
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) టేబుల్ టాపర్‌గా కొనసాగుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు (Australia) భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఇన్ ఫామ్ బ్యాటర్, కెప్టెన్ అయిన అలైస్సా హీలీ (Alyssa Healy) గాయం (కాలు వెనుక భాగంలో) కారణంగా ఇంగ్లండ్‌తో రేపు (అక్టోబర్ 23) జరుగబోయే మ్యాచ్‌కు దూరమైంది.
ప్రస్తుత ప్రపంచకప్‌లో హీలీ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉంది. భారత్, బంగ్లాదేశ్‌పై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విధ్వంసకర శతకాలు బాదింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ముగిశాక ప్రాక్టీస్ సమయంలో హీలీ గాయపడినట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో హీలీ స్థానంలో బెత్ మూనీ వికెట్ కీపింగ్ చేస్తుందని ఆసీస్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఓపెనర్‌గా హీలీ స్థానాన్ని 22 ఏళ్ల జార్జియా వాల్ భర్తీ చేస్తుందని వెల్లడించింది.
ఆసీస్ శిబిరంలో కలవరం
హీలీ గాయం నేపథ్యంలో ఆసీస్ శిబిరం కలవరపడుతుంది. ఆమె గాయం తీవ్రతపై స్పష్టత లేకపోవడంతో ఆందోళన చెందుతుంది. ఆసీస్ ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఒకవేళ హీలీ సెమీస్ మ్యాచ్‌కు కూడా దూరమైతే ఆసీస్ విజయావకాశాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది.
ఇంగ్లండ్‌తో తర్వాత ఆసీస్ లీగ్ దశలో మరో మ్యాచ్ (సౌతాఫ్రికా) ఆడుతుంది. ఆ మ్యాచ్ అక్టోబర్ 25న జరుగుతుంది. సెమీఫైనల్ మ్యాచ్‌లు అక్టోబర్ 29, 30 తేదీల్లో జరుగనున్నాయి. ఆ సమయానికి హీలీ కోలుకుంటుందని ఆసీస్ శిబిరం ఆశాభావం వ్యక్తం చేస్తుంది.
కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు కూడా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించాయి. నాలుగో బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీపడుతున్నాయి. అక్టోబర్ 23న ఇరు జట్ల మధ్య జరుగబోయే మ్యాచ్‌తో నాలుగో సెమీస్ బెర్త్ ఖరారవుతుంది.
చదవండి: చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్.. తొలి ప్లేయర్‌గా రికార్డు