
మహిళల వన్డే ప్రపంచకప్‌కు (ICC Women's World Cup 2025) ముందు భారత జట్టుకు (Team India) ఊహించని షాక్ తగిలింది. వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇవాళ (సెప్టెంబర్ 25) జరిగిన మ్యాచ్‌లో స్టార్ పేసర్ అరుంధతి రెడ్డి (Arundathi Reddy) గాయపడింది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో హీథర్ నైట్ ఆడిన బంతిని క్యాచ్ పట్టే ప్రయత్నంలో అరుంధతి, తన ఎడమ కాలుపై తేడాగా ల్యాండ్ అయ్యింది. దీంతో చాలా సేపు నొప్పితో విలవిలలాడుతూ నేలపై ఉండిపోయింది. ఫిజియో వచ్చి పరీక్షించిన తర్వాత, ఆమెను వీల్ చైర్‌లో తీసుకెళ్లారు.
అరుంధతి గాయం తీవ్రతపై స్పష్టత లేదు. స్కాన్ల కోసం ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మరి కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే వరల్డ్‌కప్‌లో ఆమె పాల్గొనడం అనుమానంగా మారింది.
27 ఏళ్ల అరుంధతి గత కొంతకాలంగా టీమిండియాలో కీలక బౌలర్‌గా వ్యవహరిస్తుంది. ఈ ఏడాది ఆమె 6 ఇన్నింగ్స్‌ల్లో 7 వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉంది. ఒకవేళ మెగా టోర్నీ నుంచి అరుంధతి తప్పుకుంటే, బీసీసీఐ ఆమె ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. టీమిండియా సెప్టెంబర్ 30న శ్రీలంకతో జరిగే మ్యాచ్‌తో తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది.
వార్మప్ మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్.. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (120 నాటౌట్) సెంచరీతో కదంతొక్కడంతో భారీ స్కోర్ దిశగా సాగుతోంది. బ్రంట్‌కు జతగా ఎమ్మా లాంబ్ (74 నాటౌట్) క్రీజ్‌లో ఉంది. 42 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 277/3గా ఉంది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో యామీ జోన్స్ 39, హీథర్ నైట్ 37 పరుగులు చేయగా.. ట్యామీ బేమౌంట్ డకౌటైంది. భారత బౌలర్లలో రేణుకా సింగ్, అరుంధతి రెడ్డి తలో వికెట్ తీశారు.