breaking news
Arundhati Reddy
-
WPL 2026: వేలంలో సత్తా చాటిన మన అమ్మాయిలు
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)- 2026 వేలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు అమ్మాయిలు అవకాశం దక్కించుకున్నారు. ఇటీవల ఐసీసీ వన్డే వరల్డ్ కప్-2025లో విజయంలో భాగమైన శ్రీచరణి, అరుంధతి రెడ్డి (హైదరాబాద్) మరో సందేహం లేకుండా ఎంపికయ్యారు. అరుంధతి రెడ్డిని రూ. 75 లక్షలకు ఆర్సీబీ జట్టు ఎంచుకుంది.గొంగడి త్రిషకు తొలిసారి చాన్స్అండర్–19 వరల్డ్ కప్ విజయంలో భాగమైన హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిషకు తొలిసారి డబ్ల్యూపీఎల్‌లో చాన్స్ లభించడం విశేషం. మమత మాదివాల, నల్లా క్రాంతి రెడ్డి కూడా ఎంపికయ్యారు. గొంగడి త్రిషను రూ. 10 లక్షలకు యూపీ వారియర్స్... మమతను రూ. 10 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్... క్రాంతి రెడ్డిని రూ. 10 లక్షలకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్నాయి. శ్రీచరణి స్థాయి పెరిగింది... వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన నల్లపు రెడ్డి శ్రీచరణి 2025 డబ్ల్యూపీఎల్‌లో రూ.55 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడింది. ఇటీవలి వన్డే వరల్డ్ కప్ విజయంలో ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రధాన పాత్ర పోషించడంతో సహజంగానే ఆమె స్థాయి పెరిగింది. వేలానికి ముందు ఆమెను విడుదల చేసిన ఢిల్లీ ఇక్కడ మళ్లీ పోటీ పడింది. కనీస విలువ రూ.30 లక్షలతో మొదలై ఢిల్లీ, యూపీ మధ్య పోరు సాగింది. చివరకు రూ.1.30 కోట్ల వద్ద వేలం ముగిసింది. ఈ మేరకు.. ఢిల్లీ భారీ మొత్తంతో తమ ప్లేయర్‌ను తిరిగి సొంతం చేసుకుంది.చదవండి: WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే -
ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధించడం ఆనందంగా ఉంది: అరుంధతి
-
వరల్డ్‌కప్ విజేత అరుంధతి రెడ్డికి మంత్రి వాకిటి శ్రీహరి సన్మానం
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 గెలిచిన భారత జట్టులో సభ్యురాలైన అరుంధతి రెడ్డి (Arundhati Reddy) గురువారం.. స్వస్థలం హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆమెకు ఘన స్వాగతం లభించింది. తాజాగా.. అరుంధతి రెడ్డి తెలంగాణ క్రీడా శాఖా మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari)ని మర్యాద పూర్వకంగా కలిసింది.ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి.. వరల్డ్‌కప్ విజేత అరుంధతి రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎండి డాక్టర్ సోనీ బాలాదేవి, కోచ్ ఆకాశ్, అరుంధతి తల్లి భాగ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో భారత జట్టు సౌతాఫ్రికాను ఓడించి జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే.నలభై ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మొట్టమొదటిసారి భారత మహిళా జట్టు ప్రపంచకప్‌ను ముద్దాడింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా దశాబ్దాల కలను నెరవేరుస్తూ నవీ ముంబై వేదికగా ట్రోఫీని అందుకుంది. ఇక ఈ జట్టులో హైదరాబాదీ అరుంధతి రెడ్డితో పాటు.. కడప బిడ్డ శ్రీ చరణి కూడా భాగస్వాములుగా ఉన్నారు. -
అరుంధతి రెడ్డికి ఘన స్వాగతం పలికిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ
ప్రపంచ మహిళా వరల్డ్ క్రికెట్ కప్ గెలుపులో తన వంతు కృషిచేసిన తెలంగాణ మహిళా క్రికెట్ క్రీడాకారిణి అరుంధతి రెడ్డికి నేడు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది.తెలంగాణకు గర్వకారణంగా నిలిచిన అరుంధతి రెడ్డి ఇటీవల జరిగిన 2025 మహిళా వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టుకు విజయాన్ని అందించడంలో కృషి చేసింది. నవంబర్ 2న తొలిసారిగా ప్రపంచ కప్‌ను భారత మహిళల జట్టు గెలుచుకుంది. ఈ విజయానంతరం నేడు (నవంబర్ 6న) అరుంధతి హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా, కుటుంబ సభ్యులు, అభిమానులు, సన్నిహితులు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టుకు వచ్చి ఆమెను అభినందించారు.ఇక తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండి డాక్టర్ సోనీ బాలాదేవి సైతం అరుంధతికి ఘన స్వాగతం పలికారు. -
అమ్మానాన్నలూ గెలిచారు
పిల్లల ప్రతిభను ప్రపంచం కంటే ముందు తల్లిదండ్రులే గుర్తించాలి. గోరుముద్దల్లో ఉత్సాహం.. వేలు పట్టి నడిపే నడకలో ప్రోత్సాహం అందించినప్పుడే పిల్లలు పులుల్లా మారతారు... చిరుతల్లా కదలాడతారు. తల్లిదండ్రులు అమ్మాయిలను చదివించి... ఉద్యోగాలు చేయించడం వరకు ఆలోచిస్తారు. కానీ, క్రీడల్లో కొనసాగమని చెప్పడం తక్కువ. మన మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ విజయం సాధించడం చూసి ఇకపై పెద్ద మార్పు రావచ్చు. ఈ జట్టులోని అమ్మాయిలను తల్లిదండ్రులు ప్రోత్సహించిన తీరు చూస్తే ‘క్రీడాకారిణి కావాలని ఉంది’ అని ఏ అమ్మాయి కోరినా తల్లిదండ్రులు తప్పక ‘మేమున్నాం’ అనే రోజులు వచ్చేశాయి.ఇంట్లో నాతోనే క్రికెట్ ఆడేది!చిన్నప్పటినుంచి అథ్లెటిక్స్ అంటే శ్రీచరణికిప్రాణం. జాతీయ స్థాయిలో ఖోఖో అడింది. కానీ, క్రికెట్ అంటేనే చాలా ఇష్టం. ఇంట్లో క్రికెట్ ఆడతానని అలిగేది. తన తండ్రి కూడా అథ్లెటిక్స్ ఆడమని చెప్పారు. కానీ, నేను మాత్రం శ్రీచరణీకి తోడుగా నిలిచి క్రికెట్‌ను ప్రోత్సహించాను. నాతోనే ఇంట్లో క్రికెట్ ఆడేది. ఇప్పుడు ఏకంగా వరల్డ్ కప్ గెలుపులో కీలకంగా నిలవడం మాకెంతో గర్వకారణం. ఇక మా సంతోషానికి హద్దులు లేవు. – నల్లపురెడ్డి రేణుక (శ్రీచరణి తల్లి)తండ్రిగా చెప్పుకోవడానికిగర్వంగా ఉంది..ఉమెన్స్ వరల్డ్ కప్‌లో అదరగొట్టిన భారత్ క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణి తండ్రిగా చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. నా కూతురు వరల్డ్ కప్‌లో క్రికెట్ ఆడుతుంటే చాలా సంతోషంగా ఉంది. – నల్లపురెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీచరణి తండ్రిమహిళల ప్రపంచ కప్ పోటీల్లో సాటిలేని ప్రతిభ కనబర్చి వైఎస్సార్ కడప జిల్లా పేరును ప్రపంచ పటంలో నిలిపిన శ్రీచరణి వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె మండలం యర్రంపల్లె గ్రామానికి చెందిన నల్లపురెడ్డి చంద్రశేఖరరెడ్డి, రేణుక దంపతుల కుమార్తె. తండ్రి ఆర్టీపీపీలో ఎలక్ట్రికల్ ఫోర్మన్ . ఒకటి నుంచి 10వ తరగతి వరకూ ఆర్టీపీపీలోని డీఏవీ స్కూల్లో చదివింది. హైదరాబాద్ లేపాక్షి జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ పూర్తిచేసింది. ప్రస్తుతం వీఎన్ పల్లె వీఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో బీఎస్పీ కంప్యూటర్స్ చదువుతూ క్రికెట్లో విశేష ప్రతిభ కనబరుస్తోంది.ఇదీ చదవండి: స్టార్ క్రికెటర్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లగ్జరీ వాచ్ : ధర ఎంతో తెలుసా?అండర్–19 నుంచి భారత జట్టు స్థాయికి..తొలుత శ్రీచరణి 2017–18లో జిల్లా అండర్–19 జట్టుకు ఎంపికైంది. అప్పటినుంచి ఇంక వెనక్కి తిరిగి చూడలేదు. అదే ఏడాది రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభించింది. జిల్లాకు చెందిన క్రికెట్ శిక్షకులు ఖాజా మొయినుద్దీన్, మధుసూదన్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఎన్నో మెళకువలు నేర్చుకుంది. ఆ తర్వాత..⇒ 2021లో అండర్–19 చాలెంజర్స్ ట్రోఫీలో ఇండియా–సి జట్టుకుప్రాతినిధ్యం వహించి నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ⇒ శ్రీచరణి ఆట నైపుణ్యం గుర్తించిన డబ్ల్యూపీఎల్ ప్రతినిధులు ఢిల్లీ క్యాపిటల్స్‌కు రూ.55 లక్షలతో ఎంపిక చేసుకున్నారు. ⇒ ఏప్రిల్ 27 నుంచి మే 11 వరకు జరిగిన శ్రీలంక ముక్కోణపు వన్డే సీరీస్ క్రికెట్ టోర్నీకి నల్లపురెడ్డి శ్రీచరణి తొలిసారి భారత జట్టుకుప్రాతినిధ్యం వహించింది. ⇒లండన్ లో జరిగిన టీ–20 టూర్‌కు భారత జట్టు తరఫున ఎంపికైంది. ⇒ ప్రస్తుతం ఐసీసీ మహిళ విభాగంలో భారత జట్టు తరఫున ప్రపంచకప్‌లో నిలకడగా రాణించింది. ఈ టోర్నీలో 14 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన రెండో బౌలర్‌గా ఘనత సాధించింది.కుటుంబ సభ్యుల ప్రోత్సాహం..చిన్నప్పటి నుంచి ఆటలపై మక్కువ చూపే శ్రీచరణి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. మొదట్లో అథ్లెటిక్స్‌లో రాణిస్తున్న శ్రీచరణి ఆ తర్వాత క్రికెట్‌పై ఆసక్తి చూపుతుండడంపై అమ్మానాన్నలు సందేహించారు. కానీ, క్రికెట్‌పై ఉన్న ఆసక్తిని గమనించిన మామ కిశోర్‌కుమార్‌రెడ్డి శ్రీచరణిని ప్రోత్సహించారు. సరదాగా మొదలుపెట్టిన క్రికెట్ ఇప్పుడు శ్రీచరణికి సర్వస్వం అయింది. ప్రోత్సాహం ఉంటే అమ్మాయిలు ఎందులోనైనా రాణించగలరని శ్రీచరణి రుజువు చేసింది. – మోపూరు బాలకృష్ణారెడ్డి. సాక్షి ప్రతినిధి, కడపదిసీజ్ ఫర్ యూ..!‘పిల్లల ఇష్టాలు కనిపెట్టి, వారు ఎంచుకున్న మార్గంలో వెళ్లేలా ప్రోత్సహించడం, తగిన స్వేచ్ఛను ఇస్తూ, సపోర్ట్‌గా ఉండటం పేరెంట్స్ నిర్వర్తించాల్సిన పనులు’ అంటారు ఇండియన్ విమెన్ క్రికెటర్ అరుంధతీరెడ్డి తల్లి భాగ్యరెడ్డి. మహిళా క్రికెట్లో వరల్డ్ కప్ కైవసం చేసుకున్న మన భారత జట్టులో భాగమైన ఫాస్ట్ బౌలర్ అరుంధతి రెడ్డి హైదరాబాద్ వాసి. ఈ విజయోత్సవ ఆనందంలో కూతురి కల గురించి అమ్మగా భాగ్య రెడ్డి పంచుకున్న విషయాలు..‘‘ఫైనల్స్ చూడటానికి ముంబయ్ వెళ్లి, ఈ రోజే వచ్చాను. మ్యాచ్ గెలవగానే ‘అమ్మా.. దిస్ ఈజ్ ఫర్ యు’ అని చెప్పింది నా బిడ్డ. ఆ క్షణంలో పొందిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఈ గెలుపును ఇప్పుడు మా కుటుంబం అంతా ఎంజాయ్ చేస్తున్నాం. చిన్నప్పుడు తన అన్న రోహిత్, ఇతర కజిన్స్‌తో కలిసి గల్లీలో క్రికెట్ ఆడేది. టీవీలో క్రికెట్ చూసేది. సోర్ట్స్‌లో చాలా చురుకుగా ఉండేది. నేను వాలీబాల్ స్టేట్ ప్లేయర్‌ని. స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉన్నా కుటుంబ పరిస్థితుల కారణంగా నా కలలను నెరవేర్చుకోలేకపోయాను. నా కూతురుకి ఉన్న ఇష్టాన్ని కాదనకూడదు అనుకున్నాను. క్రికెట్ ఫస్ట్..మేముండేది సైనిక్‌పురిలో. ప్రైవేట్ స్కూల్ టీచర్ని. మధ్యతరగతి కుటుంబం. సోర్ట్స్‌లో అరుంధతికి ఉన్న ఇష్టాన్ని చూసి, పన్నెండేళ్ల వయసులో స్పోర్ట్స్ సెంటర్లో చేర్పించాను. ఉదయం నాలుగు గంటలకే స్పోర్ట్స్ సెంటర్‌కి వెళ్లిపోయేవాళ్లం. అక్కణ్ణుంచి స్కూల్. మళ్లీ సాయంత్రం ఇద్దరం గ్రౌండ్‌కి వెళ్లిపోయేవాళ్లం. క్రికెట్ప్రాక్టీస్ చేస్తూనే ఓపెన్ లో టెన్త్ ఎగ్జామ్స్ రాసింది. 15 ఏళ్లకే అండర్ –19 హైదరాబాద్ జట్టుకు ఎంపికయ్యింది. ఫాస్ట్ బౌలర్ గా పేరు తెచ్చుకుంది. పెద్ద కల ఉంటే త్యాగాలు ఎన్నో...2017లో రైల్వేలో చేరింది. అక్కడ ఉంటూనే చాలా విషయాల పట్ల అవగాహన ఏర్పరుచుకుంది. అండర్ 23 జోనల్ టోర్నమెంట్ లో రాణించింది. మళ్లీ ఒక దశలో క్రికెట్– జాబ్ .. దేనిని ఎంచుకోవాలనే నిర్ణయం వచ్చింది. ఓ రోజు తన నిర్ణయం క్రికెట్ మాత్రమే అని చెప్పింది. నేనూ ‘సరే’ అన్నాను. రెండేళ్ల కిందట జాబ్ మానేసి పూర్తి సమయాన్నిప్రాక్టీస్కే కేటాయించింది.ప్రాక్టీస్‌లో భాగంగా కుటుంబంలో ఎన్నో సంతోష సమయాలలో తను దూరంగా ఉండాల్సి వచ్చేది. ఈ రోజు దేశాన్ని గెలిపించిన జట్టులో నా బిడ్డ ఉందంటే... చాలా ఆనందంగా ఉంది. ధైర్యమే పెద్ద సపోర్ట్అరుంధతికి క్రికెట్‌తో పాటు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. సమయం దొరికితే మెలోడీస్ ను చాలా ఇష్టంగా పాడుతుంది. అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా వారి జీవితాన్ని వారు ఎంచుకునే స్వేచ్ఛ వారికే ఇవ్వాలి. పెద్దలుగా మనం కనిపెడుతూ ఉండాలి. పిల్లల ఆసక్తితో ఎంచుకున్న మార్గంవైపు మనకు తెలిస్తే ఏవైనా సూచనలు ఇవ్వాలి. లేదంటే, ధైర్యంగా వెళ్లు అని చెప్పాలి. ఈ ఏడాది పిల్లలను సోర్ట్స్ అకాడమీలో చేర్చాం. వచ్చే ఏడాదికి పెద్ద ప్లేయర్ అయిపోవాలని వారిపై ఒత్తిడి తీసుకురావద్దు. అది సాధ్యం కాదు కూడా.ఎంచుకున్న దానిపైన అంకితభావం, క్రమశిక్షణ, సాధన ఉండాలి. మా అమ్మాయి ఆలోచన ఎప్పుడూ క్రికెట్ వైపు ఉండేది. మా కుటుంబం అంతా ఆమె వైపు ఉన్నాం. నా కలలను పిల్లల ద్వారా తీర్చుకోవాలి అనుకోలేదు. నా జీవితంలో ఎదురైన స్ట్రగుల్స్‌ని ఎప్పుడూ పిల్లల ముందు చెప్పలేదు. నా జర్నీలో మా అమ్మ నాకు పెద్ద మోరల్ సపోర్ట్. నా కూతురు ఎదుగుదలలో నేను కూడా అంతే. ఎంచుకున్న మార్గం వైపు ధైర్యంగా వెళ్లమనే చెబుతుంటాను. ఈ రోజు ఆ సక్సెస్‌ను చూస్తున్నాం’’ అంటూ ఆనందంగా వివరించారు. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు ఊహించని షాక్
మహిళల వన్డే ప్రపంచకప్‌కు (ICC Women's World Cup 2025) ముందు భారత జట్టుకు (Team India) ఊహించని షాక్ తగిలింది. వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇవాళ (సెప్టెంబర్ 25) జరిగిన మ్యాచ్‌లో స్టార్ పేసర్ అరుంధతి రెడ్డి (Arundathi Reddy) గాయపడింది.ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో హీథర్ నైట్ ఆడిన బంతిని క్యాచ్ పట్టే ప్రయత్నంలో అరుంధతి, తన ఎడమ కాలుపై తేడాగా ల్యాండ్ అయ్యింది. దీంతో చాలా సేపు నొప్పితో విలవిలలాడుతూ నేలపై ఉండిపోయింది. ఫిజియో వచ్చి పరీక్షించిన తర్వాత, ఆమెను వీల్ చైర్లో తీసుకెళ్లారు.అరుంధతి గాయం తీవ్రతపై స్పష్టత లేదు. స్కాన్ల కోసం ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మరి కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే వరల్డ్‌కప్‌లో ఆమె పాల్గొనడం అనుమానంగా మారింది.27 ఏళ్ల అరుంధతి గత కొంతకాలంగా టీమిండియాలో కీలక బౌలర్‌గా వ్యవహరిస్తుంది. ఈ ఏడాది ఆమె 6 ఇన్నింగ్స్‌ల్లో 7 వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉంది. ఒకవేళ మెగా టోర్నీ నుంచి అరుంధతి తప్పుకుంటే, బీసీసీఐ ఆమె ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. టీమిండియా సెప్టెంబర్ 30న శ్రీలంకతో జరిగే మ్యాచ్‌తో తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది.వార్మప్ మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్.. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (120 నాటౌట్) సెంచరీతో కదంతొక్కడంతో భారీ స్కోర్ దిశగా సాగుతోంది. బ్రంట్‌కు జతగా ఎమ్మా లాంబ్ (74 నాటౌట్) క్రీజ్‌లో ఉంది. 42 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 277/3గా ఉంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో యామీ జోన్స్ 39, హీథర్ నైట్ 37 పరుగులు చేయగా.. ట్యామీ బేమౌంట్ డకౌటైంది. భారత బౌలర్లలో రేణుకా సింగ్, అరుంధతి రెడ్డి తలో వికెట్ తీశారు. చదవండి: న్యూజిలాండ్‌కు షాకిచ్చిన టీమిండియా -
శ్రీలంక- సౌతాఫ్రికాలతో వన్డే సిరీస్.. భారత జట్టు ప్రకటన
శ్రీలంకలో పర్యటించనున్న మహిళా క్రికెట్ జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. శ్రీలంక- సౌతాఫ్రికాలతో జరుగనున్న త్రైపాక్షిక వన్డే సిరీస్‌కు పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును వుమెన్స్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు మంగళవారం వెల్లడించింది.హర్మన్‌ప్రీత్ పునరాగమనంఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) భారత జట్టును ముందుకు నడిపించనుండగా.. స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా కొనసాగనుంది. ఇక ఈ జట్టులో హైదరాబాదీ అమ్మాయి అరుంధతి రెడ్డి, ఆంధ్ర క్రికెటర్, అన్క్యాప్డ్ ప్లేయర్ నల్లపురెడ్డి శ్రీచరణి కూడా చోటు దక్కించుకున్నారు.అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటుఅంతేకాదు.. శ్రీచరణితో పాటు మరో ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లు కశ్వీ గౌతమ్ (Kashvi Gautam), శుచీ ఉపాధ్యాయ్‌కు కూడా సెలక్టర్లు చోటివ్వడం విశేషం. మరోవైపు.. గాయాల కారణంగా రేణుకా సింగ్ ఠాకూర్, టైటస్ సాధు ఈ వన్డే సిరీస్‌కు దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది.చివరగా మంధాన సారథ్యంలోకాగా జనవరిలో ఐర్లాండ్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. హర్మన్‌కు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు ఆమె స్థానంలో మంధానకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో జనవరి 10- 15 వరకు జరిగిన ఈ సిరీస్‌లో మంధాన సేన ఐర్లాండ్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో మంధానకు దీప్తి శర్మ డిప్యూటీగా వ్యవహరించింది.అన్నీ ఒకే స్టేడియంలోఇక ఏప్రిల్ 27 నుంచి శ్రీలంక- భారత్- సౌతాఫ్రికా మధ్య ట్రై సిరీస్ మొదలుకానుంది. ఇందులో భాగంగా నాలుగు మ్యాచ్‌లకూ శ్రీలంకలోని కొలంబోలోని ఆర్. ప్రేమదాస మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ సిరీస్‌లో ప్రతి జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందులో టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.శ్రీలంక- సౌతాఫ్రికాలతో వన్డే సిరీస్‌కు భారత జట్టుహర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యస్తికా భాటియా (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్, కశ్వీ గౌతమ్, స్నేహ్ రాణా, అరుంధతీ రెడ్డి, తేజల్ హసాబ్నిస్, శ్రీచరణి, శుచీ ఉపాధ్యాయ్.ట్రై సిరీస్‌లో భారత్ షెడ్యూల్ ఇదేఏప్రిల్ 27, ఆదివారం- ఇండియా వర్సెస్ శ్రీలంకఏప్రిల్ 29, మంగళవారం- ఇండియా వర్సెస్ సౌతాఫ్రికామే 4, ఆదివారం- ఇండియా వర్సెస్ శ్రీలంకమే 7, బుధవారం- ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా.చదవండి: గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్‌గా ఊహించని పేరు చెప్పిన కపిల్ దేవ్ -
అరుంధతి రెడ్డి తొలిసారి...
న్యూఢిల్లీ: భారత మహిళా క్రికెటర్ల వార్షిక కాంట్రాక్ట్ (2024–25)ల జాబితాను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. మొత్తం 16 మంది ప్లేయర్లను ‘ఎ’, ‘బి’, ‘సి’ గ్రేడ్లుగా విభజించి బోర్డు కాంట్రాక్ట్‌లు అందించింది. గత సీజన్లో ఈ జాబితాలో 17 మంది ఉండగా ఇప్పుడు ఈ సంఖ్య 16కు తగ్గింది. 2022 అక్టోబర్ తర్వాత భారత జట్టుకు ఆడని ఆంధ్ర ఓపెనింగ్ బ్యాటర్ సబ్బినేని మేఘన, 2023 జనవరి తర్వాత టీమిండియాకు ప్రాతినిధ్యం వహించని ఆంధ్ర లెఫ్టార్మ్ పేస్ బౌలర్ అంజలి శర్వాణిలకు కొత్త కాంట్రాక్ట్ జాబితాలో స్థానం లభించలేదు. హైదరాబాద్‌కు చెందిన పేస్ బౌలర్ అరుంధతి రెడ్డికి తొలిసారి ఈ అవకాశం దక్కింది. అరుంధతి భారత్ తరఫున 5 వన్డేలు, 33 టి20 మ్యాచ్‌లు ఆడింది. ఆరుగురు ప్లేయర్లను కాంట్రాక్ట్ నుంచి తొలగించి ఐదుగురిని కొత్తగా ఎంపిక చేశారు. అనూహ్యాలేమీ లేకుండా టాప్ ప్లేయర్లు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఓపెనర్ స్మృతి మంధాన, ఆల్‌రౌండర్ దీప్తి శర్మలు ‘ఎ’ గ్రేడ్‌లోనే కొనసాగుతున్నారు. గత ఏడాది అక్టోబర్ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయినా... షఫాలీ వర్మ తన ‘బి’ గ్రేడ్ కాంట్రాక్ట్‌ను నిలబెట్టుకోవడం విశేషం. హెడ్ కోచ్ అమోల్ మజుందార్, సెలక్షన్ కమిటీ చైర్మన్ నీతూ డేవిడ్ సిఫారసు ప్రకారం బోర్డు ఈ కాంట్రాక్ట్‌లను అందించింది. భారత క్రికెటర్ల కాంట్రాక్ట్ జాబితా గ్రేడ్ ‘ఎ’ (ఏడాదికి రూ. 50 లక్షలు): హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ. గ్రేడ్ ‘బి’ (ఏడాదికి రూ. 30 లక్షలు): రేణుకా ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, షఫాలీ వర్మ. గ్రేడ్ ‘సి’ (ఏడాదికి రూ. 10 లక్షలు): యస్తిక భాటియా, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, టిటాస్ సాధు, అరుంధతి రెడ్డి, అమన్‌జోత్ కౌర్, ఉమా ఛెత్రి, స్నేహ్ రాణా, పూజ వస్త్రకర్. -
BCCI: వార్షిక కాంట్రాక్టులు ప్రకటించిన బీసీసీఐ.. వాళ్లపై వేటు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మహిళా క్రికెటర్లకు సంబంధించి వార్షిక కాంట్రాక్టుల జాబితా విడుదల చేసింది. 2024-25 ఏడాదికి గానూ గ్రేడ్-ఎ, బి, సిలలో చోటు దక్కించుకున్న ప్లేయర్ల పేర్లను సోమవారం వెల్లడించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana), ఆల్‌రౌండర్ దీప్తి శర్మ గ్రేడ్-‘ఎ’లో తమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు.మరోవైపు.. రేణుకా ఠాకూర్ (Renuka Thakur), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, షఫాలీ వర్మ గ్రేడ్-‘బి’లో స్థానం పదిలం చేసుకున్నారు. అయితే, బౌలర్ రాజేశ్వర్ గైక్వాడ్‌కు మాత్రం ఈసారి ఈ జాబితాలో చోటు దక్కలేదు.వాళ్లపై వేటు.. వీరికి తొలిసారి చోటుఇక గ్రేడ్-‘సి’లో ఉన్న హర్లీన్ డియోల్, మేఘనా సింగ్, దేవికా వైద్య, సబ్బినేని మేఘన, అంజలి శర్వాణిలపై బీసీసీఐ ఈసారి వేటు వేసింది. వర్ధమాన స్టార్లు శ్రేయాంక పాటిల్, టైటస్ సాధు, అరుంధతి రెడ్డి, అమన్‌జ్యోత్ కౌర్, ఉమా ఛెత్రిలకు తొలిసారిగా, గ్రేడ్-‘సి’లో చోటు ఇచ్చింది.ఈ మేరకు.. ‘‘టీమిండియా సీనియర్ వుమెన్ జట్టుకు సంబంధించి బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు ప్రకటించింది. 2024-2025 సీజన్ (అక్టోబరు 1, 2024-సెప్టెంబరు 30, 2025)గానూ వివరాలు వెల్లడించడమైనది’’ అని బీసీసీఐ సోమవారం నాటి ప్రకటనలో పేర్కొంది. సమీప భవిష్యత్తులో ప్రకటించంఅయితే, పురుషుల సీనియర్ జట్టుకు సంబంధించి సమీప భవిష్యత్తులో వార్షిక కాంట్రాక్టుల జాబితా ప్రకటించబోమని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా గురువారం స్పోర్ట్స్ స్టార్‌కు వెల్లడించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. మహిళా క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టులకు సంబంధించి మూడు గ్రేడ్ల ప్లేయర్ల జీతాలు వేరుగా ఉంటాయి. అయితే, ఆ మొత్తం ఎంత అన్నది మాత్రం బీసీసీఐ ఈసారి వెల్లడించలేదు. ఆఖరిసారిగా బీసీసీఐ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. గ్రేడ్-‘ఎ’లో ఉన్న ప్లేయర్లకు రూ. 50 లక్షలు, గ్రేడ్-‘బి’లో ఉన్న క్రికెటర్లకు రూ. 30 లక్షలు, గ్రేడ్-‘సి’లో ఉన్న ప్లేయర్లకు రూ. 10 లక్షల చొప్పున వార్షిక వేతనం చెల్లిస్తారు.అయితే, పురుష క్రికెటర్లతో పోలిస్తే మహిళా క్రికెటర్లకు చెల్లించే మొత్తం అసలు ఏమాత్రం లెక్కకాదు. పురుష క్రికెటర్లలో A+ గ్రేడ్‌లో ఉన్న వారికి రూ. 7 కోట్లు, A గ్రేడ్‌లో ఉన్నవారికి రూ. 5 కోట్లు, B గ్రేడ్‌లో ఉన్న వారికి రూ. 3 కోట్లు, C గ్రేడ్‌లో ఉన్నవారికి రూ. కోటి చొప్పున బీసీసీఐ చెల్లిస్తోంది.బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు(2024-25)గ్రేడ్-ఎ: హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మగ్రేడ్-బి : రేణుకా సింగ్ ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, షఫాలీ వర్మగ్రేడ్-సి : యస్తికా భాటియా, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, టైటస్ సాధు, అరుంధతి రెడ్డి, అమన్‌జోత్ కౌర్, ఉమా ఛెత్రి, స్నేహ్ రాణా, పూజా వస్త్రాకర్.చదవండి: కలకాలం గుర్తుండిపోతుంది!.. ఎవరీ విఘ్నేశ్?.. ధోని కూడా ఫిదా! -
‘అత్యుత్తమ ఆల్‌రౌండర్ కావడమే లక్ష్యం’
న్యూఢిల్లీ: భారత్ పేస్ బౌలర్ అరుంధతి రెడ్డి 2024లో 5 వన్డేలు ఆడి 8 వికెట్లు పడగొట్టింది. వాటిలో పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో 26 పరుగులకే 4 వికెట్లు తీసి సత్తా చాటిన మ్యాచ్ కూడా ఉంది. ఇదే ఏడాది 7 టి20ల్లో కేవలం 6.50 ఎకానమీతో 10 వికెట్లు పడగొట్టింది. ఇందులో వరల్డ్ కప్‌లో తీసిన 7 వికెట్లు కూడా ఉన్నాయి. ఎలా చూసినా భారత మహిళల జట్టు కోణంలో ఇది మెరుగైన ప్రదర్శనే. కానీ అనూహ్యంగా సెలక్టర్లు ఆమెపై వేటు వేశారు. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే, టి20 సిరీస్‌లతో పాటు ఇటీవల ఐర్లాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో కూడా అరుంధతిని ఎంపిక చేయలేదు. హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల అరుంధతిపై వేటు పడటం అందరినీ ఆశ్చర్యపర్చింది. అయితే ఇలాంటివన్నీ తన చేతుల్లో లేవని... తన వైపు నుంచి అత్యుత్తమ ఆటతీరు కనబర్చడమే తాను చేయగలిగిందని ఆమె వ్యాఖ్యానించింది. ‘ఆస్ట్రేలియాతో సిరీస్ తర్వాత సరిగ్గా ఏం జరిగిందో నాకూ తెలీదు. అయితే ఈ విషయంలో నేను చేయగలిగిందేమీ లేదు. క్రికెట్ బాగా ఆడటం మాత్రమే నాకు తెలిసిన విద్య. కాబట్టి భారత్ తరఫున ఎప్పుడు అవకాశం దక్కినా అదే చేసి చూపిస్తా. ఏ స్థాయిలో ఏ జట్టు తరఫున ఆడినా మైదానంలోకి దిగగానే జట్టును గెలిపించేందుకే ప్రయత్నిస్తా. మొదటినుంచి నేను క్రికెట్‌ను ఇలాగే ఆడాను’ అని అరుంధతి పేర్కొంది. కోచ్ అండతో... భారత జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత ఆడిన చాలెంజర్ ట్రోఫీ తనకు కూడా తగిన సవాల్ విసిరిందని... కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమించి తన జట్టు (టీమ్ ‘ఎ’)ను ఫైనల్ చేర్చడం సంతృప్తిగా ఉందని ఆమె వెల్లడించింది. అయితే ఆటలో ఉండే అనిశ్చితిని ఎదుర్కోవడం అంత సులువు కాదని అరుంధతి అంగీకరించింది. జట్టులో స్థానం కోల్పోయిన సమయంలో తాను మానసికంగా నిరాశకు లోను కాకుండా తన కోచ్ అర్జున్ దేవ్ అండగా నిలిచారని అరుంధతి గుర్తు చేసుకుంది. బెంగళూరులోని ఎన్ఐసీఈ అకాడమీలో అర్జున్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ‘భారత జట్టుకు ఆడినా ఆడకపోయినా... వేరే ఏ టీమ్‌కు ఆడినా ప్రపంచంలో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా మారాలనే పట్టుదలతో సాధన చేయి అని ఆయన నాకు చెప్పారు. నేను మళ్లీ భారత్‌కు ఆడగలనా లేదా అంటే జవాబివ్వలేను. ప్రస్తుతం ఉండే అనిశ్చితిలో ఏ ప్లేయర్‌కు కూడా అది సాధ్యం కాదు. కానీ ఈ ప్రపంచంలో నువ్వే అత్యుత్తమ క్రికెటర్వు అంటూ ప్రతీ రోజు నన్ను నేను ప్రోత్సహించుకుంటూ ఉంటాను. అదే నన్ను నడిపిస్తుంది’ అని ఈ హైదరాబాదీ తన మనసులో మాటను చెప్పింది. ఎక్కడైనా ఆట ఒక్కటే... ఇన్నేళ్ల తర్వాత వచ్చిన అనుభవంతో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఆమె వెల్లడించింది. ‘పరిస్థితులను అర్థం చేసుకోగలిగే ప్రస్తుతం నాకు వచ్చిందని చెప్పగలను. ఇప్పుడు ఏ టీమ్‌కు ఆడినా సీనియర్లలో ఒకరిగా ఉంటున్నాను. ఇది నాకు ఎంతో మేలు చేస్తోంది. జూనియర్ అమ్మాయిలకు కొన్ని విషయాలు నేర్పించే క్రమంలో నేను కూడా చాలా నేర్చుకుంటాను. నా నుంచి మరింత మెరుగైన ప్రదర్శన కూడా వస్తుంది. కాబట్టి ఎక్కడ ఆడుతున్నాను. ఏ జట్టు కోసం ఆడుతున్నాను అనేది పట్టించుకోకుండా దీనిపైనే దృష్టి పెడుతున్నాను’ అని ఆమె స్పష్టం చేసింది. జట్టు మార్పుతో... దేశవాళీ క్రికెట్లో ఐదేళ్ల పాటు రైల్వేస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత రెండేళ్ల క్రితం అరుంధతి రెడ్డి కేరళ జట్టుకు మారింది. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఆమె ఎన్నో విధాలా ఆలోచించాల్సి వచ్చినా చివరకు ధైర్యం చేసింది. అయితే కేరళకు మారిన తర్వాత అటు బౌలింగ్ మాత్రమే కాకుండా బ్యాటింగ్‌లో కూడా ఆమె ఎంతో మెరుగైన ప్రదర్శన కనబర్చింది. ‘సుదీర్ఘ కాలంగా దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాను. అయితే గత రెండేళ్లుగా నా ఆటలో ఎంతో మార్పు వచ్చిందనేది వాస్తవం. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదు. కానీ అవి నాకు మేలు చేశాయి. ఇప్పుడు నా ఆటపై నాకు మరింత స్పష్టత రావడంతో టోర్నీలకు సరైన రీతిలో సిద్ధమవుతున్నా. ఆపై ఎలాంటి తడబాటు లేకుండా స్వేచ్ఛగా ఆడగలుగుతున్నా. ఇప్పుడు నాలో ఓటమిభయం కూడా తగ్గింది’ అని అరుంధతి వివరించింది. ‘అటాకింగ్’పై దృష్టి... ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్న అరుంధతి... స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా పని చేస్తోంది. తన బౌలింగ్‌లో పలు మార్పులు చేసుకుంది. ముఖ్యంగా ఆమె బౌలింగ్‌లో ‘అటాకింగ్’ పెరిగింది. గతంలో బ్యాటర్‌ను ఆడకుండా చేసే లక్ష్యంతో ఆఫ్‌స్టంప్ బయటే వరుసగా బంతులు వేసేది. ఇప్పుడు నేరుగా స్టంప్స్‌పైకే బంతులు గురి పెడుతూ బౌలింగ్ చేస్తోంది. కొన్ని సందర్భాల్లో బ్యాటర్లు ఎదురు దాడి చేసే అవకాశం ఉన్నా...ఈ తరహా బౌలింగే ప్రస్తుతం తన బలంగా మారిందని ఆమె స్పష్టం చేసింది. -
Ind vs WI: భారత టీ20, వన్డే జట్ల ప్రకటన.. స్టార్ పేసర్‌పై వేటు
వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో భారత మహిళల జట్టు ఎంపికలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నిలకడగా ఆడుతున్న హైదరాబాద్ పేసర్ అరుంధతీ రెడ్డిపై సెలక్షన్ కమిటీ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది.అరుంధతీ రెడ్డిపై వేటు.. కారణం?కాగా సొంతగడ్డపై భారత్ వెస్టిండీస్ మహిళల జట్టుతో టీ20, వన్డే సిరీస్ ఆడనున్న తరుణంలో అనుభవజ్ఞురాలైన అరుంధతీ రెడ్డిని తప్పించారు. రెండు ఫార్మాట్లలోనూ ఆమెకు ఉద్వాసన పలకడం గమనార్హం. నిజానికి జట్టులో చోటు కోల్పోయేంత పేలవంగా ఆమె ప్రదర్శన అయితే లేదు. కుదురుగా బౌలింగ్ చేస్తున్న ఆమె వికెట్లు లేదంటే పరుగుల కట్టడితో ఆకట్టుకుంటోంది. అయినప్పటికీ వేటు వేయడం గమనార్హం.వారిద్దరికి తొలిసారి చోటుఇక విండీస్ సిరీస్ నేపథ్యంలో భారత జట్టులో ముగ్గురు కొత్త ముఖాలకు చోటిచ్చారు. ప్రతిక రావల్, తనూజ కన్వర్లను తొలిసారి వన్డే జట్టులోకి తీసుకోగా... నందిని కశ్యప్, రాఘవి బిస్త్‌లను తొలిసారి టీ20 జట్టులోకి ఎంపిక చేశారు. ఈ రెండు జట్లకు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌరే సారథ్యం వహించనుంది.టీ20 సిరీస్‌తో ఆరంభంముందుగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ నెల 15, 17, 19 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అనంతరం వడోదరలో ఈ నెల 22, 24, 27 తేదీల్లో మూడే వన్డేల సిరీస్ జరుగుతుంది.ఇక ఈ రెండు సిరీస్‌లకు షఫాలీ వర్మను కూడా ఎంపిక చేయలేదు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌కు ఫామ్‌లో లేని షఫాలీకి ఉద్వాసన పలికారు. గాయాల కారణంగా యస్తిక భాటియా, శ్రేయాంక పాటిల్, ప్రియా పూనియాలను సెలక్షన్‌కు పరిగణించలేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, నందిని కశ్యప్, జెమీమా, రిచా ఘోష్, ఉమా ఛెత్రి, దీప్తి శర్మ, సజన సజీవన్, రాఘవి బిస్త్, రేణుక సింగ్, ప్రియా మిశ్రా, టిటాస్ సాధు, సైమా ఠాకూర్, మిన్ను మణి, రాధా యాదవ్.వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెపె్టన్), స్మృతి మంధాన, జెమీమా, రిచా ఘోష్, ఉమా ఛెత్రి, దీప్తి శర్మ, రేణుక సింగ్, ప్రియా మిశ్రా, టిటాస్ సాధు, సైమా ఠాకూర్, మిన్ను మణి, తేజల్ హసబ్నిస్, ప్రతిక రావల్, తనూజ కన్వర్. చదవండి: భారత్‌తో టీ20, వన్డే సిరీస్.. వెస్టిండీస్ జట్టు ప్రకటన.. స్టార్ ఆల్‌రౌండర్ మిస్ -
ఆస్ట్రేలియా బ్యాటర్ల ఊచకోత.. భారత్ ముందు భారీ టార్గెట్
ఆస్ట్రేలియాలో భారత మహిళా జట్టు బౌలర్ల వైఫల్యం కొనసాగుతోంది. పెర్త్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో సైతం భారత బౌలర్లు తీవ్ర నిరాశపరిచారు. మన బౌలర్లను ఆసీస్ బ్యాటర్లు ఉతికారేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఆసీస్ బ్యాటర్లలో అన్నాబెల్ సదర్లాండ్(95 బంతుల్లో 110, 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. గార్డనర్(50), కెప్టెన్ మెక్‌గ్రాత్(56 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్లలో ఒక్క అరుంధతి రెడ్డి మినహా మిగతా అందరూ తీవ్ర నిరాశపరిచారు. అరుంధతి తన 10 ఓవర్ల కోటాలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. కాగా ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో ఘోర ఓటమి చవిచూసిన భారత జట్టు 2-0 తేడాతో సిరీస్‌ను ఆస్ట్రేలియాకు అప్పగించేసింది. కనీసం ఆఖరి వన్డేలోనైనా గెలిచి వైట్ వాష్ నుంచి తప్పించుకోవాలని హర్మాన్ సేన భావిస్తోంది. ఇప్పుడు ఆ భారమంతా భారత బ్యాటర్లపైనే ఉంది. -
టీమిండియా కెప్టెన్‌కు విశ్రాంతి.. కారణం?
వుమెన్స్ ఆసియా టీ20 కప్-2024లో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఇప్పటి వరకు ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో భారీ విజయాలు సాధించి సెమీస్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో నేపాల్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్‌కు విశ్రాంతినిచ్చింది. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టింది. హర్మన్, పూజా స్థానాల్లో బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఎస్.సజన, ఫాస్ట్ బౌలర్ అరుంధతిరెడ్డి తుదిజట్టులో స్థానం దక్కించుకున్నట్లు తెలిపింది.డంబుల్లా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ షెఫాలీ వర్మ పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టింది. పవర్ ప్లే ముగిసే సరికి 19 బంతులు ఎదుర్కొని 32 పరుగులు సాధించింది.మరో ఓపెనర్ దయాలన్ హేమలత 17 బంతుల్లో 15 రన్స్ చేసింది. ఈ క్రమంలో ఆరు ఓవర్లు(పవర్ ప్లే) పూర్తయ్యేసరికి టీమిండియా హాఫ్ సెంచరీ మార్కు అందుకుంది. యాభై పరుగులు పూర్తి చేసుకుంది.ఇండియా వుమెన్ వర్సెస్ నేపాల్ వుమెన్ తుదిజట్లుభారత్షెఫాలీ వర్మ, స్మృతి మంధాన (కెప్టెన్), దయాలన్ హేమలత, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, ఎస్ సజానా, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్, అరుంధతి రెడ్డి.నేపాల్సంఝనా ఖడ్కా, సీతా రాణా మగర్, కబితా కున్వర్, ఇందు బర్మా (కెప్టెన్), డాలీ భట్టా, రుబీనా ఛెత్రి, పూజా మహతో, కబితా జోషి, కాజల్ శ్రేష్ఠ (వికెట్ కీపర్), సబ్నమ్ రాయ్, బిందు రావల్.గ్రూప్-ఏ పాయింట్ల పట్టిక ఇలాఆసియా కప్-2024లో గ్రూప్-ఏలో ఇండియా, పాకిస్తాన్, నేపాల్, యూఏఈ జట్లు ఉన్నాయి. భారత్ ఇప్పటి వరకు పాకిస్తాన్, యూఏఈలపై గెలిచి టాపర్(నెట్ రన్‌రేటు +3.298)గా ఉంది.ఇక తొలి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఓడిన పాకిస్తాన్.. తర్వాత నేపాల్, యూఏఈలపై విజయం సాధించింది. తద్వారా మూడింట రెండు గెలిచి రెండో స్థానం(నెట్ రన్‌రేటు + 1.158)లో కొనసాగుతోంది.ఇక శ్రీలంక, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, మలేషియా గ్రూప్-బిలో ఉన్నాయి. శ్రీలంక, థాయ్‌లాండ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.నేపాల్‌తో భారత్ మ్యాచ్ ఫలితం తర్వాత సెమీస్ బెర్తులు అధికారికంగా ఖరారుకానున్నాయి. -
WPL 2023: వేలంలో అత్యధిక ధర పలికిన తెలుగు క్రికెటర్? ఎవరు ఏయే జట్లకు ఆడబోతున్నారంటే..
Women Cricketers From Telugu States In WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ వేలం-2023లో ఆరుగురు తెలుగు అమ్మాయిలు మంచి ధర దక్కించుకున్నారు. అంజలి శర్వాణి, సబ్బినేని మేఘన, షబ్నమ్ షకీల్, సొప్పదండి యషశ్రీ, అరుంధతి రెడ్డి, స్నేహ దీప్తి ఆటతో సత్తా చాటి ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించారు. వేలంలో వీరికి పలికిన ధర, వీరు ఏయే జట్లకు ఆడబోతున్నారన్న అంశాలు సంక్షిప్తంగా.. అంజలి శర్వాణి ►లెఫ్టార్మ్ పేస్ బౌలర్. కర్నూల్ జిల్లా ఆదోని స్వస్థలం. భారత్ తరఫున 6 టి20లు మ్యాచ్‌లు ఆడింది. ►జట్టు: యూపీ వారియర్జ్ ►ధర: 55 లక్షలు సబ్బినేని మేఘన ►బ్యాటర్, స్వస్థలం విజయవాడ. భారత్ తరఫున 3 వన్డేలు, 17 టి20 మ్యాచ్‌లు ఆడింది. ►జట్టు: గుజరాత్ జెయింట్స్ ►ధర: రూ.30 లక్షలు షబ్నమ్ షకీల్ ►రైట్ ఆర్మ్ పేస్ బౌలర్. స్వస్థలం విశాఖపట్నం. ఇటీవల అండర్–19 ప్రపంచకప్‌లో ఆడింది. ►జట్టు- గుజరాత్ జెయింట్స్ ►ధర: రూ.10 లక్షల సొప్పదండి యషశ్రీ ►పేస్ బౌలర్. హైదరాబాద్ స్వస్థలం. ఇటీవల అండర్–19 ప్రపంచ కప్‌లో ఆడింది. ►జట్టు: యూపీ వారియర్స్ ►ధర: రూ.10 లక్షలు అరుంధతి రెడ్డి ►రైట్ ఆర్మ్ పేస్ బౌలర్. స్వస్థలం హైదరాబాద్. భారత్ తరఫున 26 టి20లు ఆడింది. ►జట్టు: ఢిల్లీ క్యాపిటల్స్ ►ధర: రూ.30 లక్షలు వి. స్నేహ దీప్తి ►బ్యాటర్. స్వస్థలం విశాఖపట్నం. భారత్ తరఫున 1 వన్డే, 2 టి20లు ఆడింది. ►జట్టు: ఢిల్లీ క్యాపిటల్స్ ►ధర: రూ.30 లక్షలు. వీరిలో అంజలి శర్వాణి అత్యధికంగా 55 లక్షలు పలికింది. ఇదిలా ఉంటే... అండర్-19 మహిళల ప్రపంచకప్-2023లో సత్తా చాటిన తెలంగాణ అమ్మాయి, భద్రాచలానికి చెందిన గొంగడి త్రిష మాత్రం వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయింది. చదవండి: WPL 2023 Auction: స్మృతికి అంత ధరెందుకు? వాళ్లకేం తక్కువ కాలేదు.. హర్మన్ విషయంలో మాత్రం.. WPL Auction 2023: అన్ సోల్డ్‌గా మిగిలిపోయిన తెలంగాణ అమ్మాయి


