స్వదేశంలో భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు పూర్తి కాగా.. మూడింట టీమిండియానే గెలిచింది. తద్వారా మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఈ క్రమంలో ఇవాళ (డిసెంబర్ 28) నాలుగో మ్యాచ్ జరుగనుంది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌లో భారత్ టాస్ కోల్పోవడం ఇదే తొలిసారి.
ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో రెండు మార్పులు చేశాయి. భారత్ తరఫున జెమీమా రోడ్రిగ్స్, క్రాంతి గౌడ్ స్థానాల్లో హర్లీన్ డియోల్, అరంధతి రెడ్డి తుది జట్టులోకి వచ్చారు. శ్రీలంక తరఫున ఇనోకా, మదరా స్థానాల్లో కావ్య కవింది, రష్మిక సెవ్వంది ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి వచ్చారు.
తుది జట్లు..
శ్రీలంక: హాసిని పెరెరా, చమరి అతపత్తు(సి), హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, ఇమేషా దులానీ, నీలక్షికా సిల్వా, కౌషని న్యూత్యాంగన(w), మల్షా షెహానీ, రష్మిక సెవ్వంది, కావ్య కవింది, నిమేషా మదుషాని
భారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), రిచా ఘోష్(w), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, రేణుకా సింగ్ ఠాకూర్, శ్రీ చరణి


