breaking news
Shree Charani
-
WPL 2026: వేలంలో సత్తా చాటిన మన అమ్మాయిలు
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)- 2026 వేలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు అమ్మాయిలు అవకాశం దక్కించుకున్నారు. ఇటీవల ఐసీసీ వన్డే వరల్డ్ కప్-2025లో విజయంలో భాగమైన శ్రీచరణి, అరుంధతి రెడ్డి (హైదరాబాద్) మరో సందేహం లేకుండా ఎంపికయ్యారు. అరుంధతి రెడ్డిని రూ. 75 లక్షలకు ఆర్సీబీ జట్టు ఎంచుకుంది.గొంగడి త్రిషకు తొలిసారి చాన్స్అండర్–19 వరల్డ్ కప్ విజయంలో భాగమైన హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిషకు తొలిసారి డబ్ల్యూపీఎల్‌లో చాన్స్ లభించడం విశేషం. మమత మాదివాల, నల్లా క్రాంతి రెడ్డి కూడా ఎంపికయ్యారు. గొంగడి త్రిషను రూ. 10 లక్షలకు యూపీ వారియర్స్... మమతను రూ. 10 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్... క్రాంతి రెడ్డిని రూ. 10 లక్షలకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్నాయి. శ్రీచరణి స్థాయి పెరిగింది... వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన నల్లపు రెడ్డి శ్రీచరణి 2025 డబ్ల్యూపీఎల్‌లో రూ.55 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడింది. ఇటీవలి వన్డే వరల్డ్ కప్ విజయంలో ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రధాన పాత్ర పోషించడంతో సహజంగానే ఆమె స్థాయి పెరిగింది. వేలానికి ముందు ఆమెను విడుదల చేసిన ఢిల్లీ ఇక్కడ మళ్లీ పోటీ పడింది. కనీస విలువ రూ.30 లక్షలతో మొదలై ఢిల్లీ, యూపీ మధ్య పోరు సాగింది. చివరకు రూ.1.30 కోట్ల వద్ద వేలం ముగిసింది. ఈ మేరకు.. ఢిల్లీ భారీ మొత్తంతో తమ ప్లేయర్‌ను తిరిగి సొంతం చేసుకుంది.చదవండి: WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే -
WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026 మెగా వేలంలో భారత క్రికెటర్లు దీప్తి శర్మ, నల్లపురెడ్డి శ్రీచరణి సత్తా చాటారు. వన్డే వరల్డ్‌కప్-2025లో వీరిద్దరు అదరగొట్టిన విషయం తెలిసిందే. దీప్తి ఈ మెగా టోర్నీలో 215 పరుగులు సాధించడంతో పాటు.. 22 వికెట్లు కూల్చింది.మరోవైపు.. లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీచరణి (Shree Charani) పద్నాలుగు వికెట్లతో దుమ్ములేపింది. ఈ క్రమంలో అంచనాలకు అనుగుణంగా దీప్తి శర్మ ఈసారి వేలంపాటలో అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా నిలవగా.. శ్రీచరణి సైతం జాక్‌పాట్ అందుకుంది.మరి డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలంలో వీరితో పాటు అత్యధిక ధర పలికిన ప్లేయర్లు ఎవరో చూసేద్దామా!దీప్తి శర్మ (భారత్)👉ఆల్‌రౌండర్- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 3.20 కోట్లకు కొనుగోలు చేసిన యూపీ వారియర్స్‌అమెలియా కెర్ (న్యూజిలాండ్)👉ఆల్‌రౌండర్- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 3 కోట్లకు దక్కించుకున్న ముంబై ఇండియన్స్శిఖా పాండే (భారత్)👉ఆల్‌రౌండర్- కనీస ధర రూ. 20 లక్షలు- రూ. 2.4 కోట్లకు దక్కించుకున్న యూపీ వారియర్స్సోఫీ డివైన్ (న్యూజిలాండ్)👉ఆల్‌రౌండర్- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 2 కోట్లకు కొనుక్కున్న గుజరాత్ జెయింట్స్‌మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా)👉బ్యాటర్- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 1.90 కోట్లకు సొంతం చేసుకున్న యూపీ వారియర్స్‌శ్రీచరణి (భారత్)👉ఆల్‌రౌండర్- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.3 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌చినెలె హెన్రి (వెస్టిండీస్)👉ఆల్‌రౌండర్- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.30 కోట్లకు కొనుక్కున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ఫోబే లిచిఫీల్డ్ (ఆస్ట్రేలియా)👉బ్యాటర్- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేసిన యూపీ వారియర్స్‌లారా వొల్వర్ట్ (సౌతాఫ్రికా)👉బ్యాటర్- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.10 కోట్లకు దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ఆశా శోభన (భారత్)👉బౌలర్- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.10 కోట్లకు దక్కించుకున్న యూపీ వారియర్స్‌లారెన్ బెల్ (ఇంగ్లండ్)👉బౌలర్- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 90 లక్షలకు కొనుక్కున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.చదవండి: WPL 2026 Auction Updates: ఎవరికి ఎంత ధర? -
WPL 2026: వేలంలో శ్రీచరణికి భారీ ధర
భారత క్రికెటర్, కడప ముద్దుబిడ్డ నల్లపురెడ్డి శ్రీచరణి (Shree Charani)కి జాక్‌పాట్ తగిలింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026 మెగా వేలంలో ఫ్రాంఛైజీలు ఆమె కోసం పోటీపడ్డాయి. ఈ క్రమంలో శ్రీచరణికి భారీ ధర దక్కింది.ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 టోర్నమెంట్లో భారత్ చాంపియన్‌గా నిలవడంలో శ్రీచరణిది ముఖ్య భూమిక. ఈ మెగా ఈవెంట్లో శ్రీచరణి ఏకంగా పద్నాలుగు వికెట్లు పడగొట్టింది. తద్వారా భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ నిలిచింది. రూ. 30 లక్షల కనీస ధరఈ నేపథ్యంలో ప్రపంచకప్ విజేత శ్రీచరణికి భారీ ధర దక్కుతుందనే అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఆమె అదరగొట్టింది. రూ. 30 లక్షల కనీస ధరతో శ్రీచరణి వేలంలోకి రాగా.. యూపీ వారియర్స్ తొలి బిడ్ వేసింది. ఆ వెంటనే ఢిల్లీ క్యాపిటల్స్ రంగంలోకి దిగి.. ధరను ఏకంగా రూ. 75 లక్షలకు పెంచింది.దీంతో యూవీ వెనక్కి తగ్గినట్లే తగ్గి.. ఆ వెంటనే మళ్లీ రూ. 90 లక్షలకు ధరను పెంచింది. ఈ క్రమంలో శ్రీచరణిని సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఢిల్లీ క్యాపిటల్స్ ధరను ఏకంగా రూ. 1.3 కోట్లకు పెంచగా.. యూపీ వెనక్కి తగ్గింది. ఫలితంగా శ్రీచరణి రూ. 1.3 కోట్లకు మళ్లీ సొంతగూటి (ఢిల్లీ)కి చేరుకుంది.ఎదురులేని చరణికాగా గతంలో శ్రీచరణి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడింది. 2024 సీజన్లో రూ. 55 లక్షలకు ఆమెను ఢిల్లీ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. దీంతో అత్యధిక ధర దక్కించుకున్న నాటి అన్క్యాప్డ్ ప్లేయర్ల లిస్టులో శ్రీచరణి చేరింది. అరంగేట్రంలోనే ఎలిస్ పెర్రీని అవుట్ చేసి ఆగమనాన్ని ఘనంగా చాటింది ఈ స్పిన్ బౌలర్.ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన శ్రీచరణి 2025 ఏప్రిల్‌లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టింది. శ్రీలంకతో ముక్కోణపు వన్డే సిరీస్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. అదే ఏడాది ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా టీ20లలోనూ అడుగుపెట్టింది. 4/12 గణాంకాలతో సత్తా చాటి తొలి అంతర్జాతీయ టీ20లోనే ఈ ఘనత సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది.ఇక ఇప్పటి వరకు భారత్ తరఫున 18 వన్డేలు, ఐదు టీ20లు ఆడిన 21 ఏళ్ల శ్రీచరణి.. వరల్డ్‌కప్‌లో ఏకంగా పదకొండు వికెట్లు కూల్చి సత్తా చాటింది. ప్రపంచకప్ విజేతగా డబ్ల్యూపీఎల్ వేలంలోకి వచ్చిన ఆమె కనీస ధర.. దాదాపుగా 333 శాతం పెరగడం విశేషం. -
తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)
-
సిగ్గులేని వాళ్లుంటారు: వరల్డ్‌కప్ విజేతలకు గావస్కర్ వార్నింగ్
నాలుగున్నర దశాబ్దాల కలను నెరవేరుస్తూ భారత మహిళా క్రికెట్ జట్టు ఇటీవలే వన్డే ప్రపంచకప్ (ICC Women's ODI World Cup) విజేతగా నిలిచింది. సొంతగడ్డపై ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు మొదలు అభిమానుల దాకా.. యావత్ భారతావని ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది.భారీ నజరానాఢిల్లీ నుంచి గల్లీ దాకా హర్మన్ సేన గెలుపును ప్రస్తావిస్తూ మన ఆడబిడ్డలను ఆకాశానికెత్తింది. ఇక వరల్డ్‌కప్ గెలిచిన జట్టులోని సభ్యులైన క్రికెటర్లకు ఐసీసీ అందించే రూ. 40 కోట్ల ప్రైజ్‌మనీతో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించిన రూ. 51 కోట్ల నజరానా దక్కనుంది.క్యాష్ రివార్డులు అంతేకాదు.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం భారీ ఎత్తున రివార్డులు ప్రకటించాయి. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు ప్లేయర్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, రాధ యాదవ్‌లకు ఇప్పటికే ప్రభుత్వం తలా రూ.2.25 కోట్ల మేర చెక్కులు అందించింది. భారత జట్టులోని ఇతర సభ్యులు క్రాంతి గౌడ్ (మధ్యప్రదేశ్), అమన్‌జోత్ కౌర్, హర్లీన్ డియోల్ (పంజాబ్), రిచా ఘోష్ (బెంగాల్), అరుంధతి రెడ్డి (తెలంగాణ)లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఘన స్వాగతం పలికాయి.ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీచరణికి గ్రూప్-1 ఉద్యోగంతో పాటు.. రూ. 2.5 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. సొంత ఊరిలో ఇంటి స్థలం కూడా కేటాయించింది. ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచకప్ విజేతలను ఉద్దేశించి టీమిండియా దిగ్గజ0, 1983 వరల్డ్‌కప్ విన్నర్ సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.అమ్మాయిలు జాగ్రత్తమిడ్-డేకు రాసిన కాలమ్‌లో.. ‘‘అమ్మాయిలు కాస్త జాగ్రత్త. మీకోసమే ఈ మాటలు.. అందరూ మాట ఇచ్చినట్లుగా మీకు అవార్డులు, రివార్డులు దక్కకపోతే అస్సలు బాధపడొద్దు. మన దేశంలో అడ్వర్టైజర్లు, బ్రాండ్లు, కొంతమంది వ్యక్తులు ఉచిత ప్రచారం కోసం విజేతలను తమ భుజాలపై మోస్తారు.జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫుల్‌పేజీ యాడ్లు, హోర్డింగ్‌లు పెట్టిస్తారు. జట్టు యాజమాన్యం, స్పాన్సర్లు తప్ప మిగతా వారంతా ఫ్రీ పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తారు. నిజానికి వారి ద్వారా భారత క్రికెట్‌కు ఒరిగేది ఏమీ ఉండదు.1983లో భారత్‌కు తొట్టతొలి వరల్డ్‌కప్ అందించిన విజేతలకు కూడా చాలా ప్రామిస్‌లు చేశారు. వీటి గురించి మీడియలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఈ విషయంలో మీడియాను తప్పుబట్టాల్సిన పనిలేదు.సిగ్గులేని వాళ్లుంటారువిజేతలకు వచ్చిన నజరానాల గురించి వారు పెద్ద పెద్ద హెడింగ్‌లు పెడతారంతే!.. అయితే, విజేతలతో పాటు మీడియాను కూడా కొంత మంది సిగ్గులేని వాళ్లు ఉపయోగించుకుంటారని వారికీ తెలిసి ఉండదు. కాబట్టి.. అమ్మాయిలూ.. ఇలాంటి సిగ్గులేని వ్యక్తులను ఉపేక్షించవద్దు.తమ ప్రచారం కోసం మీ పేరును వాడుకుంటారు. 1983 విజేతల తరఫు నుంచి మీకో మాట చెప్పదలచుకున్నా.. భారత క్రికెట్ అభిమానుల ప్రేమే అన్నింటికంటే గొప్ప సంపద. మీకూ ఇది వర్తిస్తుంది. మరోసారి విజేతలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశాన్ని గర్వపడేలా చేశారు. జై హింద్’’ అని గావస్కర్ రాసుకొచ్చాడు.కాగా వరల్డ్‌కప్‌లో భారత్ గెలవగానే గుజరాత్‌కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి.. మహిళా జట్టుకు డైమండ్ నెక్లెస్‌లు ఇస్తానని ప్రకటించాడు. మరో కార్ల కంపెనీ ఇంకా లాంచ్ చేయని వర్షన్‌ను విజేతలకు కానుకగా ఇస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో గావస్కర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.చదవండి: ‘ఆడమని బతిమిలాడినా పట్టించుకోలేదు... సెలక్టర్లు అడిగినా రాలేదు’ -
AP: ఎంఎస్కే ప్రసాద్‌కు ఘోర అవమానం
టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్, ఆంధ్రప్రదేశ్ మాజీ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్‌కు ఘోర అవమానం జరిగింది. మహిళల వన్డే ప్రపంచకప్-2025 విన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణికి స్వాగతం పలికేందుకు ఎంఎస్కే ఇవాళ గన్నవరం విమానాశ్రయానికి వెళ్లగా.. అక్కడి ప్రోటోకాల్ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. జాబితాలో పేరు లేదని బయటికి పంపించారు.ఎయిర్‌పోర్ట్‌లో తనకు జరిగిన అవమానాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎంఎస్కే సీఎంఓలో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లోని (ఏసీఏ) కొందరు ముఖ్యులపై బీసీసీఐకి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు. భారత సీనియర్ క్రికెట్ జట్టుకు చీఫ్ సెలెక్టర్‌గా వ్యవహరించిన తనకు ప్రోటోకాల్ ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అనంతరం శ్రీచరణి అభినందన కార్యక్రమానికి కూడా ఎంఎస్కే హాజరు కాలేదు. విమానాశ్రయం నుంచి జరిగిన ర్యాలీ లో కూడా కనిపించలేదు. సీఎం చంద్రబాబు, లోకేష్‌తో శ్రీచరణి భేటికి కూడా వెళ్లలేదు.కాగా, విమానాశ్రయంలోని ఎంట్రీ లాంజ్‌లోకి చాలామంది రాజకీయ నాయకులను అనుమతిచ్చిన ప్రోటోకాల్ సిబ్బంది.. టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ అయిన ఎంఎస్కే ప్రసాద్‌ను మాత్రం అనుమతించలేదు. -
శ్రీ చరణికి భారీ నజరానా..
భారత మహిళా క్రికెటర్, వరల్డ్‌కప్ విన్నర్ శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. కడపకు చెందిన శ్రీచరణికి 2.5 కోట్ల నగదు బహుమతితో పాటు గ్రూపు-1 ఉద్యోగం ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. అదేవిధంగా తన సొంత ఊరిలో ఇంటి స్ధలాన్ని కూడా ప్రభుత్వం ఇవ్వనుంది.శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి గన్నవరంకు చేరుకున్న శ్రీ చరణి.. విమానశ్రయం నుంచి ర్యాలీగా వెళ్లి ఉండవల్లిలో సీఎం చంద్రబాబును కలిసింది. ఆమె వెంట భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఉంది. ఈ సందర్భంగా చరణిని చంద్రబాబు అభినందించారు."వరల్డ్‌కప్ టోర్నీలో వంద శాతం ఎఫర్ట్ పెట్టాను. జట్టు మొత్తంగా కలిసికట్టుగా రాణించడంతోనే వరల్డ్‌కప్ కల మాకు సాధ్యమైంది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఎల్లప్పుడూ నా వెంట ఉంటుంది. అదేవిధంగా మా ఫ్యామిలీ కూడా ఎంతగానో సపోర్ట్ చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే.. ముందు చాలా ఉంది" అని శ్రీచరణి మీడియా సమావేశంలో పేర్కొంది. కాగా భారత్ తొలి వన్డే వరల్డ్‌కప్ టైటిల్‌ను సొంతం చేసుకోవడంతో ఈ తెలుగు తేజంది కీలక పాత్ర. -
గన్నవరం చేరుకున్న వరల్డ్‌కప్ విన్నర్ శ్రీచరణి..
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 గెలిచిన భారత జట్టు సభ్యురాలు, ఆంధ్ర క్రికెటర్ శ్రీచరణి శుక్రవారం ఉదయం గన్నవరంకు చేరుకుంది. గన్నవరం విమానశ్రయంలో ఆమెకు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ సభ్యులు, మంత్రులు అనిత, సవిత, రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ కేశినేని చిన్ని ఘనస్వాగతం పలికారు.చరణిని అభినందించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఎయిర్పోర్ట్ వద్దకు వచ్చారు. శ్రీ చరణి గన్నవరం నుండి ర్యాలీగా ఉండవల్లికి చేరుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు, మంత్రి లోకేష్‌ను చరణి కలవనుంది. ఆ తర్వాత మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంను చరణి సందర్శించనుంది.కాగా భారత మహిళల జట్టు తొలి వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకోవడంలో చరణిది కీలక పాత్ర. టోర్నీ అసాంతం చరణి అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. కడప జిల్లాకు చెందిన శ్రీచరణి ఫైనల్ మ్యాచ్‌లోనూ బంతితో మ్యాజిక్ చేసింది. ఈ 50 ఓవర్ల ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన శ్రీ చరణి 78 ఓవర్లు వేసి 14 వికెట్లు తీసింది. దీప్తీ శర్మ తర్వాత భారత్ తరపున అత్యధిక వికెట్ల తీసిన జాబితాలో చరణి నిలిచింది. -
ఇదెక్కడి న్యాయం బాబు.. శ్రీచరణిపై ఎందుకు చిన్న చూపు
-
కడప నుంచి వరల్డ్ కప్ దాకా.. శ్రీ చరణి కీలక పాత్ర (ఫొటోలు)


