ఇది అసలు నిజం.. వైఎస్‌ జగన్‌ సంచలన ట్వీట్‌ | Ys Jagan Tweet On Lies Of Tdp And Janasena | Sakshi
Sakshi News home page

ఇది అసలు నిజం.. వైఎస్‌ జగన్‌ సంచలన ట్వీట్‌

Dec 23 2025 8:13 PM | Updated on Dec 23 2025 9:54 PM

Ys Jagan Tweet On Lies Of Tdp And Janasena

సాక్షి, తాడేపల్లి: టీడీపీ, జనసేన అబద్ధాల దుష్ప్రచారాన్ని ఎక్స్‌ వేదికగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బట్టబయలు చేశారు. టీడీపీ, జనసేన అసత్య ప్రచారాన్ని మరోసారి ఆయన ఎండగట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై కూటమి సర్కార్‌ చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని వైఎస్‌ జగన్‌ బయటపెట్టారు. ఆర్‌బీఐ గణాంకాలను చూపుతూ కూటమి ప్రభుత్వానికి వైఎస్‌ జగన్‌ సూటి ప్రశ్నలు వేశారు.

‘‘వైఎస్సార్‌సీపీ హయాంలో ఏపీ బ్రాండ్‌ దెబ్బతిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. అదే నిజమైతే ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాలు భిన్నంగా ఎందుకున్నాయి?. ఆర్‌బీఐ గణాంకాలు చూస్తే వైఎస్సార్‌సీపీ పనితీరు ఏంటో తెలుస్తుంది.

..2019-24 మధ్య ఉత్పత్తి రంగంలో ఏపీ దక్షిణ భారత్‌లో నెం.1. యావత్‌ దేశంలోనే ఐదో  స్థానంలో నిలిచింది. 2019-24 మధ్య ఏపీ పారిశ్రామిక రంగంలో పురోగతి. దక్షిణ భారత్‌లో నెం.1, యావత్‌ దేశంలో 8వ స్థానం. మరి దీన్ని బ్రాండ్‌ ఏపీ నాశనం అంటారా?. లేక సమర్థవంతమైన నాయకత్వం ద్వారా రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందింది అంటారా? సత్యమేవ జయతే‘‘ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement