న్యూజిలాండ్‌కు గట్టి ఎదురుదెబ్బ | Michael Bracewell Ruled Out Of T20 World Cup 2026, New Zealand Name Surprise Replacement, Read Story Inside | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌కు గట్టి ఎదురుదెబ్బ

Feb 11 2026 4:33 PM | Updated on Feb 11 2026 4:44 PM

Michael Bracewell ruled out of T20 World Cup 2026, New Zealand name surprise replacement

టీ20 ప్రపంచకప్‌-2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యూజిలాండ్‌ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ గాయం కారణంగా మెగా టోర్నీ నుంచి వైదొలిగాడు. బ్రేస్‌వెల్‌ ప్రపంచకప్‌కు ముందు భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌ సందర్భంగా గాయపడ్డాడు (కాలి కండరానికి సంబంధించింది). అతను ప్రపంచకప్‌ సమయానికంతా ఫిట్‌నెస్‌ సాధిస్తాడని అశించినా కుదర్లేదు. 

వార్మప్‌ సమయంలో మరోసారి గాయపడ్డాడు. వైద్య పరీక్షల్లో అతని గాయం తీవ్రత అధికంగా ఉందని గుర్తించారు. కనీసం మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో బ్రేస్‌వెల్‌ స్వదేశానికి వెళ్లిపోయాడు. బ్రేస్‌వెల్‌కు ప్రత్యామ్నాయంగా ఆశ్చర్యకర ఎంపిక జరిగింది. 

గత రెండు సంవత్సరాలుగా జట్టుకు దూరంగా ఉన్న కోల్ మెక్‌కాంచీని బ్రేస్‌వెల్‌కు రీప్లేస్‌మెంట్‌గా ప్రకటించారు. మెక్‌కాంచీ న్యూజిలాండ్‌ తరఫున ఇప్పటివరకు 6 వన్డేలు, 12 టీ20లు ఆడారు. 2024లో పాకిస్తాన్‌తో చివరిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. మెక్‌కాంచీ ఇటీవల స్థానికంగా జరిగిన టోర్నీల్లో విశేషంగా రాణించాడు. 125 పరుగులు చేయడంతో పాటు 18 ఇన్నింగ్స్‌ల్లో 20 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శన కారణంగానే అతనికి ప్రపంచకప్‌ బెర్త్‌ దక్కింది.

ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ అండర్‌ డాగ్‌గా బరిలోకి దిగి, ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించింది. ఈ జట్టు వరుసగా ఆఫ్ఘనిస్తాన్‌, యూఏఈపై భారీ విజయాలు నమోదు చేసింది. ఫిబ్రవరి 14 అహ్మదాబాద్‌లో పటిష్టమైన సౌతాఫ్రికాను ఢీకొనేందుకు సిద్దంగా ఉంది. ఫిబ్రవరి 17న తమ చివరి గ్రూప్‌ (డి) మ్యాచ్‌లో కెనడాతో తలపడనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement