ఏరియా వైద్యశాల ఏర్పాటు చేసింది జగనన్నే | - | Sakshi
Sakshi News home page

ఏరియా వైద్యశాల ఏర్పాటు చేసింది జగనన్నే

Oct 4 2026 10:25 AM | Updated on Oct 4 2026 10:25 AM

ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌

యర్రగొండపాలెం: గత ప్రభుత్వ హయాంలో వెనకబడిన ప్రాంతాల పేద ప్రజల కష్టాలు తెలుసుకున్న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి యర్రగొండపాలెంలో 30 పడకల వైద్యశాలను 100 పడకల వైద్యశాలగా అప్‌గ్రేడ్‌ చేశారని ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌ అన్నారు. స్థానిక ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా శనివారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆస్పత్రిని అప్‌ గ్రేడ్‌ చేయడంతోపాటు దాదాపు రూ.10 కోట్లతో పూర్తిస్థాయిలో హాస్పిటల్‌ పక్కాభవనం నిర్మాణం చేపట్టి పూర్తి చేయించారని ఆయన అన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ కాలంలో పెద్దదోర్నాలలో మంజూరైన సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాలను త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని, ప్రభుత్వం తక్షణమే ఆ వైద్యశాలను పూర్తిచేయాలని డిమాండ్‌ చేశారు. వైద్యశాల ఆవరణలో క్యాంటిన్‌ ఏర్పాటు చేసేందుకు తీర్మానించామని చెప్పారు. వైద్యశాలపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా వైద్యశాలల కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ నాగభూషణం, డాక్టర్లు సుభాషిణి, శివానంద్‌లను ఆయన శాలువలు కప్పి సన్మానించారు. ముందుగా ఎమ్మెల్యే వైద్యశాలను పరిశీలించారు. రోగుల తో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యశాల చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన ఆయనకు, సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మండల పరిషత్‌ మాజీ ఉపాధ్యక్షుడు మందుల ఆదిశేషులను వైద్యులు, పార్టీ నాయకులు శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి హాస్పటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దేవర యదిద్యా అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, మండల అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, సూరె వెంకట రమేష్‌, మాజీ జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్‌, వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement