న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డౌగ్ బ్రేస్‌వెల్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 18 ఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్‌కు ముగింపు పలుకుతన్నట్లు స్పష్టం చేశాడు. 35 ఏళ్ల బ్రేస్‌వెల్ న్యూజిలాండ్ తరఫున 2011-23 మధ్యలో 28 టెస్ట్‌లు, 21 వన్డేలు, 20 టీ20లు ఆడాడు.
కుడి చేతి వాటం బ్యాటర్, మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన బ్రేస్‌వెల్ బ్యాటింగ్‌తో పోలిస్తే బౌలింగ్‌లో మెరుగ్గా రాణించాడు. టెస్ట్‌ల్లో 74 వికెట్లు, వన్డేల్లో 26, టీ20ల్లో 20 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో బ్రేస్‌వెల్ ఒకే ఒక హాఫ్ సెంచరీ (వన్డేల్లో) చేశాడు.
2008లో అండర్-19 విభాగం నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రేస్‌వెల్.. అన్ని విభాగాల్లో ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్రేస్‌వెల్ ఐపీఎల్‌లోనూ ఆడాడు. 2012 డ్రాఫ్ట్‌లో అతన్ని ఢిల్లీ డేర్ డెవిల్స్ ఎంపిక చేసుకుంది. ఐపీఎల్ కెరీర్ మొత్తంలో ఒకే ఒక మ్యాచ్ ఆడిన బ్రేస్‌వెల్ 3 వికెట్లు తీశాడు. తొలి మ్యాచ్‌లో 3 వికెట్లు తీసినా అతనికి ఎందుకో అవకాశాలు రాలేదు.
డౌగ్ బ్రేస్‌వెల్ కుటుంబంలో చాలామంది క్రికెటర్లు ఉన్నారు. అతని తండ్రి (బ్రెండన్ బ్రేస్‌వెల్), అంకుల్ (జాన్ బ్రేస్‌వెల్) కూడా న్యూజిలాండ్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం డౌగ్ బ్రేస్‌వెల్ కజిన్స్ మైఖేల్ బ్రేస్‌వెల్, మెలానీ బ్రేస్‌వెల్ న్యూజిలాండ్ సీనియర్ పురుష, మహిళల జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
డౌగ్ బ్రేస్‌వెల్ కెరీర్‌లో గుర్తుండిపోయే ఘట్టం: 2011లో హోబార్ట్‌లో ఆస్ట్రేలియాపై టెస్టులో ఆరు వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శన కారణంగా ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఏడు పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది.
చదవండి: పొట్టి క్రికెట్‌లో పెను సంచలనం


