2025-26 సీజన్‌కు గాను భారత పురుషల క్రికెట్ జట్టు సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటించేందుకు బీసీసీఐ సిద్దమైంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు ఈ జాబితా వెలువడే అవకాశముంది. అయితే ఈసారి సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను డిమోట్ చేయనున్నట్లు సమాచారం. రో-కో ప్రస్తుతం గ్రేడ్ 'ఎ' ప్లస్‌లో ఉన్నారు. అయితే వీరిద్దరూ ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతుండడంతో కాంట్రాక్ట్‌లో మార్పు చోటు చేసుకునే అవకాశముంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం మూడు ఫార్మాట్లలో ఆడేవారికే గ్రేడ్ ఎ ప్లస్ దక్కుతుంది. మరోవైపు వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ప్రమోషన్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తుందంట. గిల్ గ్రేడ్ ఎ నుంచి ఎ ప్లస్‌కు వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
షమీపై వేటు..
ఇక స్టార్ పేసర్ మహ్మద్ షమీకి భారీ షాక్ తగిలే అవకాశముంది. గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న షమీని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించే యోచనలో బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. షమీ చివరగా భారత్ తరపున ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడాడు.
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కాలంటే సదరు ఆటగాడు ఒక ఏడాదిలో నిర్ణీత సంఖ్యలో మ్యాచ్‌లు ఆడాలి లేదా జట్టు ఎంపికకు అందుబాటులో ఉండాలి. కానీ షమీ ఈ ఏడాది మార్చి నుంచి ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ క్రమంలోనే అతడిపై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
షమీ ప్రస్తుతం గ్రేడ్-ఎలో ఉన్నాడు. అందుకు గాను ఏడాదికి రూ.5 కోట్లు వేతనం అందుకుంటున్నాడు. షమీకి ఒకవేళ ఇప్పుడు కాంట్రాక్ట్ దక్కకపోయినా.. ఏడాది మధ్యలో జట్టులోకి వచ్చి 3 టెస్టులు లేదా 8 వన్డేలు లేదా 10 టీ20లు ఆడితే ఆటోమేటిక్‌గా ప్రో-రాటా పద్ధతిలో కాంట్రాక్ట్ దక్కుతుంది.
షమీ ప్రస్తుతం దేశవాళీ టోర్నీల్లో క్రమం తప్పకుండా ఆడుతున్నాడు. అతడు పూర్తి ఫిట్‌నెస్‌తో కన్పిస్తున్నాడు. అంతేకాకుండా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అయినప్పటికి సెలక్టర్లు అతడిని జాతీయ జట్టులోకి తీసుకోవడం లేదు. అదేవిధంగా షమీతో పాటు మరో బెంగాల్ స్పీడ్ స్టార్ కూడా తన కాంట్రాక్ట్‌ను కోల్పోయే అవకాశముంది.
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా 2024-2025..
గ్రేడ్ A+: విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా
గ్రేడ్ A: రిషబ్ పంత్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, KL రాహుల్, శుభమన్ గిల్, హార్దిక్ పాండ్య
గ్రేడ్ B: సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, శ్రేయాస్ అయ్యర్, యశస్వి జైస్వాల్
గ్రేడ్ సి: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ రాశి వరుణ్, అభిషేక్ దీప్‌వర్త్ శర్మ
చదవండి: భారత్ తరపున ఆడాడు.. కట్ చేస్తే! ఊహించని షాక్చిన పాకిస్తాన్


