సెమీస్‌లో రష్మిక జోడీ | Rashmika Jodi in the semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో రష్మిక జోడీ

Feb 13 2026 3:49 AM | Updated on Feb 13 2026 3:49 AM

Rashmika Jodi in the semis

పుణే: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) డబ్ల్యూ75 మహిళల టోర్నమెంట్‌ డబుల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ ప్లేయర్‌ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో రష్మిక–అంకిత రైనా (భారత్‌) ద్వయం 7–6 (9/7), 6–3తో భారత్‌కే చెందిన వైష్ణవి–వైదేహి జంటపై గెలుపొందింది. 94 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక–అంకిత రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు. 

తమ సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థుల సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేశారు. హైదరాబాద్‌కే చెందిన సహజ యామలపల్లికి మాత్రం నిరాశ ఎదురైంది. డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సహజ (భారత్‌)–జుజానా పావ్లీకౌస్కా (పోలాండ్‌) జంట 6–4, 3–6, 6–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో పొలీనా బఖ్‌ముత్కినా (బెల్జియం)–మరియా గొలోవినా (రష్యా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది.   

Advertisement
 
Advertisement
Advertisement