breaking news
Womens Cricket World Cup
-
ప్రపంచకప్ విజేతకు చారిత్రక గౌరవం
2025 మహిళల వన్డే ప్రపంచకప్ విజేత, ఛాంపియన్ జట్టు టీమిండియాలో కీలక సభ్యురాలైన రిచా ఘోష్‌కు (Richa Ghosh) చారిత్రక గౌరవం దక్కింది. రిచా పేరిట ఆమె సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్లో క్రికెట్ స్టేడియం నిర్మితం కానుంది. ఈ విషయాన్ని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించారు.ఇవాళ (నవంబర్ 10) జరిగిన రిచా సన్మాన కార్యక్రమం సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. రిచా జన్మస్థలమైన సిలిగురి పట్టణానికి క్రికెట్ మైదానాన్ని కేటాయిస్తూ.. దానికి రిచా ఘోష్ పేరుతో నామకరణం చేయనున్నట్లు ప్రకటించారు. రిచా సన్మాన కార్యక్రమంలో బెంగాల్ క్రికెట్ దిగ్గజాలు సౌరవ్ గంగూలీ, ఝులన్ గోస్వామి పాల్గొన్నారు. రిచా పశ్చిమ బెంగాల్ నుంచి సీనియర్ ప్రపంచకప్ గెలిచిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఫలితంగా ఆమెకు బెంగాల్ ప్రభుత్వం నుంచి భారీ నజరానాలు అందాయి. ఫైనల్లో సౌతాఫ్రికాపై చేసిన ప్రతి పరుగుకు (34 పరుగులు) రూ. లక్ష చొప్పున రూ. 34 లక్షల చెక్కును రిచాకు అందించారు.అంతకుముందు రోజే ప్రభుత్వం రిచాకు బంగ భూషణ్ బిరుదుతో పాటు రాష్ట్ర పోలీసు శాఖలో డీఎస్పీ ఉద్యోగాన్ని కేటాయించింది. పశ్చిమ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కూడా రిచాకు భారీ తాయిలాలు ప్రకటించింది. గోల్డెన్ బ్యాట్, గోల్డెన్ బాల్‌తో పాటు విలువైన బంగారు గొలుసును బహుకరించింది.కాగా, రిచా ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై అమూల్యమైన ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 24 బంతుల్లో 34 పరుగులు చేసి భారత్ 298 పరుగుల భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించింది. అంతకుముందు ఏడు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లోనూ రిచా మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఛేదనలో కీలక సమయంలో 16 బంతుల్లో 26 పరుగులు చేసి భారత విజయంలో తనవంతు పాత్ర పోషించింది.లీగ్ దశలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ రిచా చెలరేగింది. 77 బంతుల్లోనే 94 పరుగులు చేసింది. ప్రపంచకప్ మొత్తంలో రిచా మెరుపు ఇలాగే కొనసాగాయి. 8 ఇన్నింగ్స్‌ల్లో 133.52 స్ట్రయిక్‌రేట్‌తో 235 పరుగులు చేసింది. కాగా, నవంబర్ 2న జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో భారత్ సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. వికెట్ కీపర్-బ్యాటర్ అయిన రిచా ప్రపంచకప్‌లో మొత్తం 12 సిక్సర్లు బాది, టోర్నీ టాప్ టాప్ హిట్టర్‌గా నిలిచింది. -
బీసీసీఐ చారిత్రక నిర్ణయం..!
మహిళల సీనియర్ క్రికెట్ జట్టు విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలిసారి ఓ విదేశీ వ్యక్తిని టీమిండియా స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా (Strength And Conditioning Coach) నియమించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం బంగ్లాదేశ్ పురుషుల జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న నాథన్ కైలీతో (Nathan Keilty) బీసీసీఐ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అన్ని ఫార్మాలిటీస్ పూర్తై కైలీ భారత మహిళా క్రికెట్ జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా ఎంపికైతే చరిత్ర అవుతుంది. భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్రలో తొలిసారి ఓ విదేశీ వ్యక్తి స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా ఎంపికైనట్లవుతుంది. ఇప్పటివరకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కి చెందిన వారు మాత్రమే మహిళల జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌లుగా పనిచేశారు.ప్రస్తుతం భారత మహిళల జట్టుకు అల్ హర్షా స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో ఆయన అద్భుతంగా పనిచేశారు. కానీ త్వరలో అతనికి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. హర్షా స్థానాన్ని కైలీ భర్తీ చేస్తాడని బీసీసీఐకి చెందిన ఓ కీలక వ్యక్తి క్లూ ఇచ్చాడు.కాగా, ఇటీవలికాలంలో క్రికెట్ జట్ల సక్సెస్‌లో స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌ల పాత్ర క్రియాశీలకంగా మారింది. ప్లేయర్లలో శారీరక సామర్థ్యం, ఫిట్నెస్, గాయాల నివారణ, మానసిక స్థైర్యం వంటి అంశాలను వీరు పర్యవేక్షిస్తారు. జట్టులో ప్రతి ప్లేయర్‌కు వీరు వేర్వురుగా ప్రణాళికలు రూపొందిస్తుంటారు. దేశీయ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌ల పోలిస్తే విదేశీ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌లకు పని అనుభవం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరి సేవల కోసం దాదాపుగా అన్ని జట్లు ఎగబడుతుంటాయి. భారత పురుషుల జట్టు ఇటీవలే దక్షిణాఫ్రికాకు చెందిన అడ్రియన్ లె రూక్స్ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ నియమించుకుంది. చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్‌కు బెదిరింపులు -
లేడీ ధోనికి బంపరాఫర్
భారత మహిళా క్రికెట్ జట్టులో లేడీ ధోనిగా పిలువబడే రిచా ఘోష్‌కు (Richa Ghosh) బంపరాఫర్ లభించింది. ప్రపంచకప్ విధ్వంసాల గౌరవార్దం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం (west Bengal) ఆమెను డీఎస్పీగా (DSP) నియమించింది. భారత్, శ్రీలంక ఇటీవల సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్‌లో (Women' Cricket World Cup 2025_ రిచా వీరవిహారం చేసింది. ఫైనల్, సెమీఫైనల్స్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడి భారత్ ఛాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించింది. ఫలితంగా ఆమెను డీఎస్పీ ఉద్యోగం వరించింది. గతంలో రిచా తరహాలోనే ఇద్దరు భారత క్రికెటర్లను వారివారి సొంత రాష్ట్రాలు డీఎస్పీలుగా నియమించాయి. 2024లో తెలంగాణ ప్రభుత్వం టీమిండియా పేసు గుర్రం మహ్మద్ సిరాజ్‌ను డీఎస్పీగా నియమించింది. ఇటీవలే ప్రపంచకప్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ విజేత దీప్తి శర్మను కూడా ఆమె సొంత రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌లో డీఎస్పీగా నియమించారు.ప్రపంచకప్ గెలిచిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి విచ్చేసిన రిచాను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) మరియు సిలిగురి మున్సిపల్ కార్పొరేషన్ ఘనంగా సత్కరించాయి. బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం రిచాకు డీఎస్పీ ఉద్యోగం ఇవ్వడంతో పాటు బంగ భూషణ్ బిరుదుతోనూ సత్కరించింది. రిచా 2025 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై అమూల్యమైన ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 24 బంతుల్లో 34 పరుగులు చేసి భారత్ 298 పరుగుల భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించింది. అంతకుముందు ఏడు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లోనూ రిచా మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఛేదనలో కీలక సమయంలో 16 బంతుల్లో 26 పరుగులు చేసి భారత విజయంలో తనవంతు పాత్ర పోషించింది.లీగ్ దశలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ రిచా చెలరేగింది. 77 బంతుల్లోనే 94 పరుగులు చేసింది. ప్రపంచకప్ మొత్తంలో రిచా మెరుపు ఇలాగే కొనసాగాయి. 8 ఇన్నింగ్స్‌ల్లో 133.52 స్ట్రయిక్‌రేట్‌తో 235 పరుగులు చేసింది. కాగా, నవంబర్ 2న జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో భారత్ సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. చదవండి: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ఆరోసారి ఛాంపియన్ -
AP: ఎంఎస్కే ప్రసాద్‌కు ఘోర అవమానం
టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్, ఆంధ్రప్రదేశ్ మాజీ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్‌కు ఘోర అవమానం జరిగింది. మహిళల వన్డే ప్రపంచకప్-2025 విన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణికి స్వాగతం పలికేందుకు ఎంఎస్కే ఇవాళ గన్నవరం విమానాశ్రయానికి వెళ్లగా.. అక్కడి ప్రోటోకాల్ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. జాబితాలో పేరు లేదని బయటికి పంపించారు.ఎయిర్‌పోర్ట్‌లో తనకు జరిగిన అవమానాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎంఎస్కే సీఎంఓలో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లోని (ఏసీఏ) కొందరు ముఖ్యులపై బీసీసీఐకి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు. భారత సీనియర్ క్రికెట్ జట్టుకు చీఫ్ సెలెక్టర్‌గా వ్యవహరించిన తనకు ప్రోటోకాల్ ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అనంతరం శ్రీచరణి అభినందన కార్యక్రమానికి కూడా ఎంఎస్కే హాజరు కాలేదు. విమానాశ్రయం నుంచి జరిగిన ర్యాలీ లో కూడా కనిపించలేదు. సీఎం చంద్రబాబు, లోకేష్‌తో శ్రీచరణి భేటికి కూడా వెళ్లలేదు.కాగా, విమానాశ్రయంలోని ఎంట్రీ లాంజ్‌లోకి చాలామంది రాజకీయ నాయకులను అనుమతిచ్చిన ప్రోటోకాల్ సిబ్బంది.. టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ అయిన ఎంఎస్కే ప్రసాద్‌ను మాత్రం అనుమతించలేదు. -
అరుంధతి రెడ్డికి ఘన స్వాగతం పలికిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ
ప్రపంచ మహిళా వరల్డ్ క్రికెట్ కప్ గెలుపులో తన వంతు కృషిచేసిన తెలంగాణ మహిళా క్రికెట్ క్రీడాకారిణి అరుంధతి రెడ్డికి నేడు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది.తెలంగాణకు గర్వకారణంగా నిలిచిన అరుంధతి రెడ్డి ఇటీవల జరిగిన 2025 మహిళా వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టుకు విజయాన్ని అందించడంలో కృషి చేసింది. నవంబర్ 2న తొలిసారిగా ప్రపంచ కప్‌ను భారత మహిళల జట్టు గెలుచుకుంది. ఈ విజయానంతరం నేడు (నవంబర్ 6న) అరుంధతి హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా, కుటుంబ సభ్యులు, అభిమానులు, సన్నిహితులు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టుకు వచ్చి ఆమెను అభినందించారు.ఇక తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండి డాక్టర్ సోనీ బాలాదేవి సైతం అరుంధతికి ఘన స్వాగతం పలికారు. -
ఛాంపియన్ టీమ్ కెప్టెన్‌కు మొండిచెయ్యి..!
మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 టీమ్ ఆఫ్ ద టోర్నీని (Women's Cricket World Cup Team of the Tournament) ఐసీసీ ఇవాళ (నవంబర్ 4) ప్రకటించింది. ఈ జట్టులో ఛాంపియన్ జట్టు భారత్ నుంచి ముగ్గురు, రన్నరప్ జట్టు సౌతాఫ్రికా నుంచి ముగ్గురికి అవకాశం దక్కింది. అలాగే ఏడు సార్లు ఛాంపియన్, ఈ ఎడిషన్ సెమీఫైనలిస్ట్ అయిన ఆస్ట్రేలియా నుంచి కూడా ముగ్గురికి చోటు లభించింది. ఈ ఎడిషన్ మరో సెమీ ఫైనలిస్ట్ అయిన ఇంగ్లండ్ నుంచి ఒకరు, లీగ్ దశలో నిష్క్రమించిన పాకిస్తాన్ నుంచి ఒకరికి అవకాశం దక్కింది. ఇంగ్లండ్‌కు చెందిన మరో ప్లేయర్‌కు 12వ సభ్యురాలిగా అవకాశం లభించింది. ఆశ్చర్యకరంగా ఈ జట్టులో ఛాంపియన్ టీమ్ కెప్టెన్‌కు (Harmanpreet Kaur) చోటు దక్కలేదు.బెర్త్‌లు పరిమితిగా ఉండటంతో ఛాంపియన్ టీమ్ కెప్టెన్‌కు చోటు కల్పించలేకపోయామని ఐసీసీ వివరణ ఇచ్చింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా రన్నరప్ టీమ్ కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ ఎంపిక కాగా.. అదే జట్టు నుంచి పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మారిజాన్ కాప్, ఆల్‌రౌండర్ నదినే డి క్లెర్క్ చోటు దక్కించుకున్నారు.లారా సెమీస్, ఫైనల్స్‌లో సెంచరీలు సహా టోర్నీ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలువగా.. కాప్ 2 అర్ద సెంచరీలు సహా 208 పరుగులు చేసి 12 వికెట్లు తీసింది. డి క్లెర్క్ 52 సగటున, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 208 పరుగులు చేసి, 26.11 సగటున 9 వికెట్లు తీసింది.భారత్ నుంచి టోర్నీ సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్ స్మృతి మంధన, సెమీస్‌లో ఆస్ట్రేలియాపై వీరోచిత శతకం బాదిన జెమీమా రోడ్రిగ్స్, ఫైనల్లో హాఫ్ సెంచరీ సహా 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన దీప్తి శర్మకు చోటు దక్కింది.మంధన సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 434 పరుగులు చేయగా.. జెమీ సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 292 పరుగులు చేసింది. దీప్తి సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు సహా 22 వికెట్లు తీసి, టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచింది. ఈ ప్రదర్శనలకు గానూ దీప్తి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగానూ నిలిచింది.ఆస్ట్రేలియా నుంచి ఆష్లే గార్డ్నర్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, అలానా కింగ్ ఐసీసీ టీమ్ ఆఫ్ ద టోర్నీలో చోటు దక్కించుకున్నారు. గార్డ్నర్ రెండు సెంచరీలు, హాఫ్ సెంచరీతో పాటు 7 వికెట్లు తీయగా.. సదర్‌ల్యాండ్ ఓ హాఫ్ సెంచరీ చేసి, 17 వికెట్లు తీసింది. లెగ్ స్పిన్నర్ అలానా కింగ్ 17.38 సగటున 13 వికెట్లు తీసింది.పాకిస్తాన్ నుంచి వికెట్‌కీపర్ సిద్రా నవాజ్, ఇంగ్లండ్ నుంచి సోఫీ ఎక్లెస్టోన్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. సిద్రా ఈ ప్రపంచకప్‌లో 8 డిస్మిసల్స్లో భాగంగా కావడంతో పాటు 62 పరుగులు చేయగా.. ఎక్లెస్టోన్ 14.25 సగటున 16 వికెట్లు తీసింది. 12వ ప్లేయర్‌గా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ నాట్ సీవర్ బ్రంట్ ఎంపికైంది. బ్రంట్ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 262 పరుగులు చేసి, 9 వికెట్లు తీసింది.చదవండి: స్మృతి మంధనకు భారీ షాక్ -
ఆట.. అంతకుమించి...
వ్యూహం.. బలం ఈ రెంటికి జెండర్ లేదని క్రీడలు నిరూపిస్తాయి! అందులో క్రికెట్ ఒకటి.. వ్యూహం.. బలం.. టీమ్ స్పిరిట్ ప్రతిఫలించే ఆట! మహిళా క్రికెట్లో వరల్డ్ కప్ కైవసం చేసుకుని ఈ మూడింటిలోనూ భేష్ అని నిరూపించుకుంది మన జాతీయ మహిళా జట్టు! ఈ టీమ్‌లో ప్రతి ఒక్కరిదీ ఒక్కో ప్రత్యేకత.రాహుల్ ద్రవిడ్ బ్యాట్‌తో...స్మృతి మంధాన అంటే తెలియనిదెవరికి? క్రికెట్‌తోనే కాకుండా తన ΄్యాషన్ అయిన మొబైల్ గేమింగ్ (బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా బీజీఎమ్ఐ)తోనూ ప్రసిద్ధి. కుకింగ్ అండ్ ట్రావెలింగ్ హాబీస్తో ఫేమస్. క్రికెట్ మ్యాచ్‌లు లేకపోతే మొబైల్ గేమింగ్.. కుకింగ్.. ట్రావెల్‌తో సేదతీరుతుందీ ఏ23 అంబాసిడర్. పంజాబీ వంటకాల్లో చేయితిరిగిన నైపుణ్యం ఆమెది. స్పైసీ పనీర్ టిక్కా మసాలా ఆమె సిగ్నేచర్ డిష్. దాన్ని ఆమె థెరపీ ఇన్ ఎ బౌల్‌గా అభివర్ణిస్తుంది. ఇష్టమైన ట్రావెల్ డెస్టినేషన్ స్విట్జర్లాండ్. క్రికెట్ విషయానికి వస్తే.. స్మృతి మంధానది సహజంగా కుడిచేతి వాటమే. కానీ వాళ్ల నాన్నకున్న లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ అబ్సెషన్ వల్ల ఆయన బలవంతంగా కూతురిని క్రికెట్లో ఎడమచేతి వాటం ప్లేయర్‌గా మార్చాడు. డొమెస్టిక్ క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా ఘనత వహించిన విషయం తెలిసిందే కదా! కానీ ఆ డబుల్ సెంచరీ చేసిన బ్యాట్ ఎవరిదో తెలుసా.. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్‌ది. అయితే ఆ బ్యాట్‌ను స్మృతి సోదరుడు శ్రవణ్‌కు (జూనియర్ క్రికెటర్‌గా ఉన్న రోజుల్లో) ద్రవిడ్ గిఫ్ట్‌గా ఇచ్చాడట. ముచ్చటపడి ఆ బ్యాట్‌తో తాను ఆడటం మొదలుపెట్టి అలా రికార్డ్ క్రియేట్ చేసింది స్మృతి మంధాన.వంటాగింటా జాన్తా నై ..క్రికెట్టే జీవితంహర్మన్ ప్రీత్ కౌర్.. మన మహిళా క్రికెట్ జట్టు సారథి. కూలెస్ట్ పర్సన్. ధైర్యసాహసాలు అని పర్ప్లెక్సిటీని అడిగితే ఆమెనే చూపిస్తుంది. పంజాబ్‌కు చెందిన 36 ఏళ్ల ఈ ప్లేయర్ క్రికెట్లో తన ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడానికి సంప్రదాయ మూసధోరణులతో ఒక యుద్ధమే చేసింది. ఆటల్లో హర్మన్‌ప్రీత్‌కి స్ఫూర్తి ఆమె తండ్రి హర్మందర్ సింగ్ భుల్లర్. ఆయన బాస్కెట్‌బాల్, వాలీబాల్ ప్లేయర్. తనూ తండ్రిలాగే దేశం తరపున ఆడాలని చిన్నప్పుడే నిశ్చయించుకుంది. క్రికెట్లో మహిళల జట్టు లేకపోతే మగవాళ్ల జట్టులో అయినా సరే ఆడి తన సత్తా చాటాలనుకుంది. స్థానిక మేల్ టీమ్‌తోనే ప్రాక్టీస్ మొదలుపెట్టింది కూడా. అలా కూతురు ప్యాంట్, షర్ట్ వేసుకుని.. అస్తమానం మగపిల్లలతోనే ఆడుతుండటం చూసిన హర్మన్‌ప్రీత్ తల్లి కంగారు పడింది. పిల్ల భవిష్యత్ ఏం గానూ అని కలవరం చెందింది. ‘నువ్విలా ప్యాంట్, షర్ట్లు వేసుకుని మగపిల్లలతో ఆటలాడ్డం ఏమీ బాగోలేదు. అందరు ఆడపిల్లల్లా చక్కగా సల్వార్ కమీజ్ వేసుకుని ఇంటిపట్టునే ఉండు. రోజూ వంటింట్లో నాకు చేదోడు వాదోడుగా ఉంటూ వంట నేర్చుకో’ అని అల్టిమేటం కూడా జారీ చేసింది. కానీ మన ప్లేయర్ ‘వంటాగింటా జాన్తా నై.. క్రికెటే నా జీవితం.. నేను ఇలాగే ఉంటాను’ అని తేల్చేసింది. ‘నా ఆ జవాబుతో అమ్మ మళ్లీ మాట్లాడలేదు’ అంటుంది హర్మన్‌ప్రీత్ కౌర్.ఆటకే కాదు పాటలకూ అంతే ఫాలోయింగ్.. మన మహిళా క్రికెట్ జట్టుకు జెమీమా రోడ్రిగ్స్ ఒక మెరుపు. తండ్రి గైడెన్స్‌తో ఏడేళ్ల వయసులోనే క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టింది. అయితే ఆమెకు స్ఫూర్తి మాత్రం సోదరులు ఎలి, ఎనోచ్లే! క్రికెట్లో ఆమె సూపర్‌స్టార్ అవుతుందని ప్రపంచానికి జోస్యం చెప్పింది ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్. అన్నట్టుగానే ఆమె సూపర్‌స్టార్ అయింది. క్రికెట్‌తోపాటు ఆమెకు పాటలు పాడటం.. రీల్స్ చేయడం ప్రాణం. ఆటలో ఆమె పట్ల ఎంత క్రేజ్ ఉందో.. ఆమె రీల్స్‌కి సోషల్ మీడియాలో అంతే ఫాలోయింగ్ ఉంది.అమ్మ ఆనంద తాండవంమన టీమ్ ఘన విజయం తరవాత పేసర్ రేణుక సింగ్ తల్లి సునీత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో స్థానికులతో కలిసి పాట పాడుతూ, డ్యాన్స్ చేస్తున్న దృశ్యం నెటిజనులను ఆకట్టుకుంటోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని పర్సా అనే మారుమూల గ్రామానికి చెందిన రేణుక చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది. అప్పటి నుంచి తల్లే తండ్రిగా మారింది.రేణుక తండ్రికి క్రికెట్ అంటే మహా ఇష్టం. తన కూతురిని క్రికెటర్‌గా చూడాలనుకునేవాడు. తండ్రి కల నెరవేర్చడానికి రేణుక ఎంతో కష్టపడింది. ఆమె ప్రయాణంలో ప్రతి అడుగులో తల్లి అండగా నిలిచింది.ఈ అమ్మాయి పేరు... ముంబై కీ డొనాల్డ్ ట్రంప్ప్రపంచ కప్ ఘన విజయ సంబరాలు అం» రాన్ని అంటుతున్న నేపథ్యంలో ఒక అమ్మాయి సోషల్ మీడియాలో ఎట్రాక్షన్‌గా మారింది. ప్రపంచ కప్ విజయం గురించి ఈ అమ్మాయి అద్భుతమైన ఇంగ్లీష్‌లో మాట్లాడిన తీరు, హావభావాలకు నెటిజనులు ఫిదా అయ్యారు. అంతేకాదు, ఈ అమ్మాయికి ‘ముంబై కీ డొనాల్డ్ ట్రంప్’ అని పేరు పెట్టారు. డొనాల్డ్ ట్రంప్ లెవెల్లో ఇంగ్లీష్ మాట్లాడుతుందని ఆ పేరు పెట్టారు! ‘ఈ విజయం గురించి మాట్లాడడానికి నాకు మాటలు రావడం లేదు. ప్రతి ప్లేయర్ అద్భుతంగా ఆడారు. ఎంతో నిరీక్షణ తరువాత వరల్డ్ కప్ గెలుచుకున్నాం. సహనానికీ , అంకితభావానికి అద్దం పట్టే విజయం ఇది’ అని చెప్పింది ముంబై కి డోనాల్డ్ ట్రంప్.విల్పవర్తో వీల్‌చైర్‌లో...గాయం కారణంగా ఐకానిక్ మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్ నుంచి తప్పుకున్న ప్రతీక రావల్ నవీముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో వీల్‌చైర్‌లో విజయోత్సవంలో పాల్గొంది. టీమ్ సభ్యులు ఆమెను వీల్‌చైర్‌పై వేదికపైకి తీసుకువస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది.‘నేను మైదానంలో పోరాడలేకపోయాను. కానీ నా మనసు ఎప్పుడూ ఆటతోనే ఉంది. ప్రతి ఉత్సాహం నాదే, కన్నీటి బొట్టు కూడా నాదే’ అని ‘ఎక్స్’లో ఫోటో షేర్ చేసింది, కామెంట్ రాసింది రావల్. ‘సీరియస్లీ స్వీట్ మూమెంట్’ అని ఒక నెటిజనుడు ఈ ఫొటో గురించి కామెంట్ రాశాడు.→ ఐర్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 320 పరుగులు సాధించి.. ఇంటర్నేషనల్ వన్ డే మ్యాచ్‌లలో 300 పరుగుల భాగస్వామ్యం సాధించిన తొలి మహిళా జోడీగా దీప్తి శర్మ, పూనమ్ రౌత్‌లు రికార్డ్ నెలకొల్పారు.→ మన దేశంలో తొలి మహిళా క్రికెట్ క్లబ్ పేరు ‘ది అల్బీస్’. దీన్ని ముంబైలో.. 1969లో అలూ బామ్జీ ఏర్పాటు చేశారు. ఇండియన్ క్రికెట్ క్లబ్ సభ్యురాలైన ఆమె.. క్రికెట్లో మహిళలూ ప్రొఫెషనల్‌గా ఆడాలని .. వాళ్లకూ అందులో కీలక స్థానం కల్పించాలని సాఫ్ట్‌బాల్ ప్లేయర్స్‌ను పరిచయం చేశారు. -
50 ఏళ్ల శ్రమ ఫలం
అర్ధ శతాబ్దపు స్వప్నం సాకారమై క్రికెట్లో మన నారీమణులు సాధించిన ప్రపంచ కప్ విజయం వెనుక వారు ఎన్నో ఏళ్ళుగా ఎదుర్కొన్న పెను సవాళ్ళు, ఛీత్కారాలు ఉన్నాయి. అమ్మాయిల క్రికెట్ నిన్న మొన్నటి దాకా ఆటలో అరటి పండు లాంటిదే. ‘పురుషుల క్రికెట్లో మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు?’ అని మిథాలీ రాజ్‌ను ఆ మధ్య ఓ జర్నలిస్ట్ అడిగాడు. ‘ముందు ఆ పురుష పుంగవులను కలిసి వారికిష్టమైన మహిళా క్రికెటర్ ఎవరో అడిగి తెలుసుకుని రండి’ అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చి పడేశారామె. చులకన భావం ఒక్కటే మన క్రికెట్ వనితల సమస్య కాదు. మన దేశంలో మహిళల క్రికెట్ చాలా కాలం పాటు ఓ మొక్కుబడి వ్యవహారంగానే ఉంటూ వచ్చింది. నిధుల కొరత, అరకొర సదు పాయాల వల్ల ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి దేశాల క్రికెట్ ప్రమాణా లను అందుకోవడం మన అమ్మాయిలకు కష్టంగా ఉండేది. మన దేశంలో మగపిల్లలు క్రీడలపై ఆసక్తి చూపిస్తేనే అది తలిదండ్రులకు నచ్చదు. ఇక ఆడపిల్లల్ని ఆటలకు పంపడం గురించి చెప్పేదేముంది! బ్యాట్లయినా లేని రోజుల నుంచి...పురుషులతో పోలిస్తే చాలా ఆలస్యంగా మన మహిళలు అంత ర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టారు. 1976లో మన మహిళా జట్టు మొట్టమొదటి క్రికెట్ టెస్ట్ ఆడింది. కొన్ని సంవత్సరాల తరబడి ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని సందర్భాలు 1980, 1990 దశ కాల్లో ఉండేవి. అప్పట్లో నిధుల కొరత వల్ల మన జట్టు ఫంక్షన్ హాళ్ళలో, స్కూలు బిల్డింగుల్లో బస చేసేది. అక్కడ ఎలుకలు, బొద్దింకలతో సహజీవనం చేయాల్సి వచ్చేదని తొలినాళ్ళలో భారత మహిళా జట్టు కెప్టెన్ గా ఉన్న శాంతా రంగస్వామి చెబుతోంది. టీమ్ మొత్తానికి కలిపి రెండు, మూడు బ్యాట్లు మాత్రం ఉండేవట! మిథాలీ రాజ్ ఆడిన రోజుల్లో కూడా సరైన టాయిలెట్ సదుపాయలు లేక పోవడాన్ని ‘శభాష్ మిథు’ బయోపిక్‌లో చూపించారు. ఇన్ని ఇబ్బందులున్నా అప్పట్లో శాంతా రంగస్వామితో పాటు, డయానా ఎడుల్జీ, నీతూ డేవిడ్, మిథాలీ, ఝులన్ గోస్వామి లాంటి మెరిక ల్లాంటి క్రికెటర్లు పుట్టుకొచ్చారు. 2005 ప్రపంచ కప్‌లో మన జట్టు ఫైనల్ దాకా వెళ్ళింది కూడా!అప్పట్లో రైల్వేస్ వారు మన మహిళా క్రికెటర్లకు ఉద్యోగాలిచ్చి ప్రోత్సహించేవారు. 2006లో మహిళల క్రికెట్‌ను బి.సి.సి.ఐ. పరిధి లోకి తీసుకొచ్చారు. అయితే మన క్రికెట్ బోర్డు వారు ప్రేమ కొద్దీ చేసిన పని మాత్రం కాదది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐ.సి.సి.) ఆదేశాల మేరకు మహిళల క్రికెట్‌ను బి.సి.సి.ఐ.లో విలీనం చేశారు. ఈ మార్పు తర్వాత పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. కనీసం రిజర్వేషన్ ఉన్న రైల్వే కంపార్ట్మెంట్లలో ప్రయాణం, కొన్నిసార్లు విమానయానం కూడా సాధ్యపడింది. ఆర్థికంగా కూడా మహిళా క్రికెటర్లు కొంత లాభపడ్డారు. ఇందిరా గాంధీతో 1975 నాటి తొలి భారత మహిళా క్రికెట్ జట్టు సీరియస్‌గా తీసుకోవడం మొదలైంది!హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతీ మంధాన, దీప్తీ శర్మ, షెఫాలీ వర్మ లాంటి కొత్త తరం రంగంలోకి దిగాక అమ్మాయిల క్రికెట్‌కి కొత్త కళ వచ్చింది. ఈ తరం అమ్మాయిలు ఫిట్నెస్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో పాటు, తమ ఆట తీరులో కూడా దూకుడు పెంచారు. 2017 ప్రపంచ కప్ సెమీఫైనల్లో హర్మన్ ప్రీత్ ఆడిన ఇన్నింగ్స్ భారత మహిళల క్రికెట్లో గేమ్ ఛేంజర్. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆమె కేవలం 115 బంతుల్లో అజేయంగా 171 పరుగులు చేసింది. హర్మన్ ఆడిన ఆ ఇన్నింగ్స్ మొత్తం క్రికెట్ ప్రపంచం విస్తుపోయేలా చేసింది. అప్పటి ఫైనల్లో కూడా మన జట్టు గెల వాల్సింది గానీ తొమ్మిది పరుగుల తేడాతో కప్ పోగొట్టుకుంది. ఆ ప్రపంచ కప్ తర్వాత మన క్రీడాభిమానులు అమ్మాయిల క్రికెట్‌ను కూడా సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టారు. ఫ్యాన్ ఫాలో యింగ్ బాగా పెరిగింది.2022 నుంచి మహిళా క్రికెటర్లకు పురుషులతో సరిసమానంగా మ్యాచ్ ఫీజ్ ఇవ్వాలని బి.సి.సి.ఐ. నిర్ణయించింది. అలాగే మహిళా ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) కూడా ప్రారంభించడం మరో ముఖ్యమైన పరిణామం. కడప జిల్లాలోని ఓ మారుమూల పల్లెకు చెందిన శ్రీచరణి ఈ డబ్ల్యూపీఎల్ ద్వారానే భారత జట్టులోకి వచ్చింది. శ్రీచరణి లాగానే డబ్ల్యూపీఎల్ వల్ల గ్రామాల నుంచి, దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి కొత్త క్రికెటర్లు వస్తున్నారు. అమన్ జోత్ కౌర్ తండ్రి ఒక వడ్రంగి. తండ్రి తయారు చేసిచ్చిన బ్యాట్‌తోనే ఆమె క్రికెట్లో ఓనమాలు దిద్దుకుంది. షెఫాలీ వర్మ మగవాళ్ల హెయిర్ కట్‌తో కనిపిస్తుంది. అందుకు కారణం ఆమె చిన్నప్పుడు మగపిల్లాడిగా నటిస్తూ మగవాళ్లతో కలిసి ఆడేది. గ్రామీణ వాతా వరణం నుంచి వచ్చిన ఈ కొత్త తరం అమ్మాయిలు కసిగా, నిర్భయంగా ఆడుతున్నారు. మంచి ఫలితాలు తెస్తున్నారు. మగవాళ్లతో పోటీ!2022 కామన్వెల్త్ క్రీడల్లో మన అమ్మాయిలు క్రికెట్లో రజత పతకం గెలుచుకున్నారు. 2023 ఆసియా క్రీడల్లో మన దేశానికి క్రికెట్లో మొట్టమొదటి స్వర్ణ పతకం మన మహిళా జట్టే అందించింది. ఇప్పుడు ప్రపంచ కప్‌లో జయకేతనం ఎగరవేశారు. 1983 విజయం పురుషుల జట్టును అమాంతంగా ఎలా సూపర్ స్టార్స్‌ను చేసిందో, ఈ గెలుపు మహిళల క్రికెట్లో కూడా ఒక సువర్ణాధ్యాయా నికి తెర లేపనుంది అనడంలో సందేహం లేదు. 2017లో హర్మన్ ఆడిన ఇన్నింగ్స్ లాగానే మొన్నటి సెమీ ఫైనల్లో జమీమా రోడ్రిగ్స్ సెంచరీ కూడా భావితరాలకు స్ఫూర్తిగా నిలిచిపోతుంది. ఇకపై సూపర్ స్టార్డమ్ కేవలం మగ క్రికెటర్లకే పరిమితం కాకపోవచ్చు. వారు అమ్మాయిలతో పోటీ పడాల్సి రావచ్చు. వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ద ఫన్!సి. వెంకటేశ్వ్యాసకర్త జర్నలిస్ట్, స్పోర్ట్స్ కామెంటేటర్ -
విశ్వ విజేతల వెనుక త్యాగాల గాథ
2025, నవంబర్ 2. భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించిన రోజు. ఈ రోజు భారత్ తొలిసారి జగజ్జేతగా అవతరించింది. 2025 ఎడిషన్ వన్డే ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ గెలుపుతో యావత్ భారతావణి ఉప్పొంగి పోయింది. భారత ఆటగాళ్ల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. తొలిసారి ప్రపంచకప్ గెలిచిన భారత క్రికెటర్లు కోట్లాది హృదయాలను గెలుచుకున్నారు. భారతీయుల ప్రపంచకప్ కలను సాకారం చేసిన టీమిండియా ప్లేయర్ల వెనుక ఎన్నో త్యాగాలు, పోరాటాలు, కన్నీరు, కలలు దాగి ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.హర్మన్‌ప్రీత్ కౌర్.. దూషించిన నోళ్లతోనే జేజేలు కొట్టించుకుందిపంజాబ్లోని మోగాలో జన్మించిన హర్మన్‌ప్రీత్, తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్లోకి అడుగుపెట్టింది. 1983లో కపిల్ దేవ్ భారత జట్టుకు తొలి ప్రపంచకప్ అందించి, పురుషుల క్రికెట్లో కొత్త శకానికి నాంది పలికితే.. హర్మన్ 2025 ప్రపంచకప్ విక్టరీతో మహిళల క్రికెట్లో కొత్త శకాన్ని ప్రారంభించింది.హర్మన్ క్రీడల్లో అడుపెట్టాలనుకున్న అందరు అమ్మాయిల్లాగే చిన్నతనంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆమె భారత జట్టు కెప్టెన్‌గా ఎదిగి భారతీయుల ప్రపంచకప్ కలను సాకారం చేసింది. చిన్నతనంలో హర్మన్ అబ్బాయిలతో క్రికెట్ ఆడుతూ మెళకువల నేర్చుకుంది. గ్రామీణ నేపథ్యం నుంచి రావడంతో అబ్బాయిలతో క్రికెట్ ఏంటని బంధులందరూ ఆమెను దూషించారు. అయినా పట్టువదలని హర్మన్ అనుకున్నది సాధించి దూషించిన నోళ్లతోనే శభాష్ అనిపించుకుంది.Worked as a carpenter. Got taunted by many when young daughter started playing cricket with boys in the neighborhood. But he stood by her. Made her first bat with his own hands. Got her enrolled in an academy. Travelled far everyday to take her to training and decided to pick and https://t.co/fgmIiEAFtl— TheRandomCricketPhotosGuy (@RandomCricketP1) November 2, 2025అమన్‌జోత్ కౌర్.. కార్పెంటర్ తండ్రి కలను నెరవేర్చిన కూతురుక్రికెటర్గా అమన్‌జోత్ ప్రయాణం తండ్రి చెక్కిన బ్యాట్‌తో మొదలైంది. ఆమె తండ్రి ఓ కార్పెంటర్. బాల్యంలో అమన్‌జోత్ బాలురతో క్రికెట్ ఆడటాన్ని చూసి ఊరంతా విమర్శించేవారు. అయినా తండ్రి ఆమెను వెనకేసుకొచ్చేవాడు. రోజూ 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అమన్‌జోత్‌ను అకాడమీకి తీసుకెళ్లెవాడు. భారత జట్టు ప్రపంచకప్ గెలిచిన తర్వాత అమన్‌జోత్ తండ్రి ఆనంధానికి అవథుల్లేవు. “నా కూతురు గెలిచింది” అంటూ విజయ గర్వంతో ఊగిపోయాడు.Renuka's father passed away before she turned 3. He was such a cricket tragic that he named his son Vinod after Kambli. Renuka's mother encouraged her to take up the game despite being from a village in HP. Renuka showed her CWG Bronze to all the girls in her village. She will https://t.co/TBUEnQssJb— TheRandomCricketPhotosGuy (@RandomCricketP1) November 2, 2025రేణుకా సింగ్.. తల్లి త్యాగాన్ని, అన్న నమ్మకాన్ని నిలబెట్టిందిహిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లా జిల్లాలో జన్మించిన రేణుకా సింగ్‌కు మూడేళ్ల వయసుండగానే తండ్రి చనిపోయాడు. తల్లి సునీతా సింగే రేణుకా బాగోగులు చూసింది. రేణుకను క్రికెట్ అకాడమీకి పంపేందుకు సునీత ఎన్నో కష్టాలు పడింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కావడంతో రేణుక కోసం తల్లి సునీత ఎన్నో త్యాగాలు చేసింది. రేణుక కోసం ఆమె అన్న వినోద్ కూడా క్రికెట్‌ను వదిలేశాడు. ఆర్దిక కష్టాలు ఉండటంతో ఇంట్లో ఒక్కరికే ఆకాడమీలో చేరే అవకాశం ఉండేది. రేణుక క్రికెట్లో రాణిస్తుండటంతో వినోద్ తన కలను చంపుకున్నాడు. చివరికి రేణుక ప్రపంచకప్ గెలిచిన జట్టులో కీలక సభ్యురాలిగా నిలిచి తల్లి, అన్నల త్యాగాలకు న్యాయం చేసింది.Comes from Bundelkhand, backwaters of Indian cricket. Played tennis ball cricket with boys in the neighborhood. Toiled hard in domestic cricket for years. Became a net bowler in 2024 for MI before UP Warriorz picked her in the auctions. Soon made her India debut, took a 6 wicket https://t.co/NO7T8nd9L1— TheRandomCricketPhotosGuy (@RandomCricketP1) November 2, 2025క్రాంతి గౌడ్.. పోలీస్ కానిస్టేబుల్ కూతురుమధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలోని ఘువారా అనే చిన్న పట్టణంలో జన్మించిన క్రాంతి గౌడ్ ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో కీలక సభ్యురాలిగా నిలిచింది. క్రాంతి తండ్రి ఓ రిటైర్డ్ పోలీస్ కానిస్టేబుల్. కుటుంబం ఆర్థికంగా వెనుకబడినప్పటికీ, క్రాంతికి క్రికెట్‌పై ఉన్న ఆసక్తిని చూసి తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహించారు. తండ్రి తన పెన్షన్‌తో ఆమెకు క్రికెట్ కిట్ కొనిపెట్టాడు. తల్లి రోజూ ప్రాక్టీస్‌కు తీసుకెళ్లేది.క్రాంతి చిన్నతనంలో అబ్బాయిలతో గల్లీ క్రికెట్ ఆడుతూ పెరిగింది. క్రాంతి క్రికెటర్ అవుతానంటే ఊరిలోని వారంతా నవ్వేవారు. ఇవాళ ఆమె ప్రపంచకప్‌లో భారత పేస్ బౌలింగ్ సెస్సేషన్‌గా నిలిచింది. టీమిండియా వరల్డ్‌కప్ గెలిచాక క్రాంతి సొంత ఊరిలో సంబరాలు అంబరాన్ని అంటాయి. #WATCH | Rohtak, Haryana | Cricketer Shafali Sharma's father says, "... It is all by the grace of god. We are thankful to the almighty... The whole nation was praying for our victory... By the grace of god, she has become the player of the match... The whole team worked hard to… https://t.co/uV2mBjIT6V pic.twitter.com/65nBhFfITq— ANI (@ANI) November 2, 2025షఫాలీ వర్మ.. బాలుడి వేషధారణలో..!షఫాలీ వర్మ హర్యానా రాష్ట్రంలోని రూథక్లో జన్మించింది. చిన్నతనం నుంచే ఆమెకు క్రికెట్‌పై ఆసక్తి పెరిగింది. కానీ స్థానిక అకాడమీలో అమ్మాయిలకు ప్రవేశం లేదు. దీంతో ఆమె బాలుడి వేషధారణలో, అన్న కోసం తయారు చేసిన జెర్సీ వేసుకుని ప్రాక్టీస్‌కి వెళ్లేది. షఫాలీ ఆర్థికంగా వెనుకపడిన కుటుంబం నుంచి వచ్చింది. తండ్రి సంజయ్ వర్మ ఎంతో కష్టపడి ఆమెను అకాడమీలో చేర్పించాడు. ఓ సమయంలో అతని దగ్గర షఫాలీకి కిట్ కొనిచ్చే స్తోమత కూడా లేకుండింది. ఇన్ని కష్టాలు ఎదుర్కొన్న షఫాలీ ఫైనల్లో 87 పరుగులు చేయడంతో పాటు 2 వికెట్లు తీసి, భారత్‌ను విశ్వ విజేతగా నిలపడంలో ప్రధానపాత్ర పోషించింది.#WATCH | Agra, UP | Celebrations erupt at cricketer Dipti Sharma's residence as India win the ICC Women's World Cup by defeating South Africa by 52 runs. pic.twitter.com/zTbGBH82gK— ANI (@ANI) November 2, 2025దీప్తి శర్మ.. రైల్వే ఉద్యోగి తండ్రి కలను నిజం చేసిన బౌలింగ్ సంచలనంఉత్తరప్రదేశ్లోని సాగర్జీ నగర్‌కు చెందిన దీప్తి, తన అన్నతో కలిసి క్రికెట్ ఆడుతూ పెరిగింది. తండ్రి రైల్వే ఉద్యోగి. అందరిలాగే అబ్బాయిలతో క్రికెట్ ఆడుతుండటంతో దీప్తి కూడా విమర్శలు ఎదుర్కొంది. అయినా తండ్రి ప్రోత్సాహంతో ముందడుగు వేసి, టీమిండియా ప్రపంచకప్ కలను సాకారం చేసింది. ఫైనల్లో దీప్తి అర్ద సెంచరీ సహా 5 వికెట్ల ప్రదర్శనను నమోదు చేసింది.జెమిమా రోడ్రిగ్స్.. మల్టీ టాలెంటెడ్ స్టార్సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై వీరోచిత శతకం బాది భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన జెమిమా రోడ్రిగ్స్.. ముంబైలోని ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. జెమిమా తండ్రి స్వయంగా కోచ్‌గా మారి ఆమెను ప్రాక్టీస్‌కు తీసుకెళ్లెవాడు. జెమిమాకు క్రికెట్‌తో పాటు సంగీతంలోనూ ప్రావీణ్యం ఉంది. ఆమె గిటార్ అద్భుతంగా వాయిస్తుంది. చదవండి: CWC25 Team India Prize Money: జగజ్జేత టీమిండియాకు భారీ నజరానా -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్.. వరల్డ్ రికార్డు బద్దలు
సౌతాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (Laura Wolvaardt) చరిత్ర సృష్టించింది. ఓ సింగిల్ వన్డే వరల్డ్‌కప్ (women's CWC) ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 2025 ఎడిషన్‌లో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉండిన లారా.. 9 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 3 అర్ద సెంచరీల సాయంతో 571 పరుగులు చేసింది. తద్వారా ఈ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలవడంతో పాటు ఓ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గానూ ప్రపంచ రికార్డు సాధించింది. ఈ క్రమంలో లారా ఆస్ట్రేలియా కెప్టెన్ అలైస్సా హీలీ (Alyssa Healy) పేరిట ఉండిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. హీలీ 2022 ఎడిషన్‌లో 509 పరుగులు చేసింది.ఓ సింగిల్ వన్డే వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ప్లేయర్లు..లారా వోల్వార్డ్ట్- 570 (2025)అలైస్సా హీలీ- 509 (2022)రేచల్ హేన్స్- 497 (2022)డెబ్బీ హాక్లీ- 456 (1997)లిండ్సే రీలర్- 448 (1989)సెమీస్, ఫైనల్స్‌లో సెంచరీలుతాజాగా ముగిసిన వన్డే ప్రపంచకప్ ఎడిషన్‌లో లారా అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉండింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్, భారత్‌తో జరిగిన ఫైనల్స్‌లో అద్భుతమైన సెంచరీలు చేసింది. అలాగే భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో అర్ద సెంచరీలు చేసింది. నిన్న జరిగిన ఫైనల్లో ఓ పక్క సహచరులంతా విఫలమైనా లారా ఒంటరిపోరాటం చేసి తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేసింది. ఈ ఇన్నింగ్స్‌తో ఆమె అందరి మన్ననలు అందుకుంది.మూడో ప్రయత్నంలోనూ..గడిచిన రెండేళ్లలో మూడు సార్లు (2023, 2024 టీ20 ప్రపంచకప్, 2025 వన్డే ప్రపంచకప్) వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు చేరిన సౌతాఫ్రికా మహిళల జట్టు ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా అవతరించలేకపోయింది. తాజాగా భారత్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఈ జట్టు 52 పరుగుల తేడాతో పరాజయంపాలై, రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫైనల్లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత్ తొలిసారి జగజ్జేతగా అవతరించింది.చెలరేగిన షఫాలీ, దీప్తి.. లారా ఒంటరి పోరాటం వృధాఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58), స్మృతి మంధన (45) సత్తా చాటి భారీ స్కోర్ (298/7) చేసింది. టార్గెట్‌ను కాపాడుకునే క్రమంలో దీప్తి శర్మ (9.3-0-39-5) చెలరేగడంతో సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (101) ఒంటరి పోరాటం చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. చదవండి: ఓటమి బాధ కలిగిస్తున్నా, గర్వంగా ఉంది: సౌతాఫ్రికా కెప్టెన్ లారా -
ఓటమి బాధ కలిగిస్తున్నా, గర్వంగా ఉంది: సౌతాఫ్రికా కెప్టెన్ లారా
నిన్న (నవంబర్ 2) జరిగిన వన్డే వరల్డ్‌కప్ 2025 (Women's CWC 2025) ఫైనల్లో సౌతాఫ్రికా భారత్ చేతిలో పరాజయంపాలై, రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గత రెండేళ్లలో ఈ జట్టుకు ఇది వరుసగా మూడో ఫైనల్స్ పరాభవం. దీనికి ముందు 2023 (ఆస్ట్రేలియా చేతిలో), 2024 (న్యూజిలాండ్ చేతిలో) టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఓడింది.తాజా ఫైనల్స్ (India vs South Africa) పరాభవం తర్వాత సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (Laura Wolvaardt) తీవ్రమైన భావోద్వేగానికి లోనైంది. ఆమె మాటల్లో..“మా జట్టు పట్ల ఎంత గర్వంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా ఆడాం. ఫైనల్లో భారత్ మా కంటే మెరుగ్గా ఆడింది. ఓటమి బాధ కలిగించినా, ఈ ప్రయాణం మాకు ఎంతో నేర్పింది. మరింత బలంగా తిరిగి వస్తాం.ఇంగ్లండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓటములపై స్పందిస్తూ.. "ఓపెనింగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో, ఆతర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవాలను సమర్దవంతంగా అధిగమించాం. కొన్ని మ్యాచ్‌లు అద్భుతంగా, కొన్ని బాగా కష్టంగా సాగుతాయి. ఈ టోర్నీలో చాలా మంది ఆటగాళ్లు మెరిశారు. ఫైనల్ వరకూ వచ్చామంటే, మా బలాన్ని చూపించాం”అంత ఈజీ కాదు..“కెప్టెన్సీ, బ్యాటింగ్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం అంత సులభం కాదు. టోర్నమెంట్ ప్రారంభంలో నేను బాగా ఆడలేదు. కానీ చివర్లో ‘ఇది కూడా ఓ క్రికెట్ మ్యాచ్’ అని భావించి నా సహజ ఆటతీరును ప్రదర్శించగలిగాను”సరైన నిర్ణయమే..“టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయమే. 300 పరుగుల లక్ష్యం సాధ్యమే అనిపించింది. కానీ వికెట్లు ఎక్కువగా కోల్పోయాం”అద్భుతంగా పుంజుకున్నాం..“టీమిండియా 350 పరుగుల దిశగా వెళ్తోంది అనిపించింది. కానీ చివర్లో మా బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. టోర్నమెంట్ మొత్తం మా డెత్ ఓవర్ల బౌలింగ్ బలంగా ఉంది”షఫాలీ, కాప్ గురించి..“షఫాలీ బౌలింగ్‌లోనూ, బ్యాటింగ్‌లోనూ అద్భుతంగా రాణించింది. ఆమె ఆట చాలా అగ్రెసివ్‌గా ఉంటుంది. ఇవాళ అది బాగా వర్కౌట్ అయ్యింది. ఆమె ప్రత్యర్థిని గాయపరచగలదు”“మారిజాన్ కాప్ గురించి చెప్పాలంటే.. ఆమె ఇద్దరు ఆటగాళ్లతో సమానం. గతంలో చాలా వరల్డ్ కప్‌లలో అద్భుతంగా ఆడింది. ఇది ఆమె చివరి టోర్నీ కావడం బాధ కలిగిస్తుంది. ఆమె కోసమైనా ఈసారి ప్రపంచకప్ గెలవాలన్న తపన అందరిలోని ఉండింది”కాగా, నిన్న జరిగిన ఫైనల్లో భారత్ సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించి, తొలిసారి జగజ్జేతగా అవతరించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58), స్మృతి మంధన (45) సత్తా చాటి భారీ స్కోర్ (298/7) చేసింది. టార్గెట్‌ను కాపాడుకునే క్రమంలో దీప్తి శర్మ (9.3-0-39-5) చెలరేగడంతో సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (101) ఒంటరి పోరాటం చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. వోల్వార్డ్ట్ ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లోనూ సూపర్ సెంచరీతో (169) చెలరేగింది.చదవండి: హ్యాట్సాఫ్ మజుందార్ -
పాపం సౌతాఫ్రికా.. ఓడినా మనసులు గెలుచుకుంది..!
క్రికెట్ చరిత్రలో అత్యంత దురదృష్టవంతమైన జట్టు ఏదైనా ఉందా అంటే అది సౌతాఫ్రికానే (South Africa) అని చెప్పాలి. ఈ జట్టు పురుషుల, మహిళల విభాగాంలో సమానంగా దురదృష్టాన్ని షేర్ చేసుకుంటుంది. ఇటీవలికాలంలో ఏకంగా నాలుగు ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఓడింది.తొలుత మహిళల జట్టు 2023 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఆ మరుసటి ఏడాదే (2024) మహిళల జట్టు మరోసారి టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో (న్యూజిలాండ్) చిత్తైంది. అదే ఏడాది (2024) పురుషుల జట్టుకు కూడా ఫైనల్లో (భారత్ చేతిలో) చుక్కెదురైంది. తాజాగా మహిళల జట్టు మరోసారి ఫైనల్లో ఓటమిపాలై, దురదృష్ట పరంపరను కొనసాగించింది.2025 వన్డే ప్రపంచకప్‌లో (Women's Cricket World Cup) భాగంగా నిన్న (నవంబర్ 2) జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికా భారత్ చేతిలో 52 పరుగుల తేడాతో ఓడి, రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ప్రపంచకప్ ప్రయాణంలో సౌతాఫ్రికా జట్టు రెండేళ్ల వ్యవధిలో నాలుగు సార్లు ఫైనల్‌కు చేరినప్పటికీ.. ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలవలేకపోయింది.ప్రపంచ కప్ టోర్నీల్లో సౌతాఫ్రికా జర్నీ క్రికెట్ అభిమానులను ఒకింత బాధకు గురి చేస్తుంది. పాపం సౌతాఫ్రికా.. అంటూ నెటిజన్లు సానుభూతి వ్యక్తపరుస్తున్నారు. తాజా ప్రయత్నంలో సౌతాఫ్రికా వీరోచితంగా పోరాడినప్పటికీ అంతిమ సమరంలో అద్భుతమైన క్రికెట్ ఆడిన భారత్ చేతిలో ఓడింది.ఈ ఎడిషన్‌లో సౌతాఫ్రికా సైతం అది నుంచి అద్భుతంగా ఆడింది. లీగ్ దశలో భారత్ సహా న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ జట్లను ఓడించిన ఈ జట్టు (ఇంగ్లండ్, ఆస్ట్రేలియా చేతుల్లో మాత్రమే ఓడింది).. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఫైనల్లోనూ సౌతాఫ్రికా అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోలేదు. తొలుత బౌలింగ్ చేసి భారీ స్కోర్ (298) ఇచ్చినప్పటికీ.. దాన్ని ఛేదించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్న వారి కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (101) మరోసారి శతకంతో విజృంభించింది. అయితే ఆమెకు మరో ఎండ్ నుంచి సరైన సహకారం లభించలేదు. దీంతో ఓటమి తప్పలేదు.భారత బౌలర్లు, ముఖ్యంగా స్పిన్నర్లు దీప్తి శర్మ (9.3-0-39-5), షఫాలీ వర్మ (7-0-36-2), శ్రీచరణి (9-0-48-1) మ్యాజిక్ చేసి భారత్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓడినా హుందాగా ప్రవర్తించి అందరి మన్ననలు అందుకుంది. అత్యుత్తమ క్రికెట్ ఆడిన జట్టు చేతిలో ఓడామని సర్ది చెప్పుకుంది. చదవండి: జగజ్జేత టీమిండియాకు భారీ నజరానా -
విశ్వవిజేతగా నిలిచేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి: టీమిండియా కెప్టెన్
విశ్వవిజేతగా (Women's CWC 2025) నిలిచేందుకు భారత మహిళా క్రికెట్ జట్టుకు (Team India) అన్ని అర్హతలు ఉన్నాయని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) అభిప్రాయపడింది. 2025 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో సౌతాఫ్రికాపై విజయం అనంతరం హర్మన్ మాట్లాడుతూ ఇలా అంది."వరుసగా మూడు ఓటముల తర్వాత కూడా ఏదైనా అద్భుతం చేయగలమని మేం నమ్మాం. పగలు, రాత్రి శ్రమించిన ఈ జట్టుకు విశ్వ విజేతగా నిలిచేందుకు అన్ని అర్హతలూ ఉన్నాయి.బ్యాటింగ్‌లో షఫాలీ చూపించిన ఆత్మవిశ్వాసాన్ని బట్టి ఆమెకు బౌలింగ్‌లో కూడా రాణిస్తుందని భావించా. అదే మలుపుగా మారింది. ఈ రోజు పిచ్ సెమీస్కంటే భిన్నమైంది.ఫైనల్లో ఉండే ఒత్తిడి వల్ల మేం చేసిన స్కోరు సరిపోతుందని తెలుసు. దక్షిణాఫ్రికా బాగానే ఆడినా చివర్లో ఒత్తిడి పెంచుకుంది. దానిని మేం సరైన విధంగా వాడుకున్నాం.ప్రతీ ప్రపంచ కప్ ముగిసిన తర్వాత మేం వచ్చే సారైనా ఎలా గెలవాలి అనే విషయం చర్చించుకునేవాళ్లం. గత రెండేళ్లలో కోచ్ అమోల్ మజుందార్ నేతృత్వంలో మా సన్నాహకాలు చాలా బాగా సాగాయి. తుది జట్టులో మేం పెద్దగా మార్పులు చేయకుండా ప్రతీ మ్యాచ్‌లో వారిపై నమ్మకం ఉంచాం.ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు ఇలాంటి విజయాలను అలవాటుగా మార్చుకోవాలనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద టోర్నీలు ఉన్నాయి. అక్కడా ఇదే జోరు కొనసాగాలి.మ్యాచ్ ఆసాంతం మైదానంలో అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు"కాగా, నిన్న జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్లో భారత్ సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలుపొంది, తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి సౌతాఫ్రికాను చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58), స్మృతి మంధన (45) సత్తా చాటి భారత్‌కు భారీ స్కోర్ (298/7) అందించగా.. టార్గెట్‌ను కాపాడుకునే క్రమంలో దీప్తి శర్మ (9.3-0-39-5) చెలరేగిపోయింది. ఫలితంగా సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ లారా వోల్వర్డ్ట్ (101) ఒంటరి పోరాటం చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. చదవండి: జగజ్జేత టీమిండియాకు భారీ నజరానా -
జగజ్జేత టీమిండియాకు భారీ నజరానా
తొలిసారి వన్డే ప్రపంచకప్ (Women's Cricket World Cup 2025 Winner Prize Money) గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు (Team India) భారీ నజరానా (Prize Money) లభించింది. జగజ్జేత భారత్‌కు రికార్డు స్థాయిలో 44 లక్షల 80 వేల డాలర్లు (రూ. 39 కోట్ల 80 లక్షలు) ప్రైజ్‌మనీ అందింది. రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుకు 22 లక్షల 40 వేల డాలర్లు (రూ. 19 కోట్ల 90 లక్షలు) లభించాయి.సెమీఫైనల్లో ఓడిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల ఖాతాలో 11 లక్షల 20 వేల డాలర్ల (రూ. 9 కోట్ల 94 లక్షలు) చొప్పున చేరాయి. ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన శ్రీలంక, న్యూజిలాండ్ జట్లకు 7 లక్షల డాలర్ల (రూ. 6 కోట్ల 21 లక్షలు) చొప్పున... ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచిన బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లకు 2 లక్షల 80 వేల డాలర్ల (రూ. 2 కోట్ల 48 లక్షలు) చొప్పున లభించాయి.అంతేకాకుండా ఈ మెగా ఈవెంట్లో ఆడిన ఎనిమిది జట్లకు గ్యారంటీ మనీ కింద 2 లక్షల 50 వేల డాలర్ల (రూ. 2 కోట్ల 22 లక్షలు) చొప్పున దక్కాయి. లీగ్ దశలో సాధించిన ఒక్కో విజయానికి ఆయా జట్లకు 34 వేల 314 డాలర్ల (రూ. 30 లక్షల 47 వేలు) చొప్పున లభించాయి. 300 శాతం పెరిగిన ప్రైజ్మనీవన్డే ప్రపంచకప్ విజేతకు లభించే ప్రైజ్‌మనీ ఈసారి 300 శాతం పెరిగింది. ఐసీసీ అధ్యక్షుడు జై షా ఈ పెంపును అమల్లోకి తెచ్చారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.బీసీసీఐ భారీ నజరానావరల్డ్కప్ విజేత భారత్‌కు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. జగజ్జేత టీమిండియాకు రూ. 51 కోట్లు బహుమతిగా ఇవ్వనున్నట్లు సైకియా తెలిపారు. ఈ బహుమతిని జట్టులోని ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ పంచుకుంటారని అన్నారు.కాగా, నిన్న జరిగిన ఫైనల్లో భారత్ సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలుపొంది, వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి సౌతాఫ్రికాను చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58), స్మృతి మంధన (45) సత్తా చాటి భారత్‌కు భారీ స్కోర్ (298/7) అందించగా.. టార్గెట్‌ను కాపాడుకునే క్రమంలో దీప్తి శర్మ (9.3-0-39-5) చెలరేగిపోయింది. ఫలితంగా సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ లారా వోల్వర్డ్ట్ (101) ఒంటరి పోరాటం చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. చదవండి: హ్యాట్సాఫ్ మజుందార్ -
చరిత్ర సృష్టించిన స్మృతి మంధన
టీమిండియా స్టార్ మహిళా బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఓ సింగిల్ వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించింది. 2025 వన్డే వరల్డ్‌కప్ ఎడిషన్‌లో (Women's CWC 2025) భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (నవంబర్ 2) జరుగుతున్న ఫైనల్లో (India vs South Africa) మంధన ఈ ఘనత సాధించింది. గతంలో ఈ రికార్డు మిథాలీ రాజ్ పేరిట ఉండేది. మిథాలీ 2017 ఎడిషన్‌లో 409 పరుగులు చేయగా.. తాజా ఎడిషన్‌లో మంధన 412 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోగా, భారత్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు స్మృతి మంధన (39), షఫాలీ వర్మ (48) వేగంగా పరుగులు సాధిస్తున్నారు. 17 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 97/0గా ఉంది.తుది జట్లు..భారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్దక్షిణాఫ్రికా: లారా వోల్వార్డ్ట్(కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, అన్నేకే బాష్, సునే లూస్, మారిజానే కాప్, సినాలో జాఫ్తా(వికెట్ కీపర్), అన్నరీ డెర్క్సెన్, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, అయాబొంగా ఖాకా, మ్లాబాచదవండి: IND Vs AUS: సుందర్ విధ్వంసం.. ఆసీస్‌పై టీమిండియా గెలుపు -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా బౌలర్
సౌతాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మారిజేన్ కాప్ (Marizanne Kapp) చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే ప్రపంచకప్ (Women's Cricket World Cup) చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా టీమిండియా మాజీ బౌలర్ ఝులన్ గోస్వామి (Jhulan Goswami) రికార్డును బద్దలు కొట్టింది. 2025 ఎడిషన్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో నిన్న (అక్టోబర్ 29) తొలి సెమీఫైనల్లో ఈ ఘనత సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌లోనూ (42) రాణించిన కాప్.. బౌలింగ్‌లో చెలరేగిపోయింది. 320 పరుగుల భారీ లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో 5 వికెట్లు తీసి, ప్రత్యర్ది పతనాన్ని శాశించింది.మహిళల వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు..మారిజేన్ కాప్-44ఝులన్ గోస్వామి-43లిన్ ఫుల్స్టన్-39మెగాన్ షట్-39క్యారోల్ హాడ్జస్-37మ్యాచ్ విషయానికొస్తే.. గౌహతి వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (169) రికార్డు శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోర్ చేసింది.అనంతరం లక్ష్య ఛేదనలో మారిజన్ కాప్ (7-3-20-5) నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ 42.3 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటై 125 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. ఇవాళ (అక్టోబర్ 30) జరుగబోయే రెండో సెమీఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా ఢీకొంటున్నాయి. నవీ ముంబై వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.చదవండి: IND VS AUS: అదే జరిగితే టీమిండియా కొంప కొల్లేరే..! -
అదే జరిగితే టీమిండియా కొంప కొల్లేరే..!
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 30) భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగనుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగే ఈ నాకౌట్ సమరం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియాను వరుణుడు పరీక్షించబోతున్నాడు.ఈ మ్యాచ్‌కు వాతావరణం అడ్డంకిగా మారే అవకాశం ఉంది. AccuWeather నివేదిక ప్రకారం, DY పాటిల్ స్టేడియం పరిసరాల్లో ఇవాళ ఉదయం ఆకాశం 93 శాతం మేఘావృతంగా ఉంటుంది. 25 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది.మ్యాచ్ సమయానికి పరిస్థితులు మెరుగవుతాయన్న అంచనా ఉన్నా, నవీ ముంబైలో వాతావరణ పరిస్థితులను నమ్మడానికి వీల్లేదు. ఈనెల 28న ఇక్కడ జరగాల్సిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌ను కూడా వర్షం ముంచేస్తుందేమోనని భారత క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.మ్యాచ్ పూర్తిగా రద్దైతే..?ఒకవేళ నేటి మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దైనా రిజర్వ్ డే (అక్టోబర్ 31) ఉంది. ఇవాళ కొంత మ్యాచ్ జరిగి ఆగిపోయినా, ఇదే స్థితి నుంచి రిజ్వర్ డేలో కొనసాగుతుంది. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ సాధ్యపడకపోతే మాత్రం టీమిండియా కొంప కొల్లేరవుతుంది. గ్రూప్ దశలో భారత్ కంటే ఎక్కువ పాయింట్లు ఉండటం చేత ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంటుంది. గ్రూప్ దశలో ఆసీస్ 7 మ్యాచ్‌ల్లో ఓటమెరుగని జట్టుగా 13 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. భారత్ 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 7 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది.ఇదిలా ఉంటే, నిన్న (అక్టోబర్ 29) జరిగిన తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (169) రికార్డు శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోర్ చేసింది.అనంతరం లక్ష్య ఛేదనలో మారిజన్ కాప్ (7-3-20-5) చెలరేగడంతో ఇంగ్లండ్ 42.3 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటై 125 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది.చదవండి: పెను విషాదం.. ఆస్ట్రేలియా యువ క్రికెటర్ మృతి -
టీమిండియాకు బ్యాడ్ న్యూస్
నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో రేపు (అక్టోబర్ 30) జరుగబోయే మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌కు (India vs Australia) ముందు టీమిండియాకు (Team India) బ్యాడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు (ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా) దూరంగా ఉన్న ఆసీస్ స్టార్ ప్లేయర్ అలైస్సా హీలీ (Alyssa Healy) ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి రానుంది.ఈ విషయంపై క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. హీలీ ఫిట్నెస్ టెస్ట్‌ను క్లియర్ చేసినట్లు తెలుస్తుంది. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఆమె, పునరాగమనం సంకేతాలు ఇచ్చింది. సెమీస్‌లో హీలీ బరిలోకి దిగితే టీమిండియాను కష్టాలు తప్పవు.గాయపడక ముందు ఆమె అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉండింది. వరుసగా భారత్, బంగ్లాదేశ్‌పై సెంచరీలు (142, 113 నాటౌట్) చేసింది. ఇదే ఫామ్‌ను హీలీ సెమీస్‌లోనూ కొనసాగిస్తే.. టీమిండియా ప్రపంచకప్ సాధించాలన్న కల తలకిందులయ్యే ప్రమాదం ఉంది.ఈ టోర్నీలో హీలీ 4 మ్యాచ్‌ల్లో 2 సెంచరీల సాయంతో 98 సగటున 298 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా అజేయ జట్టుగా సెమీస్‌కు చేరింది. లీగ్ దశలో న్యూజిలాండ్, పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికాపై విజయాలు సాధించి, జైత్రయాత్రను కొనసాగిస్తుంది. భారత్ విషయానికొస్తే.. చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించిన భారత్.. టోర్నీ ప్రారంభంలో వరుసగా శ్రీలంక, పాకిస్తాన్‌లపై విజయాలు సాధించి, ఆతర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఇంగ్లండ్ చేతుల్లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. ఈ టోర్నీ నుంచి మరో రెండు సెమీస్ బెర్త్‌లు ఇంగ్లండ్, సౌతాఫ్రికాకు దక్కాయి. ఇరు జట్లు ఇవాళ (అక్టోబర్ 29) జరుగబోయే తొలి సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. చదవండి: పాక్‌ను చిత్తుగా ఓడించిన సౌతాఫ్రికా -
టీమిండియాకు బిగ్ షాక్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) భాగంగా అక్టోబర్ 30న ఆస్ట్రేలియాతో జరుగబోయే సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. నిన్న (అక్టోబర్ 26) బంగ్లాదేశ్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్ సందర్భంగా ఇన్ ఫామ్ ఓపెనర్ ప్రతిక రావల్ (Pratika Rawal) తీవ్రంగా గాయపడింది. దీంతో సెమీస్ మ్యాచ్‌కు ఆమె అందుబాటులో ఉంటుందా లేదా అన్నది అనుమానంగా మారింది.ప్రస్తుతానికి ప్రతిక గాయంపై ఎలాంటి అప్డేట్ లేనప్పటికీ.. అభిమానుల్లో మాత్రం ఆందోళన నెలకొలింది. ప్రతిక న్యూజిలాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో స్మృతి మంధనతో సహా విధ్వంసకర శతకం బాదిన విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రపంచకప్‌లో ప్రతిక మంధనతో కలిసి భారత్‌కు శుభారంభాలు అందిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తుంది.అలాంటి ప్రతిక ఆసీస్‌తో జరుగబోయే డూ ఆర్ డై సెమీఫైనల్ మ్యాచ్‌కు దూరమైతే, టీమిండియా విజయావకాశాలు తప్పక ప్రభావితమవుతాయి.మ్యాచ్ రద్దునవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో నిన్న జరిగిన భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. 27 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 119 పరుగుల స్వల్ప స్కోర్‌కు పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్ 21వ ఓవర్ రెండో బంతికి మిడ్‌వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ప్రతిక తీవ్రంగా గాయపడింది.విలవిలాడిపోయిన ప్రతికమైదానం చిత్తడిగా ఉండటంతో రన్నింగ్ చేసే సమయంలో ప్రతిక కుడి కాలి మడమ మడతపడింది. తీవ్ర నొప్పితో బాధపడుతున్న ఆమెను సిబ్బంది డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు. ఆతర్వాత ఆమె తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు. ఆమె స్థానంలో అమన్‌జోత్ కౌర్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.ఛేదనలో అమన్‌జోత్, మంధన 8.4 ఓవర్లలో 57 పరుగులు జోడించాక వర్షం మళ్లీ మొదలుకావడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.రికార్డుల ప్రతికప్రతిక న్యూజిలాండ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో పలు రికార్డులు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో చేసిన సెంచరీ ఆమెకు ప్రపంచకప్ టోర్నీలో మొదటిది. ఈ మ్యాచ్‌లో ఆమె మహిళల వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్లలో ఒకరిగా నిలిచింది. అలాగే మంధన తర్వాత ఓ క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు చేసిన భారత మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కింది.ప్రతిక దూరమైతే..?ప్రతిక ఆస్ట్రేలియాతో జరుగబోయే సెమీఫైనల్ మ్యాచ్‌కు దూరమైతే టీమిండియా తీవ్రమైన కష్టాలు ఎదుర్కోనుంది. ప్రతిక స్థానాన్ని భర్తీ చేసే ఓపెనర్ ఎవరూ జట్టులో లేరు. ఐసీసీ అంగీకారంతో రిజర్వ్‌లలో లేని ప్లేయర్‌ను పిలిపించుకోవాల్సి వస్తుంది. ప్రతిక పూర్తిగా టోర్నీ నుంచి తప్పుకుంటేనే ఇది సాధ్యపడుతుంది.టీమిండియాకు మరో సమస్యప్రతిక గాయానికి ముందే టీమిండియా మరో సమస్య ఉండింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా వికెట్‌కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ గాయపడింది. దీంతో బంగ్లాదేశ్ మ్యాచ్‌కు ఆమెకు విశ్రాంతినిచ్చారు. సెమీస్ మ్యాచ్‌కు రిచా అందుబాటులో ఉంటుందా లేదా అన్నదానిపై కూడా ప్రస్తుతానికి సమాచారం లేదు. గాయాల నేపథ్యంలో టీమిండియా సెమీస్‌లో పటిష్టమైన ఆసీస్‌ను ఏమేరకు నిలువరించగలదో చూడాలి.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్‌కు అర్హత సాధించాయి. అక్టోబర్ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్‌లో భారత్, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి. ఫైనల్ మ్యాచ్ (నవీ ముంబై) నవంబర్ 2న జరుగుతుంది. చదవండి: ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ -
టీమిండియా బౌలర్ల విజృంభణ.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన బంగ్లాదేశ్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (అక్టోబర్ 26) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో (India vs Bangladesh) టీమిండియా (Team India) బౌలర్లు చెలరేగిపోయారు. వర్షం కారణంగా 27 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. బంగ్లాదేశ్‌ను 119 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది.బంగ్లా ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేసిన షర్మిన్ అక్తర్ టాప్ స్కోరర్‌గా నిలువగా.. శోభన మోస్తరి (26), రుబ్యా హైదర్ (13), రితూ మోనీ (11) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారిలో సుమయ్యా అక్తర్ 2, కెప్టెన్ నిగార్ సుల్తానా 9, షోర్నా అక్తర్ 2, నహీద అక్తర్ 3, రబేయా ఖాన్ 3, నిషిత అక్తర్ 4 (నాటౌట్), మరుఫా అక్తర్ 2 (నాటౌట్) పరుగులు చేశారు.భారత బౌలర్లలో రాధా యాదవ్ 3 వికెట్లు తీయగా.. శ్రీచరణి 2, రేణుకా సింగ్, దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్ తలో వికెట్ తీశారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో సెమీస్ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. అక్టోబర్ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్‌లో భారత్, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి. ఫైనల్ మ్యాచ్ (నవీ ముంబై) నవంబర్ 2న జరుగుతుంది. చదవండి: రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యద్భుతం -
ఇంగ్లండ్ సునాయాస విజయం
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 26) ఉదయం జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ (New Zealand vs England) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ (England) సునాయాస విజయం సాధించింది. తొలుత బౌలర్లు, స్వల్ప ఛేదనలో బ్యాటర్లు సత్తా చాటడంతో ఆడుతూ పాడుతూ గెలుపుతీరాలు చేరింది. ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించిన ఇంగ్లండ్, ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఇదివరకే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన న్యూజిలాండ్ ఓటమితో టోర్నీ నుంచి వైదొలిగింది.చెలరేగిన బౌలర్లుటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి 38.2 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది. లిండ్సే స్మిత్ 3, కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్, అలైస్ క్యాప్సీ తలో 2, ఛార్లీ డీన్, సోఫీ ఎక్లెస్టోన్ చెరో వికెట్ పడగొట్టి కివీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు.న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జార్జియా ప్లిమ్మర్ (43) టాప్ స్కోరర్‌గా నిలువగా.. అమేలియా కెర్ (35), కెప్టెన్ సోఫీ డివైన్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సూజీ బేట్స్ 10, బ్రూక్ హ్యాలీడే 4, మ్యాడీ గ్రీన్, ఇసబెల్లా గేజ్, జెస్ కెర్ 10, రోస్‌మేరీ మైర్ డకౌట్, లియా తహుహు 2 పరుగులకు ఔటయ్యారు.సత్తా చాటిన జోన్స్అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. ఓపెనర్ యామీ జోన్స్ (86 నాటౌట్) సత్తా చాటడంతో 29.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ట్యామీ బేమౌంట్ (40), హీథర్ నైట్ (33) రాణించారు. కివీస్ బౌలర్లలో సోఫీ డివైన్, లియా తహుహు తలో వికెట్ పడగొట్టారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో సెమీస్ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. అక్టోబర్ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్‌లో భారత్, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి. ఈ మెగా టోర్నీ ఫైనల్ (నవీ ముంబై) నవంబర్ 2న జరుగుతుంది.చదవండి: Women's CWC: అద్వితీయ ప్రస్థానం.. చరిత్ర తిరగేస్తే అంతా వారే..! -
అద్వితీయ ప్రస్థానం.. చరిత్ర తిరగేస్తే అంతా వారే..!
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (women's Cricket World Cup) ఆస్ట్రేలియా (Australia Women's Cricket Team) ప్రస్తానం అద్వితీయంగా సాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు పూర్తైన 12 ఎడిషన్లలో ఏడు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. తద్వారా టోర్నీ చరిత్రలో అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టుగా ప్రపంచ రికార్డు కలిగి ఉంది.ఘన చరిత్ర కలిగిన ఆసీస్.. ప్రస్తుతం ఎనిమిదో టైటిల్ దిశగా అడుగులు వేస్తుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న 2025 ఎడిషన్‌లో ఓటమెరుగని ఏకైక జట్టుగా సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో భారత్‌తో అమీతుమీకి సిద్దమైంది. ఈ మ్యాచ్ నవీ ముంబై వేదికగా అక్టోబర్ 30న జరుగనుంది. తొలి సెమీస్‌లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా పోటీపడనున్నాయి. ఆసీస్ మరోసారి సెమీస్‌కు చేరిన నేపథ్యంలో ప్రపంచకప్‌లో ఆ జట్టు ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం.తొట్ట తొలి ఛాంపియన్ ఇంగ్లండ్ఈ మెగా టోర్నీ 1973లో (ఇంగ్లండ్‌లో) తొలిసారి జరిగింది. ఈ ఎడిషన్‌లో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి తొట్ట తొలి జగజ్జేతగా ఆవిర్భవించింది. 7 జట్లు పాల్గొన్న ఆ ఎడిషన్‌లో ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. తొలిసారి జగజ్జేతభారత్ వేదికగా జరిగిన రెండో ఎడిషన్‌లో (1978) ఆస్ట్రేలియా తొలిసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ ఎడిషన్‌లో ఆసీస్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి విజేతగా అవతరించింది. కేవలం నాలుగు జట్లు పాల్గొన్న ఈ ఎడిషన్‌లో ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచింది. ఆతిథ్య భారత్ చివరి స్థానంతో సరిపెట్టుకుంది. భారత్‌కు ఇదే తొలి ప్రపంచకప్. రెండోసారిన్యూజిలాండ్ వేదికగా జరిగిన మూడో ఎడిషన్‌లో (1982) ఆస్ట్రేలియా రెండో సారి ఛాంపియన్‌గా నిలిచింది. రౌండ్ రాబిన్ ఫార్మాట్లోనే జరిగిన ఈ ఎడిషన్‌లో ఆసీస్ అజేయగా జట్టుగా నిలిచి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ ఎడిషన్‌లోనూ ఇంగ్లండ్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. హ్యాట్రిక్స్వదేశంలో జరిగిన 1988లో ఎడిషన్‌లో ఆసీస్ మరోసారి ఛాంపియన్‌గా నిలిచి, హ్యాట్రిక్ సాధించింది. ఐదు జట్లుతో 60 ఓవర్ల ఫార్మాట్లో జరిగిన ఈ ఎడిషన్‌లోనూ ఇంగ్లండ్ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో ఆసీస్ ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించి, ముచ్చటగా మూడో టైటిల్ ఎగరేసుకుపోయింది.తొలిసారి పరాభవం1993 ఎడిషన్‌లో ఆస్ట్రేలియా తొలిసారి ఫైనల్‌కు చేరలేకపోయింది. రౌండ్ రాబిన్ పద్దతిలో జరిగిన ఈ ఎడిషన్‌లో ఇంగ్లండ్ ఛాంపియన్‌గా, న్యూజిలాండ్ రన్నరప్‌గా నిలువగా.. ఆస్ట్రేలియా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఈ ఎడిషన్‌లో 8 జట్లు పాల్గొనగా భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.తిరిగి జగజ్జేతగా..1997లో భారత్ వేదికగా జరిగిన ఎడిషన్‌లో ఆస్ట్రేలియా తిరిగి జగజ్జేతగా ఆవిర్భవించింది. 11 జట్లు పాల్గొన్న ఈ ఎడిషన్‌లో న్యూజిలాండ్ రన్నరప్‌గా నిలువగా.. భారత్ సెమీస్ వరకు చేరుకుంది.మూడు సార్లు పరాభవం తర్వాత..!మూడు సార్లు ఫైనల్లో పరాభవం తర్వాత న్యూజిలాండ్ తొలిసారి 2000 ఎడిషన్‌లో ఛాంపియన్‌గా అవతరించింది. స్వదేశంలో జరిగిన ఈ ఎడిషన్‌లో న్యూజిలాండ్ తిరుగులేని ఆధిపత్యం చలాయించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 8 జట్లు పాల్గొన్న ఈ ఎడిషన్‌లో ఆస్ట్రేలియా రన్నరప్‌తో సరిపెట్టుకుంది.భారత్‌పై గెలిచి ఐదోసారిసౌతాఫ్రికా వేదికగా జరిగిన 2005 ఎడిషన్‌లో ఆస్ట్రేలియా ఐదోసారి జగజ్జేతగా ఆవతరించింది. ఫైనల్లో భారత్‌పై విజయం సాధించి, ఛాంపియన్‌గా అవతరించింది.ఊహించని పరాభవంస్వదేశంలో జరిగిన 2009 ఎడిషన్‌లో ఆసీస్‌కు ఊహించని పరాభవం ఎదురైంది. ఈ ఎడిషన్‌లో ఆ జట్టు సూపర్ సిక్స్ దశను అధిగమించలేకపోయింది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరుకోగా.. ఇంగ్లండ్ తమ మూడో టైటిల్‌ను సొంతం చేసుకుంది.ఆరో టైటిల్భారత్ వేదికగా జరిగిన 2013 ఎడిషన్‌లో ఆస్ట్రేలియా తిరిగి పుంజుకొని ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో వెస్టిండీస్‌పై విజయం సాధించి ఆరో టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ ఎడిషన్‌లో భారత్ సూపర్ సిక్స్‌కు కూడా చేరలేకపోయింది.ఇంగ్లండ్ నాలుగోసారి..స్వదేశంలో జరిగిన 2017 ఎడిషన్‌లో ఇంగ్లండ్ విజేతగా అవతరించింది. ఫైనల్లో భారత్‌పై విజయం సాధించి, నాలుగసారి జగజ్జేతగా నిలిచింది.ఏడోసారి జగజ్జేతగా..న్యూజిలాండ్ వేదికగా జరిగిన 2022 ఎడిషన్‌లో ఆస్ట్రేలియా ఏడో సారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ ఎడిషన్‌లో భారత్ నాకౌట్ దశకు చేరలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఎడిషన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆసీస్ ఎనిమిదో టైటిల్‌పై కన్నేసింది. చదవండి: కేకేఆర్ హెడ్ కోచ్‌గా రోహిత్ శర్మ ఫిట్నెస్ గురు -
చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన న్యూజిలాండ్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's WC 2025) ఇవాళ (అక్టోబర్ 26) ఉదయం మొదలైన నామమాత్రపు మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు (England vs New Zealand) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడంతో ఆ జట్టు 38.2 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది.ఇంగ్లండ్ బౌలర్లలో లిండ్సే స్మిత్ 3, కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్, అలైస్ క్యాప్సీ తలో 2, ఛార్లీ డీన్, సోఫీ ఎక్లెస్టోన్ చెరో వికెట్ పడగొట్టారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జార్జియా ప్లిమ్మర్ (43) టాప్ స్కోరర్‌గా నిలువగా.. అమేలియా కెర్ (35), కెప్టెన్ సోఫీ డివైన్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.సూజీ బేట్స్ 10, బ్రూక్ హ్యాలీడే 4, మ్యాడీ గ్రీన్, ఇసబెల్లా గేజ్, జెస్ కెర్ 10, రోస్‌మేరీ మైర్ డకౌట్, లియా తహుహు 2 పరుగులకు ఔటయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ త్వరగా మ్యాచ్ ముగించే దిశగా సాగుతోంది. 10 ఓవర్లలో ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. ఇంగ్లండ్ గెలుపుకు మరో 119 పరుగులు కావాలి. యామీ జోన్స్ (20), ట్యామీ బేమౌంట్ (26) క్రీజ్‌లో ఉన్నారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో సెమీస్ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. అక్టోబర్ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్‌లో భారత్, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి. ఈ మెగా టోర్నీ ఫైనల్ (నవీ ముంబై) నవంబర్ 2న జరుగుతుంది.చదవండి: హ్యారీ బ్రూక్ ఐకానిక్ శతకం వృధా -
అవమాన భారంతో ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన పాకిస్తాన్
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ జట్టు ఒక్క గెలుపు కూడా లేకుండా అవమాన భారంతో నిష్క్రమించింది. శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్ 24) జరగాల్సిన వారి చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకునపోయింది. దీంతో ప్రస్తుత ఎడిషన్‌లో గెలుపు నోచుకోని ఏకైక జట్టుగా పాక్ టోర్నీ నుంచి వైదొలిగింది.టోర్నీ ప్రారంభానికి ముందు టీమిండియా సహా అగ్రశ్రేణి జట్లనన్నిటినీ ఓడిస్తామని ప్రగల్బాలు పలికిన పాక్ ప్లేయర్లు.. తొలి మ్యాచ్‌లోనే వారికంటే బలహీనమైన బంగ్లాదేశ్ చేతిలోనే ఓడారు. టోర్నీ మొత్తంలో 7 మ్యాచ్‌లు ఆడి 4 పరాజయాలు ఎదుర్కొన్నారు. 3 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. భారత్‌పై ఏదో పొడిచేస్తామని బీరాలు పలికిన పాక్ 88 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఆతర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతుల్లో కూడా అవమానకర ఓటములు ఎదుర్కొంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంకతో మ్యాచ్‌లు రద్దయ్యాయి.ఇవాళ శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్‌కు ఆది నుంచే వరుణుడు అడ్డు తగిలాడు. కొన్ని గంటల తర్వాత వర్షం కాస్త ఎడతెరిపినివ్వడంతో టాస్ పడింది. శ్రీలంక టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకోగా.. 4.2 ఓవర్ల తర్వాత మరోసారి భారీ వర్షం మొదలైంది. దీంతో చేసేదేమీ లేక అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి పాక్ వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే పాక్, శ్రీలంక జట్లు ఇదివరకే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. ఈ రెండు జట్లతో పాటు బంగ్లాదేశ్, న్యూజిలాండ్ కూడా నిష్క్రమించాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ సెమీస్‌కు అర్హత సాధించాయి. పాయింట్ల పట్టికలో భారత్ నాలుగో స్థానాన్ని ఖరారు చేసుకోగా.. తొలి మూడు స్థానాల కోసం ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మధ్య పోటీ జరుగుతుంది. సెమీస్‌కు చేరిన నాలుగు జట్లు ఇంకా తలో మ్యాచ్ ఆడాల్సి ఉంది. రేపటి మ్యాచ్‌లో (అక్టోబర్ 25) ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తలపడనుండగా.. 26న ఉదయం మ్యాచ్‌లో ఇంగ్లండ్-న్యూజిలాండ్.. మధ్యాహ్నం మ్యాచ్‌లో భారత్-బంగ్లాదేశ్ ఢీకొంటాయి.చదవండి: ప్రపంచకప్ నుంచి తప్పుకొన్న పాకిస్తాన్ -
చరిత్ర సృష్టించిన స్మృతి మంధన
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా ఆసీస్ దిగ్గజం మెగ్ లాన్నింగ్తో (Meg Lanning) వరల్డ్ రికార్డును షేర్ చేసుకుంది. ఈ ఇద్దరూ తలో 17 సెంచరీలు చేశారు. లాన్నింగ్ వన్డేల్లో 15, టీ20ల్లో 2 సెంచరీలు చేయగా.. మంధన వన్డేల్లో 14, టెస్ట్‌ల్లో 2, టీ20ల్లో ఓ సెంచరీ చేసింది.మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నిన్న (అక్టోబర్ 23) న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ సెంచరీ చేసిన మంధన లాన్నింగ్ పేరిట ఉండిన ప్రపంచ రికార్డును సమం చేసింది. ఇకపై మంధన ఏ ఫార్మాట్లో అయినా సెంచరీ చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక శతకాల రికార్డు ఆమె పేరిటే సోలోగా ఉంటుంది.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్-5 బ్యాటర్లు..స్మృతి మంధన-17 (వన్డేల్లో 14, టెస్ట్‌ల్లో 2, టీ20ల్లో 1)మెగ్ లాన్నింగ్-17 (వన్డేల్లో 15, టీ20ల్లో 2)సూజీ బేట్స్-13 (వన్డేల్లో 13)ట్యామీ బేమౌంట్-12 (వన్డేల్లో 12)నాట్ సీవర్ బ్రంట్-10 (వన్డేల్లో 10)పై జాబితాలో మంధన మినహా మిగతా నలుగురు ఏదైన ఒకటి లేదా రెండు ఫార్మాట్లలో మాత్రమే సెంచరీలు చేశారు. మంధన మాత్రమే మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసి ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అనిపించుకుంది.న్యూజిలాండ్‌పై తాజా సెంచరీతో మంధన మరో రికార్డు కూడా సమం చేసింది. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ప్లేయర్‌గా తజ్మిన్ బ్రిట్స్‌తో (సౌతాఫ్రికా) పాటు ప్రపంచ రికార్డును పంచుకుంది. తజ్మిన్, మంధన ఇద్దరు ఈ ఏడాది తలో 5 సెంచరీలు చేశారు.ఈ సెంచరీతో మంధన వన్డేల్లో అత్యధిక సెంచరీలు (14) చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ క్రమంలో సూజీ బేట్స్‌ను (13) దాటి, అగ్రస్థానంలో ఉన్న మెగ్ లాన్నింగ్‌కు (15) మరింత చేరువయ్యింది.న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా 53 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్) గెలుపొంది సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్లు ప్రతిక (122), స్మృతి మంధన (109) సెంచరీలతో చెలరేగడంతో 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగెజ్ (76 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది.అనంతరం భారీ లక్ష ఛేదనలో న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు మాత్రమే చేయగలిగింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో బ్రూక్ హాలీడే (81), ఇసబెల్లా (65 నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్‌కు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్ బెర్త్ దక్కించుకున్న విషయం తెలిసిందే. -
టీమిండియా ప్లేయర్ ప్రపంచ రికార్డు
భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ ప్రతిక రావల్ (Pratika Rawal) ఖాతాలో ఓ ప్రపంచ రికార్డు చేరింది. వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) భాగంగా నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ సెంచరీ చేసిన ఆమె.. వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా ఆస్ట్రేలియాకు చెందిన లిండ్సే రీలర్‌తో ప్రపంచ రికార్డును షేర్ చేసుకుంది. లిండ్సే, ప్రతిక ఇద్దరూ 23 ఇన్నింగ్స్‌ల్లోనే 1000 పరుగులు పూర్తి చేశారు. సాధారణంగా ఆస్ట్రేలియా ప్లేయర్లతో నిండుకుపోయే ఇలాంటి రికార్డులలో ప్రతిక చేరడం గమనార్హం. వన్డేల్లో తొలి 1000 పరుగులను అత్యంత వేగంగా పూర్తి చేసిన టాప్-5 ప్లేయర్ల జాబితాలో ప్రతిక, లిండ్సే తర్వాత ముగ్గురూ ఆస్ట్రేలియన్లే ఉన్నారు. నికోల్ బోల్టన్, మెగ్ లాన్నింగ్ తలో 25 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని తాకగా.. బెలిండా క్లార్క్ 27 ఇన్నింగ్స్‌ల్లో చేరుకుంది.25 ఏళ్ల ప్రతిక గతేడాది (2024) డిసెంబర్లో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. స్వల్ప కెరీర్లో తాజా ఇన్నింగ్స్ (న్యూజిలాండ్‌పై) సహా ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడింది. ఢిల్లీకి చెందిన ప్రతిక పదేళ్ల నుంచే క్రికెట్ ఆడటం ప్రారంభించింది. పలు దశలను దాటుకుంటూ ప్రస్తుతం టీమిండియాలో కీలక సభ్యురాలిగా కొనసాగుతుంది.ప్రస్తుత ప్రపంచకప్‌లోనూ ప్రతిక అద్భుతమైన టచ్‌లో ఉంది. 6 మ్యాచ్‌ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 51.33 సగటున 308 పరుగులు చేసి టోర్నీలో సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతుంది. ఓవరాల్ కెరీర్లో 23 వన్డేలు ఆడిన ప్రతిక 2 సెంచరీలు, 7 అర్ద సెంచరీల సాయంతో 50.45 సగటున 1110 పరుగులు చేసింది.నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా 53 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్) గెలుపొంది సెమీస్‌కు అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్లు ప్రతిక (122), స్మృతి మంధన (109) సెంచరీలతో చెలరేగడంతో 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగెజ్ (76 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది.అనంతరం భారీ లక్ష ఛేదనలో న్యూజిలాండ్ అనూహ్య పోరాటం ప్రదర్శించింది. 44 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేయగలిగింది. బ్రూక్ హాలీడే (81), ఇసబెల్లా (65 నాటౌట్) న్యూజిలాండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్‌కు ముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్ బెర్త్ దక్కించుకున్న విషయం తెలిసిందే.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఆసీస్ వరల్డ్ రికార్డు బ్రేక్ -
ICC WC 2025: సత్తా చాటి సెమీఫైనల్‌కు భారత్
వరల్డ్ కప్‌లో వరుసగా మూడు పరాజయాలతో వెనుకబడి విమర్శలు ఎదుర్కొన్న భారత మహిళల జట్టు అసలు పోరులో చెలరేగింది. తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సత్తా చాటి దర్జాగా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. స్మృతి మంధాన, ప్రతీక రావల్ సెంచరీలతో పాటు జెమీమా మెరుపులు తోడవడంతో భారీ స్కోరుతో న్యూజిలాండ్ మహిళలకు సవాల్ విసిరిన టీమిండియా...ఆపై పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కుప్పకూల్చి ఘన విజయాన్ని అందుకుంది. తాజా ఓటమితో మాజీ చాంపియన్ కివీస్ సెమీస్ అవకాశం కోల్పోయింది. ముంబై: స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టు సెమీఫైనల్‌కు చేరింది. ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ తర్వాత సెమీస్ చేరిన చివరి జట్టుగా హర్మన్ సేన నిలిచింది. గురువారం డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 53 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. భారత బ్యాటింగ్ చివర్లో వాన కారణంగా ఇన్నింగ్స్‌ను 49 ఓవర్లకు కుదించగా, టీమిండియా 3 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రతీక రావల్ (134 బంతుల్లో 122; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (95 బంతుల్లో 109; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకాలతో చెలరేగారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 33.2 ఓవర్లలో 212 పరుగులు జోడించడం విశేషం. జెమీమా రోడ్రిగ్స్ (55 బంతుల్లో 76 నాటౌట్; 11 ఫోర్లు) కూడా మెరుపు బ్యాటింగ్‌తో జట్టు భారీ స్కోరులో కీలక పాత్ర పోషించింది. అనంతరం వర్షం మళ్లీ అంతరాయం కలిగించడంతో న్యూజిలాండ్ లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 44 ఓవర్లలో 325 పరుగులుగా నిర్ణయించారు. కివీస్ 44 ఓవర్లలో 8 వికెట్లకు 271 పరుగులు చేసింది. బ్రూక్ హ్యాలిడే (84 బంతుల్లో 81; 9 ఫోర్లు, 1 సిక్స్), ఇసబెల్లా గేజ్ (51 బంతుల్లో 65 నాటౌట్; 10 ఫోర్లు) రాణించారు. ఆదివారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. నేడు కొలంబోలో జరిగే నామమాత్రమైన మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో శ్రీలంక తలపడుతుంది. రికార్డు భాగస్వామ్యం... ప్రతీక, స్మృతి జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టడంతో తొలి 2 ఓవర్లు మెయిడిన్‌గా ముగియగా, 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 40/0కు చేరింది. ఆ తర్వాత బ్యాటర్లు నిలదొక్కుకొని పరుగులు రాబట్టడంతో తర్వాతి 46 బంతుల్లో 60 పరుగులు రాబట్టిన భారత్ 100 పరుగుల మార్క్‌ను అందుకుంది. ఇదే క్రమంలో ముందుగా స్మృతి 49 బంతుల్లో, ప్రతీక 75 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. సగం ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ 147/0 వద్ద నిలిచింది. 77 పరుగుల వద్ద స్మృతికి అదృష్టం కలిసొచ్చింది. అమేలియా బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించగా బంతి ప్యాడ్‌కు తగలడంతో బౌలర్ అప్పీల్ చేసింది. వెంటనే అంపైర్ అవుట్‌గా ప్రకటించడంతో స్మృతి రివ్యూ కోరింది. రీప్లేలో ముందుగా బంతి గమనాన్ని చూపించారు. అందులో బంతి స్టంప్స్‌ను తాకుతున్నట్లు అర్థం కావడంతో స్మృతి పెవిలియన్ వైపు సాగిపోయింది. అయితే ఆ తర్వాత అల్ట్రా ఎడ్జ్‌లో బంతి బ్యాట్‌కు తగిలినట్లు రేఖ కనిపించడంతో ఆమె వెనక్కి వచ్చింది. కొద్ది సేపటికి 88 బంతుల్లో స్మృతి శతకం పూర్తి చేసుకుంది. ఎట్టకేలకు 34వ ఓవర్లో తొలి వికెట్ (స్మృతి) తీయడంలో కివీస్ సఫలమైంది. 122 బంతుల్లో ప్రతీక సెంచరీ పూర్తి కాగా, మూడో స్థానంలో వచ్చిన జెమీమా ఆరంభంనుంచే దూకుడును ప్రదర్శించింది. కార్స్ ఓవర్లో మూడు ఫోర్లు బాది 38 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ చేసింది. బ్యాటింగ్ వైఫల్యం... భారీ లక్ష్య ఛేదనలో కివీస్ ఆరంభం నుంచే తడబడింది. ఓపెనర్ సుజీ బేట్స్ (1) తన వైఫల్యం కొనసాగించగా...ప్లిమ్మర్ (30; 5 ఫోర్లు, 1 సిక్స్), అమేలియా కెర్ (45; 4 ఫోర్లు) కొద్దిగా ప్రతిఘటించారు. టోర్నీలో జట్టు బెస్ట్ బ్యాటర్, కెప్టెన్ సోఫీ డివైన్ (6)ను రేణుక చక్కటి బంతితో బౌల్డ్ చేయడంతోనే భారత్‌కు పట్టు చిక్కింది.59 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకొని ఒకవైపు నుంచి హ్యాలిడే పోరాడుతున్నా...మరో వైపు వరుసగా వికెట్లు తీసి భారత్ ఒత్తిడి పెంచింది. చివర్లో ఇసబెల్లా కూడా ప్రయత్నించినా, చేయాల్సిన రన్‌రేట్ పెరిగిపోవడంతో కివీస్ ఓటమి దిశగా పయనించింది. 340 వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ అత్యధిక స్కోరు. ఇదే టోర్నీలో ఆసీస్‌పై సాధించిన 330 పరుగుల స్కోరును జట్టు అధిగమించింది. 212 స్మృతి, ప్రతీక జోడించిన పరుగులు. వరల్డ్ కప్‌లో ఏ వికెట్‌కైనా భారత్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం.14 స్మృతి వన్డే కెరీర్లో ఇది 14వ సెంచరీ. అత్యధిక సెంచరీల జాబితాలో మెగ్ లానింగ్ (15) తర్వాత రెండో స్థానంలో నిలిచింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ప్రతీక (సి) (సబ్) రోవ్ (బి) అమేలియా 122; స్మృతి (సి) (సబ్) రోవ్ (బి) బేట్స్ 109; జెమీమా (నాటౌట్) 76; హర్మన్‌ప్రీత్ (సి) కార్సన్ (బి) రోజ్మేరీ 10; రిచా (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (49 ఓవర్లలో 3 వికెట్లకు) 340. వికెట్ల పతనం: 1–212, 2–288, 3–336. బౌలింగ్: రోజ్మేరీ 8–1–52–1, జెస్ కెర్ 8–1–51–0, డివైన్ 6–0–34–0, కార్సన్ 6–0–46–0, తహుహు 4–0–37–0, అమేలియా కెర్ 10–0–69–1, బేట్స్ 7–0–40–1. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: బేట్స్ (సి) ప్రతీక (బి) క్రాంతి 1; ప్లిమ్మర్ (బి) రేణుక 30; అమేలియా కెర్ (సి) స్మృతి (బి) స్నేహ్ 45; డివైన్ (బి) రేణుక 6; హ్యాలిడే (సి) స్నేహ్ (బి) చరణి 81; గ్రీన్ (సి) క్రాంతి (బి) ప్రతీక 18; ఇసబెల్లా (నాటౌట్) 65; జెస్ కెర్ (సి) స్మృతి (బి) క్రాంతి 18; రోజ్మేరీ (సి) స్మృతి (బి) దీప్తి 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (44 ఓవర్లలో 8 వికెట్లకు) 271. వికెట్ల పతనం: 1–1, 2–51, 3–59, 4–115, 5–154, 6–226, 7–266, 8–271. బౌలింగ్: రేణుక 6–0–25–2, క్రాంతి గౌడ్ 9–0–48–2, స్నేహ్ రాణా 8–0–60–1, శ్రీచరణి 9–0–58–1, దీప్తి శర్మ 8–0–57–1, ప్రతీక 4–0–19–1. -
ఓపెనర్ల శతకాలు.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా (Team India) భారీ స్కోర్ చేసింది. నవీ ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్లు స్మృతి మంధన (Smriti Mandhana) (95 బంతుల్లో 109; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), ప్రతిక రావల్ (Pratika Rawal) (134 బంతుల్లో 122; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర శతకాలతో చెలరేగిపోయారు.వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగెజ్ (55 బంతుల్లో 76 నాటౌట్; 11 ఫోర్లు) కూడా సునామీ ఇన్నింగ్స్ ఆడింది. ఫలితంగా వర్షం కారణంగా 49 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల నష్టానికి 340 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ 10, రిచా ఘోష్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో రోస్‌మేరీ మైర్, అమేలియా కెర్, సూజీ బేట్స్‌కు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవాలంటే డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 44 ఓవర్లలో 325 పరుగులు చేయాలి.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో మొదటి మూడు సెమీస్ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగో సెమీస్ బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. మరోపక్క బంగ్లాదేశ్, పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.చదవండి: గర్జించిన బంగ్లాదేశ్ పులులు.. బిత్తరపోయిన మాజీ ఛాంపియన్లు -
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో స్మృతి మంధన సూపర్ సెంచరీ
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) సూపర్ సెంచరీతో కదంతొక్కింది. నవీ ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్ 23) జరుగుతున్న మ్యాచ్‌లో 88 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసింది. మంధనకు ఈ ఏడాది ఇది ఐదో శతకం. ఓవరాల్‌గా వన్డేల్లో 14వ శతకం. ప్రస్తుత ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన మంధన.. గత రెండు మ్యాచ్‌లుగా సత్తా చాటుతూ వస్తుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో జరిగిన చివరి రెండు మ్యాచ్‌ల్లో బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలతో మెరిసింది. వాస్తవానికి ఆ రెండు అర్ద సెంచరీలు కూడా సెంచరీల్లోకి మారాల్సింది. అయితే అవి తృటిలో చేజారాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. ఆది నుంచి నిలకడగా ఆడింది. ఓపెనర్లు మంధన, ప్రతీక రావల్ (77) సంయమనంతో బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. అర్ద సెంచరీ తర్వాత మంధన గేర్ మార్చగా.. ప్రతీక రావల్ అదే టెంపోలో బ్యాటింగ్ చేస్తుంది. 31 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ వికెట్ నష్టపోకుండా 192 పరుగులుగా ఉంది. మంధన 100, ప్రతీక రావల్ 77 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో మొదటి మూడు సెమీస్ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగో సెమీస్ బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. మరోపక్క బంగ్లాదేశ్, పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. చదవండి: IND vs AUS: టీమిండియాపై ఆసీస్ గెలుపు.. సిరీస్ కైవసం -
రాణించిన ఆసీస్ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన ఇంగ్లండ్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 22) ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు (Australia vs England) తలపడుతున్నాయి. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఆసీస్ బౌలర్లు రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 244 పరుగులు మాత్రమే చేయగలిగింది. అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (10-1-60-3), సోఫీ మోలినెక్స్ (10-0-52-2), ఆష్లే గార్డ్నర్ (9-0-39-2), అలానా కింగ్ (10-1-20-1), కిమ్ గార్త్ (7-2-43-0) ఇంగ్లండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ట్యామీ బేమౌంట్ (78) మాత్రమే సత్తా చాటింది. అలైస్ క్యాప్సీ (38), ఛార్లోట్ డీన్ (26), సోఫీ డంక్లీ (22), హీథర్ నైట్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. యామీ జోన్స్ 18, కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ 7, ఎమ్మా ల్యాంబ్ 7, లిన్సే స్మిత్ 3 పరుగులు చేసి ఔటయ్యారు. సోఫీ ఎక్లెస్టోన్ 10, లారెన్ బెల్ 2 పరుగులతో అజేయంగా నిలిచారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించాయి. దీంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. ఈ రెండు జట్లతో పాటు సౌతాఫ్రికాకు ఫైనల్ ఫోర్కు అర్హత సాధించింది. నాలుగో బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించాయి. చదవండి: శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం -
విధ్వంసం సృష్టించిన సౌతాఫ్రికా బ్యాటర్లు.. పాకిస్తాన్ ముందు అతి భారీ లక్ష్యం
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్ 21) జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (90), సూన్ లస్ (68 నాటౌట్), మారిజన్ కాప్ (67 నాటౌట్), నదినే డి క్లెర్క్ (41) విధ్వంసం సృష్టించడంతో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది.ఆఖర్లో నదినే డి క్లెర్క్ పూనకం వచ్చినట్లు ఊగిపోయింది. 38వ ఓవర్లో 2 సిక్సర్లు, 39వ ఓవర్లో 3 సిక్సర్లు, ఓ ఫోర్ బాదింది. 40వ ఓవర్లో బౌండరీ కొట్టిన అనంతరం ఔటైంది. ఆ ఓవర్లో సౌతాఫ్రికా 3 వికెట్లు కోల్పోయింది. అయినా అంతిమంగా భారీ స్కోర్ చేయగలిగింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ముగ్గురు (తజ్మిన్ బ్రిట్జ్, కరాబో మెసో, మ్లాబా) డకౌట్లైనా ఇంత స్కోర్ రావడం విశేషం. పాక్ బౌలర్లలో నష్రా సంధు, సదియా ఇక్బాల్ తలో 3 వికెట్లు తీయగా.. కెప్టెన్ ఫాతిమా సనా ఓ వికెట్ పడగొట్టింది.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు కూడా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించాయి. నాలుగో బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీపడుతున్నాయి. అక్టోబర్ 23న ఇరు జట్ల మధ్య జరుగబోయే మ్యాచ్‌తో నాలుగో సెమీస్ బెర్త్ ఖరారవుతుంది. ఆడిన 5 మ్యాచ్‌ల్లో మూడింట ఓడిన పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. చదవండి: చెలరేగిన అఫ్రిది.. బ్రెవిస్ డకౌట్.. తడబడిన సౌతాఫ్రికా -
ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. కెప్టెన్ ఔట్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) టేబుల్ టాపర్‌గా కొనసాగుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు (Australia) భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఇన్ ఫామ్ బ్యాటర్, కెప్టెన్ అయిన అలైస్సా హీలీ (Alyssa Healy) గాయం (కాలు వెనుక భాగంలో) కారణంగా ఇంగ్లండ్‌తో రేపు (అక్టోబర్ 23) జరుగబోయే మ్యాచ్‌కు దూరమైంది.ప్రస్తుత ప్రపంచకప్‌లో హీలీ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉంది. భారత్, బంగ్లాదేశ్‌పై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విధ్వంసకర శతకాలు బాదింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ముగిశాక ప్రాక్టీస్ సమయంలో హీలీ గాయపడినట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో హీలీ స్థానంలో బెత్ మూనీ వికెట్ కీపింగ్ చేస్తుందని ఆసీస్ మేనేజ్మెంట్ ప్రకటించింది. ఓపెనర్‌గా హీలీ స్థానాన్ని 22 ఏళ్ల జార్జియా వాల్ భర్తీ చేస్తుందని వెల్లడించింది.ఆసీస్ శిబిరంలో కలవరంహీలీ గాయం నేపథ్యంలో ఆసీస్ శిబిరం కలవరపడుతుంది. ఆమె గాయం తీవ్రతపై స్పష్టత లేకపోవడంతో ఆందోళన చెందుతుంది. ఆసీస్ ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఒకవేళ హీలీ సెమీస్ మ్యాచ్‌కు కూడా దూరమైతే ఆసీస్ విజయావకాశాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. ఇంగ్లండ్‌తో తర్వాత ఆసీస్ లీగ్ దశలో మరో మ్యాచ్ (సౌతాఫ్రికా) ఆడుతుంది. ఆ మ్యాచ్ అక్టోబర్ 25న జరుగుతుంది. సెమీఫైనల్ మ్యాచ్‌లు అక్టోబర్ 29, 30 తేదీల్లో జరుగనున్నాయి. ఆ సమయానికి హీలీ కోలుకుంటుందని ఆసీస్ శిబిరం ఆశాభావం వ్యక్తం చేస్తుంది.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు కూడా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించాయి. నాలుగో బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీపడుతున్నాయి. అక్టోబర్ 23న ఇరు జట్ల మధ్య జరుగబోయే మ్యాచ్‌తో నాలుగో సెమీస్ బెర్త్ ఖరారవుతుంది. చదవండి: చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్.. తొలి ప్లేయర్‌గా రికార్డు -
చెలరేగిన బంగ్లాదేశ్ బౌలర్లు.. కుదేలైన శ్రీలంక బ్యాటింగ్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 20) శ్రీలంక, బంగ్లాదేశ్ (Sri Lanka Vs Bangladesh) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లా బౌలర్లు చెలరేగడంతో ఆ జట్టు 48.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. హాసిని పెరీరా (85) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో శ్రీలంక ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆమెకు కెప్టెన్ చమారీ ఆటపట్టు (46), నిలాక్షి డిసిల్వ (37) సహకరించారు. పై ముగ్గురు మినహా లంక ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. బంగ్లా బౌలర్లలో షోర్నా అక్తర్ (10-4-27-3) అద్భుతంగా బౌలింగ్ చేసింది. రబేయా ఖాన్ 2, నహిదా అక్తర్, నిషిత అక్తర్, మరుఫా అక్తర్ తలో వికెట్ తీశారు.టాస్ గెలిచాక తాము తీసుకున్న నిర్ణయం సరైంది కాదని శ్రీలంకకు తొలి బంతికే తెలిసింది. ఓపెనర్ విష్మి గౌతమ్‌ను మరుఫా అక్తర్ ఇన్నింగ్స్ తొలి బంతికే ఔట్ చేసింది. అనంతరం కెప్టెన్ చమారీ ఆటపట్టు (46), హాసిని పెరీరా (85) లంక ఇన్నింగ్స్‌ను నిర్మించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 72 పరుగులు జోడించారు. ఆతర్వాత ఆటపట్టును రబేయా ఖాన్ ఔట్ చేసింది. 28 పరుగుల వ్యవధిలో శ్రీలంక మరో రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హాసిని, నీలాక్షి లంకను ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 74 పరుగులు జోడించారు. ఆతర్వాత లంక ఇన్నింగ్స్ ఒక్కసారిగా పతనమైంది. 28 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి ఐదు వికెట్లు కోల్పోయింది.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సెమీస్‌కు చేరడం దాదాపుగా అసాధ్యం. ప్రస్తుతం ఈ జట్లు పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు మూడు సెమీస్ బెర్త్‌లు ఇప్పటికే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. నాలుగో బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి.చదవండి: PAK Vs SA: మరోసారి తుస్సుమన్న బాబర్.. 73 ఇన్నింగ్స్‌లు అయ్యాయి, ఎలా భరిస్తున్నార్రా సామీ..! -
CWC 2025: చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్
భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ (Deepthi Sharma) వన్డే క్రికెట్లో అరుదైన ఘనత సాధించింది. 2000 పరుగులతో పాటు 150 వికెట్లు తీసిన తొలి భారత ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ అరుదైన ఫీట్‌ను నమోదు చేసిన నాలుగో క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది.వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) భాగంగా ఇండోర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (India vs England) ఈ గ్రాండ్ డబుల్‌ను సాధించింది. ఈ మ్యాచ్‌లో దీప్తి మొత్తం 4 వికెట్లు తీసి తన వన్డే వికెట్ల సంఖ్యను 153కి పెంచుకుంది. బ్యాటింగ్‌లో దీప్తి 2607 పరుగులు చేసింది.దీప్తికి ముందు స్టెఫనీ టేలర్ (వెస్టిండీస్, 5873 పరుగులు, 155 వికెట్లు), ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా , 4414, 166), మారిజన్ కాప్ (దక్షిణాఫ్రికా, 3397, 172) మాత్రమే వన్డేల్లో 2500 పరుగులతో పాటు 150 వికెట్లు తీసిన ఆల్రౌండర్లుగా ఉన్నారు.దీప్తి ప్రభంజనంప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో దీప్తి ప్రభంజనం కొనసాగుతుంది. ఈ మెగా టోర్నీలో ఆమె ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి లీడింగ్ వికెట్‌టేకర్‌గా కొనసాగుతోంది. టోర్నీ ఓపెనర్‌లో శ్రీలంకపై హాఫ్ సెంచరీ సహా 3 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది.మ్యాచ్ విషయానికొస్తే.. దీప్తి శర్మ (10-0-51-4) బంతితో రాణించినప్పటికీ ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. హీథర్ నైట్ (91 బంతుల్లో 109; 15 ఫోర్లు, సిక్స్) మెరుపు సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. నైట్‌తో పాటు ఓపెనర్ యామీ జోన్స్ (56) రాణించింది. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (38) పర్వాలేదనిపించింది.మరో ఓపెనర్ ట్యామీ బేమౌంట్ 22, సోఫీ డంక్లీ 11, అలైస్ క్యాప్సీ 2, సోఫీ ఎక్లెస్టోన్ 3 పరుగులు చేశారు. ఛార్లోట్ డీన్ (19), లిన్సే స్మిత్ (0) నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో దీప్తి శర్మతో పాటు శ్రీ చరణి (10-0-68-2) మాత్రమే వికెట్లు తీసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 42 పరుగులకే ప్రతిక రావల్ (6), హర్లీన్ డియోల్ (24) వికెట్లు కోల్పోవడంతో ఆచితూచి ఆడుతుంది. స్మృతి మంధన (34), కెప్టెన్ హర్మన్ (33) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. 19.1 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 100/2గా ఉంది. చదవండి: టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్.. కోహ్లి సరసన గిల్ -
వరుసగా రెండో మ్యాచ్‌లో విధ్వంసకర శతకం బాదిన ఆసీస్ కెప్టెన్
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఆస్ట్రేలియా కెప్టెన్ అలైస్సా హీలీ (Alyssa Healy) అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉంది. ఈ టోర్నీలో ఆమె వరుసగా రెండో మ్యాచ్‌లో విధ్వంసకర శతకం బాదింది.కొద్ది రోజుల కిందట విశాఖ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం చేసిన హీలీ.. ఇవాళ (అక్టోబర్ 16) అదే విశాఖ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మరింత రెచ్చిపోయి 77 బంతుల్లో 20 ఫోర్ల సాయంతో అజేయమైన 113 పరుగులు చేసింది.రెండు మ్యాచ్‌ల్లో హీలీ లక్ష్య ఛేదనల్లోనే సెంచరీలు సాధించడం విశేషం. భారత్‌తో మ్యాచ్‌లో 331 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శతక్కొట్టగా.. తాజాగా బంగ్లాదేశ్‌పై 199 పరుగుల స్వల్ప ఛేదనలో సెంచరీ చేసింది.నేటి మ్యాచ్‌లో హీలీ ఒంటిచేత్తో తన జట్టును గెలుపుతీరాలు దాటించింది. ఆమెకు మరో ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (72 బంతుల్లో 84 నాటౌట్; 12 ఫోర్లు, సిక్స్) సహకరించింది. వీరిద్దరి ధాటికి ఆసీస్ సగం ఓవర్లు కూడా పూర్తి కాకుండానే (24.5 ఓవర్లు) లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఆసీస్ ఓటమెరుగని జట్టుగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరి, సెమీస్‌కు కూడా అర్హత సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆసీస్.. న్యూజిలాండ్, పాకిస్తాన్, భారత్‌పై విజయాలు సాధించింది. శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా రెచ్చిపోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది. మిడిలార్డర్ బ్యాటర్ శోభన మోస్తరి (66 నాటౌట్), ఓపెనర్ రుబ్యా హైదర్ (44) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు.ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. తన కోటా 10 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసింది. ఇందులో 4 మెయిడిన్లు ఉండటం విశేషం. మిగతా బౌలర్లలో ఆష్లే గార్డ్నర్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, జార్జియా వేర్హమ్ కూడా తలో 2 వికెట్లు తీశారు. మెగాన్ షట్‌కు ఓ వికెట్ దక్కింది.చదవండి: చివరి బెర్త్ కూడా ఖరారు.. టీ20 ప్రపంచకప్ ఆడబోయే జట్లు ఇవే..! -
తేలిపోయిన బంగ్లా బ్యాటర్లు.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..?
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 16) ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ (Australia vs Bangladesh) జరుగుతుంది. వైజాగ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. పటిష్టమైన ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది.ఆసీస్ బౌలర్ల అనుభవం ముందు బంగ్లా బ్యాటర్లు తేలిపోయారు. మిడిలార్డర్ బ్యాటర్ శోభన మోస్తరి (66 నాటౌట్), ఓపెనర్ రుబ్యా హైదర్ (44) మాత్రం కాస్త ప్రతిఘటించారు. మిగతా 9 మందిలో షర్మిన్ అక్తర్ (19), కెప్టెన్ నిగార్ సుల్తానా (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఫర్జానా హాక్ (8), షోర్నా అక్తర్ (7), రితూ మోనీ (2), ఫహీమా ఖాతూన్ (4), రబేయా ఖాన్ (6), నిషిత అక్తర్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు.ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. తన కోటా 10 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసింది. ఇందులో 4 మెయిడిన్లు ఉండటం విశేషం. మిగతా బౌలర్లలో ఆష్లే గార్డ్నర్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, జార్జియా వేర్హమ్ కూడా తలో 2 వికెట్లు తీశారు. మెగాన్ షట్‌కు ఓ వికెట్ దక్కింది.ప్రస్తుత ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆసీస్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో ఒక్క ఓటమి కూడా లేకుండా పాయింట్లు పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, భారత్ ఒకటి, మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ వరుసగా ఐదు నుంచి ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి.చదవండి: సూపర్ సెంచరీతో కదంతొక్కిన ఆర్సీబీ కెప్టెన్ -
CWC 2025: శ్రీలంకతో మ్యాచ్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 14) శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు (Sri Lanka vs New Zealand) తలపడుతున్నాయి. కొలొంబో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిలాక్షి డిసిల్వ (55 నాటౌట్), కెప్టెన్ చమారీ ఆటపట్టు (53), హసిని పెరీరా (44), విష్మి గౌతమ్ (42) రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. మిగతా లంక బ్యాటర్లలో హర్షిత 26, కవిష దిల్హరి 4, పియుమి వత్సల బడల్జే 7 పరుగులకు ఔటయ్యారు. అనుష్క సంజీవని 6 పరుగులతో అజేయంగా నిలిచింది.లంక స్కోర్‌కు ఎక్స్‌ట్రాల రూపంలో అదనంగా 21 పరుగులు యాడ్ అయ్యాయి. న్యూజిలాండ్ బౌలర్లలో కెప్టెన్ సోఫీ డివైన్ 3 వికెట్లు పడగొట్టగా.. బ్రీ ఇల్లింగ్ 2, రోస్మేరి మైర్ ఓ వికెట్ పడగొట్టారు.కాగా, భారత్‌తో కలిసి ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్న శ్రీలంక ఈ టోర్నీ ఇప్పటివరకు బోణీ కొట్టలేదు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకోవడంతో ఆ జట్టు ఖాతాలో ఓ పాయింట్ చేరింది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిన శ్రీలంక.. ఆతర్వాత ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైంది. ప్రస్తుతం ఆ జట్టు 3 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలతో కేవలం ఒకే ఒక పాయింట్ ఖాతాలో కలిగి ఉండి పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.న్యూజిలాండ్ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రదర్శన కూడా ఇప్పటివరకు ఏమంత ఆశాజనకంగా లేదు. ఈ జట్టు 3 మ్యాచ్‌ల్లో రెండు పరాజయాలు, ఓ విజయంతో రెండు పాయింట్లు ఖాతాలో కలిగి ఉండి, పట్టికలో ఐదో స్థానంలో ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో వరుసగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతుల్లో ఓడిన న్యూజిలాండ్.. మూడో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది.ఇతర జట్ల విషయానికొస్తే.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, భారత్ తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. బంగ్లాదేశ్ ఆరో స్థానంలో ఉంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన పాకిస్తాన్ చిట్టచివరి స్థానంలో ఉంది.చదవండి: పాక్‌పై 11 వికెట్లు.. సౌతాఫ్రికా బౌలర్ అరుదైన ఘనత -
క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..!
మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఓ అద్భుతం జరిగింది. తొలిసారి ఓ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన ఎనిమిదో నంబర్ ప్లేయర్లు అర్ద సెంచరీలు చేశారు. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఇంతకు ముందెప్పుడు ఇలా జరగలేదు.వన్డే ప్రపంచకప్ 2025లో (CWC 2025) భాగంగా భారత్, సౌతాఫ్రికా (India vs South Africa) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు చెందిన ఎనిమిదో నంబర్ ప్లేయర్ రిచా ఘెష్ (Richa Ghosh), సౌతాఫ్రికా తరఫున ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన నదినే డి క్లెర్క్ (Nadine de Klerk) అర్ద సెంచరీలు చేశారు.ఘోష్, క్లెర్క్ ఈ అర్ద సెంచరీలను వారివారి జట్లు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండగా, ఘోష్ (77 బంతుల్లో 94; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచితంగా పోరాడింది. స్వల్ప తేడాతో సెంచరీ సైతం మిస్ అయ్యింది. స్నేహ్ రాణాతో కలిసి (33) అమూల్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌కు ఫైటింగ్ స్కోర్‌ను అందించింది.క్లెర్క్ విషయానికొస్తే.. భారత్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 142 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి, మ్యాచ్‌పై ఆశలు దాదాపుగా వదులుకుంది. ఈ దశలో ఎనిమిదో నంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన క్లెర్క్ (54 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 5 సిక్సర్లు).. సంచలన ఇన్నింగ్స్ ఆడి భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుని, తన జట్టుకు అపుకూప విజయాన్నందించింది. ఆధ్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్‌పై సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. క్లెర్క్ కారణంగా తప్పక గెలుస్తుందనుకున్న ఈ మ్యాచ్‌లో భారత్ అనూహ్యంగా ఓటమిపాలైంది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్.. 28 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు -
రణధీర శరణార్థులు
గౌహతిలోని బర్స పారా క్రికెట్ స్టేడియంలో ఇండియా, శ్రీలంకల మధ్య జరిగిన మహిళల ప్రపంచ కప్ 2025 ప్రారంభ మ్యాచ్‌కు అఫ్గానిస్థాన్ శరణార్థ మహిళల క్రికెట్ జట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్, ఇనోకా రణవీర ప్రారంభ ఆటలో అద్భుతమైన ప్రదర్శనతో వార్తల్లో నిలిచారు. అయితే ఆటలోకి అడుగు పెట్టకుండానే అఫ్గాన్ మహిళల జట్టు వార్తల్లో నిలిచింది. మహిళల హక్కుల కోసం పోరాడి, తాలిబాన్ ప్రభుత్వం నుంచి తప్పించుకున్న ఈ అఫ్గాన్ మహిళా క్రికెటర్ల బృందం ప్రవాసంలో ఉంటుంది. భద్రతా విషయాలను దృష్టిలో పెట్టుకొని అఫ్గానిస్థాన్ ప్లేయర్స్ వివరాలను ఐసీసీ బయటపెట్టలేదు. రాబోయే రోజుల్లో అఫ్గాన్ మహిళల క్రికెట్ జట్టును మరింత క్రియాశీలం చేయడానికి వారి పర్యటన తొలి ప్రయత్నంగా భావించాలి. అఫ్గానిస్థాన్ శరణార్థుల క్రికెట్ జట్టుకు భవిష్యత్తులో జరగబోయే రెండు ప్రధాన ప్రపంచ టోర్నమెంట్లలో స్థానం కల్పించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత క్రికెట్‌తో సహా ఎన్నో ఆటలపై మహిళలు ఆడకుండా నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో తమ దేశం నుంచి పారిపోయిన అఫ్గాన్ మహిళా అథ్లెట్లకు సహాయం చేయడానికి ఐసీసీ చొరవ చూపింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసీసీఐ), ఇంగ్లండ్ అండ్ వేల్ఫ్ క్రికెట్ బోర్డ్ (ఇసీబి), క్రికెట్ ఆస్ట్రేలియా (సిఏ) సహకారంతో అఫ్గాన్ జట్టును ముందుకు నడిపించడానికి ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా కీలకంగా వ్యవహరిస్తున్నాడు.చాలామంది శరణార్థ ప్లేయర్స్ ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. మరికొందరు యూకే, కెనడాలలో నివసిస్తున్నారు. అయితే వీసా సమస్య కారణంగా చాలామంది మన దేశానికి రాలేకపోయారు. ఇక్కడికి వచ్చిన వారు శిక్షణ శిబిరాలలో పాల్గొంటారు. దేశీయ జట్లతో కొన్ని మ్యాచ్‌లలో పోటీ పడతారు. -
టీమిండియా బ్యాటర్ల విధ్వంసం.. దక్షిణాఫ్రికాపై ఘన విజయం
బెనోని: తొలి అండర్–19 టి20 ప్రపంచకప్‌ను భారత మహిళల జట్టు ఘన విజయంతో మొదలు పెట్టింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా అండర్–19 మహిళల టీమ్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేయగా... భారత్ 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 170 పరుగులు చేసింది. షబ్నమ్ వేసిన తొలి ఓవర్లోనే 3 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి వాన్ రెన్స్‌బర్గ్ (23) సఫారీ జట్టుకు శుభారంభం అందించగా, సోనమ్ వేసిన తర్వాతి రెండు ఓవర్లలో కలిపి సిమోన్ లోరెన్స్ (44 బంతుల్లో 61; 9 ఫోర్లు, 1 సిక్స్) 4 ఫోర్లు, సిక్స్ బాదింది. అయితే ఆ తర్వాత ప్రత్యర్థిని భారత బౌలర్లు కట్టడి చేయడంలో సఫలం కాగా, మ్యాడిసన్ ల్యాండ్స్‌మన్ (17 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. ఛేదనలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్వేత సెహ్రావత్ (57 బంతుల్లో 92 నాటౌట్; 20 ఫోర్లు), కెప్టెన్ షఫాలీ వర్మ (16 బంతుల్లో 45; 9 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగిపోయారు. నిని వేసిన ఓవర్లో షఫాలీ వరుసగా 4, 4, 4, 4, 4, 6తో ఆధిపత్యం ప్రదర్శించింది. మరోవైపు శ్వేత తన దూకుడును తగ్గించకుండా దూసుకుపోయింది. గొంగడి త్రిష (15) తొందరగానే వెనుదిరిగినా... శ్వేత చివరి వరకు నిలబడటంతో భారత్‌కు గెలుపు సులువైంది. ఓపెనర్ శ్వేత 7 ఓవర్లలో కనీసం రెండు ఫోర్ల చొప్పున కొట్టడం విశేషం. ఇతర మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ ఏడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై, యూఏఈ ఆరు వికెట్ల తేడాతో స్కాట్లాండ్పై, శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో అమెరికాపై గెలిచాయి. -
ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ సమరం
-
వన్డే ప్రపంచకప్‌కు భారత మహిళల జట్టు అర్హత
దుబాయ్: వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 నుంచి మార్చి 7 వరకు న్యూజిలాండ్ ఆతిథ్యమిచ్చే మహిళల వన్డే ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌కు భారత మహిళల జట్టు నేరుగా అర్హత సాధించిందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం ప్రకటించింది. 2017 వరల్డ్‌కప్ రన్నరప్ భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు కూడా ఈ మెగా ఈవెంట్‌కు బెర్త్‌లు ఖాయం చేసుకున్నాయి. ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా 2017 నుంచి 2020 మధ్యకాలంలో ఆయా జట్ల మధ్య జరగని సిరీస్‌లకు సంబంధించి అన్ని జట్లకు సమంగా పాయింట్లు ఇవ్వాలని ఐసీసీ నిర్ణయించింది. దాంతో పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (37 పాయింట్లు), ఇంగ్లండ్ (29), దక్షిణాఫ్రికా (25), భారత్ (23) తొలి నాలుగు స్థానాల్లో నిలిచి నేరుగా వరల్డ్‌కప్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నాయి. ఆతిథ్య దేశం హోదాలో న్యూజిలాండ్ పాల్గొంటుంది. జూలై 3 నుంచి 19 వరకు శ్రీలంకలో జరిగే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ ద్వారా మిగిలిన మూడు బెర్త్‌లు ఖాయమవుతాయి. -
సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్
సిడ్నీ: ‘హ్యాట్రిక్’ విజయంతో దక్షిణాఫ్రికా... మూడో గెలుపుతో ఇంగ్లండ్ జట్లు మహిళల టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఆదివారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా 17 పరుగుల ఆధిక్యంతో పాకిస్తాన్‌పై... ఇంగ్లండ్ 46 పరుగుల ఆధిక్యంతో వెస్టిండీస్‌పై గెలుపొందాయి. గ్రూప్ ‘బి’లో తమ నాలుగు లీగ్ మ్యాచ్‌లను పూర్తి చేసుకున్న ఇంగ్లండ్ మూడు విజయాలతో ఆరు పాయింట్లు సంపాదించింది. దక్షిణాఫ్రికా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఆరు పాయింట్లతో ఇంగ్లండ్‌తో సమఉజ్జీగా ఉంది. అయితే మెరుగైన రన్‌రేట్ కారణంగా ఇంగ్లండ్ ఈ గ్రూప్‌లో టాప్ ర్యాంక్‌లో ఉంది. మంగళవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడిస్తే దక్షిణాఫ్రికా గ్రూప్ టాపర్‌గా నిలుస్తుంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 136 పరుగులు చేసింది. లారా వోల్వార్ట్ (36 బంతుల్లో 53 నాటౌట్; 8 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. మారిజన్ కాప్ (32 బంతుల్లో 31; 2 ఫోర్లు, సిక్స్) కూడా రాణించింది. 137 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 119 పరుగులు చేసి ఓడిపోయింది. జవేరియా ఖాన్ (31; 4 ఫోర్లు), అలియా రియాజ్ (39 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) రాణించినా ఫలితం లేకపోయింది. మాజీ చాంపియన్ వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 143 పరుగులు చేసింది. నటాలీ షివెర్ (56 బంతుల్లో 57; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకుంది. అనంతరం వెస్టిండీస్ 17.1 ఓవర్లలో 97 పరుగులకు ఆలౌటైంది. సోఫీ ఎకిల్‌స్టోన్ 7 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి విండీస్‌ను దెబ్బతీసింది. నేటి గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్‌తో శ్రీలంక; ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ విజేత ఈ గ్రూప్ నుంచి రెండో జట్టుగా సెమీఫైనల్ చేరుకుంటుంది. గ్రూప్ ‘ఎ’లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ అజేయంగా నిలిచి భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్ చేరుకున్న సంగతి తెలిసిందే. -
ఇంగ్లండ్ విజయం
లీస్టర్ (ఇంగ్లండ్): మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్ టోర్నమెంట్లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు తొలి విజయం నమోదు చేసింది. పాకిస్తాన్‌తో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 107 పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 377 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ హీథెర్‌నైట్ (109 బంతుల్లో 106; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), నటాలీ సివెర్ (92 బంతుల్లో 137; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీలు చేయడం విశేషం. వీరిద్దరూ మూడో వికెట్‌కు 213 పరుగులు జోడించారు. అనంతరం పాకిస్తాన్ 29.2 ఓవర్లలో 3 వికెట్లకు 109 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం రావడంతో మిగతా ఓవర్ల ఆట సాధ్యపడలేదు. డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం మ్యాచ్ నిలిచే సమయానికి పాకిస్తాన్ 214 పరుగులు చేయాల్సింది. బుధవారం జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో దక్షిణాఫ్రికా ఆడుతుంది.


