బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై కొనసాగుతున్న దాడుల సెగ ఐపీఎల్‌కు తగిలింది. 2026 సీజన్ కోసం వేలం ద్వారా ఎంపికైన ఏకైక బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తమ జట్టునుంచి విడుదల చేస్తున్నట్లు కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం ప్రకటించింది.
ఐపీఎల్-2026 వేలంలో ముస్తాఫిజుర్ ను రూ. 9.20 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో ముస్తఫిజుర్‌ను ఐపీఎల్‌లో ఆడనివ్వకూడదని భారత్‌లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.
అంతేకాకుండా ముస్తాఫిజుర్‌ను జట్టులోకి తీసుకున్నందుకు కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. కొందరు రాజకీయ నాయకులు అతడిని "దేశద్రోహి" అని కూడా మండిపడ్డారు. ఈ పరిస్థితులను గమనించిన బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, ముస్తాఫిజుర్‌ను విడుదల చేయాల్సిందిగా కేకేఆర్ యాజమాన్యానికి సూచించారు.
దీంతో కేకేఆర్ అతడిని జట్టు నుంచి తప్పించింది. ఇక ఈ విషయంపై ముస్తఫిజుర్ తొలిసారి స్పందించాడు. "వారు నన్ను విడుదల చేస్తే, నేను మాత్రం ఏం చేయగలను?" అంటూ తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాది సీజన్ కోసం ముస్తఫిజుర్ స్ధానాన్ని మరొక ఆటగాడితో కేకేఆర్ భర్తీ చేయనుంది.
ఇక ఇది ఇలా ఉండగా.. ముస్తఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించడంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది తమ దేశ క్రికెటర్లను అవమానించడమేనని, ఐపీఎల్ ప్రసారాలను బంగ్లాదేశ్‌లో నిలిపివేయాలని అక్కడి క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ఆదేశించడం గమనార్హం. అదేవిధంగా టీ20 వరల్డ్‌కప్-2026లో తమ లీగ్ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ను కోరనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: T20 WC 2026: భారత్‌లో ఆడబోము..! పాక్ బాటలోనే బంగ్లాదేశ్?


