భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ 2026.. ప్రారంభానికి ముందే హాట్ టాపిక్‌గా మారింది. భారత్‌తో నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో తమ మ్యాచ్‌ల వేదికలను మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరనున్నట్లు తెలుస్తోంది.
బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రెహమన్‌ను తమ జట్టు నుంచి విడుదల చేయాలని కేకేఆర్‌ను బీసీసీఐ ఆదేశించిన అనంతరం ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై కొనసాగుతున్న దాడుల నేపథ్యంలో ముస్తఫిజుర్‌ను ఐపీఎల్‌లో ఆడించరాదంటూ కొంత కాలంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. బంగ్లా పేస్ బౌలర్ బరిలోకి దిగితే టీమ్ యజమాని షారుఖ్ ఖాన్‌పై కూడా దాడులు చేస్తామంటూ పలు చోట్ల హెచ్చరికలు జారీ అయ్యాయి.
వీటిని దృష్టిలో ఉంచుకుంటూ అతడిని తప్పించాలంటూ స్వయంగా బీసీసీఐ కేకేఆర్ యాజమాన్యానికి సూచించింది. దీంతో బోర్డు ఆదేశాల మేరకు జట్టు నుంచి ముస్తఫిజుర్‌ను కేకేఆర్ విడుదల చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ బాటలోనే బంగ్లాదేశ్ కూడా పయనించనున్నట్లు సమాచారం. పాకిస్తాన్ మాదిరిగానే వరల్డ్‌కప్‌లో ఆడే తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేస్తుందంట.
"ముస్తాఫిజుర్‌ను విడుదలకు సంబంధించి నేను ఎటువంటి వ్యాఖ్య చేయలేను. ఎందుకంటే అది పూర్తిగా బీసీసీఐ, ఫ్రాంచైజీ అంతర్గత విషయం. టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే విషయానికి వస్తే, అది ఐసీసీ నిర్వహించే ఈవెంట్. ఈ విషయంపై త్వరలోనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీతో చర్చిస్తుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్తాన్‌కు వెళ్లేందుకు భారత్ నిరాకరించిన విషయం తెలిసిందే. మేము కూడా మా డిమాండ్లను ఐసీసీ ముందు పెడతాము. ఇందుకు సంబంధించి ఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుందని" బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
ఇదే విషయంపై బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ స్పందించాడు. "బీసీబీ సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న ఒక ఆటగాడు భారత్‌లో ఆడలేనప్పడు.. మొత్తం బంగ్లాదేశ్ జట్టు అక్కడ సురక్షితంగా ఉంటుందన్న నమ్మకం మాకు లేదు. అందుకే మా నాలుగు లీగ్ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని జైషా నేతృత్వంలోని ఐసీసీని కోరమని బోర్డుకు సూచించాను" అని బీసీబీకి రాసిన లేఖలో ఆసిఫ్ పేర్కొన్నాడు.
కాగా వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్‌లో బంగ్లాదేశ్ ఆడాల్సిన నాలుగు మ్యాచ్‌లను భారత్‌లోనే షెడ్యూల్ చేశారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఫిబ్రవరి 7న వెస్టిండీస్, 9న ఇటలీ, 14న ఇంగ్లండ్, 17న వాంఖడేలో నేపాల్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
చదవండి: VHT 2025-26: అర్షిన్, పృథ్వీ షా మెరుపులు.. ముంబై జోరుకు బ్రేక్


