
శ్రీలంక మహిళల జట్టు కెప్టెన్ చమరి ఆతపట్టు అరుదైన ఘనత సాధించింది. వన్డేల్లో 4000 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి శ్రీలంక ఉమెన్ క్రికెటర్‌గా ఆతపట్టు చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా సోమవారం ముంబై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె ఈ ఫీట్ సాధించింది.
మహిళల వన్డేల్లో ఈ రికార్డు సాధించిన నాలుగో ఆసియా బ్యాటర్‌గా ఆతపట్టు నిలిచింది. ఈ శ్రీలంక ఉమెన్ క్రికెటర్‌గా ఆమె దారిదాపుల్లో లేరు. లంక తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో శశికళ సిరివర్ధనే 2029 పరుగులతో రెండో స్థానంలో ఉంది.
కాగా ఈ మ్యాచ్‌లో ఆతపట్టు దూకుడుగా ఆడింది. కేవలం 43 బంతుల్లో 6 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 46 పరుగులు చేసి ఔటైంది. బౌలింగ్‌లో అయితే ఆమె సత్తాచాటింది. చివరి ఓవర్‌లో బంగ్లా విజయానికి 9 పరుగులు అవసరమవ్వగా.. ఆతపట్టు బంతితో మ్యాజిక్ చేసింది.
ఓ రనౌట్‌తో పాటు వరుసగా నాలుగు వికెట్లు సాధించింది. మధ్యలో రనౌట్ ఉండడంతో ఆమె హ్యాట్రిక్ పొందే అవకాశాన్ని కోల్పోయింది. ఆమె సంచలన బౌలింగ్ కారణంగా బంగ్లాపై 7 వికెట్ల తేడాతో లంక విజయం సాధించింది.
టోర్నీ నుంచి ఔట్..
కాగా ఈ టోర్నీలో శ్రీలంక జట్టు మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచింది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడగా.. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. శ్రీలంక మూడు మ్యాచ్‌లలో ఓటమి పాలవ్వగా.. మరో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. ప్రస్తుతం ఆతపట్టు సేన పాయింట్ల పట్టికలో ఆరో స్దానంలో ఉంది. లంక జట్టు సెమీస్‌కు చేరడం దాదాపు ఆసాధ్యం అనే చెప్పాలి. ఈ జట్టుకు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది.
చదవండి: IND vs SA: అగార్కర్‌తో విభేదాలు.. మహ్మద్ షమీకి ఊహించని షాక్