సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. అంబటికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతేగడాది నవంబర్ 12న నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేస్తూ గుంటూరు కోర్టు తీర్పును వెలువరించింది.
నవంబర్ 12న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టింది. ఆ ర్యాలీ నిర్వహించే సమయంలో అంబటి తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు. తాజా, కోర్టు తీర్పుతో ఈరోజే అంబటి రాంబాబు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అంబటి రాంబాబు బెయిల్‌కు సంబంధించి పూచికత్తుల వ్యవహారం ఇప్పటికే పూర్తయ్యింది. అంబటి తరఫు న్యాయవాదులు పదివేల రూపాయలు చొప్పున రెండు పూచీకత్తులు కోర్టుకు సమర్పించారు. రిలీజింగ్ ఆర్డర్ తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు బయల్దేరారు.



