ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు ఇవాళ (ఫిబ్రవరి 19) రెండో టీ20 ఆడుతుంది. కాన్‌బెర్రా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. ఆసీస్‌ను 163 పరుగులకే (5 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది.
తొలుత ఆసీస్ ఓపెనర్లు జార్జియా వాల్ (57 బంతుల్లో 88; 11 ఫోర్లు, సిక్స్), బెత్ మూనీ (39 బంతుల్లో 46; 4 ఫోర్లు) ధాటికి తడబడిన భారత బౌలర్లు.. చివరి 5 ఓవర్లలో అనూహ్యంగా పుంజుకున్నారు.
వాల్-మూనీ తొలి వికెట్‌కు 14.5 ఓవర్లలో 128 పరుగులు జోడించినా.. అరుంధతి రెడ్డి (4-0-20-2), శ్రీచరణి (3-0-28-0), రేణుకా ఠాకూర్ (4-0-27-1) ఊహించని విధంగా పుంజుకొని ఆసీస్‌ను భారీ స్కోర్ చేయకుండా నిలువరించారు. వాల్, మూనీ మినహా ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రాణించలేకపోయారు.
లిచ్‌ఫీల్డ్ 6, ఎల్లిస్ పెర్రీ 7, గార్డ్‌నర్ 10 (నాటౌట్), జార్జియా వేర్హమ్ డకౌటయ్యారు. స్కోర్‌ను 170 పరుగులైనా దాటించాలనే ఆతృతతో ఆసీస్ ఇన్నింగ్స్ చివరి రెండు బంతులకు వికెట్లు కోల్పోయింది. వేర్హమ్, పెర్రీ రనౌట్లయ్యారు. ఈ ఓవర్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే వచ్చాయి. శ్రీచరణి ఆసీస్ బ్యాటర్లను అద్భుతంగా కట్టడి చేసింది.
కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి టీ20లో 21 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో) విజయం సాధించి, ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ ఆసీస్ పర్యటనలో భారత్ టీ20ల తర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, ఆతర్వాత ఏకైక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడనుంది.


