ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంక మహిళా జట్టుతో విశాఖ వేదికగా ఇవాళ (డిసెంబర్ 23) జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఓ మార్పు చేయగా.. శ్రీలంక తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగించింది.
స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ స్వల్ప అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్ ఆడటం లేదని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. దీప్తి స్థానంలో స్నేహ్ రాణా తుది జట్టులోకి వచ్చింది.కాగా, ఇదే విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధ్యింలోకి వెళ్లింది.
తుది జట్లు..
శ్రీలంక: విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(సి), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డి సిల్వా, కవిషా దిల్హరి, కౌషని న్యూత్యాంగన(w), మల్కీ మదార, ఇనోకా రణవీర, కావ్య కావింది, శశిని గిమ్‌హనై
భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), రిచా ఘోష్ (w), అమంజోత్ కౌర్, స్నేహ రాణా, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి


