ప్రపంచ మహిళా వరల్డ్ క్రికెట్ కప్ గెలుపులో తన వంతు కృషిచేసిన తెలంగాణ మహిళా క్రికెట్ క్రీడాకారిణి అరుంధతి రెడ్డికి నేడు శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం లభించింది.
తెలంగాణకు గర్వకారణంగా నిలిచిన అరుంధతి రెడ్డి ఇటీవల జరిగిన 2025 మహిళా వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టుకు విజయాన్ని అందించడంలో కృషి చేసింది. నవంబర్ 2న తొలిసారిగా ప్రపంచ కప్‌ను భారత మహిళల జట్టు గెలుచుకుంది.
ఈ విజయానంతరం నేడు (నవంబర్ 6న) అరుంధతి హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా, కుటుంబ సభ్యులు, అభిమానులు, సన్నిహితులు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టుకు వచ్చి ఆమెను అభినందించారు.
ఇక తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండి డాక్టర్ సోనీ బాలాదేవి సైతం అరుంధతికి ఘన స్వాగతం పలికారు.


