాత్రం మొండి వైఖరి అవలంబించింది. తాము భారత్‌లో మ్యాచ్‌లు ఆడే ప్రసక్తే లేదని పంతం పట్టింది. ఐసీసీ గడువు ఇచ్చినప్పటికీ తమ నిర్ణయం ఇదేనంటూ సవాలు విసిరినట్లుగా మాట్లాడింది. అంతేకాదు ఆఖరి ప్రయత్నంగా వివాద పరిష్కారాల కమిటీ (DRC)ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆశ్రయించింది.ముందుగా హెచ్చరించినట్లుగానేతాము భారత్‌లో ఆడాల్సిందేనంటూ ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేయాలంటూ డీఆర్సీని బీసీబీ కోరింది. అయితే ఐసీసీ ఆధ్వర్యంలోనే పని చేసే డీఆర్సీ వారి విజ్ఞప్తికి స్పందించే అవకాశం లేకపోయింది.ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఐసీసీ.. ముందుగా హెచ్చరించినట్లుగానే బంగ్లాదేశ్ స్థానాన్ని స్కాట్లాండ్తో భర్తీ చేసినట్లు క్రిక్‌బజ్ తన కథనంలో వెల్లడించింది. ఈ విషయం గురించి బీసీబీకి ఐసీసీ లేఖ కూడా రాసినట్లు పేర్కొంది. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 వరల్డ్‌కప్ టోర్నీ జరుగనుంది. ఇందుకు భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇక ఈసారి ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొంటుండగా. గ్రూప్-సిలో ఇంగ్లండ్, వెస్టిండీస్, నేపాల్, ఇటలీలతో కలిసి ఉంది బంగ్లాదేశ్. ఇప్పుడు ఆ స్థానంలో స్కాట్లాండ్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. చదవండి: భారత్‌కు మాత్రమే అవకాశం ఇస్తారా?: బంగ్లాదేశ్ ఆరోపణలు -
ఐసీసీపై ‘ఫిర్యాదు’.. బంగ్లాదేశ్‌కు మరో షాక్ తప్పదు!
టీ20 ప్రపంచకప్-2026లో తమ మ్యాచ్‌ల వేదిక మార్పు విషయంలో బంగ్లాదేశ్ ఆఖరి ప్రయత్నం కూడా బెడిసికొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఇప్పటికే ఈ విషయంలో తమ వైఖరి ఏమిటో తెలిపింది. భారత్‌లో బంగ్లా ఆటగాళ్లు, సిబ్బందికి ఎలాంటి ముప్పు లేదని.. ఇక్కడే తమ మ్యాచ్‌లు ఆడాలని స్పష్టం చేసింది.అయినప్పటికీ పంతం వీడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తమ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. తమ విజ్ఞప్తిని అంతర్జాతీయ క్రికెట్ మండలి పట్టించుకోకపోవడంతో వివాద పరిష్కారాల కమిటీ (DRC)ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆశ్రయించింది. తాము భారత్‌లో ఆడాల్సిందేనంటూ ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేయాలంటూ డీఆర్సీని బీసీబీ కోరింది.అది కుదరని పనిఅయితే ఐసీసీ ఆధ్వర్యంలోనే పని చేసే డీఆర్సీ వారి విజ్ఞప్తికి స్పందించే అవకాశం లేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం బోర్డు డైరెక్టర్లు కలిసి తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించే అధికారం డీఆర్సీకి లేదు. ఇక్కడా తమకు సానుకూల స్పందన లభించకపోతే చివరగా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్ (సీఏఎస్)కు వెళ్లాలని కూడా బంగ్లాదేశ్ యోచిస్తోంది.మరోవైపు.. తమ జట్టు భారత్‌లో మ్యాచ్ ఆడదంటూ తీసుకున్న నిర్ణయాన్ని ముందుగా ఐసీసీకీ చెప్పకుండా బీసీబీ చైర్మన్ అమీనుల్ ఇస్లామ్ మీడియా ముందు ప్రకటించడం కూడా ఐసీసీకి ఆగ్రహం కలిగించింది. ప్రస్తుతానికి పరిస్థితి చూస్తే బంగ్లాదేశ్‌ను తప్పించడం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. అండర్–19 వరల్డ్ కప్ జరుగుతున్న నమీబియాలో ఉన్న ఐసీసీ చైర్మన్ జై షా బంగ్లాదేశ్‌ను వరల్డ్ కప్ నుంచి తప్పిస్తూ స్కాట్లాండ్కు అవకాశం ఇస్తున్నట్లుగా శనివారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్ -
మీ కెప్టెన్ హిందువు: బంగ్లాదేశ్‌కు భారత మాజీ క్రికెటర్ సలహా
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడం దాదాపుగా ఖాయమైనట్లే కనిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మాటను లెక్కచేయకుండా పంతానికి పోయినందుకు బంగ్లా టోర్నీలో ఆడే అవకాశం కోల్పోవడం లాంఛనమే అనిపిస్తోంది. కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య గత కొంతకాలంగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలుగతంలో తమకు చేదోడువాదోడుగా నిలిచిన భారత్‌పై కొంతమంది బంగ్లాదేశ్ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై వరుస దాడులు ఇందుకు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ఫాస్ట్‌బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్‌ను బీసీసీఐ తప్పించింది.ఐసీసీ మాట వినని బీసీబీఈ విషయాన్ని సాకుగా చూపుతూ టీ20 ప్రపంచకప్-2026లో భారత్‌లో తమ మ్యాచ్‌లు ఆడబోడమంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) రచ్చకెక్కింది. తమ ఆటగాళ్లకు అక్కడ భద్రత ఉండదంటూ కొత్తగా రాగం ఎత్తుకుంది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని కోరగా.. ఐసీసీ ఇందుకు నిరాకరించింది.ఈ క్రమంలో ఐసీసీ తమ పట్ల న్యాయంగా వ్యవహరించాలని.. ఏదేమైనా తాము భారత్‌లో ఆడబోమని బంగ్లాదేశ్ గురువారమే తన నిర్ణయాన్ని స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ బీసీబీకి ఓ సలహా ఇచ్చాడు.మీ కెప్టెన్ ఓ హిందువువార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ.. ‘‘నిజంగా ఐసీసీకి ఇదొక పీడకలలాంటిది. చాన్నాళ్ల క్రితమే టీ20 ప్రపంచకప్ టోర్నీ నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయి. టోర్నీ ఆరంభానికి సమయం కూడా ఆసన్నమైంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఇలా చేయడం సరికాదు.భారత్‌లో భద్రతా పరమైన ఇబ్బందులు ఉంటాయని నేను అనుకోను. అసలు ఇక్కడ గతంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇక్కడ సెక్యూరిటీకి వచ్చిన ఇబ్బంది ఏమీలేదు. మీ కెప్టెన్ (Litton Das) ఓ హిందువు.ఈ విషయాన్ని బంగ్లాదేశ్ తమకు సానుకూలంగా మలచుకోవచ్చే. టోర్నీలో పాల్గొనడం ద్వారా ప్రస్తుతం ఇరుదేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు’’ అని అతుల్ వాసన్ బంగ్లాదేశ్‌కు హితవు పలికాడు. కాగా భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు వరల్డ్‌కప్ టోర్నీ జరుగనుంది.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి బంగ్లాదేశ్ జట్టులిట్టన్ దాస్ (కెప్టెన్), మహ్మద్ సైఫ్ హసన్, తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హొస్సేన్ ఇమోన్, తౌహిద్ హృదోయ్, షమీమ్ హొస్సేన్, నూరుల్ హసన్ సోహన్, మెహదీ హసన్, రిషద్ హొస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్, తాంజిమ్ హసన్ సకీబ్, టస్కిన్ అహ్మద్, మహ్మద్ షైపుద్దీన్, షోరిఫుల్ ఇస్లాం. చదవండి: భారత్‌కు మాత్రమే అవకాశం ఇస్తారా?: బంగ్లాదేశ్ ఆరోపణలు -
భారత్‌కు మాత్రమే అవకాశం ఇస్తారా?
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తీరు మారలేదు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తాము భారత్‌లో టీ20 ప్రపంచకప్-2026 మ్యాచ్‌లు ఆడబోమని గురువారం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లామ్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)ని విమర్శించాడు. ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందనేలా ఆరోపణలు చేశాడు.భద్రతాపరమైన కారణాలతో వేదికలు మార్చడం గతంలో చాలాసార్లు జరిగిందని, ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లన్నింటినీ దుబాయ్‌లోనే ఆడేలా భారత్‌కు అనుమతి ఇచ్చారని బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లామ్ గుర్తు చేశాడు. పాక్‌లో ఆడబోమని భారత్ చెబితే..‘ఐసీసీ ఎప్పుడో 1996, 2003లో జట్లు కొన్ని వేదికల్లో ఆడటానికి ఇష్టపడక పాయింట్లు చేజార్చుకున్న విషయాన్ని గుర్తు చేస్తోంది. ఎప్పటి మాటలో ఎందుకు?2025 చాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్లో ఆడబోమని భారత్ చెబితే వారి మ్యాచ్‌లను తరలించలేదా? అన్ని మ్యాచ్‌లు ఒకే వేదికపై ఆడి, ఒకే హోటల్లో జట్టు బస చేయడం వారికి కల్పించిన ప్రత్యేక సౌకర్యం కాదా? మేం పోరాడతాంశ్రీలంక పేరుకే సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తోంది కానీ ఒక జట్టు కోసమే (పాకిస్తాన్) హైబ్రిడ్ మోడల్లో మ్యాచ్‌లు అక్కడ పెట్టారు. ఐసీసీ స్థాయి సంస్థ 24 గంటల గడువు ఇవ్వడం అనేది అర్థరహితం. ఈ విషయంలో మేం పోరాడతాం’ అని అమీనుల్ స్పష్టం చేశాడు. కాగా గతంలో పాకిస్తాన్లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విదేశీ జట్లు అక్కడ పర్యటించడం మానేశాయి. పాక్‌లో పరిస్థితి వేరు.. వితండవాదంఇటీవలి కాలంలో మళ్లీ పర్యటనలు మొదలుపెట్టాయి. అయితే, బీసీసీఐ మాత్రం భద్రతా కారణాలతో టీమిండియాను అక్కడకు పంపడం లేదు. అందుకే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి తటస్థ వేదికను ఏర్పాటు చేసింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తున్నందున శ్రీలంకలో పాక్ మ్యాచ్‌లు ఆడిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ముదిరిన నేపథ్యంలో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, భారత్‌లో బంగ్లాదేశ్ క్రికెటర్లకు ఏమాత్రం ముప్పులేదని పరిశీలన బృందం చెప్పినా బంగ్లాదేశ్ ఇలా వితండవాదానికి దిగడం గమనార్హం. లాంఛనమేకాగా టీ20 వరల్డ్ కప్‌నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడం ఇక లాంఛనంగానే కనిపిస్తోంది! ఒకరోజు సమయమిచ్చి తుది నిర్ణయం తీసుకోవాలంటూ ఐసీసీ చేసిన హెచ్చరికను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పట్టించుకోలేదు. భద్రతా కారణాల వల్ల తాము భారత్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడబోమని బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ పునరుద్ఘాటించారు.‘ఇది మా దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని స్పష్టంగా చెప్పదల్చుకున్నాం. భద్రత విషయంలో మా భయం వాస్తవం. ఐసీసీ నుంచి మాకు ఇప్పటి వరకైతే న్యాయం దక్కలేదు. మా ఆందోళనను వారు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా’ అని నజ్రుల్ వ్యాఖ్యానించాడు.చదవండి: వరల్డ్‌కప్-2027లో అతడిని ఆడించాలి: భారత మాజీ క్రికెటర్ -
ICC: మా తుది నిర్ణయం ఇదే: బంగ్లాదేశ్ సంచలన ప్రకటన
బంగ్లాదేశ్ పంతం వీడలేదు. భారత్‌లో టీ20 ప్రపంచకప్-2026 ఆడే విషయమై తమ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని మరోసారి పునరుద్ఘాటించింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తమ విషయంలో న్యాయంగా వ్యవహరిస్తుందనే నమ్మకం ఉందని తెలిపింది.శ్రీలంకకు మార్చాలని కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా కారణాలు సాకుగా చూపుతూ.. బంగ్లాదేశ్ తమ ప్లేయర్లను భారత్‌కు పంపడానికి నిరాకరిస్తోంది. భారత్‌కు బదులు తమ మ్యాచ్‌ల వేదికలను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. అయితే, బంగ్లాదేశ్ చెప్పినట్లు భారత్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు, ఇతర సిబ్బందికి వచ్చిన ముప్పేమీ లేదని ఐసీసీ బుధవారం స్పష్టం చేసింది.కుండబద్దలు బద్దలు కొట్టిన ఐసీసీమరో 24 గంటల సమయం ఇస్తున్నామని.. ఒకవేళ వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలగానుకుంటే.. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను ఆడిస్తామని ఐసీసీ కుండబద్దలు కొట్టింది. ఈ నేపథ్యంలో గురువారం బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం స్పందిస్తూ.. తమ ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం వెలువడుతుందని పేర్కొన్నాడు.తాజా సమాచారం ప్రకారం.. భారత్‌లో టీ20 ప్రపంచకప్-2026 మ్యాచ్‌లు ఆడవద్దని బంగ్లాదేశ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బంగ్లా జాతీయ జట్టు ఆటగాళ్లు, దేశ క్రీడా, యువజన శాఖ మంత్రి ఆసిఫ్ నజ్రుల్‌తో సమావేశం అనంతరం బోర్డు తమ వైఖరిని వెల్లడించింది.నమ్మకాన్ని కోల్పోవడం లేదుఈ మేరకు మీడియా సమావేశంలో నజ్రుల్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించేందుకు మా క్రికెటర్లు ఎంతగానో కష్టపడ్డారు. అయితే, ఇండియాలో మా భద్రతపై అనుమానాలు అలాగే ఉన్నాయి. ఏవో కొన్ని పరిశీలన (ఐసీసీ)లు చేసి ముప్పు లేదనే నిర్ణయానికి రాకూడదు.ఇప్పటికీ మేము నమ్మకాన్ని కోల్పోవడం లేదు. టోర్నీకి మా జట్టు సిద్ధంగా ఉంది. ఐసీసీ మా అభ్యర్థనను మన్నించి.. న్యాయమైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం. మమ్మల్ని శ్రీలంకలో ఆడేందుకు అనుమతిస్తారని ఆశాభావంతో ఉన్నాము’’ అని పేర్కొన్నాడు.కచ్చితంగా ఐసీసీ వైఫల్యమేఇక బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం మాట్లాడుతూ.. ‘‘మేము ఐసీసీతో మరోసారి చర్చలు జరుపుతాము. వరల్డ్‌కప్‌లో ఆడాలని మాకు ఉంది. కానీ భారత్‌లో మాత్రం ఆడబోము. ఈ విషయంపై పోరాటం చేస్తాం. ఐసీసీ బోర్డు మీటింగ్‌లో కొన్ని షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నారు.ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ తొలగింపు విషయం చిన్నదేమీ కాదు. మా మ్యాచ్‌ల విషయంలో బీసీసీఐదే తుది నిర్ణయం అన్నట్లుగా వ్యవహారం ఉంది. భారత్‌లో ఆడలేమని అంటే మా అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. క్రికెట్‌కు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. ఒలింపిక్స్ వరకు ఈ క్రీడ వెళ్లింది. కానీ మేము మాత్రం ఇక్కడే ఉండిపోయాము. ఇది కచ్చితంగా ఐసీసీ వైఫల్యమే’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే! -
షాకిచ్చిన ఐసీసీ.. స్పందించిన బంగ్లాదేశ్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ణయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం స్పందించాడు. ఏదో ఒక అద్భుతం జరిగి ఐసీసీ తమ పట్ల సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అదే సమయంలో మరోసారి భారత్ గురించి అవాకులు చెవాకులు పేలాడు.కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య రాజకీయపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్-2026లో తమ మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌కు రాబోమని బంగ్లా బోర్డు (BCB) ఐసీసీకి తెలిపింది. తమ వేదికలను భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలని విజ్ఞప్తి చేసింది.ఆడితే ఆడండి.. లేకపోతే పొండిఈ విషయంపై చర్చించిన ఐసీసీ బుధవారం తమ తుది నిర్ణయాన్ని వెల్లడించింది. భారత్ నుంచి మ్యాచ్‌లను తరలించడం సాధ్యం కాదని... వరల్డ్ కప్‌లో ఆడాలా లేదా అనేది బంగ్లాదేశ్ తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఇందుకోసం గురువారం నాటికి తుది గడువు విధించింది.ఒకవేళ బంగ్లాదేశ్ తమ పంతం వీడకపోతే ఆ జట్టును వరల్డ్ కప్ నుంచి తప్పిస్తామని ఐసీసీ హెచ్చరించింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తర్వాతి స్థానంలో ఉన్న స్కాట్లాండ్ జట్టును బంగ్లాదేశ్ స్థానంలో ఆడించాలని కూడా ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో దీనికి మద్దతుగా అత్యధిక డైరెక్టర్లు ఓటు వేశారు.ఐసీసీ చైర్మన్ జై షాతో పాటు బీసీసీఐ తరఫున దేవజిత్ సైకియా ఇందులో పాల్గొన్నారు. 15 మంది డైరెక్టర్లు సమావేశానికి హాజరు కాగా, ఒక్క పాకిస్తాన్ మాత్రమే బంగ్లాదేశ్‌కు అండగా నిలిచింది. ఇప్పటికే బంగ్లా డిమాండ్‌కు మద్దతు ప్రకటించిన పాకిస్తాన్ తమ దేశంలో ఆ జట్టు మ్యాచ్‌లను నిర్వహిస్తామని కూడా ప్రతిపాదించింది.ఎలాంటి ప్రమాదం లేదు..అయితే ఇవన్నీ సాధ్యం కాదని ఐసీసీ కొట్టిపారేసింది. ‘భద్రతాపరమైన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాం. భారత్‌లోని ఏ వేదికపైన కూడా బంగ్లాదేశ్ ఆటగాళ్లు, మీడియా ప్రతినిధులు, ఇతర అధికారులకు ఎలాంటి ప్రమాదం లేదు.టోర్నీ చేరువైన సమయంలో షెడ్యూల్ మార్పు ఏమాత్రం సాధ్యం కాదు. భద్రతా పరమైన కారణం అంటూ ఈసారి అలా చేస్తే ఇది చెడు సాంప్రదాయానికి దారి తీస్తూ ఐసీసీ ఈవెంట్లకు చెడ్డపేరు వస్తుంది. బంగ్లా బోర్డుకు ఇప్పటికే ఇవన్నీ పూర్తిగా వివరించాం.అయితే ఎంత చెప్పినా వరల్డ్ కప్‌తో ఏమాత్రం సంబంధం లేని ఒక దేశవాళీ లీగ్‌లో జరిగిన ఘటనను చూపిస్తూ బంగ్లా తమ డిమాండ్‌ను కొనసాగించింది. ఎన్నో అంశాలను బట్టి వరల్డ్ కప్ మ్యాచ్‌ల షెడ్యూల్, వేదికలు ప్రకటిస్తాం. ఇప్పుడు ఎలాంటి మార్పులూ చేయలేం’ అని ఐసీసీ తమ ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది. ఇండియా మాకు భద్రం కాదుఈ నేపథ్యంలో బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం స్పందిస్తూ.. ‘‘మా ప్రభుత్వంతో చర్చించేందుకు నాకు కొంత గడువు కావాలని ఐసీసీ బోర్డును అడిగాను. చివరి అవకాశం ఇమ్మని కోరాను. ఇది సరైనదేనని వారు భావించారు. 24 నుంచి 48 గంటలలోపు మా నిర్ణయం చెప్పాలన్నారు.అయితే, ఈ విషయంలో నేను మా ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టదలచుకోలేదు. ఏదేమైనా ఇండియా మాకు భద్రమైన దేశం కాదు. శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడేందుకే మేము కట్టుబడి ఉన్నాము. ఐసీసీ మా అభ్యర్థనను తిరస్కరించిందని తెలుసు.అద్భుతం జరుగుతుందిప్రభుత్వంతో చర్చించిన తర్వాతే మా తుది నిర్ణయం వెల్లడిస్తాం. ఐసీసీ మా విషయంలో అద్భుతం చేస్తుందని ఆశిస్తున్నాం. ప్రపంచకప్ టోర్నీలో ఆడాలని ఎవరు మాత్రం కోరుకోరు!.. బంగ్లాదేశ్ ఆటగాళ్లంతా ఐసీసీ ఈవెంట్లో ఆడాలని కోరుకుంటున్నారు.బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా బంగ్లా క్రికెట్ జట్టు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో పాల్గొనాలని ఆశిస్తోంది. అయితే, ముందుగా చెప్పినట్లు భారత్ మా ఆటగాళ్లకు సురక్షిత ప్రదేశం కాదు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వానిదే తుది నిర్ణయం’’ అంటూ ఓవైపు వరల్డ్‌కప్ టోర్నీలో ఆడాలనే కోరిక ఉందంటూనే.. మరోవైపు భారత్ గురించి అతిగా మాట్లాడాడు. కాగా అంతకుముందు తమ అభ్యర్థనను తిరస్కరిస్తే వరల్డ్‌కప్ బహిష్కరిస్తామంటూ బంగ్లా హెచ్చులకు పోయింది. ఇప్పుడు మాత్రం తమకు ఆడాలని ఉందంటూ తమదంతా మేకపోతు గాంభీర్యమేనని నిరూపించుకుంది. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు భారత్- శ్రీలంక వేదికలుగా ప్రపంచకప్-2026 టోర్నీ జరుగనుంది. చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్ -
బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. బీసీబీ అభ్యర్థనను తిరస్కరించిన ఐసీసీ
భారత్‌తో నెలకొన్న రాజకీయ ఉద్రికత్తల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ 2026లో తాము ఆడాల్సిన గ్రూప్ మ్యాచ్‌ల వేదికలను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లు జరుగుతాయని స్పష్టం చేసింది. ఈ విషయంలో పునఃపరిశీలనలు ఉండవని తేల్చి చెప్పింది.ఇవాళ (జనవరి 21) జరిగిన అత్యవసర బోర్డు సమావేశంలో ఓటింగ్ ద్వారా ఈమేరకు నిర్ణయించింది. మొత్తం 16 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనగా.. కేవలం ఇద్దరు మాత్రమే బంగ్లాదేశ్ అభ్యర్థనకు మద్దతు ఇచ్చారు. మిగతా సభ్యులు వ్యతిరేకించారు.భరోసా ఇచ్చినా..!భద్రతను సాకుగా చూపుతూ భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు నిరాకరిస్తున్న బంగ్లాదేశ్ జట్టుకు ఐసీసీ పూర్తి భరోసా ఇచ్చింది. అయినా ఆ దేశ క్రికెట్ బోర్డు ఓవరాక్షన్ చేస్తుంది. తాజాగా జరిగిన సమావేశంలో స్వతంత్ర సంస్థలు చేసిన భద్రతా అంచనాలు, వేదికల వారీగా రూపొందించిన భద్రతా ప్రణాళికలు, ఆతిథ్య దేశం ఇచ్చిన హామీలన్నిటినీ ఐసీసీ క్షుణ్ణంగా పరిశీలించి, బంగ్లాదేశ్ జట్టుకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది.ముస్తాఫిజుర్ ఉదంతంతో సంబంధమే లేదు భారత్‌లో ఆడకుండా ఉండటానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చూపుతున్న సాకులకు, ముస్తాఫిజుర్ రహ్మాన్ ఉదంతంతో సంబంధమే లేదని ఐసీసీ పేర్కొంది. ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించడాన్ని భద్రతా సమస్యతో అనుసంధానం చేయడం సరి కాదని హితవు పలికింది. స్కాట్లాండ్కు అవకాశం ఒకవేళ బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు రాకపోతే, వారి స్థానాన్ని స్కాట్లాండ్ భర్తీ చేస్తుంది. ప్రస్తుతం స్కాట్లాండ్ టీ20 ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉంది. ప్రపంచకప్‌కు అర్హత సాధించని జట్లలో అత్యధిక ర్యాంక్ కలిగిన జట్టుగా స్కాట్లాండ్ ప్రపంచకప్‌కు ఎంపికవుతుంది.మరో 24 గంటల డెడ్లైన్ఇది జరగకుండా ఉండాలంటే బంగ్లాదేశ్ మరో 24 గంటల్లో ఏ విషయం తేల్చాలని ఐసీసీ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈలోపు కూడా బంగ్లాదేశ్ ఏ విషయం తేల్చకపోతే డీఫాల్ట్‌గా స్కాట్లాండ్ ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది.షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్.. వెస్టిండీస్, ఇంగ్లండ్, నేపాల్, ఇటలీ జట్లతో కలిసి గ్రూప్-సిలో ఉంది. బంగ్లాదేశ్ తొలి మూడు మ్యాచ్‌లు కోల్‌కతాలో ఆడి, చివరి గ్రూప్ మ్యాచ్‌ను ముంబైలో ఆడేలా షెడ్యూల్ ఉంది. -
భారత్‌లో మ్యాచ్‌లు.. బంగ్లాదేశ్ కెప్టెన్ స్పందన వైరల్
బంగ్లాదేశ్ మొండిపట్టు వీడటం లేదు. భారత్‌లో టీ20 ప్రపంచకప్-2026 మ్యాచ్‌లో ఆడే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేసింది. తమ ఆటగాళ్ల భద్రతకు కట్టుబడి ఉన్నామని.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఒత్తిళ్లకు తలొగ్గమంటూ మరోసారి ఓవరాక్షన్ చేసింది.బంగ్లా బదులు ఆ జట్టుఫలితంగా వరల్డ్‌కప్ టోర్నీలో బంగ్లాదేశ్ ఆడే అవకాశాలు సన్నగిల్లాయి. ఇప్పటికే షెడ్యూల్, వేదికలు ఖరారు కావడం.. అందుకు అనుగుణంగా ఆయా జట్ల విమానాల టికెట్లు బుక్ చేసుకోవడం కూడా జరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ మ్యాచ్‌లను ఐసీసీ శ్రీలంకకు మార్చే అవకాశం లేనట్లే కనిపిస్తోంది.ఒకవేళ బంగ్లాదేశ్ ఇలాగే పట్టుదలకు పోతే.. ఆ జట్టుకు బదులు ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్ ప్రపంచకప్ టోర్నీలో అడుగుపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ టీ20 జట్టు కెప్టెన్ లిటన్ దాస్ (Litton Das) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వివాదంలో తలదూరిస్తే తాను చిక్కుల్లో పడతానని ఆందోళన వ్యక్తం చేశాడు.దయచేసి అడగవద్దుబంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌తో బిజీగా ఉన్న లిటన్ దాస్ మీడియాతో మాట్లాడగా.. ‘‘మీరు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఆడతారా? లేదా?’’ అన్న ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘నా వరకైతే ఈ విషయంపై స్పష్టత లేదు. జట్టులోని ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే.ప్రస్తుతం బంగ్లాదేశ్ వ్యాప్తంగా అనిశ్చితి నెలకొంది. ఈ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. తదుపరి మీరు ఏ ప్రశ్న అడుగబోతున్నారో నాకు తెలుసు. అది నాకు అంత సురక్షితమైనది కాదు. కాబట్టి సమాధానం చెప్పలేను’’ అని లిటన్ దాస్ పేర్కొన్నాడు. కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.బీసీబీ వైఖరితో కష్టాల్లోకి ఆటగాళ్లుఈ నేపథ్యంలోనే భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు భద్రత అనే సాకు చూపి బంగ్లాదేశ్ నిరాకరిస్తోంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) వైఖరి కారణంగా ఆటగాళ్లకు ఇప్పటికే కష్టాలు మొదలైనట్లు తెలుస్తోంది. బంగ్లా ప్లేయర్లలో చాలా మందికి బ్యాట్ స్పాన్సర్లుగా భారత కంపెనీలు ఉన్నాయి. బీసీబీ వైఖరితో ఆ కంపెనీలు తమ కాంట్రాక్టులు రద్దు చేసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.మరోవైపు.. బంగ్లాదేశ్ టీ20 ప్రపంచకప్- 2026 టోర్నీలో ఆడకపోతే దేశానికి వచ్చే నష్టమేమీలేదని.. ఆటగాళ్లే నష్టపోతారంటూ బీసీబీ అధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు.. ఐసీసీ నుంచే ప్రధాన ఆదాయం వస్తున్నందున ఈ విషయంలో బీసీబీ ఆచితూచి వ్యవహరించాలని కోరినందుకు మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌పై బీసీబీ అధికారి నజ్ముల్ ఇస్లాం ‘భారత ఏజెంట్’ అనే ముద్ర వేశాడు.ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బంగ్లాదేశ్ క్రికెటర్ల వెల్ఫేర్ అసోసియేషన్ నజ్ముల్‌ను సస్పెండ్ చేసేదాకా వదిలిపెట్టలేదు. ఇలా బోర్డు తీరుతో ఆటగాళ్లు వ్యక్తిగతంగా మాటలు పడుతూ.. ఆర్థికంగానూ నష్టపోయే ప్రమాదంలో పడ్డారు. అందుకే లిటన్ దాస్ సైతం ప్రపంచకప్ టోర్నీ ఆడే విషయమై స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటవేశాడు.చదవండి: న్యూజిలాండ్‌తో తొలి టీ20.. మూడో స్థానంలో వచ్చేది అతడే..! -
T20 WC 2026: మా నిర్ణయం ఇదే: బంగ్లాదేశ్
భారత్‌లో టీ20 ప్రపంచకప్-2026 మ్యాచ్‌లను ఆడబోమని బంగ్లాదేశ్ మరోసారి తెలిపింది. టోర్నీలో ఆడే విషయమై బుధవారం లోగా నిర్ణయాన్ని ప్రకటించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) గడువు ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని బంగ్లాదేశ్ ప్రభుత్వ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ (Asif Nazrul) మంగళవారం వెల్లడించారు. ఒక వేళ భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరిస్తే... ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్ను వరల్డ్‌కప్‌నకు ఎంపిక చేసే అవకాశాలున్నాయి. మా బదులు స్కాట్లాండ్ ఆడుతుందా?‘మా స్థానాన్ని స్కాట్లాండ్ భర్తీ చేస్తుందని తెలియదు. భారత క్రికెట్ బోర్డు ఒత్తిడికి తలొగ్గి... ఐసీసీ మాపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తే మేము అంగీకరించము. గతంలో భారత్‌లో ఆడేందుకు పాకిస్తాన్ నిరాకరిస్తే... వారి మ్యాచ్‌ల వేదికలను మార్చారు. మేం కూడా అదే కోరుతున్నాం’ అని ఆసిఫ్ అన్నారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య ప్రస్తుతం రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో... భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు ఆ జట్టు నిరాకరిస్తోంది. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ జట్టు గ్రూప్ దశ మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబైలో ఆడాల్సి ఉంది. ఇటీవల ఐసీసీతో జరిగిన భేటీలో తమ మ్యాచ్‌లను మార్చాలని బీసీబీ కోరింది. స్పందించని ఐసీసీగ్రూప్ ‘బి’లో ఉన్న ఐర్లాండ్ జట్టు లీగ్ దశలోని మ్యాచ్‌లన్నీ శ్రీలంక వేదికగానే ఆడనుండగా... తమ జట్టును గ్రూప్ ‘బి’లో వేసి తమ స్థానంలో ఐర్లాండ్‌కు అవకాశం ఇవ్వాలని కోరింది. అయితే దీనిపై ఐసీసీ స్పందించలేదు. వెస్టిండీస్, ఇటలీ, ఇంగ్లండ్, నేపాల్‌తో కలిసి బంగ్లాదేశ్ గ్రూప్ ‘సి’లో ఉండగా... శ్రీలంక, ఆస్ట్రేలియా, ఓమన్, జింబాబ్వేతో కలిసి ఐర్లాండ్ గ్రూప్ ‘బి’లో ఉంది. చదవండి: న్యూజిలాండ్‌తో తొలి టీ20.. మూడో స్థానంలో వచ్చేది అతడే..! -
అబ్బే అదేం లేదు!.. మాట మార్చిన పాక్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో ఆడే విషయమై బంగ్లాదేశ్ ఇంత వరకు తమ నిర్ణయాన్ని స్పష్టం చేయలేదు. ఈ అంశంలో బుధవారం (జనవరి 21) వరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తమ వైఖరి ఏమిటో చెప్పాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది.ముదిరిన వివాదంకాగా భారత్- బంగ్లాదేశ్ దౌత్య సంబంధాల్లో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. భారత్‌పై బంగ్లా నేతలు అవాకులు, చెవాకులు పేలడం.. ఆ దేశంలో మైనారిటీ హిందువులపై దాడులు జరగడం ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తొలగించింది.దీనిని అవమానంగా భావించిన బంగ్లాదేశ్ బోర్డు.. ప్రపంచకప్ టోర్నీ ఆడేందుకు భారత్‌కు రాలేమని.. తమ ఆటగాళ్ల భద్రతకు ముప్పు ఉందంటూ కొత్తరాగం ఎత్తుకుంది. తాము ఆడే మ్యాచ్‌లను మరో వేదికైన శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరింది. కుదరదుఅయితే, ఇప్పటికే భారత్- శ్రీలంకలో జరిగే మ్యాచ్‌లకు ఆయా జట్లు టికెట్లు బుక్ చేసుకోవడం, టోర్నీ ఆరంభానికి తక్కువ సమయం ఉన్నందున బీసీబీ విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చినట్లు సమాచారం.డెడ్లైన్అయినా సరే బంగ్లాదేశ్ మాత్రం తమ మొండి వైఖరి వీడటం లేదు. ఈ నేపథ్యంలోనే కఠిన చర్యలకు ఉపక్రమించేందుకు సంకల్పించిన ఐసీసీ డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తలదూర్చేందుకు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. పాక్ మీడియా కథనాల ప్రకారం..బంగ్లాదేశ్ అభ్యర్థనను ఐసీసీ గనుక మన్నించకపోతే.. తాము సైతం టోర్నీ నుంచి వైదొలగాలని పాక్ బోర్డు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఐసీసీ వైఖరిని గట్టిగా వ్యతిరేకించేందుకు పాక్ సిద్ధమైనట్లు తెలిసింది. అయితే, పీసీబీ వర్గాలు తాజాగా ఈ విషయంపై స్పందించాయి.అబ్బే అదేం లేదు.. మాకేం అవసరంరెవ్స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘అబ్బే అదేం లేదు. బంగ్లాదేశ్ విషయంలో అసలు పీసీబీ ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు. అలా చేయడానికి పాకిస్తాన్‌కు అధికారం కూడా లేదు. ముందుగా నిర్ణయించిన ప్రకారం పాకిస్తాన్ ఇప్పటికే తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడేందుకు సిద్ధమైంది. మరి అలాంటపుడు మాకు వచ్చిన ఇబ్బంది ఏముంది?..తటస్థ వేదికలపైనే భారత్- పాక్ మ్యాచ్లుబంగ్లాదేశ్- బీసీసీఐ- ఐసీసీ మధ్య జరుగుతున్న విషయాలకు ఆజ్యం పోసేలా కొంతమంది కావాలని ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు’’ అని పీసీబీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గతేడాది చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు కూడా టీమిండియా అక్కడికి వెళ్లలేదు.తటస్థ వేదికైన దుబాయ్‌లో భారత జట్టు తమ మ్యాచ్‌లు ఆడి చాంపియన్‌గా నిలిచింది. ఐసీసీ చెప్పిన ప్రకారం చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు తటస్థ వేదికను ఏర్పాటు చేసినట్లుగానే.. ఈసారి టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండటంతో పాక్ మ్యాచ్‌లకు శ్రీలంకను వేదికగా ఖరారు చేశారు. అంతకుముందు మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 టోర్నీ భారత్‌లో జరుగగా.. పాక్ జట్టు తమ మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడింది. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 7- మార్చి8 వరకు భారత్-శ్రీలంక వేదికలుగా టీ20 వరల్డ్‌కప్-2026 టోర్నీ జరుగనుంది.చదవండి: బంగ్లాదేశ్ T20 WC 2026లో ఆడకపోతే స్కాట్లాండ్కు అవకాశం! -
బంగ్లాదేశ్ ఆడకపోతే స్కాట్లాండ్కు అవకాశం!
టి20 ప్రపంచ కప్‌లో తాము ఆడే మ్యాచ్‌లను భద్రతాకారణాలతో భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) చేస్తున్న డిమాండ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తుది నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో మ్యాచ్‌ల వేదిక మార్పు సాధ్యం కాదని ఐసీసీ పదేపదే చెబుతున్నా... బీసీబీ మాత్రం తమ మంకు పట్టును వీడటం లేదు. దీంతో ఈ విషయంపై కఠినంగా వ్యవహరించాలని ఐసీసీ భావిస్తోంది. ఈ నెల 21న దీనిపై ఐసీసీ స్పష్టమైన ప్రకటన ఇవ్వనుంది. తాము వరల్డ్ కప్ ఆడాలా లేదా అనేది బంగ్లాదేశ్ ఆలోపు నిర్ణయం తీసుకోవాలని ఐసీసీ హెచ్చరించింది. లేదంటే టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించి ప్రస్తుత ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం తర్వాతి స్థానంలో ఉన్న స్కాట్లాండ్కు అవకాశం ఇస్తామని కూడా చెప్పేసింది. తమ గ్రూప్‌ను మార్చి ఐర్లాండ్ మ్యాచ్‌ల స్థానంలో శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడించాలని బీసీబీ చేసిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనకు కూడా అంగీకరించేది లేదని ఐసీసీ జవాబిచి్చంది. భారత్–శ్రీలంక ఆతిథ్యమివ్వనున్న టి20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. -
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మరో షాక్..
టీ20 ప్రపంచకప్-2026లో పాల్గోనేందుకు తమ జట్టును భారత్‌కు పంపబోమని మొండి పట్టుతో ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మరో భారీ షాక్ తగిలింది. బీసీబీ తాజాగా చేసిన 'గ్రూప్ స్వాపింగ్' ప్రతిపాదనను క్రికెట్ ఐర్లాండ్ నిర్మొహమాటంగా తిరస్కరించింది. తమ లీగ్ మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడుతామని ఐరీష్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.ఈ మెగా టోర్నీలో బంగ్లాదేశ్ గ్రూపు-సిలో ఉంది. షెడ్యూల్ ప్రకారం బంగ్లా జట్టు తమ గ్రూపు మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబై వేదికలగా ఆడాల్సి ఉంది. అయితే భద్రతా కారణాలను సాకుగా చూపిస్తూ ఈ మెగా టోర్నీ కోసం భారత్‌కు రాబోమని బంగ్లాదేశ్ పట్టుబడుతోంది. తాజాగా శనివారం ఢాకాలో ఐసీసీ ప్రతినిధి బృందం, బీసీబీ అధికారుల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. భారత్‌లో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని ఐసీసీ హామీ ఇచ్చినా, బంగ్లాదేశ్ ప్రభుత్వం, బోర్డు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ భేటిలో బంగ్లా క్రికెట్ బోర్డు ఐసీసీ ముందు మరో సరికొత్త ప్రతిపాదనను ఉంచింది. గ్రూప్-బిలో ఉన్న ఐర్లాండ్‌తో తమ గ్రూపును మార్పు చేయాలంటూ ఐసీసీని బీసీబీ కోరింది. ఐర్లాండ్‌తో గ్రూప్ స్వాపింగ్ చేసుకుంటే లీగ్ దశ మ్యాచ్‌లన్నింటినీ శ్రీలంకలో ఆడవచ్చని బంగ్లాదేశ్ భావించింది. కానీ అందుకు ఐర్లాండ్ నో చెప్పడంతో కథ మళ్లీ మొదటికే వచ్చింది. ఇదే విషయంపై ఐర్లాండ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు మాట్లాడుతూ.. "మేము మొదట నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఆడతాం. గ్రూప్ స్టేజ్ మొత్తం శ్రీలంకలోనే జరుగుతుంది” అని చెప్పుకొచ్చారు. కాగా ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను ఐపీఎల్ నుంచి విడుదల చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఒకవేళ టోర్నీలో పాల్గోనేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు రాకపోతే పాయింట్లను కోల్పోవల్సి ఉంటుంది.చదవండి: ఇటలీ ప్రపంచకప్ జట్టులో సౌతాఫ్రికా ఆటగాడు -
ఆటగాళ్ల తిరుగు బాటు..! కీలక అధికారిపై వేటు వేసిన బీసీబీ
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. క్రికెటర్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన బోర్డు ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్, డైరెక్టర్ నజ్ముల్ ఇస్లాంను తన పదవి నుంచి బీసీబీ తొలగించింది. అతడి స్ధానంలో బీసీబీ చైర్మెన్ అమీనుల్ ఇస్లాం తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు. దీంతో బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య చెలరేగిన వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లే.వివాదానికి కారణం ఏంటంటే?ఐపీఎల్-2026 నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను బీసీసీఐ ఆదేశాలతో కేకేఆర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌లో తమ జట్టుకు భద్రత లేదని, తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి బంగ్లా క్రికెట్ బోర్డు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఈ విషయంపై ఐసీసీ-బీసీబీ మధ్య ఇంకా చర్చలు నడుస్తున్నాయి.అయితే ఈ వివాదంపై బంగ్లా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ స్పందిస్తూ భావోద్వేగాలకు పోకుండా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించాడు. తమీమ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీబీ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ నజ్ముల్ ఇస్లాం.. సోషల్ మీడియా వేదికగా తమీమ్ ఇక్బాల్‌ను ‘ఇండియన్ ఏజెంట్’ అని సంబోధించాడు.ఈ క్రమంలో 16 ఏళ్ల పాటు దేశానికి సేవలందించిన ఆటగాడిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల క్రికెటర్ల సంక్షేమ సంఘం (CWAB) మండిపడింది. చాలా మంది క్రికెటర్లు కూడా అతడి వ్యాఖ్యలను ఖండించారు. ఆ తర్వాత మరోసారి నజ్ముల్ ఇస్లాం వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు."ఒకవేళ బంగ్లా క్రికెట్ జట్టు వరల్డ్ కప్‌లో ఆడకపోయినా బోర్డుకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఐసీసీ నుంచి రావాల్సిన రూ. 290 కోట్ల రెవెన్యూ ఎలాగూ వస్తుంది. కానీ ఆటగాళ్లే నష్టపోతారు. వారు ఈ అవకాశాన్ని కోల్పోతే ఎలాంటి పరిహారం ఉండదు. బోర్డు ఆటగాళ్లపై కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తోంది.కానీ ప్రతీ ఐసీసీ టోర్నీలో జట్టు విఫలమవుతోంది. అటువంటి సందర్భాల్లో బోర్డు వారిపై ఖర్చు చేసే డబ్బులను తిరిగి చెల్లించమని మేము అడగడం లేదు కదా?" అని నజ్ముల్ పేర్కొన్నాడు. దీంతో అతడి కామెంట్స్‌పై క్రికెటర్ల సంక్షేమ సంఘం మరోసారి అగ్రహం వ్యక్తం చేసింది.చదవండి: IND vs USA: వైభవ్ సూర్యవంశీ అట్టర్ ప్లాప్..నజ్ముల్ ఇస్లాం తన పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) మ్యాచులతో పాటు అంతర్జాతీయ మ్యాచులను కూడా ఆడబోమని ఆటగాళ్లు స్పష్టం చేశారు. నజ్ముల్ ఇస్లాంకు షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పటికి బంగ్లా ప్లేయర్లు వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో గురువారం జరగాల్సిన రెండు బీపీఎల్ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. దీంతో బోర్డు పెద్దలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నజ్ముల్ ఇస్లాంపై వేటు వేశారు. -
'భారత్‌లో ఆడే ప్రసక్తే లేదు'.. మారని బంగ్లాదేశ్ వైఖరి
టీ20 ప్రపంచకప్-2026లో భారత్‌లో మ్యాచ్‌లు ఆడే విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తన పట్టు వీడటం లేదు. మంగళవారం ఐసీసీతో జరిగిన సమావేశంలోనూ టోర్నమెంట్ కోసం భారత్‌కు వెళ్లకూడదని తమ నిర్ణయాన్ని బీసీబీ పునరుద్ఘాటించింది.భద్రతా కారణాలను సాకుగా చూపుతూ తమ జట్టును భారత్‌కు పంపబోమని, తమ మ్యాచ్‌లను శ్రీలంక లేదా మరేదైనా ఇతర వేదికకు మార్చాలని మరోసారి బీసీబీ డిమాండ్ చేసింది. అయితే షెడ్యూల్ ఇప్పటికే ఖరారు కావగడంతో ఆఖరి నిమిషంలో వేదికలను మార్చడం అసాధ్యమని, బీసీబీ తన వైఖరి పునఃపరిశీలించుకోవాలని ఐసీసీ విజ్ఞప్తి చేసింది. కానీ బంగ్లా క్రికెట్ బోర్డు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆఖరి నిమిషం వరకు తమ చర్చలు జరుపుతామని, ఆటగాళ్లు భద్రత తమకు ముఖ్యమని బీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది.కాగా భారత్-బంగ్లాదేశ్ మధ్య గత కొంత కాలంగా దౌత్యపరమైన ఉద్రిక్తలు నెలకొన్నాయి. అయితే బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి రిలీజ్ చేయడంతో మరింత పెరిగాయి. ఐపీఎల్-2026 వేలంలో ముస్తాఫిజుర్‌ను రూ.9.20 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది.అయితే బంగ్లాలో హిందువులపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతుండడంతో ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించాలని చాలామంది డిమాండ్ చేశారు. దీంతో అతడిని జట్టు నుంచి రిలీజ్ చేయాలని కేకేఆర్‌ను బీసీసీఐ ఆదేశించింది. దీంతో అతడిని కేకేఆర్ విడుదల చేసింది.ఈ క్రమంలో తమ జట్టు ఆటగాడిని రిలీజ్ చేయడాన్ని బంగ్లా క్రికెట్ బోర్డు ఘోర అవమానంగా భావించింది. దీంతో వరల్డ్‌కప్ మ్యాచ్‌లను ఆడేందుకు భారత్‌కు తమ జట్టును పంపబోమని, వేదికలను మార్చాలని ఐసీసీని బీసీబీ డిమాండ్ చేసుకుంది. అంతేకాకుండా ఐపీఎల్ ప్రసారాలను తమ దేశంలో బంగ్లాదేశ్ బ్యాన్ చేసింది. ఒకవేళ బంగ్లాదేశ్ భారత్‌లో ఆడేందుకు నిరాకరిస్తే, టోర్నమెంట్ రూల్స్ ప్రకారం వారు పాయింట్లు కోల్పోయే అవకాశం ఉందిచదవండి: IND vs NZ: భారత జట్టులోకి అనూహ్య ఎంట్రీ.. బదోని ఎంపికకు గల కారణాలివే? -
బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నేపథ్యంలో బంగ్లాదేశ్ భారత్‌పై మరోసారి నిందలు వేసింది. భద్రతా కారణాల దృష్ట్యా మెగా ఈవెంట్లో ఆడేందుకు తమ ఆటగాళ్లను భారత్‌కు పంపలేమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ మ్యాచ్‌ల వేదికలను మార్చాలంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి విజ్ఞప్తి కూడా చేసింది.ఐసీసీ చెప్పింది.. ఈ మూడు జరిగితే దాడులు!అయితే, ఈ విషయంపై ఐసీసీ స్పందించిందంటూ బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘‘వేదికల మార్పు గురించి ఐసీసీకి మేము రెండు లేఖలు పంపించాము. ఇందుకు సమాధానం ఇంకా రాలేదు. అయితే, ఐసీసీ భద్రతా బృందం నుంచి మాకు లేఖ వచ్చింది.సెక్యూరిటీ టీమ్ ఇంఛార్జి మాకు రాసిన లేఖలో మూడు విషయాలు చెప్పారు. ఒకటి.. ఒకవేళ ముస్తాఫిజుర్ రహమాన్ బంగ్లాదేశ్ జట్టులో ఉంటే భద్రతా ముప్పు పెరుగుతుందని చెప్పారు. రెండోది.. ఒకవేళ బంగ్లాదేశ్‌కు మద్దతు ఇచ్చే ఆటగాళ్లు మా దేశ జెర్సీ వేసుకుని మైదానంలోకి వస్తే దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పారు.ఎన్నికలు సమీపిస్తున్నందున అది కూడా బంగ్లాదేశ్ జట్టుకు ముప్పును పెంచే అవకాశం ఉందని చెప్పారు. ఐసీసీ సెక్యూరిటీ టీమ్ హెడ్ ఇచ్చిన వివరాలను బట్టి.. టీ20 ప్రపంచకప్ ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు వెళ్లడం ఎంతమాత్రం సరికాదని అర్థమవుతోంది’’ అని నజ్రుల్ ఒక రకంగా నిందలు వేశాడు.దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఐసీసీఅయితే, నజ్రుల్ వ్యాఖ్యలకు ఐసీసీ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ఐసీసీ వర్గాలు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘పబ్లిక్‌గా కొంతమంది చేస్తున్న కామెంట్లు ఐసీసీ దృష్టికి వచ్చాయి. టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ ఆడే విషయంలో కొంతమంది తమకు నచ్చినట్లుగా ఐసీసీ సెక్యూరిటీ రిస్క్ గురించి చెప్పిందని మాట్లాడుతున్నారు.అంతర్జాతీయ స్థాయి భద్రతా నిపుణులతో ఐసీసీ చర్చిస్తుంది. దీనర్థం భారత్‌లో బంగ్లాదేశ్ మ్యాచ్‌లు ఆడకూడదని కాదు. భారత్‌లో ఎలాంటి భద్రతా ముప్పు లేదు. ఒకవేళ సెక్యూరిటీ రిస్క్ ఉంటుందని భావించినా.. అది తక్కువ నుంచి అతి తక్కువగా ఉంది.భారత్‌లో ఇప్పటికే ఎన్నో ఐసీసీ, మెగా టోర్నీలు జరిగాయి. మా భద్రతా విభాగం ప్రత్యక్షంగా బంగ్లాదేశ్ ప్లేయర్లపై దాడులు జరుగుతుందని అస్సలు చెప్పలేదు’’ అని నజ్ముల్ వ్యాఖ్యలను ఖండించాయి. పచ్చి అబద్ధంఇక PTI అందించిన వివరాల ప్రకారం.. ‘‘భారత్‌లో భద్రత గురించి ఐసీసీ- బీసీబీ మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఆసిఫ్ నజ్రుల్ చెప్పింది పచ్చి అబద్ధం. ముస్తాఫిజుర్ సెలక్షన్ వల్ల బంగ్లాదేశ్ జట్టుకు ముప్పు ఉంటుందని చెప్పిందన్నదాంట్లో ఎంత మాత్రం నిజం లేదు. ఇలాంటి ఒక విషయాన్ని లేఖలో అధికారికంగా రాయనేలేదు’’ అని ఐసీసీ వర్గాలు తెలిపాయి.కాగా బంగ్లాదేశ్‌లో కొన్నాళ్లుగా మైనారిటీలపై దాడులు పెరిగాయి. అందుకు తోడు భారత్‌పై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో బంగ్లా కవ్వింపులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2026లో ఉన్న ఒకే ఒక్క బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రహమాన్‌ను తొలగించాలనే డిమాండ్లు రాగా.. బీసీసీఐ అందుకు అంగీకరించింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2026 ఆడేందుకు తాము భారత్‌కు రాలేమని.. తమ ఆటగాళ్ల భద్రతకు ముప్పు ఉందంటూ బీసీబీ రాగం ఎత్తుకుంది.చదవండి: U19 WC 2026 IND vs ENG: వైభవ్ సూర్యవంశీ ఫెయిల్ -
బంగ్లా మ్యాచ్‌ల వేదికలు మార్పు!.. స్పందించిన బీసీసీఐ
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో బంగ్లాదేశ్ ఆడే వేదికల మార్పు అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పందించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని స్పష్టం చేసింది. కాగా బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడుల నేపథ్యంలో భారత్‌తో దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.భద్రత విషయంలో.. ఈ క్రమంలో ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ఫాస్ట్‌బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ (Mustafizur Rahman)ను బీసీసీఐ తొలగించిది. ఈ నేపథ్యంలో తమ ఆటగాళ్ల భద్రత దృష్ట్యా భారత్‌లో తాము టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడబోమంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) పంతానికి పోయింది. తమ జట్టు ఆడే వేదికలను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాల్సిందిగా ఐసీసీకి విజ్ఞప్తి చేసింది.అయితే, టోర్నీ ఆరంభానికి కొద్ది రోజుల (ఫిబ్రవరి 7) సమయమే ఉన్నందున ఐసీసీ ఇందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ వేదికలను కోల్‌కతా, ముంబై నుంచి చెన్నై, తిరునవంతపురానికి మార్చినట్లు సోమవారం వార్తలు వచ్చాయి.స్పందించిన బీసీసీఐఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్వయంగా స్పందించారు. IANSతో మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్ మ్యాచ్‌ల వేదికలను చెన్నై లేదంటే మరో చోటికి మార్చాలంటూ ఐసీసీ నుంచి బీసీసీఐకి ఎలాంటి సందేశమూ రాలేదు. అయినా ఈ విషయం మా ఆధీనంలో లేదు.బీసీబీ, ఐసీసీ మధ్య వ్యవహారం ఇది. ఐసీసీ పాలక మండలికే అన్ని అధికారాలు ఉంటాయి. ఒకవేళ వేదికలను మార్చాలని గనుక ఐసీసీ ఆదేశిస్తే.. ఆతిథ్య దేశంగా అందుకు తగ్గట్లుగా చర్యలు చేపడతాము. ఇప్పటికైతే ఈ అంశంలో మాకు ఎలాంటి సమాచారమూ లేదు’’ అని దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.టీ20 ప్రపంచకప్-2026లో బంగ్లాదేశ్ షెడ్యూల్ఫిబ్రవరి 7- వెస్టిండీస్‌తో- కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగాఫిబ్రవరి 9- ఇటలీతో- కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగాఫిబ్రవరి 14- ఇంగ్లండ్‌తో- కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగాఫిబ్రవరి 17- నేపాల్‌తో- ముంబైలోని వాంఖడే వేదికగా.చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్.. జట్టులోకి ఊహించని ఆటగాడు -
మేము నటిస్తున్నామని మాకూ తెలుసు: బంగ్లాదేశ్ కెప్టెన్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో బంగ్లాదేశ్ ఆడుతుందా?.. బంగ్లా డిమాండ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది?.. ఈ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వైఖరి ఎలా ఉండబోతోంది?.. క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఈ అంశాల గురించే ప్రధానంగా చర్చ నడుస్తోంది.బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడుల నేపథ్యంలో భారత్‌తో దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రహమాన్‌ను బీసీసీఐ తొలగించింది. ఈ క్రమంలో భద్రతా కారణాలు చూపుతూ వరల్డ్‌కప్ ఆడేందుకు తాము భారత్‌కు రాలేమని.. శ్రీలంకలో తమ మ్యాచ్‌లు నిర్వహించాలని బంగ్లా బోర్డు.. ఐసీసీకి విజ్ఞప్తి చేసింది.గందరగోళంలో ఆటగాళ్లుఅయితే, టోర్నీ ఆరంభానికి నెలరోజుల సమయం కూడా లేనందున ఈ మార్పు కుదరకపోవచ్చని ఐసీసీ బంగ్లా క్రికెట్ బోర్డు(BCB)కు సంకేతాలు ఇచ్చింది. అయినప్పటికీ బీసీబీ తమ పట్టువీడటం లేదు. దీంతో బంగ్లాదేశ్ లేకుండానే టోర్నీ నిర్వహించే పరిస్థితులు రావొచ్చనే ఆందోళనలు ఆ దేశ ఆటగాళ్లలో నెలకొన్నాయి.ఐసీసీతో పంచాయతీ వద్దని, తెగేదాక లాగవద్దంటూ బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ హితవు పలికితే.. బీసీబీ అధికారి అతడిని ‘ఇండియన్ ఏజెంట్’ అంటూ ఆరోపణలు చేశాడు. మరోవైపు.. బంగ్లా కీలక ఆటగాళ్ల బ్యాట్ స్పాన్సర్లుగా ఉన్న భారత కంపెనీలు తప్పుకొనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో నష్టపోతారు.అంగారక గ్రహంపైకి పంపించినాఅయినా సరే బీసీబీ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్ టీ20 వరల్డ్‌కప్ జట్టులో భాగమైన మెహదీ హసన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘ప్రపంచకప్ ఆడే విషయంలో యాజమాన్యం తరఫు నుంచి సందిగ్దం నెలకొంది. అధికారులే ఈ సమస్యను పరిష్కరించాలి.ప్లేయర్లుగా కేవలం ఆడటం మాత్రమే మా బాధ్యత. ఒకవేళ బోర్డు మమ్మల్ని అంగారక గ్రహంపైకి పంపించినా మేము ఆడి తీరాల్సిందే. ఈ విషయంలో ఆటగాళ్లు ఎక్కడా వెనక్కి తగ్గరు’’ అని పేర్కొన్నాడు.మేము నటిస్తున్నామని మాకూ తెలుసుఇక బంగ్లాదేశ్ టెస్టు జట్టు కెప్టెన్, గత టీ20 వరల్డ్‌కప్‌లో సారథిగా వ్యవహరించిన నజ్ముల్ హుసేన్ షాంటో సైతం బంగ్లా బోర్డు తీరును పరోక్షంగా తప్పుబట్టాడు. ‘‘ప్రతి ప్రపంచకప్ టోర్నీకి ముందు మాకు ఇలాంటి సమస్య ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది.వరల్డ్‌కప్ ఈవెంట్లలో ఆడిన ఆటగాడిగా నా అనుభవం గురించి చెబుతున్నా. ఇలాంటి పరిణామాలు కచ్చితంగా ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపుతాయి. మాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. ఎలాంటి ప్రభావం లేదన్నట్లు పైకి చెబుతూ ఉంటాము.నిజానికి ఆ సమయంలో మేమంతా నటిస్తున్నామన్న మాట. ఆ విషయం మాకూ తెలుసు. అయితే, ఇదేమీ తేలికైన విషయం కాదు. ఇలాంటి పరిస్థితులు రానేకూడదు. ఒకవేళ వచ్చినా ఆటగాళ్లుగా మేము చేసేదేమీ లేదు’’ అంటూ బీసీబీ వ్యవహారశైలిని విమర్శించాడు.చదవండి: T20 WC 2026: భారత్‌లో ఆడబోము..! బంగ్లా డిమాండ్‌పై స్పందించిన బీసీసీఐ -
‘ఇండియన్ ఏజెంట్’: ఓవరాక్షన్ చేశాడు.. ఇచ్చిపడేశారు!
భారత్-బంగ్లాదేశ్ మధ్య దౌత్య వివాదం ముదురుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్నాళ్లు తమ ఆటగాళ్లను వెనకేసుకొచ్చినట్లుగా కనిపించిన.. బంగ్లా క్రికెట్ బోర్డు (BCB) నిజ స్వరూపం తాజాగా తేట తెల్లమైంది. తమ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ పట్ల బీసీబీ అధికారి ఒకరు వ్యవహరించిన తీరే ఇందుకు కారణం.బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత, తదనంతర పరిణామాల నేపథ్యంలో భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మైనారిటీ హిందూలపై దాడులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లా ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ (Mustafizur Rahman)ను తొలగించారు.తెగేదాకా లాగొద్దుఇందుకు ప్రతిగా టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా భారత్‌లో జరిగే మ్యాచ్‌లకు తాము హాజరు కాబోమని బీసీబీ పేర్కొంది. ఇందుకు సంబంధించి భద్రతా కారణాలు చూపిస్తూ.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి లేఖ రాసింది. ఈ విషయంలో తెగేదాకా లాగొద్దని మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ బీసీబీని హెచ్చరించాడు.ఐసీసీ నుంచే బంగ్లాదేశ్ క్రికెట్‌కు భారీ మొత్తంలో ఆదాయం వస్తోందని.. సున్నితమైన ఈ అంశంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. ఐసీసీతో సంబంధాలు చెడితే మొదటికే మోసం వస్తుందని పేర్కొన్నాడు. ఆటగాళ్లు, బంగ్లా క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని హితవు పలికాడు.ఇండియన్ ఏజెంట్ అంటూ..ఈ విషయంపై బీసీబీ ఆర్థిక వ్యవహారాల కమిటీ చైర్మన్ ఎం. నజ్ముల్ ఇస్లాం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తమీమ్ ఇక్బాల్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈసారి బంగ్లాదేశ్ ప్రజలు.. తాను ఇండియన్ ఏజెంట్‌ను అని నిరూపించుకున్న వ్యక్తి నిజ స్వరూపాన్ని కళ్లారా చూశారు’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.ఈ నేపథ్యంలో ‘క్రికెటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ బంగ్లాదేశ్’ (CWAB) ఘాటుగా స్పందించింది. ‘‘బీసీబీ డైరెక్టర్ నజ్ముల్ ఇస్లాం.. జాతీయ జట్టు మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మా దృష్టికి వచ్చాయి.తీవ్రంగా ఖండిస్తున్నాంఈ మాటలు మమ్మల్ని ఆశ్చర్యపరిచాయి. ఆందోళనకు గురిచేశాయి. పదహారేళ్లు జాతీయ జట్టు తరఫున ఆడిన, విజయవంతమైన ఆటగాడి పట్ల ఇలాంటి కామెంట్లు చేయడం సరికాదు. ఏ కారణంగానూ ఇవి ఆమోదయోగ్యనీయం కాదు. సామాజిక మాధ్యమం వేదికగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.ఇది చాలా అవమానకరం. ఈ విషయాన్ని బీసీబీ అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్లాము. సదరు అధికారి క్షమాపణలు చెప్పి తీరాల్సిందే’’ అని CWAB డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్ మాజీ, ప్రస్తుత క్రికెటర్లు సైతం తమీమ్ ఇక్బాల్‌కు మద్దతుగా.. బీసీబీ అధికారి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.చదవండి: IND vs NZ: తిలక్ వర్మ స్థానంలో జట్టులోకి అతడు! -
బంగ్లాదేశ్ క్రికెట్‌కు మరో భారీ షాక్!.. ఇక ఖేల్ ఖతం?
భారత్-బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు క్రీడా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి తప్పించడంతో రగిలిపోతున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మరో భారీ షాక్ తగిలింది.ప్రముఖ భారత క్రికెట్ పరికాల సంస్థ సాన్స్పరీల్స్ గ్రీన్లాండ్స్ (SG).. బంగ్లాదేశ్ క్రికెటర్లతో తన స్పాన్సర్షిప్ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్ లిట్టన్ దాస్, మాజీ కెప్టెన్ మోమినుల్ హక్, యాసిర్ అలీ వంటి స్టార్ ప్లేయర్లకు ఎస్జీనే స్పాన్సర్‌గా ఉంది. ఇప్పుడు రెండు దేశాల మధ్య నెలకొన్న పరిణామాల నేపథ్యంలో తమ కాంట్రాక్ట్‌లను పొడిగించేందుకు ఎస్జీ సముఖత చూపలేదు. దీంతో బంగ్లాదేశ్ ఆటగాళ్లు తమకు అలవాటైన కస్టమ్-మేడ్ బ్యాట్లను కోల్పోవడమే కాకుండా భారీ ఆర్థిక నష్టాన్ని కూడా ఎదుర్కొనున్నారు.అయితే దీనిపై ఇంకా ఎస్జీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఇతర దేశాలకు చెందిన స్పాన్సర్లను వెతుక్కోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మరో భారత దిగ్గజ సంస్థ ఎస్ఎస్ కూడా ఎస్జీ బాటలో నడిచే అవకాశం ఉంది. ముష్ఫికర్ రహీమ్, సబ్బీర్ రెహమాన్, నాసిర్ హొస్సేన్ వంటి స్టార్ ఆటగాళ్లకు ఎస్ఎస్ స్పాన్సర్ ఉంది.కాగా ఈ వివాదం కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ జట్టు నుంచి ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను విడుదల చేయడంతో మొదలైంది. ఐపీఎల్-2026 వేలంలో ముస్తాఫిజుర్‌ను రూ.9.20 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగిపోవడంతో ముస్తాఫిజుర్‌ను జట్టులోకి తీసుకున్నందుకు కేకేఆర్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.ఈ క్రమంలో రంగంలోకి దిగిన బీసీసీఐ ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి రీలీజ్ చేయాలని కేకేఆర్‌ను అదేశించింది. దీంతో అతడిని కేకేఆర్ విడుదల చేసింది. ఆ తర్వాత భారత్‌లో భద్రతా కారణాలను సాకుగా చూపుతూ, వరల్డ్‌కప్‌లో తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరింది. బీసీబీ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. షెడ్యూల్ ప్రకారం భారత్‌కు వచ్చి ఆడకపోతే పాయింట్లను కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను సైతం బ్యాన్ చేసింది.చదవండి: IND vs NZ: తిలక్ వర్మ స్థానంలో జట్టులోకి అతడు! -
పాకిస్తాన్ మాదిరే మేము కూడా!: బంగ్లాదేశ్ ఓవరాక్షన్
భారత్‌లో తమ ఆటగాళ్లకు భద్రత ఉండదంటూ బంగ్లాదేశ్ మరోసారి ఓవరాక్షన్ చేసింది. టీ20 ప్రపంచకప్-2026 ఆడేందుకు తమ క్రికెట్ జట్టును అక్కడికి పంపలేమని పేర్కొంది. అయితే, అదే సమయంలో తాము మాత్రం టోర్నమెంట్‌ను వైదొలిగేందుకు సిద్ధంగా లేమంటూ తమ ద్వంద్వ వైఖరిని బయటపెట్టింది.భారత్‌లో మ్యాచ్‌లు ఆడే పరిస్థితి లేదుఈ విషయం గురించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం, ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ‘‘భారత్‌లో మ్యాచ్‌లు ఆడే పరిస్థితి లేదని మేము ఇప్పటికే ఐసీసీకి అర్థమయ్యేలా చెప్పాము.మరింత స్పష్టంగా ఈరోజు రాత్రికో.. రేపు ఉదయమో మరోసారి ఇదే విషయాన్ని వారికి చెబుతాము. బంగ్లాదేశ్ భద్రత, గౌరవం, మర్యాద విషయంలో మేము ఎంతమాత్రము రాజీపడబోము. అయితే, మేము కచ్చితంగా టీ20 ప్రపంచకప్ టోర్నీలో పాల్గొంటాము’’ అని నజ్రుల్ పేర్కొన్నాడు.మరోవైపు.. అమినుల్ పాకిస్తాన్ పేరును ప్రస్తావిస్తూ తమకు కూడా అలాంటి వెసలుబాటు కావాలని డిమాండ్ చేశాడు. ‘‘చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లలేదు. అలాగే గత వరల్డ్‌కప్ ఆడేందుకు పాకిస్తాన్ భారత్‌కు రాలేదు.పాకిస్తాన్ మాదిరే మేము కూడాకాబట్టి మా విషయంలోనూ పాక్ మాదిరే ఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం. ప్రపంచకప్ టోర్నీల్లో హైబ్రిడ్ మోడల్ కొనసాగుతున్న విషయం అందరికీ తెలుసు. ఇందుకు భద్రతే ప్రధాన కారణం. కాబట్టి మాకు సానుకూల స్పందన లభిస్తుందని ఆశిస్తున్నాం’’ అని అమినుల్ అన్నాడు.కాగా బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై హత్యాకాండ నేపథ్యంలో.. ఐపీఎల్ నుంచి ఆ దేశ ఆటగాళ్లను బహిష్కరించాలనే డిమాండ్లు పెరిగాయి. అందుకు అనుగుణంగానే బీసీసీఐ.. ముస్తాఫిజుర్ రహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి తొలగించేలా ఆదేశాలు ఇచ్చింది.ఐసీసీ తిరస్కరించే అవకాశం?ఈ క్రమంలో భద్రత అనే కారణం చూపుతూ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ కోసం తాము భారత్‌కు రాలేమని బంగ్లాదేశ్ పేర్కొంది. అయితే, టోర్నీ ఆరంభానికి నెలరోజుల సమయమే ఉన్నందున ఈ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ కోరినట్లు శ్రీలంకలో వారి మ్యాచ్‌లు నిర్వహించడం కుదరకపోవచ్చు. ఈ నేపథ్యంలో తొలుత తాము టోర్నీ నుంచి తప్పుకొంటామని బెదిరింపు ధోరణి కనబరిచిన బంగ్లా.. తాజాగా ఇలా మాట్లాడటం గమనార్హం.చదవండి: IND vs NZ: టీమిండియాకు శుభవార్త -
ICC: అబ్బే అదేం లేదు!.. మా మాట విన్నారు!
తమ అభ్యర్థనను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తిరస్కరించిందన్న వార్తలను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఖండించింది. ఐసీసీ తమకు ఎలాంటి అల్టిమేటం జారీ చేయలేదని తెలిపింది. ఇందుకు సంబంధించిన బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఐసీసీ హామీ ఇచ్చింది‘‘మా విజ్ఞప్తిపై ఐసీసీ స్పందించింది. భారత్‌లో టీ20 ప్రపంచకప్-2026 మ్యాచ్‌ల నేపథ్యంలో.. మా ఆటగాళ్ల భద్రత విషయంలో మేము లేవెనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంది. మ్యాచ్‌ల వేదికలను మార్చాలనే మా విజ్ఞప్తిపై కూడా బదులిచ్చింది.మేము ఈ టోర్నమెంట్లో కొనసాగేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని ఐసీసీ హామీ ఇచ్చింది. ఈ సమస్యలపై మా నుంచి ఇన్పుట్స్ తీసుకుని బీసీబీతో కలిసి పనిచేస్తామని తెలిపింది. భద్రత విషయంలో మాతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు పేర్కొంది.వరల్డ్‌కప్ ఆడతాంటోర్నీలో కొనసాగే విషయమై మాకు ఎలాంటి అల్టిమేటం జారీ చేయలేదు. ఇందుకు సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. ఐసీసీతో పాటు ఈవెంట్ నిర్వహిస్తున్న వారితో మా బోర్డు ప్రొఫెషనల్‌గానే ముందుకు సాగుతుంది. వరల్డ్‌కప్‌లో మేము తప్పక పాల్గొంటాము.ఇందుకు సంబంధించిన ప్రక్రియ సజావుగా సాగేందుకు.. మా సమస్యకు సరైన పరిష్కారం వెదికేందుకు సిద్ధంగా ఉన్నాము. ఏదేమైనా మా ఆటగాళ్ల భద్రతే మాకు మొదటి ప్రాధాన్యం’’ అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తన ప్రకటనలో పేర్కొంది.ఆటగాడి తొలగింపు.. ఐపీఎల్ అక్కడ బ్యాన్!కాగా బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడుల నేపథ్యంలో.. భారత్- బంగ్లాదేశ్ మధ్య దౌత్య వివాదంలో ముదిరిన విషయం తెలిసిందే. మార్చి నుంచి జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లను తమ దేశంలో ప్రసారం చేయరాదని బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బంగ్లా సమాచార, ప్రసార శాఖమంత్రి నిర్ధారించారు. ఐపీఎల్‌నుంచి తమ దేశం ఆటగాడు ముస్తఫిజుర్ రహమాన్‌ను అనూహ్యంగా తప్పించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ) ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ కనిపించరాదని నిర్ణయించింది.అంతేకాదు.. తమ ఆటగాళ్ల భద్రతపై సందేహాలు ఉన్నాయంటూ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లను భారత్‌నుంచి శ్రీలంకకు మార్చాలంటూ ఐసీసీకి శనివారం విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో పంచాయితీ ఐసీసీ వద్దకు చేరింది. టోర్నీకి నెలరోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో వేదికలు మార్చడం కుదరని బీసీబీకి ఐసీసీ స్పష్టం చేసినట్లు బుధవారం వార్తలు వచ్చాయి. అందుకే యూటర్న్?ఒకవేళ బంగ్లాదేశ్ ఈ టోర్నీ నుంచి వైదొలగానుకున్నా ఫర్వాలేదని చెప్పినట్లు ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్లు వెల్లడించాయి. అయితే, బీసీబీ మాత్రం వీటిని ఖండిస్తూ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. టోర్నీ నుంచి తప్పుకొంటామని ముందుగా బెదిరింపు ధోరణి అవలంబించిన బీసీబీ.. తెగేదాకా లాగితే మొదటికే మోసం వస్తుందని భావించి యూటర్న్ తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: ముఖం మీద కొట్టినట్లు.. యువీ దెబ్బకు అల్లాడినా.. నాలో కసి పెరిగి... -
బంగ్లాదేశ్ అంత పని చేసిందా?.. నేనే తప్పుకొన్నా!
భారత్- బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ వివాదం ముదురుతోంది. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడుల నేపథ్యంలో.. ఐపీఎల్ నుంచి ఆ దేశ ఆటగాళ్లను తొలగించాలనే డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు కోల్‌కతా నైట్ రైడర్స్ తమ జట్టులో ఉన్న ముస్తాఫిజుర్ రహమాన్‌ను విడుదల చేసింది.షాకిచ్చిన ఐసీసీఈ క్రమంలో బంగ్లాదేశ్ టీమిండియా టూర్‌కు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయగా.. ఈ పర్యటనపై తాము నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2026 ఆడేందుకు తాము భారత్‌కు రాబోమంటూ బంగ్లా క్రికెట్ బోర్డు ప్రగల్భాలు పలకగా.. ఐసీసీ ఇందుకు విముఖత వ్యక్తం చేసింది. ఇప్పటికే షెడ్యూల్ ఖరారైనందున యథావిధిగా మ్యాచ్‌లు సాగుతాయని స్పష్టం చేసింది.బంగ్లాదేశ్ అంత పని చేసిందా?ఇదిలా ఉంటే.. తాజా సమాచారం ప్రకారం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) నుంచి భారత స్పోర్ట్స్ ప్రజెంటర్ రిధిమా పాఠక్ (Ridhima Pathak)ను తొలగించారనే ప్రచారం ఊపందుకుంది. ఈ విషయంపై ఆమె స్వయంగా స్పందించింది. తనకు దేశమే మొదటి ప్రాధాన్యం అని.. అందుకే తానే లీగ్ నుంచి వైదొలిగినట్లు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది.దేశం కోసం నేనే తప్పుకొన్నా!‘‘నన్ను బీపీఎల్ నుంచి తొలగించారని గత కొన్ని గంటలుగా ప్రచారం జరుగుతోంది. అది వాస్తవం కాదు. ఈ లీగ్ నుంచి తప్పుకోవాలనే నేనే నిర్ణయించుకున్నాను. దేశ ప్రయోజనాలే నాకు ఎల్లప్పుడూ ప్రథమ ప్రాధాన్యం.అదే విధంగా ఆట పట్ల కూడా నాకు నిబద్ధత ఉంది. ఇన్నాళ్లుగా స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా నిజాయితీ, అంకితభావం, గౌరవం, ప్యాషన్‌తో పనిచేశాను. దీనిలో ఇక ముందు కూడా ఎలాంటి మార్పూ ఉండదు. క్రికెట్ సమగ్రత కోసం నేను ఎల్లప్పుడూ క్రీడాస్ఫూర్తితోనే ఉంటాను.ఈ విషయంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. క్రికెట్ విషయంలో నిజం చెప్పడం ముఖ్యం. ఇకపై ఈ అంశం గురించి నేను స్పందించను. జై హింద్’’ అని రిధిమా పాఠక్ పేర్కొంది. చదవండి: సచిన్ కొడుకు పెళ్లి ముహూర్తం ఫిక్స్ -
ఐపీఎల్ నుంచి ఔట్.. ముస్తాఫిజుర్‌కు పరిహారం అందుతుందా?
బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఊహించని షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అతడు కూడా ఆడకుండా బీసీసీఐ నిషేదం విధించింది బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.బీసీసీఐ ఆదేశాల మేరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ అతడిని జట్టు నుంచి రిలీజ్ చేసింది. ఐపీఎల్ 2026 వేలంలో ముస్తాఫిజుర్‌ను రూ. 9.20 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. కానీ ప్రస్తుత పరిణామాల దృష్ట్యా అతడిని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో బంగ్లాదేశ్ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది.తమ దేశ క్రికెటర్‌ను అర్ధాంతరంగా తప్పించడాన్ని బంగ్లా జీర్ణించుకోలేకపోతుంది. ఈ క్రమంలో భద్రతను కారణంగా చూపుతూ టీ20 ప్రపంచకప్‌లో పాల్గోనేందుకు భారత్‌కు వెళ్లబోము అని ఐసీసీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు లేఖ రాసింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించాలని ఆ లేఖలో బీసీబీ రాసుకొచ్చింది. అయితే బీసీబీ అభ్యర్ధను ఐసీసీ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను కూడా బంగ్లాదేశ్ బ్యాన్ చేసింది.భారీ ధరకు అమ్ముడైనా..అయితే ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను కేకేఆర్ అనుహ్యంగా జట్టు నుంచి రిలీజ్ చేయడంతో అతడికి ఏమైనా పరిహరం చెల్లిస్తుందా? అన్న ప్రశ్న క్రికెట్ అభిమానుల్లో ఉత్పన్నమవుతోంది. ఈ క్రమంలో రూల్స్ ఏమి చెబుతున్నాయో ఓసారి పరిశీలిద్దాము. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. కాంట్రాక్ట్ పొందిన ఆటగాడికి సదురు ఫ్రాంచైజీకి ఇన్సూరెన్స్ చేయిస్తోంది.ఒక జట్టులో చేరిన తర్వాత లేదా టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో గాయపడితే భీమా వర్తిస్తోంది. అటువంటి సందర్భాల్లో ఇన్సూరెన్స్ కంపెనీలు సదరు ఆటగాడికి ఏభై శాతం వరకు జీతాన్ని చెల్లిస్తాయి. కానీ ముస్తాఫిజుర్ పరిస్థితి అందుకు భిన్నం. అతడు ఇంకా కేకేఆర్ క్యాంపులోనే చేరలేదు. దౌత్యపరమైన కారణాల వద్ద అతడి ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. రాజకీయ ఉద్రిక్తతలు, బోర్డు ఆదేశాలు వంటివి ఇన్సూరెన్స్ పరిధిలోకి రావు. కాబట్టి కేకేఆర్ యాజమాన్యం నుంచి అతడికి ఒక్క పైసా కూడా అందదని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.అదొక్కటే మార్గం..అయితే చట్టపరంగా పోరాడటం ఒక్కటే ముస్తాఫిజుర్ రెహమాన్ ముందున్న మార్గం. ఐపీఎల్ కాంట్రాక్ట్‌లు భారత చట్టపరిధిలోకి వస్తుంది. కానీ ఏ విదేశీ క్రికెటర్ భారత కోర్టులలో గానీ అంతర్జాతీయ స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ (CAS)లో కేసు వేసే అంత సహసం చేయరు. ఎందుకంటే ఇది చాలా కష్టతరమైన ప్రక్రియ.చదవండి: బంగ్లాదేశ్ మరో సంచలన నిర్ణయం! -
బంగ్లాదేశ్ మరో సంచలన నిర్ణయం!
బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను ఐపీఎల్ నుంచి విడుదల చేయడంతో మొదలైన వివాదం రోజు రోజుకు మరింత ముదురుతోంది. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ బ్యాన్ దగ్గర నుంచి, టీ20 వరల్డ్ కప్‌లో ఆడేందుకు భారత్‌కు రాబోమని చెప్పడం వరకూ చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి.ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో భారత్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు తమ అంపైర్లను పంపకూడదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో ఉన్న బంగ్లా అంపైర్లు షర్ఫుద్దౌలా, షాహిద్ సైకత్ ప్రపంచకప్‌లో పాల్గోనడంపై సందిగ్ధత నెలకొంది. అయితే వీరిద్దరూ ఐసీసీ ప్యానెల్లో ఉన్నందున తుది నిర్ణయం మాత్రం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తీసుకోనుంది.రగిలిపోతున్న బంగ్లా..ఐపీఎల్‌నుంచి తమ దేశం ఆటగాడు ముస్తఫిజుర్ రెహ్మన్‌ను అనూహ్యంగా తప్పించడాన్ని బంగ్లాదేశ్ ఘోర అవమానంగా భావిస్తోంది. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలంటూ శనివారం ఐసీసీకి విజ్ఞప్తి చేసిన బంగ్లాదేశ్... తర్వాతి రోజే ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించింది. ఇప్పుడు అంపైర్లను కూడా భారత్‌కు పంపకూడదన్న యోచనలో బంగ్లా ఉంది.చదవండి: ఆ ముగ్గురిని చూస్తుంటే..: కోహ్లిపై భారత మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు -
బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన ఐసీసీ?!
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్-2026లో బంగ్లాదేశ్ ఆడే మ్యాచ్‌లను భారత్ నుంచి తరలించేందుకు ఐసీసీ సుముఖంగా లేనట్లు సమాచారం. క్రిక్‌బజ్ అందించిన వివరాల ప్రకారం.. బీసీబీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మధ్య ఉన్న ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని ఐసీసీ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.ముస్తఫిజుర్ రహమాన్ అవుట్‌ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా మెజారిటీ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్న బీసీసీఐకే తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బ తిన్న నేపథ్యంలో క్రికెట్‌కు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు జరుగుతున్న కారణంగా ఆ దేశపు పేస్ బౌలర్ ముస్తఫిజుర్ రహమాన్‌ను ఐపీఎల్ నుంచి తప్పించాలని డిమాండ్లు వచ్చాయి. ఈ క్రమంలో బీసీసీఐ ఆదేశాల మేరకు శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్ దీనిని అంగీకరిస్తూ ముస్తఫిజుర్‌ను తమ జట్టునుంచి తొలగించింది. అనంతరం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.మ్యాచ్‌లను తరలించాలంటూ ఐసీసీకి విజ్ఞప్తిభారత్లో మ్యాచ్‌లు ఆడితే తమ ఆటగాళ్లకు భద్రతా సమస్యలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత స్థితిలో తాము భారత్‌లో ప్రయాణించలేమని స్పష్టం చేసింది. కాబట్టి టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లా ఆడాల్సిన 4 లీగ్ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్ తమ తొలి మూడు లీగ్ మ్యాచ్‌లను కోల్‌కతాలో, చివరి మ్యాచ్‌ను ముంబైలో ఆడాల్సి ఉంది.‘బంగ్లాదేశ్ ప్రభుత్వం సూచన మేరకు మా క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించరాదని నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల మధ్య అన్నింటికంటే ఆటగాళ్ల భద్రతే మాకు ముఖ్యం. కాబట్టి ఇక్కడ మేం ఆడాల్సిన అన్ని మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరుతున్నాం. బీసీసీఐ ఒక్క ఆటగాడికే భద్రత కల్పించలేకపోతోంది. ఇక మొత్తం జట్టుకు ఎలాంటి సెక్యూరిటీ ఇస్తుంది. ఒక్క క్రికెటర్ల గురించే కాకుండా మేం అభిమానులు, సహాయక సిబ్బంది, మీడియా గురించి కూడా ఆలోచిస్తున్నాం’ అని బీసీబీ ప్రకటన జారీ చేసింది. తరలింపు కష్టమే! బంగ్లా బోర్డు ఎన్ని డిమాండ్లు చేసినా ఇప్పటికిప్పుడు మ్యాచ్‌లను తరలించడం సాధ్యం కాదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. టోర్నమెంట్ ప్రారంభానికి మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. ఇలాంటి స్థితిలో బీసీబీ వాదన సహేతుకం కాదని భారత బోర్డు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ‘ఎవరో ఒకరి ఇష్టానుసారం మ్యాచ్‌లను మార్చడం సాధ్యం కాదు. ఏర్పాట్లపరంగా ఎన్నో సమస్యలు ఉంటాయి. బంగ్లాతో ఆడే ప్రత్యర్థి జట్లు ఇప్పటికే విమాన టికెట్లు, హోటల్ బుక్ చేసుకున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఒక్కో రోజు మూడు మ్యాచ్‌లు ఉండే వాటిలో ఒకటి శ్రీలంకలో జరుగుతుంది. ప్రసారకర్తలు మ్యాచ్‌లకు ఎలా సిద్ధమవుతారు. కాబట్టి మాటలు చెప్పినంత సులువు కాదు చేసి చూపించడం’ అని ఆయన అన్నారు. మరో వైపు.. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేయరాదని తమ దేశ ప్రభుత్వానికి బంగ్లా మాజీ క్రికెటర్లు విజ్ఞప్తి చేశారు. చదవండి: ఆ రియల్ హీరోల కోసం.. చప్పట్లతో మారుమోగిన స్టేడియం -
వారు తొలిగిస్తే నేనేం చేయగలను?
బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై కొనసాగుతున్న దాడుల సెగ ఐపీఎల్‌కు తగిలింది. 2026 సీజన్ కోసం వేలం ద్వారా ఎంపికైన ఏకైక బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తమ జట్టునుంచి విడుదల చేస్తున్నట్లు కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం ప్రకటించింది.ఐపీఎల్-2026 వేలంలో ముస్తాఫిజుర్ ను రూ. 9.20 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో ముస్తఫిజుర్‌ను ఐపీఎల్లో ఆడనివ్వకూడదని భారత్‌లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.అంతేకాకుండా ముస్తాఫిజుర్‌ను జట్టులోకి తీసుకున్నందుకు కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. కొందరు రాజకీయ నాయకులు అతడిని "దేశద్రోహి" అని కూడా మండిపడ్డారు. ఈ పరిస్థితులను గమనించిన బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, ముస్తాఫిజుర్‌ను విడుదల చేయాల్సిందిగా కేకేఆర్ యాజమాన్యానికి సూచించారు.దీంతో కేకేఆర్ అతడిని జట్టు నుంచి తప్పించింది. ఇక ఈ విషయంపై ముస్తఫిజుర్ తొలిసారి స్పందించాడు. "వారు నన్ను విడుదల చేస్తే, నేను మాత్రం ఏం చేయగలను?" అంటూ తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాది సీజన్ కోసం ముస్తఫిజుర్ స్ధానాన్ని మరొక ఆటగాడితో కేకేఆర్ భర్తీ చేయనుంది.ఇక ఇది ఇలా ఉండగా.. ముస్తఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించడంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది తమ దేశ క్రికెటర్లను అవమానించడమేనని, ఐపీఎల్ ప్రసారాలను బంగ్లాదేశ్‌లో నిలిపివేయాలని అక్కడి క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ఆదేశించడం గమనార్హం. అదేవిధంగా టీ20 వరల్డ్‌కప్-2026లో తమ లీగ్ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ను కోరనున్నట్లు తెలుస్తోంది.చదవండి: T20 WC 2026: భారత్‌లో ఆడబోము..! పాక్ బాటలోనే బంగ్లాదేశ్? -
బీసీసీఐ కీలక నిర్ణయం.. బంగ్లాదేశ్‌కు భారీ షాక్!
భారత పురుషల క్రికెట్ జట్టు ఈ ఏడాది సెప్టెంబర్‌లో మూడు వన్డేలు, టీ20ల సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే మరోసారి ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లపై నీలినీడలు కమ్ముకున్నాయి. బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరత, హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో టీమిండియా పర్యటనను బీసీసీఐ తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు."బంగ్లాదేశ్ టూర్‌ను మేము ఇంకా ఖరారు చేయలేదు. గతేడాది కూడా మా జట్టు బంగ్లా పర్యటనకు వెళ్లలేదు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వదేశంలో జరిగే అంతర్జాతీయ సిరీస్ క్యాలెండర్‌ను విడుదల చేసినప్పటికి.. టీమిండియా పర్యటించేది మాత్రం అనుమానమే. ఈ టూర్‌పై తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనున్నాము.ఎందుకంటే దేశం వెళ్లి ఆడాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసారి. ఇక టీ20 ప్రపంచకప్ విషయానికి వస్తే షెడ్యూల్ ప్రకారమే.. బంగ్లాదేశ్ మ్యాచ్‌లు భారత్‌లో జరగనున్నాయి" అని సదరు అధికారి పేర్కొన్నారు. కాగా భారత్-బంగ్లా జట్టు వైట్‌బాల్ సిరీస్ షెడ్యూల్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. కానీ అంతలోనే బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. వాస్తవానికి గతేడాది ఆగస్టులో జరగాల్సి ఉంది. కానీ అప్పట్లో అక్కడ నెలకొన్న రాజకీయ అస్థిరత వల్ల అది ఈ ఏడాది సెప్టెంబర్‌కు వాయిదా పడింది. మళ్ళీ ఇప్పుడు అదే కథ పునరావృతమయ్యేలా ఉంది. పొట్టి ప్రపంచకప్ కోసం బంగ్లాదేశ్ జట్టు భారత పర్యటనకు ఫిబ్రవరిలో రానుంది. ముస్తాఫిజుర్ ఔట్..అదేవిధంగా బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుంచి విడుదల చేయాలని కోల్‌కతా నైట్ రైడర్స్‌ను బీసీసీఐ ఆదేశించింది. ఐపీఎల్ 2026 మినీ వేలంలో రూ.9.2 కోట్ల భారీ ధరకు ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే బంగ్లాదేశ్‌లో రోజు రోజుకు హిందువులపై దాడులు పెరిగిపోతుండడంతో బంగ్లా ప్లేయర్లను ఐపీఎల్లో ఆడకుండా చాలా మంది డిమాండ్ చేశారు.అయితే కేకేఆర్ యాజమాని షారుఖ్ ఖాన్‌పై విమర్శలు వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే బీసీసీఐ ముస్తాఫిజుర్‌ను జట్టు విడుదల చేయాలని కేకేఆర్‌ను సూచించింది.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ వచ్చేశాడు -
రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ ప్లేయర్
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ టెస్ట్, టీ20 క్రికెట్ నుంచి తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు. జాతీయ జట్టు తరపున తిరిగి మూడు ఫార్మాట్లలో ఆడాలని భావిస్తున్నట్లు షకీబ్ తెలిపాడు. సొంత ప్రజలు ముందు రిటైర్మెంట్ అవ్వాలనే తన కోరికను అతడు వ్యక్తం చేశాడు.కాగా గతేడాది భారత పర్యటన తర్వాత టెస్ట్, టీ20లకు షకీబ్ వీడ్కోలు పలికిన షకీబ్.. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతానని చెప్పుకొచ్చాడు. కానీ షకీబ్ వివాదాలలో చిక్కుకోవడంతో వన్డేలకు అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఈ స్టార్ ఆల్‌రౌండర్ ప్రస్తుతం యూకేలో ఉంటున్నాడు.గతేడాది మే నుంచి ఇప్పటివరకు అతడు ఇప్పటివరకు బంగ్లాదేశ్‌కు తిరిగి రాలేదు. ఓ హత్య కేసులో అతడి పేరిట ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ వివాదంలో అతడు చిక్కుకున్నప్పటికి పాకిస్తాన్, భారత్‌లలో జరిగిన టెస్ట్ సిరీస్‌లలో మాత్రం పాల్గోనున్నాడు.ఆ తర్వాత అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోవడంతో షకీబ్ విదేశాల్లోనే ఉండిపోయాడు. షకీబ్ ఆ పార్టీ ఎంపీగా పనిచేసిన సంగతి తెలిసిందే. తాజాగా మోయిన్ అలీతో 'బీర్డ్ బిఫోర్ వికెట్' పాడ్‌కాస్ట్‌లో షకీబ్ అల్ హసన్ పాల్గోన్నాడు. ఈ సందర్భంగా తన మనసులోని మాటను అతడు వెల్లడించాడు."నేను ఇంకా అన్ని ఫార్మాట్ల నుంచి అధికారికంగా రిటైర్ కాలేదు. ఈ విషయాన్ని మొదటిసారి వెల్లడిస్తున్నా. తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లి పూర్తి స్ధాయిలో వన్డే, టెస్ట్, టీ20 సిరీస్ ఆడి రిటైర్ అవ్వాలనుకుంటున్నాను. సొంత ప్రజల ముందు అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతా. ఫిట్‌గా ఉండేందుకే టీ20 లీగ్స్‌లో ఆడుతున్నా అని షకీబ్ పేర్కొన్నాడు. మరి అతడి కోరికను బంగ్లా క్రికెట్ బోర్డు నెరవేరుస్తుందో లేదో వేచి చూడాలి.చదవండి: IPL 2026: యువ సంచలనంపై ముంబై కన్ను.. ఎవరీ ముకుల్ చౌదరి? -
ఆసియాకప్-2025కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన
ఆసియాకప్-2025 కోసం బంగ్లాదేశ్క్రికెట్ బోర్డు 25 మంది సభ్యులతో కూడిన తమ ప్రాథమిక జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా లిట్టన్ దాస్ ఎంపికయ్యాడు. సీనియర్, యువ ఆటగాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. అదేవిధంగా గత రెండేళ్లగా జట్టుకు దూరం ఉంటున్న వికెట్ కీపర్ బ్యాటర్ నూరల్ హసన్‌కు బంగ్లా సెలక్టర్లు తిరిగి పిలపునిచ్చారు.నూరల్ చివరగా బంగ్లాదేశ్ తరపున 2022లో టీ20 మ్యాచ్ ఆడాడు. అంతేకాకుండా పాకిస్తాన్ సిరీస్‌లో భాగం కాని నజ్ముల్ హుస్సేన్ శాంటో, సౌమ్య సర్కార్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.కాగా ఆసియాకప్‌నకు ముందు బంగ్లాదేశ్ స్వదేశంలో నెదర్లాండ్స్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. అలాగే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ అగ్రశ్రేణి క్రికెటర్ల కోసం మీర్పూర్లో స్పెషల్ టైనింగ్ క్యాంపు ఏర్పాటు చేసింది. ఆగస్టు 15 నుంచి బంగ్లా ఆటగాళ్ల స్పెషల్ ట్రైనింగ్ ప్రారంభం కానుంది. కాగా ఈ ఏడాది ఆసియాకప్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 11న అబుదాబి వేదికగా హాంకాంగ్‌తో తలపడనుంది.ఆసియాకప్‌నకు బంగ్లాదేశ్ జట్టులిట్టన్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్ తమీమ్, ఎండి నయీమ్ షేక్, సౌమ్య సర్కార్, మహ్మద్ పర్వేజ్ హోస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, షమీమ్ హుస్సేన్, నజ్ముల్ హోస్సేన్, రిషాద్ హొస్సేన్, షాక్ మహేదీ హసన్, తన్వీర్ ఇస్లాం,నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, సైఫుద్దీన్, నహిద్ రానా, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరీఫుల్ ఇస్లాం, సయ్యద్ ఖలీద్ అహ్మద్, నూరుల్ హసన్ సోహన్, మహిదుల్ ఇస్లాం భుయాన్ అంకోన్, మహ్మద్ సైఫ్ హసన్. -
బంగ్లాదేశ్ దిగ్గజ క్రికెటర్ కన్నుమూత
బంగ్లాదేశ్ క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ క్రికెటర్, మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ మీర్ బెలాయెట్ హుస్సేన్(70) కన్నుముశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. 1970లలో బంగ్లాదేశ్‌కు టెస్ట్ హోదా లేకపోవడం కారణంగా.. బెలాయిట్ జాతీయ జట్టు తరపున కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.బంగ్లాదేశ్ మొట్టమొదటి ప్రధాన అంతర్జాతీయ టోర్నమెంట్ అయిన 1979 ఐసీసీ ట్రోఫీలో ఆయన పాల్గొన్నారు. కాగా దేశవాళీ క్రికెట్లో మాత్రం ఆయనకు అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. అబహాని, కలబాగన్, రూపాలి బ్యాంక్, అగ్రాని బ్యాంక్, ధన్మొండి క్లబ్ జట్లకు బెలాయిట్ ప్రాతినిథ్యం వహించాడు.ఇక రిటైర్ అయిన తర్వాత హుస్సేన్ మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించాడు. ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 81 లిస్ట్ A మ్యాచ్‌లు, ఓ టీ20 మ్యాచ్‌కు మ్యాచ్ రిఫరీగా పనిచేశాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ప్రాంతీయ అభివృద్ధి మేనేజర్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించాడు. ఆయన మృతి పట్ల పలువురు బంగ్లాక్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు. -
భారత్-బంగ్లాదేశ్ వైట్ బాల్ సిరీస్‌లపై నీలినీడలు?
ఈ ఏడాది ఆగస్టులో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన వైట్‌బాల్ సిరీస్‌లపై అనిశ్చితి నెలకొంది. తాజాగా ఈ సిరీస్‌లకు సంబంధించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చీఫ్ అమీనుల్ ఇస్లాం కీలక అప్డేట్ ఇచ్చారు. బంగ్లాదేశ్ పర్యటనకు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ(BCCI) ఇంకా ప్రభుత్వ అనుమతి కోసం వేచిచూస్తుందని అమీనుల్ ఇస్లాం తెలిపాడు.వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టులో భారత జట్టు మూడు టీ20, మూడు వన్డేల సిరీస్ కోసం బంగ్లాలో పర్యాటించాల్సి ఉంది. ఆగస్టు 17 నుంచి టీమిండియా టూర్ ప్రారంభమవ్వాల్సి ఉంది. కానీ బంగ్లాదేశ్-భారత్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ సిరీస్‌లు జరగడం అసంభవం అన్పిస్తోంది.అయితే బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ మాత్రం ఈ సిరీస్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆగస్టులో వీలుకాకపోయినా, తర్వాతైనా భారత జట్టు తమ దేశానికి రావాలని అతడు ఆశిస్తున్నాడు. "ఈ పర్యటనకు సంబంధించి మేము బీసీసీఐతో నిరంతరం చర్చలు జరుపుతున్నాము. వారు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో సిరీస్‌లను నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాము. ఒకవేళ ఇప్పుడు వీలుకాకపోతే తర్వాతైనా భారత్‌కు ఆతిథ్యమిస్తామన్న నమ్మకం మాకు ఉంది. భారత్ ఇంకా అధికారికంగా టూర్‌ను వాయిదా వేయలేదు. భారత జట్టు బంగ్లా పర్యటన అనేది ప్రభుత్వం నుండి అనుమతి లభించడంపై ఆధారపడి ఉందని" బోర్డు మీటింగ్ అనంతరం మీడియా సమావేశంలో అమీనుల్ పేర్కొన్నారు. కాగా భారత జట్టు వచ్చే నెలలో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లకపోతే, బీసీబీ ఐపీఎల్-2026 వేచి ఉండాల్సిందే. ఎందుకంటే వచ్చే ఏడాది జనవరిలో జరిగే టీ20 ప్రపంచకప్ వరకు టీమిండియా షెడ్యూల్ ముందుగానే ఫిక్స్ అయింది. పొట్టి ప్రపంచకప్ తర్వాత ఐపీఎల్ జరగనుంది. కాబట్టి వచ్చే ఏడాది ఐపీఎల్ తర్వాతే భారత జట్టుకు కాస్త సమయం లభిస్తోంది. టీమిండియా చివరగా 2022లో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు బంగ్లాలో పర్యటించింది.చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. ఇంగ్లండ్ మాస్టర్ ప్లాన్! అతడికి పిలుపు? -
ఊహించిందే జరిగింది.. కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన స్టార్ ప్లేయర్
అంతా ఊహించిందే జరిగిందే. బంగ్లాదేశ్ క్రికెట్లో కెప్టెన్‌గా నజ్ముల్ హొస్సేన్ శాంటో ప్రస్దానం ముగిసింది. ఇప్పటికే టీ20, వన్డే కెప్టెన్సీని కోల్పోయిన శాంటో.. ఇప్పుడు టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పుకున్నాడు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో ఓటమి అనంతరం షాంటో తన నిర్ణయాన్ని వెల్లడించాడు. బంగ్లా క్రికెట్ బోర్డుతో విభేదాల కారణంగా షాంటో ఈ నిర్ణయం తీసుకున్నాడు.టీ20 కెప్టెన్సీ నుంచి తనంతట తనే తప్పుకున్న శాంటో.. వన్డే, టెస్టుల్లో సారథిగా కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. కానీ బీసీబీ మాత్రం అతడికి ఊహించని షాకిచ్చింది. ఈ నెల 12న అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన బంగ్లా క్రికెట్ బోర్డు.. అనూహ్యంగా వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి షాంటోని తప్పించింది.అతడి స్ధానంలో స్టార్ ఆల్‌రౌండర్ మెహదీ హసన్‌కు తమ వన్డే కెప్టెన్‌గా బంగ్లా క్రికెట్ నియమించింది. అప్పటి నుంచి శాంటో బీసీబీ తీవ్ర ఆంసతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే షాంటో టెస్టు కెప్టెన్సీని కూడా వదులుకున్నాడు. "ఇది వ్యక్తిగతం కాదు. జట్టు శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా బంగ్లాదేశ్ డ్రెసింగ్స్ రూమ్‌లో భాగంగా ఉన్నాను. ముగ్గురు కెప్టెన్లు ఉండడం సమంజసం కాదని నేను భావిస్తున్నాను. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. దీనిపై బోర్డు ఆలోచన ఏంటో నాకు తెలియదు. ఏదేమైనప్పటికి వారి నిర్ణయానికి మద్దతు ఇస్తాను" అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో శాంటో పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్‌గా లిట్టన్ దాస్ ఉండగా.. వన్డే కెప్టెన్‌గా మెహదీ హసన్ ఇటీవలే ఎంపికయ్యాడు. ఇప్పుడు శాంటో రాజీనామా చేయడంతో టెస్టు కెప్టెన్‌గా ఎవరు బాధ్యతలు చేపడతారో వేచి చూడాలి. శ్రీలంకతో తొలి టెస్టును డ్రా గా ముగించిన బంగ్లా టైగర్స్.. రెండో టెస్టులో మాత్రం ఘోర ఓటమి చవిచూసింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-1తో బంగ్లాదేశ్ కోల్పోయింది.చదవండి: గెలిచిన మ్యాచ్‌లు కంటే ఓడిందే ఎక్కువ.. గంభీర్‌పై తీవ్ర ఒత్తిడి: ఆకాష్ -
బోర్డుతో విభేదాలు.. ఆ జట్టు కెప్టెన్ సంచలన నిర్ణయం?
బంగ్లాదేశ్ క్రికెట్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశముంది. శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ టెస్టు కెప్టెన్సీ నుంచి నజ్ముల్ హొస్సేన్ షాంటో తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన నిర్ణయాన్ని బంగ్లా క్రికెట్ బోర్డుకు షాంటో తెలియజేసినట్లు సమాచారం బంగ్లాదేశ్ ఆల్‌ఫార్మాట్ కెప్టెన్‌గా గతేడాది ఆరంభంలో షాంటో బాధ్యతలు చేపట్టాడు.కానీ ఏడాది కాలంలోనే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న షాంటో.. వన్డే, టెస్టుల్లో సారథిగా కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. కానీ బీసీబీ మాత్రం అతడికి ఊహించని షాకిచ్చింది. ఈ నెల 12న అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన బంగ్లా క్రికెట్ బోర్డు.. అనూహ్యంగా వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి షాంటోని తప్పించింది.అతడి స్ధానంలో స్టార్ ఆల్‌రౌండర్ మెహది హసన్ మిరాజ్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది. దీంతో బీసీబీ నిర్ణయం పట్ల షాంటో ఆసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రెడ్‌బాల్ కెప్టెన్సీ నుంచి కూడా వైదొలగాలని షాంటో యోచిస్తున్నట్లు క్రిక్‌బజ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది.కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగే రెండో టెస్టు అనంతరం దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. అయితే ఈ వార్తలపై బీసీబీ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ షాంటో సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 148 పరుగులు చేసిన షాంటో.. రెండో ఇన్నింగ్స్‌లో 125 రన్స్ చేశాడు. అయితే ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండో టెస్టు జూన్ 25 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: ఎప్పుడో నా కెరీర్ ముగిసిందన్నారు.. కానీ పదేళ్లు పూర్తి చేసుకున్నాను: బుమ్రా -
పాకిస్తాన్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్?.. భద్రతే ముఖ్యం..
ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన పాకిస్తాన్ క్రికెట్ (Pakistan Cricket) మళ్లీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. పాక్ జట్టు ఇటీవలి కాలంలో వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శల పాలైన విషయం తెలిసిందే. తరచూ కెప్టెన్లు, క్రికెట్ బోర్డు యాజమాన్యాన్ని మారుస్తూ ఒక దశ, దిశ లేకుండా కొట్టుమిట్టాడుతోంది.ఇటీవల సొంతగడ్డపై జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy 2025)లోనూ రిజ్వాన్ బృందం పేలవ ప్రదర్శన కనబరిచింది. గ్రూప్-ఎలో భాగంగా న్యూజిలాండ్, టీమిండియా చేతుల్లో ఓడి.. కనీసం సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలుద్దామనుకుంటే వర్షం వల్ల అదీ రద్దై పోవడంతో ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్‌కు అసలు గెలుపన్నదే లేకుండా పోయింది.పరిమిత ఓవర్ల సిరీస్‌లోనైనా గెలవాలని..ఈ క్రమంలో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో గెలిచి పరువు దక్కించుకోవాలని పాకిస్తాన్ క్రికెట్ జట్టు భావిస్తోంది. అయితే, ఇప్పట్లో అదీ జరిగేలా లేదు. కాగా.. ఉగ్రదాడుల నేపథ్యంలో సుదీర్ఘకాలం సొంతగడ్డపై క్రికెట్ మ్యాచ్‌లకు పాక్ జట్టు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి పరిస్థితులే ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి.నాడు శ్రీలంక జట్టుపై ఉగ్రవాదుల దాడికాగా 2009లో శ్రీలంక జట్టుపై పాకిస్తాన్లో ఉగ్రవాదులు దాడి చేయడంతో అంతర్జాతీయ జట్లు ఆ దేశంలో పర్యటించడాన్ని దాదాపు నిషేధించగా... ఇటీవలే పరిస్థితులు తిరిగి మెరువడంతో కొన్ని జట్లు పాకిస్తాన్లో పర్యటిస్తున్నాయి. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణతో పాకిస్తాన్లో క్రికెట్‌కు పూర్వవైభవం రావడం ఖాయమే అనుకుంటున్న దశలో... మరోసారి దీనికి బ్రేక్ పడేలా కనిపిస్తోంది.ఆపరేషన్ సిందూర్‌తో పాక్ గజగజజమ్మూకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం గట్టిగా బదులిస్తోంది.‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్తాన్‌లోని పలు ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. ఇందుకు బదులుగా పాకిస్తాన్ ప్రతిదాడులు ప్రారంభించగా... భారత సాయుధ బలగాలు వాటిని బలంగా తిప్పికొట్టాయి.5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసంఈ నేపథ్యంలో అతిత్వరలో పాకిస్తాన్లో పర్యటించాల్సి ఉన్న బంగ్లాదేశ్ జట్టు... ఈ పర్యటనపై పునరాలోచనలో పడింది. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలించడంతో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో నిరంతరం చర్చిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటనలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనున్నాయి.ఆటగాళ్ల భద్రతే ముఖ్యం‘ఆటగాళ్ల భద్రతే అన్నిటికంటే ముఖ్యం. పాకిస్తాన్ బోర్డుతో చర్చిస్తున్నాం. ఏ నిర్ణయమైనా త్వరలోనే వెల్లడిస్తాం’ అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు బంగ్లాదేశ్ జట్టు ఈ నెల 17 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. మరోవైపు పాకిస్తాన్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ నిలిచిపోగా... అందులో పాల్గొంటున్న రిషాద్ హుసేన్, నహీద్ రాణా ఇప్పటికే బంగ్లాదేశ్‌కు చేరుకున్నారు. చదవండి: క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్లు! -
బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో రాజీనామా..
బంగ్లాదేశ్ క్రికెట్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్సీకి నజ్ముల్ హొస్సేన్ శాంటో రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ అధికారికంగా ధ్రువీకరించింది. కాగా దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ తర్వాత అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి షాంటో వైదొలగాలని నిర్ణయించుకున్నాడు.కానీ ఆ సమయంలో బీసీబీ అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్ విదేశాల్లో ఉండడంతో షాంటో రాజీనామాపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఆ తర్వాత ఫరూక్ అహ్మద్‌తో చర్చలు జరిపిన అనంతరం షాంటో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. బీసీబీ చీఫ్ సూచన మెరకు కెప్టెన్‌గా కొనసాగేందుకు అతడు ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో గత నవంబరలో యూఏఈ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో బంగ్లా కెప్టెన్‌గా వ్యవహరించిన షాంటో దురదృష్టవశాత్తూ గాయపడ్డాడు. దీంతో ఆ సిరీస్ మధ్యలోనే వైదొలిగిన నజ్ముల్ హొస్సేన్.. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యాడు.షాంటో తన గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతడు త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు నజ్ముల్ హొస్సేన్ శాంటో మరోసారి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. వర్క్‌లోడ్ కారణంగా టీ20 నుంచి కెప్టెన్సీ నుంచి అతడు వైదొలగాలని ఫిక్స్ అయ్యాడు."నజ్ముల్ హొస్సేన్ శాంటో తన తుది నిర్ణయాన్ని వెల్లడించాడు. బంగ్లా టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. అతడి రాజీనామాను మేము అంగీకరించాము. ప్రస్తుతం మా షెడ్యూల్ ఎటువంటి టీ20 సిరీస్‌లు లేవు. ఈ నేపథ్యంలో మా కొత్త కెప్టెన్ కోసం వెతకడం లేదు. షాంటో గాయం నుంచి త్వరగా కోలుకుంటే అతడే వన్డేలు, టెస్టుల్లో మా జట్టుకు నాయకత్వం వహిస్తాడు. ఈ విషయం ఇప్పటికే అతడితో చర్చించాము" అని బీసీబీ అధికారి ఒకరు పేర్కొన్నారు.చదవండి: IND vs AUS 5th Test: రోహిత్ శర్మపై వేటు.. భారత కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా!? -
షకీబ్ భద్రత మా చేతుల్లో లేదు: బీసీబీ చైర్మెన్
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ అంతర్జాతీయ టీ20లకు విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాన్పూర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షకీబ్ తన భద్రత గురుంచి కీలక వ్యాఖ్యలు చేశాడు. "బంగ్లాలో నా చివరి టెస్టు ఆడాలని ఉంది. భారత్ నుంచి అక్కడకు వెళ్లేందకు నాకు ఎలాంటి సమస్య ఎదురుకాకపోవచ్చు. కానీ అక్కడ వెళ్తే బయటకు వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. నా స్నేహితులు, కుటుంబసభ్యులు నా భద్రతపై ఆందోళనతో ఉన్నారు అని షకీబ్ పేర్కొన్నాడు. తాజాగా ఇదే విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్ స్పందించాడు. షకీబ్ భద్రతకు బోర్డు ఎటువంటి హామీ ఇవ్వలేదని ఫరూక్ అహ్మద్ స్పష్టం చేశాడు."షకీబ్ భద్రత ఆంశం మా చేతుల్లో లేదు. బోర్డు ఎవరికీ వ్యక్తిగతంగా భద్రతను అందించదు. అతడు తన నిర్ణయాన్ని వెల్లడించాడు. అతడి భద్రత విషయంపై ప్రభుత్వ అత్యున్నత స్థాయి వర్గాలు స్పందిస్తాయి. బీసీబీ.. పోలీసు లేదా రాపిడ్ యాక్షన్ బెటాలియన్ వంటి భద్రతా ఏజెన్సీ కాదు. మేము ఈ విషయం గురించి ప్రభుత్వంలో ఎవరితోనూ చర్చించలేదు. స్వదేశంలో తన చివరి టెస్టు అతడు ఆడవచ్చు. అందుకు ఎటువంటి సమస్య లేదు. షకీబ్ తన జీవితంలో ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. అతడితో తన రిటైర్మెంట్ విషయం గురించి ఇంకా మాట్లాడలేదు. రిటైరయ్యేందుకు ఇదే సరైన సమయమని భావించాడు. అతడి నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాము" అని ఫరూక్ పేర్కొన్నారు -
టీమిండియాతో సిరీస్.. బంగ్లా క్రికెట్లో కీలక పరిణామం
టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్ క్రికెట్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) డైరెక్టర్ పదవికి మాజీ కెప్టెన్ ఖలీద్ మహమూద్ రాజీనామా చేశాడు. దేశంలో రాజకీయ మార్పుల కారణంగా అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే బంగ్లాలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీబీ ప్రెసిడెంట్ పదవి నుంచి నజ్ముల్ హసన్ సైతం వైదొలిగాడు. అతడి స్ధానంలో మాజీ క్రికెటర్ ఫరూఖ్ అహ్మద్ బాధ్యతలు చేపట్టాడు. ఇప్పుడు ఖలీద్ వంతు వచ్చింది. కాగా 2013లో గాజీ అష్రఫ్ హుస్సేన్‌ను ఓడించి తొలిసారిగా డైరెక్టర్‌గా ఎన్నికైన మహమూద్.. వరుసగా మూడు పర్యాయాలు ఆ పదవిలో కొనసాగారు. తన పదవీకాలంలో బంగ్లా క్రికెట్ అభివృద్దికి మహమూద్ ఎంతగానో కృషి చేశాడు. చాలా ఏళ్ల పాటు బీసీబీ గేమ్ డెవలప్మెంట్ కమిటీకి ఛైర్మన్‌గా పనిచేశాడు. యువ క్రికెటర్లను తయారు చేయడంలో అతడిది కీలక పాత్ర. ఖలీద్ హయాంలోనే యువ బంగ్లా జట్టు 2020లో భారత్‌ను ఓడించి అండర్19 ప్రపంచ కప్ గెలుచుకుంది. కాగా నజ్ముల్ హసన్, ఖలీద్ బాటలోనే మరికొందరు ప్రయాణించనున్నట్లు తెలుస్తోంది. బోర్డు డైరెక్టర్లు షఫియుల్ ఆలం చౌదరి, నైమూర్ రెహమాన్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక భారత్-బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.చదవండి: AUS vs ENG: హెడ్ విధ్వంసం.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్ -
షకీబ్ అల్ హసన్‌పై మర్డర్ కేసు.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు నోటీసులు
బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు షకీబ్ అల్ హసన్‌పై హత్య కేసు నమోదైంది. బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న వేళ ఆగస్టు 7న తమ కుమారుడు రూబెల్ హత్యకు గురయ్యాడని రఫీకుల్ ఇస్లాం అనే వ్యక్తి ఢాకాలోని అడబోర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో షకీబ్ 28వ నిందితుడిగా ఉన్నాడు. నిందితుల జాబితాలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పేరు కూడా ఉంది. ఈ కేసులో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు లీగల్ నోటీసులు అందాయి. బాధితుల తరఫు లాయర్లు షకీబ్‌ను తక్షణమే జట్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. షకీబ్‌పై కేసు విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని బీసీబీ అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్ తెలిపాడు. ప్రస్తుతం షకీబ్ పాకిస్తాన్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా పాక్‌పై బంగ్లాదేశ్ సాధించిన సంచలన విజయంలో షకీబ్ కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో షకీబ్ నాలుగు వికెట్లు తీసి బంగ్లాదేశ్ చారిత్రక విజయానికి దోహదపడ్డాడు.కాగా, రావల్పిండి వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 565 పరుగులు చేసి ఆలౌటైంది.సెకెండ్ ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్లు చెలరేగడంతో పాక్ 146 పరుగులకే ఆలౌటైంది. 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగస్ట్ 30న ఇదే వేదికగా జరుగనుంది.స్కోర్ వివరాలు..పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ 448/6 (సౌద్ షకీల్ 141, మొహమ్మద్ రిజ్వాన్ 171 నాటౌట్, హసన్ మహమూద్ 2/70)బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 565 (ముష్ఫికర్ అహ్మద్ 191, షడ్మాన్ ఇస్లాం 93, నసీం షా 3/93)పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ 146 (మొహమ్మద్ రిజ్వాన్ 51, మెహిది హసన్ 4/21)బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 30/0 (జకీర్ హసన్ 15 నాటౌట్) -
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడి రాజీనామా.. కొత్త చీఫ్‌గా మాజీ క్రికెటర్
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్ష పదవికి నజ్ముల్ హసన్ రాజీనామా చేశాడు. కొత్త అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ ఫరూఖ్ అహ్మద్ ఎన్నికయ్యాడు. కొత్త అధ్యక్షుడు ఎన్నికైన విషయాన్ని బీసీబీ అంపైర్ల కమిటీ ప్యానెల్ చైర్మన్ ఇఫ్తికార్ అహ్మద్ ధృవీకరించాడు. దేశంలో విద్యార్థుల నిరసనల నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ దేశం విడిచి వెళ్లిపోయినట్లు ఇఫ్తికార్ తెలిపాడు. కొత్త అధ్యక్షుడు ఫరూఖ్ బంగ్లాదేశ్ తరఫున ఏడు వన్డేలు ఆడాడు. అలాగే 200-07, 2013-16 మధ్యలో రెండుసార్లు జాతీయ చీఫ్ సెలెక్టర్‌గా పని చేశాడు. కాగా, బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నిరసనల నేపథ్యంలో మాజీ అధ్యక్షురాలు షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆమె అనంతరం బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి కారణంగా టీ20 మహిళల వరల్డ్‌కప్ యూఏఈకి తరలిపోయింది. -
డిప్రెషన్‌తో బాధపడుతున్నా.. నన్ను సెలక్ట్ చేయవద్దు: స్టార్ క్రికెటర్
పాకిస్తాన్ పర్యటనకు ముందు బంగ్లాదేశ్ క్రికెట్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ సైఫుద్దీన్ మానసిక సమస్యల కారణంగా రెండు నెలల పాటు అన్ని రకాల క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.ఈ క్రమంలో తన నిర్ణయాన్ని సైఫుద్దీన్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు తెలియజేసినట్లు క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది. రెండు నెలల పాటు తనని ఏ ఫార్మాట్‌కు ఎంపిక చేయవద్దని బోర్డుకు అతడు అభ్యర్ధించినట్లు సమాచారం. బీసీబీ కూడా అతడి అభ్యర్ధన పట్ల సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.కాగా ఈ నెలలో బంగ్లాదేశ్ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు పాకిస్తాన్‌కు వెళ్లనుంది. ఆగస్టు 21 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. సీనియర్ జట్టు కంటే ముందు బంగ్లాదేశ్-ఎ జట్టు పాక్ గడ్డపై అడుగుపెట్టనుంది. ఈ టూర్లో భాగంగా బంగ్లా ఎ జట్టు.. . పాకిస్తాన్ షహీన్స్‌తో రెండు నాలుగు రోజుల అనాధికారిక టెస్టులు, మూడు వన్డేలలో తలపడనుంది. అయితే ఈ టూర్‌కు ఎంపిక చేసిన బంగ్లా ఎ జట్టులో సైఫుద్దీన్‌కు సెలక్టర్లు చోటిచ్చారు. ఈ సిరీస్‌లో అతడి ప్రదర్శనను పరిగణలోకి తీసుకోని పాక్‌తో టెస్టులకు ఎంపిక చేయాలని బంగ్లా సెలక్టర్లు భావించరంట. కానీ అంతలోనే డిప్రెషన్ కారణంగా సైఫుద్దీన్ తప్పుకున్నాడు.కాగా టీ20 వరల్డ్‌కప్-2024 బంగ్లాదేశ్ జట్టులో సైఫుద్దీన్‌కు చోటు దక్కలేదు. టీ20 క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటకి సెలక్టర్లు మాత్రం అతడి స్ధానంలో తాంజిమ్ హసన్ షకీబ్‌కు ఛాన్స్ ఇచ్చారు. అప్పటి నుంచి సైఫుద్దీన్ మానసికంగా కాస్త ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే రెండు నెలల పాటు అతడు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.చదవండి: ప్రపంచం ఏం అంతం కాదు.. నిజంగా అదో పెద్ద జోక్: రోహిత్ శర్మ -
బంగ్లాదేశ్‌కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు.. ఎవరంటే?
బంగ్లాదేశ్ పురుషల క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ నజ్ముల్ హుస్సేన్ శాంటో ఎంపికయ్యాడు. మూడు ఫార్మాట్లలో తమ జట్టు పగ్గాలను అప్పగిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. కాగా టెస్టు, టీ20ల్లో కెప్టెన్‌గా ఉన్న షకీబ్ అల్ హసన్ రాజకీయాలపై దృష్టి సారించడంతో.. అతడి రీ ఎంట్రీ అనిశ్చతి నెలకొంది. షకీబ్ ప్రస్తుతం కంటి సమస్యతో కూడా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో త్వరలో జరగనున్న శ్రీలంకతో వైట్‌బాల్ సిరీస్‌కు షకీబ్ దూరమయ్యాడు. మరోవైపు స్టార్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటకి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతాడన్నది అనుమానమే. కాగా వన్డే వరల్డ్‌కప్-2023కు ముందు బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్సీ నుంచి తమీమ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షకీబ్‌ను వన్డే కెప్టెన్‌గా బీసీబీ నియమించింది. అయితే వరల్డ్‌కప్ అనంతరం షకీబ్ కూడా బంగ్లా వన్డే, టీ20 జట్టు కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేశాడు. కేవలం టెస్టుల్లో మాత్రమే కొనసాగతానని షకీబ్ తెలిపాడు. అయితే షకీబ్ ఇప్పటిలో రీ ఎంట్రీ ఇచ్చేలా కన్పించడం లేదు. ఈ నేపథ్యంలోనే శాంటోను మూడు ఫార్మట్లలో ఏడాది పాటు కెప్టెన్‌గా బీసీబీ నియమించింది. కాగా శాంటోకు కెప్టెన్‌గా అనుభవం ఉంది. గతేడాది సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బంగ్లా జట్టుకు శాంటో సారథ్యం వహించాడు. అతడి నాయకత్వంలోని బంగ్లా జట్టు సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించింది. అంతకుముందు వన్డే వరల్డ్‌కప్‌లోనూ షకీబ్ గైర్హజరీలో శాంటో జట్టు పగ్గాలను చేపట్టాడు. అతని సారథ్యంలో బంగ్లాదేశ్ 11 మ్యాచ్‌లు ఆడగా.. మూడింట గెలిచింది. సొంతగడ్డపై మార్చిలో శ్రీలంకతో బంగ్లాదేశ్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్‌తో బంగ్లా ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా శాంటో ప్రయాణం ప్రారంభం కానుంది. -
'ఈ డర్టీ గేమ్‌లో నాకు ఆడాలని లేదు.. కావాలనే నన్ను తప్పించారు'
వన్డే ప్రపంచకప్-2023కు తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జట్టులో మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్భాల్‌కు చోటు దక్కపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌కు, ఇక్భాల్‌కు మధ్య విభేదాలు తారాస్ధాయికి చేరినట్లు తెలుస్తోంది. గాయంతో బాధపడుతున్న తమీమ్‌ను వరల్డ్‌కప్‌కు ఎంపిక చేస్తే టోర్నీ నుంచి తప్పుకుంటానని బీసీబీని షకీబ్ బెదిరించినట్లు పలు రిపోర్టులు పేర్కొన్నాయి. కాగా వెన్ను గాయం నుంచి కోలుకుని న్యూజిలాండ్ సిరీస్‌తో తమీమ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. అంతకంటే ముందు అన్నిఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తమీమ్.. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా జోక్యం చేసుకోవడంతో అతడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. వరల్డ్‌కప్‌లో ఆడాలని నిర్ణయించకున్నాడు. కానీ అనుహ్యంగా అతడికి ఏకంగా వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కలేదు. అవన్నీ రూమర్సే ఇక తమీమ్- షకీబ్ విభేదాల వార్తలపై స్పందించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ సెలక్ర్ మిన్షాజుల్ అబేదిన్ అవన్నీ రూమర్సే అని కొట్టిపారేశాడు. "తమీమ్ ఇక్బాల్ చాలా కాలంగా గాయంతో సతమతమవుతున్నాడు. అతను న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ ఒకే మ్యాచ్ ఆడి, ఇబ్బంది పడుతున్నానని చెప్పాడు. అతడి గాయాన్ని దృష్టిలో పెట్టుకుని వరల్డ్‌కప్ ఎంపిక చేయలేదని అబేదిన్ తెలిపాడు. అంతేకాకుండా తమీమ్‌ను సంప్రదించే ఈ నిర్ణయం తీసుకన్నామని ఆయన అన్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై తమీమ్ ఇక్భాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ చెత్త ఆటలో తను బాగం కాకూడదనుకుంటానని తమీమ్ తెలిపాడు. కావాలనే నన్ను తప్పించారు.. "వరల్డ్‌కప్ జట్టు ఎంపిక ముందు బంగ్లా క్రికెట్ బోర్డు సీనియర్ అధికారి ఒకరి నుంచి నాకు ఫోన్ వచ్చింది. వరల్డ్‌కప్ కోసం జట్టుతో కలిసి నేను భారత్‌కు వెళ్తానని ఆయన చెప్పారు. నా ఫిట్నెస్ను మరోసారి ఆయన నిరూపించుకోమన్నారు. అదేవిధంగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు దూరంగా ఉండమని ఆయన సలహా ఇచ్చారు. అందుకు బదులుగా వరల్డ్‌కప్‌కు ఇంకా 10 నుంచి 15 రోజుల సమయం ఉంది, అయినా నేను పూర్తి ఫిట్నెస్తో ఉన్నప్పటికీ తొలి మ్యాచ్ ఎందుకు ఆడకూడదని ప్రశ్నించాను. దీంతో ఒక వేళ మీరు జట్టులో ఉంటే బ్యాటింగ్ ఆర్డర్ మార్చాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఒక్కసారిగా అతను ఏమి మాట్లాడాతున్నారో నాకు అర్ధం కాలేదు. వెంటనే నేను పూర్తిగా పాజిటివ్ మైండ్‌తో ఉన్నా. కొన్ని రోజుల తర్వాత న్యూజిలాండ్‌పై మంచి ఇన్నింగ్స్ ఆడాను. ఒక్కసారిగా నా బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంటని ఆయనతో అన్నాను. నేను గత 17 ఏళ్లగా ఓపెనింగ్ స్ధానంలోనే ఆడుతున్నాను. ఎప్పుడూ మూడు లేదా నాలుగో స్ధానంలో బ్యాటింగ్ చేయలేదు. అటువంటి అప్పుడు నా బ్యాటింగ్ ఆర్డర్ ఎలా మారుస్తారు. మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేసిన అనుభవం నాకు లేదు. ఫిజియో రిపోర్ట్ ప్రకారం.. నా ఫిట్నెస్ లెవల్స్ నాకు తెలుసు. కివీస్ తొలి వన్డే, రెండో వన్డే తర్వాత నేను కాస్త నొప్పితో బాధపడ్డా. అది వాస్తవం. కానీ రెండు రోజుల విశ్రాంతి తర్వాత మళ్లీ ఆఖరి వన్డేకు జట్టు సెలక్షన్‌కు నేను అందుబాటులోకి వచ్చా. కానీ జట్టు వైద్య సిబ్బంది విశ్రాంతి తీసుకుంటే బాగుటుందని సూచించారు. వరల్డ్‌కప్‌లో ప్రతీ మ్యాచ్‌కు దాదాపు రెండు రోజుల విశ్రాంతి లభిస్తోంది. నాకు అది చాలు . ఇప్పటికే నేను దాదాపు 10 వారాల పాటు రిహాబిలేటేషన్లో ఉన్నా. ఉద్దేశ్వపూర్వకంగానే నన్ను జట్టు నుంచి తప్పించారు అని తమీమ్ సోషల్ మీడియాలో ఓ వీడియో సందేశాన్ని పోస్ట్చేశాడు. చదవండి: IND Vs AUS 3rd ODI: అభిమానుల మనసు గెలుచుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్ -
టీమిండియాపై అద్భుత ప్రదర్శన.. బంగ్లాదేశ్ జట్టుకు భారీ నజరానా! ఎంతంటే?
స్వదేశంలో భారత మహిళల జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌ను 1-1తో బంగ్లాదేశ్ డ్రాగా ముగించిన సంగతి తెలిసిందే. ఢాకా వేదికగా జరిగిన ఆఖరి వన్డే టై కావడంతో ట్రోఫీని ఇరు జట్లు సంయుక్తంగా పంచుకున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. టీమిండియా వంటి పటిష్ట జట్టుపై అద్బుత ప్రదర్శరన కనబరిచిన తమ జట్టుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారీ నజరానా ప్రకటించింది. తమ మహిళల జట్టుకు 35 లక్షల టాకాలు(భారత కరెన్సీలో సూమారు రూ.27 లక్షలు) ఇవ్వనున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. అదే విధంగా వన్డేల్లో బంగ్లాదేశ్ మహిళల జట్టు తరపున తొలి సెంచరీ సాధించిన ఫర్గానా హోక్‌పై బీసీబీ ఛీప్ నజ్ముల్ హసన్ పాపోన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఫర్గానా అద్బుతమైన బ్యాటర్ అని, బంగ్లా క్రికెట్‌ను మరో స్ధాయికి తీసుకువెళ్తుందని అతడు కొనియాడాడు. "సాధారణంగా మేము సిరీస్ గెలిస్తే మా జట్లకు బోనస్ ఇస్తాం. కానీ భారత్‌తో సిరీస్ డ్రా అయినప్పటికీ మా జట్టుకు రివార్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ సిరీస్‌లో సిరీస్‌లో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా భారత్‌పై మేము తొలి వన్డే విజయం సాధించాము. అదే విధంగా సెంచూరియన్ ఫర్గానా హోక్ వంటి వ్యక్తిగత ప్రదర్శనలు కూడా ఉన్నాయి. అందుకే మా ప్లేయర్స్‌కు 25 లక్షల టాకాలు ఇవ్వాలని అనుకుంటున్నాం. అదేవిధంగా సెంచరీతో చెలరేగిన ఫర్గానా 2 లక్షల టాకాలు, వ్యక్తిగత ప్రదర్శన మిగితా ప్లేయర్స్‌కు రివార్డు ఇవ్వనున్నాం. మరోవైపు కోచింగ్ స్టాప్‌ను కూడా ఇందులో భాగం చేయాలి అనకుంటున్నాం. మొత్తంగా 35 లక్షల టాకాలు రివార్డు రూపంలో ఇవ్వనున్నాం" అని నజ్ముల్ హసన్ పాపోన్ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు. -
'డేర్ అండ్ డాషింగ్' హర్మన్‌ప్రీత్.. కుండ బద్దలయ్యేలా!
టీమిండియా మహిళల కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఎంత డేర్ అండ్ డాషింగ్‌గా ఉంటుందో మరోసారి చూపించింది. తాను చెప్పాలనుకున్నది సూటిగా స్పష్టంగా మొహంమీద చెప్పడం ఆమె నైజం. ఇదే ఆమెను అందరిలో స్పెషల్‌గా నిలిపింది. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి వన్డేలో అంపైరింగ్ ప్రమాణాలపై అసహనం వ్యక్తం చేసింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ట్రోఫీ అందుకోవడానికి ముందు మాట్లాడుతూ.. ''ఈ మ్యాచ్‌తో మేం చాలా నేర్చుకున్నాం. అంపైరింగ్ ప్రమాణాలను కూడా చూశాం. చాలా ఘోరంగా ఉంది. మేం మళ్లీ బంగ్లాదేశ్‌కు వచ్చినప్పుడు దాని కోసం కూడా సిద్ధమై రావాలేమో. ఇక మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఇండియన్ హైకమీషన్‌కు కనీసం స్వాగతం పలకలేదు. బంగ్లాదేశ్ క్రికెట్లో అంపైరింగే అనుకున్నాం.. కనీస మర్యాదలకు కూడా చోటు లేదు. మీరు మ్యాచ్‌కు వచ్చినందుకు మా ఇండియన్ టీమ్ తరపున హైకమీషన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.'' అంటూ పేర్కొంది. Indian Captain Harmanpreet Kaur blasts Bangladesh Cricket board, calls the umpiring and management pathetic. She also exposed the board for insulting the members of the Indian high commission by not inviting them on the stage. Sherni standing up for 🇮🇳 without any fear. pic.twitter.com/HNHXB3TvdW — Roshan Rai (@RoshanKrRaii) July 22, 2023 హర్మన్‌ప్రీత్ చేసిన వ్యాఖ్యలు టీమిండియా అభిమానులను ఆకట్టుకున్నాయి. ''బహుశా పురుషుల క్రికెట్లో కూడా ఇంత ధైర్యంగా మాట్లాడే సాహసం ఎవరు చేయలేదనుకుంటా. కానీ హర్మన్‌ప్రీత్ అలా కాదు.. తాను ఏం చెప్పాలనుకుందో అది స్పష్టంగా, ముక్కుసూటిగా చెబుతుంది.. అందుకే ఆమెంటే మాకు గౌరవం'' అంటూ కామెంట్ చేశారు. తప్పుడు నిర్ణయం.. అంపైర్‌పై కోపంతో బంగ్లాదేశ్ బౌలర్ నహిదా అక్తర్ వేసిన 34 ఓవర్లో నాలుగో బంతికి భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ స్వీప్ షాట్ ఆడింది. అయితే, బంతి బ్యాట్‌కు తగలకుండా.. ప్యాడ్‌కు తగిలింది. బంగ్లా ప్లేయర్లు అప్పీల్ చేయగా.. అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఔట్ ఇచ్చాడు. బంతికి లెంగ్ స్టంప్ అవతల పిచ్ అయిందని, నాటౌట్ అని హర్మన్ భావించింది. దీంతో అంపైర్ నిర్ణయంపై ఆగ్రహించిన హర్మన్.. బ్యాట్‌తో వికెట్లను కొట్టింది. కనీస ధర్మాన్ని పాటించడం లేదంటూ అంపైర్‌ను తిట్టుకుంటూ పెవిలియన్ వైపు వెళ్లింది. ఈ సమయంలో బంగ్లా అభిమానుల్లో కొంతమంది ఆమెను రెచ్చగొట్టే ప్రయత్నం చేయగా.. హర్మన్‌ప్రీత్ వ్యంగ్యంగా వారికి బొటనవేలు చూపించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The controversial dismissal of Harmanpreet Kaur #CricketTwitter #BANvIND pic.twitter.com/XEGdTMgRJd — Female Cricket (@imfemalecricket) July 22, 2023 చదవండి: IND vs BAN: కోపంతో ఊగిపోయిన టీమిండియా కెప్టెన్.. బ్యాట్‌తో వికెట్లను కొట్టి! వీడియో వైరల్ -
ఐపీఎల్లో ఆడనందుకు రివార్డు.. ఆ ముగ్గురికీ బోనస్
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగం కావాలని ప్రపంచంలో ప్రతీ ఒక్క క్రికెటర్ కోరుకుంటాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అదే విధంగా ఎంతోమంది అనామకులను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత కూడా ఐపీఎల్‌కు ఉంది. ఇటువంటి క్యాష్‌రిచ్ లీగ్‌లో భాగమయ్యే అవకాశాన్ని ఏ ఆటగాడు వదులుకోవడానికి ఇష్టపడడు. కానీ బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు మాత్రం ఐపీఎల్ కంటే తమ జాతీయ జట్టుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఐపీఎల్ ఆఫర్‌ను వదులుకున్న బంగ్లాదేశ్ ఆటగాళ్లు షకీబ్ అల్హసన్, లిటన్ దాస్, టాస్కిన్ అహ్మద్‌లకు ఆ దేశ క్రికెట్ రివార్డు ప్రకటించింది. ఈ ముగ్గురికీ కలిపి 65 వేల డాలర్లు (దాదాపు 53 లక్షలు) బీసీబీ రివార్డుగా ఇవ్వనుంది. కాగా ఐపీఎల్ 2023 మినీ వేలంలో బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌ని బేస్ ప్రైజ్ రూ.1.5 కోట్లకు కొనుగోలు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. అయితే ఐర్లాండ్‌తో టెస్టు సిరీస్ కారణంగా షకీబ్ అల్హసన్ ఐపీఎల్-2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అదే విధంగా లిటన్ దాస్ కూడా ఐర్లాండ్ సిరీస్ కారణంగా ఈ ఏడాది సీజన్ ఫస్ట్‌హాఫ్‌లో ఆడలేదు. ఆ తర్వాత ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో ఆడేందుకు వచ్చిన కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడి స్వదేశానికి వెళ్లిపోయాడు. అతడిని రూ.50 లక్షలకు కేకేఆరే సొంతం చేసుకుంది. మరోవైపు గాయం కారణంగా ఐపీఎల్ సెకెండ్ హాఫ్‌కు దూరమైన లక్నో ఫాస్ట్ బౌలర్ స్ధానంలో టాస్కిన్ అహ్మద్‌కు ఆ ఫ్రాంచైజీ నుంచి పిలుపు వచ్చిందంట. అయితే బంగ్లా క్రికెట్ బోర్డు అనుమతి ఇవ్వకపోవడంతో లక్నో ఆఫర్‌ను టస్కిన్ అహ్మద్ తిరష్కరించినట్లు సమాచారం. ఇక వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023 ఫైనల్‌ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యారు. చదవండి: ఆ రెండు మ్యాచులు గెలిస్తే.. వరల్డ్ కప్ టీమిండియాదే: సునీల్ గవాస్కర్ -
టీమిండియాతో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్ కెప్టెన్‌గా లిటన్ దాస్
టీమిండియాతో వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్ రెగ్యూలర్ కెప్టెన్ తమీమ్ ఇక్భాల్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. దీంతో తమీమ్ స్ధానంలో కెప్టెన్‌గా ఆ జట్టు వికెట్ కీపర్- బ్యాటర్ లిటన్ దాస్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నియమించింది. కాగా లిట్టన్ దాస్‌కు కెప్టెన్‌గా అంత అనుభవం లేదు. అంతకుముందు ఒకే ఒక టీ20 మ్యాచ్‌లో బంగ్లా జట్టుకు సారథ్యం వహించాడు. "లిటన్ దాస్ మా జట్టులో అనుభవజ్ఞుడైన ఆటగాళ్లలో ఒకడు. అదే విధంగా అతడు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్‌ను కూడా కలిగిఉన్నాడు. అయితే ముఖ్యమైన ఈ సిరీస్‌కు తమీమ్ దూరం కావడం చాలా దురదృష్టకరం. గత రెండేళ్లలో అతడి సారథ్యంలో మా జట్టు అద్భుతంగా రాణిస్తోంది. అదే విధంగా వన్డే ఫార్మాట్లో తమీమ్ అత్యుత్తమ ఆటగాడు" అని బీసీబీ క్రికెట్ ఆపరేషన్ చైర్మన్ జలాల్ యూనస్ పేర్కొన్నారు. కాగా హోం సిరీస్‌లో భాగంగా భారత్‌తో బంగ్లాదేశ్ మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఆదివారం(డిసెంబర్ 4)న జరగనున్న తొలి వన్డేతో భారత పర్యటన ప్రారంభం కానుంది. భారత్‌తో వన్డేలకు బంగ్లా జట్టు: లిట్టన్ కుమార్ దాస్(కెప్టెన్), అనముల్ హక్ బిజోయ్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొస్సేన్, యాసిర్ అలీ చౌదరి, మెహిదీ హసన్ మిరాజ్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, ఎబాడోత్ హుస్సేన్, నసుమ్ అహ్మద్,జ్ముల్ హుస్సేన్ శాంటో,మహ్మదుల్లా,నూరుల్ హసన్ సోహన్ చదవండి: IND vs BAN: టీమిండియాతో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్‌కు ఊహించని షాక్! ఇక అంతే సంగతి -
ఏడేళ్ల తర్వాత బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా..!
ఈ ఏడాది డిసెంబర్లో బంగ్లాదేశ్ పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా.. అతిథ్య బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. భారత పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ గురువారం ప్రకటించింది. డిసెంబర్ 4న ఢాకా వేదికగా జరగనున్న తొలి వన్డేతో భారత్ టూర్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు కూడా ఢాకా వేదికగానే జరగనున్నాయి. అనంతరం డిసెంబర్ 14 చటోగ్రామ్ వేదికగా తొలి టెస్టు.. డిసెంబర్ 22 ఢాకాలో రెండో టెస్టు జరగనుంది. కాగా భారత జట్టు దాదాపు ఏడేళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కు టూర్‌కు వెళ్లనుండడం గమనార్హం. టీమిండియా చివరిసారిగా 2015లో బంగ్లా పర్యటనకు వెళ్లింది. మరోవైపు బంగ్లాదేశ్ పర్యటకు భారత్ జట్టు రానుండడం తమకు ఎంతో సంతోషంగా ఉంది అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ అన్నారు. "బంగ్లాదేశ్- భారత్ మధ్య మరో చిరస్మరణీయమైన సిరీస్ కోసం ఇరు దేశాల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేము షెడ్యూల్‌ను ఫిక్స్ చేయడంలో మా క్రికెట్ బోర్డుకు సహకరించినందుకు బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి)కి ధన్యవాదాలు. బంగ్లాదేశ్‌కు వచ్చే భారత జట్టును స్వాగతించేందుకు ఎదురుచూస్తున్నాం’’ అని బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ పేర్కొన్నారు. చదవండి: T20 World Cup 2022: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. మెల్బోర్న్కు చేరుకున్న టీమిండియా -
Asia Cup 2022: బంగ్లాదేశ్ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్!
Asia Cup 2022- T20 World Cup 2022: ఆసియా కప్-2022, టీ20 ప్రపంచకప్-2022 టోర్నీల నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా ఈవెంట్ల కోసం టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీధరన్ శ్రీరామ్‌ను కోచ్‌గా నియమించినట్లు సమాచారం. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ వెల్లడించినట్లు ది డైలీ స్టార్ తన కథనంలో పేర్కొంది. ‘‘అవును.. ప్రపంచకప్ ఈవెంట్ వరకు మేము శ్రీరామ్‌తో కలిసి పనిచేయబోతున్నాం. ఆసియా కప్ నుంచి సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. మా ప్రధాన లక్ష్యం టీ20 ప్రపంచకప్. నిజానికి... వరల్డ్‌కప్ టోర్నీ సమయంలో ఈ నియామకం జరిగినట్లయితే.. అప్పటికప్పుడు పరిస్థితులను అర్థం చేసుకుని జట్టుతో మమేకమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి.. ఆసియా కప్ ఈవెంట్ నుంచే జట్టుతో కలిసేలా ప్రణాళికలు వేశాం’’ అని సదరు అధికారి పేర్కొన్నట్లు డైలీ స్టార్ తెలిపింది. మరి పాత కోచ్? అదే విధంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు శ్రీరామ్ నియామకం నేపథ్యంలో ప్రస్తుత కోచ్ రసెల్ డొమింగో బంగ్లాదేశ్ టెస్టు జట్టుకు మార్గదర్శనం చేస్తాడని తెలిపినట్లు పేర్కొంది. కాగా చెన్నైకి చెందిన శ్రీధరన్ శ్రీరామ్ లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా ఎదిగాడు. 2000- 2004 మధ్య కాలంలో టీమిండియా తరఫున ఎనిమిది వన్డేలు ఆడిన అతడు కోచింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. ఆసీస్‌ను విజేతగా నిలపడంలో! ఈ క్రమంలో ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించి.. అష్టన్ అగర్, ఆడం జంపా వంటి యువకులకు స్పిన్ బౌలింగ్‌లో మెళకువలు నేర్పించాడు. టీ20 ప్రపంచకప్-2021 గెలిచిన ఆసీస్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. అదేవిధంగా ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కోచింగ్ స్టాఫ్‌లో భాగంగా ఉన్నాడు. గతంలో పంజాబ్ బౌలింగ్ కోచ్‌గానూ శ్రీధరన్ శ్రీరామ్ పనిచేశాడు. ఘోర పరాభవం! కాగా ఇటీవల బంగ్లాదేశ్.. జింబాబ్వే చేతిలో ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే. జింబాబ్వేలో పర్యటించి వన్డే, టీ20 సిరీస్‌లను 2-1 తేడాతో ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. ఆసియా కప్-2022కు ముందుకు ఇలాంటి పరాభవం ఎదురైన నేపథ్యంలో బోర్డు దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కోచ్‌గా శ్రీధరన్ శ్రీరామ్ నియామకం జరిగినట్లు సమాచారం. చదవండి: Ind Vs Zim: అతడిని ముట్టుకున్నా.. జింబాబ్వే యువతి సంతోషం! ఫిదా చేసిన భారత క్రికెటర్! LLC 2022: గంభీర్ అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ బ్యాట్ పట్టనున్న గౌతీ! -
ఆసియా కప్‌కు జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్.. స్టార్ ఆటగాడు దూరం!
ఆసియా కప్-2022 కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు శనివారం ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ ఆల్ హసన్ ఎంపికయ్యాడు. ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ వరకు బంగ్లా జట్టు కెప్టెన్‌గా షకీబ్ కొనసాగనున్నాడు.ఇక జింబాబ్వే సిరీస్‌లో గాయపడిన వికెట్ నూరల్ హసన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక అదే సిరీస్‌లో గాయపడిన మరో వికెట్ కీపర్ లిటన్ దాస్ మాత్రం ఇంకా కోలుకోలేదు. దీంతో అతడు ఆసియాకప్‌కు దూరమయ్యాడు. కాగా ఆసియా కప్‌కు జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆగస్టు 8న ప్రకటించాల్సి ఉండగా.. షకీబ్ స్పాన్సర్షిప్ వివాదం వల్ల ఆలస్యమైంది. ఇక ఆసియాకప్‌లో బంగ్లాదేశ్ ఇప్పటి వరకు ఒక్క సారి కూడా టైటిల్ నెగ్గలేకపోయింది. 2012, 2016, 2018లో ఫైనల్‌కు చేరినప్పటికీ విజయం సాధించలేకపోయింది. కాగా ఆసియకప్-2022 ఆగస్టు 27 నుంచి యూఏఈ వేదికగా జరనగుంది. తొలి మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా ఆఫ్గానిస్తాన్- శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఆసియా కప్‌కు బంగ్లాదేశ్ జట్టు షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), అనాముల్ హక్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొస్సేన్, మొసద్దెక్ హొస్సేన్, మహ్మదుల్లా, మహేదీ హసన్, మహ్మద్ సైఫుద్దీన్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, నసుమ్ అహ్మద్, సబ్బీర్ రహ్మాన్,మెహిదీ హసన్ మిరాజ్,ఎబాడోత్ హుస్సేన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, నూరుల్ హసన్ సోహన్, టాస్కిన్ అహ్మద్ చదవండి: Asia Cup 2022: బంగ్లాదేశ్ కెప్టెన్‌గా షకీబ్ ఆల్ హసన్.. -
చిక్కుల్లో బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్..
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ చిక్కుల్లో పడ్డాడు. బంగ్లా క్రికెట్ బోర్డు(బీసీబీ) నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకున్నాడు. విషయంలోకి వెళితే.. ఇటీవలే ఈ స్టార్ ఆల్‌రౌండర్ ఒక బెట్టింగ్ వెబ్‌సైట్‌తో కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని షకీబ్.. ''బెట్ విన్నర్ న్యూస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నా'' అంటూ ఫేస్బుక్ వేదికగా ఫోటోను షేర్ చేశాడు. తన కాంట్రాక్ట్ ఒప్పందం విషయమై షకీబ్ బీసీబీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. ఇదే ఇప్పుడతన్ని కష్టాల్లోకి నెట్టింది. షకీబ్ మమ్మల్ని సంప్రదించకుండా ఒక బెట్టింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడని.. బెట్టింగ్ అనేది ఒక అనైతిక చర్య అని.. బెట్టింగ్తో సంబంధమున్న ఏ కంపెనీతోనూ ఆటగాళ్లు ఒప్పందం కుదుర్చుకోరాదని నిబంధనల్లో ఉందని బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ పేర్కొన్నాడు. షకీబ్ ఒప్పంద విషయమై బోర్డు మీటింగ్ అనంతరం అధ్యక్షుడు నజ్ముల్ హసన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాడు. ''గురువారం జరిగిన మీటింగ్‌లో షకీబ్ తాజాగా ఒప్పందం కుదుర్చుకున్న స్పాన్సర్షిప్ గురించి ప్రస్తావనకు వచ్చింది. అతను ఒక బెట్టింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని నిబంధన ఉల్లఘించాడు. ఒప్పంద విషయమై బోర్డుకు కనీస సమాచారం ఇవ్వకుండా సొంత నిర్ణయం తీసుకున్నాడు. దీనిపై వివరణ కోరుతూ షకీబ్‌కు నోటీసులు పంపించాం. ఒకవేళ షకీబ్ ఒప్పందం కుదుర్చుకున్న సంస్థకు బెట్టింగ్ మాఫియాతో సంబంధముందని తెలిస్తే ఉపేక్షించబోయేది లేదు. దీనిపై ఇన్వెస్టిగేషన్(విచారణ) ప్రారంభించబోతున్నాం. మా అనుమతి తీసుకోకుండా ఒప్పందం కుదుర్చుకున్న షకీబ్‌పై ఎలాంటి చర్యలు ఉంటాయనేది విచారణ అనంతరమే తెలుస్తోంది. కానీ షకీబ్ చేసింది బీసీబీ బోర్డుకు విరుద్దంగా ఉంది. బెట్టింగ్ అనే అంశానికి (బీసీబీ-లా) పూర్తి వ్యతిరేకం'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఎన్ని వివాదాలు ఉన్నా షకీబ్ అల్ హసన్ ప్రస్తుత తరంలో ఉన్న గొప్ప ఆల్రౌండర్లలో ఒకడు. మైదానం వెలుపల.. బయట ఎంతో అగ్రెసివ్‌గా కనిపించే షకీబ్ ఆల్‌రౌండర్‌గా లెక్కలేనన్ని రికార్డులు తన సొంతం. బంగ్లాదేశ్ క్రికెటర్లలో ఫేస్బుక్లో ఎక్కువ మంది ఫాలోయర్లు ఉన్న ఆటగాడు షకీబ్ అల్ హసన్. దాదాపు 15.6 మంది మిలియన్ ఫాలోవర్స్ అతని సొంతం. టి20లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో షకీబ్ అల్ హషన్ నెంబర్ వన్‌లో ఉన్నాడు. 99 టి20ల్లో 121 వికెట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. ఇక టి20 వరల్డ్‌కప్‌లోనూ అత్యధిక వికెట్లు షకీబ్(41 వికెట్లు) పేరిటే ఉండడం విశేషం. ఐసీసీ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విభాగంలో షకీబ్ అల్ హసన్ ఎక్కువకాలం పాటు నెంబర్‌వన్‌గా కొనసాగాడు. ప్రస్తుతం ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విభాగంలో నెంబర్-2లో ఉన్నాడు షకీబ్. బంగ్లాదేశ్ తరపున షకీబ్ 63 టెస్టులు, 221 వన్డేలు, 99 టి20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లు కలిపి బ్యాటింగ్‌లో 12వేలకు పైగా పరుగులు.. బౌలింగ్‌లో 621 వికెట్లు పడగొట్టాడు. చదవండి: NZ vs NED: కివీస్‌కు ముచ్చెమటలు పట్టించిన డచ్ బ్యాటర్.. Senior RP Singh: భారత్‌ను కాదని ఇంగ్లండ్‌కు ఆడనున్న మాజీ క్రికెటర్ కుమారుడు -
జింబాబ్వే టూర్.. జట్లను ప్రకటించిన బంగ్లాదేశ్.. కెప్టెన్ దూరం..!
జింబాబ్వే పర్యటనకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ జట్లను శుక్రవారం ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా జింబాబ్వేతో బంగ్లాదేశ్ మూడు వన్డేలు, మూడు టీ20ల మ్యాచ్‌లు ఆడనుంది. అయితే టీ20, వన్డే సిరీస్‌లకు రెండు వేర్వేరు జట్లును సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా టీ20 సిరీస్‌కు బంగ్లా రెగ్యులర్ కెప్టెన్ మహ్మదుల్లాకు సెలక్టర్లు విశ్రాంతి విశ్రాంతి ఇచ్చారు. అతడి స్థానంలో కెప్టెన్‌గా ఆ జట్టు వికెట్ కీపర్ నూరుల్ హసన్ ఎంపికయ్యాడు. అదే విధంగా జట్టు స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. జూలై 30 న హరారే వేదికగా జరగనున్న తొలి టీ20తో బంగ్లా పర్యటన ప్రారంభం కానుంది. ఇక ఇటీవల విండీస్‌తో జరిగిన టీ20, టెస్టు సిరీస్‌లో ఓటమి చెందిన బంగ్లాదేశ్.. వన్డే సిరీస్‌ను మాత్రం క్లీన్‌స్వీప్ చేసింది. బంగ్లాదేశ్ టీ20 జట్టు: నూరుల్ హసన్ (కెప్టెన్), మునిమ్ షహరియార్, అనాముల్ హక్, లిటన్ దాస్, అఫీఫ్ హుస్సేన్, మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్, హసన్ మహమూద్, మొసద్దెక్ హుస్సేన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో,మెహిదీ హసన్ మిరాజ్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ బంగ్లాదేశ్ వన్డే జట్టు: తమీమ్ ఇక్బాల్ (కెప్టెన్), లిటన్ దాస్, అనాముల్ హక్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, నూరుల్ హసన్ (వికెట్), మెహిదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్, హసన్ మహమూద్, హజ్సన్ మహ్మద్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, మొసద్దెక్ హొస్సేన్, తైజుల్ ఇస్లాం చదవండి: IRE vs NZ 3rd T20: తిరుగులేని న్యూజిలాండ్.. సిరీస్ క్లీన్‌స్వీప్ -
బంగ్లాదేశ్ టెస్టు కెప్టెన్ మోమినుల్ హక్ సంచలన నిర్ణయం
బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్ మోమినుల్ హక్ టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఇటీవలే స్వదేశంలో లంకతో జరిగిన టెస్టు సిరీస్ ఓటమికి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు మంగళవారం జరిగిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్(బీసీబీ) సమావేశంలో అధ్యక్షుడు నిజాముల్ హసన్‌కు తన నిర్ణయాన్ని వెల్లడించి కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. కాగా మోమినుల్ నాయకత్వంలో బంగ్లాదేశ్ జట్టు 17 టెస్టుల్లో కేవలం మూడు మాత్రమే గెలిచి.. 12 ఓడిపోయి.. మరో రెండు మ్యాచ్‌లు డ్రా చేసుకుంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ''ఒక ఫెయిల్యుర్ ఆటగాడిగా జట్టును ముందుకు నడిపించలేను. నా స్థానంలో మరొకరిని కెప్టెన్‌గా నియమించడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నా. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో బ్యాటింగ్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టేందుకు దృష్టి సారిస్తా'' అని చెప్పుకొచ్చాడు. కాగా లంకతో సిరీస్‌లో బ్యాటింగ్‌లోనూ ఘోరంగా విఫలమైన మోమినుల్ హక్ 2022లో ఆడిన ఆరు టెస్టులు కలిపి 162 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. కాగా మోమినుల్ స్థానంలో షకీబ్ అల్ హసన్ టెస్టు కెప్టెన్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇక మోమినుల్ హక్ బంగ్లాదేశ్ తరపున 53 టెస్టుల్లో 11 సెంచరీల సాయంతో 3525 పరుగులు చేశాడు. చదవండి: Ms Dhoni: ప్రేమించే వారికోసం ఎంతదూరమైనా.. అదీ ధోని అంటే! -
T20 World Cup 2021: స్టార్ ఓపెనర్‌కు మొండిచేయి.. బంగ్లా జట్టు ఇదే
ఢాకా: ఐసీసీ టీ 20 ప్రపంచకప్ 2021 సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (బీసీబీ) 15 మందితో కూడిన ప్రాబబుల్స్‌ను ప్రకటించింది. మహ్మదుల్లా కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో ఆసీస్, న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పాల్గొన్న ఆటగాళ్లకే తొలి ప్రాధాన్యం ఇచ్చింది. షీకీబ్ ఆల్ హసన్, ముష్ఫీకర్ రహీమ్, లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, ముస్తాఫిజుర్ రెహ్మన్ లాంటి ఆటగాళ్లు చోటు దక్కించుకోగా.. బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్‌కు మాత్రం మొండిచేయి చూపింది. గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్న తమీమ్‌ను బీసీబీ పరిగణలోకి తీసుకోలేదు. చదవండి: BAN Vs NZ: ముస్తాఫిజుర్ స్టన్నింగ్ క్యాచ్.. మోచేతికి దెబ్బ తగిలినా ఇక స్టాండ్ బై ప్లేయర్స్‌గా రూబెల్ హుస్సెన్, అమినుల్ ఇస్లామ్ బిప్లాబ్లను ఎంపిక చేసింది. ఇటీవలే ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న బంగ్లాదేశ్ .. తాజాగా కివీస్‌పై ట20 సిరీస్‌ను గెలుచుకునే పనిలో ఉంది. ఇప్పటికే 3-1 తేడాతో ఆధిపత్యంలో ఉన్న బంగ్లా చివరి టీ20ని గెలిచి 4-1తో ముగించాలని భావిస్తోంది. అయితే బంగ్లాదేశ్ సూపర్ 12లో ఎంటర్ కావాలంటే ముందుగా క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడాల్సి వస్తుంది. క్వాలిఫయింగ్ దశలో గ్రూఫ్ బిలో ఉన్న బంగ్లాదేశ్‌తో పాటు స్కాట్లాండ్, పపువా న్యూ జినియా, ఒమన్ ఉన్నాయి. ఇక గ్రూఫ్ ఏలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా ఉన్నాయి. చదవండి: Ishan Kishan T20 World Cup 2021: ఎంపికయ్యానని తెలియగానే ఏడ్చేశాడు టీ20 ప్రపంచకప్ బంగ్లాదేశ్ టీ 20 జట్టు: మహ్మదుల్లా (కెప్టెన్), నయీమ్ షేక్, సౌమ్య సర్కార్, లిట్టన్ కుమార్ దాస్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొసైన్, నూరుల్ హసన్ సోహన్, షాక్ మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మన్, షోరిఫుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, షైఫ్ ఉద్దీన్, షైఫ్ ఉద్దీన్, షామిమ్ ఉద్దీన్ స్టాండ్ బై ప్లేయర్స్: రూబెల్ హుస్సేన్, అమీనుల్ ఇస్లాం బిప్లాబ్ Bangladesh have announced their 15-member squad for the ICC Men’s #T20WorldCup 2021! 🚨 All you need to know 👇 — ICC (@ICC) September 9, 2021 -
'నాకు దేశభక్తి ఎక్కువ.. ఐపీఎల్ ఆడను'
ఢాకా: ఐపీఎల్ కంటే దేశం తరపున ఆడడమే తనకు ముఖ్యమని బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ స్పష్టం చేశాడు. ఏప్రిల్‌లో మొదలవనున్న ఐపీఎల్ 2021 సీజన్ సమయంలోనే బంగ్లా క్రికెట్ బోర్డు(బీసీబీ) లంకతో టెస్టు సిరీస్ ఆడాలని సోమవారం నిర్ణయం తీసుకుంది. కాగా బీసీబీ నిర్ణయం తీసుకున్న రోజే తాను ఐపీఎల్ ఆడేందుకు అనుమతి ఇవ్వాలంటూ మరో ఆల్‌రౌండర్ షకీబ్ ఆల్ హసన్ కోరాడు.దీనిపై నిరాశ చెందిన బీసీబీ ఐపీఎల్ ఆడాలనుకునేవారికి ఎన్వోసీ ఇస్తామని... లీగ్‌లో పాల్గొనే వారిని తాము అడ్డుకోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ముస్తాఫిజుర్ స్పందించాడు. ' నాకు దేశ భక్తి ఎక్కువ. ఐపీఎల్ కంటే దేశానికి ప్రాధాన్యమిస్తా. బంగ్లా బోర్డు ఏది చెబితే అదే చేస్తా. ఒకవేళ శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు నా పేరును ప్రకటిస్తే దేశానికి ఆడేందుకే ప్రాధాన్యమిస్తా. ఐపీఎల్ దృష్యా ఒకవేళ బోర్డు లంకతో సిరీస్‌కు తన పేరును పరిగణలోకి తీసుకోకుంటే ఆ విషయం వాళ్లే స్వయంగా చెబుతారు. వారు ఎన్వోసీ ఇచ్చేవరకు వేచిచూస్తా.. అప్పుడే ఐపీఎల్లో ఆడేందుకు వెళ్తా. ఐపీఎల్లో పాల్గొనమని బోర్డు ఎన్వోసీ ఇచ్చినా నా మొదటి ప్రాధాన్యం దేశ భక్తిపైనే ఉంటుంది.' అని రెహ్మాన్ స్పష్టం చేశాడు. కాగా ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను రాజస్తాన్ రాయల్స్ కనీస ధర రూ. కోటికి దక్కించుకోగా.. ఆల్‌రౌండర్ షకీబ్ ఆల్ హసన్‌ను కేకేఆర్ రూ.3.20 కోట్లకు కొనుగోలు చేసింది. బంగ్లాదేశ్ తరపున ముస్తాఫిజుర్ 14 టెస్టుల్లో 30 వికెట్లు, 61 వన్డేల్లో 115 వికెట్లు, 41 టీ20ల్లో 58 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్లో 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన ముస్తాఫిజుర్ చక్కగా రాణించాడు. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి ఆ ఏడాది ఎస్ఆర్హెచ్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2018 ఐపీఎల్ సీజన్లో ముంబైకి ప్రాతినిధ్యం వహించిన ముస్తాఫిజుర్ మొత్తం 24 మ్యాచ్‌లాడి 24 వికెట్లు తీశాడు. చదవండి: విదేశీ బౌలర్లకు అంత ఇచ్చి.. అతనికి ఇంత తక్కువ సన్‌రైజర్స్‌కు వార్నర్ షాక్ ఇవ్వనున్నాడా! -
బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ ఆత్మహత్య
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రాబోయే బంగాబందు టీ-20 టోర్నమెంట్లో చోటు దక్కకపోవడంతో నిరాశ చెంది బంగ్లాదేశ్ అండర్ -19 మాజీ ఆటగాడు మహమ్మద్ సోజిబ్(21) శనివారం రాజ్‌షాహిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. టోర్నమెంట్లో తనకు అవకాశం కచ్చితంగా లభిస్తుందని తన చుట్టూ ఉన్న వ్యక్తులతో సోజిబ్ తెలిపాడు. టీ-20 ఆటగాళ్ల జాబితాలో తన పేరు రాలేదని నిరాశకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని అతడి తల్లిదండ్రులు తెలిపారు. మహమ్మద్ సోజిబ్ మృతిని దుర్గాపూర్ పోలీస్ స్టేషన్ అధికారి హష్మోత్ అలీ ధ్రువీకరించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం సోజిబ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2017లో అండర్ -19 ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ తాత్కాలిక జట్టులో సోజిబ్ పాల్గొన్నాడు. అతడు 2018 అండర్ -19 ప్రపంచ కప్‌లో స్టాండ్-బై ప్లేయర్ గా ఉన్నాడు. చదవండి: మొదటి బంతికే డకౌట్, సారీ చెప్పిన బౌలర్ -
పెద్ద మనసు చాటుకున్న వెటోరి
ఢాకా: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, బంగ్లాదేశ్ స్పిన్ బౌలింగ్ కోచ్ డేనియల్ వెటోరి పెద్ద మనసు చాటుకున్నాడు. తన జీతంలో కొంత భాగాన్ని కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బోర్డు సిబ్బందికి ఇవ్వాల్సిందిగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును (బీసీబీ) కోరాడు. ఈ విషయాన్ని బీసీబీ సీఈవో నిజాముద్దీన్ ప్రకటించారు. అయితే ఎంత మొత్తాన్ని వెటోరి విరాళంగా ప్రకటించాడో మాత్రం ఆయన గోప్యంగా ఉంచారు. టి20 ప్రపంచకప్ ముగిసేవరకు బంగ్లాదేశ్ కోచింగ్ బృందంలో ఉండనున్న 41 ఏళ్ల వెటోరికి బంగ్లాదేశ్ బోర్డు మొత్తం 2,50,000 డాలర్లు (రూ. కోటీ 88 లక్షలు) చెల్లించనుంది. -
మీ కోచింగ్ పదవి నాకొద్దు..
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ జట్టు తమ టెస్టు జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పని చేయాలంటూ చేసిన ప్రతిపాదనను భారత మాజీ ఆటగాడు సంజయ్ బంగర్ తిరస్కరించాడు. ముందే కుదుర్చుకున్న ప్రొఫెషనల్ ఒప్పందాలతో పాటు వ్యక్తిగత అం శాలు కూడా ఇందుకు కారణమని అతను చెప్పాడు. 12 టెస్టులు, 15 వన్డేలు ఆడిన బంగర్ భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా ఐదేళ్ల పాటు అద్భుతమైన ఫలితాలు సాధించాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్ లోపాలను సరిదిద్ది వారిని అత్యుత్తమంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాడు. తమ టెస్టు జట్టును పటిష్టపర్చేందుకు బంగ్లాదేశ్ బంగర్ సేవలను కోరింది. అయితే ప్రస్తుతం కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న అతను తన వల్ల కాదని చెప్పాడు. ఇప్పటికే బంగ్లాదేశ్ బ్యాటింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు నీల్ మెకెంజీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాను పరిమిత ఓవర్లు, టీ 20లకు మాత్రమే బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగుతానని కొద్దిరోజుల క్రితం బీసీబీకి తెలిపాడు. దీంతో టెస్టు ఫార్మాట్‌కు కొత్త బ్యాటింగ్ కోచ్‌కు అన్వేషణ మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే బీసీబీ సంజయ్ బంగర్‌ను కలిసినట్లు తెలిసింది. కాగా టెస్టులకు కొత్త బ్యాటింగ్ కోచ్ వచ్చేవరకు మెకేంజీనే మూడు ఫార్మాట్లలో బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగుతాడని బీసీబీ స్పష్టం చేసింది. కాగా సంజయ్ బంగర్ 2014 నుంచి 2019 వరకు టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. -
బంగ్లా బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా సంజయ్ బంగర్?
ఢాకా : అన్నీ అనుకున్నట్లు జరిగితే టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్ బంగర్‌ను జూన్‌లో ఆసీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ జట్టుకు టెస్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా చూడొచ్చు. ఇందుకు సంబంధించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్(బీసీబీ) సంజయ్ బంగర్‌ను టెస్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా తీసుకోవాలనే యోచనలో ఉంది. ' మేము సంజయ్ బంగర్‌తో ఈ విషయమై చర్చించాము.. కానీ తుది నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ బంగర్ రాలేని అవకాశం ఉంటే మిగతావాళ్లతో కూడా టచ్‌లో ఉంటాము' అని బీసీబీ ఎగ్జిక్యూటివ్ కోచ్ నిజాముద్దీన్ చౌదరీ పేర్కొన్నాడు. (టెస్టు చాంపియన్‌షిప్‌పై వకార్ యూనిస్ అసంతృప్తి) కాగా ఇప్పటికే బంగ్లాదేశ్ బ్యాటింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు నీల్ మెకెంజీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాను పరిమిత ఓవర్లు, టీ 20లకు మాత్రమే బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగుతానని కొద్దిరోజుల క్రితం బీసీబీకి తెలిపాడు. దీంతో టెస్టు ఫార్మాట్‌కు కొత్త బ్యాటింగ్ కోచ్‌కు అన్వేషణ మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే బీసీబీ సంజయ్ బంగర్‌ను కలిసినట్లు తెలిసింది. కాగా టెస్టులకు కొత్త బ్యాటింగ్ కోచ్ వచ్చేవరకు మెకేంజీనే మూడు ఫార్మాట్లలో బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగుతాడని బీసీబీ స్పష్టం చేసింది. కాగా సంజయ్ బంగర్ 2014 నుంచి 2019 వరకు టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన సంగతి తెలసిందే. ఒకవేళ బంగర్ బంగ్లా జట్టుకు టెస్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వస్తే మాత్రం జూన్ 2020 నుంచి ఫిబ్రవరి 2021 వరకు కొనసాగే అవకాశం ఉంది. ('ధోని ఇక జట్టులోకి రావడం కష్టమే') -
మాకు కోహ్లి కావాలి: బంగ్లాదేశ్
ఢాకా: బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబూర్ రెహ్మాన్ శతజయంతి సందర్భంగా వచ్చే నెలలో ఆసియా ఎలెవన్, ప్రపంచ ఎలెవన్ జట్ల మధ్య రెండు టీ20 మ్యాచ్‌లను నిర్వహించడానికి ఆ దేశ క్రికెట్ బోర్డు(బీసీబీ) ఇప్పటికే సగం ఏర్పాట్లును పూర్తి చేసింది. ఇంకా షెడ్యూల్, ఆటగాళ్ల పూర్తి వివరాలను ఖరారు చేయాల్సి ఉండగా దానిపై తమ కార్యాచరణను ముమ్మరం చేసింది. మార్చి 18-22 మధ్యలో రెండు టీ20లను జరపాలని బంగ్లాదేశ్ యోచిస్తోంది. దీనిలో భాగంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని కచ్చితంగా ఆసియా ఎలెవన్ జట్టులో ఉంచాలని బీసీబీ పట్టుదలతో ఉంది. (ఇక్కడ చదవండి: పాక్ వద్దు.. భారత్ ముద్దు) ‘మేము ఇంకా షెడ్యూల్, అందుబాటులో ఉండే ఆటగాళ్లపై కసరత్తులు చేస్తున్నాం. మరో రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మేము ప్రస్తుతం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీ)తో టచ్‌లో ఉన్నాం. భారత్ నుంచి ఏ ఆటగాళ్లు ఉంటారు అనే దానిపై వివరణ కోరాం. కాకపోతే కోహ్లి కచ్చితంగా ఉండాలని బీసీసీఐకి విజ్క్షప్తి చేశాం. దీనిపై బీసీసీఐ సానుకూలంగా స్పందించింది. ఈ విషయాన్ని బీసీసీఐ పరిశీలిస్తోంది. కోహ్లితో మాట్లాడిన తర్వాత మాకు సందేశం పంపొచ్చు. ఈ రెండు టీ20ల సిరీస్‌లో కోహ్లి ఉంటాడనే భావిస్తున్నాం’ బీసీబీ తెలిపింది.(ఇక్కడ చదవండి: ‘మేము రావట్లేదు.. మీరే ఆడుకోండి’) అయితే భారత్ నుంచి నాలుగు నుంచి ఐదుగురు ప్లేయర్లను ఆసియా ఎలెవన్ తరఫున ఆడటానికి పంపించడానికి సిద్ధమవుతున్న విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. కాకపోతే ఆ క్రికెటర్ల పేర్లు ఇంకా ఖరారు కాలేదన్నాడు. ఆదివారం జరుగనున్న ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బంగ్లాదేశ్ అభ్యర్థనపై బీసీసీఐ చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. రేపు దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిపై కోహ్లితో ముందుగా చర్చించాలని బీసీసీఐ భావిస్తోంది. -
‘మేము రావట్లేదు.. మీరే ఆడుకోండి’
కరాచీ: వరల్డ్ ఎలెవన్‌తో మ్యాచ్‌లో భాగంగా పాకిస్తాన్ క్రికెటర్లకు ఆసియా ఎలెవన్ జట్టులో చోటు కల్పించడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) మొగ్గుచూపడం లేదనే వార్తల నేపథ్యంలో పీసీబీ క్లారిటీ ఇచ్చింది. తమ ఆటగాళ్లు లేకుండా భారత్ ఆటగాళ్లు, బంగ్లాదేశ్ ఆటగాళ్లు కలిసి వరల్డ్ ఎలెవన్‌తో మ్యాచ్‌లు ఆడుకున్నప్పటికీ తమకు ఎటువంటి అభ్యంతరం లేదంటూనే మరొకవైపు అసహనం వ్యక్తం చేసింది. ఇలా పాకిస్తాన్ క్రికెటర్లను ఆసియా లెవన్‌లో ఆడుకుండా అడ్డుకోవడానికి బీసీసీఐ ప్రధాన కారణమని పీసీబీ మరొకసారి తన అక్కసు వెళ్లగక్కింది. (ఇక్కడ చదవండి: పాక్ వద్దు.. భారత్ ముద్దు) బీసీసీఐ కారణంగానే తమ ఆటగాళ్లను ఆసియాకప్‌లో ఆడకుండా అడ్డుకుంటున్నారని వాపోయింది. ఇది కచ్చితంగా తమ ఆటగాళ్లను కించపరచడమే అవుతుందన్నారు. ఇక్కడ బీసీసీఐ వాస్తవాలను కప్పిపుచ్చి తమ ఫ్యాన్స్‌ను తప్పుదోవ పట్టించడానికి యత్నించిందని విమర్శించింది. తమకు పీఎస్ఎల్ ఉన్నందును ఆసియా ఎలెవన్ జట్టులో భాగం కావడానికి తమ క్రికెటర్లు ఎవరూ కూడా అంత ఆసక్తిగా లేరని తెలిపింది. ఈ విషయాన్ని ముందుగానే బీసీబీకి తెలిపామన్న పీసీబీ.. ఇది బీసీసీఐ తెరపైకి తీసుకొచ్చిన కొత్త ట్విస్ట్ అంటూ విమర్శించింది. ‘వరల్డ్ లెవన్-ఆసియా ఎలెవన్‌ల మధ్య జరగబోయే రెండు టీ20 మ్యాచ్‌ల సమయంలో మాకు పీఎస్ఎల్ చివరి దశలో ఉంటుంది. దాంతో మా ఆటగాళ్లు పాల్గొనడం కుదరదు. పీఎస్ఎల్ తేదీలను మార్చడం కూడా కుదరదు..అలానే వరల్డ్ ఎలెవన్-ఆసియా ఎలెవన్ షెడ్యూల్‌లను కూడా మార్చడం కుదరదు.అటువంటప్పుడు మేము ఆసియా ఎలెవన్ జట్టులో ఎలా భాగం ఆవుతాం. మా క్రికెటర్లంతా పీఎస్ఎల్తో బిజీగా ఉంటారు. ఈ విషయాన్ని ముందుగానే బీసీబీకి తెలియజేశాం. వారు అంగీకరించారు కూడా. అయితే మా ఆటగాళ్లు ఆడితే భారత జట్టు నుంచి ఏ ఒక్క ఆటగాడు ఆసియా ఎలెవన్‌లో ఆడటానికి రాబోమని చెప్పడం ఏమిటి. ఇది వాస్తవాన్ని కనుమరుగు చేసి మా ఆటగాళ్లను మా అభిమానుల్ని తప్పుదోవ పట్టించడం కాదా. ఇది బీసీసీఐ ఆడుతున్న డ్రామా’ అని పీసీబీ అధికార ప్రతినిధి ప్రశ్నించారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబర్ రహ్మాన్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మార్చి నెలలో వరల్డ్ లెవన్-ఆసియా లెవన్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్‌లను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో పాటు ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ)లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. తొలి మ్యాచ్ మార్చి 16వ తేదీన జరుగనుండగా, రెండో టీ20 మార్చి 20వ తేదీన జరుగనుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అధికారిక హోదాలోనే ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక్కడ చదవండి: ‘భారత్ కంటే పాకిస్తాన్ ఎంతో సురక్షితం’ భారత్ సంగతి మీకెందుకు! -
పాక్ వద్దు.. భారత్ ముద్దు
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) మరో సారి భారత్ వైపు మొగ్గు చూపింది. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబూర్ రెహ్మాన్ శతజయంతి సందర్భంగా ఆసియా ఎలెవన్, ప్రపంచ ఎలెవన్ జట్ల మధ్య రెండు టీ20 మ్యాచ్‌లను మార్చిలో నిర్వహించాలని బీసీబీ భావిస్తోంది. దీనికి ఐసీసీ కూడా సానుకూలంగా స్పందించింది. అంతేకాకుండా మ్యాచ్ తేదీలను, ఆసియా ఎలెవన్ జట్టును తమకు పంపించాలని బీసీబీకి ఐసీసీ సూచించింది. అయితే ప్రస్తుత పరిస్థితలు దృష్ట్యా భారత్-పాకిస్తాన్ దేశాలకు చెందిన క్రికెటర్లు ఒకే జట్టులో ఉండటం సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి బీసీబీ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ కంటే తమకు భారతే ముఖ్యమనే భావనలో బీసీబీ ఉన్నట్లు తెలుస్తుంది. బీసీసీఐ సంయుక్త కార్యదర్శి జయేశ్ జార్జ్ తాజా వ్యాఖ్యలతో ఇదే స్పష్టమవుతోంది. ‘బీసీసీఐకి అందిన సమాచారం ప్రకారం ఆసియా ఎలెవన్ జట్టులో పాకిస్తాన్ ఆటగాళ్లు లేరని తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇరు దేశాల ఆటగాళ్లు ఒకే జట్టులో ఆడే అవకాశం లేదు. అలా ఆడాల్సి వస్తే దీనిపై బీసీసీఐ ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆసియా ఎలెవన్ జట్టులో భారత్ నుంచి ఐదుగురు క్రికెటర్లు పాల్గొంటారు. ఈ ఐదుగురిని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఎంపిక చేస్తారు’ అని జయేశ్ జార్జ్ వ్యాఖ్యానించారు. దీంతో పాక్ ఆటగాళ్లు ఆడితే తమ క్రికెటర్లను పంపమని బీసీసీఐ పరోక్షంగా తేల్చిచెప్పింది. ఇదే విషయాన్ని బీసీబీకి కూడా చెప్పడంతో ఆ దేశ బోర్డు బీసీసీఐ వైపే నిలిచింది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థుతులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అంతేకాకుండా పాక్ నేతలు భారత్‌పై అక్కసు వెల్లగక్కుతూనే ఉన్నారు. తాజాగా స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ విజయవంతం కావడంతో పీసీబీ చైర్మన్ ఎహ్సాన్ మణి వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. రక్షణ పరంగా భారత్ కంటే పాక్ ఎంతో నయమని వ్యాఖ్యానించాడు. దీనిపై బీసీసీఐ కూడా గట్టిగానే బదులిచ్చింది. భారత అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని బీసీసీఐ తేల్చిచెప్పింది. చదవండి: ‘భారత్ కంటే పాకిస్తాన్ ఎంతో నయం’ భారత్ సంగతి మీకెందుకు! -
టెస్టుల సంగతి తర్వాత చూద్దాం!
ఢాకా: పూర్తి స్థాయి పర్యటన కోసం రావాలన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అభ్యర్థనను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) సున్నితంగా తిరస్కరించింది. ముందు మూడు టి20లు ఆడేందుకు అంగీకరించిన బంగ్లా... టెస్టులు ఆడే విషయమై స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ముందు అయితే పొట్టి మ్యాచ్‌లు ఆడిన తర్వాతే టెస్టుల సంగతి చూద్దామని చెప్పింది. ‘పాకిస్తాన్ తమ దేశంలో అంతర్జాతీయ క్రికెట్‌ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించే ప్రయత్నంలో ఉంది. అయితే మేం మాత్రం మా ఆటగాళ్లు, సహాయ సిబ్బంది సూచనల ప్రకారం నడుచుకుంటాం. మా జట్టు మేనేజ్మెంట్లో చాలా మంది విదేశీయులున్నారు. కాబట్టి ఇక్కడ వారి అభిప్రాయాలను పరిశీలించాల్సిందే’ అని బీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ నిజాముద్దీన్ చౌదరి చెప్పారు. మా ప్రాథమిక ప్రతిపాదన మేరకు ముందు టి20లు ఆడతాం. పరిస్థితుల్ని బట్టి టెస్టులపై నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. ఇటీవల శ్రీలంక జట్టు పాక్‌లో పర్యటించి రెండు టెస్టుల సిరీస్‌లో ఆడింది. దీంతో పదేళ్ల తర్వాత పాక్‌గడ్డపై అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. -
పాకిస్తాన్‌కు ఝలక్ ఇచ్చిన బంగ్లా
ఇస్లామాబాద్: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కు బంగ్లాదేశ్ చిన్న ఝలక్ ఇచ్చింది. జనవరిలో రెండు టెస్టులు, మూడు టీ20ల కోసం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పాక్‌లో పర్యాటించాల్సివుంది. దీనికోసం పీసీబీ అన్ని ఏర్పాట్లను చేసింది. అయితే పాక్‌లో కేవలం టీ20లు మాత్రమే ఆడతామని, టెస్టులు తటస్థ వేదికపై ఆడతామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) తేల్చిచెప్పింది. పాక్‌లో ఎక్కువ రోజులు ఉండటానికి బంగ్లా క్రికెటర్లు విముఖత వ్యక్తం చేయడంతోనే బీసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ నిర్ణయంతో కంగుతిన్న పాక్ క్రికెట్ బోర్డు బీసీబీపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదే క్రమంలో పాక్ కెప్టెన్ అజహర్ అలీ, హెడ్‌కోచ్ మిస్బావుల్ హక్‌లు కూడా బీసీబీ తీరును తప్పుపడుతున్నారు. ‘కేవలం టీ20లే ఆడతాం, టెస్టులు ఆడం అనడం అనైతికం. ప్రస్తుతం పాక్‌లో క్రికెట్ పునరజ్జీవం పోసుకోవాలంటే అది టెస్టులతోనే సాధ్యం. వీలైనన్ని ఎక్కువ టెస్టు సిరీస్‌లు నిర్వహించడంతో పాక్‌లో క్రికెట్ బతుకుతుంది. దీని కోసమే పీసీబీ అన్ని ప్రయత్నాలను చేస్తోంది. ఈ క్రమంలో టెస్టులు ఆడమని, కేవలం టీ20లో అడతామనడం సరైనదికాదు. ఈ విషయంలో బీసీబీని ఉపేక్షించేదిలేదు. టెస్టులు ఆడకపోతే బంగ్లాపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారు కోరినట్లు కేవలం టీ20లు మాత్రమే ఆడే అవకాశం ఇస్తే మిగతా దేశాలు కూడా అదే దారిలో వెళతాయి. దీంతో పాక్‌లో టెస్టు క్రికెట్ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పటికే శ్రీలంక టెస్టు సిరీస్ దిగ్విజయంగా ముగిసింది. లంక దారిలోనే మరిన్ని జట్లు పాక్‌లో అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తున్నాం’అంటూ మిస్బావుల్, అజహర్లు పేర్కొన్నారు. ఇక బీసీబీ నిర్ణయంతో పాకిస్తాన్‌కు మింగుడుపడటంలేదు. ఈ విషయంపై పీసీబీ చైర్మన్ ఎహ్సాన్ మణి కూడా స్పందించారు. బీసీబీతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పాక్‌లో బంగ్లాదేశ్ పర్యటన ఉంటుందని, టీ20లతో పాటు టెస్టులు కూడా ఆడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించబోమని మరోసారి స్పష్టం చేశారు. భద్రతాపరమైన ఎలాంటి చిక్కులు లేవని శ్రీలంక సిరీస్‌తో ప్రపంచానికి తెలిసిపోయిందని.. ఈ క్రమంలో పాక్‌లో పర్యటిచడానికి వారి సమస్యేంటో అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏయ్ వేషాలు వేస్తున్నావా.. క్రికెటర్‌కు వార్నింగ్!
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్లు తమ డిమాండ్లను నేరవేర్చలాంటూ సమ్మెకు దిగి తమ పంతం నెగ్గించుకున్న తరుణంలో మరో వివాదం చోటు చేసుకుంది. భారత్ పర్యటనకు సంబంధించి బంగ్లాదేశ్ క్రికెటర్లతో సమావేశమై బీసీబీ చీఫ్ నజ్ముల్ హసన్.. ఆల్ రౌండర్ మెహిది హసన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన ఫోన్ కాల్‌ను మెహిదీ లిఫ్ట్ చేయకపోవడంపై సమావేశంలోనే హసన్‌ను తిట్టిపోశారు. ‘ ఏయ్ వేషాలు వేస్తున్నావా.. నీ నంబర్ డిలీట్ చేసేస్తా’ అంటూ ఫైర్ అయ్యారు. ‘ మెహిది.. సమావేశం ఉంటుందని తెలుసి కూడా నా ఫోన్ కాల్‌ను ఎత్తలేదు. ఇలాగైతే కష్టం. నీ నంబర్‌ను ఈ రోజు నుంచే నా కాంటాక్ట్స్ లిస్ట్ నుంచి తీసేస్తా. నీకు ఏమి చేయలేదని నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఈ రోజు నుంచి నీ నంబర్ నా దగ్గర ఉండదు’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. అదే సమయంలో మిగతా క్రికెటర్లపై కూడా నజ్ముల్ తీవ్రంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. (ఇక్కడ చదవండి: క్రికెటర్ల స్ట్రైక్ దెబ్బకు దిగొచ్చిన బోర్డు) ఇటీవల తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరసన గళం వినిపించకుండా స్టైక్‌కు దిగిన బంగ్లాదేశ్ క్రికెటర్ల దెబ్బకు ఆ దేశ క్రికెట్ బోర్డు బీసీబీ దిగొచ్చింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి క్రికెటర్లకు గురువారం స్పష్టమైన హామీ లభించడంతో స్ట్రైక్‌ను విరమించారు. ఈ మేరకు తమ క్రికెటర్లతో సుదీర్ఘ చర్చలు జరిపిన బీసీబీ.. సాధ్యమైనన్ని డిమాండ్లను నేరవేర్చడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 11 ప్రధాన డిమాండ్లతో నిరసన గళం వినిపించగా వాటిలో తొమ్మిది డిమాండ్లను తీర్చడానికి బీసీబీ ముందుకొచ్చింది. ఫలితంగా షకిబుల్ హసన్ నేతృత్వంలోని క్రికెటర్లు సమ్మె విరమించడంతో భారత్ పర్యటనకు మార్గం సుగమం అయ్యింది. దానిలో భాగంగా సమావేశం ఏర్పాటు చేయగా బీసీబీ చీఫ్ తన ఆక్రోశాన్ని క్రికెటర్లపై చూపించారు. -
క్రికెటర్ల స్ట్రైక్ దెబ్బకు దిగొచ్చిన బోర్డు
ఢాకా: ఇటీవల తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరసన గళం వినిపించకుండా స్టైక్‌కు దిగిన బంగ్లాదేశ్ క్రికెటర్ల దెబ్బకు ఆ దేశ క్రికెట్ బోర్డు బీసీబీ దిగొచ్చింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి క్రికెటర్లకు స్పష్టమైన హామీ లభించడంతో స్ట్రైక్‌ను విరమించారు. ఈ మేరకు తమ క్రికెటర్లతో సుదీర్ఘ చర్చలు జరిపిన బీసీబీ.. సాధ్యమైనన్ని డిమాండ్లను నేరవేర్చడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో క్రికెటర్లు తమ సమ్మెకు ముగింపు పలికారు. దీనిలో భాగంగా మాట్లాడిన బోర్డు అధ్యక్షుడు నజ్ముల్లా హసన్.. క్రికెటర్లను డిమాండ్లను తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. తమ క్రికెటర్లు కోరిన తొమ్మిది డిమాండ్లలో రెండు మినహాయించి మిగతా వాటిని తీర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని క్రికెటర్లతో జరిపిన చర్చల్లో ప్రస్తావించడంతో వార అందుకు అంగీకారం తెలిపారన్నాడు. ఫలితంగా క్రికెటర్ల సమ్మెలో కీలక పాత్ర పోషించిన షకిబుల్ హసన్‌కు డిమాండ్ల విషయంపై క్లారిటి ఇచ్చామన్నాడు. క్రికెటర్లు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారన్నాడు. శనివారం నుంచి తమ జాతీయ క్రికెటర్లు యథావిధిగా మ్యాచ్‌లకు సిద్ధం కానున్నారన్నాడు. దాంతో వచ్చే నెలలో భారత్‌తో జరుగనున్న మూడు టీ20ల సిరీస్‌తో పాటు, రెండు టెస్టుల సిరీస్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. వచ్చే నెల 3 నుంచి భారత్‌లో బంగ్లా పర్యటన మొదలవుతుంది. సొమవారం కాంట్రాక్టు మొత్తాల పెంపుతో పాటు తమ డిమాండ్లు తీర్చకపోతే ఏ స్థాయి క్రికెటైనా ఆడబోమంటూ బంగ్లా క్రికెటర్లు నిరసన బాట పట్టాడరు. మైదాన సిబ్బంది, ఆటగాళ్ల జీతాలు పెంచడం, ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఫీజు పెంచడం, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో మార్పులు, ప్రయాణ ఖర్చుల పెంపు వంటి డిమాండ్లతో సమ్మెకు దిగారు. మొత్తం 11 ప్రధాన డిమాండ్లతో నిరసన గళం వినిపించారు. దాంతో వెంటనే లాయర్ సమక్షంలో చర్చలు జరిపిన బీసీబీ.. దాదాపు అన్ని డిమాండ్లను నేరవేర్చడానికి ముందుకొచ్చింది. -
సమ్మెకు దిగిన క్రికెటర్లు..
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్లు సోమవారం సమ్మెకు దిగారు. తమ డిమాండ్లు పరిష్కరించేంతవరకు క్రికెట్ ఆడమని అదేవిధంగా క్రికెట్ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)కి తేల్చిచెప్పారు. అంతేకాకుండా బీసీబీకి గతంలోనే 11 డిమాండ్లతో కూడిన లేఖను పంపామని.. కానీ పట్టించుకోకపోవడంతోనే సమ్మెకు దిగినట్లు క్రికెటర్లు తెలిపారు. మైదాన సిబ్బంది, ఆటగాళ్ల జీతాలు పెంచడం, ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఫీజు పెంచడం, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో మార్పులు, ప్రయాణ ఖర్చుల పెంపు వంటి డిమాండ్లతో సమ్మెకు దిగినట్లు క్రికెటర్లు పేర్కొంటున్నారు. సుమారు 50 మంది క్రికెటర్లు ఈ సమ్మెలో పాల్గొన్నట్లు సమాచారం. సమ్మెలో పాల్గొన్న క్రికెటర్లకు షకీబుల్ హసన్, ముష్పీకర్ రహీమ్‌లు నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో భారత్-బంగ్లాదేశ్ సిరీస్ జరిగేది అనుమానంగా మారింది. టీమిండియాతో బంగ్లా మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. నవంబర్ 3న తొలి టి20 జరగాల్సి ఉంది. అయితే బంగ్లా క్రికెటర్లు సమ్మెకు దిగడంతో ఈ సిరీస్ ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇది బీసీబీకి చెందిన అంతర్గత విషయమని, దానిపై స్పందించాల్సిన అవసరం లేదని బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు. బంగ్లా- టీమిండియా సిరీస్ తప్పక జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా బీసీబీ నుంచి అధికారిక సమాచారం వచ్చేంత వరకు దీనిపై స్పందించకుండా ఉంటేనే ఉత్తమమని గంగూలీ పేర్కొన్నాడు. -
సరికొత్తగా టీ20 లీగ్.. ఇవేం రూల్స్‌రా నాయనా..!
ఢాకా : బంగ్లాదేశ్ టీ20 ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలతో విభేదాల నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. బీపీఎల్‌లో సరికొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు అన్ని దేశాలు పాటించిన రూల్స్‌నే అనుసరించిన బంగ్లా క్రికెట్ బోర్డు బీపీఎల్‌ను తన అధీనంలోకి తీసుకుని తాజా నిర్ణయాలను ప్రకటించింది. మేటి ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన తమ దేశ క్రికెటర్లు టీ20 ఫార్మాట్లో మెరుగ్గా రాణించేందుకు తాజా నిబంధనలు దోహదపడతాయని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ మహబూబల్ అనమ్ చెప్పారు. వచ్చే సీజన్ నుంచి ఈ నిబంధనలు అమలవుతాయని వెల్లడించారు. కాగా, ఏడు ప్రాంచైజీలు ఉన్న బీపీఎల్‌లో ఆరు జట్ల యజమానులతో బంగ్లా క్రికెట్ బోర్డుకు విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో బంగ్లా ప్రీమియర్ లీగ్‌ను బంగ్లా బోర్డు అధీనంలోకి తీసుకుంది. అయితే, బీసీబీ కొత్త నిబంధనలపై విమర్శలు వస్తున్నాయి. మోకాలుకు బోడి గుండుకు ముడిపెట్టుగా రూల్స్ చెత్తగా ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. సరుకంతా విదేశాలదైతే బంగ్లా ప్రీమియర్ లీగ్ అనే పేరెందుకుని క్రికెట్ అభిమానులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. బంగ్లా టీ20 ప్రీమియర్ లీగ్ తాజా రూల్స్.. ఏడు టీమ్‌లలో ఒక విదేశీ ఫాస్ట్ బౌలర్ తప్పనిసరి. అతను 140 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగలగాలి టీమ్‌లో ఒక లెగ్ స్పిన్నర్ తప్పనిసరిగా ఉండాలి ప్రతి జట్టులో ఉన్న మణికట్టు స్పిన్నర్ తప్పనిసరిగా పూర్తి కోటా (4 ఓవర్లు) బౌలింగ్ చేయాలి విదేశీ ప్రధాన కోచ్, ఫిజియోథెరపిస్టు, ట్రెయినర్లే ఉండాలి. స్వదేశానికి చెందిన కోచ్‌లు ఈ ప్రధాన కోచ్‌కు సహాయకుడిగా మాత్రమే ఉంటారు. టీమ్‌లకు డైరెక్టర్‌ను ఎంపిక చేసే అధికారం బీసీబీ డైరెక్టర్‌కు ఉంటుంది. -
బంగ్లా బౌలర్‌పై పదేళ్ల నిషేధం
ఢాకా: ఇటీవల బంగ్లాదేశ్ డివిజన్ లీగ్ క్రికెట్ మ్యాచ్ లో అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసి నాలుగు బంతుల్లో 92 పరుగులిచ్చి ప్రత్యర్ధి జట్టు విజయానికి కారణమైన లాల్ మతియా జట్టు బౌలర్ సుజోన్ మహ్మద్ పై 10 ఏళ్ల నిషేధం పడింది. ఆ మ్యాచ్ లో అతను వ్యవహరించిన తీరుపై పూర్తిస్థాయి విచారణ చేపట్టిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పదేళ్ల పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో అతను సుదీర్ఘ కాలం పాటు ఏ క్రికెట్ మ్యాచ్ ల్లో పాల్గొనే అవకాశమే లేకుండా పోయింది. ’మా విచారణలో అతను తప్పు చేసినట్లు తేలింది. కావాలనే వైడ్లు, నోబాల్స్ వేసి ప్రత్యర్థి విజయానికి కారణమయ్యాడు. ఇది క్రీడా స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. మా దేశ క్రికెట్ కు భంగం కల్గించే ఏ చర్యను ఉపేక్షించం. అందుచేతం అతనిపై 10 ఏళ్ల పాటు నిషేధం విధిస్తున్నాం’అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు క్రమశిక్షణా కమిటి చీఫ్ షేక్ సోహెల్ తెలిపారు. ఢాకా సెకండ్ డివిజన్ లీగ్‌మ్యాచ్‌లో లాల్మతియా క్లబ్, ఆక్సియామ్ గ్రూప్‌లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సుజోన్ మహ్ముద్ తొలి ఓవర్లోనే వరుసగా 13 వైడ్లు, 3 నోబాల్స్ వేయగా ఇవన్నీ బౌండరీ దాటాయి. దీంతో జట్టు ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే 80 పరుగులు చేసింది. -
భారత్‌తో సిరీస్‌లో డీఆర్ఎస్ లేదు: బీసీబీ
ఢాకా : స్వదేశంలో భారత్‌తో జరగనున్న సిరీస్‌కు అంపైర్ నిర్ణయ పునఃసమీక్ష పద్ధతి (డీఆర్ఎస్)ని ఉపయోగించడం లేదని బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు నజ్ముల్ హసన్ తెలిపారు. రెండు దేశాల బోర్డుల మధ్య జరిగిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘ఇటీవల పాక్‌తో జరిగిన సిరీస్‌లో అంపైర్ రిఫరల్ పద్ధతిని వినియోగించాం. కానీ ఇప్పుడు అది కూడా లేదు. డీఆర్ఎస్పై బీసీసీఐకి వ్యతిరేకత ఉంది. కాబట్టి ఇందులో దేన్నీ ఉపయోగించడం లేదు. ఇప్పటి వరకు భారత్‌తో ఆడిన ఏ జట్టైనా డీఆర్ఎస్ను వాడలేదు. మేం కూడా అదే దారిలో వెళ్తున్నాం’ అని హసన్ పేర్కొన్నారు. మరోవైపు వేలి గాయం నుంచి పూర్తిగా కోలుకోని తమ వికెట్ కీపర్ ముష్పికర్ రహీమ్ భారత్‌తో టెస్టులో వికెట్ కీపింగ్ చేసే అవకాశం లేదని హసన్ వెల్లడించారు. అనాముల్ హక్, లిట్టన్ దాస్‌లలో ఒకరికి అవకాశం దక్కొచ్చు.


