ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్‌లో భారత్ స్వర్ణం నిలబెట్టుకుంది.
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన టీమిండియా అజేయ జట్టుగా ఫైనల్‌కు చేరి, తుది సమరంలో పాక్‌పై 19 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.
భారీ లక్ష్య ఛేదనలో పాక్ ఆదిలోనే తడబడింది. 33, 36, 39 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయి ఓటమిని ఖరారు చేసుకుంది.
Images Source : Twitter (X) @BCCI


