
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ 2025 వార్మప్ మ్యాచ్‌లు (ICC Women's World Cup 2025 Warm up Matches) ఇవాల్టి నుంచి (సెప్టెంబర్ 25) ప్రారంభమయ్యాయి. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మరియు కొలొంబోలోని వేర్వేరు మైదానాల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతున్నాయి.
తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్-ఏ (India A vs New zealand) 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. ఇసబెల్లా గేజ్ (101) అజేయ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది.
అనంతరం భారత్ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా వర్షం ప్రారంభమైంది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన టార్గెట్‌ను 40 ఓవర్లలో 224 పరుగులుగా నిర్దేశించారు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికే భారత్ టార్గెట్‌ను రీచ్ అయ్యింది (39.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది). దీంతో భారత్‌ను విజేతగా ప్రకటించారు.
121 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన టీమిండియాను కెప్టెన్ మిన్నూ మణి (39 నాటౌట్), మమత మడివాలా (56 నాటౌట్) ఆదుకున్నారు. అంతకుముందు షఫాలీ వర్మ (49 బంతుల్లో 70) విధ్వంసకర అర్ద శతకంతో ఆకట్టుకుంది.
బెంగళూరులోనే జరుగుతున్న మరో మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా 36 ఓవర్ల అనంతరం 3 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (89), ఎమ్మా లాంబ్ (45) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో రేణుకా ఠాకూర్, అరుంధతి రెడ్డి తలో వికెట్ తీశారు.
కొలొంబోలో జరుగుతున్న మరో రెండు మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా-బంగ్లాదేశ్, శ్రీలంక-పాకిస్తాన్ తలపడుతున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా ఆగిపోయాయి.
చదవండి: IND VS AUS: కేఎల్ రాహుల్‌కు గాయం.. సెంచరీ దిశగా సాగుతుండగా..!