భారత మహిళా క్రికెటర్, వరల్డ్‌కప్ విన్నర్ శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. కడపకు చెందిన శ్రీచరణికి 2.5 కోట్ల నగదు బహుమతితో పాటు గ్రూపు-1 ఉద్యోగం ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. అదేవిధంగా తన సొంత ఊరిలో ఇంటి స్ధలాన్ని కూడా ప్రభుత్వం ఇవ్వనుంది.
శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి గన్నవరంకు చేరుకున్న శ్రీ చరణి.. విమానశ్రయం నుంచి ర్యాలీగా వెళ్లి ఉండవల్లిలో సీఎం చంద్రబాబును కలిసింది. ఆమె వెంట భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఉంది. ఈ సందర్భంగా చరణిని చంద్రబాబు అభినందించారు.
"వరల్డ్‌కప్ టోర్నీలో వంద శాతం ఎఫర్ట్ పెట్టాను. జట్టు మొత్తంగా కలిసికట్టుగా రాణించడంతోనే వరల్డ్‌కప్ కల మాకు సాధ్యమైంది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఎల్లప్పుడూ నా వెంట ఉంటుంది. అదేవిధంగా మా ఫ్యామిలీ కూడా ఎంతగానో సపోర్ట్ చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే.. ముందు చాలా ఉంది" అని శ్రీచరణి మీడియా సమావేశంలో పేర్కొంది. కాగా భారత్ తొలి వన్డే వరల్డ్‌కప్ టైటిల్‌ను సొంతం చేసుకోవడంతో ఈ తెలుగు తేజంది కీలక పాత్ర.


