న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌కు భారత స్టార్ ప్లేయర్లు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. టీ20 వరల్డ్ కప్ 2026 దృష్ట్యా సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
వన్డేలకు దూరంగా ఉండనున్న హార్దిక్-బుమ్రా.. తిరిగి జనవరి 21 నుండి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మాత్రం ఆడనున్నాడు. ఈ టీ20 సిరీస్ ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరగనుంది. మొత్తం ఐదు మ్యాచ్‌లలోనూ వారిద్దరూ ఆడనున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌కు కూడా వర్క్ లోడ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా వీరిద్దరి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు.
సఫారీలతో టీ20 సిరీస్‌లో మాత్రం ఆడారు. ఇప్పుడు అదే జరగనుంది. హార్దిక్ పాండ్యా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత ఇప్పటివరకు ఒక్క వన్డే కూడా ఆడలేదు. అదే విధంగా జస్ప్రీత్ బుమ్రా 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత వన్డే ఫార్మాట్‌కు దూరంగా ఉండనున్నాడు.
బుమ్రా టెస్టుల్లో దుమ్ములేపుతుంటే.. పాండ్యా టీ20ల్లో అదరగొడుతున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన టీ 20 సిరీస్‌లో పాండ్యా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. ఒకవేళ కివీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు పాండ్యా దూరమైతే ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి జట్టులో దక్కనుంది. ఈ వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సైతం తిరిగి జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది.
కివీస్‌తో వన్డేలకు భారత జట్టు (అంచనా)
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ /ఇషాన్ కిషన్ , రుతురాజ్ గైక్వాడ్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్
చదవండి: మహ్మద్ షమీకి బీసీసీఐ భారీ షాక్..!


