ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 గెలిచిన భారత జట్టు సభ్యురాలు, ఆంధ్ర క్రికెటర్ శ్రీచరణి శుక్రవారం ఉదయం గన్నవరంకు చేరుకుంది. గన్నవరం విమానశ్రయంలో ఆమెకు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ సభ్యులు, మంత్రులు అనిత, సవిత, రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ కేశినేని చిన్ని ఘనస్వాగతం పలికారు.
చరణిని అభినందించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఎయిర్‌పోర్ట్ వద్దకు వచ్చారు. శ్రీ చరణి గన్నవరం నుండి ర్యాలీగా ఉండవల్లికి చేరుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు, మంత్రి లోకేష్‌ను చరణి కలవనుంది. ఆ తర్వాత మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంను చరణి సందర్శించనుంది.

కాగా భారత మహిళల జట్టు తొలి వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకోవడంలో చరణిది కీలక పాత్ర. టోర్నీ అసాంతం చరణి అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. కడప జిల్లాకు చెందిన శ్రీచరణి ఫైనల్ మ్యాచ్‌లోనూ బంతితో మ్యాజిక్ చేసింది. ఈ 50 ఓవర్ల ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన శ్రీ చరణి 78 ఓవర్లు వేసి 14 వికెట్లు తీసింది. దీప్తీ శర్మ తర్వాత భారత్ తరపున అత్యధిక వికెట్ల తీసిన జాబితాలో చరణి నిలిచింది.


