న్యూస్‌రీల్
నేడు వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం
ఎల్‌నినో ప్రభావంతో కొఠార్లలో నిలిచిన ఉప్పు తయారీ ఉమ్మడి జిల్లాలో సుమారు 4 వేల ఎకరాల్లో ఉప్పు సాగు నాణ్యమైన ఉప్పు 80 కేజీల బస్తా ధర రూ.220 మాత్రమే నాసిరకం ఉప్పు ధర కేజీ ఒక్క రూపాయే.. ఎల్‌నినో ప్రభావంతో నాసిరకం ఉప్పు ఉత్పత్తి ఆర్థికంగా నష్టం వాటిల్లడంతో కొఠార్లలో నిలిచిన ఉప్పుసాగు ఇతర పనులకు వెళ్తున్న వేలాది మంది కూలీలు
గత ఎన్నికల హామీల్లో భాగంగా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు. 50 ఏళ్లకే పెన్షన్ మాట దేవుడెరుగు, 60 ఏళ్లు దాటినవారు రెండున్నర సంవత్సరాలుగా పెన్షన్‌ల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళలకు రూ.1500 నెల నెలా ఇస్తామని చెప్పి ఇంత వరకూ అమలు చేయకపోవడం మోసం కాదా.
– బత్తుల స్రవంతి, మాజీ వలంటీర్, ఇనమనమెళ్లూరు, మద్దిపాడు మండలం
ఉమ్మడి జిల్లాలో ఉప్పు రైతులతో పాటు కూలీల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. ఎల్‌నినో ప్రభావంతో ఎండల తీవ్రత కారణంగా కొఠార్లలో నాసిరకం ఉప్పు తయారవటంతో ధర లేక ఆర్ధికంగా నష్టపోతున్నారు. కేజీ ఉప్పు ధర రూపాయికి దిగజారడంతో దిక్కుతోచక రైతులు ఉప్పుసాగుకు స్వస్తి చెబుతున్నారు. పనులు లేక వేలాది మంది కూలీలు ఇతర పనులకు వెళ్లాల్సి వస్తోంది.
ఉప్పు కేజీ ఒక్క రూపాయే ఉంది..
నేను 10 ఎకరాల్లో ఉప్పు సాగు చేస్తున్నాను. ప్రస్తుతం ఉప్పు ధరలు తక్కువగా ఉన్నాయి. ఉప్పు ధర కేజీ ఒక్క రూపాయి మాత్రమే ఉంది. దీంతో ఆర్థికంగా నష్టం రావటంతో ఉప్పు తయారీ ఆపేశాను. ఈ సంవత్సరం ఉప్పు రైతు ఆర్థికంగా నష్టపోవాల్సిన దుస్థితి ఉంది.
– పురిణి శ్రీనివాసులరెడ్డి, ఉప్పు రైతు, ఊళ్లపాలెం
ఉప్పు సాగుకు
సింగరాయకొండ:
ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితులు సాధారణ రైతులనే కాక ఉప్పు తయారు చేసే రైతులనూ నష్టపరుస్తున్నాయి. వాస్తవానికి ఈ సమయంలో వర్షాలు కురుస్తాయని స్వతహాగా రైతులు ఉప్పు ఉత్పత్తి ఆపేస్తారు. కానీ ఈ సంవత్సరం వర్షాలు లేక ఎండ తీవ్రత కారణంగా నాసిరకం ఉప్పు తయారుకావటంతో ధర లేక ఆర్ధికంగా నష్టం వాటిల్లి రైతులే స్వచ్ఛందంగా ఉప్పు ఉత్పత్తి నిలిపేశారు.
జిల్లాలో ఉప్పు సాగు ఇలా..
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనపర్తి, చిన్నగంజాం, పాకల, ఊళ్లపాలెం, బింగినపల్లి గ్రామాల్లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో సుమారు 4 వేల ఎకరాల్లో ఉప్పు సాగవుతుంది. 7 వేలకు పైగా రైతులు, 10 వేలకు పైగా కూలీలు ఉప్పు సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. సింగరాయకొండ, చిన్నగంజాం నుంచి తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు ఉప్పు సరఫరా అవుతుంది. ప్రతి సంవత్సరం వర్షాకాలం తప్ప సుమారు 9 నెలల పాటు ఉప్పు సాగవుతుంది. ప్రతి సంవత్సరం ఎకరాకు 80 కేజీల ఉప్పు బస్తాలు 1,000 వరకు ఉత్పత్తి అవుతాయి. ఈ ప్రకారం ప్రతినెలా 25 వేల టన్నుల వరకు ఉప్పు ఉత్పత్తి వస్తుంది. గత సంవత్సరం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఉప్పు ఉత్పత్తి లక్ష్యానికన్నా తక్కువగా అయింది. ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటంతో నాణ్యమైన ఉప్పు ఉత్పత్తి కాక ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.
పడిపోయిన ఉప్పు ధరలు:
ప్రస్తుతం నాణ్యమైన ఉప్పు 80 కేజీల బస్తా ధర రూ.220 ఉండగా, నాసిరకంగా ఉప్పు ధర కేజీ ఒక రూపాయి మాత్రమే ఉంది. వాస్తవానికి ఉప్పు కనీస మద్దతు ధర రూ.250 ఉంటేనే రైతుకు గిట్టుబాటు ధర దక్కే పరిస్థితి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రైతు ఎకరాకు ప్రతి నెలా రూ.10 వేలు కూలీల రూపంలో ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఉందని ఉప్పు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉప్పు కొఠారు గట్ల వద్ద నిల్వ ఉన్న ఉప్పు రాశులు
ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఒంగోలు నగరం, ఒంగోలు మండలానికి సంబంధించిన విస్తృతస్థాయి సమావేశం ఆదివారం జరగనుంది. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు అధ్యక్షతన నిర్వహించే సమావేశంలో మాజీ టీటీడీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు వైవీ.సుబ్బారెడ్డి, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ ఇన్‌చార్జ్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ పుత్తా శివశంకర్‌రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు అసెంబ్లీ పరిశీలకులు వెంకటేశ్వర్లు నాయుడు తదితరులు పాల్గొననున్నారు. రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, ఒంగోలు నగర అధ్యక్షుడు కటారి శంకరరావు, కొత్తపట్నం మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, ఒంగోలు మండల అధ్యక్షుడు మన్నే శ్రీనివాసరావుతో పాటు వివిధ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు హాజరుకానున్నారు.
ఎంపీపీలు, జెడ్పీటీసీలకు సన్మానం..
ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వైఎస్సార్ సీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. పార్టీ పదవులు పొందిన వారికి గుర్తింపు కార్డులను అందజేయనున్నారు. డివిజన్, గ్రామ అధ్యక్షులు, వివిధ విభాగాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు సమావేశానికి హాజరుకావాలని పార్టీ నాయకులు కోరారు.
ఇతర పనులకు వెళ్తున్న కూలీలు
ధర లేక రైతులే స్వచ్ఛందంగా ఉప్పు తయారీ ఆపేయడంతో వేలాదిగా ఉన్న కూలీలు ఇతర పనులకు వెళుతున్నారు. గతంలో రొయ్యల కంపెనీల్లో పనులు దొరికేవని, కానీ ప్రస్తుతం కంపెనీల్లో కూడా పనులు దొరకటం లేదని కూలీలు వాపోతున్నారు. ఇప్పటికే తయారైన ఉప్పుకు సరైన ధరలేకపోవటంతో కొఠారుల గట్ల వద్ద తయారైన ఉప్పు రాశులు భారీగా దర్శనమిస్తున్నాయి. వర్షాలు కురిసి నేల స్వభావం మారి కొఠారులను సిద్ధం చేసుకుంటే తప్ప నాణ్యమైన ఉప్పు తయారు కాదని, అప్పటి వరకు వేచి ఉండాల్సిందేనని ఉప్పు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


