ఆసియా క్రీడలు-2026 పురుషుల టీ20 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా మరోసారి సత్తా చాటింది.
జపాన్ వేదికగా పాకిస్తాన్‌తో శనివారం నాటి ఫైనల్లో 19 పరుగుల తేడాతో గెలిచి వరుసగా రెండోసారి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.
ఈ విజయంలో ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బంతుల్లో 61), వైస్ కెప్టెన్ తిలక్ వర్మ (22 బంతుల్లో 51 నాటౌట్), ఆల్‌రౌండర్ శివం దూబే (15 బంతుల్లో 27) కీలక పాత్ర పోషించారు.
ఇక చాంపియన్‌గా నిలిచిన భారత జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) చైర్మన్ జై షా బంగారు పతకాలను ప్రదానం చేశారు.
Images Source : Twitter (X) @BCCI


