
మహిళల ప్రపంచ కప్ 2025 కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా సీనియర్ క్రికెటర్ చమరి అటపత్తు వ్యవహరించనుంది. అదేవిధంగా ఈ వరల్డ్‌కప్ జట్టులో హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, ఉదేశిక ప్రబోధని వంటి అనుభవజ్ఞులైన ప్లేయర్లు ఉన్నారు.
27 ఏళ్ల హర్షిత గత కొన్నాళ్లగా శ్రీలంక జట్టులో కీలక సభ్యురాలిగా కొనసాగుతోంది. హర్షిత 41 వన్డేల్లో 1,075 పరుగులు చేసింది. గతేడాది జరిగిన ఆసియాకప్ ఫైనల్లో భారత్‌పై హర్షిత అద్బుతమైన సెంచరీతో చెలరేగింది. దీంతో 2024 ఆగస్టు నెలకు గాను సిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఆమె ఎంపికైంది.
అదేవిధంగా యువ పేస్ సంచలనం దేవ్మి విహంగాకు ఈ జట్టులో చోటు దక్కింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో శ్రీలంక ఆతిథ్యమిచ్చిన ముక్కోణపు వన్డే సిరీస్‌లో దేవ్మి విహంగా 11 వికెట్లతో సత్తాచాటింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది.
తొలి మ్యాచ్‌లో గౌహతిలోని బర్సపారా స్టేడియం వేదికగా హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్‌తో శ్రీలంక తలపడనుంది. ఈ టోర్నీ కోసం బీసీసీఐ ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది.
మహిళల వన్డే ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు
చమరి అతపత్తు (కెప్టెన్), హాసిని పెరెరా, విష్మి గుణరత్నే, హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని, ఇమేషా దులాని, దేవీ విహంగా, పియుమి వత్సల, ఇనోకా రణవీర, సుగండిక కుమారి, ఉద, సుగండిక కుమారి, ఉదేశిక ప్రబోదని, మల్కీ మదర, అచ్చిని కులసూర్య
మహిళల వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతికా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), క్రాంతి గౌడ్, అమన్‌జోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి, యస్తిక భాటియా (వికెట్ కీపర్), స్నేహ్ రాణా