వైఎస్ జగన్‌ను కలిసిన ఈదుమూడి గ్రామ యాదవులు | Prakasam District Edumudi Village Yadavas Met Ys Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్‌ను కలిసిన ఈదుమూడి గ్రామ యాదవులు

Aug 19 2026 6:08 PM | Updated on Aug 19 2026 6:58 PM

Prakasam District Edumudi Village Yadavas Met Ys Jagan

సాక్షి, తాడేపల్లి: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామానికి చెందిన యాదవులు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. తమపై జరిగిన దాడి, అనంతరం తమపైనే నమోదైన కౌంటర్‌ కేసు, పోలీసుల వ్యవహారశైలితో ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

మేకలు మేపుకుంటున్న తమపై టీడీపీ నేతలు దాడి చేశారనీ.. తిరిగి తమమీదే కేసులు పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు, పోలీసుల వైఖరిపై వైఎస్‌ జగన్‌కు బీసీలు ఫిర్యాదు చేశారు. బాధితులకు అండగా ఉంటామని వైఎస్‌ జగన్ భరోసా ఇచ్చారు.

తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన YSRCP నేతలు

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement