breaking news
Asian Games 2026
-
స్వర్ణ విజేత మహిళల కబడ్డీ జట్టు కోచ్ నీతా దడ్వేకు ఘన స్వాగతం
హైదరాబాద్: జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల కబడ్డీ జట్టును స్వర్ణ పతకం వైపు నడిపించిన కోచ్, అర్జున అవార్డు గ్రహీత నీతా దడ్వే సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు, కబడ్డీ క్రీడాకారులు ఘనంగా స్వాగతం పలికారు.భారత మహిళల కబడ్డీ జట్టు అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకం సాధించడంలో నీతా దడ్వే అందించిన సమర్థవంతమైన మార్గదర్శకత్వాన్ని ఈ సందర్భంగా అధికారులు, కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. ఆమె శిక్షణ, వ్యూహాత్మక మార్గదర్శకత్వం భారత జట్టు విజయానికి కీలకంగా నిలిచిందని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి మహేందర్ రెడ్డి, సలహాదారులు జగదీశ్ యాదవ్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ అశోక్ కుమార్, పీఆర్ఓ కాలేరు సురేశ్, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు, కబడ్డీ క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు. -
రేపు క్వార్టర్ ఫైనల్; జట్టును వీడిన స్టార్ బ్యాటర్.. బంగ్లాకు షాక్!
ఆసియా క్రీడల్లో మలేషియాతో క్వార్టర్ ఫైనల్ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక బ్యాటర్ నజ్ముల్ హసన్ శాంటో అనారోగ్యం కారణంగా జట్టును వీడాడు. జ్వరంతో బాధపడుతున్న నజ్ముల్ రేపు స్వదేశానికి తిరిగి రానున్నట్లు బంగ్లాదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ (బీవోఏ) వెల్లడించింది. అక్టోబర్ 9 నుంచి అఫ్గానిస్తాన్ జట్టుతో బంగ్లాదేశ్ ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో టెస్టు కెప్టెన్ అయిన నజ్ముల్ అనారోగ్యంతో ఆసియా క్రీడల్లో పాల్గొనడం రిస్క్ అని భావించి అతడిని వెనక్కి రావాలని ఆదేశించినట్లు బంగ్లా క్రికెట్‌బోర్డు తెలిపింది. ఇక ర్యాంకింగ్ ఆధారంగా నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించిన బంగ్లాదేశ్ మంగళవారం మలేషియాతో తలపడనుంది. జపాన్ పిచ్‌లను దృష్టిలో పెట్టుకొని బౌలింగ్‌కు ప్రాధాన్యతనివ్వనున్నట్లు కెప్టెన్ లిటన్ దాస్ అభిప్రాయపడ్డాడు. వర్షం అంతరాయంతో సరైన ప్రాక్టీస్ లేకుండానే బంగ్లాదేశ్ రేపటి మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. ఇప్పటికే భారత్, అఫ్గానిస్తాన్; పాకిస్తాన్, హాంకాంగ్‌ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ రద్దు కావడంతో మెరుగైన ర్యాంక్ ఆధారంగా దాయాది జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. మరో క్వార్టర్ ఫైనల్లో నేపాల్, శ్రీలంక తలపడనున్నాయి. ఒకవేళ మలేషియాతో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ రద్దయితే సెమీస్‌లో అడుగుపెట్టనున్న బంగ్లాదేశ్ అక్కడ పాకిస్తాన్‌తో ఆడనుంది. నేపాల్, శ్రీలంక మధ్య విజేతతో భారత్ మరో సెమీఫైనల్ ఆడనుంది.ఇదీ చదవండి: జావెలిన్ త్రోలో భారత్‌కు రెండు పతకాలు; స్వర్ణం అతడిదే! -
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఆసియా క్రీడలు-2026 పురుషుల హాకీ పోటీల్లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన పూల్-ఎ చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 10-0 తేడాతో విజయాన్ని అందుకుంది. ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకున్న భారత జట్టు.. ఆఖరి మ్యాచ్‌లోనూ విజృంభించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు గోల్స్ వర్షం కురిపించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (27, 40, 45వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగగా, లక్రా శిలానంద్ (44, 45వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించాడు. అలాగే అభిషేక్, జుగ్రాజ్ సింగ్, సుఖ్జీత్ సింగ్, సంజయ్ మరియు మన్దీప్ సింగ్ తలా ఒక గోల్ చేసి భారత్ భారీ విజయంలో భాగమయ్యారు. ఈ విజయంతో పూల్-ఎ విభాగంలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కాగా, అక్టోబర్ 1న జరగనున్న తొలి సెమీఫైనల్ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. భారత జట్టు జోరును బట్టి చూస్తే దాయాది జట్టుపై విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. -
జావెలిన్ త్రోలో భారత్‌కు రెండు పతకాలు; స్వర్ణం అతడిదే!
ఆసియా గేమ్స్‌కు భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా దూరమైనప్పటికీ, ఈ విభాగంలో అథ్లెట్లు మన దేశానికి పతకాలు అందించారు. సోమవారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో భారత అథ్లెట్లు యశ్ వీర్ సింగ్, రోహిత్ యాదవ్‌లు రజత, కాంస్యాలతో మెరిశారు. శ్రీలంక స్టార్ రుమేశ్ తరంగ పతిరగె మరోసారి స్వర్ణం చేజెక్కించుకున్నాడు. ఫైనల్లో రుమేశ్ తరంగ ఈటెను చివరి ప్రయత్నంలో 88.55 మీటర్ల దూరం విసిరి పసిడి నెగ్గగా.. యశ్వీర్ సింగ్ తన పర్సనల్ బెస్ట్ (85.72 మీటర్లు) నమోదు చేయడమే గాక రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకున్నాడు. ఇక తొలి ప్రయత్నంలో ఈటెను 83.56 మీటర్ల దూరం విసిరిన రోహిత్ మూడో ప్రయత్నంలో 84.35 మీటర్లు విసిరి కాంస్యం దక్కించుకున్నాడు. ఈసారి నీరజ్ చోప్రా ఆసియా క్రీడలకు దూరంగా ఉన్న నేపథ్యంలో యశ్ వీర్, రోహిత్‌లపై అంచనాలు పెరిగాయి. వారిపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ యశ్ వీర్, రోహిత్‌లు పతకాలు సాధించారు. దీంతో భారత్ పతకాల సంఖ్య 45కు పెరిగింది. ఇందులో 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలున్నాయి. పాకిస్తాన్ స్టార్ అర్షద్ నదీమ్ 80.29 మీటర్ల దూరం విసిరి నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు.ఇదీ చదవండి: Asian Games: పీటీ ఉష రికార్డు బ్రేక్.. పతకాల మోత మోగించిన భారత్ -
పీటీ ఉష రికార్డు బ్రేక్.. పతకాల మోత మోగించిన భారత్
ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. సోమవారం భారత్ ఖాతాలో 13 పతకాలు వచ్చి చేరాయి. స్వర్ణం రాకపోయినప్పటికీ, మన అథ్లెట్లు రజతాలు, కాంస్యాలతో పతకాల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు. ఇక జావెలిన్ త్రోలో రజతం, కాంస్యం రావడంతో ఇప్పటివరకు భారత్ 45 పతకాలు గెలుచుకోగా.. ఇందులో 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలున్నాయి.గుల్వీర్కు మరో రజతంభారత లాండ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ ఆసియా గేమ్స్‌లో రెండో రజతంతో మెరిశాడు. ఇప్పటికే 10వేల మీటర్ల పరుగులో రజతం గెలిచిన గుల్వీర్ సోమవారం జరిగిన 1500 మీటర్ల ఫైనల్లో రెండో స్థానంలో వెండి పతకాన్ని కొల్లగొట్టాడు. 1500 మీటర్ల రేసును గుల్వీర్ 3:36.72 నిమిషాల్లో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. 𝐆𝐔𝐋𝐕𝐄𝐄𝐑 𝐒𝐈𝐍𝐆𝐇 𝐎𝐍 𝐓𝐇𝐄 𝐏𝐎𝐃𝐈𝐔𝐌! 🥈A strong 1500m run sees him finish second and add another medal to India’s tally! ✨Watch the 20th Asian Games Aichi-Nagoya 2026, LIVE on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #AsianGames… pic.twitter.com/wsYKwYJlWl— Sony Sports Network (@SonySportsNetwk) September 28, 2026చివరి నిమిషం వరకు టాప్‌లో ఉన్న గుల్వీర్కు.. జపాన్ అథ్లెట్ కజుటో ఇజావా ఊహించని షాక్ ఇచ్చాడు. ఫినిష్ లైన్ సమీపిస్తున్న తరుణంలో కజుటో ఇజావా పుంజుకుని కేవలం 0.37 సెకన్ల తేడాతో గుల్వీర్ను వెనక్కి నెట్టి స్వర్ణ పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇక జపాన్‌కే చెందిన జపాన్‌కు చెందిన నగియా మోరీ 3:37.92 నిమిషాల్లో రేసును పూర్తి చేసి కాంస్యం కైవసం చేసుకున్నాడు.పీటీ ఊష రికార్డు బ్రేక్..అంతకముందు మహిళల 400 మీటర్ల హార్డిల్స్‌లో భారత అథ్లెట్ విథ్యా రామ్రాజ్ దిగ్గజం పీటీ ఉష రికార్డును బ్రేక్ చేయడమే గాక కాంస్య పతకంతో మెరిసింది. 400 మీటర్ల హార్డిల్స్‌ను విథ్యా రామ్రాజ్ 54.75 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్యం ఒడిసిపట్టింది. PC: Twitterకాగా 1984 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హార్డిల్స్‌లో పీటీ ఉష నెలకొల్పిన 55.42 సెకన్ల టైమింగ్‌ను 0.67 సెకన్ల వ్యవధిలో బద్దలుకొట్టిన విథ్యా రామ్రాజ్ తన పేరును లిఖించుకుంది. ఇక యూఏఈకి చెందిన మరియమ్ కరీమ్ (54.31 సెకన్లు) స్వర్ణం గెలుచుకోగా, కజకిస్తాన్‌కు చెందిన అడెలినా జెమ్స్ (54.58 సెకన్లు) రజతం కైవసం చేసుకుంది.🥉 कांस्य पदक विथ्या रामराजने AsianGames2026 में महिलाओं की 400 मीटर हर्डल्स में कांस्य पदक जीती —उन्होंने पी.टी. उषा के पिछले राष्ट्रीय रिकॉर्ड को तोड़ा!#AsianGames2026 #VithyaRamraj #Athletics pic.twitter.com/IhEvgTaBL9— @p2- चंद्रवंशी 🇮🇳 (@pra1366) September 28, 2026లాంగ్ జంప్‌లో మురళీకి రజతంభారత అథ్లెట్ మురళీ శ్రీశంకర్ సత్తా చాటాడు. పురుషుల లాంగ్ జంప్ విభాగంలో మురళీ 8.07 మీటర్ల దూరం దూకి రజతం సొంతం చేసుకున్నాడు. గత ఆసియా గేమ్స్‌లోనూ రజతమే సాధించిన మురళీ ఈసారి స్వర్ణం కోసం ప్రయత్నించాడు. అయితే చీలమండ గాయంతో చివరి రెండు ప్రయత్నాలు విరమించుకోవడంతో మురళీ శ్రీ శంకర్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే చివరి రెండు ప్రయత్నాల్లో మురళీ పాల్గొననప్పటికీ తన బెస్ట్ (8.07 మీటర్లు)ను ఎవరు అధిగమించకపోవడం విశేషం. కొరియాకు చెందిన లిన్ యూ టోంగ్ (8.05 మీటర్లు) స్వర్ణం గెలుచుకోగా.. అన్వరోవ్ అన్వోర్ (8.06 మీటర్లు) దూకి రజతం గెలుచుకున్నాడు.పారుల్ చౌదరీకి కాంస్యం..భారత స్టార్ స్ప్రింటర్ పారుల్ చౌదరీ ఆసియా గేమ్స్‌లో రెండో పతకం సాధించింది. ఇప్పటికే 3వేల మీటర్ల స్టీపుల్ చేజ్లో కాంస్యం సాధించిన పారుల్ చౌదరీ సోమవారం 5వేల మీటర్ల స్టీపుల్‌చేజ్ రేసులో కాంస్యం ఒడిసిపట్టింది. ఆమె గమ్యాన్ని 15:14.61 సెకన్లలో పరుగు పూర్తి చేసింది. తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన కంటే 10 సెకన్లు ఆలస్యంగా పరుగెత్తిన పారుల్ కాంస్యంతో సరిపెట్టుకుంది. అయితే గత ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకం పట్టేసిన పారుల్ ఈసారి కంచుమోతతోనే సరిపెట్టుకుంది. ఇక బహ్రెయిన్ అథ్లెట్ విన్‌ఫ్రెడ్ యవి 15:10.18 సెకన్లలో గమ్యాన్ని చేరి పసిడి పతకం నెగ్గగా.. జపాన్ అథ్లెట్ నజోమి టనక (15:11.65 సెకన్లు) రజతం సొంతం చేసుకుంది.Congratulations to Parul Chaudhary on once again, winning the Bronze Medal in the Women’s 5000m at the #AsianGames2026! #Cheer4Bharat pic.twitter.com/E0DrL8leUb— Kiren Rijiju (@KirenRijiju) September 28, 2026ఇదీ చదవండి: ఆసీస్‌తో తొలి టెస్టు.. భారత ఓపెనర్ డబుల్ సెంచరీ -
మ్యాచ్ ఆడకుండానే సెమిస్ కు భారత్ అసలు ఏం జరిగిందంటే?
-
Asian Games: జ్యోతి సురేఖకు షాకిచ్చిన 14 ఏళ్ల సంచలనం
ఆసియా గేమ్స్‌లో ఆర్చరీ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్, డిఫెండింగ్ చాంపియన్ జ్యోతి సురేఖకు ఊహించని షాక్ ఎదురైంది. వ్యక్తిగత విభాగంలో దేశానికి కచ్చితంగా పతకం తెస్తుందని భావించినప్పటికీ, జ్యోతి సురేఖ ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టి నిరాశ పరిచింది. అయితే దక్షిణ కొరియాకు చెందిన 14 ఏళ్ల కాంగ్ యోన్సియో చేతిలో సురేఖ ఓటమి పాలవ్వడం అభిమానులను షాక్‌కు గురి చేసింది. ప్రిక్వార్టర్స్‌లో కాంగ్ యోన్సియో చేతిలో 150-146 తేడాతో సురేఖ ఓటమి చవిచూసింది. ఆరు సెట్ల సిరీస్‌గా జరిగిన మహిళల ఆర్చరీ వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్లో 14 ఏళ్ల కాంగ్ యోన్సియో ఆరు సెట్లు కలిపి 150 స్కోరు సాధించగా.. జ్యోతి సురేఖ 146కే పరిమితమైంది. రెండో సిరీస్‌లో జ్యోతి సురేఖ మూడుసార్లు 10 పాయింట్లు సాధించగా.. కాంగ్ ఆమెను సమం చేసింది. ఇక మూడో సిరీస్‌లోనూ కాంగ్ మూడుసార్లు పది పాయింట్లు స్కోరు చేయగా, సురేఖ తన చివరి సెట్లో 9 పాయింట్లే నమోదు చేసి పోటీలో వెనుకబడిపోయింది. 2011 నవంబర్ 1న జన్మించిన కాంగ్ యోన్సియో దక్షిణ కొరియా జాతీయ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కురాలైన ఆర్చర్‌గా చరిత్ర సృష్టించింది.కాంగ్ యోన్సియో 701 పాయింట్లు సాధించి ర్యాంకింగ్ రౌండ్లో నాలుగో స్థానంలో నిలిచింది. ఆమె ప్రదర్శనతో దక్షిణ కొరియా మహిళల టీమ్ పోటీలో 2,096 పాయింట్లు సాధించి, చైనా, భారత్‌ల తర్వాత మూడో స్థానంలో నిలిచింది. కాంగ్ యోన్సియో అదే ఫామ్‌ను వ్యక్తిగత డ్రాలోనూ కొనసాగించింది. రౌండ్ ఆఫ్ 32లో మంగోలియాకు చెందిన ఒట్గోన్బయార్ డాగ్డ్జావ్ను 150-133 తేడాతో సునాయాసంగా ఓడించిన కాంగ్, తాజాగా రౌండ్ ఆఫ్ 16లో డిఫెండింగ్ చాంపియన్ సురేఖకు షాక్ ఇచ్చి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఇక వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ నిరాశపరిచినప్పటికీ, గ్రూప్ ఈవెంట్లో మాత్రం భారత పురుషుల, మహిళల కాంపౌండ్ జట్లు సెమీస్‌లోకి ప్రవేశించి పతకం రేసులో నిలిచాయి. జ్యోతి సురేఖ, తానిపర్తి చికిత, ప్రతీకలతో కూడిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో 233-230 తేడాతో కజకిస్తాన్‌ను ఓడించింది. ఇక పురుషుల కాంపౌండ్ విభాగంలో కుశాల్ దలాల్, సాహిల్ జాదవ్, గణేశ్లతో కూడిన జట్టు 235-232 తో భూటాన్‌ను ఓడించింది.ఇదీ చదవండి: అప్పుడు పతకం అందిస్తే.. ఇప్పుడు ఇంటికి సాగనంపింది! -
అప్పుడు పతకం అందిస్తే.. ఇప్పుడు ఇంటికి సాగనంపింది!
జపాన్‌లోని నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో అఫ్గానిస్తాన్‌ను దురదృష్టం వెంటాడిందని చెప్పొచ్చు. నేపాల్ చేతిలో అనూహ్య ఓటమి చవిచూసిన అఫ్గానిస్తాన్ క్వార్టర్స్‌లో టీమిండియాపై గెలిచి సెమీస్ చేరాలని భావించింది. కానీ ఆఫ్గన్ పాలిట వరుణుడు విలన్‌గా మారాడు. వర్షం అంతరాయం కారణంగా ఆట సాధ్యం కాకపోవడంతో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన టీమిండియా సీడింగ్, టాప్ ర్యాంక్ ఆధారంగా సెమీస్‌లో అడుగుపెట్టగా, పదో ర్యాంకులో ఉన్న అఫ్గానిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.కట్‌చేస్తే.. మూడేళ్ల క్రితం, హాంగ్జౌ ఆసియా గేమ్స్‌లో అఫ్గానిస్తాన్ రజతం సాధించిన సంగతి తెలిసిందే. నాడు వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దవ్వడంతో అఫ్గానిస్తాన్ రజతం సాధించగా, వరుస విజయాలతో టాప్ లేపిన రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని టీమిండియా స్వర్ణం ఎగరేసుకుపోయింది. పైన రెండింటిని గమనించి చూస్తే.. అఫ్గానిస్తాన్, టీమిండియాలతో పాటు వర్షం ఇక్కడ కామన్‌గా కనిపిస్తోంది.నాటి ఆసియా గేమ్స్ ఫైనల్లో ఏ వర్షమైతే మ్యాచ్‌కు అడ్డుపడి, అఫ్గానిస్తాన్‌కు పతకం అందించిందో.. ఇవాళ అదే వర్షం ఆ జట్టును సగర్వంగా ఇంటికి సాగనంపడంలో విజయవంతమైంది. ఈ రెండు సందర్భాల్లోనూ టీమిండియానే ప్రత్యర్థి కావడం ఇక్కడ యాదృశ్చికం. అలా అఫ్గానిస్తాన్ హార్ట్‌బ్రేక్ అవ్వడానికి వర్షం పరోక్షంగా కారణమయ్యింది.ఇదీ చదవండి: Asian Games Cricket: సెమీఫైనల్‌కు టీమిండియా -
బుల్లెట్ ట్రైన్ లో టీమిండియా.. VIRAL VIDEO
-
Asian Games 2026: రజతంతో సరిపెట్టుకున్న ఈషా సింగ్
ఏషియన్ గేమ్స్ 2026లో తొమ్మిదో రోజు భారత్‌కు షూటింగ్లో మరో పతకం లభించింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఈషా సింగ్ రజత పతకం సాధించింది. ఫైనల్లో ఈషా సింగ్ అద్భుతంగా పోరాడినప్పటికీ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఈవెంట్లో చైనాకు చెందిన షియావో జియారుయ్షువాన్ స్వర్ణం గెలిచింది. ఈ పతకంతో భారత్ పతకాల సంఖ్య 39కి చేరింది.ఇక ఇతర విభాగాల్లోనూ భారత్ పతకాల వేట కొనసాగుతోంది. ఇవాళే కురాష్ మహిళల 78 కేజీల విభాగంలో పింకీ బల్హారా కాంస్యం సాధించింది. బాక్సింగ్‌లో లవ్లీనా బోర్గోహెయిన్ 75 కేజీల సెమీఫైనల్‌కు చేరి మరో పతకాన్ని ఖాయం చేసుకుంది.పురుషుల క్రికెట్లోనూ భారత్ సెమీఫైనల్‌కు చేరింది. ఆఫ్ఘనిస్తాన్‌తో క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.అథ్లెటిక్స్‌లో పారుల్ చౌధరి మహిళల 5000 మీటర్ల ఫైనల్లో బరిలోకి దిగనుంది. ఇప్పటికే ఒక పతకం సాధించిన పారుల్ మరో పతకంపై దృష్టి పెట్టింది.ఇదీ చదవండి: Asian Games Cricket: సెమీఫైనల్‌కు టీమిండియా -
Asian Games Cricket: సెమీఫైనల్‌కు టీమిండియా
ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో భాగంగా భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇవాళ జరగాల్సిన రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ తడి ఔట్ ఫీల్డ్ కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. ఫలితంగా మెరుగైన ర్యాంకింగ్ ఆధారంగా భారత్ సెమీఫైనల్‌కు చేరింది. దీనికి ముందు పాకిస్తాన్-హాంగ్‌కాంగ్ చైనా మధ్య జరగాల్సిన తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. దీంతో పాక్ కూడా సెమీస్‌కు చేరింది. పాపం ఆఫ్ఘనిస్తాన్.. గత ఎడిషన్ ఫైనల్లోనూ ఇంతే..!ఆసియా క్రీడల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు కనీసం పోరాడే అవకాశం కూడా లేకుండా పోతుంది. గత ఎడిషన్ ఫైనల్లోనూ ఆ జట్టు పోరాడే ప్రయత్నాన్ని వరుణుడు అడ్డుకున్నాడు. ఆ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు కావడంతో ఆఫ్ఘనిస్తాన్ రజతంతో సరిపెట్టుకుంది. ఇప్పుడు కనీసం కాంస్యం కూడా లేకుండానే ఏషియన్ గేమ్స్ నుంచి నిష్క్రమించింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్ ఈసారి కూడా మరో అడుగు ముందుకేసి సెమీస్‌కు చేరింది.అక్టోబర్ 1న జరిగే రెండో సెమీస్‌లో భారత్ బంగ్లాదేశ్-మలేషియా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో తలపడుతుంది. అదే రోజు జరిగే తొలి సెమీఫైనల్లో పాక్ శ్రీలంక-నేపాల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతను ఎదుర్కొంటుంది. రెండు సెమీఫైనల్స్‌లో గెలిచే జట్లు అక్టోబర్ 3న స్వర్ణ పతకం కోసం జరిగే మ్యాచ్‌లో తలపడతాయి. సెమీస్‌లో ఓడిన జట్లు అదే రోజు కాంస్య పతకం కోసం పోటీపడతాయి. ఇదీ చదవండి: Asian Games Cricket: సెమీస్‌కు పాక్ -
ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. 8వ రోజు ఏకంగా 7 పతకాలు
-
Asian Games Cricket: సెమీస్‌కు పాక్
ఏషియన్ గేమ్స్ పురుషుల క్రికెట్లో పాకిస్తాన్ సెమీఫైనల్‌కు చేరింది. హాంకాంగ్ చైనాతో ఇవాళ జరగాల్సిన తొలి క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడంతో పాక్ ఫైనల్-4లోకి అడుగు పెట్టింది. ఎడతెరిపిలేని వర్షం కారణంగా ఈ మ్యాచ్‌లో టాస్ కూడా సాధ్యపడలేదు. దీంతో మెరుగైన ఐసీసీ టీ20 ర్యాంకింగ్ ఆధారంగా పాక్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.పాకిస్తాన్‌తో పాటు భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు కూడా ర్యాంకింగ్స్ కారణంగా నేరుగా నాకౌట్ దశకు (క్వార్టర్ ఫైనల్) చేరుకోగా.. మలేషియా, హాంగ్‌కాంగ్ గ్రూప్-బి నుంచి, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్-ఏ నుంచి క్వార్టర్‌ఫైనల్‌కు చేరాయి.ఇవాళే జరుగనున్న రెండో క్వార్టర్ ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్.. భారత్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. రేపు జరుగబోయే మిగతా రెండు క్వార్టర్ ఫైనల్స్‌లో శ్రీలంక-నేపాల్, బంగ్లాదేశ్-మలేషియా తలపడతాయి. అక్టోబర్ 1న రెండు సెమీఫైనల్స్ మ్యాచ్‌లు, 3న కాంస్య పతక మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ (స్వర్ణం కోసం) జరుగనున్నాయి. ఇదీ చదవండి: సెమీస్‌లో భారత ఆర్చరీ జట్లు -
సెమీస్‌లో భారత ఆర్చరీ జట్లు
నగోయా: ఆసియా క్రీడల ఆర్చరీలో భారత పురుషుల, మహిళల కాంపౌండ్ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించి పతకం రేసులో నిలిచాయి. వెన్నం జ్యోతి సురేఖ, తానిపర్తి చికిత, ప్రతీకలతో కూడిన భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లో 233–230తో కజకిస్తాన్ జట్టును ఓడించింది. కుశాల్ దలాల్, సాహిల్ జాధవ్, గణేశ్ మణిరత్నంలతో కూడిన భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్లో 235–232తో భూటాన్ జట్టుపై గెలిచింది. పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో బొమ్మదేవర ధీరజ్, యశ్దీప్, నీరజ్లతో కూడిన భారత జట్టు సెమీఫైనల్‌కు చేరింది. మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ విభాగంలో చికిత–సాహిల్ జోడీ... మిక్స్డ్ టీమ్ రికర్వ్ విభాగంలో ధీరజ్–కుమ్కుమ్ జోడీ కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. -
పతకమోత...
అంచనాలను అందుకుంటూ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. పసిడి పతకం ఇంకా గెలవకపోయినా మన అథ్లెట్లు రజత, కాంస్యాలతో మెరిపిస్తున్నారు. ఎనిమిదో రోజు ఆదివారం భారత్ ఖాతాలో మొత్తం ఏడు పతకాలు చేరగా... అందులో ఐదు అథ్లెటిక్స్‌లోనే వచ్చాయి. మహిళల లాంగ్‌జంప్‌లో అన్సీ సోజన్ ఎడిపిల్లి... పురుషుల హైజంప్‌లో సర్వేశ్ కుశారే రజత పతకాలు గెలిచారు. పది క్రీడాంశాల సమాహారమైన డెకాథ్లాన్‌లో తేజస్విన్ శంకర్... మహిళల 200 మీటర్ల స్ప్రింట్ రేసులో హరిత భద్ర... మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో పారుల్ చౌధరీ కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. స్క్వాష్‌లో అనాహత్ సింగ్, అభయ్ సింగ్ పసిడి పోరులో ఓటమి పాలై రజత పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. బాక్సింగ్‌లో మూడు పతకాలు ఖాయం కాగా... ఆర్చరీలో భారత కాంపౌండ్ టీమ్ విభాగంలో పురుషుల, మహిళల జట్లు సెమీఫైనల్‌కు చేరుకొని పతకం బరిలో నిలిచారు. బ్యాడ్మింటన్ వ్యక్తిగత విభాగంలో భారత్ షట్లర్లు ఈసారి రిక్తహస్తాలతో తిరిగిరానున్నారు. సెమీఫైనల్ చేరితే నాలుగు పతకాలు ఖాయమయ్యే పరిస్థితిలో భారత షట్లర్లందరూ క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగారు. నగోయా: పసిడి అందకపోయినా పతకాల వేటలో భారత అథ్లెట్లు దూసుకుపోతున్నారు. ఆసియా క్రీడల ఎనిమిదో రోజు భారత్‌కు త్రుటిలో రెండు స్వర్ణాలు చేజారిపోయాయి. మహిళల లాంగ్‌జంప్‌లో ఆఖరి ప్రయత్నంలో చైనా అథ్లెట్ దెబ్బకొట్టగా... పురుషుల హైజంప్‌లో కౌంట్‌బ్యాక్‌లో బంగారు పతకాలు దూరమయ్యాయి. మహిళల లాంగ్‌జంప్‌లో కేరళకు చెందిన 26 ఏళ్ల అన్సీ సోజన్ వరుసగా రెండో ఆసియా క్రీడల్లో రజత పతకంతో సంతృప్తి పడింది. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లోనూ అన్సీ రెండో స్థానంలో నిలిచింది. ఈసారి ఆసియా క్రీడల్లో స్వర్ణమే లక్ష్యంగా కామన్వెల్త్ గేమ్స్‌కు కూడా దూరమైన అన్సీ కేవలం రెండు సెంటీమీటర్ల వ్యత్యాసంతో పసిడి పతకాన్ని కోల్పోయింది. అన్సీ 6.53 మీటర్ల దూరం గెంతగా... చైనా ప్లేయర్ అమ్మాయి యింగ్యింగ్ హువాంగ్ 6.55 మీటర్లతో స్వర్ణాన్ని ఎగురేసుకపోయింది. ఐదో ప్రయత్నంలో అన్సీ 6.53 మీటర్ల దూరం గెంతి అగ్రస్థానంలో ఉండగా... యింగ్యింగ్ చివరిదైన ఆరో ప్రయత్నంలో 6.55 మీటర్ల దూరం గెంతి విజేతగా నిలిచింది. మెంగీ టాన్ (చైనా; 6.46 మీటర్లు) కాంస్యం దక్కించుకోగా... మరో భారత లాంగ్‌జంపర్ శైలి సింగ్ 6.42 మీటర్లతో నాలుగో స్థానంలో నిలిచింది. 56 ఏళ్ల నిరీక్షణకు తెర...గత జూలైలో జరిగిన గ్లాస్గో కామన్వెల్ గేమ్స్‌లో రజతం గెల్చుకున్న సర్వేశ్ కుశారే అదే ప్రదర్శనను ఆసియా క్రీడల్లో పునరావృతం చేశాడు. తద్వారా 1970 తర్వాత ఆసియా క్రీడల పురుషుల హైజంప్‌లో భారత్‌కు పతకాన్ని అందించిన అథ్లెట్‌గా 31 ఏళ్ల సర్వేశ్ గుర్తింపు పొందాడు. స్వర్ణ పతకం సాధించిన ఫు చావో సువాన్ (చైనీస్ తైపీ), రజతం గెలిచిన సర్వేశ్ 2.25 మీటర్ల ఎత్తుకు ఎగిరారు. తదుపరి 2.28 మీటర్ల మార్క్‌ను దాటేందుకు ప్రయత్నించి ఇద్దరూ నిర్ణీత మూడు ప్రయత్నాల్లోనూ విఫలమయ్యారు. దాంతో నిబంధనల ప్రకారం 2.25 మీటర్ల ఎత్తును తొలి ప్రయత్నంలోనే దాటిన ఫు చావో సువాన్కు స్వర్ణం ఖరారైంది.తొలి ప్రయత్నంలో విఫలమై, రెండో ప్రయత్నంలో 2.25 మీటర్ల ఎత్తును దాటిన సర్వేశ్‌కు రజతం దక్కింది. సాంగ్‌హైక్ వూ (దక్షిణ కొరియా; 2.22 మీటర్లు) కాంస్య పతకం అందుకున్నాడు. 1970 బ్యాంకాక్ ఆసియా క్రీడల హైజంప్‌లో భీమ్ సింగ్ భారత్‌కు కాంస్యం రూపంలో చివరిసారి పతకం గెలుచుకోగా... 56 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ సర్వేశ్ మళ్లీ హైజంప్‌లో భారత్‌కు రజతం రూపంలో పతకాన్ని అందించాడు.హరిత.. అరంగేట్రంలోనే...అంతర్జాతీయస్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తొలి ప్రయత్నంలోనే స్ప్రింటర్ హరిత భద్ర పతకంతో మెరిసింది. మహిళల 200 మీటర్ల ఫైనల్ రేసును హరిత 23.20 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. మహారాష్ట్రకు చెందిన హరిత గత ఏడాది లండన్‌లోని లాఫ్బరా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ స్పోర్ట్స్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి అథ్లెటిక్స్ కెరీర్‌పై పూర్తి దృష్టి కేంద్రీకరించింది. ఈ ఏడాది ఇంటర్‌స్టేట్ చాంపియన్‌షిప్‌లో 23.14 సెకన్లతో స్వర్ణం గెలిచిన హరిత ఆసియా క్రీడలకు అర్హత సాధించింది. అదే జోరును ఆసియా క్రీడల్లోనూ కొనసాగించి తన మెడలో కాంస్య పతకాన్ని వేసుకుంది. ఒకవైపు అథ్లెటిక్స్‌లో కొనసాగుతూ మరోవైపు సొంతంగా నగలను డిజైన్ చేసి ఆన్లైన్లో విక్రయించే హరిత స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్‌ను ఆదర్శంగా తీసుకుంటానని తెలిపింది. తేజస్విన్ శంకర్ కొత్త చరిత్ర ఆసియా క్రీడల డెకాథ్లాన్ ఈవెంట్లో రెండుసార్లు పతకాలు గెలిచిన తొలి భారతీయ డెకాథ్లెట్‌గా తేజస్విన్ శంకర్ రికార్డు నెలకొల్పాడు. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో రజతం నెగ్గిన తేజస్విన్ ఈసారి కాంస్య పతకం అందుకున్నాడు. పది క్రీడాంశాల (100 మీటర్లు, లాంగ్‌జంప్, షాట్‌పుట్, హైజంప్, 400 మీటర్లు, 110 మీటర్ల హర్డిల్స్, డిస్కస్ త్రో, పోల్‌వాల్ట్, జావెలిన్ త్రో, 1500 మీటర్లు) సమాహారమైన డెకాథ్లాన్‌లో తేజస్విన్ 7934 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచాడు. యుమా మారుయామ (జపాన్; 8123 పాయింట్లు) స్వర్ణం, జింగ్హువా చెన్ (చైనా; 8012 పాయింట్లు) రజతం సాధించారు. భారత్‌కే చెందిన తౌఫీక్ నౌషాద్ ఐదు ఈవెంట్స్ తర్వాత వైదొలిగాడు. గతంలో భారత్ తరఫున ఆసియా క్రీడల డెకాథ్లాన్‌లో ఖుర్షీద్ అహ్మద్ (1951; కాంస్యం), రోనీ ఒబ్రెయిన్ (1954; కాంస్యం), గుర్బచన్సింగ్ రణ్‌ధావా (1962; స్వర్ణం), ఎంజీ శెట్టి (1970; రజతం), సురేశ్ బాబు (1974; కాంస్యం) ఒక్కోసారి పతకం గెలిచారు.పారుల్... ఈసారి కాంస్యం... ఆసియా క్రీడల్లో 2010లో ప్రవేశపెట్టిన మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో వరుసగా ఐదోసారి భారత్ ఖాతాలో పతకం చేరింది. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో రజత పతకంతో మెరిసిన పారుల్ చౌధరీ ఈసారి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. పారుల్ 9 నిమిషాల 08.67 సెకన్లతో తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన నమోదు చేసి మూడో స్థానంలో నిలిచింది. 2010 గేమ్స్ 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో సుధా సింగ్ స్వర్ణం, 2014 గేమ్స్‌లో లలిత కాంస్యం... 2018 గేమ్స్‌లో సుధా సింగ్ రజతం గెలిచారు. మరోవైపు మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో భారత అథ్లెట్ నందిని ఆరో స్థానంలో నిలువగా... పురుషుల లాంగ్‌జంప్‌లో శ్రీశంకర్ మురళీ, డేవిడ్ సాల్మన్ ఫైనల్‌కు అర్హత సాధించారు. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో విత్య రామరాజ్, అను రాఘవన్... పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో తమిళ్‌రాసన్ సంతోష్ కుమార్ కూడా ఫైనల్లోకి ప్రవేశించారు. అనాహత్, అభయ్‌లకు రజతాలునగోయా: ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించి లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించాలని ఆశించిన భారత స్క్వాష్ స్టార్స్ అనాహత్ సింగ్, అభయ్ సింగ్‌లకు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్స్‌లో అనాహత్, అభయ్ ఓడిపోయి రజత పతకాలు గెల్చుకున్నారు. మహిళల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ ఐదో ర్యాంకర్ శివసంగరి సుబ్రమణియం (మలేసియా) 11–4, 11–4, 11–7తో అనాహత్ను ఓడించి స్వర్ణం సొంతం చేసుకుంది. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఎన్జీ ఇయాన్ యో (మలేసియా) 11–9, 11–5, 11–5తో అభయ్‌పై గెలిచి పసిడి పతకంతోపాటు లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్నాడు. -
ఆసియా గేమ్స్‌లో ఓటమి.. నిర్వాహకులను ఏకిపారేసిన పీవీ సింధు
ఆసియా గేమ్స్‌లో పతకం సాధిస్తుందనుకున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిరాశపరిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన చెన్ యుఫెయ్ చేతిలో సింధు ఓటమి చవిచూసింది. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం ఆసియా గేమ్స్ నిర్వాహకులపై పీవీ సింధు అసంతృప్తి వ్యక్తం చేసింది. అడ్డదిడ్డంగా మ్యాచ్‌లను నిర్వహించడంపై నిర్వాహకులను ఏకిపారేసింది."24 గంటల వ్యవధిలో మూడు సింగిల్స్ మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. మేము మనుషులమే.. రోబోలు కాదు. సుదీర్ఘమైన మ్యాచ్‌లు జరిగినప్పుడు కచ్చితంగా కోలుకోవడం అవసరం. ఆటలో మంచి స్థితిలో ఉన్నప్పుడు సహజంగానే ముందుకు కదలాలనిపిస్తుంది, కానీ అలసటతో కాళ్లు కదలవు.అసలు మ్యాచ్‌ల షెడ్యూల్ ప్రణాళికను సరిగ్గా నిర్వహించలేదు. దీంతో సరైన విశ్రాంతి లేకుండానే మ్యాచ్‌లు ఆడాల్సి వస్తుందని, దీనివల్ల పూర్తిగా అలసిపోతున్నాం. నా ఓటమికి కారణాలు వెతకను. ఇక్కడ కెమెరాలు లేవు. ఇది నిజంగా దురదృష్టకరం. కొన్ని 2-3 షాట్లు లైన్ పై ఉన్నాయని నాకు అనిపించింది. ఏషియన్ గేమ్స్ క్వార్టర్ ఫైనల్లో కెమెరా ఉండాలి" అని సింధు ఆవేదన వ్యక్తం చేసింది.కాగా పీవీ సింధులాగే మరో భారత షట్లర్ ఉన్నతి హుడా కూడా మ్యాచ్‌ల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక పీవీ సింధు శనివారం రెండు సింగిల్స్ మ్యాచ్‌లు ఆడింది. ఆ తర్వాత ఆదివారం మరో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. కనీస విశ్రాంతి లేకుండానే బరిలోకి దిగడం వల్ల సింధు కోర్టులో అలసటగా కనిపించడం గమనార్హం.ఆదివారం ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో మూడు పతకాలు వచ్చి చేరాయి. స్వ్కాష్‌లో అనాహత్, అభయ్‌లు రజతం నెగ్గగా, మహిళల 200 మీటర్ల రేసులో హరిత కాంస్యం దక్కించుకుంది. ఇప్పటివరకు భారత్ ఖాతాలో 33 పతకాలు చేరగా, ఇందులో 4 స్వర్ణాలు, 14 రజతాలు, 15 కాంస్యాలున్నాయి.ఇదీ చదవండి: ఏడాది తర్వాత బరిలోకి.. కుమ్ముతాడనుకుంటే ఇలా బుక్కయ్యాడు! -
రజతంతో సరిపెట్టుకున్న భారత స్క్వాష్ స్టార్
రజతంతో సరిపెట్టుకున్న భారత స్క్వాష్ స్టార్భారత స్క్వాష్ స్టార్ అభయ్ సింగ్ రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో యోవ్ చేతిలో ఓటమి పాలై స్వర్ణ పతకాన్ని చేజార్చుకున్నాడు.తొలి రెండు గేమ్‌లను కోల్పోయి 0-2తో వెనుకబడిన అభయ్.. మూడో గేమ్‌లో అద్భుతంగా పుంజుకున్నాడు. వరుస పాయింట్లు సాధిస్తూ 4-2 ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే యోవ్ తన అనుభవాన్ని ఉపయోగించి తిరిగి పుంజుకుని స్కోరును 4-4తో సమం చేశాడు.ఆ తర్వాత ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. స్కోరు 5-5తో సమమైన సమయంలో యోవ్ కీలక పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి వచ్చాడు. అక్కడి నుంచి దూకుడుగా ఆడి గేమ్‌ను 11-5తో ముగించాడు. దీంతో యోవ్ స్వర్ణ పతకం సాధించగా, అభయ్ సింగ్ రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది.నిరాశపరిచిన సింధు.. క్వార్టర్ఫైనల్లోనే నిష్క్రమణభారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఏషియన్ గేమ్స్‌లో నిరాశ ఎదురైంది. మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో చైనాకు చెందిన చెన్ యూఫీ చేతిలో మూడు గేమ్‌ల పోరులో ఓటమి పాలైంది.తొలి గేమ్‌లో సింధు అద్భుతంగా ఆడి 21-11తో విజయం సాధించింది. అయితే ఆ తర్వాత చెన్ యూఫీ పుంజుకుంది. రెండో గేమ్‌ను 21-18తో, నిర్ణయాత్మక మూడో గేమ్‌ను 21-10తో గెలుచుకుంది. సింధు ఓటమితో భారత్‌కు ఈ విభాగంలో పతకం దక్కే అవకాశం చేజారింది.ఆర్చరీలో భారత్ వరల్డ్ రికార్డు సమం.. పతకాల వేటలో మను బాకర్ఏషియన్ గేమ్స్ 2026లో భారత్ ఇవాళ (ఎనిమిదో రోజు) మరిన్ని పతకాలపై కన్నేసింది. స్క్వాష్‌లో అబయ్ సింగ్, అనాహత్ సింగ్ తమ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లు ఆడనున్నారు. ఇప్పటికే వీరిద్దరూ రజత పతకాలు ఖాయం చేసుకున్నారు. ఫైనల్లో విజయం సాధిస్తే ఆ పతకాలు స్వర్ణంగా మారనున్నాయి.డెకాథ్లాన్‌లో తేజస్విన్ శంకర్ చివరి ఐదు ఈవెంట్లలో పోటీ పడనున్నాడు. అథ్లెటిక్స్‌లోనూ భారత్ పతకాలపై ఆశలు పెట్టుకుంది.10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో నిరాశపరిచిన తర్వాత, మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో పతకాలు సాధించాలని మను బాకర్, ఈషా సింగ్ ఆసక్తిగా ఉన్నారు.ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు సెమీఫైనల్‌కు చేరాయి. మహిళల జట్టు ప్రపంచ రికార్డును సమం చేయడం విశేషం. పురుషుల జట్టు రౌండ్ ఆఫ్ 16లో యూఏఈని, క్వార్టర్ఫైనల్లో భూటాన్‌ను ఓడించి సెమీస్‌కు చేరింది. మహిళల జట్టు రౌండ్ ఆఫ్ 16లో మంగోలియాను, క్వార్టర్ఫైనల్లో కజకిస్థాన్‌ను ఓడించింది.మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్ క్వార్టర్ఫైనల్లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ ఓటమి పాలైంది.ఇదీ చదవండి: వైభవ్ రూపంలో వారికి ప్రమాదం పొంచి ఉంది..! -
భారత్ పసిడి 'కూత'
భారత కబడ్డీ జట్లు నిరాశపర్చలేదు...ఆసియా క్రీడల్లో తమ స్థాయిని మళ్లీ చూపిస్తూ పురుషుల, మహిళల కబడ్డీ టీమ్‌లు తమ స్వర్ణాలను నిలబెట్టుకున్నాయి. అథ్లెటిక్స్‌లో కూడా భారత్ మూడు పతకాలతో మెరిసింది. మారథాన్ సావన్ అనూహ్యంగా రజతాన్ని అందించగా, షాట్‌పుటర్ తజీందర్ కూడా సిల్వర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరో వైపు ప్రాచి కూడా ఏషియాడ్‌లో వరుసగా రెండో పతకాన్ని అందుకోగా...సీనియర్ స్క్వాష్ స్టార్ జోష్న తన భాగస్వామి సెంథిల్‌తో కలిసి కంచు మోత మోగించింది. ఓవరాల్‌గా ఏడో రోజు 7 పతకాలతో భారత బృందం మురిపించగా... బ్యాడ్మింటన్, బాక్సింగ్‌లలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి.హోరాహోరీ పోరులో... మహిళల కబడ్డీలో భారత జట్టు తమ స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్ 37–34 పాయింట్ల తేడాతో ఇరాన్‌పై విజయం సాధించింది. ఈ క్రీడల్లో ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్‌లలో ఏకపక్ష విజయాలు సాధించిన భారత్‌కు తుది పోరులో మాత్రం పోటీ ఎదురైంది. తొలి అర్ధ భాగం ముగిసేసరికి భారత్ 22–16తో ఆధిక్యంలో నిలిచింది. వీటిలో 16 రెయిడ్ పాయింట్లు సాధించిన జట్టు 3 బోనస్ పాయింట్లు, ఒక ఆలౌట్‌ను స్కోర్ చేసింది. అయితే రెండో అర్ధ భాగంలో కోలుకొని వరుసగా పాయింట్లు సాధించిన ఇరాన్ గట్టి పోటీనిస్తూ స్కోరును దాదాపు సమంగా 26–27 వద్దకు తీసుకొచ్చింది. అయితే ఈ దశలో ఒత్తిడిని అధిగమిస్తూ సంజు దేవి సూపర్ రైడ్‌తో మన జట్టు మళ్లీ ముందంజ వేసింది. ఆ తర్వాత కెప్టెన్ పుష్ప రాణా ప్రత్యర్థిని ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించడంతో జట్టుకు పట్టు చిక్కింది. ఈ దశలో ఇరాన్ సూపర్ టాకిల్‌తో కొంత పోరాడినా... చివరకు భారత మహిళలదే పైచేయి అయింది. 2010 ఆసియా క్రీడల్లో మహిళల కబడ్డీని మొదటి సారి ప్రవేశపెట్టిన తర్వాత భారత్‌కు ఇది నాలుగో స్వర్ణం కావడం విశేషం. 2010, 2014, 2022, 2026లలో భారత్ పసిడి గెలవగా, 2018లో మాత్రం ఇరాన్‌కు బంగారు పతకం దక్కింది.పురుషులకు తొమ్మిదో స్వర్ణం... కబడ్డీలో భారత పురుషుల జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆసియా క్రీడల చరిత్రలో ఏకంగా 9వ స్వర్ణాన్ని తమ ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో భారత్ 40–34 పాయింట్ల తేడాతో ఇరాన్‌ను ఓడించింది. జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన పవన్ సెహ్రావత్ లేకుండానే తుది పోరులో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలో తడబడింది. అయితే అర్జున్ దేశ్వాల్, దేవాంక్ వరుస పాయింట్లు రాబట్టడంతో కోలుకుంది. అర్ధభాగం ముగిసే సరికి భారత్ 17–18తో వెనుకబడింది. అయితే రెండో అర్ధభాగంలో జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చింది. కీలక దశలో ప్రత్యర్థిని ఆలౌట్ చేయడంతో ఆధిక్యం 29–24కు పెరిగింది. సమయం దగ్గరవుతుండటంతో భారత్ దూకుడు తగ్గించి జాగ్రత్తపడింది. ఈ దశలో ఇరాన్ ఎంత ప్రయత్నించినా పాయింట్లు రాబట్టడంలో విఫలమైంది. 1990 ఆసియా క్రీడల్లో పురుషుల కబడ్డీని ప్రవేశపెట్టిన తర్వాత వరుసగా 7 స్వర్ణాలు గెలుచుకున్న భారత్ 2018 క్రీడల్లో కాంస్యానికి పరిమితమైంది. అయితే 2022లో మళ్లీ పసిడిని అందుకున్న మన బృందం ఈ సారి దానిని నిలబెట్టుకుంది.తజీందర్ వెండి వెలుగులు... ఆసియా క్రీడల్లో వరుసగా మూడో స్వర్ణం సాధించే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత అథ్లెŠట్ తజీందర్‌పాల్ సింగ్ తూర్ కల నెరవేరలేదు. శనివారం జరిగిన పురుషుల షాట్‌పుట్ ఈవెంట్లో తజీందర్ రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. గుండును అతను 20.64 మీటర్ల దూరం విసిరాడు. ఇరాన్ అథ్లెట్ మొహమ్మద్ రెజా (20.81 మీటర్లు) స్వర్ణం గెలుచుకోగా, మొహమ్మద్ తొలు (సౌదీ అరేబియా–20.48 మీటర్లు) కాంస్యం అందుకున్నాడు. పంజాబ్‌కు చెందిన తూర్ 2018, 2022 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించాడు. ప్రాచి చౌదరికి కాంస్యం గత ఆసియా క్రీడల్లో మహిళల 4్ఠ400 మీటర్ల రిలేలో రజతం సాధించిన భారత అథ్లెట్ ప్రాచి చౌదరి ఈ సారి వ్యక్తిగత విభాగంలో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళల 400 మీటర్ల పరుగులో ప్రాచి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 53.21 సెకన్లలో పరుగు పూర్తి చేసిన ఉత్తరప్రదేశ్ అథ్లెట్ ప్రాచి మూడో స్థానంలో నిలిచింది. ఈ ఈవెంట్లో సల్వా నాసర్ (బహ్రెయిన్–49.29 సెకన్లు) స్వర్ణం సాధించగా, జెహ్రీ జరీ (ఇరాన్–52.38 సెకన్లు) రజత పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ పోటీల బరిలోకి నిలిచిన మరో భారత అథ్లెట్ కిరణ్ పహల్ ఐదో స్థానంతో ముగించింది. సిల్వర్ సావన్పురుషుల మారథాన్ రేస్‌లో భారత్‌కు 44 ఏళ్ల తర్వాత పతకం లభించింది. అద్భుత ప్రదర్శనతో సత్తా చాటిన సావన్ బర్వాల్ రజత పతకం గెలుచుకున్నాడు. 42.195 కిలోమీటర్ల దూరాన్ని సావన్ 2 గంటల 11 నిమిషాల 37 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. జపాన్‌కు చెందిన ఇచిటకా యమషిత (2 గంటల 10 నిమిషాల 49 సెకన్లు) స్వర్ణం గెలుచుకోగా, ప్యూ ఫెంగ్ (చైనా – 2 గంటల 12 నిమిషాల 13 సెకన్లు)కు కాంస్యం దక్కింది. 1982 ఆసియా క్రీడల్లో హోసూర్ కుక్కప్ప సీతారన్ కాంస్యం గెలిచిన తర్వాత మారథాన్‌కు మళ్లీ ఇప్పుడే పతకం దక్కడం విశేషం. అంతకు ముందు 1951 ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు ఛోటా సింగ్, సూరత్ సింగ్ మారథాన్‌లో స్వర్ణ, కాంస్యాలు నెగ్గారు. పతకాన్ని గెలిచే క్రమంలో సావన్ కొత్త జాతీయ రికార్డును కూడా నెలకొల్పాడు. గత ఏప్రిల్‌లోనే తానే నెలకొల్పిన 2 గంటల 11 నిమిషాల 58 సెకన్ల టైమింగ్‌ను అతను బద్దలు కొట్టాడు. ఈ రేస్‌లో పాల్గొన్న మరో భారత అథ్లెట్ కార్తీక్ కర్కేరా 17వ స్థానంతో ముగించాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లా జోగీందర్ నగర్ సావన్ స్వస్థలం. అతని తండ్రి కుల్దీప్ ఢిల్లీలో డ్రైవర్‌గా పని చేశాడు. స్కూల్ గ్రౌండ్లో పరుగెడుతూ ఆసక్తి పెంచుతున్న సావన్ 14 ఏళ్ల వయసులోనే 1500 మీటర్ల పరుగులో శిక్షణ పొందాడు. 2015లో అండర్–18 కేటగిరీలో తొలిసారి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న అతను మరో మూడేళ్ల తర్వాత ఫెడరేషన్ కప్‌లో 5000 మీటర్ల పరుగుతో తన సీనియర్ ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు. లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సావన్... 2023లో దుబాయ్‌లో జరిగిన ఆసియా హాఫ్ మారథాన్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచి అందరి దృష్టినీ ఆకర్షించాడు. గత ఏడాది జాతీయ క్రీడల్లో 5,000 మీటర్లు, 10,000 మీటర్లలో స్వర్ణం సాధించిన సావన్ స్పోర్ట్స్ కోటాలో ఆర్మీలో ఉద్యోగం దక్కించుకున్నాడు. ప్రస్తుతం అమెరికాలోని కొలరాడో స్ప్రింగ్స్‌లో అతను శిక్షణ పొందుతున్నాడు.షూటింగ్లో మరో రజతం భారత్‌కు షూటింగ్ మరో పతకాన్ని అందించింది. మహిళల 50 మీటర్ల 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్లో మన జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది. తిలోత్తమ సేన్, విదర్స వినోద్, ఆషి చోక్సీలతో కూడిన భారత జట్టు మొత్తం 1763 పాయింట్ల స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. ఈ పోరులో చైనా (1773 పాయింట్లు) స్వర్ణం సాధించగా, కజకిస్తాన్ (1754 పాయింట్లు) కాంస్యం సొంతం చేసుకుంది. ఇదే ఈవెంట్ వ్యక్తిగత విభాగంలోనూ మెరుగైన ప్రదర్శనే కనబర్చినా... భారత షూటర్లకు అదృష్టం కలిసి రాలేదు. తిలోత్తమ నాలుగో స్థానంతో విదర్స ఐదో స్థానంతో ముగించారు. ఈ ఆసియా క్రీడల మహిళల 10 మీ. ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో రజతం సాధించిన విదర్సకు ఇది రెండో పతకం కాగా... ఆషి 2022 ఆసియా క్రీడల్లో ఒక రజతం, ఒక కాంస్యం నెగ్గింది.స్క్వాష్‌లో కాంస్య పతకంస్క్వాష్ మిక్స్డ్ డబుల్స్‌లో భారత్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. భారత జోడి జోష్నా చిన్నప్ప–వెలవన్ సెంథిల్ కుమార్ శనివారం జరిగిన సెమీఫైనల్లో పరాజయంపాలైంది. హాంకాంగ్‌కు చెందిన టాంగ్ మింగ్ హాంగ్–లీ కా యి చేతిలో భారత ద్వయం 1–2 (10–11, 11–2, 10–11) స్కోరుతో ఓటమిని ఎదుర్కొంది. అయితే ఈ పోరు స్వల్ప వివాదంతో ముగిసింది. చెరో గేమ్ గెలిచిన తర్వాత మూడో గేమ్ కూడా హోరాహోరీగా సాగింది. 10–10తో స్కోరు సమంగా ఉన్న సమయంలో భారత్ పాయింట్ సాధించి సంబరాలు చేసుకుంది. అయితే భారత ద్వయం అరుస్తూ ప్రత్యర్థి ఏకాగ్రతను దెబ్బ తీశారంటూ రిఫరీ ఈ పాయింట్‌ను అనుమతించకుండా మళ్లీ ఆడించారు. ఈ సారి హాంకాంగ్‌ది పైచేయి కావడం జోష్నా–సెంథిల్ జోడి నిరాశగా వెనుదిరిగింది. నిజానికి 10–7తో ఆధిక్యంలో నిలిచిన భారత్ 3 మ్యాచ్ పాయింట్లు చేజార్చుకుంది. ఆసియా క్రీడల చరిత్రలో జోష్నాకు ఇది 6వ పతకం కావడం విశేషం. వరుసగా 2010, 2014, 2018, 2022, 2026లలో కలిపి ఆమె 2 రజతాలు, 4 కాంస్యాలు నెగ్గింది. సెంథిల్‌కు ఆసియా క్రీడల్లో ఇదే తొలి పతకం. -
అనాహత్ అదరహో
భారత టాప్ స్క్వాష్ ప్లేయర్ అనాహత్ సింగ్ సెమీఫైనల్ మ్యాచ్... సటోమీ వతనబె (జపాన్)తో జరుగుతున్న పోరులో తొలి రెండు గేమ్‌లు చేజారిపోయాయి. మూడో గేమ్‌లో కూడా 8–10తో ఓటమికి చేరువగా నిలిచింది. ఈ దశలో ఒక్కసారిగా చెలరేగి వరుసగా నాలుగు పాయింట్లు సాధించిన అనాహత్ ఆపై మరింత మెరుగైన ప్రదర్శనతో మ్యాచ్‌ను సొంతం చేసుకొని ఫైనల్లోకి అడుగు పెట్టింది.చివరకు 3–2 (9–11, 11–13, 12–10, 11–6, 11–3)తో అనాహత్ విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలో భారత ఆటగాడు అభయ్ సింగ్ కూడా ఫైనల్‌కు చేరాడు. సెమీస్‌లో అభయ్ 3–0 (11–3, 12–10, 11–6)తో పాకిస్తాన్‌కు చెందిన ముహమ్మద్ ఇర్ఫాన్‌ను ఓడించాడు. స్క్వాష్ పురుషుల, మహిళల విభాగాల్లో విజేతలు 2028 ఒలింపిక్స్‌కు నేరుగా క్వాలిఫై అవుతారు. లక్ష్యసేన్ నిష్క్రమణ... బ్యాడ్మింటన్ మహిళల విభాగంలో పీవీ సింధు, ఉన్నతి హుడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్స్‌లో సింధు 21–9, 21–13తో టొమొకా మియకాజి (జపాన్)ను ఓడించగా, ఉన్నతి హుడా కూడా ప్రిక్వార్టర్స్‌లో 21–19, 21–13తో వరల్డ్ నంబర్ 6 పుత్రి కుసుమ (ఇండోనేసియా)పై సంచలన విజయం సాధించింది. మహిళల డబుల్స్‌లో కూడా భారత జంట పుల్లెల గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ 24–22, 21–18తో వరల్డ్ నంబర్ 3 మయు మట్సుమొటొ–యుకీ ఫుకుషిమాపై గెలుపొంది క్వార్టర్స్ చేరింది. అయితే పురుషుల విభాగంలో ఇద్దరు భారత ఆటగాళ్లు లక్ష్య సేన్, ఆయుశ్ శెట్టి కూడా పరాజయంతో నిష్క్రమించారు. లక్ష్యసేన్ 12–21, 21–15, 14–21తో లో కీన్ యు (సింగపూర్) చేతిలో, ఆయుశ్ 16–21, 21–19, 17–21తో చో టిన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయంపాలయ్యారు. -
11 ఏళ్ల పసివాడికి పసిడి
ఆసియా క్రీడల్లో జపాన్‌కు చెందిన 11 ఏళ్ల యుకీ కురిహారా సంచలనం ఆసియా క్రీడల్లో జపాన్‌కు చెందిన 11 ఏళ్ల యుకీ కురిహారా సంచలనం సృష్టించాడు. ఈ ఈవెంట్లో పాల్గొంటున్న అతి పిన్న వయస్కుడైన అతను ఇ స్పోర్ట్స్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. ఇ స్పోర్ట్స్‌లో భాగంగా ఉన్న ‘పుయో పుయో చాంపియన్స్’ ఈవెంట్లో అతను ఈ పసిడిని సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో కురిహారా 10–2తో తనరక్ వాంగ్ (థాయిలాండ్)ను ఓడించాడు. పుయో పుయో చాంపియన్స్ ఒక రకమైన పజిల్ వీడియో గేమ్. ప్లే స్టేషన్ 4పై దీనిని ఆడవచ్చు. ప్రాధమిక పాఠశాలలో చదువుతున్న కురిహారా ఫైనల్లో ఓడించిన ప్రత్యర్థి వయసు 28 ఏళ్లు. దాంతో ఈ గెలుపు తర్వాత అతను కనీసం నవ్వలేదు కూడా! తన విజయాన్ని కూడా ఆస్వాదించలేకపోతున్నానని, దాదాపు మూడు రెట్లు ఎక్కువ వయసు ఉన్న వ్యక్తిపై గెలవడం తనకూ బాగా ఇబ్బందికరంగా ఉందని కురిహారా వ్యాఖ్యానించాడు. అయితే పతకం, దాంతో పాటు జ్ఞాపికగా ఇచ్చిన బొమ్మ చాలా బాగున్నాయని అతను సంతోషం ప్రకటించాడు. ‘పుయో పుయో’లో ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రొఫెషనల్ లైసెన్స్ అందుకున్న కురిహారా అప్పటినుంచే తనకంటే వయసులో ఎంతో పెద్దవాళ్లయిన ప్రత్యర్థులను వరుసగా ఓడిస్తూ వస్తున్నాడు. చదువును, ఆటలను సమన్వయం చేసుకోవడం చాలా కష్టంగా ఉందని ఈ జపాన్ అబ్బాయి చెప్పాడు. -
ఆసియా క్రీడల్లో పతకం.. తరుణ్ మానేపల్లికి సన్మానం
హైదరాబాద్, సెప్టెంబర్ 26: ఆసియా క్రీడలు–2026లో పురుషుల బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకం సాధించి తెలంగాణతో పాటు దేశానికి గర్వకారణంగా నిలిచిన యువ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు తరుణ్ మానేపల్లిని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (SATG) వైస్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎ. సోనీబాలా దేవి, ఐఎఫ్ఎస్ శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ సోనీబాలా దేవి మాట్లాడుతూ, ఆసియా క్రీడల్లో పతకం సాధించడం తరుణ్ మానేపల్లి కృషి, అంకితభావం, పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. సరూర్‌నగర్ స్టేడియంలో తన క్రీడా ప్రస్థానాన్ని ప్రారంభించిన తరుణ్, నేడు ఆసియా క్రీడల పతక విజేతగా ఎదిగి తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం గర్వకారణమని అన్నారు. తెలంగాణ యువ క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై సాధిస్తున్న విజయాలు రాష్ట్రంలో ఉన్న అపారమైన క్రీడా ప్రతిభకు నిదర్శనమని ఆమె తెలిపారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో మరింత రాణించేలా ప్రపంచ స్థాయి శిక్షణ, ఆధునిక క్రీడా మౌలిక వసతులు, అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలను అందించేందుకు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ నిరంతరం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తరుణ్ మానేపల్లికి తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇప్పటివరకు భారత్ ఖాతాలో 30 పతకాలు చేరగా, ఇందులో 4 స్వర్ణాలు, 12 రజతాలు, 14 కాంస్యాలున్నాయి. ఇదీ చదవండి: 'కోహ్లితో నాకేంటి?.. నా ఆటయితే పూర్తి కాలేదు' -
గమ్మత్తుగా ఒమన్ క్రికెట్ టీం.. తొమ్మిది మందికి ఒకే ఇంటిపేరు
ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న ఒమన్ క్రికెట్ జట్టు సరికొత్త ఫీట్ నమోదు చేసింది. ఆట పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ, జట్టు కూర్పు పరంగా మాత్రం ఒక గమ్మత్తైన విషయం బయటికి వచ్చింది. ఒమన్ జట్టులో తొమ్మిది మంది ఆటగాళ్లకు ఒకే ఇంటిపేరు ఉండడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఒమన్ తుది జట్టులోని పదకొండు మందిలో ఒకే ఇంటిపేరున్న ఏడుగురు ఆటగాళ్లు మ్యాచ్‌లో ఆడడం మరో విశేషం.శుక్రవారం హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్ కోసం.. సుఫ్యాన్ మహమూద్ కెప్టెన్‌గా వ్యవహరించిన జట్టులో మహమ్మద్ అల్ బలూషి, షుఐబ్ అల్ బలూషి, జుబైర్ అల్ బలూషి, వహీద్ అల్ బలూషి, ఈసా అల్ బలూషి, నవీద్ అల్ బలూషి, ఫారిస్ అల్ బలూషి మ్యాచ్ ఆడారు. వీరితో పాటు బెంచ్‌పై ఉన్న వసీం, ఖైస్ల ఇంటిపేరు కూడా అల్ బలూషినే కావడం గమనార్హం.ఒమన్ జట్టు తరఫున అల్ బలూషి పేరున్న నలుగురు ఓపెనింగ్ నుంచి నాలుగో స్థానం వరకు బ్యాటింగ్‌కు రావడం విశేషం. మహమ్మద్ అల్ బలూషి, ఐబ్ అల్ బలూషి ఓపెనర్లుగా రాగా.. జుబైద్ అల్ బలూషి, వహీద్ అల్ బలూషి మూడు, నాలుగు స్థానాల్లో వచ్చారు. క్రికెట్ చరిత్రలో ఇలా ఒకే ఇంటిపేరున్న నలుగురు ఆటగాళ్లు వరుసగా తొలి నాలుగు స్థానాల్లో బ్యాటింగ్‌కు రావడం ఇదే మొదటిసారి.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ముహమ్మద్ హఫీజ్ (33), బాబర్ హయత్ (23) రాణించారు. ఒమన్ బౌలర్లలో మొహమ్మద్ అల్ బలూషి 3 వికెట్లు తీశాడు. అనంతరం ఒమన్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 80 పరుగులకే పరిమితమైంది. సుఫ్యాన్ మెహ్మూద్ (26) టాప్ స్కోరర్. ఆయుశ్ శుక్లా మూడు వికెట్లతో రాణించాడు.ఇదీ చదవండి: కలిసొచ్చిన శనివారం.. 30 పతకాల మార్క్ దాటిన భారత్ -
కలిసొచ్చిన శనివారం.. 30 పతకాల మార్క్ దాటిన భారత్
జపాన్‌లోని నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 30 పతకాల మార్క్‌ను టచ్ చేసింది. గత ఆసియా క్రీడల్లో సెంచరీ మార్క్‌ను దాటిన భారత్ ఈసారి అన్ని పతకాలు సాధించడం కష్టమే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అథ్లెటిక్స్‌లో భారీగా పతకాలు వస్తాయనే ఆశలను మన అథ్లెట్లు నెరవేరుస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు భారత్ ఖాతాలో 30 పతకాలు చేరగా, ఇందులో 4 స్వర్ణాలు, 12 రజతాలు, 14 కాంస్యాలున్నాయి. శనివారం కబడ్డీలో రెండు స్వర్ణాలు రాగా, అథ్లెటిక్స్ విభాగం నుంచి మూడు పతకాలు వచ్చి చేరాయి. కాగా స్వ్కాష్‌లో మహిళల విభాగంలో అనాహత్, పురుషుల విభాగంలో అభయ్ సింగ్‌లు ఫైనల్లో అడుగుపెట్టి పతకాలు ఖాయం చేశారు. ఇక హాకీలో భారత పురుషుల జట్టు శనివారం ఆతిథ్య జపాన్ను ఓడించి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది.షాట్‌పుట్‌లో రజతంమహిళల షాట్‌పుట్‌లో మన్‌ప్రీత్ కౌర్ కాంస్యం నెగ్గగా.. తాజాగా పురుషుల షాట్‌పుట్ ఈవెంట్లో భారత అథ్లెట్ తజిందర్‌పాల్ సింగ్ తూర్ రజతం గెలుచుకున్నాడు. ఇవాళ జరిగిన పురుషుల షాట్‌పుట్ ఫైనల్లో తజిందర్ తన ఐదో ప్రయత్నంలో షాట్‌పుట్‌ను 20.64 మీటర్ల దూరం విసిరి బెస్ట్ ప్రదర్శన నమోదు చేయడంతో పాటు రజతం ఖాయం చేసుకున్నాడు. ఇరాన్‌కు చెందిన మొహమ్మద్రెజా తయబైస్ 20.81 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం సాధించాడు.ప్రాచీకి కాంస్యంమహిళల 400 మీటర్ల ఫైనల్లో భారత అథ్లెట్ ప్రాచీ చౌదరీ కాంస్యం ఒడిసిపట్టింది. నగోయా వేదికగా జరిగిన ఫైనల్ రేసులో ప్రాచీ 53.21 సెకన్లలో గమ్యాన్ని చేరింది. బహ్రెయిన్‌కు చెందిన సాల్వా నాసర్ 49.20 సెకన్లలో గమ్యాన్ని చేరి స్వర్ణం గెలుచుకోగా, ఇరాన్‌కు చెందిన జహ్రా జరేయి 52.38సెకన్లలో గమ్యాన్ని చేరి రజతం సాధించింది. మరో భారత అథ్లెట్ కిరణ్ పహాల్ 53.41 సెకన్లలో గమ్యాన్ని చేరి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.Heartiest congratulations to Prachi Choudhary on winning the Bronze Medal in the Women’s 400m at the Asian Games 2026.#Cheer4Bharat pic.twitter.com/wXXhElJ2ux— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 26, 2026REDEMPTION FOR TOOR!Tajinderpal Singh Toor fights back to win Asian Games SILVER with a best throw of 20.64m.Down in third after Round 4, he delivered when it mattered most — 20.64m in Round 5 to climb onto the podium.Just 17cm off GOLD.And now: THREE STRAIGHT ASIAN GAMES…— nnis Sports|Asian GamesAthletics (@nnis_sports) September 26, 2026ఇదీ చదవండి: విండీస్‌తో తొలి వన్డే.. రోహిత్‌ను ఊరిస్తున్న ప్రపంచ రికార్డు -
ఇరాన్‌ను చిత్తు చేసిన భారత్.. ఆసియా గేమ్స్‌లో నాలుగో స్వర్ణం
ఆసియా గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. ఇప్పటికే మహిళల కబడ్డీ జట్టు స్వర్ణంతో మెరవగా, తాజాగా డిఫెండింగ్ చాంపియన్ భారత పురుషుల కబడ్డీ జట్టు కూడా పసిడి పతకం గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో భారత్ 40-34 తేడాతో ఇరాన్‌ను చిత్తు చేసి స్వర్ణం ఒడిసిపట్టింది. తొలి హాఫ్‌లో భారత్‌కు ఇరాన్ గట్టి పోటీనిచ్చింది. ఒక దశలో 18-17తో సమానంగా నిలిచాయి. అయితే రెండో సగంలో భారత రైడర్లు విజృంభించి వరుస టాకిల్ పాయింట్లతో భారత్ ఆధిక్యాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోయారు. ఆట చివరి నిమిషాల్లో కాస్త హైడ్రామా నెలకొంది. చివర్లో ఇరాన్ మరో 5 పాయింట్లు సాధించి ఆధిక్యాన్ని తగ్గించగలిగిందే కానీ భారత్ చేతిలో ఓటమి తప్పించుకోలేకపోయింది. పురుషుల కబడ్డీలో ఆసియా గేమ్స్‌లో భారత్ చాంపియన్స్‌గా నిలవడం ఇది వరుసగా తొమ్మిదో సారి కావడం విశేషం. 1990 నుంచి వరుసగా 9 సార్లు భారత పురుషుల కబడ్డీ జట్టు స్వర్ణ పతకాలు గెలుస్తూ వస్తోంది. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు ఇది నాలుగో స్వర్ణం కాగా, ఇప్పటివరకు 4 స్వర్ణాలు, 11 రజతాలు, 13 కాంస్యాలు కలిపి మొత్తం 28 పతకాలు సాధించింది. పతకాల పట్టికలో భారత్ ప్రస్తుతం పదో స్థానంలో కొనసాగుతోంది. అంతకముందు మహిళల కబడ్డీ జట్టు కూడా స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత్ 37-34 తేడాతో ఇరాన్‌ను చిత్తు చేసింది.INDIA BEATS IRAN TWICE IN KABADDI FINALS AT ASIAN GAMES 2026! 🤩🔥- Indian Men’s Team win the Gold 🥇- Indian Women’s Team win the Gold 🥇BOTH TEAM SUCCESSFULLY DEFENDS TITLE! pic.twitter.com/l2O4aO4rqb— The Khel India (@TheKhelIndia) September 26, 2026 INDIAN MEN KABADDI AT ASIAN GAMES!1990 🥇1994 🥇1998 🥇2002🥇2006🥇2010 🥇2014 🥇2018 🥉2022 🥇2026 🥇INDIA ARE NOW 9 TIMES CHAMPIONS! 🏆 pic.twitter.com/zBFc99cMUl— The Khel India (@TheKhelIndia) September 26, 2026 India are Asian Games Kabaddi champions! 🇮🇳Indian men's Kabaddi team beats Iran 40-34 in a thriller to win record-extending ninth gold medal at Asian Games.2nd Gold of the day after Indian Women team hit the Golden glory 🫡🙌 pic.twitter.com/undO5ttwsJ— Megh Updates 🚨™ (@MeghUpdates) September 26, 2026ఇదీ చదవండి: కబడ్డీ బాటలోనే హాకీ జట్లు.. డబుల్ స్వర్ణాలపై గురి! -
Asian Games 2026: బుల్లెట్ ట్రైన్లో టీమిండియా ప్రయాణం
ఆసియా గేమ్స్‌లో పాల్గొనేందుకు టీమిండియా గతవారమే జపాన్‌లో అడుగుపెట్టింది. అయితే జపాన్‌తో చారిత్రక మ్యాచ్ అనంతరం రాజధాని టోక్యోలో గడిపిన టీమిండియా బృందం శనివారం ఆసియా గేమ్స్ జరుగుతున్న నగోయాకు చేరుకుంది. ఈ నేపథ్యంలో టోక్యో నుంచి నగోయాకు టీమిండియా బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన ఎక్స్‌లో పంచుకుంది. స్వదేశంలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కారణంగా హెడ్‌కోచ్ గంభీర్ భారత్‌లోనే ఉండిపోవడంతో, శ్రేయస్ అయ్యర్ టీంకు మెంటార్ కమ్ కోచ్‌గా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. అనంతరం శ్రేయస్ నేతృత్వంలోని జట్టు గ్రూప్ ఫొటోకు ఫోజిచ్చింది. PC: BCCI Twitterభారత్‌కు సీడింగ్, ఐసీసీ ర్యాంకింగ్ ఆధారంగా ఆసియా గేమ్స్‌లో నేరుగా క్వార్టర్‌ఫైనల్ బెర్త్ లభించిన విషయం తెలిసిందే. సోమవారం జరిగే రెండో క్వార్టర్ ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. 2023 ఆసియా గేమ్స్‌లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని టీమిండియా స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే.PC: BCCI Twitterకాగా ఈసారి క్రీడలకు మాత్రం డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఫుల్ మెంబర్స్ జట్టుతో బరిలోకి దిగింది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టులో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ తదితర స్టార్లు ఉన్నారు.All set for the #AsianGames 2026 challenge 🇮🇳Drop a 💙 if you are ready to cheer for #TeamIndia 👇@WeAreTeamIndia | @Media_SAI pic.twitter.com/qypPk87QQM— BCCI (@BCCI) September 26, 2026ఇదీ చదవండి: టీమిండియా తరఫున అదే చివరిది: విరాట్ కోహ్లి -
మహిళా కబడ్డీ జట్టుకు వైఎస్ జగన్ అభినందనలు
ఏషియన్ గేమ్స్ 2026లో స్వర్ణ పతకం గెలిచిన మహిళల కబడ్డీ జట్టుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఫైనల్లో ఇరాన్‌పై ఉత్కంఠభరిత విజయంతో స్వర్ణం గెలిచి దేశం గర్వించేలా చేశారని ప్రశంసించారు. Heartiest congratulations to India’s women’s kabaddi team on winning gold at the #AsianGames2026! Your thrilling victory over Iran has made the entire nation proud. From Sanju Devi’s outstanding contribution to the team’s composure in the closing minutes, every player showed… pic.twitter.com/9uRPo94w0h— YS Jagan Mohan Reddy (@ysjagan) September 26, 2026సంజు దేవి అద్భుత ప్రదర్శనతో పాటు చివరి నిమిషాల్లో జట్టు ప్రదర్శించిన సమయస్ఫూర్తి ఆకట్టుకుందని కొనియాడారు. దేశంలోని మరింత మంది యువతులు క్రీడల వైపు అడుగులు వేయడానికి ఈ విజయం స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు.కాగా, హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత్ ఇరాన్‌ను 37-34తో ఓడించి, వరుసగా రెండో ఆసియా క్రీడల్లో ఛాంపియన్‌గా నిలిచింది. ఓవరాల్‌గా ఆసియా క్రీడల మహిళల కబడ్డీలో భారత్‌కు ఇది నాలుగో స్వర్ణం.మరోవైపు ఇవాళే పురుషుల కబడ్డీ జట్టు కూడా ఇరాన్‌తో స్వర్ణం కోసం పోటీపడనుంది.మహిళల కబడ్డీలో పతకంతో భారత్ ఖాతాలో మూడో స్వర్ణం, మొత్తంగా 27వ పతకం చేరింది. ప్రస్తుతం భారత్ పతకాల పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతోంది. చైనా 169 పతకాలతో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇదీ చదవండి: ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో గోల్డ్ -
ఏషియన్ గేమ్స్ క్రికెట్.. మిగిలిన రెండు బెర్త్లూ ఖరారు
ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో నాలుగు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. గ్రూప్ దశ మ్యాచ్‌ల తర్వాత నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, మలేషియా, హాంగ్‌కాంగ్ చైనా జట్లు ఫైనల్-8కు చేరుకున్నాయి. సీడింగ్, ఐసీసీ ర్యాంకింగ్ ఆధారంగా భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లకు నేరుగా క్వార్టర్‌ఫైనల్ బెర్త్‌లు లభించిన విషయం తెలిసిందే.తాజాగా మలేషియా, ఒమన్ మధ్య జరగాల్సిన చివరి గ్రూప్-బి మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో గ్రూప్ టాపర్‌గా నిలిచిన మలేషియా, సెకెండ్ టాపర్ అయిన హాంగ్‌కాంగ్ చైనా క్వార్టర్స్‌కు చేరుకున్నాయి. ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిన ఒమన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.అంతకుముందే గ్రూప్-ఏ నుంచి నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు క్వార్టర్స్‌కు చేరుకున్నాయి. జపాన్, నేపాల్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఈ రెండు జట్లు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు దక్కించుకున్నాయి. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవని జపాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.క్వార్టర్స్‌లో ఎవరెవరు..?గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచిన నేపాల్ సెప్టెంబర్ 29న జరిగే మూడో క్వార్టర్ ఫైనల్లో శ్రీలంకను ఢీకొంటుంది. అదే గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్ సెప్టెంబర్ 28న జరిగే రెండో క్వార్టర్ ఫైనల్లో భారత జట్టుతో తలపడనుంది.గ్రూప్-బి టాపర్‌గా నిలిచిన మలేషియా సెప్టెంబర్ 29న జరిగే నాలుగో క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. రెండో స్థానంలో నిలిచిన హాంగ్‌కాంగ్ చైనా సెప్టెంబర్ 28న జరిగే తొలి క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్‌ను ఢీకొంటుంది.ఇదీ చదవండి: ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో గోల్డ్ -
ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో గోల్డ్
ఏషియన్ గేమ్స్ 2026లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. మహిళల కబడ్డీలో భారత జట్టు గోల్డ్ మెడల్ సాధించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ భారత్ ఇరాన్‌ను 37-34తో ఓడించి, వరుసగా రెండో ఆసియా క్రీడల్లో ఛాంపియన్‌గా నిలిచింది.ఫైనల్లో భారత జట్టు తొలి అర్ధభాగంలో ఆధిపత్యం ప్రదర్శించింది. విరామ సమయానికి 22-16తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో ఇరాన్ గట్టిగా పోరాడింది. ఆ దశలో ఇరాన్ 18-15తో ఆధిక్యం సాధించినప్పటికీ.. తొలి అర్ధభాగంలో భారత్ సాధించిన ఆరు పాయింట్ల ఆధిక్యం కీలకంగా మారింది.చివరి నిమిషాల్లో ఇరాన్ వరుసగా పాయింట్లు సాధిస్తూ భారత్‌పై ఒత్తిడి పెంచింది. అయితే భారత డిఫెన్స్ కీలక సమయంలో పట్టు కోల్పోకుండా మ్యాచ్‌ను ముగించింది. చివరికి 37-34తో విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.ఈ విజయంతో ఆసియా క్రీడల మహిళల కబడ్డీలో భారత్ నాలుగో స్వర్ణ పతకం సాధించింది. 2018 జకార్తా ఆసియా గేమ్స్‌లో మాత్రమే భారత్ స్వర్ణాన్ని కోల్పోయింది. ఆ ఏడాది ఇరాన్ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లోనూ భారత్ స్వర్ణం సాధించింది. తాజాగా ఇరాన్‌ను ఓడించి టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకుంది.విజయం అనంతరం భారత క్రీడాకారిణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి ‘వందే మాతరం’ నినాదాలతో సంబరాలు చేసుకున్నారు.కాగా, మహిళల కబడ్డీలో పతకంతో భారత్ ఖాతాలో మూడో స్వర్ణం, మొత్తంగా 27వ పతకం చేరింది. ప్రస్తుతం భారత్ పతకాల పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతోంది. చైనా 169 పతకాలతో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇదీ చదవండి: ఏషియన్ గేమ్స్ క్వార్టర్ ఫైనల్లో టీమిండియా ప్రత్యర్ది ఖరారు -
ఆసియా క్రీడల్లో భారత్ Vs పాకిస్తాన్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడంటే?
-
ఏషియన్ గేమ్స్ క్వార్టర్ ఫైనల్లో టీమిండియా ప్రత్యర్ది ఖరారు
ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో భారత్ క్వార్టర్‌ఫైనల్ ప్రత్యర్థి ఖరారైంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టు సోమవారం జరిగే రెండో క్వార్టర్ ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. భారత్‌కు సీడింగ్, ఐసీసీ ర్యాంకింగ్ ఆధారంగా నేరుగా క్వార్టర్‌ఫైనల్ బెర్త్ లభించిన విషయం తెలిసిందే.ఆఫ్ఘనిస్తాన్ ఎలా క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది..?జపాన్, నేపాల్ మధ్య ఇవాళ జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఆఫ్ఘనిస్తాన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. గ్రూప్-ఏలో ఆఫ్ఘనిస్తాన్, జపాన్, నేపాల్ జట్లు పోటీపడగా.. నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ తొలి రెండు స్థానాల్లో నిలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు దక్కించుకున్నాయి. గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచిన నేపాల్ సెప్టెంబర్ 29న జరిగే మూడో క్వార్టర్ ఫైనల్లో శ్రీలంకను ఢీకొంటుంది. నేపాల్ తాజాగా జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో తమకంటే మెరుగైన ఆఫ్ఘనిస్తాన్‌కు షాకిచ్చింది.మరో రెండు బెర్త్‌లు ఎవరివి..?గ్రూప్-ఏ నుంచి నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారు చేసుకోగా.. గ్రూప్-బి బెర్త్‌లు ఖరారు కావాల్సి ఉంది. ఈ గ్రూప్‌లో మలేషియా, హాంగ్‌కాంగ్ చైనా, ఒమన్ జట్లు పోటీపడుతున్నాయి. ఈ గ్రూప్ నుంచి తొలి స్థానంలో నిలిచే జట్టు సెప్టెంబర్ 29న జరిగే నాలుగో క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. రెండో స్థానంలో నిలిచే జట్టు సెప్టెంబర్ 28న జరిగే తొలి క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్‌ను ఢీకొంటుంది. ప్రస్తుతం మలేషియా, హాంగ్‌కాంగ్ తలో 2 పాయింట్లతో మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. ఒమన్ ఖాతా తెరవకుండా చివరి స్థానంలో ఉంది.ఇదిలా ఉంటే, ఈ క్రీడల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఫుల్ మెంబర్స్ జట్టుతో బరిలోకి దిగింది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టులో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ తదితర స్టార్లు ఉన్నారు.ఇదీ చదవండి: తొలి వన్డేకు ముందు టీమిండియాకు భారీ షాక్ -
గత ఎడిషన్ రికార్డును భారత్ ఈసారి బద్దలు కొట్టేనా..?
ఏషియన్ గేమ్స్ 2026లో భారత్ పతకాల వేట నిదానంగా కొనసాగుతోంది. ఏడో రోజు ఉదయానికి భారత్ ఖాతాలో కేవలం 25 పతకాలు మాత్రమే ఉన్నాయి. ఈ ఎడిషన్ మరో ఎనిమిది రోజుల్లో (అక్టోబర్ 4) ముగియనున్న నేపథ్యంలో భారత్ గత ఎడిషన్ పతకాల రికార్డును తాకగలుగుతుందా అన్న చర్చ మొదలైంది.2022 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత్ రికార్డు స్థాయిలో 107 పతకాలు సాధించింది. భారత్ ఆసియా క్రీడల చరిత్రలోనే ఇదే అత్యధికం (పతకాల పరంగా). అయితే ఈసారి భారత్ మళ్లీ 100 పతకాల మార్క్‌ను దాటగలదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.భారత్ క్రితంసారి రికార్డును సమం చేయాలంటే ఇంకా 82 పతకాలు సాధించాలి. 100 మార్క్‌ను దాటాలంటే కనీసం 76 పతకాలు రావాలి. ప్రస్తుత పరిస్థితుల్లో పై రెండు లక్ష్యాలను చేరుకోవడం అంత సులభం కాదనే అనిపిస్తుంది. పలు వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో భారత్ ఇప్పటికే పలు పతకాలు చేజార్చుకోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇకపై పతక అవకాశమున్న ప్రతి ఈవెంట్లో సత్తా చాటినా, భారత్ 107 పతకాల మార్కును తాకడం కష్టంగా కనిపిస్తుంది. అయితే ఇది అసాధ్యమైతే కాదు. ఎందుకంటే భారత్‌కు ఆ మార్కును దాటడానికి ఇంకా వీలైనన్ని అవకాశాలు ఉన్నాయి.కొన్ని ఈవెంట్లలో ఇంకా క్వాలిఫికేషన్ దశనే నడుస్తుండటం భారత్ పతకాల వేగం నిదానించడానికి కారణం. తర్వాతి దశలో భారత్ షూటింగ్, ఆర్చరీ, అథ్లెటిక్స్, రెజ్లింగ్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, స్క్వాష్, కబడ్డీ, హాకీ వంటి విభాగాల్లో మరిన్ని పతకాలు సాధించే అవకాశాలు ఉన్నాయి.ఎక్కడి నుంచి ఎక్కువ పతకాలు రావొచ్చు..?గత ఎడిషన్‌లో భారత్‌కు అత్యంత ఫలవంతమైన విభాగాల్లో షూటింగ్ ప్రధానమైంది. ఈసారి కూడా భారత్ ఈ క్రీడపై చాలా ఆశలు పెట్టుకుంది. అందుకు అనుగుణంగానే ఇప్పటికే పలు పతకాలు కూడా సాధించింది. మిగిలిన రోజుల్లో షూటింగ్లో భారత్ మరిన్ని పతకాలు సాధించవచ్చు.అథ్లెటిక్స్:సావన్ బర్వాల్ రజతం (మారథాన్) ఇప్పటికే భారత్ ఖాతాలో చేరింది. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ఇంకా పలు ఈవెంట్లు మిగిలి ఉన్నాయి. గత ఎడిషన్‌లో భారత్ అథ్లెటిక్స్‌లో ఏకంగా 29 పతకాలు సాధించింది.ఆర్చరీ: కంపౌండ్, రికర్వ్ విభాగాల్లో భారత్‌కు వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో అవకాశాలు ఉన్నాయి. ఏడో రోజు నుంచే క్వాలిఫికేషన్ రౌండ్లు కొనసాగుతున్నాయి.కబడ్డీ: పురుషులు, మహిళల జట్లు రెండూ పతక పోటీలో ఉన్నాయి. ఇవాళే (సెప్టెంబర్ 26) ఈ రెండు ఫైనల్స్ జరగనున్నాయి. ఈ రెండు ఈవెంట్లలో భారత్ స్వర్ణ పతకాలు ఆశిస్తుంది.స్క్వాష్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, హాకీ: నాకౌట్ దశల్లో భారత్‌కు మరిన్ని పతక అవకాశాలు ఉన్నాయి.ఇదీ చదవండి: షూటింగ్లో మరొకటి.. 25కు చేరిన భారత్ పతకాల సంఖ్య -
షూటింగ్లో మరొకటి.. 25కు చేరిన భారత్ పతకాల సంఖ్య
ఏషియన్ గేమ్స్ 2026లో ఏడో రోజు భారత్‌కు శుభారంభం లభించింది. ఒకే రోజు రెండు ఖాతాలో రజత పతకాలు చేరాయి. తొలుత పురుషుల మారథాన్‌లో సావన్ బర్వాల్ రజతం సాధించగా.. ఆతర్వాత మహిళల షూటింగ్ జట్టు కూడా సిల్వర్ మెడల్ గెలుచుకుంది.మారథాన్‌లో సావన్ బర్వాల్ చరిత్రపురుషుల మారథాన్‌లో సావన్ బర్వాల్ వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్ 2:11:37తో రజత పతకం సాధించాడు. దీంతో ఏషియన్ గేమ్స్ పురుషుల మారథాన్‌లో భారత్‌కు 44 ఏళ్ల తర్వాత పతకం లభించింది.షూటింగ్లో మహిళల జట్టుకు రజతంమహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్లో తిలోత్తమ సేన్, విదర్సా వినోద్, ఆశి చౌక్సేతో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది. ఇదే ఈవెంట్లో తిలోత్తమ సేన్, విదర్సా వినోద్ వ్యక్తిగత ఫైనల్‌కు కూడా అర్హత సాధించారు.25కు చేరిన భారత్ పతకాల సంఖ్యఏడో రోజు రెండు రజతాలు రావడంతో ప్రస్తుత ఏషియన్ గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య 25కు చేరింది.ఇదీ చదవండి: భారత ఫుట్‌బాల్ జట్టు అద్భుత ప్రదర్శన -
ఏషియన్ గేమ్స్ మారథాన్‌లో భారత్‌కు రజతం
భారత అథ్లెట్ సావన్ బర్వాల్ ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల మారథాన్‌లో రజత పతకం సాధించాడు. 42.195 కిలోమీటర్ల రేసులో రెండో స్థానంలో నిలిచి, ఈ ఈవెంట్లో భారత్ 44 ఏళ్లుగా ఎదురుచూస్తున్న పతకాన్ని అందించాడు. జపాన్‌కు చెందిన ఇచితకా యమషితాకు ఈ ఈవెంట్లో స్వర్ణం లభించింది.1982 ఏషియన్ గేమ్స్‌లో హోసూర్ కుక్కప్ప సీతారన్ కాంస్యం సాధించిన తర్వాత.. పురుషుల మారథాన్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. ఓవరాల్‌గా ఏషియన్ గేమ్స్ మారథాన్ చరిత్రలో భారత్‌కు ఇది నాలుగో పతకం. 1951 తొలి ఏషియన్ గేమ్స్‌లో ఛోటా సింగ్ స్వర్ణం, సూరత్ సింగ్ మాథుర్ కాంస్యం సాధించారు. 1982లో సీతారన్ మరో కాంస్యం అందించారు.బర్వాల్ రజతంతో ప్రస్తుత ఏషియన్ గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య 24కు చేరింది. పతకాల పట్టికలో భారత్ 12వ స్థానంలో కొనసాగుతుండగా.. చైనా 160 పతకాలతో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఇదీ చదవండి: 'గోల్డ్' తెచ్చిన 'గన్' -
'గోల్డ్' తెచ్చిన 'గన్'
ఆసియా క్రీడల్లో భారీ సంఖ్యలో పతకాలు వస్తాయని ఆశించిన షూటింగ్లో ఒక్కో రోజు గడుస్తున్నకొద్దీ నిరాశ పెరుగుతూ వచ్చింది. అంచనాలు పెట్టుకున్న స్టార్లంతా విఫలం కావడంతో గత క్రీడల 22 పతకాలకు దరిదాపుల్లోకి కూడా వచ్చే పరిస్థితి కనిపించలేదు. ఎట్టకేలకు రజత, కాంస్యాలు దక్కినా... పసిడి మాత్రం దూరంగా ఉండిపోయింది. కానీ శుక్రవారం భారత్‌కు ఆ లోటు తీరింది. సురుచి సింగ్–కమల్జీత్ జోడీ షూటింగ్లో స్వర్ణ పతకాన్ని అందించి ఊరటనిచ్చింది. దీనికి తోడు మరో రజతం కూడా షూటర్ల ఖాతాలో చేరింది. మరోవైపు అథ్లెటిక్స్‌లో లాంగ్‌డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 10 వేల మీటర్ల విభాగంలో వెండి పతకంతో మెరిశాడు. మహిళా పోల్‌వాల్టర్ బరానికా ఇలంగోవన్, షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్ కూడా కాంస్యాలు అందించారు. టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మనుశ్ షా–దియా చిటాలె ద్వయం కాంస్యం గెలవడంతో ఆసియా క్రీడల ఆరో రోజును భారత్ ఆరు పతకాలతో ముగించింది. నగోయా: ఆసియా క్రీడల్లో భారత్ రెండో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు మహిళల టి20 క్రికెట్లో ఏకైక పసిడి దక్కగా, ఇప్పుడు షూటింగ్ ఆ జాబితాలో చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు చెందిన సురుచి సింగ్–కమల్జీత్ ద్వయం స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్లో భారత జంట మొత్తంగా 484.6 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. సురుచి 245.7 పాయింట్లు స్కోర్ చేయగా, కమల్జీత్ 238.9 పాయింట్లు నమోదు చేశాడు. క్వాలిఫయింగ్‌లో తొలి స్థానంతో ఫైనల్స్‌కు అర్హత సాధించిన భారత జంట చివరి వరకు అదే జోరును కనబర్చడంలో సఫలమైంది. దక్షిణ కొరియా (478.0 పాయింట్లు) రజతం సాధించగా, ఇరాన్ (415.8)కు కాంస్యం దక్కింది. ఆధిక్యం కోల్పోయి... షూటింగ్లో భారత్ మరో స్వర్ణం గెలుచుకునే ప్రయత్నంలో హోరాహోరీగా తలపడినా... చివరకు రెండో స్థానానికే పరిమితమైంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు రజతం లభించింది. మన త్రయం ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, రుద్రాంక్ష్ పాటిల్, నీరజ్ కుమార్ ఓవరాల్‌గా 1762 పాయింట్లు సాధించారు. వీటిలో ఐశ్వర్య ప్రతాప్ 589, నీరజ్ 588, రుద్రాంక్ష్ 585 పాయింట్లు స్కోర్ చేశారు. చైనా (1766 పాయింట్లు) స్వర్ణం గెలుచుకోగా, దక్షిణ కొరియాకు (1751 పాయింట్లు) కాంస్యం లభించింది. ఒకదశలో ఇక్కడి ప్రదర్శనను బట్టే వ్యక్తిగత విభాగంలో ఫైనల్స్‌కు కూడా షూటర్లు అర్హత సాధిస్తారు. దాంతో మూడో స్థానంతో ఐశ్వర్య ప్రతాప్, నాలుగో స్థానంతో నీరజ్ ఫైనల్ చేరారు. 9వ స్థానంతో నిలిచిన రుద్రాంక్ష్ ముందంజ వేయడంలో విఫలమయ్యాడు. అయితే వ్యక్తిగత ఫైనల్లో భారత షూటర్లు నిరాశపర్చారు. క్వాలిఫయింగ్‌లో ప్రదర్శనను పునరావృతం చేయలేక నీరజ్ 8వ స్థానంలో, ఐశ్వర్య ప్రతాప్ ఐదో స్థానంలో నిలిచి నిష్క్రమించారు. కమల్ కా కమాల్... కమల్జీత్ విజయం కూడా సరిగ్గా ఇదే తరహాలో రెండు ఓటముల తర్వాతే వచ్చింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో 9వ స్థానంతో ఫైనల్ అవకాశాలు చేజారగా, టీమ్ ఈవెంట్లో జట్టు నాలుగో స్థానానికి పరిమితమైంది. తొలిసారి పాల్గొన్న ఆసియా క్రీడల్లో పతకం లేకుండానే నిష్క్రమిస్తానని భయపడ్డానని, అయితే తన ఆటకు తోడు అదృష్టం కూడా కలిసొచ్చిందని కమల్జీత్ చెప్పాడు. నిజానికి మిక్స్డ్ ఈవెంట్లో సురుచితో పాటు కేదార్లింగ్ బరిలోకి దిగాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో అతడిని తప్పించి కమల్జీత్కు కోచ్ సమరేశ్ జంగ్ అవకాశం ఇచ్చాడు. దాంతో తనను తాను కచ్చితంగా నిరూపించుకోవాల్సిన స్థితిలో అతను నిలిచాడు.హరియాణాలోని రేవారికి చెందిన 23 ఏళ్ల కమల్జీత్ మెరుగ్గానే ఆరంభించినా... చివరికొచ్చేసరికి కాస్త తడబడ్డాడు. అయితే సురుచి స్కోరు కారణంగా ఇద్దరికీ స్వర్ణం దక్కింది. ఏడేళ్ల క్రితం షూటింగ్ మొదలు పెట్టిన కమల్జీత్ 2023లో భారత జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. అదే ఏడాది తాను ప్రయాణిస్తున్న ఆటోకు ప్రమాదం జరగడంతో కాలుకు తీవ్ర గాయమైన అతను కోలుకునేందుకు చాలా సమయం పట్టింది. ఇటీవలే ఆర్మీలో హవల్దార్‌గా చేరిన అతను ఇప్పుడు పసిడి పతకంతో వెనుదిరుగుతున్నాడు. స్వర్ణం ‘సురుచి’కరం... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో 26వ స్థానం... టీమ్ విభాగంలో త్రుటిలో పతకం చేజారి నాలుగో స్థానంతో సరి... ఈ ఆసియా క్రీడల్లో రెండు వైఫల్యాల తర్వాత శుక్రవారం తీవ్ర ఒత్తిడి మధ్య సురుచి బరిలోకి దిగింది. 20 ఏళ్ల వయసులో ఆమె ఖాతాలో ఇప్పటికే వరల్డ్ చాంపియన్‌షి ప్ రజతం, వరల్డ్ కప్ ఫైనల్ స్వర్ణం, 5 వరల్డ్ కప్ స్వర్ణాలు, గత ఏడాదే వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్లాంటివి ఉన్నాయి. ఇలాంటి రికార్డు కారణంగా భారీ అంచనాలతో బరిలోకి దిగిన సురుచి రెండు ఈవెంట్ల వైఫల్యంతో భారత షూటింగ్ మేనేజ్మెంట్ నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంది. కానీ ఇప్పుడు తన ప్రదర్శనతోనే ఆమె వాటికి సమాధానం ఇచ్చింది. ఈ క్రీడల షూటింగ్లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన ప్లేయర్‌గా సురుచి నిలిచింది. క్వాలిఫికేషన్లో 295 పాయింట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన 296 పాయింట్లు స్కోర్ చేసిన ఆమె... ఫైనల్లో 246 పాయింట్ల లక్ష్యంతో గురి పెట్టి అతి చేరువగా 245.7 పాయింట్లు సాధించగలిగింది. అయితే స్వర్ణం గెలుచుకోవడానికి ఇది సరిపోయింది. హరియాణాలోని ఝఝర్ జిల్లాకు చెందిన సురుచి తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేసింది. ‘ఎలాగైనా స్వర్ణమే సాధించాలని బరిలోకి దిగాను. నా ప్రదర్శన పట్ల చాలా ఆనందంగా ఉన్నా. గత రెండు వైఫల్యాలను నా మనసులోంచి చెరిపేసి కొత్తగా మొదలు పెట్టా. నీకు మరో అవకాశం ఉందంటూ కోచ్‌లు స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ ఫలితం కనిపించింది’ అని సురుచి వ్యాఖ్యానించింది. కాంస్యం నుంచి రజతానికి...భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ గత ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచాడు. ఈసారి అంతకంటే మెరుగైన ప్రదర్శనతో అతను రజతాన్ని తన ఖాతాలో వేసుకోవడం విశేషం. గత రెండేళ్లుగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న గుల్వీర్ అంచనాలను అందుకోవడంలో సఫలమయ్యాడు. 10 వేల మీటర్ల పరుగును గుల్వీర్ 28 నిమిషాల 28.38 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. బిర్హాను బలెవ్ (బహ్రెయిన్; 28 నిమిషాల 27.51 సెకన్లు) స్వర్ణ పతకం సాధించగా, ఆల్బర్టో కిప్టో (బహ్రెయిన్; 28 నిమిషాల 34.18 సెకన్లు)కు కాంస్యం దక్కింది. ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో కూడా గుల్వీర్ 10 వేల మీటర్ల పరుగులో రజతం, 5 వేల మీటర్ల పరుగులో కాంస్యం అందుకున్నాడు. ఆర్మీలో నాయబ్ సుబేదార్‌గా పని చేస్తున్న గుల్వీర్ పేరిటే ఈ రెండు ఈవెంట్లలో జాతీయ రికార్డులు ఉన్నాయి. 5 వేల మీటర్ల పరుగును 13 నిమిషాల్లోపు పూర్తి చేసిన తొలి భారత అథ్లెట్‌గా అతను గుర్తింపు పొందాడు. 36 ఏళ్ల వయసులో... రెండు దశాబ్దాల క్రితం ఆసియా జూనియర్ చాంపియన్‌షి ప్తో అంతర్జాతీయ కెరీర్ మొదలు... కానీ షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్‌కు విజయాల పరంగా ఎలాంటి గుర్తింపూ రాలేదు. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో మూడుసార్లు పాల్గొంటే 9వ, 7వ, 4వ స్థానాలు మాత్రమే దక్కాయి. గత ఆసియా క్రీడల్లో 5వ స్థానం లభిస్తే ఒలింపిక్స్‌లో 23వ స్థానం మాత్రమే! పైగా డోపింగ్ వివాదంతో నాలుగేళ్లపాటు నిషేధం కూడా ఎదుర్కొంది. కానీ పట్టువదలకుండా పోరాడిన ఆమె ఇప్పుడు ఆసియా క్రీడల్లో కాంస్యంతో మెరిసింది. శుక్రవారం జరిగిన మహిళల షాట్‌పుట్ ఫైనల్స్‌లో ఇనుప గుండును 17.17 మీటర్లు విసిరి మన్‌ప్రీత్ మూడో స్థానంలో నిలిచింది. సంగ్ జియాయున్ (చైనా; 19.40 మీటర్లు) పసిడి పతకాన్ని అందుకోగా, జాంగ్ లిన్రు (చైనా; 18.14 మీటర్లు) రజత పతకం సాధించింది. జాతీయ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి ప్లో ఆసియా క్రీడల అర్హత మార్క్‌ను అందుకొని ఈ పోటీలకు వచ్చిన మన్‌ప్రీత్ తన అత్యుత్తమ ప్రదర్శనతో పతకం సాధించి సగర్వంగా నిలిచింది. బార్బరా వెబ్‌స్టర్ (1951), కిరణ్ బలియాన్ (2023) తర్వాత ఆసియా క్రీడల మహిళల షాట్‌పుట్‌లో పతకం నెగ్గిన భారత అథ్లెట్‌గా ఆమె నిలిచింది. బరానిక కొత్త చరిత్రభారత అథ్లెటిక్స్ చరిత్రలో శుక్రవారం కొత్త ఘనత నమోదైంది. ఆసియా క్రీడల చరిత్రలో పురుషుల, మహిళల విభాగాల్లో ఒక్కసారి కూడా పతకం లభించని పోల్‌వాల్ట్‌లో ఈసారి భారత క్రీడాకారిణి పోడియంపై నిలిచింది. తమిళనాడుకు చెందిన 29 ఏళ్ల బరానిక ఇలంగోవన్ ఈ ఘనత సాధించిన అథ్లెట్‌గా తన పేరును లిఖించుకుంది. మహిళల పోల్‌వాల్ట్ ఈవెంట్లో 4.15 మీటర్ల ఎత్తుకు ఎగిరిన బరానిక కాంస్యం సొంతం చేసుకుంది. కజకిస్తాన్‌కు చెందిన పొలీనా ఇవనోవా కూడా 4.15 మీటర్లు ఎగిరి భారత అథ్లెట్‌తో సమంగా నిలిచింది. ఇద్దరూ కూడా సరిగ్గా 4.25 మీటర్ల ప్రయత్నంలోనే విఫలమయ్యారు. దాంతో ఇద్దరికీ కాంస్యాన్ని ప్రకటించారు. ఈ ఈవెంట్లో మిసాకి మొరోటా (జపాన్; 4.55 మీటర్లు) స్వర్ణాన్ని అందుకోగా, చుంగే నియు (చైనా; 4.50 మీటర్లు) రజతం గెలుచుకుంది. ఈ ఏడాది జాతీయ ఇండోర్ ఓపెన్ ఈవెంట్లో బరానిక 4.23 మీటర్లతో తన అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది. దీనిని అధిగమించలేకపోయినా... పతకం మాత్రం గెలుచుకోవడంలో ఆమె సఫలమైంది. ఆరేళ్ల క్రితం ఏసీఎల్ గాయంతో చాలా కాలం ఆటకు దూరమై కెరీర్ ప్రమాదంలో పడినా... 2023లో రిలయన్స్ హైపర్ఫార్మెన్స్ సెంటర్లో చేరడం ఆమెకు కొత్త ఊపిరి పోసింది. గత మూడేళ్ల కఠోర సాధన తర్వాత ఇప్పుడు ఏషియాడ్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయురాలిగా బరానిక సగర్వంగా నిలిచింది. ‘మిక్స్డ్ డబుల్స్’ టీటీలో మనుశ్–దియాలకు కాంస్యంగత ఆసియా క్రీడల్లో ఏకైక పతకం అందించిన టేబుల్ టెన్నిస్ (టీటీ)లో శుక్రవారం తొలి పతకం చేరింది. మిక్స్డ్ డబుల్స్‌లో భారత జోడీ మనుశ్ షా–దియా చిటాలె సెమీఫైనల్లో ఓడి కాంస్యంతో ముగించింది. సెమీఫైనల్లో భారత జంట 8–11, 5–11, 8–11, 2–11తో చైనాకు చెందిన వాంగ్‌చుక్–సున్ యింగ్షా జోడీ చేతిలో ఓటమి పాలైంది. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో మనుశ్–దియా 11–6, 13–15, 11–9, 11–5తో ప్రపంచ నాలుగో ర్యాంక్ హాంకాంగ్ జోడీ వాంగ్ టున్ టింగ్–డూ హోయ్ కిమ్‌పై సంచలన విజయంతో సెమీఫైనల్‌కు చేరి పతకాన్ని ఖాయం చేసుకున్నారు.స్క్వాష్ లో 3 పతకాలు ఖాయంఆసియా క్రీడల స్క్వాష్ లో భారత్‌కు మూడు పతకాలు ఖాయమయ్యాయి. మహిళల సింగిల్స్‌లో అనాహత్ సింగ్, పురుషుల సింగిల్స్‌లో అభయ్ సింగ్, మిక్స్డ్ డబుల్స్‌లో జోష్నా చినప్ప–సెంథిల్ కుమార్ జోడీ సెమీఫైనల్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకాలను ఖరారు చేసుకున్నారు. రికార్డు స్థాయిలో ఏడోసారి ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న జోష్న ఇప్పటికే ఐదు పతకాలు సాధించింది. 2018 ఆసియా క్రీడల్లో మహిళల సింగిల్స్‌లో కాంస్యం నెగ్గిన జోషా్న... 2014, 2018 క్రీడల్లో టీమ్ విభాగాల్లో రజత పతకాలు గెలుచుకుంది. 2010, 2023లో టీమ్ విభాగంలో కాంస్యాలు దక్కించుకుంది. శుక్రవారం మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో జోషా్న–సెంథిల్ జోడీ 11–3, 11–5తో డేవిడ్ పెలినో–జెమికా అరిబాడో (ఫిలిప్పీన్స్) ద్వయంపై గెలుపొందింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో అనాహత్ 11–2, 11–5, 11–3తో భారత్‌కే చెందిన తన్వీ ఖన్నాపై గెలిచింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అభయ్ 11–4, 11–3, 11–6తో ర్యోనోసుకె సుకువే (జపాన్)పై గెలిచాడు. మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో వీర్ చోత్రాని 11–6, 8–11, 3–11, 3–11తో ఇర్ఫాన్ (పాకిస్తాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. -
సెమీస్‌లో భారత మహిళల హాకీ జట్టు
కాకామిగహారా: వరుసగా నాలుగో విజయం సాధించిన భారత మహిళల హాకీ జట్టు సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఆతిథ్య జపాన్ జట్టుతో శుక్రవారం జరిగిన పూల్ ‘బి’ మ్యాచ్‌లో టీమిండియా 3–1 గోల్స్ తేడాతో గెలిచింది. 12 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది. భారత్ తరఫున లాల్రెమ్సియామి (5వ ని.లో), ఇషిక (30వ ని.లో), నవ్‌నీత్ కౌర్ (36వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. జపాన్ జట్టుకు షిహో కొబయాకవా (46వ ని.లో) ఏకైక గోల్ అందించింది. ఆదివారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో సింగపూర్‌తో భారత్ ఆడుతుంది. -
చైనా స్విమ్మర్‌కు సప్త స్వర్ణాలు
నగోయా: ఆసియా క్రీడల్లో అరంగేట్రం చేస్తూనే చైనా టీనేజ్ స్విమ్మర్ జాంగ్ జాన్షువో రికార్డు పుటల్లోకి ఎక్కాడు. శుక్రవారం జరిగిన పురుషుల 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో జాంగ్ స్వర్ణం సాధించాడు. దాంతో ఒకే ఆసియా క్రీడల్లో అత్యధికంగా 7 స్వర్ణాలు గెలిచిన క్రీడాకారుడిగా ఉత్తర కొరియా షూటర్ సో గిల్ సాన్ (1982 న్యూఢిల్లీలో 7 స్వర్ణాలు) పేరిట ఉన్న రికార్డును 19 ఏళ్ల జాంగ్ జాన్షువో సమం చేశాడు. అంతేకాకుండా ఒకే ఆసియా క్రీడల్లో అత్యధిక పసిడి పతకాలు గెలిచిన స్విమ్మర్‌గా రికార్డుసృష్టించాడు. తాజా గేమ్స్‌లో జాంగ్ 200, 400, 800, 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్స్‌లో, 4్ఠ100 మీటర్ల రిలే, 4్ఠ200 మీటర్ల రిలే, 4్ఠ100 మీటర్ల రిలే ఈవెంట్లలో స్వర్ణ పతకాలు గెలిచాడు. -
10వేల మీటర్ల రేసులో గుల్వీర్ చరిత్ర.. పోల్‌వాల్ట్‌లో తొలి పతకం
భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ (Gulveer Singh) చరిత్ర సృష్టించాడు. జపాన్‌లోని నగోయా వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో (Asian Games) పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో గుల్వీర్ రజత పతకం సాధించాడు.శుక్రవారం జరిగిన ఫైనల్ రేసును గుల్వీర్ 28:29.38 నిమిషాల్లో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. గత హాంగ్జౌ (2022) ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన గుల్వీర్, ఈసారి తన ప్రదర్శనను మెరుగుపరుచుకుని వెండిని కొల్లగొట్టాడు. బహ్రెయిన్‌కు చెందిన బిర్హాను బలేవ్ (28:27.51 నిమిషాలు) బంగారు పతకాన్ని గెలుచుకోగా.. బహ్రెయిన్‌కే చెందిన ఆల్బర్ట్ కిప్టో (28:34.18 నిమిషాలు) కాంస్యం సొంతం చేసుకున్నాడు. కాగా ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌లో 5వేల మీటర్ల పరుగు పందెంలో గుల్వీర్ కాంస్యం గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇండియన్ ఆర్మీలో నాయబ్ సుబేదార్ అయిన గుల్వీర్ సింగ్ కొంతకాలంగా సూపర్ ఫామ్ కనబరుస్తున్నాడు. 2025 ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గుల్వీర్ సింగ్ 5వేల మీటర్లతో పాటు 10వేల మీటర్ల రేసులో స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాడు. 5వేల మీటర్ల రేసును 12:59.77 నిమిషాల్లో పూర్తి చేసిన గుల్వీర్ ఆసియా నుంచి 13 నిమిషాల బారియర్‌ను బ్రేక్ చేసిన మొదటి అథ్లెట్‌గా రికార్డులకెక్కాడు.పోల్‌వాల్ట్‌లో తొలిసారి పతకంఆసియా గేమ్స్‌కు పోల్‌వాల్ట్‌లో భారత్‌కు తొలిసారి పతకం లభించింది. భారత అథ్లెట్ బరానికా ఎలన్గోవన్ మహిళల పోల్‌వాల్ట్‌లో కాంస్య పతకం సాధించింది. తన ఐదో ప్రయత్నంలో పోల్వాల్ట్తో 4.15 మీటర్ల ఎత్తు ఎగిరిన బరానికా తన బెస్ట్ ప్రదర్శనను నమోదు చేసి కాంస్యం ఒడిసిపట్టింది. తొలి ప్రయత్నంలో 3.45 మీటర్లు, రెండో ప్రయత్నంలో 3.65 మీటర్లు, మూడో ప్రయత్నంలో 3.85 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 4 మీటర్లు, ఐదో ప్రయత్నంలో 4.15 మీటర్ల ఎత్తు ఎగిరింది.షాట్‌పుట్‌లో కాంస్యంమహిళల షాట్‌పుట్ విభాగంలో భారత అథ్లెట్ మన్‌ప్రీత్ కౌర్ కాంస్యం గెలుచుకుంది. ఆమె షాట్‌పుట్‌ను 17.17 మీటర్ల దూరం విసిరి కాంస్యం ఒడిసిపట్టింది. చైనాకు చెందిన సోంగ్ జియాహున్ (19.40 మీటర్లు), జాంగ్ లిన్రు (18.14 మీటర్లు) స్వర్ణ, రజతాలు కైవసం చేసుకున్నారు. ఓవరాల్‌గా ఆసియా గేమ్స్‌లో భారత్‌కు ఇది 23వ పతకం కాగా, ఇందులో రెండు స్వర్ణాలు, 9 రజతాలు, 12 కాంస్యాలు ఉన్నాయి.ఇదీ చదవండి: సెంచరీ బాదిన ఆసీస్ బ్యాటర్.. భారత్ ముంగిట భారీ లక్ష్యం -
టేబుల్ టెన్నిస్‌లో కాంస్యం.. అథ్లెటిక్స్‌లో 9 పతకాలు ఖాయం!
ఆసియా గేమ్స్ 2026లో భారత్ ఖాతాలో 20వ పతకం వచ్చి చేరింది. టేబుల్ టెన్నిస్ మిక్సడ్ డబుల్స్ విభాగంలో మానుష్ షా-దియా చితాలే జోడీ కాంస్య పతకం గెలుచుకుంది. సెమీస్‌లో చైనాకు చెందిన సన్ ఇంగ్షా-వాంగ్ చుయిన్ చేతిలో 4-0 (8-11, 5-11, 8-11, 2-11) తేడాతో మానుష్-దియా జోడీ ఓటమి చవిచూసింది. సెమీఫైనల్లో ప్రత్యర్థి చేతిలో వరుస గేముల్లో ఓటమిపాలైనప్పటికీ, కాంస్యం దక్కించుకుంది. దీంతో భారత్ ఇప్పటివరకు 20 పతకాలు సొంతం చేసుకోగా, ఇందులో రెండు స్వర్ణాలు, 8 రజతాలు, 10 కాంస్యాలున్నాయి. పతకాల పట్టికలో భారత్ 12వ స్థానంలో కొనసాగుతుంది. ఇక అథ్లెటిక్స్ విభాగంలో భారత ప్లేయర్లు దాదాపు 9 పతకాలు ఖాయం చేసుకున్నారు. ఉదయం షూటింగ్ విభాగంలో ఒక స్వర్ణం, రజతం వచ్చిన సంగతి తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో కమల్జీత్ - సురుచి సింగ్ జోడీ అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, నీరజ్ కుమార్, రుద్రాంక్ష్ పాటిల్ త్రయం రజత పతకాన్ని సొంతం చేసుకుంది. 🥉 BRONZE FOR INDIA! 🇮🇳🔥Manush Shah & Diya Chitale win BRONZE in the Mixed Doubles event at #AsianGames2026! 🏓Another medal for Team India! 🇮🇳👏#TeamIndia #TableTennis #AsianGames2026 #IndiaSportsHub pic.twitter.com/niG1gMQJ8O— IndiaSportsHub (@IndiaSportsHub) September 25, 2026ఇదీ చదవండి: 24 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా స్పిన్నర్ అరుదైన ఫీట్ -
Asian Games 2026: సాత్విక్-చిరాగ్ జోడీకి షాక్
ఆసియా గేమ్స్‌లో కచ్చితంగా పతకం సాధిస్తారనుకున్న భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి నిరాశపరిచారు. జపాన్ వేదికగా జరుగుతున్న గేమ్స్‌లో డిఫెండింగ్ చాంపియన్లయిన సాత్విక్-చిరాగ్ జోడీ తొలి రౌండ్లోనే ఓటమిపాలయ్యి టోర్నీ నుంచి నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ తొలి రౌండ్లో థాయ్‌లాండ్‌కు చెందిన పక్కాపోన్ తీరాతరత్సాకుల్-పీరట్చాయ్ సుక్ఫున్ జోడీ 12-21, 21-19, 21-14 తేడాతో సాత్విక్-చిరాగ్ జోడీ ఓటమి చవిచూసింది. గంటా 8 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్‌ను సునాయాసంగా కైవసం చేసుకున్న సాత్విక్ జంట రెండో గేమ్‌ను ప్రత్యర్థికి కోల్పోయింది. అయితే కీలకమైన మూడో గేమ్‌లో పూర్తిగా ఒత్తిడికి లోనైన భారత ద్వయానికి ఓటమి తప్పలేదు. గత ఆసియా గేమ్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. టీమ్ విభాగంలో కాంస్యం గెలిచిన భారత్‌కు సాత్విక్-చిరాగ్ జోడీ డబుల్స్ విభాగంలో పక్కాగా పతకం తెస్తారని ఆశించగా, ఈ ఓటమి అభిమానులను షాక్‌కు గురి చేసిందని చెప్పొచ్చు. మిగిలిన మ్యాచ్‌ల విషయానికొస్తే.. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తనిషా-ధ్రువ్ కపిల జంట తొలి రౌండ్లో విజయాన్నిసాధించింది. ఈ జోడీ 21-8, 21-7తో మాల్దీవ్స్‌కు చెందిన నిబల్ అహ్మద్-అబినాథ్ జోడీపై 21 నిమిషాల్లోనే విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఇక మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా రెండో రౌండ్‌కు చేరుకుంది. తొలి రౌండ్లో ఉన్నతి 21-9, 21-10తో నార్త్ కొరియాకు చెందిన మి సోంగ్ యును చిత్తు చేసింది.ఇదీ చదవండి: SA vs AUS: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ -
Asian Games Cricket: అఫ్గాన్‌ను చిత్తు చేసిన పసికూన
ఆసియా క్రీడలు-2026 పురుషుల టీ20 క్రికెట్లో సంచలనం నమోదైంది. గత ఎడిషన్‌లో రజతం గెలిచిన అఫ్గానిస్తాన్ జట్టుపై.. పసికూన నేపాల్ తాజాగా ఘన విజయం సాధించింది. అఫ్గాన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి పాయింట్ల ఖాతా తెరిచింది.102 పరుగులేజపాన్లోని నిశిన్లో శుక్రవారం నాటి గ్రూప్- ‘ఎ’ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్- నేపాల్ జట్లు తలపడ్డాయి. కరోగి స్పోర్ట్స్ పార్కు వేదికగా టాస్ గెలిచిన అఫ్గాన్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నేపాల్ బౌలర్ల ధాటికి తాళలేక నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 102 పరుగులకే పరిమితమైంది.టాపార్డర్‌లో మహ్మద్ అక్రం (2), హసన్ ఐసాఖిల్ (0).. కరీం జనత్ (9) పూర్తిగా విఫలమయ్యారు. నేపాల్ స్పిన్నర్ లలిత్ రాజ్‌బన్షీ అద్భుత బౌలింగ్‌తో ఈ ముగ్గురిని అవుట్ చేశాడు. మిగిలిన వారిలో ఫైజల్ షినోజాదా (30), నజీబుల్లా జద్రాన్ (30) రాణించగా.. కెప్టెన్ డార్విష్ రసూలీ డకౌట్ అయ్యాడు. ఆఖర్లో నంగేయలియా ఖరోటి 17 పరుగులతో అజేయంగా నిలిచాడు.17.2 ఓవర్లలో టార్గెట్ పూర్తినేపాల్ బౌలర్లలో కుశాల్ భుర్తేల్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. లలిత్ రాజ్‌బన్షీ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్.. 17.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది.రాణించిన రోహిత్ఓపెనర్లు కుశాల్ భుర్తేల్ (0), ఆసిఫ్ షేక్ (2) నిరాశపరచగా.. వన్‌డౌన్‌లో వచ్చిన సందీప్ జోరా (34) మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. మిగిలిన వారిలో కుశాల్ మల్లా (9), కెప్టెన్ దీపేంద్ర సింగ్ ఐరీ (15) కాస్త ఫర్వాలేదనిపించగా.. రోహిత్ పౌడేల్ (33 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చాడు.అగ్ర స్థానంలోనే అఫ్గాన్.. అఫ్గాన్ బౌలర్లలో ఫరీదూన్ దావూద్జాయ్, అబ్దుల్లా అహ్మద్జాయ్, అరబ్ గుల్ మొమంద్ తలా ఒక వికెట్ తీయగలిగారు. కాగా గ్రూప్-‘ఎ’ నుంచి అఫ్గాన్ ఇప్పటికి రెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. తొలుత జపాన్‌పై గెలిచిన డార్విష్ బృందం.. తాజాగా నేపాల్ చేతిలో ఓడిపోయింది. తద్వారా రెండు పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.మరోవైపు.. నేపాల్ తమ తొలి మ్యాచ్‌లోనే అఫ్గాన్‌ను ఓడించి బోణీ కొట్టింది. పాయింట్ల పరంగా నేపాల్ (+0.846)తో సమంగా ఉన్నప్పటికీ నెట్‌రన్‌రేటు పరంగా కాస్త వెనుబడి నేపాల్ (+0.842)పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. కాగా ఐసీసీ టీ20 టీమ్ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్తాన్ తొమ్మిదో స్థానంలో ఉండగా.. నేపాల్ పదహారో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: తొలి టెస్టులో ఆసీస్‌ను మట్టికరిపించిన భారత్ -
ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా
ఏషియన్ గేమ్స్-2026లో భారత పురుష, మహిళల కబడ్డీ జట్లు అదరగొడుతున్నాయి. మహిళల జట్టు ఇప్పటికే ఫైనల్‌కు దూసుకెళ్లగా.. తాజాగా మెన్స్ టీమ్ కూడా తుది పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం ఐచి వేదికగా జరిగిన సెమీఫైనల్లో థాయ్‌లాండ్‌పై 66-28 స్కోర్‌తో టీమిండియా ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.దీంతో ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. శనివారం జరగనున్న ఫైనల్ పోరులో భారత పురుషుల కబడ్డీ జట్టు తైవాన్ లేదా ఇరాన్‌తో తలపడే అవకాశముంది. అంతకుముందు భారత మహిళల కబడ్డీ జట్టు కూడా సత్తాచాటింది. సెమీఫైనల్లో నేపాల్‌ను 48-24 తేడాతో భారత్ చిత్తు చేసింది. కాగా టోర్నమెంట్లో మెన్స్, ఉమెన్స్ కబడ్డీ జట్లు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు.చదవండి: సనత్ జయసూర్య రికార్డ్ బ్రేక్.. ఇంగ్లండ్‌కు షాకిచ్చిన శ్రీలంక -
అదరగొట్టిన షూటర్లు.. భారత్ ఖాతాలో మరో స్వర్ణం
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత్ రెండో పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 6 వరోజు భారత షూటర్లు సంచలన ప్రదర్శన కనబరిచారు. శుక్రవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో కమల్జీత్ - సురుచి సింగ్ జోడీ అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్ పోరు ఆరంభం నుంచే కమల్జీత్ - సురుచి జోడీ ప్రత్యర్ధులకు చుక్కలు చూపించింది. మొత్తంగా ఈ భారత ద్వయం 484.6 పాయింట్లతో గోల్డ్‌మెడల్‌ను సొంతం చేసుకుంది. కమల్జీత్ - సురుచి జోడీ భారత్‌కు పసిడి పతకాన్ని అందించడమే కాకుండా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఈ విభాగం ఫైనల్లో అత్యధిక పాయింట్లు సాధించిన ఏషియన్ జంటగా వారు నిలిచారు. ఇంతకుముందు ఈ రికార్డు ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ముహమ్మద్ కమాలోవ్ - నిగినా సైద్కులోవా(481.3 పాయింట్లు) పేరిట ఉండేది. తాజా ప్రదర్శనతో వారిని కమల్జీత్ - సురుచి అధిగమించారు.మరోవైపు పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, నీరజ్ కుమార్, రుద్రాంక్ష్ పాటిల్ త్రయం రజత పతకాన్ని సొంతం చేసుకుంది. దీంతో భారత్ పతకాల సంఖ్య 19కు చేరింది.చదవండి: Asian Games: 'అంతా మోసం.. నా నుంచి గోల్డ్ మెడల్ లాగేసుకున్నారు' -
'అంతా మోసం.. నా నుంచి గోల్డ్ మెడల్ లాగేసుకున్నారు'
ఆసియా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు పతకం అందించిన సుచికా తరియాల్ స్వదేశానికి చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా సుచికా సంచలన వ్యాఖ్యలు చేసింది. విచిత్రమైన బరువు నిబంధనల కారణంగా తనకు దక్కాల్సిన స్వర్ణ పతకాన్ని లాక్కున్నారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది."నేను సెమీఫైనల్ బౌట్లో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నాను. కానీ రిఫరీలు ఆ మ్యాచ్‌ను 'డ్రా'గా ప్రకటించారు. నిబంధనల ప్రకారం డ్రా అయినప్పుడు మరో రౌండ్ పోటీ నిర్వహించాలి. కానీ అలా చేయకుండా అత్యంత విచిత్రమైన బరువు నిబంధనలను వర్తింపజేశారు. దీంతో నాకు దక్కాల్సిన స్వర్ణపతకం చేజారింది. వెయిట్-ఇన్ రూల్ ఒక చెత్త నిబంధన. నన్ను మరో రౌండ్ ఆడటానికి అనుమతించి ఉండాల్సింది. ఒకవేళ ఆ రౌండ్లో ఓడిపోయినా నేను దాన్ని అంగీకరించేదాన్ని. కానీ ఇలా అర్ధాంతరంగా ముగించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. అయితే ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో పతకం సాధించినందుకు సంతోషంగా ఉంది. కానీ నావరకు అయితే కచ్చితంగా స్వర్ణ పతకం గెలుస్తాననిపించింది. తీవ్రంగా శ్రమించి సెమీఫైనల్ స్థాయికి చేరుకున్నాను. అక్కడ ఇలా జరుగుతుందని అనుకోలేదు.అదనంగా కేటాయించిన ఆ ఒక్క నిమిషం రౌండ్లో కూడా నేను ఆమెపై ఆధిపత్యం ప్రదర్శించాను. ప్రత్యర్థి వెనక్కి పారిపోతుంటే నేను దాడి చేస్తూనే ఉన్నాను. ఈ క్రీడా సమాఖ్య సింగపూర్‌కు చెందినదే కావడం వల్ల, బహుశా ఆమెను గెలిపించాల్సి వచ్చిందేమో" అని పీటీఐతో మాట్లాడుతూ సుచికా ఆరోపించింది.అసలు ఏమి జరిగిందంటే?జపాన్ వేదికగా జరుగుతున్న ఏషియడ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ 60 కేజీల విభాగంలో సుచికా తరియాల్ కాంస్య పతకం సాధించింది. సింగపూర్‌కు చెందిన టీ హుయ్ హూన్తో జరిగిన సెమీఫైనల్లో సుచికా అద్భుత ప్రదర్శన చేసినా 'వెయిట్ రూల్' కారణంగా రజతం/పసిడి పోరుకు దూరమై కాంస్యంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేవలం 700 గ్రాముల బరువు వ్యత్యాసంతో ఫైనల్‌కు చేరే అవకాశాన్ని కోల్పోయింది.ఈ సెమీస్ పోరులో తొలి రౌండ్లో సుచికా కాస్త వెనకబడినప్పటికీ, రెండో రౌండ్లో అద్భుతమైన పునరాగమనం చేసింది. దీంతో మ్యాచ్ ఓవర్ టైమ్‌కు వెళ్లింది. ఓవర్ టైమ్ పూర్తయ్యాక కూడా ఫలితం తేలకపోవడంతో మ్యాచ్ 'డ్రా'గా ముగిసింది.అయితే మరో రౌండ్ నిర్వహించకుండా రిఫరీలు "వెయిట్-బేస్డ్ టైబ్రేకర్" నిబంధనను అమలు చేశారు. ఉదయం జరిగిన వెయిట్-ఇన్ లెక్కల ప్రకారం సుచికా కంటే సింగపూర్ అథ్లెట్ కేవలం 700 గ్రాములు తక్కువ బరువు ఉంది. ఆ నిబంధన ప్రకారమే తక్కువ బరువు ఉన్న సింగపూర్ క్రీడాకారిణిని విజేతగా ప్రకటించి ఫైనల్‌కు పంపారు. -
క్వార్టర్స్‌లో అనాహత్
భారత స్క్వాష్ స్టార్ అనాహత్ సింగ్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అనాహత్‌తో పాటు తన్వీ, అభయ్, వీర్ చొత్రాని కూడా క్వార్టర్స్‌లో అడుగు పెట్టారు. మిక్స్డ్ డబుల్స్‌లో జోష్నా చినప్ప–సెంథిల్ కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో అనాహత్ 11–4, 11–5, 11–7తో వై ఇయాన్ యోంగ్ (సింగపూర్) పై విజయం సాధించింది. మహిళా బాక్సర్ సాక్షి 51 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో 2–3తో బల్కిబెకోవా (కజకిస్తాన్) చేతిలో ఓడింది. పురుషుల 70 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత బాక్సర్ సుమిత్ గాయం కారణంగా తప్పుకున్నాడు. మహిళల జిమ్నాస్టిక్స్ వాల్ట్ ఫైనల్లో ప్రణతి నాయక్ ఆరో స్థానంలో నిలిచింది. -
రజత, కాంస్యాల పరుగు
ఆసియా క్రీడల్లో భారీగా అంచనాలు పెట్టుకున్న అథ్లెటిక్స్‌లో బరిలోకి దిగిన తొలి రోజే రెండు పతకాలతో భారత్ బోణీ చేసింది. గత ఆసియా క్రీడల్లో మన దేశానికి అత్యధికంగా 29 పతకాలు అందించిన అథ్లెటిక్స్‌లో గురువారం రజత, కాంస్యాలు దక్కాయి. 4x400 మీటర్ల మిక్స్డ్ రిలేలో వెండి దక్కగా, 10 వేల మీటర్ల పరుగులో సీమా కుమారికి కాంస్యం లభించింది. ఆసియా క్రీడల రోయింగ్ చరిత్రలో తొలిసారి భారత్‌కు సత్నామ్ సింగ్–సల్మాన్ ఖాన్ జోడీ పతకం అందించగా... షూటింగ్ స్కీట్‌లో కూడా అనంత్‌జీత్–పరీనాజ్ ద్వయం తొలిసారి కాంస్యం గెలుచుకుంది. వుషు ఫైనల్ ఫైట్‌లో ఓడిన రోషిబీనా దేవి చివరకు రజతంతో సంతృప్తి చెందింది. మొత్తంగా పోటీల ఐదో రోజు మన ఖాతాలో ఐదు పతకాలు చేరాయి. మరోవైపు బాక్సింగ్, జిమ్నాస్టిక్స్లలో నిరాశాజనక ఫలితాలు రాగా... హాకీ, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, స్క్వాష్ లలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ భారత్ దూసుకుపోతోంది. స్కీట్‌లో గురి కుదిరె...భారత్‌కు షూటింగ్లో మరో పతకం దక్కింది. స్కీట్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అనంత్‌జీత్ సింగ్–పరీనాజ్ ధలివాల్ ద్వయం మూడో స్థానంలో నిలిచి కంచు పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో భారత జోడీ 44 పాయింట్లు సాధించింది. బుధవారం కాంస్యాలు గెలిచిన పురుషుల, మహిళల స్కీట్ టీమ్ ఈవెంట్లలో భాగంగా ఉన్న అనంత్‌జీత్, పరీనాజ్లకు ఈ క్రీడల్లో ఇది రెండో పతకం కావడం విశేషం. మరోవైపు పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్లు కమల్జీత్ (9వ స్థానం), ఆకాశ్ భరద్వాజ్ (11వ స్థానం), కేదార్లింగ్ (35వ స్థానం) క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగారు. టీమ్ విభాగంలో భారత్ 1727 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. తాత, ముత్తాతల స్ఫూర్తితో...పంజాబ్‌లో పటియాలాకు చెందిన 24 ఏళ్ల పరీనాజ్ ధలివాల్ ఆసియా క్రీడల్లో వరుసగా రెండో రోజు పతకాన్ని గెలుచుకుంది. గత ఆసియా క్రీడల్లో భారత జట్టులో ఉన్నా... త్రుటిలో పతకం చేజారగా, ఇప్పుడు ఆమె తన కల నెరవేర్చుకుంది. మిత్రులు, సన్నిహితులంతా ఆతీ్మయంగా పరీ (దేవకన్య) అని పిలుచుకునే ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి షూటింగ్‌పై ఆసక్తి ఉంది. తన తాత, ముత్తాతలు ఇంట్లో గన్స్ ఉంచుకునేవారని, వారు జంతువులను వేటాడిన కథలను వింటూ వచ్చిన ఆమె కూడా అటు వైపు ఆకర్షితురాలైంది. తన ముత్తాత గుర్కీరత్పాల్ సింగ్ ధలివాల్ ఈ విషయంలో ఆమెకు స్ఫూర్తిగా నిలిచారు. అజ్మీర్‌లోని ప్రతిష్టాత్మక మాయో స్కూల్లోని చదువుతున్నప్పుడే 14 ఏళ్ల వయసులో పరీనాజ్ ఎయిర్ రైఫిల్ షూటింగ్ మొదలు పెట్టింది. తన ఆటకు పదును పెట్టుకున్న ఆమె జూనియర్, సీనియర్ విభాగాల్లో నిలకడగా రాణిస్తూ జాతీయ స్థాయికి ఎదిగింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత పరీనాజ్ ముందు రెండు ప్రత్యామ్నాయాలు కనిపించాయి. షూటింగ్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లడం ఆమె ముందున్నాయి. అయితే తనకు నచ్చి న పనే చేస్తానంటూ ఆమె చదువును పక్కన పెట్టి షూటింగ్ వైపు మొగ్గింది. 2019లో స్కీట్‌లో జాతీయ జూనియర్ చాంపియన్‌గా నిలిచిన ఆమె అదే ఏడాది ఆసియా షాట్‌గన్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన భారత జట్టులో సభ్యురాలిగా ఉంది. 2021 ప్రపంచకప్‌లోనూ పాల్గొన్న పరీనాజ్... తర్వాతి ఏడాది జూనియర్ ప్రపంచకప్‌లో కాంస్యం సాధించిన టీమ్‌లో ఉంది. ఇప్పుడు రెండు ఆసియా క్రీడల పతకాలు ఆమె స్థాయిని పెంచాయి. సత్తా చాటిన సీమా...మహిళల 10,000 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ సీమా కుమారి కాంస్యంతో మెరిసింది. సీమా 32 నిమిషాల 50.05 సెకన్లలో పరుగును పూర్తి చేసి మూడో స్థానంతో ముగించింది. ఈ ఈవెంట్లో భారత్‌కు 16 ఏళ్ల తర్వాత పతకం దక్కడం విశేషం. బహ్రెయిన్‌కు చెందిన యావి విన్‌ఫ్రెడ్ (32 నిమిషాల 39.18 సెకన్లు) స్వర్ణం గెలుచుకోగా, తనకా నొజొమి (జపాన్; 32 నిమిషాల 41.54 సెకన్లు) రజత పతకాన్ని అందుకుంది.రజతం నిలబెట్టుకున్నారు...నగోయా: ఆసియా క్రీడల అథ్లెటిక్స్‌లో భారత్‌కు మిక్స్డ్ టీమ్ తొలి రజతాన్ని అందించింది. 4్ఠ400 మీటర్ల మిక్స్డ్ రిలే ఈవెంట్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. మను తెక్కినలిల్, విశాల్ తెన్నరసు, విత్య రామ్రాజ్, పూవమ్మ రాజు సభ్యులుగా ఉన్న మన బృందం 3 నిమిషాల 14.46 సెకన్లలో పరుగు పూర్తి చేసింది. చివరి లెగ్‌లో విత్య దూసుకుపోయి భారత్‌కు పతకం అందించడంలో కీలకపాత్ర పోషించింది. 2023 ఆసియా క్రీడల్లో కూడా ఈ ఈవెంట్లో భారత్‌కు రజతమే దక్కింది. బహ్రెయిన్ (3 నిమిషాల 12.87 సెకన్లు) స్వర్ణ పతకం గెలుచుకోగా, వియత్నాం జట్టు (3 నిమిషాల 14.54 సెకన్లు) కాంస్యం గెలుచుకుంది.‘చంబా’కీ రాణిపేదరిక నేపథ్యం... 12 ఏళ్ల వయసులో తండ్రి చనిపోయాడు. వ్యవసాయం, పశువుల పెంపకంపై ఆధారపడిన కుటుంబం. ఇలాంటి స్థితిలో ఒక అమ్మాయి అథ్లెటిక్స్ గురించి ఆలోచించడం కష్టం. కానీ ఆటలపై ఉన్న ఆసక్తి సీమా కుమారిని ముందుకు తీసుకెళ్లాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లా రీటా గ్రామం ఆమె స్వస్థలం. స్పోర్ట్స్‌లో రాణించి జిల్లా స్థాయికి చేరడంతో ఆమె గురించి స్థానికులకు తెలిసింది. అప్పుడు ‘పరుగుల రాణి’ పీటీ ఉషతో పోలుస్తూ ‘చంబా’కీ రాణి అంటూ అందరూ పిలవడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) హాస్టల్లో సీటు లభించడం ఆమె అథ్లెటిక్స్ కెరీర్‌కు పునాది వేసింది. 14 ఏళ్ల వయసులో రాంచీలో జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకోవడంతో సీమా అందరి దృష్టిలో పడింది. భారత అథ్లెటిక్స్‌లో లాంగ్ డిస్టెన్స్ రన్నర్‌గా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులువు కాదు. ప్రాక్టీస్, క్రమశిక్షణ మాత్రమే కాకుండా ఫిట్నెస్ మన ఆటగాళ్ల స్థాయిని నిర్దేశిస్తాయి. మహిళల విభాగంలో అయితే మరింత కష్టంగా మారిపోతుంది. కానీ సీమా ఇక్కడే తన సత్తా చూపించింది. జూనియర్ స్థాయిలో 2 వేల మీటర్లు, 3 వేల మీటర్ల పరుగులో పలు జాతీయ రికార్డులు నెలకొల్పుతూ వచ్చి ఆపై సీనియర్ స్థాయిలో 5000 మీటర్లు, 10,000 మీటర్లకు అనుగుణంగా తన పరుగును మార్చుకుంది. 2017లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా యూత్ పోటీల్లో పాల్గొనేందుకు డబ్బులు లేకపోవడంతో ఆమె తల్లి తన ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి విత్‌డ్రా చేసి ఆమెను పంపించింది. ఇక్కడ సాధించిన కాంస్యం ఆమె భవిష్యత్తుకు పునాది వేసింది. 25 ఏళ్ల సీమా గత కొంత కాలంగా లాంగ్ డిస్టెన్స్ రన్నర్‌గా నిలకడగా రాణిస్తూ భారత అథ్లెటిక్స్‌లో తనకంటూ ప్రత్యేక చోటు సంపాదించుకుంది. 2026లో జాతీయ చాంపియన్‌గా నిలిచిన సీమా... ఈ ఏడాదే 5 వేల మీటర్లు, 10 వేల మీటర్ల పరుగులో తన అత్యుత్తమ టైమింగ్‌ను నమోదు చేసి ఆసియా క్రీడలకు సిద్ధమైంది. ఇప్పుడు గెలిచిన పతకం ఆమె కెరీర్‌ను మరో మెట్టు ఎక్కించింది. పతకం అందించిన రోయింగ్...గత నాలుగు ఆసియా క్రీడల నుంచి భారత్‌కు పతకాలు అందిస్తున్న రోయర్లు ఈసారి కూడా ఖాతా తెరిచారు. పురుషుల డబుల్స్ స్కల్స్ ఈవెంట్లో భారత్‌కు సత్నామ్ సింగ్–సల్మాన్ ఖాన్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. వీరిద్దరు రేస్‌ను 6 నిమిషాల 13.25 సెకన్లలో పూర్తి చేశారు. ఆసియా క్రీడల ఈ ఈవెంట్లో భారత్‌కు ఇదే మొదటి పతకం కావడం గమనార్హం. తొలి 1500 మీటర్ల వరకు రెండో స్థానంలో ఉన్న భారత జోడీ చివరి 500 మీటర్లలో వెనుకబడి మూడో స్థానానికి పరిమితమైంది. యి యుది–నీ యిడ్ (చైనా; 6 నిమిషాల 09.77 సెకన్లు) స్వర్ణం గెలుచుకోగా, మెక్రోబెక్–సోరిన్ (ఉజ్బెకిస్తాన్; 6 నిమిషాల 10.49 సెకన్లు) ద్వయం రజతాన్ని అందుకుంది. సత్నామ్ గత ఆసియా క్రీడల్లో కూడా కాంస్యం గెలిచాడు. ఫైనల్లో ఓటమితో...వుషులో భారత ప్లేయర్ రోషిబీనా దేవి వరుసగా మూడో ఏషియాడ్‌లోనూ పతకం గెలుచుకుంది. అయితే ఫైనల్‌కు చేరి స్వర్ణంపై గురి పెట్టిన ఆమెకు తుది మెట్టుపై నిరాశే ఎదురైంది. మహిళల 60 కేజీల ఫైనల్లో రోషిబీనా చైనాకు చెందిన జాంగ్ జియోయు చేతిలో 0–2తో పరాజయంపాలైంది. -
కూతురే...దేశానికి గర్వకారణం!
‘ఆడపిల్లవి...డిష్యుం డిష్యుం ఆటలు నీకెందుకమ్మా’ అనే తల్లిదండ్రులను చూస్తుంటాం.నవ్వుతూనే అన్నప్పటికీ ఆడబిడ్డల కలలకు పరిమితులు విధించే అనధికార ఆంక్ష అది.కానీ రోషిబినా దేవి తల్లిదండ్రులు అలా కాదు.మార్షల్ ఆర్ట్ సినిమాలు తెగచూస్తూ....డిష్యుం డిష్యుం ఫైట్లు చేసే కూతురిని చూసి...‘హీరో కంటే నువ్వే బాగా చేస్తున్నావు తల్లీ!’ అనేవారు. ఇది చాలదా... భవిష్యత్ కలకు బలమైన పునాది పడడానికి!తాజాగా...ఆసియా క్రీడల్లో ‘వుషు’ 60 కిలోల విభాగంలో మణిపూర్‌కు చెందిన రోషిబినా దేవి రజతం గెలుచుకుంది. 2018 ఆసియా క్రీడల్లో కాంస్యం, 2023 ఆసియా క్రీడల్లో రజతం గెల్చుకున్న రోషిబినా దేవి ముచ్చటగా మూడోసారి పతకం గెల్చుకొని ఆసియా గేమ్స్‌లో పతకాల హాట్రిక్ సాధించింది. ‘నా తల్లిదండ్రులు సర్వస్వం త్యాగం చేశారు’ అని తడి కళ్లతో చెబుతున్నప్పుడు, ఆ కళ్లలోనే గర్వరేఖ మెరుస్తుంది. రోషిబినా దేవి అంతరంగం ఆమె మాటల్లోనే...మాది మణిపూర్‌లోని ఓ పేద కుటుంబం. తల్లిదండ్రులు ఇద్దరూ రైతులు. నాకు చిన్నప్పటి నుంచీ మార్షల్ ఆర్ట్స్ సినిమాలు అంటే ఇష్టం. ముఖ్యంగా జాకీచాన్ సినిమాలు! మార్షల్ ఆర్ట్స్‌పై ఇష్టంతోనే నేను మార్షల్ ఆర్ట్ ‘వుషు’పై ఆసక్తి పెంచుకున్నాను. తొమ్మిదేళ్ల వయసులో ఈ ఆటలోకి వచ్చాను. ‘వుషు’ గురించి నా తల్లిదండ్రులకు బొత్తిగా తెలియదు.‘మార్షల్ ఆర్ట్స్ సినిమాలు అమ్మాయిలకెందుకు?’ అని గానీ ‘వుషు ఆట నీకెందుకు?’ అనిగానీ వారు ఎప్పుడూ అనలేదు. నేను ఏది చేసినా వారికి అపురూపమే. తల్లిదండ్రుల ప్రోత్సాహమే నాకు కొండంత అండగా నిలిచింది. నా సోదరి నన్ను స్పోర్ట్ ఆథారిటీ ఇండియా(ఎస్ఎఐ)కి పరిచయం చేసింది. 2014లో నా కోచ్ మైబాబ్ ప్రేమ్‌కుమార్‌తో నా ప్రయాణం ప్రారంభమైంది.సాధన ఒక్కటే సరిపోదు...కోచ్ పర్యవేక్షణలో ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడుగంటలు ‘వుష్’ ప్రాక్టీస్ చేసేదాన్ని. ఆటలో రాణించాలంటే సాధన ఒక్కటే సరిపోదు. పట్టుదల, అంకితభావం కూడా తోడు ఉండాలి. శిక్షణ లేనప్పుడు... సంగీతం వింటాను. ఫుట్‌బాల్ ఆడుతాను. వీడియో గేమ్స్ చూస్తాను. ఇలాంటి ఇష్టమైన పనుల ద్వారా నాలో సానుకూల దృక్పథాన్ని పెంచుకుంటాను.ఈ క్రెడిట్ వారికే...ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటిMీ నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరూ నా కోసం సర్వస్వం త్యాగం చేశారు. నాకు ఏదో ఒక రకంగా సహాయపడేవారు. నాకు ధైర్యం చెప్పేవారు. వారి సహకారమే లేకపోతే నేను ఈ స్థితిలో ఉండేదాన్నే కాదు.,,లక్ష్యాన్ని సాధించాలనుకునేవారికి నేను చెప్పేదేమిటంటే...మనం ఏ పని చేసినా అంకితభావంతో, కఠోర శ్రమతో చేయాలి. మనల్ని మనం నమ్ముకోవాలి. నిరాశను దరి చేరనీయకుండా ఆత్మవిశ్వాసంతో... సానుకూల దృక్పథంతో ముందుకెళ్లాలి.ఒక కూతురు మణిపూర్ పొలాల నుంచి లేచి ఆసియా గేమ్స్‌లో పతకాల హాట్రిక్ కొట్టింది. మరో కూతురు పదేళ్లకే స్కూబా సూట్ వేసుకుని నాన్న చేయి పట్టుకుని సముద్ర గర్భంలోకి దూకి ‘భయం అంటే ఏంటో’ తెలియని తరానికి ప్రతినిధి అని నిరూపించింది. ఇంకో కూతురు బుల్లెట్లకు ఎదురొడ్డి దేశాన్ని కాపాడి తన ఇద్దరు కూతుళ్లతో పాటు కోట్లాది ఆడబిడ్డలకు ‘పులిబిడ్డ’ అయింది. ఈ ముగ్గురి వెనుకా ఉన్నది ఒక్కరే.... ‘నా కూతురు ఏదైనా చేయగలదు’ అని నమ్మిన తల్లిదండ్రులు. నమ్మి చూడండి... ప్రోత్సహించి చూడండి... ప్రతి కూతురూ ఒక ఆశ... ఆశ్చర్యం... అద్భుతం. అంతేనా? ఈ దేశానికే గర్వకారణం.– యాకుబ్ పాషా -
4X400 మిక్స్డ్ రిలేలో భారత్‌కు రజతం
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల పతకాల వేట కొనసాగుతోంది. తాజాగా మహిళల 10,000 మీటర్ల పరుగు పందెంలో భారత స్ప్రింటర్ సీమా కుమారి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. రేసును 32:50.05 నిమిషాల్లో ముగించిన సీమా మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్‌ను తన ఖాతాలో వేసుకుంది.ఈ విభాగంలో బహ్రెయిన్‌కు చెందిన విన్‌ఫ్రెడ్ యావి 32:39.18 సమయంతో ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణ పతకం సాధించగా.. జపాన్ అథ్లెట్ నోజోమి తనకా (32:41.54) రజత పతకాన్ని గెలుచుకుంది. మరోవైపు మిక్స్డ్ 4x400 మీటర్ల రిలే రేసులో భారత బృందం రజత పతకాన్ని కైవసం చేసుకుంది. రేసు ప్రారంభంలో భారత్ కాస్త వెనుకబడినప్పటికీ.. చివరిలో విశాల్ తెన్నరసు, విత్య రామ్‌రాజ్‌లు అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇవ్వడంతో 3:14.46 నిమిషాల్లో పూర్తి చేసి సిల్వర్ మెడల్‌ను దక్కించుకుంది. ఈ రజతంతో కలిపి ప్రస్తుతం ఆసియా క్రీడల్లో భారత్ మొత్తం పతకాల సంఖ్య 17కు చేరింది. -
IND vs PAK: స్వర్ణం గెలవడానికి అన్ని జట్లను ఓడిస్తాం: పాక్ కెప్టెన్
జపాన్ వేదికగా ఆసియా క్రీడలు-2026లో పురుషుల టీ20 క్రికెట్ టోర్నమెంట్‌కు గురువారం (సెప్టెంబరు 24) తెరలేచింది. గ్రూప్ దశలో భాగంగా తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ జపాన్‌పై 48 పరుగుల తేడాతో గెలిచి బోణీ కొట్టింది. రెండో మ్యాచ్‌లో హాంకాంగ్‌ను మలేషియా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది.నేరుగా క్వార్టర్ ఫైనల్కుఇదిలా ఉంటే.. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా టీమిండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ నేరుగా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాయి. ఈ నేపథ్యంలో చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే, క్వార్టర్ ఫైనల్ లేదంటే సెమీస్‌లో ఈ దాయాదుల పోరును చూసే అవకాశం లేదు. టోర్నీ విధానం ప్రకారం భారత్- పాక్ రెండు వేర్వేరు పూల్స్‌లో ఉన్నాయి. కాబట్టి ఫైనల్ లేదంటే.. కాంస్య పతక పోరు కోసం జరిగే మ్యాచ్‌లలో మాత్రమే చిరకాల ప్రత్యర్థులు పోటీ పడే అవకాశం ఉంది.ప్రతీ మ్యాచ్ మాకు ముఖ్యమైనదేఈ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సాహిబ్జాదా ఫర్హాన్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘మా దృష్టి కేవలం టీమిండియాతో మ్యాచ్‌పై మాత్రమే లేదు. టోర్నమెంట్లో ప్రతీ మ్యాచ్ మాకు ముఖ్యమైనదే. ప్రతీ మ్యాచ్‌లోనూ గెలవడానికి మా శాయశక్తులా కృషి చేస్తాము.స్వర్ణం గెలవడానికి అన్ని జట్లను ఓడిస్తాంకేవలం టీమిండియా మ్యాచ్ కోసం మాత్రమే మేము సన్నద్ధం కావడం లేదు. ముందుగా చెప్పినట్లు ప్రతీ మ్యాచ్ మాకు కీలకమే. ఎవరిని ఓడించాలనుకుంటున్నాం.. ఎవరిపై గెలవాలనుకుంటున్నాం అన్న విషయాల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. స్వర్ణ పతకం సాధించడమే లక్ష్యం. అందుకు అన్ని జట్లను ఓడించాల్సి ఉంటుంది’’ అని సాహిబ్జాదా ఫర్హాన్ చెప్పుకొచ్చాడు. కాగా ఇప్పటి వరకు టీమిండియా- పాకిస్తాన్ 17 టీ20 మ్యాచ్‌లలో తలపడగా.. భారత్ పద్నాలుగుసార్లు గెలుపొందింది. కాగా గత ఆసియా క్రీడల ఎడిషన్‌లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో భారత్ పసిడి పతకం గెలిచింది.చదవండి: విండీస్‌తో తొలి వన్డే.. చరిత్రకు అడుగుదూరంలో కోహ్లి -
T20I: చరిత్ర సృష్టించిన భారత సంతతి బ్యాటర్
ఆసియా క్రీడలు-2026 పురుషుల టీ20 క్రికెట్ టోర్నమెంట్లో మలేషియా బోణీ కొట్టింది. హాంకాంగ్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి పాయింట్ల ఖాతా తెరిచింది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా మలేషియా వన్‌డౌన్ బ్యాటర్, భారత సంతతికి చెందిన విరణ్‌దీప్ సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.81 పరుగులకే ఖేల్ ఖతంజపాన్లోని నిశిన్ వేదికగా కరోగి స్పోర్ట్స్ పార్కులో టాస్ గెలిచిన హాంకాంగ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మలేషియా బౌలర్ల ధాటికి తాళలేక నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 81 పరుగులే చేయగలిగింది.ఓపెనర్ నిజాకత్ ఖాన్ (19), టెయిలెండర్ హసన్ ఖాన్ మొహమ్మద్ (13*) డబుల్ డిజిట్ స్కోర్లు దాటగా.. శివ్ మాథూర్ 29 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. మలేషియా బౌలర్లలో పవన్‌దీప్ సింగ్, ముహమ్మద్ ఆమిర్ ఆజిమ్ చెరో మూడు వికెట్లు తీయగా.. కెప్టెన్ సయ్యద్ అజీజ్ ముబారక్, ముహమ్మద్ వఫీక్, విరణ్‌దీప్ సింగ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.12 ఓవర్లలోనే టార్గెట్ ఉఫ్ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన మలేషియా 12 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 84 పరుగులు సాధించింది. తద్వారా హాంకాంగ్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఓపెనర్లు ముహమ్మద్ హజీక్ ఐమన్ (6), అజీజ్ ముబారక్ (6) విఫలం కాగా.. విరణ్‌దీప్ సింగ్ 32, ముహమ్మద్ సైహాదత్ 36 పరుగులతో అజేయంగా నిలిచి మలేషియా గెలుపును ఖరారు చేశారు.అసోసియేట్ జట్ల తరఫున సరికొత్త చరిత్రకాగా ఈ మ్యాచ్‌లో 32 బంతుల్లో 32 పరుగులు చేసిన విరణ్‌దీప్ సింగ్.. సరికొత్త చరిత్ర లిఖించాడు. అసోసియేట్ జట్ల తరఫున అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 3500 పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా రికార్డు సాధించాడు.మలేషియా తరఫున 2019లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విరణ్‌దీప్ సింగ్ ఇప్పటికి 126 మ్యాచ్‌లు ఆడి.. 3513 పరుగులు సాధించాడు. ఇందులో ఓ శతకం, 24 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక విరణ్‌దీప్ సింగ్ అన్న పవన్‌దీప్ సింగ్ కూడా మలేషియా తరఫున రాణిస్తున్నాడు. వీరిద్దరు ప్రస్తుతం ఆసియా క్రీడలతో బిజీగా ఉన్నారు.అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు (ఓవరాల్‌గా)👉బాబర్ ఆజం (పాకిస్తాన్)- ఇప్పటికి 4596 పరుగులు👉జోస్ బట్లర్ (ఇంగ్లండ్)- ఇప్పటికి 4384 పరుగులు👉రోహిత్ శర్మ (ఇండియా)- 4231 పరుగులు👉విరాట్ కోహ్లి (ఇండియా)- 4188 పరుగులు👉పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్)- ఇప్పటికి 3895 పరుగులు👉మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్)- 3531 పరుగులు👉విరణ్‌దీప్ సింగ్ (మలేషియా)- ఇప్పటికి 3515 పరుగులు.చదవండి: విండీస్‌తో తొలి వన్డే.. చరిత్రకు అడుగుదూరంలో కోహ్లి -
పాకిస్తాన్ కెప్టెన్‌గా డేంజరస్ ప్లేయర్.. ఎవరంటే?
పాకిస్తాన్ టీ20 కెప్టెన్ సల్మాన్ అలీ అఘాపై వేటు వేసేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు సిద్దమైనట్లు తెలుస్తోంది. అతడి స్దానంలో విధ్వంసకర ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్‌ను ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా నియమించాలని పీసీబీ యోచిస్తున్నట్లు సమాచారం.వచ్చే నెలలో శ్రీలంకతో సొంతగడ్డపై జరగనున్న టీ20 సిరీస్‌కు ముందే ఫర్హాన్ నియామకంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. కాగా ఆసియా క్రీడల్లోనూ పాకిస్తాన్ జట్టును నడిపించేందుకు ఫర్హాన్ ఇప్పటికే సిద్ధమయ్యాడు. కాగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2028 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే కెప్టెన్సీ మార్పుతో పాటు తమ టీ20 జట్టులో కూడా యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలని పీసీబీ భావిస్తుందంట.కాగా సల్మాన్ అఘా నాయకత్వంలో పాకిస్తాన్ 52 టీ20 మ్యాచ్‌లలో 32 విజయాలు సాధించినప్పటికీ.. అతడి బ్యాటింగ్ ప్రదర్శన మాత్రం దారుణంగా పడిపోయింది. గతేడాది ఆసియాకప్‌తో పాటు టీ20 ప్రపంచకప్-2026లోనూ ఘోరంగా విఫలమయ్యాడు.ఈ క్రమంలోనే అతడిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి, కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగించాలని పీసీబీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరోవైపు ఫర్హాన్ ప్రస్తుతం పాక్ టీ20 జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతుండటంతో పాటు, డొమెస్టిక్ క్రికెట్లో కెప్టెన్‌గా మంచి అనుభవం కలిగి ఉన్నాడు. దీంతో జాతీయ జట్టు పగ్గాలు అతడికి అప్పగించడం సరైన నిర్ణయమని పీసీబీ పెద్దలు భావిస్తున్నరంట.చదవండి: IND vs AUS: అర్ధ శతకంతో మెరిసిన కెప్టెన్.. భారీ ఆధిక్యంలో భారత్ -
కొనసాగుతున్న టీమిండియా జైత్రయాత్ర
ఏషియన్ గేమ్స్ పురుషుల హాకీలో భారత జట్టు అజేయ జైత్రయాత్ర కొనసాగుతోంది. దక్షిణ కొరియాతో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో భారత్ 8-2తో గెలిచి పూల్-ఏలో అగ్రస్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. ప్రస్తుత క్రీడల్లో భారత్‌కు వరుసగా ఇది మూడో గెలుపు.భారత్ తరఫున దిల్‌ప్రీత్ సింగ్, అభిషేక్ చెరో రెండు గోల్స్ చేశారు. షిలానంద్ లక్రా, సుఖ్జీత్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, రాజిందర్ సింగ్ ఒక్కో గోల్ సాధించారు. ఆసియా గేమ్స్ చరిత్రలో దక్షిణ కొరియాపై భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. తదుపరి మ్యాచ్‌లో భారత్ ఆతిథ్య జపాన్‌తో (శనివారం) తలపడనుంది.ఇదిలా ఉంటే, ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు 15 పతకాలు ఖాతాలో వేసుకుంది. ఇవాళ వుషు మహిళల 60 కేజీల విభాగంలో రోషిబినా దేవి రజత పతకం సాధించింది. ఆతర్వాత డబుల్ స్కల్స్ రోయింగ్ విభాగంలో సత్నామ్ సింగ్, సల్మాన్ ఖాన్ కాంస్య పతకం గెలిచారు. స్కీట్ షూటింగ్ మిక్స్డ్ పెయిర్ ఈవెంట్లో భారత షూటర్లు అనంత్‌జీత్ సింగ్ నరూకా, పరినాజ్ ధలీవాల్ కాంస్యం సొంతం చేసుకున్నారు.ఇదీ చదవండి: పదిహేనుకు చేరిన పతకాల సంఖ్య -
పదిహేనుకు చేరిన పతకాల సంఖ్య
జపాన్ వేదికగా ఆసియా క్రీడలు-2026 టోర్నమెంట్లో భారత్ ఖాతాలో మరో రెండు కాంస్యాలు చేరాయి. తద్వారా పతకాల సంఖ్య పదిహేనుకు చేరింది. కాగా గురువారం తొలుత వుషు అథ్లెట్ రోషిబినా దేవి భారత్‌కు పతకాన్ని అందించింది.రోషిబినాకు రజతంమహిళల అరవై కిలోల విభాగం ఫైనల్లో చైనాకు చెందిన జియాయు ఝాంగ్‌తో తలపడ్డ రోషిబినా.. దురదృష్టవశాత్తూ 2-0 తేడాతో ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఆమె రజత పతకం సాధించింది. కాగా ఆఖరి నిమిషంలో రోషిబినా ఆసియా క్రీడల బృందంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.కాగా దివ్యాంశి చౌదరి స్థానంలో ఆమె వచ్చి చేరగా.. దివ్యాంశి తీవ్రమైన ఆరోపణలు చేసింది. అయితే, ఆఖరికి ఆమె వెనక్కి తగ్గగా.. రోషిబినా పతకంతో మెరిసి తన ఎంపిక సరైందేనని నిరూపించుకుంది. మరో రెండు కాంస్యాలుఇక డబుల్ స్కల్స్ రోయింగ్ విభాగంలో సత్నామ్ సింగ్, సల్మాన్ ఖాన్ కాంస్య పతకం గెలిచారు. మరోవైపు.. స్కీట్ షూటింగ్ మిక్స్డ్ పెయిర్ ఈవెంట్లో భారత షూటర్లు అనంత్‌జీత్ సింగ్ నరూకా, పరినాజ్ ధలీవాల్ కాంస్యం సొంతం చేసుకున్నారు.ఈ క్రమంలో ఆసియా క్రీడల తాజా ఎడిషన్‌లో పతకాల సంఖ్య పదిహేనుకు చేరింది. ఇప్పటి వరకు భారత్‌కు మహిళల క్రికెట్లో స్వర్ణంతో పాటు.. ఆరు రజతాలు, ఎనిమిది కాంస్య పతకాలు లభించాయి. పట్టికలో భారత్ ప్రస్తుతానికి పద్నాలుగో స్థానంలో నిలిచింది.చదవండి: చైనా చేతిలో ఓటమి.. కాంస్యంతో సరిపెట్టుకున్న భారత జట్టు -
ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రికార్డు బ్రేకింగ్ ప్రదర్శన
ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఘనంగా బోణీ కొట్టింది. ఆతిథ్య జపాన్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆఫ్ఘన్ గెలుపులో యువ లెగ్‌స్పిన్నర్ అరబ్ గుల్ మొమంద్ కీలక పాత్ర పోషించాడు.అంతర్జాతీయ అరంగేట్రంలోనే రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో గుల్ రెచ్చిపోయాడు. 4 ఓవర్లలో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 19 డాట్ బాల్స్ సహా రెండు మెయిడిన్ ఓవర్లు ఉండటం విశేషం.జపాన్ జట్టుపై ఏ అంతర్జాతీయ క్రికెటర్‌కు అయినా ఇవే అత్యుత్తమ గణాంకాలు. గతంలో ఈ రికార్డు ఇండోనేషియాకు చెందిన కేతుత్ ఆర్టవాన్ (4/12) పేరిట ఉండేది. తాజాగా గుల్ అరంగేట్రం మ్యాచ్‌లోనే ఆ రికార్డు బద్దలు కొట్టాడు.జపాన్‌పై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు* అరబ్ గుల్ మొమంద్ – 4/8* కేతుత్ ఆర్టవాన్ – 4/12* టియాన్ సేన్ కున్ – 4/12* ఎన్ నిపికో – 4/17* అలీ దావూద్ – 4/19మ్యాచ్ విషయానికొస్తే.. గుల్‌తో పాటు ఖరోటి (3.3-0-19-3), అబ్దుల్లా అహ్మద్జాయ్ (3-0-13-2) రెచ్చిపోవడంతో జపాన్ 19.3 ఓవర్లలో 81 పరుగులకే ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. అంతర్జాతీయ టీ20ల్లో జపాన్‌కు ఇది రెండో అత్యల్ప స్కోర్.ఎవరీ గుల్..?21 ఏళ్ల అరబ్ గుల్ మొమంద్ 2024 అండర్-19 ప్రపంచకప్‌లో క్రికెట్ వర్గాల దృష్టిని ఆకర్షించాడు. అనంతరం ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోనూ సత్తా చాటాడు. ఆఫ్ఘనిస్తాన్-ఏ తరఫున అరంగేట్ర మ్యాచ్‌లోనే ఏడు వికెట్లు తీసిన గుల్.. ఐర్లాండ్-ఏతో జరిగిన మరో మ్యాచ్‌లో ఏకంగా 10 వికెట్లు పడగొట్టాడు.ఈ ప్రదర్శనల తర్వాత గుల్కు ఫ్రాంచైజీ క్రికెట్లోనూ అవకాశాలు లభించాయి. ఎంఐ ఎమిరేట్స్, బార్బడోస్ రాయల్స్ వంటి జట్లకు సంబంధించిన స్క్వాడ్లలో అతడు చోటు దక్కించుకున్నాడు.ఇదీ చదవండి: మితిమీరిన క్రికెట్.. జనాలకు బోర్ కొట్టదా..? -
బోణీ కొట్టిన ఆఫ్ఘనిస్తాన్.. జపాన్ మరో పోరాటం
ఏషియన్ గేమ్స్ పురుషుల క్రికెట్ ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. ఆరంభ మ్యాచ్‌లో పసికూన, ఆతిథ్య జపాన్‌పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓడినా జపాన్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. దీనికి ముందు టీమిండియాతో జరిగిన చారిత్రక మ్యాచ్‌లోనూ జపాన్ బౌలర్లు సత్తా చాటారు.ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లోనూ అదే తరహా ప్రదర్శన చేసిన జపాన్ బౌలర్లు తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ను ఇబ్బందిపెట్టారు. తమకంటే చాలా మెరుగైన ఆఫ్ఘనిస్తాన్‌ను జపాన్ కేవలం 129 పరుగులకే (20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. జపాన్ బౌలర్లు వికెట్లు పెద్దగా తీయలేకపోయినా పరుగులు నియంత్రించారు. షోమా స్లేటర్, ఇబ్రహాం తలో 2, బెంజమిన్, థామస్ చెరో వికెట్ తీశారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో మొహమ్మద్ అక్రమ్ (34), కరీం జనత్ (21), కెప్టెన్ దర్విష్ రసూలీ (29) రెండంకెల స్కోర్లు చేయగా..ఆఖర్లో మొహమ్మద్ ఇషాక్ (25 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.అనంతరం బ్యాటింగ్‌లో మాత్రం జపాన్ చేతులెత్తేసింది. ముగ్గురు మినహా ఎవరూ కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. గుల్ మొమంద్ (4-2-8-4), ఖరోటి (3.3-0-19-3), అబ్దుల్లా అహ్మద్జాయ్ (3-0-13-2) ధాటికి జపాన్ 19.3 ఓవర్లలో 81 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇదీ చదవండి: మితిమీరిన క్రికెట్.. జనాలకు బోర్ కొట్టదా..? -
మితిమీరిన క్రికెట్.. జనాలకు బోర్ కొట్టదా..?
క్రికెట్.. ఈ క్రీడ భారతీయులకు ఓ ఎమోషన్. టీమిండియా మ్యాచ్ ఉందంటే చాలు, జనాలు పనులు పక్కనపెట్టి మరీ టీవీలకు అతుక్కుపోతారు. వీలైతే నేరుగా మ్యాచ్ చూసేందుకు స్టేడియాలకు క్యూ కడతారు. భారత్ గెలిస్తే పండుగ చేసుకుంటారు. ఓడితే నిరాశ చెందుతారు. గెలిచినా, ఓడినా గల్లీ నుంచి ఢిల్లీ దాకా డిబేట్లు పెడుతుంటారు. అయితే ప్రస్తుతం ఈ డిబేట్లలో ఓ ఆసక్తికర అంశం చేరింది. అదే.. 'మితిమీరిన క్రికెట్'.ఇటీవలికాలంలో భారత క్రికెట్ జట్లు విపరీతంగా మ్యాచ్‌లు ఆడేస్తున్నాయి. ఆ స్థాయి, ఈ విభాగం అని ప్రతి రోజూ ఏదో ఒక మ్యాచ్ జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఒకే రోజు మూడు వేర్వేరు విభాగాలు, స్థాయిలకు సంబంధించి ఏకంగా మూడు మ్యాచ్‌లు జరిగాయి. భారత-ఏ జట్టు, భారత మహిళల-ఏ జట్టు, భారత అండర్-19 జట్టు.. ఇలా మూడు జట్లు ఒకే రోజు, ఒకే ప్రత్యర్దితో (ఆస్ట్రేలియా) మ్యాచ్‌లు ఆడాయి.ఇది చూసి అభిమానులు తెగ తికమకపడ్డారు. ఎక్కడ ఏ జట్టు ఆడుతుందో అర్దం కాక జట్టు పీక్కున్నారు. ఒక్కప్పుడు భారత క్రికెట్ జట్టు మ్యాచ్ ఆడుతుందంటే ఓ క్లారిటీ ఉండేది. కానీ, ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. ఏ ఆటగాడు ఏ జట్టులో ఉంటాడో ఎవరికీ తెలీదు.పురుషుల క్రికెట్ వరకు తీసుకుంటే.. భారత్‌కు ఒక్క జట్టు చాలా తక్కువైపోతుంది. అందుకే టీ20లకు ఒకటి, వన్డేలకు ఒకటి, టెస్ట్‌లకు మరో జట్టు ఉంటుంది. ఇవి కాకుండా భారత-ఏ జట్టు, భారత అండర్ 19, 23 విభాగాల జట్లు.. ఇలా విభాగానికి ఓ జట్టు ఉంది. ఈ జట్లన్నీ ఏడాది పొడవునా ఏదో ఒక మ్యాచ్ ఆడుతూనే ఉంటాయి. ఇవి కావని దేశవాలీ క్రికెట్, ఐపీఎల్, స్థానిక లీగ్‌లతో ఆటగాళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక్కడి వరకు సమస్య ఆటగాళ్ల వరకే ఉంది. మితిమీరిన క్రికెట్ వల్ల ఇప్పుడు, అభిమానులూ ఇబ్బంది పడుతున్నారు. ఆడేందుకు ఆటగాళ్లకు అలసట రాకపోయినా, చూసేందుకు మాత్రం అభిమానులకు బోర్ కొడుతుంది.ఈ పరిస్థితి కేవలం భారత క్రికెట్ వరకు మాత్రమే. ప్రపంచవ్యాప్త క్రికెట్‌ను తీసుకుంటే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఏడాది పొడవునా అంతర్జాతీయ మ్యాచ్‌లు, దేశవాలీ మ్యాచ్‌లు, ప్రైవేట్ టీ20 లీగ్‌లతో ఆటగాళ్లకు, అభిమానులకు క్షణం తీరిక లేకుండా పోతుంది. ఈ మితిమీరిన క్రికెట్ ఆడేందుకు ఎలా ఉన్నా, చూసేందుకు మాత్రం ఎబ్బేట్టుగా మారిపోతుంది.ఈ పరిస్థితి వల్ల కొందరు అభిమానులు క్రికెట్ చూడటమే మానేశారు. ప్రస్తుతం క్రికెట్ బోర్ కొట్టే దశ నుంచి విరక్తి వచ్చే దశకు రూపాంతరం చెందుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే అతి త్వరలో జనాలు క్రికెట్‌ను పూర్తిగా విస్మరించే ప్రమాదం ఉంది. కాబట్టి అంతర్జాతీయ షెడ్యూల్, ప్రైవేట్ లీగ్‌ల సంఖ్య తగ్గించి, మ్యాచ్‌లను పరిమితం చేస్తే క్రికెట్ బ్రతుకుతుంది. ఇప్పటికే ఆటలో నాణ్యత తగ్గిపోయి చాలామంది క్రికెట్ చూడటం మానేశారు. ఇదే కొనసాగితే మిగతా జనాలు కూడా కాలక్రమేనా ఆటకు దూరమవుతారు.ఇదీ చదవండి: టీమిండియాను ఫాలో అవ్వండి.. పాక్ జట్టుకు సూచన -
Asian Games 2026: రోషిబినా దేవి హ్యాట్రిక్
ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. ఐదో రోజు (సెప్టెంబర్ 24) పోటీల్లో భారత వుషూ స్టార్ నౌరెమ్ రోషిబినా దేవి రజత పతకాన్ని సాధించింది. మహిళల 60 కేజీల విభాగం ఫైనల్లో చైనాకు చెందిన జియాయు ఝాంగ్ చేతిలో ఓటమి పాలైనప్పటికీ.. వరుసగా మూడో ఆసియా గేమ్స్‌లోనూ పతకం సాధించి అరుదైన ఘనతను అందుకుంది.రోయింగ్‌లో రజతంమరోవైపు, పురుషుల డబుల్ స్కల్స్ రోయింగ్ విభాగంలో సత్నామ్ సింగ్, సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.నాలుగో రోజు వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు చాలా కాలం తర్వాత పతకం (మీరాబాయ్ చాను) లభించగా.. అదే జోరును ఐదో రోజూ కొనసాగించాలని భారత అథ్లెట్లు పట్టుదలతో ఉన్నారు. ఇవాల్టి నుంచి అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం కానుండగా.. షూటింగ్, హాకీ, కబడ్డీ ఈవెంట్లలోనూ భారత క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు.ఇప్పటివరకు భారత్ మహిళల క్రికెట్లో స్వర్ణం, 5 రజతాలు, 7 కాంస్య పతకాలతో (మొత్తం 13) పట్టికలో 13వ స్థానంలో కొనసాగుతుంది. చైనా మొత్తం 80 పతకాలతో పట్టికలో అగ్రస్థానంలో దూసుకుపోతుంది.ఇదీ చదవండి: మీరా కల నెరవేరె... -
దీపిక 9 గోల్స్...
ఆసియా క్రీడల మహిళల హాకీ ఈవెంట్లో భారత జట్టు ఒకవైపు గోల్స్ వర్షం కురిపిస్తూ... మరోవైపు తమ విజయపరంపర కొనసాగిస్తోంది. పూల్ ‘బి’లో భాగంగా బుధవారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు 20–1 గోల్స్ తేడాతో థాయ్‌లాండ్‌ను చిత్తుగా ఓడించింది. భారత స్టార్ ‘డ్రాగ్ ఫ్లికర్’ దీపిక సెహ్రావత్ ఈసారి 9 గోల్స్‌తో చెలరేగిపోయింది. ఉజ్బెకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో 8 గోల్స్ కొట్టిన దీపిక... ఇండోనేసియాతో మ్యాచ్‌లో 3 గోల్స్ సాధించింది. థాయ్‌లాండ్‌తో మ్యాచ్‌లో దీపిక చేసిన 9 గోల్స్ (2వ, 8వ, 9వ, 24వ, 33వ, 36వ, 39వ, 51వ, 57వ ని.లో) పెనాల్టీ కార్నర్ల ద్వారానే రావడం విశేషం. ఈ క్రమంలో దీపిక ఒకే మ్యాచ్‌లో అత్యధిక గోల్స్ చేసిన మహిళా హాకీ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. 8 గోల్స్‌తో తన పేరిటే ఉన్న రికార్డును దీపిక సవరించింది. నవ్‌నీత్ కౌర్ (4వ, 29వ, 35వ, 51వ ని.లో) నాలుగు గోల్స్... రుతుజా (10వ, 11వ, 47వ ని.లో మూడు గోల్స్ చేశారు. నేహా (19వ ని.లో), లాల్రెమ్సియామి (26వ ని.లో), సాక్షి (29వ ని.లో), సలీమా టెటె (45వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. మ్యాచ్ మొత్తంలో భారత్‌కు 23 పెనాల్టీ కార్నర్లు రాగా... పదింటిని గోల్స్‌గా మలిచింది. శుక్రవారం జరిగే నాలుగో లీగ్ మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ ఆడుతుంది. -
మీరా కల నెరవేరె...
ఒలింపిక్స్ స్వర్ణం, పసిడి సహా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మూడు మెడల్స్, కామన్వెల్త్ క్రీడల్లో మూడు బంగారు పతకాలు... వీటికి తోడు ఆసియా చాంపియన్ షిప్, కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లలో కూడా మరో ఆరు పతకాలు... కానీ ఇన్నేళ్లపాటు ఆసియా క్రీడల పతకం మాత్రం ఆమె మెడను వరించలేదు... కానీ ఇప్పుడు ఆ లోటు కూడా తీరిపోయింది. భారత టాప్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ఆసియా క్రీడల్లో రజత పతకంతో తొలిసారి ఈ పోటీల్లో పోడియంపై నిలిచి సంబరం చేసుకుంది. ఏషియాడ్‌లో పోటీల నాలుగో రోజు బుధవారం భారత్ మొత్తం ఐదు పతకాలను ఖాతాలో వేసుకుంది. షూటింగ్ పురుషుల, మహిళల స్కీట్ టీమ్ ఈవెంట్లలో కాంస్యాలు దక్కగా... పురుషుల బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్ సెమీస్‌లో ఓడిన భారత బృందం కాంస్యంతో సరిపెట్టుకుంది. సాఫ్ట్ టెన్నిస్‌లో తొలిసారి కాంస్యం రూపంలో పతకం లభించగా... కచ్చితంగా పతకాలు సాధిస్తారని భావించిన మహిళా పిస్టల్ షూటర్ల వైఫల్యం భారత బృందాన్ని షాక్‌కు గురి చేసింది. నగోయా: భారత టాప్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను కల నెరవేరింది. తన అద్భుత కెరీర్లో లోటుగా ఉన్న ఆసియా క్రీడల పతకాన్ని గెలుచుకొని ఆమె తన ఘనతను పరిపూర్ణం చేసుకుంది. బుధవారం జరిగిన మహిళల 49 కేజీల ఈవెంట్లో మీరాబాయి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 111 కేజీల బరువెత్తిన మీరా మొత్తం 198 కేజీలతో రెండో స్థానంలో నిలిచింది. ఉత్తర కొరియాకు చెందిన రీ సంగ్ గుమ్ (మొత్తం 215 కేజీలు) స్వర్ణం, విజయాన లులుక్ (ఇండోనేసియా; 191 కేజీలు) కాంస్యం దక్కించుకున్నారు. 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో కరణం మల్లీశ్వరి రజతం గెలుచుకున్న తర్వాతి వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇదే మొదటి పతకం కావడం విశేషం. తన చిరకాల స్వప్నం నెరవేర్చుకునే క్రమంలో మీరాబాయి ఈసారి ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా బరువెత్తింది. స్నాచ్‌లో తన ప్రదర్శనను మెరుగుపర్చుకుంటూ మూడు ప్రయత్నాల్లో వరుసగా 83 కేజీలు, 85 కేజీలు, 87 కేజీల బరువెత్తింది. ఆ తర్వాత క్లీన్ అండ్ జర్క్‌లో తొలి ప్రయత్నంలో 107 కేజీలు ఎత్తిన ఆమె తన రెండో ప్రయత్నంలో మరింత మెరుగ్గా 111 కేజీలతో ముగించింది. వెండి పతకం ఖాయం కావడంతో ఆమె మూడో ప్రయత్నం చేయలేదు. మరోవైపు రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన రీ సంగ్ గుమ్ తనపై ఉన్న అంచనాలకు అనుగుణంగా సత్తా చాటి మూడు కొత్త ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టి మరీ పసిడి గెలుచుకుంది. విడిగా స్నాచ్‌లో 94 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 121 కేజీలతో పాటు ఓవరాల్‌గా 215 కేజీలతో ఆమె ప్రపంచ రికార్డులు నెలకొల్పడం విశేషం. 2018, 2022 ఆసియా క్రీడల్లో కూడా పసిడి పతకం గెలుచుకున్న ఆమెకు ఇది వరుసగా మూడో స్వర్ణం కావడం గమనార్హం.పుష్కర కాలపు పతకం 2014 ఆసియా క్రీడల్లో 9వ స్థానం... 2018లో వెన్ను గాయం కారణంగా పోటీల నుంచి ముందే తప్పుకున్న పరిస్థితి... 2023 క్రీడల్లో మెరుగైన ప్రదర్శనే ఇచ్చినా కీలక సమయంలో గాయంతో చేజారిన పతకం... నాలుగో స్థానంతో సరి! భారత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ఆసియా క్రీడల ప్రదర్శన ఇది. 12 ఏళ్ల క్రితం తొలిసారి ఈ క్రీడల బరిలోకి దిగిన ఆమె గత మూడు అవకాశాల్లోనూ పతకాన్ని అందుకోలేకపోయింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో రజతం గెలుచుకొని తన స్థాయిని పెంచుకున్న మీరాపై తర్వాతి క్రీడల్లోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.అయితే దురదృష్టవశాత్తూ ఆమె వాటిని అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడు తన స్థాయికి తగిన ప్రదర్శనతో ఆసియా క్రీడల పతకం గెలుచుకొని ఈ మణిపూర్ బిడ్డ సగర్వంగా నిలిచింది. ఆరుగురు పిల్లల కుటుంబంలో అందరికంటే చిన్నది అయినా... తనకంటే పెద్దయిన అన్నలకూ సాధ్యంకాని రీతిలో కట్టెల మోపులను అలవోకగా ఎత్తుతూ ఆశ్చర్యపర్చిన ఈ అమ్మాయి ఇప్పుడు బరువులెత్తడంలో ప్రపంచాన్ని గెలిచి చూపించింది. ప్రస్తుతం మణిపూర్ పోలీసు విభాగంలో మీరాబాయి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తోంది. ఒలింపిక్ రింగ్స్ నమూనాతో అమ్మ ప్రత్యేకంగా తయారు చేయించి ఇచ్చిన చెవి రింగులు, మూడు రంగుల రిబ్బన్‌తో జుట్టుకు ముడి, గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో మీరా స్టేజ్ మీదకు వచ్చింది. స్నాచ్‌లో ఇండోనేసియా ప్రత్యర్థికంటే ఒక కేజీ వెనుకబడిన మీరాకు క్లీన్ అండ్ జర్క్‌లో ఆధిపత్యం ప్రదర్శించాల్సిన అవసరం కలిగింది. దాంతో రెండో ప్రయత్నంలో 111 కేజీలకు గురి పెట్టిన ఆమె ఈ బరువునెత్తడంలో సఫలమైంది. తన సాధనను సరైన రీతిలో ప్రదర్శిస్తూ పతకంతో ముగించింది. ప్రస్తుతం 32 ఏళ్ల వయసు ఉన్న తనకు ఇంతకంటే మంచి అవకాశం రాదని మీరాకు బాగా తెలుసు. అందుకే ఈసారి అన్ని రకాలుగా పోటీకి సన్నద్ధమై ఆమె వచ్చింది. కోచ్ విజయ్ శర్మ మరోసారి ఈ ప్రయాణంలో మీరాకు అండగా నిలిచారు. ఇటీవలే కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన తర్వాత ఆమె అసలు విశ్రాంతి తీసుకోలేదు. మరుసటి రోజునుంచే తన ప్రాక్టీస్ మొదలు పెట్టడం ఆమె ఏషియాడ్ పతకం విషయంలో ఎంత పట్టుదలగా ఉందో చూపించింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో కరణం మల్లీశ్వరి తర్వాత ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన రెండో భారతీయురాలిగా ఇప్పుడు మీరాబాయి తన పేరుకు శాశ్వత కీర్తిని తెచ్చుకుంది. 20 ఏళ్ల వయసులో కామన్వెల్త్ క్రీడల్లో తన తొలి పతకం (రజతం) సాధించి భారత్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో తన గెలుపు ప్రస్థానాన్ని మొదలు పెట్టిన మీరా... పుష్కర కాలం తర్వాత తన విజయయాత్రలో శిఖరానికి చేరింది. గత 12 ఏళ్లుగా ఈ పతకం కోసం ప్రయత్నిస్తున్నా. వేర్వేరు కారణాలతో అది దక్కలేదు. కానీ ఇప్పుడు నా కల తీరింది. తాజా ఫలితంతో నా మనసు తేలికపడింది. ఇక్కడికి వచ్చే ముందు ఎలాగైనా గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఇక్కడ నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించా. నా నుంచి చాలా మంది పతకాన్ని ఆశించారు. కాబట్టి కొంత ఒత్తిడి ఉన్నా నా బలాన్ని నమ్ముకున్నాను. ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆసియా నుంచే పెద్ద ప్లేయర్లు ఉన్నారు కాబట్టి ఇక్కడి పతకం కూడా దాదాపుగా ఒలింపిక్‌తో సమానం. క్లీన్ అండ్ జర్క్‌లో 111 కేజీలకంటే తక్కువ బరువు ఎత్తినా రజతం దక్కుతుందని నాకు అర్థమైంది. అయినా సరే ఎలాంటి అవకాశం ఇవ్వరాదని ఆ మొత్తానికి ప్రయత్నించా. ప్రస్తుతం ఈ విజయాన్ని ఆస్వాదిస్తా. నాకిష్టమైన పిజ్జా తింటా... ఆ తర్వాతే 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ సన్నాహాల గురించి ఆలోచిస్తా. డిసెంబర్లో జరిగే క్వాలిఫయింగ్స్ నుంచి నా సన్నద్ధత మొదలవుతుంది. –మీరాబాయి చాను -
టీటీలో పతకాలకు గెలుపు దూరంలో...
టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ ఈవెంట్స్‌లో భారత జట్లకు నిరాశ ఎదురుకాగా... మిక్స్డ్ డబుల్స్‌లో రెండు భారత జోడీలు యశస్విని–హర్మీత్ దేశాయ్, దివ్య చిటాలె–మనుశ్ షా క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. పతకాలకు విజయం దూరంలో నిలిచాయి. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో యశస్విని–హర్మీత్ జంట 11–6, 11–5, 10–12, 11–7తో వింగ్ లామ్ ఎన్జీ–క్వాన్ టో యుయి (హాంకాంగ్) జోడీపై... దివ్య–మనుశ్ ద్వయం 11–0, 11–7, 11–6తో మూసా అహ్మద్–ఐషాత్ నజీమ్ (మాల్దీవులు) జంటపై గెలుపొందాయి. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో భారత జోడీలు నెగ్గి సెమీఫైనల్ చేరుకుంటే కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి.కబడ్డీలో ‘హ్యాట్రిక్’డిఫెండింగ్ చాంపియన్స్ భారత పురుషుల, మహిళల కబడ్డీ జట్లు వరుస విజయాలతో సెమీఫైనల్‌కు చేరువయ్యాయి. భారత పురుషుల జట్టు 48–25తో బంగ్లాదేశ్‌పై... భారత మహిళల జట్టు 37–23తో మాజీ చాంపియన్ ఇరాన్‌పై గెలిచాయి. నేడు జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో చైనీస్ తైపీతో భారత పురుషుల జట్టు... జపాన్‌తో భారత మహిళల జట్టు తలపడతాయి. బాక్సింగ్ క్వార్టర్స్‌లో అంకుశ్ భారత యువ బాక్సర్ అంకుశ్ పంఘాల్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. బుధవారం పురుషుల 80 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో అంకుశ్ 5–0తో బహ్రెయిన్ బాక్సర్ హమ్సా వోగెల్పై విజయం సాధించాడు. కామన్వెల్త్ గేమ్స్ పసిడి పతక విజేత అయిన 21 ఏళ్ల అంకుశ్ జోరు ముందు బహ్రెయిన్ బాక్సర్ నిలవలేకపోయాడు. క్వార్టర్స్‌లో సలిమోవ్ (తజకిస్తాన్)తో అంకుశ్ తలపడనున్నాడు. అభయ్ సింగ్ శుభారంభం ఆసియా క్రీడల స్క్వాష్ లో భారత ప్లేయర్లు అభయ్ సింగ్, వీర్ చోత్రాని, తన్వీ ఖన్నా ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో బుధవారం రెండో సీడ్ అభయ్ సింగ్ 11–1, 11–0, 11–2తో అర్కరాడెట్ అర్కరాహిరుణ్య (థాయ్‌లాండ్)పై ఏకపక్ష విజయం సాధించాడు. వీర్ 11–8, 11–3, 11–3తో షమిల్ వకీల్ (శ్రీలంక)పై గెలిచాడు. మహిళల సింగిల్స్‌లో తన్వీ ఖన్నా 11–5, 11–7, 11–5తో దామి కిమ్ (దక్షిణ కొరియా)పై గెలిచింది. భారత నంబర్‌వన్ ర్యాంకర్ అనాహత్ సింగ్ నేడు నేరుగా ప్రిక్వార్టర్స్ బరిలో దిగనుంది. -
కాంస్యంతో ‘జై’...
ఆసియా క్రీడల సాఫ్ట్ టెన్నిస్ క్రీడాంశంలో పతకం అందించిన తొలి భారతీయ ప్లేయర్‌గా జై మీనా చరిత్ర సృష్టించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల జై మీనా 2–4 (3–5, 1–4, 1–4, 4–1, 6–4, 1–4)తో జపాన్ ప్లేయర్ టకుయా కురోసాకా చేతిలో ఓడిపోయాడు. సాఫ్ట్ టెన్నిస్‌లో సెమీఫైనల్లో ఓడిన వారికి కాంస్య పతకం లభిస్తుంది. 1994 హిరోషిమా ఆసియా క్రీడల నుంచి సాఫ్ట్ టెన్నిస్ మెడల్ ఈవెంట్‌గా ఉంది. వరుసగా మూడో ఆసియా క్రీడల్లో పోటీపడుతున్న జై మీనా 2018 జకార్తా గేమ్స్‌లో లీగ్ దశలోనే వెనుదిరగ్గా... 2023 హాంగ్జౌ క్రీడల్లో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. ‘నాకిది ఒలింపిక్ పతకంలాంటిది. గతంలో కీలకదశలో తడబడ్డా.. ఈసారి ఒత్తిడిని అధిగమించి పతకాన్ని సాధించాను’ అని 2024 ప్రపంచ చాంపియన్‌షిప్ మిక్స్డ్ డబుల్స్‌లో కాంస్యం, 2024 ఆసియా చాంపియన్‌షిప్ సింగిల్స్ విభాగంలో కాంస్యం గెలిచిన జై మీనా వ్యాఖ్యానించాడు. -
ఈసారి కాంస్యంతో సరి
గత ఆసియా క్రీడల ఫైనల్లో చైనా చేతిలో ఓడిపోయి రజత పతకం సాధించిన భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు ఈసారి కాంస్య పతకంతో సంతృప్తి పడింది. డిఫెండింగ్ చాంపియన్ చైనా జట్టుతో బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు 1–3తో పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌లో లక్ష్య సేన్ 16–21, 18–21తో ప్రపంచ ఆరో ర్యాంకర్ షి యుకీ చేతిలో ఓడిపోయాడు. రెండో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 21–11, 22–20తో లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ జంటను ఓడించి స్కోరును 1–1తో సమం చేసింది. మూడో మ్యాచ్‌లో ఆయుశ్ శెట్టి 19–21, 13–21తో ప్రపంచ 12వ ర్యాంకర్ లీ షి ఫెంగ్ చేతిలో ఓటమి చవిచూశాడు. నాలుగో మ్యాచ్‌లో హరిహరన్–ఎంఆర్ అర్జున్ జోడీ 16–21, 21–17, 9–21తో చెన్ బొయాంగ్–లియు యి జంట చేతిలో ఓడిపోవడంతో భారత పరాజయం ఖరారైంది. కాంస్య పతకం గెలిచిన భారత జట్టులో కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, తరుణ్ మన్నేపల్లి, ధ్రువ్ కపిల కూడా సభ్యులుగా ఉన్నారు. -
ఆసియా క్రీడల్లో చిచ్చరపిడుగు.. 13 ఏళ్లకే హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు-2026లో చైనా యువ స్విమ్మర్ 13 ఏళ్ల యు జిడి తన అద్భుత ప్రదర్శనతో అదరగొడుతోంది. ఈ చిచ్చరపిడుగు తన అసాధారణ ప్రతిభతో ఏకంగా మూడు స్వర్ణ పతకాలు సాధించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. బుధవారం జరిగిన మహిళల 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లే రేసును యు జిదీ కేవలం 4 నిమిషాల 28.56 సెకన్లలో పూర్తి చేసి పసిడి పతకాన్ని ముద్దాడింది. తన తోటి క్రీడాకారిణి కెవెన్క్సి కంటే 3.95 సెకన్ల ముందుగా ముగించి ఆమె విజయం సాధించింది. యుజిడి గోల్డ్‌మెడల్‌తో పాటు గత ఆసియా క్రీడల రికార్డును 4.5 సెకన్ల వ్యత్యాసంతో బద్దలు కొట్టింది. ఓవరాల్‌గా వరల్డ్‌లో అత్యంత వేగవంతమైన రేసర్ల జాబితాలో జడి నాలుగో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మొదటి మూడు అత్యుత్తమ టైమింగ్స్ ప్రపంచ రికార్డు కెనడా స్టార్ స్విమ్మర్ 'సమ్మర్ మెకింటోష్' పేరిటే ఉన్నాయి. యుజిడి అంతకుముందు 200 మీటర్ల బటర్‌ఫ్లై, 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే విభాగాల్లో బంగారు పతకం సాధించింది. -
రూ.6 కోట్ల నజరానా.. ఎస్పీ ఉద్యోగం! ఆసియాడ్‌లోనూ మెరిసిన మీరాబాయ్
భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను తన అద్భుత కెరీర్లో లోటుగా ఉన్న ఆసియా క్రీడల పతకాన్ని ఎట్టకేలకు సొంతం చేసుకుంది. జపాన్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా గేమ్స్‌లో మహిళల 49 కేజీల విభాగంలో ఆమె రజత పతకం సాధించడంతో సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. అంతేకాకుండా 28 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు పతకం అందించిన తొలి అథ్లెట్‌గా మీరాబాయి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అంతర్జాతీయ వేదికలపై మీరాబాయి చాను సాధించిన విజయాలు, అందుకున్న పురస్కారాలు, బహుమతుల వివరాలను తెలుసుకుందాం.కష్టానికి దక్కిన ప్రతిఫలంమీరాబాయిఆదాయంలో ప్రధాన భాగం అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించినప్పుడు లభించిన నగదు బహుమతుల నుంచే వచ్చిందే కావడం గమనార్హం. ముఖ్యంగా టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుచుకున్న తర్వాత ఆమెకు అత్యధిక మొత్తంలో ఆర్థిక ప్రోత్సాహకాలు లభించాయి.టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించడంతో వచ్చిన నగదు బహుమతులు ఇవేభారతీయ రైల్వేస్: రూ. 2 కోట్లుఉత్తరప్రదేశ్ ప్రభుత్వం: రూ. 1.5 కోట్లుమణిపూర్ ప్రభుత్వం: రూ. 1 కోటిబైజూస్ : రూ. 1 కోటిబీసీసీఐ : రూ. 50 లక్షలుభారత ఒలింపిక్ సంఘం: రూ. 40 లక్షలుజెఎస్డబ్ల్యూ గ్రూప్ : రూ. 20 లక్షలు👉మొత్తంగా టోక్యో ఒలింపిక్స్ అనంతరం ఆమెకు మొత్తంగా రూ. 6.6 కోట్లు లభించాయి.అలాగే ఈ ఏడాది గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన మీరాబాయిని మణిపూర్ ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెకు రూ. 20 లక్షల నగదు బహుమతితో పాటు గుర్తింపు పత్రం కూడా అందజేశారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కూడా ఆమెను సన్మానించడంతో పాటురూ. 30 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు. ఇప్పుడు ఏషియన్ గేమ్స్‌లో రజత పతకం సాధించడంతో మరిన్ని నగదు పురష్కారాలు లభించే ఛాన్స్ ఉంది.హోదాలు- ఉద్యోగాలుటోక్యో ఒలింపిక్స్ అనంతరం అప్పటికే ఈశాన్య రైల్వేలో పనిచేస్తున్న మీరాబాయ్ను 'ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ' గా ప్రమోట్ చేశారు. అప్పటి మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ ఆమెను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా నియమించారు. అప్పట్లో రైల్వే ఉద్యోగాన్ని వదిలి మణిపూర్ పోలీస్ శాఖలో చేరేందుకు మీరాబాయి ఆసక్తి చూపినట్లు వార్తలు వచ్చాయి.బ్రాండ్ ఎండార్స్మెంట్లుఅంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మీరాబాయి చాను.. అడిడాస్, అమ్వే - న్యూట్రిలైట్, స్టార్ సిమెంట్, అమృతాంజన్, డొమినోస్ వంటి పలు కార్పొరేట్ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది.క్రీడారంగంలో మీరాబాయి చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం అనేక అత్యున్నత పౌర, క్రీడా పురస్కారాలతో గౌరవించింది. పద్మశ్రీ, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న వంటి అవార్డ్‌లను సొంతం చేసుకుంది. -
రేపటి నుంచే ఏషియన్ గేమ్స్ క్రికెట్.. జట్లు, లైవ్ స్ట్రీమింగ్ తదితర వివరాలు!
ఆసియా క్రీడలు-2026 పురుషుల క్రికెట్ టోర్నమెంట్‌కు సమయం అసన్నమైంది. జపాన్‌లోని నిస్షిన్ నగరంలో ఉన్న కోరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా గురువారం (సెప్టెంబరు 24) నుంచి ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు పోటీపడుతున్నాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించగా.. మిగిలిన ఆరు జట్లను (అఫ్గానిస్తాన్, జపాన్, నేపాల్, హాంకాంగ్, మలేషియా, ఒమన్) రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ దశ మ్యాచ్‌లలో తలపడి టాప్ పొజిషన్లో నిలిచే జట్లు క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత పురుషుల క్రికెట్ జట్టు మరోసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మ్యాచ్‌లను ఎక్కడ చూడాలంటే?ఈ ఏషియన్ గేమ్స్ మ్యాచ్‌లను భారత్‌లో అభిమానులు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో వీక్షించవచ్చు. అదేవిధంగా ఈ క్రికెట్ పోటీలను సోనీ లివ్ వెబ్సైట్, యాప్‌లో కూడా చూడవచ్చు.పురుషుల క్రికెట్ షెడ్యూల్క్వాలిఫయర్స్👉సెప్టెంబర్ 24- అఫ్గానిస్తాన్ వర్సెస్ జపాన్ హాంకాంగ్-చైనా వర్సెస్ మలేషియా 👉సెప్టెంబర్ 25- హాంకాంగ్-చైనా వర్సెస్ ఒమన్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ నేపాల్ 👉సెప్టెంబర్ 26- జపాన్ వర్సెస్ నేపాల్ మలేషియా వర్సెస్ ఒమన్ క్వార్టర్‌ఫైనల్స్ 👉సెప్టెంబర్ 28 (తొలి క్వార్టర్ ఫైనల్)- పాకిస్తాన్ వర్సెస్ గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచే జట్టుసెప్టెంబర్ 28 (రెండో క్వార్టర్ ఫైనల్)- భారత్ వర్సెస్ గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచే జట్టు👉సెప్టెంబర్ 29 (మూడో క్వార్టర్ ఫైనల్)- శ్రీలంక వర్సెస్ గ్రూప్-ఏ విన్నర్సెప్టెంబర్ 29 (నాలుగో క్వార్టర్ ఫైనల్)- బంగ్లాదేశ్ వర్సెస్ గ్రూప్-బి విన్నిర్👉అక్టోబర్ 1- సెమీఫైనల్స్ 👉అక్టోబర్ 3- కాంస్య పతక మ్యాచ్, ఫైనల్ఏషియన్ గేమ్స్ క్రికెట్ స్క్వాడ్స్ ఇవేఅఫ్గానిస్తాన్: దర్విష్ రసూలీ (కెప్టెన్), అబ్దుల్లా అహ్మద్జాయ్, మహ్మద్ అక్రమ్, ఇస్మత్ ఆలం, ఫరీదూన్ దావూద్జాయ్, హసన్ ఈసాఖిల్, మహ్మద్ ఇషాక్, కరీం జనత్, ఫైసల్ ఖాన్, నంగ్యాల్ ఖరోటీ, ఇమ్రాన్ మీర్, అరబ్ గుల్ మొమంద్, ఫర్మానుల్లా సఫీ, ఖలీద్ తనివాల్, నజీబుల్లా జద్రాన్.బంగ్లాదేశ్: లిట్టన్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, మహ్మద్ సైఫ్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, ముసద్దెక్ హుస్సేన్ సైకత్, యాసిర్ అలీ చౌదరి, రిషద్ హుస్సేన్, షాక్ మహేదీ హసన్, సహ్మద్ హసన్, నస్హమ్దిన్* ముస్తాఫిజుర్ రెహమాన్, హసన్ మహమూద్హాంకాంగ్: యాసిమ్ ముర్తాజా (కెప్టెన్), బాబర్ హయత్, అనాస్ ఖాన్, అన్షుమన్ రాత్, ఆయుష్ శుక్లా, ఎహసాన్ ఖాన్, హఫీజ్ ఖాన్, హుస్సేన్ రజబ్, మహ్మద్ గజన్ఫర్, మహ్మద్ హసన్ ఖాన్, మహ్మద్ వహీద్, నిజాకత్ ఖాన్, రానా నస్రుల్లా, షాహిద్ వాసిఫ్భారత్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ, విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, యశ్ ఠాకూర్జపాన్: కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్ (కెప్టెన్), చార్లీ హరా-హింజ్, బెంజమిన్ ఇటో-డేవిస్, అలెస్టర్ కడోవాకి-ఫ్లెమింగ్, కోహెయ్ కుబోటా, జేక్ కుసుడా-నైర్న్, వటారు మియౌచి, రియో సకురానో-థామస్, అలెక్స్ షిరాయ్-పత్మోర్, సుగయ-స్సులాజ్, షోమాటర్ తకాడ, ఇబ్రహీం తకహషి, మకోటో తనియామా, లచ్లాన్ యమమోటోమలేషియా: సయ్యద్ అజీజ్ ముబారక్, వీరన్‌దీప్ సింగ్, షర్విన్ మునియాండీ, విజయ్ ఉన్ని, అజ్రీ అజర్, పవన్‌దీప్ సింగ్, ముహమ్మద్ సియాహదత్, ముహమ్మద్ అక్రమ్, అస్లాం ఖాన్ మాలిక్, ముహమ్మద్ హజిక్ ఐమన్, రహీమ్ ఖాన్, నందన్ యాదవ్, షహబ్ ఆలం, ఆరిఫ్ షేక్ఒమన్: సుఫ్యాన్ మెహమూద్ (కెప్టెన్), ముజఫర్ షిరాల్కర్, మహ్మద్ అలీ అల్ బలూషి, జుబైర్ అల్ బలూషి, షుయబ్ అల్ బలూషి, నవేద్ అల్ బలూషి, వసీమ్ అల్ బలూషి, అహ్మద్ అల్ జడ్జాలీ, సమీర్ ఒత్మాన్, వహీద్ అల్ బలూషి, ఫారిస్ అల్ బలూషి, మహ్మద్ ఉస్మాన్, ఇస్సా రహీమ్ అల్ బలూషి, అబ్దుల్ జలీల్, కైస్ అల్ బలూషిపాకిస్తాన్: సాహిబ్జాదా ఫర్హాన్ (కెప్టెన్), అబ్దుల్ సమద్ (వైస్ కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియాల్, అకీఫ్ జావేద్, అలీ రజా, అరాఫత్ మిన్హాస్, హైదర్ అలీ, హసన్ నవాజ్, మాజ్ సదాకత్, మహ్మద్ సల్మాన్ మీర్జా, సాద్ మసూద్, సైమ్ అయూబ్, సుఫ్యాన్ మొకీమ్, ఉస్మాన్ ఖాన్శ్రీలంక: సహన్ అరాచ్చిగే (కెప్టెన్), అషెన్ బండార, లసిత్ క్రూస్పుల్లే, కేషన్ డి లివెరా, నిరోషన్ డిక్వెల్లా (వికె), బినుర ఫెర్నాండో, నువానీడు ఫెర్నాండో, తరిందు హంసక, దుషన్ హేమంత, సినీత్ జయవర్దన, చమిక కరుణరత్నే, ప్రమోద్ మదుషాన్, వనుజా సహన్, నువాన్ తుషార, విజయకాంత్ వియస్కాంత్నేపాల్: దీపేంద్ర సింగ్ ఐరీ (కెప్టెన్), రోహిత్ కుమార్ పౌడెల్, సోంపాల్ కమీ, కరణ్ కెసి, సందీప్ లామిచానే, ఆరిఫ్ షేక్, ఆసిఫ్ షేక్, కుశాల్ భుర్టెల్, లలిత్ రాజ్‌బన్షి, గుల్సన్ కుమార్ ఝా, నందన్ యాదవ్, లోకేష్ బామ్, సందీప్ జోరా, షేర్ మల్లా, కుషాల్ మల్లా -
Asian Games 2026: చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
2026 ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పరంపర కొనసాగుతోంది. తొలి మూడు రోజులు షూటర్లు ఆధిపత్యం చలాయించగా.. ఇప్పుడిప్పుడే ఇతర క్రీడల అథ్లెట్లు పతకాలు సొంతం చేసుకుంటున్నారు. నాలుగో రోజు కూడా షూటర్లే బోణీ కొట్టినప్పటికీ.. ఈ రోజుకి అతి పెద్ద పతకం మాత్రం వెయిట్ లిఫ్టింగ్‌లో దక్కింది.భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్, ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను, మహిళల 49 కేజీల విభాగంలో రజత పతకం సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల్లో చానుకు ఇదే తొలి పతకం. దీంతో ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న ఏషియన్ గేమ్స్ పతక నిరీక్షణకు ఆమె తెరదించింది.సాఫ్ట్ టెన్నిస్‌లో భారత్‌కు తొలి పతకంపురుషుల సింగిల్స్ సాఫ్ట్ టెన్నిస్‌లో జయ్ మీనా సెమీఫైనల్‌కు చేరి భారత్‌కు చారిత్రాత్మక పతకాన్ని ఖాయం చేశాడు. అయితే సెమీఫైనల్ మ్యాచ్‌లో గాయం కారణంగా పోటీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. దీంతో జయ్ మీనాకు కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. ఆసియా క్రీడల సాఫ్ట్ టెన్నిస్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం.స్కీట్‌లో డబుల్ బ్రాంజ్అంతకుముందు షూటింగ్లో భారత జట్టు మరో రెండు పతకాలు సాధించింది. మహిళల స్కీట్ టీమ్ విభాగంలో రైజా ధిల్లాన్, పరినాజ్ ధలివాల్, మహేశ్వరి చౌహాన్ కాంస్య పతకం గెలిచారు.పురుషుల స్కీట్ టీమ్ విభాగంలో అనంత్‌జీత్ సింగ్ నరూకా, మైరాజ్ అహ్మద్ ఖాన్, భవ్‌తేజ్ సింగ్ గిల్ కాంస్యం సాధించారు. అనంత్‌జీత్ సింగ్ వ్యక్తిగత స్కీట్ ఫైనల్‌కు కూడా అర్హత సాధించాడు.మను బాకర్‌కు నిరాశమహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో భారత్‌కు ఆశించిన ఫలితం దక్కలేదు. టీమ్ విభాగంలో మను బాకర్, సురుచి ఇందర్ సింగ్, ఇషా సింగ్‌ల భారత జట్టు నాలుగో స్థానంతో పతకాన్ని చేజార్చుకుంది. వ్యక్తిగత ఫైనల్లోనూ మను బాకర్ ఐదో స్థానంలో నిలిచి పతకం లేకుండానే ముగించింది.కబడ్డీలో భారత్ విజయంమహిళల కబడ్డీలో భారత జట్టు గ్రూప్-ఎ మ్యాచ్‌లో ఇరాన్‌పై 37-23తో విజయం సాధించింది. మరోవైపు రోయింగ్, కెనో స్ప్రింట్, టేబుల్ టెన్నిస్, సెపక్తక్రా విభాగాల్లోనూ భారత క్రీడాకారులు తదుపరి రౌండ్లకు పురోగమించారు. ఇప్పటివరకు భారత్ ఖాతాలో 11 పతకాలు (1 స్వర్ణం, 5 రజతాలు, 5 కాంస్యాలు) చేరాయి. ప్రస్తుతం పట్టికలో భారత్ 10వ స్థానంలో కొనసాగుతోంది.ఇదీ చదవండి: మను బాకర్‌కు నిరాశ.. షూటింగ్లో భారత్‌కు డబుల్ బ్రాంజ్ -
మను బాకర్‌కు నిరాశ.. షూటింగ్లో భారత్‌కు డబుల్ బ్రాంజ్
2026 ఆసియా క్రీడల నాలుగో రోజు భారత షూటర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. స్వర్ణం ఖాయమనుకున్న స్టార్ షూటర్ మనూ బాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కనీసం కాంస్య కూడా సాధించలేకపోగా.. స్కీట్ ఈవెంట్లో మహిళలు, పురుషుల జట్లు కాంస్య పతకాలు సాధించాయి. తొలుత మహిళల స్కీట్ టీమ్ ఈవెంట్లో రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్, పరినాజ్ ధలివాల్‌తో కూడిన భారత జట్టు.. ఆతర్వాత పురుషుల స్కీట్ టీమ్ అనంత్‌జీత్ సింగ్ నరూకా, మైరాజ్ ఖాన్, భవ్‌తేజ్ సింగ్ గిల్‌తో కూడిన భారత జట్టు కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాయి. అనంత్‌జీత్ సింగ్ వ్యక్తిగత విభాగంలోనూ ఫైనల్‌కు అర్హత సాధించాడు.సాఫ్ట్ టెన్నిస్‌లో చరిత్ర.. జయ్ మీనాకు పతకం ఖాయంపురుషుల సాఫ్ట్ టెన్నిస్ సింగిల్స్‌లో భారత ఆటగాడు జయ్ మీనా సెమీఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించాడు. ఈ విజయంతో ఆసియా గేమ్స్ చరిత్రలో సాఫ్ట్ టెన్నిస్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది.మహిళల కబడ్డీలో భారత్ ఘన విజయంమహిళల కబడ్డీలో భారత జట్టు అదరగొట్టింది. గ్రూప్-ఎ మ్యాచ్‌లో ఇరాన్‌ను 37-23తో ఓడించింది. మరోవైపు, వెయిట్‌లిఫ్టింగ్ మహిళల 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను పతకంపై ఆశలు పెట్టుకుంది. ఆసియా గేమ్స్‌లో తన తొలి పతకం సాధించడమే లక్ష్యంగా ఆమె బరిలోకి దిగనుంది.ఇదీ చదవండి: టీమిండియా క్రికెటర్‌కు తమిళనాడు సీఎం విజయ్ భారీ నజరానా -
Asian Games 2026: షూటింగ్లో భారత్‌కు మరో పతకం
జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత షూటర్లు మరో పతకాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. మహిళల స్కీట్ టీమ్ ఈవెంట్లో రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్, పరినాజ్ ధలివాల్‌తో కూడిన భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. ఈ ఈవెంట్లో చైనా స్వర్ణం సాధించగా.. కజకిస్తాన్ రజతంతో సరిపెట్టుకుంది. షూటింగ్లో భారత్‌కు ఇది ఆరో పతకం కాగా.. మొత్తంగా ఎనిమిదో పతకం (ఒక గోల్డ్, 4 సిల్వర్, 3 బ్రాంజ్).ప్రస్తుతం భారత్ పతకాల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 58 పతకాలతో అగ్రస్థానంలో దూసుకుపోతుంది.కాగా, నాలుగో రోజు భారత క్రీడాకారులు పలు విభాగాల్లో సత్తా చాటుతున్నారు. ఇప్పటకే షూటింగ్లో మహిళల స్కీట్ టీమ్ కాంస్య పతకాన్ని సాధించగా, స్టార్ షూటర్ మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించింది. మరోవైపు, సాఫ్ట్ టెన్నిస్‌లో జయ్ మీనా సెమీఫైనల్‌కు చేరడంతో భారత్‌కు ఆ క్రీడలో ఆసియా గేమ్స్ చరిత్రలో తొలి పతకం ఖాయమైంది.ఇదీ చదవండి: 'మన బంగారం' మహిళా క్రికెటర్లు -
‘అంతా తొండి.. అందుకే కరచాలనం చేయలేదు’
ఆసియా గేమ్స్‌లో తొలిసారి ప్రవేశ పెట్టిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(ఎంఎంఏ)లో మహిళల 60కేజీల విభాగంలో సుచికా తరియాల్ కాంస్య పతకం గెలుచుకుంది. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. అయితే ఫైనల్స్‌లో అడుగు పెట్టేందుకు సింగపూర్‌కు చెందిన హుయ్ హూన్ టియోతో సుచిక తలపడింది .హుయ్‌ను విజేతగా ప్రకటించిన తరువాత తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన సుచిక తన ప్రత్యర్థితో కరచాలనం చేయడానికి నిరాకరించింది. రిఫరీ, టియో చేతిని పైకి ఎత్తగానే మ్యాట్‌పై మోకాళ్లపై కూలబడి విలపించింది సుచిక. ఫలితాలు ప్రకటించిన తీరు ఆమెకు తీవ్రమైన నిరాశను కలిగించింది. ఇద్దరు ఫైటర్లు హోరాహోరీ తల పడిన ఆ పోరులో, నిర్ణీత సమయంలో విజేత ఎవరనేదీ స్పష్టంగా తెలియలేదు.రిఫరీలు మొదట సింగపూర్ క్రీడాకారిణిని విజేతగా ప్రకటించడంతో భారత బృందం తీవ్ర నిరాశకు గురైంది. ‘జడ్జ్‌ల నిర్ణయంతో నేను ఎంత మాత్రం ఏకీభవించలేదు. వారి నిర్ణయం న్యాయంగా లేదు. మా అంతర్జాతీయ ఫెడరేషన్ సింగపూర్‌కు చెందింది. ఆమె కూడా సింగపూర్‌కు చెందిన అమ్మాయే’ అని సుచిక ఓటమి అనంతరం పేర్కొంది.రిఫరీ నిర్ణయాన్ని భారత బృందం సవాలు చేయగా, ఆ ఫైట్‌ను డ్రాగా ప్రకటించారు. దీంతో బరువు నిబంధనల ప్రకారం టియోను విజేతగా ప్రకటించారు. సుచిక తన ప్రత్యర్థి కంటే 700 గ్రాములు ఎక్కువ బరువు ఉంది. దీంతో టియో ఫైనల్‌కు చేరుకోగా, సుచిక కాంస్యంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బరువు నిబంధనల కారణంగా ఆమె ఫైనల్లోకి అడుగు పెట్టే అపూర్వమైన అవకాశాన్ని కోల్పోయింది. సుచిక దుఃఖం సంగతి ఎలా ఉన్నప్పటికీ ప్రత్యర్థి క్రీడాకారిణితో కరచాలనం చేయకపోవడంపై మిశ్రమ స్పందన వచ్చింది. జాతీయ జెండాను మెడలో వేసుకొని సుచిక తరియాల్ ఇలా ప్రవర్తించడం ద్వారా భారతదేశాన్ని అవమానించినట్లేనని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే మరికొందరు మాత్రం సుచిక చర్యను సమర్థించారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫెడరేషన్ సింగపూర్‌కు చెందినది కావడం, ప్రత్యర్థి కూడా అదే దేశానికి చెందడంతో, బరువు పేరు చెప్పి సుచికకు అన్యాయం చేశారన్నది వారి వాదన. ఇది ఎలా ఉన్నా ఆసియా క్రీడల్లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఇదే మొట్టమొదటి పతకం కావడం విశేషంగా మారింది.Indian Semi-Finalist Suchika refuses to accept loss in MMA at Asian Games 2026 against Singaporean PlayerSuchika lost a dramatic semifinal to Singapore’s Tiffany Teo after regulation time ended in a draw.The 1-minute overtime was initially awarded 2–1 to Teo. India protested,… pic.twitter.com/nOU2HkrGBd— Mogambo (@Netajinonsense1) September 22, 2026 🚨 SUCHIKA TARIYAL - ASIAN GAMES BRONZE🥉MEDALISTSuchika Bags Bronze in Traditional 60kg MMA 🇮🇳She felt she was robbed of the victory & it felt unacceptable (check video). Score 0-2 vs 🇸🇬But keep your head high. A historical medal 🇮🇳pic.twitter.com/KRn9DGG8bo— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) September 21, 2026ఇదీ చదవండి: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు.. ‘నన్ను ఇరికించే ప్రయత్నం’ -
టీమిండియా క్రికెటర్‌కు తమిళనాడు సీఎం విజయ్ భారీ నజరానా
ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన టీమిండియాలో సభ్యురాలైన భారత మహిళా క్రికెటర్ జి కమలికి తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసఫ్ విజయ్ భారీ నజరానా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.75 లక్షల నగదు పురస్కారం అందించనున్నట్లు వెల్లడించారు. మదురైకి చెందిన కమలిని ప్రతిభను ప్రత్యేకంగా అభినందించిన సీఎం విజయ్.. ప్రతిభావంతులైన క్రీడాకారులకు తమిళనాడు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. కమలిని విజయం రాష్ట్రంలోని యువతకు, మహిళలకు స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత జట్టు సాధించిన చారిత్రాత్మక విజయంపై హర్షం వ్యక్తం చేశారు.వికెట్ కీపర్ బ్యాటర్ అయిన కమలిని ఇప్పటికే భారత క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2024లో మహిళల అండర్-19 ఆసియా కప్, 2025లో అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్లలో ఆమె భాగమైంది.వైస్ జగన్ అభినందనలుమరోవైపు ఆసియా క్రీడల్లో స్వర్ణంతో మెరిసిన భారత మహిళల క్రికెట్ జట్టును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అభినందించారు. జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీ చరణిని ప్రత్యేకంగా ప్రశంసించారు.కాగా, నిన్న జరిగిన ఆసియా క్రీడల మహిళల క్రికెట్ ఫైనల్స్‌లో భారత్ శ్రీలంకను 147 పరుగుల తేడాతో చిత్తు చేసి, వరుసగా రెండో సారి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ సాధించింది.స్మృతి మంధాన (79), రిచా ఘోష్ (49 నాటౌట్) రాణించారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో శ్రీలంక 69 పరుగులకే కుప్పకూలింది. దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా, శ్రీచరణి, శ్రేయాంక, షఫాలీ వర్మ తలా రెండు వికెట్లు పడగొట్టారు.ఇదీ చదవండి: ఫైనల్లో శ్రీలంకను మట్టికరిపించిన భారత్.. స్వర్ణం మనదే! -
'మన బంగారం' మహిళా క్రికెటర్లు
అంచనా తప్పలేదు. ఊహించిన ఫలితమే వచ్చింది. ఆసియా క్రీడల్లో మూడో రోజు భారత్ స్వర్ణ పతక బోణీ చేసింది. మహిళల క్రికెట్లో భారత జట్టు తమ ఆధిపత్యాన్ని మరోసారి చూపిస్తూ ఆసియా క్రీడల్లో పసిడి పతకంతో మురిపించింది. పది రోజుల వ్యవధిలో శ్రీలంకను మళ్లీ చిత్తు చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం వరుసగా రెండోసారి ఏషియాడ్ బంగారాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఇతర క్రీడాంశాల్లో మన బృందానికి మంగళవారం మిశ్రమ ఫలితాలు లభించాయి. టీమ్ విభాగంలో పురుషుల బ్యాడ్మింటన్ జట్టు సెమీఫైనల్ చేరడంతో పతకం ఖాయం కాగా, మహిళల టీమ్ నిరాశపరుస్తూ నిష్క్రమించింది. మహిళల వుషులో కూడా రోషిబీనా దేవి సెమీఫైనల్ చేరి మరో పతకాన్ని ఖాయం చేసింది. అయితే తొలి రెండు రోజుల్లో పతకాలపై గురి పెట్టిన భారత షూటర్లకు మూడో రోజు కలిసి రాలేదు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో ఇలవేనిల్–పార్థ్ జోడీ నాలుగో స్థానంతో ముగించి పతకం చేజార్చుకుంది. భారత పురుషుల హాకీ జట్టు మరో ఘనమైన ప్రదర్శనతో జట్టు ముందంజ వేయగా... టేబుల్ టెన్నిస్‌లో భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించి పతకానికి దూరమైంది. ఈ ఆసియా క్రీడల్లో బరిలో ఉన్న ఏకైక భారత మహిళా జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ వాల్ట్ ఈవెంట్ ఫైనల్లోకి ప్రవేశించి పతకం రేసులో నిలిచింది.నిషిన్: భారత మహిళల క్రికెట్ జట్టు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగి ఆసియా క్రీడల్లో దేశానికి తొలి స్వర్ణాన్ని అందించింది. 2023 హాంగ్జూ ఆసియా క్రీడల్లో పసిడి పతకాన్ని గెలుచుకున్న హర్మన్‌ప్రీత్ బృందం ఇప్పుడు దానిని నిలబెట్టుకోవడం విశేషం. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో భారత్ 147 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. శ్రీలంక జట్టుకు రజత పతకం లభించగా... బంగ్లాదేశ్‌పై 31 పరుగుల తేడాతో గెలిచి పాకిస్తాన్ కాంస్య పతకాన్ని సంపాదించింది. శ్రీలంకతో తుది పోరులో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. స్మృతి మంధాన (45 బంతుల్లో 79; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) సిక్సర్లతో చెలరేగి అర్ధ సెంచరీ సాధించింది. రిచా ఘోష్ (22 బంతుల్లో 49 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), షఫాలీ వర్మ (29 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చారు. తొలి వికెట్‌కు స్మృతి, షఫాలీ 60 బంతుల్లోనే 99 పరుగులు జోడించి శుభారంభం అందించగా, చివర్లో రిచా దూకుడు జట్టుకు భారీ స్కోరును అందించింది. అనంతరం శ్రీలంక 15.4 ఓవర్లలో 69 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ చమరి అటపట్టు (21 బంతుల్లో 29; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా, మిగతా వారంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 6 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా... షఫాలీ వర్మ, శ్రేయాంక పాటిల్, శ్రీచరణి తలా 2 వికెట్లు తీశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి ఆసియా క్రీడల్లో ఆడిన 3 మ్యాచ్‌లలో కేవలం 3.75 సగటుతో 8 వికెట్లు పడగొట్టడం విశేషం. మొత్తం 66 బంతులు బౌలింగ్ చేసిన ఆమె 30 పరుగులే ఇచ్చింది.147 అంతర్జాతీయ టి20ల్లో భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం. 2018 ఆసియా కప్‌లో భారత్ 142 పరుగుల తేడాతో మలేసియాను చిత్తు చేసింది. 13 భారత ఒక మ్యాచ్‌లో కొట్టిన అత్యధిక సిక్స్‌లు.సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ 12 సిక్స్‌లు కొట్టింది.8 అంతర్జాతీయ టి20ల్లో భారత్ వరుసగా గెలిచిన మ్యాచ్‌లు. ఆసియా క్రీడలకు ముందు ఆసియా కప్‌లో భారత్ వరుసగా 5 నెగ్గింది.110 ఈ ఏడాది భారత్ కొట్టిన సిక్సర్ల సంఖ్య. ఒక సంవత్సరం టి20ల్లో 100కు పైగా సిక్స్‌లు కొట్టిన తొలి జట్టుగా భారత్ నిలిచింది.ఆసియా క్రీడల్లో పసిడి గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మెగా ఈవెంట్లో స్వర్ణంతో మేం బోణీ చేశాం. ఇక మరిన్ని బంగారు పతకాలు వస్తాయని ఆశిస్తున్నాం. మా ఆట పూర్తయినా ఇతర క్రీడల్లో భారత్ ప్రదర్శనను చూస్తూనే ఉంటాం. స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఇక్కడ బరిలోకి దిగాం. భారత జెండా ఎగిరి జాతీయ గీతం వినపడాలని కోరుకున్నాం. జపాన్‌లో పిచ్‌లు, పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు కాబట్టి మానసికంగా అన్నింటికీ సిద్ధపడే వచ్చాం. అయితే మొత్తంగా ఇక్కడి సౌకర్యాలు సంతృప్తిని కలిగించాయి. పిచ్ అటు బౌలింగ్‌కు, ఇటు బ్యాటింగ్‌కు కూడా సమానంగా అనుకూలించింది. మా ప్లేయర్లు ఎవరూ గాయపడకపోవడం సానుకూలాంశం. ఒక క్రికెటర్‌గా ప్రపంచ కప్, ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడుతూనే ఉంటాం. కానీ ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్స్‌లలో ఆడాలని అందరూ కోరుకుంటారు. వరుసగా రెండుసార్లు ఏషియాడ్‌లో ఆడే అవకాశం రావడం అదృష్టం. ట్రోఫీలు గెలిస్తే అవి బీసీసీఐ కార్యాలయానికి వెళతాయి. ఇప్పుడు ఈ రెండు ఏషియాడ్ పతకాలను మేం మా ఇంట్లో వేలాడదీసుకోవచ్చు. – హర్మన్‌ప్రీత్ కౌర్, భారత కెప్టెన్ -
రోషిబీనా ‘హ్యాట్రిక్’ పతకం
నగోయా: ఆసియా క్రీడల వుషు క్రీడాంశంలో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. మహిళల సాండా ఈవెంట్ 60 కేజీల విభాగంలో భారత స్టార్ ఫైటర్ నరోమ్ రోషిబీనా దేవి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా వరుసగా మూడో ఆసియా క్రీడల్లోనూ కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. చు మాన్ సిన్ (మకావ్)తో మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో రోషిబీనా 5–0తో గెలిచింది. మణిపూర్‌కు చెందిన 25 ఏళ్ల రోషిబీనా 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో రజతం... 2018 జకార్తా ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించింది. మరోవైపు పురుషుల సాండా 56 కేజీల క్వార్టర్ ఫైనల్లో భారత ఫైటర్ ఆర్యన్ 1–2తో అబురషితోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. -
జపాన్‌కు భారత్ స్మాష్
నగోయా: ఆతిథ్య జపాన్ జట్టుకు షాక్ ఇస్తూ భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు ఆసియా క్రీడల్లో పతకాన్ని ఖాయం చేసుకుంది. మంగళవారం జరిగిన టీమ్ ఈవెంట్ క్వార్టర్ ఫైనల్లో భారత పురుషుల జట్టు 3–0తో జపాన్ జట్టును బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ చైనా జట్టుతో భారత్ తలపడుతుంది. జపాన్‌తో జరిగిన పోరులో తొలి సింగిల్స్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ 14వ ర్యాంకర్ లక్ష్య సేన్ 66 నిమిషాల్లో 11–21, 21–5, 21–19తో ప్రపంచ 7వ ర్యాంకర్, రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ రన్నరప్ కొడాయ్ నరోకాను ఓడించి సంచలనం సృష్టించాడు.రెండో మ్యాచ్‌గా జరిగిన డబుల్స్ సమరంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 56 నిమిషాల్లో 21–18, 24–22తో ప్రపంచ మాజీ చాంపియన్స్ హోకి టకురో–కొబయాషి యుగో జంటను బోల్తా కొట్టించింది. మూడో మ్యాచ్‌లో ప్రపంచ 20వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టి 21–10, 21–19తో ప్రపంచ 16వ ర్యాంకర్ కొకి వతనాబెపై గెలిచి భారత్‌కు 3–0తో విజయాన్ని కట్టబెట్టాడు. ఫలితం తేలిపోవడంతో మిగతా రెండు మ్యాచ్‌లు నిర్వహించలేదు. భారత మహిళల జట్టుకు నిరాశ మరోవైపు భారత మహిళల జట్టు వరుసగా మూడో ఆసియా క్రీడల్లోనూ పతకం సాధించలేకపోయింది. జపాన్ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 1–3తో పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌లో పీవీ సింధు 72 నిమిషాల్లో 23–21, 18–21, 11–21తో ప్రపంచ 3వ ర్యాంకర్ అకానె యామగుచి చేతిలో పోరాడి ఓడిపోయింది.రెండో మ్యాచ్‌లో ఉన్నతి హుడా 16–21, 18–21తో ప్రపంచ 7వ ర్యాంకర్ టొమోకా మియజాకి చేతిలో ఓటమి పాలైంది.. మూడో మ్యాచ్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 21–17, 21–16తో యూకీ ఫుకుషిమా–మయు మత్సుమోటో జంటపై గెలిచింది. అయితే నాలుగో మ్యాచ్‌లో తన్వీ శర్మ 12–21, 10–21తో ప్రపంచ 10వ ర్యాంకర్ నొజోమి ఒకుహారా చేతిలో ఓడిపోవడంతో భారత పరాజయం ఖరారైంది. -
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన షఫాలీ వర్మ
ఆసియా గేమ్స్‌లో మహిళల క్రికెట్ విభాగంలో ఫైనల్లో శ్రీలంకను మట్టికరిపించిన భారత్ స్వర్ణం కైవసం చేసుకుంది. సెమీస్‌లో బంగ్లాదేశ్‌లో అజేయ సెంచరీతో మెరిసిన షఫాలీ.. ఫైనల్లోనూ 48 పరుగులతో ఆకట్టుకుంది. ఇక క్వార్టర్స్‌లోనూ 40 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్‌తో అలరించిన షఫాలీ తాజాగా ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లోనూ రఫ్పాడించింది. బ్యాటింగ్ విభాగంలో రెండు స్థానాలు ఎగబాకిన షఫాలీ వర్మ నాలుగో స్థానంలో నిలిచింది. ఇక ఓపెనర్ స్మృతి మంధాన ఒక స్థానం దిగజారి ఆరో స్థానంలో నిలవగా, హర్మన్‌ప్రీత్ కౌర్ పదో స్థానాన్ని నిలబెట్టుకుంది. బౌలింగ్ విభాగంలో శ్రీచరణి, దీప్తి శర్మలు తొలి రెండు స్థానాలను నిలబెట్టుకున్నారు. మిగతా ప్లేయర్ల విషయానికొస్తే.. క్రాంతి గౌడ్ 15 స్థానాలు ఎగబాకి 57వ స్థానంలో నిలవగా, నందనీ శర్మ 22 స్థానాలు ఎగబాకి 72వ స్థానంలో నిలిచింది.మ్యాచ్ విషయానికొస్తే.. మంగళవారం జరిగిన ఫైనల్లో శ్రీలంకను 147 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్.. వరుసగా రెండో సారి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ సాధించింది. స్మృతి మంధాన (79), రిచా ఘోష్ (49 నాటౌట్) రాణించాడు. అనంతరం భారీ లక్ష్య చేధనలో శ్రీలంక 69 పరుగులకే కుప్పకూలింది. ఇక కాంస్య పతక పోరులో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ విజయం సాధించింది.ఇదీ చదవండి: శ్రీలంకతో తొలి వన్డే.. రూట్ ప్రపంచ రికార్డు -
‘శ్రీ చరణి ఒక అద్భుతం.. భారత జట్టుకు అభినందనలు’
ఆసియా క్రీడల్లో స్వర్ణంతో మెరిసిన భారత మహిళల క్రికెట్ జట్టును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'ఎక్స్' వేదికగా అభినందించారు. ఈ మేరకు వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘‘ఆసియా గేమ్స్-2026 లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టుకు నా హృదయపూర్వక అభినందనలు. టోర్నమెంట్ అంతటా జట్టు కనబరిచిన అద్భుతమైన ప్రదర్శన యావత్ దేశానికి గర్వకారణం. ఈ అద్భుత విజయానికి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు, జట్టులోని ప్రతి క్రీడాకారిణికి అభినందనలు. జట్టు విజయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీ చరణి పోషించిన పాత్రను గుర్తించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఆమె విజయ ప్రస్థానం మన రాష్ట్రంలోని యువతులకు ఎంతగానో స్ఫూర్తినిస్తుందని నమ్ముతున్నాను.’’ అని చెప్పుకొచ్చారు.మహిళల క్రికెట్ పోటీల విజేతగా భారత్ నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో శ్రీలంకను 147 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్.. వరుసగా రెండో సారి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ సాధించింది. స్మృతి మంధాన (79), రిచా ఘోష్ (49 నాటౌట్) రాణించారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో శ్రీలంక 69 పరుగులకే కుప్పకూలింది. దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా, శ్రీచరణి, శ్రేయాంక, షఫాలీ వర్మ తలా రెండు వికెట్లు పడగొట్టారు. My heartiest congratulations to the Indian women’s cricket team on winning the gold medal at the #AsianGames2026. The team’s dominant performance throughout has made the entire nation proud. Congratulations to captain Harmanpreet Kaur and every player of the team for this… pic.twitter.com/FSjiOZjNs7— YS Jagan Mohan Reddy (@ysjagan) September 22, 2026ఇదీ చదవండి: వరుస విజయాలు.. దుమ్ములేపుతున్న భారత హాకీ జట్లు -
వరుస విజయాలతో దుమ్ములేపుతున్న భారత హాకీ జట్లు
ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్లు (పురుషులు, మహిళలు) వరుస భారీ విజయాలతో దుమ్మురేపుతున్నాయి. జపాన్‌లోని కకమిగహారా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భారత జట్లు ప్రత్యర్థులపై గోల్స్ వర్షం కురిపిస్తూ టోర్నమెంట్లో దూసుకుపోతున్నాయి. పురుషుల విభాగంలో మంగళవారం గ్రూప్-ఏలో భారత్ 16-1 తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. మ్యాచ్‌లో జుగ్రాజ్ సింగ్ 4 గోల్స్ చేయగా, అభిషేక్, దిల్‌ప్రీత్ సింగ్ చెరో హ్యాట్రిక్ సాధించారు. అంతకముందు తాము ఆడిన తొలి మ్యాచ్‌లో భారత్ 13-1తో ఇండోనేషియాపై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.ఇక మహిళల విభాగంలో ఇవాళే జరిగిన పూల్-బి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 17-1తో ఇండోనేషియాను మట్టికరిపించింది. దీపికా సెహ్రావత్, రుతుజా పిసల్ హ్యాట్రిక్లతో చెలరేగారు. అంతకముందు ఉజ్బెకిస్తాన్‌పై అమ్మాయిల జట్టు 19-0 తేడాతో ఇందులో దీపికా ఒక్కరే ఏకంగా 8 గోల్స్ చేయడం విశేషం. ఇక భారత పురుషుల జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో సెప్టెంబర్ 24న బలమైన సౌత్ కొరియాతో తలపడనుంది.ఇక మంగళవారం భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. క్రికెట్లో భారత మహిళల జట్టు స్వర్ణం సాధించింది. హర్మన్‌ప్రీత్ సేనకు ఆసియా క్రీడల్లో ఇది వరుసగా రెండో స్వర్ణం కావడం విశేషం. దీంతో భారత్ తమ పతకాలు సంఖ్యను ఏడుకు పెంచుకుంది. ఇందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలున్నాయి. మిగిలిన క్రీడల విభాగానికొస్తే బ్యాడ్మింటన్, వుశు క్రీడల్లో భారత్‌కు పతకాలు ఖాయమయ్యాయి. కబడ్డీ పురుషుల జట్టు 63-31తో సౌత్ కొరియాను చిత్తు చేసింది. ఇక షూటింగ్లో తొలిరోజు రెండు రజతాలు రాగా, సోమవారం రెండు రజతాలు, ఒక కాంస్యం వచ్చి చేరాయి.ఇదీ చదవండి: జపాన్‌పై విజయం.. తక్కువ మార్జిన్‌తో భారత్ గట్టెక్కిన సందర్భాలు! -
ఫైనల్లో శ్రీలంకను మట్టికరిపించిన భారత్.. మరోసారి స్వర్ణం!
ఆసియా క్రీడలు- 2026 మహిళల టీ20 టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. జపాన్ వేదికగా మంగళవారం జరిగిన ఫైనల్లో శ్రీలంకను 147 పరుగుల తేడాతో మట్టికరిపించిన హర్మన్‌ప్రీత్ సేన మరోసారి చాంపియన్‌గా అవతరించింది. వరుసగా రెండోసారి సగర్వంగా పసిడి పతకాన్ని ముద్దాడింది.ఫైనల్ వరకు ఇలాజపాన్ వేదికగా ఆసియా క్రీడల్లో నేరుగా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టిన భారత మహిళల జట్టు.. జపాన్ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి సెమీస్‌కు చేరింది. సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను 114 పరుగుల తేడాతో చిత్తు చేసి టైటిల్ పోరుకు రెండోసారి అర్హత సాధించింది.స్మృతి, షఫాలి ధనాధన్‌ఈ క్రమంలో కరోగి స్పోర్ట్స్ వేదికగా శ్రీలంకతో మంగళవారం నాటి స్వర్ణ పతక పోరులో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు షఫాలి వర్మ, స్మృతి మంధాన అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. షఫాలి 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 48 పరుగులు సాధించింది.Smriti Mandhana brings up a fluent 50* off just 30 balls to put India firmly in control of the Gold Medal match! 🥇Watch Sri Lanka vs India, in the Women's Cricket Final at the 20th Asian Games Aichi-Nagoya, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.… pic.twitter.com/NsZ6db9Ciu— Sony Sports Network (@SonySportsNetwk) September 22, 2026రిచా మెరుపులుమరోవైపు.. స్మృతి 30 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకుని జోరు కొనసాగించింది. మొత్తంగా 45 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 79 పరుగులు రాబట్టింది. ఇక వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (17 బంతుల్లో 19) నిరాశపరచగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడింది.𝐑𝐈𝐂𝐇𝐀 𝐆𝐇𝐎𝐒𝐇 𝐓𝐔𝐑𝐍𝐒 𝐔𝐏 𝐓𝐇𝐄 𝐏𝐎𝐖𝐄𝐑! 💥Big hits in the final overs as she provides the perfect finish to India’s innings against Sri Lanka! 🔥Watch Sri Lanka vs India, in the Women's Cricket Final at the 20th Asian Games Aichi-Nagoya, LIVE NOW on Sony… pic.twitter.com/l6WJHKCwEL— Sony Sports Network (@SonySportsNetwk) September 22, 2026కేవలం 22 బంతుల్లోనే రిచా 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 49 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆఖర్లో భారతి ఫుల్మలి ఏడు బంతుల్లో ఏడు పరుగులతో రిచాకు తోడుగా నిలిచింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో భారత మహిళా జట్టు కేవలం మూడు వికెట్ల నష్టానికి ఏకంగా 216 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.నిప్పులు చెరిగిన భారత బౌలర్లు217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఆరంభంలోనే ఓపెనర్ ఇమేషా దులాని (3), వన్‌డౌన్ బ్యాటర్ హన్సిని పెరీరా (0)ల వికెట్లు తీసి షఫాలి వర్మ శుభారంభం అందించగా.. ఆ తర్వాత దీప్తి శర్మ విజృంభించింది.కెప్టెన్ చమరి ఆటపట్టు (29) రూపంలో కీలక వికెట్ దక్కించుకున్న దీప్తి.. కవిశా దిల్హరి (11), సుగందిక కుమారి (3)ని కూడా అవుట్ చేసింది. ఇక కడప అమ్మాయి శ్రీచరణి హన్సిమ కరుణరత్నె (1), కావ్యా కవింది (2) రూపంలో రెండు వికెట్ల దక్కించుకోగా.. హర్షిత సమరవిక్రమ (0), కౌశాని నూత్యాంగన (14) వికెట్లను శ్రేయాంక పాటిల్ దక్కించుకుంది.ఈ క్రమంలో 15.4 ఓవర్లలో కేవలం 69 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయింది. ఫలితంగా.. భారత్ 147 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి.. స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.మళ్లీ అదే పునరావృతం.. గోల్డ్ గెలిచిన భారత్2023 ఆసియా క్రీడల ఫైనల్లోనూ భారత్- శ్రీలంక తలపడ్డాయి. ఈ క్రమంలో హర్మన్ సారథ్యంలోని టీమిండియా లంకపై 19 పరుగుల తేడాతో గెలిచి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. తాజాగా మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేసింది.చదవండి: భారత ఓపెనర్ వరల్డ్ రికార్డుజపాన్తో మ్యాచ్‌లో టీమిండియా చెత్త రికార్డు -
IND vs SL: ఓపెనర్ వరల్డ్ రికార్డు.. ఫైనల్లో భారత్ భారీ స్కోరు
భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో పదకొండు వేల పరుగుల మైలురాయిని చేరిన తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సాధించింది. ఆసియా క్రీడలు-2026 టీ20 టోర్నమెంట్లో భాగంగా శ్రీలంకతో పసిడి పతక పోరు సందర్భంగా.. స్మృతి ఈ ఘనత సాధించింది.ఓపెనర్లు ధనాధన్జపాన్లోని నిశిన్ వేదికగా కరోగి స్పోర్ట్స్ పార్కులో మంగళవారం నాటి ఫైనల్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలి వర్మ శుభారంభం అందించారు. స్మృతి దూకుడుగా మొదలుపెట్టగా.. కాస్త సమయం తీసుకున్న షఫాలి ఆ తర్వాత వేగం అందుకుంది.ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 60 బంతుల్లో 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, తొమ్మిదో ఓవర్లో చముది ప్రబోద బౌలింగ్‌లో కావ్యా కవిందికి క్యాచ్ ఇచ్చి షఫాలీ తొలి వికెట్‌గా వెనుదిరగగా.. స్మృతి మాత్రం జోరు కొనసాగించింది. ప్రబోద బౌలింగ్‌లో రెండో బంతికి సింగిల్ తీసి యాభై పరుగుల మార్కును అందుకుంది.37వ అర్ధ శతకం కాగా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో స్మృతికి ఇది 37వ అర్ధ శతకం కావడం విశేషం. కేవలం 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. దురదృష్టవశాత్తూ సెంచరీ మార్కు అందుకోలేకపోయింది. సుగందిక కుమారి బౌలింగ్‌లో కవిశా దిల్హరికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది.Smriti Mandhana brings up a fluent 50* off just 30 balls to put India firmly in control of the Gold Medal match! 🥇Watch Sri Lanka vs India, in the Women's Cricket Final at the 20th Asian Games Aichi-Nagoya, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.… pic.twitter.com/NsZ6db9Ciu— Sony Sports Network (@SonySportsNetwk) September 22, 2026భారత్ భారీ స్కోరుఈ మ్యాచ్‌లో మొత్తంగా 45 బంతులు ఎదుర్కొన్న స్మృతి ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసింది. ఇక మిగిలిన వారిలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (17 బంతుల్లో 19) నిరాశపరచగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ ఆకాశమే హద్దుగా చెలరేగింది.కేవలం 22 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 49 పరుగులతో అజేయంగా నిలిచింది రిచా. ఇక భారతి ఫుల్మలి ఏడు బంతుల్లో 7 పరుగులతో రిచాకు తోడుగా నిలవగా.. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో భారత్ కేవలం మూడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో సుగందిక కుమారి, కవిశా దిల్హరి, చముది ప్రబోద తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.చదవండి: చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా.. -
టీమిండియా ప్రపంచ రికార్డు
భారత మహిళల క్రికెట్ జట్టు మరో ప్రపంచ రికార్డు సమం చేసింది. మహిళల టీ20 అంతర్జాతీయాల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జట్టుగా ఇంగ్లండ్ సరసన నిలిచింది. ఏషియన్ గేమ్స్ 2026లో భాగంగా శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న స్వర్ణ పతక మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది.ఈ మ్యాచ్‌లో భారత్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల సంఖ్య 233కు చేరింది. ప్రస్తుతం ఇంగ్లండ్ కూడా అన్నే మ్యాచ్‌లతో భారత్ సరసన ఉంది. ఈ జాబితాలో భారత్, ఇంగ్లండ్ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (213), వెస్టిండీస్ (206), పాకిస్తాన్ (205), న్యూజిలాండ్ (204) ఉన్నాయి.2006లో మొదలైన ప్రయాణంమహిళల టీ20ల్లో భారత్ ప్రయాణం 2006లో ప్రారంభమైంది. ఇప్పటివరకు ఆడిన 233 మ్యాచ్‌ల్లో 130 విజయాలు, 95 పరాజయాలు నమోదు చేసింది. ఒక మ్యాచ్ టై కాగా, ఆరు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.మ్యాచ్ విషయానికొస్తే.. స్వర్ణ పతక మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తుంది. 16 ఓవర్లు ముగిసే సమయానికి జట్టు స్కోర్ 157-2గా ఉంది. షఫాలీ వర్మ (48), హర్మన్‌ప్రీత్ (19) ఔట్ కాగా.. స్మృతి మంధన (79), రిచా ఘోష్ (10) క్రీజ్‌లో ఉన్నారు. ఇదీ చదవండి: చరిత్ర సృష్టించి టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
చరిత్ర సృష్టించి టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
భారత మహిళల జట్టు స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఆసియా క్రీడల మహిళల టీ20 టోర్నమెంట్ ఫైనల్లో శ్రీలంకపై షెఫాలీ సంచలన ఇన్నింగ్స్ ఆడింది. కోరోగి స్పోర్ట్స్ పార్క్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించింది. తన సహచర ఓపెనర్ స్మృతి మంధానతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న షెఫాలీ.. 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48 పరుగులు చేసి ఔటైంది. ఈ క్రమంలో షెఫాలీ వర్మ ఓ ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఒక క్యాలెండర్ ఈయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా షెఫాలీ రికార్డులకెక్కింది. ఈ ఏడాది షెఫాలీ ఇంటర్ననేషనల్ టీ20ల్లో 863 పరుగులు చేసింది. దీంతో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (824)ను షెఫాలీ అధిగమించింది. కాగా ఈ టోర్నీలో షెఫాలీ మొత్తంగా 188 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతోంది.మహిళల టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు వీరే863 - 2026లో షఫాలీ వర్మ*824 - 2026లో లారా వోల్వార్డ్ట్ .800 - 2026లో నటాషా మైల్స్ (హాంకాంగ్).779 - 2025లో ఈషా ఓజా (యూఏఈ).779 - 2026లో యాస్మిన్ దాస్వానీ (హాంకాంగ్).UPDATE: స్మృతి మంధాన వరల్డ్ రికార్డు... భారత్ భారీ స్కోరుచదవండి: జపాన్‌తో చారిత్రక టీ20.. వైభవ్ ఇన్! సంజూ అవుట్? -
Asian Games Final: టీమిండియాదే గోల్డ్ మెడల్.. ఫైనల్లో శ్రీలంక చిత్తు
ఏషియన్ గేమ్స్ మహిళల క్రికెట్ పోటీల విజేతగా భారత్ నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో శ్రీలంకను 147 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్.. వరుసగా రెండో సారి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం భారీ లక్ష్య చేధనలో శ్రీలంక 69 పరుగులకే కుప్పకూలింది.తొమ్మిదో వికెట్ డౌన్శ్రీలంక తొమ్మిదో వికెట్ కోల్పోయింది. మిథాలి అయోధ్య(0) రనౌటైంది. భారత్ విజయానికి ఒక్క వికెట్ దూరంలో నిలిచింది.ఎనిమిదో వికెట్ కోల్పోయిన శ్రీలంక13.1వ ఓవర్: దీప్తి బౌలింగ్‌లో ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగిన సుగందిక (3).మిథాలి అయోధ్య క్రీజులోకి రాగా.. కౌశాని 9 పరుగులతో ఉంది. స్కోరు: 63-8ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక10.2వ ఓవర్: శ్రీచరణి బౌలింగ్‌లో కావ్యా కవింది (2) రిచాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. సుగందిక కుమారి క్రీజులోకి వచ్చింది. స్కోరు: 54-7. కౌశాని ఒక పరుగుతో ఉండగా.. సుగందిక రెండు పరుగులు చేసింది.ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంక9.1వ ఓవర్: దీప్తి శర్మ బౌలింగ్‌లో కవిశా దిల్హరి (11) క్యాచౌట్ అయింది. శ్రీలంక స్కోరు: 49-6. కౌశాని సున్నా పరుగులతో ఉంది.ఐదో వికెట్ కోల్పోయిన శ్రీలంక8.4వ ఓవర్: శ్రీచరణి బౌలింగ్‌లో హన్సిమా కరుణరత్నె (1) భారతికి క్యాచ్ ఇచ్చి అవుటైంది. కౌశాని నూత్యాంగన క్రీజులోకి వచ్చింది. స్కోరు: 49-5 (9).నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక7.3వ ఓవర్: శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. శ్రియాంక పాటిల్ బౌలింగ్‌లో హర్షితా డకౌటైంది. హన్సిమా క్రీజులోకి వచ్చింది. 7.3 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 44/4మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక6.5వ ఓవర్: దీప్తి శర్మ బౌలింగ్ భారతికి క్యాచ్ ఇచ్చి మూడో వికెట్‌గా వెనుదిరిగిన కెప్టెన్ చమరి ఆటపట్టు (21 బంతుల్లో 29). హర్షిత సమరవిక్రమ క్రీజులోకి రాగా.. కవిశా ఆరు పరుగులతో ఉంది. స్కోరు: 43-3.పవర్ ప్లేలో శ్రీలంక స్కోరు: 41-2👉విజయానికి 84 బంతుల్లో 176 పరుగులు కావాలి👉ఆటపట్టు 27, కవివా ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక👉4.2వ ఓవర్: షఫాలి వర్మ బౌలింగ్‌లో హన్సిని పెరీరా భారతి ఫుల్మలికి క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగింది. కవిశా దిల్హరి క్రీజులోకి వచ్చింది. ఐదు ఓవర్లలో లంక స్కోరు: 31-2. ఓపెనర్ ఆటపట్టు 22 పరుగులతో ఉంది.తొలి వికెట్ కోల్పోయిన లంక👉2.5వ ఓవర్: షఫాలి వర్మ బౌలింగ్‌లో ఇమేషా దులాని స్టంపౌట్ (3). హన్సిని పెరీరా క్రీజులోకి వచ్చింది. శ్రీలంక స్కోరు: 22-1 (3)భారత్ భారీ స్కోరుఓపెనర్లు స్మృతి మంధాన (45 బంతుల్లో 79), షఫాలి వర్మ (29 బంతుల్లో 48) భారీ స్కోరుకు పునాది వేయగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. కేవలం 22 బంతుల్లోనే ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 49 పరుగులతో అజేయంగా నిలిచింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో భారత్ కేవలం మూడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో సుగందిక కుమారి, కవిశా దిల్హరి, చముది ప్రబోద తలా ఒక వికెట్ పడగొట్టారు.పందొమ్మిది ఓవర్లలో భారత్ స్కోరు: 191-3👉సుగందిక పొదుపుగా బౌలింగ్ చేయడంతో పందొమ్మిదో ఓవర్లో భారత్ తొమ్మిది పరుగులే చేయగలిగింది. రిచా 32, భారతి 7 పరుగులతో ఉన్నారు.పద్దెనిమిది ఓవర్లలో భారత్ స్కోరు: 182-3👉కావ్యా కవింది బౌలింగ్‌లో మూడో బంతికి ఫోర్, నాలుగో బంతికి సిక్సర్ బాదిన రిచా👉భారతి ఒకటి, రిచా 15 బంతుల్లో 30 పరుగులతో ఉన్నారు.పదిహేడు ఓవర్లలో భారత్ స్కోరు: 163-3అయ్యో స్మృతి👉16.5వ ఓవర్: సుగందిక కుమారి బౌలింగ్‌లో కవిశాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన స్మృతి మంధాన. మొత్తం 45 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. సెంచరీ దిశగా పయనిస్తున్న వేళ దురదృష్టవశాత్తూ అవుటైంది. భారతిక్రీజులోకి రాగా.. రిచా 15 పరుగులతో ఉంది.పదహారు ఓవర్లలో భారత్ స్కోరు: 157-2👉ప్రబోద బౌలింగ్‌లో రెండు, మూడో బంతికి రిచా ఫోర్లు బాదగా.. ఆఖరి బంతికి స్మృతి సిక్సర్ బాదింది.👉స్మృతి 44 బంతుల్లో 79, రిచా 6 బంతుల్లో 10 పరుగులతో ఉన్నారు.పదిహేను ఓవర్లలో భారత్ స్కోరు: 142-2👉రిచా 5, స్మృతి 73 పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన భారత్👉14.4వ ఓవర్: కవిశా దిల్హరి బౌలింగ్‌లో ఆటపట్టుకు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగిన హర్మన్ (17 బంతుల్లో 19). రిచా ఘోష్ క్రీజులోకి వచ్చింది.పద్నాలుగు ఓవర్లలో భారత్ స్కోరు: 136-1👉కావ్యా కవింది బౌలింగ్‌లో నాలుగో బంతికి సిక్సర్ బాదిన స్మృతి👉ఆరో బంతికి ఫోర్ బాదిన హర్మన్👉స్మృతి 72, హర్మన్ 15 పరుగులతో ఉన్నారు.పదమూడు ఓవర్లలో భారత్ స్కోరు: 123-1👉కవిశా బౌలింగ్‌లో తొలి బంతికి హర్మన్ ఫోర్ బాదగా.. ఆఖరి బంతికి స్మృతి బంతిని బౌండరీ దాటించింది.👉స్మృతి 65, హర్మన్ 10 పరుగులతో ఉన్నారు.పన్నెండు ఓవర్లలో భారత్ స్కోరు: 112-1👉ప్రబోద పొదుపుగా బౌలింగ్ చేయగా.. స్మృతి 37 బంతుల్లో 60, హర్మన్ 4 పరుగులతో ఉన్నారు.పదకొండు ఓవర్లలో భారత్ స్కోరు: 107-1👉ఆటపట్టు బౌలింగ్‌లో మూడో బంతికి ఫోర్ బాదిన స్మృతి👉హర్మన్ 2, స్మ1తి 57 పరుగులతో ఉన్నారు.పది ఓవర్లలో భారత్ స్కోరు: 99-1తొలి వికెట్ డౌన్👉9.6వ ఓవర్: ప్రబోద బౌలింగ్‌లో కావ్యాకుక్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన షఫాలి (29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు: 48 రన్స్). హర్మన్ క్రీజులోకి రాగా.. స్మృతి 51 పరుగులతో ఉంది.మంధాన అర్ధ శతకం👉9.2వ ఓవర్: ప్రబోద బౌలింగ్‌లో సింగిల్ తీసి అర్ధ శతకం (30 బంతుల్లో) పూర్తి చేసుకున్న స్మృతి మంధాన. ఆమెకు అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఇది 37వ ఫిఫ్టీ.తొమ్మిది ఓవర్లలో భారత్ స్కోరు: 95-0👉కవిశా దిల్హరి బౌలింగ్ చేయగా.. నాలుగో బంతికి సిక్సర్ బాదిన షఫాలి👉స్మృతి 49, షఫాలి 46 పరుగులతో ఉన్నారు.ఎనిమిది ఓవర్లలో భారత్ స్కోరు: 88-0👉చముది ప్రబోద బౌలింగ్‌లో ఐదో బంతికి సిక్సర్ బాదిన స్మృతి👉షఫాలి 21 బంతుల్లో 39, స్మృతి 27 బంతుల్లో 48 పరుగులతో ఉన్నారు.ఏడు ఓవర్లలో భారత్ స్కోరు: 77-0👉కవిశా దిల్హరి బౌలింగ్‌లో మూడో బంతికి ఫోర్ బాదిన షఫాలి👉స్మృతి 23 బంతుల్లో 40, షఫాలి 19 బంతుల్లో 37 పరుగులతో ఉన్నారు.పవర్ ప్లేలో భారత్ స్కోరు (6 ఓవర్లు): 67-0👉కావ్యా కవింది బౌలింగ్‌లో తొలి బంతికే ఫోర్ బాదిన షఫాలి👉అనంతరం కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన కావ్యా👉స్మృతి 21 బంతుల్లో 38, షఫాలి 15 బంతుల్లో 29 పరుగులతో ఉన్నారు.ఐదు ఓవర్లలో భారత్ స్కోరు: 59-0👉చమరి ఆటపట్టు బౌలింగ్ తొలి బంతికే ఎల్బీడబ్ల్యూ గండం తప్పించుకున్న షఫాలి. అనంతరం రెండు, మూడో బంతుల్లో సిక్సర్లు బాదిన షఫాలి.👉తానేం తక్కువ కాదంటూ ఆరో బంతికి సిక్స్ కొట్టిన స్మృతి👉స్మతి 36, షఫాలి 23 పరుగులతో ఉన్నారు.నాలుగు ఓవర్లలో భారత్ స్కోరు: 40-0👉మిథాలి అయోధ్య బౌలింగ్‌లో తొలి బంతికే షఫాలి ఫోర్ బాదగా.. మూడో బంతికి బౌండరీ బాదిన స్మతి, నాలుగో బంతికి సిక్స్ కొట్టింది. స్మృతి 17 బంతుల్లో 30, షఫాలి 10 పరుగులతో ఉన్నారు.మూడు ఓవర్లలో భారత్ స్కోరు: 25-0👉సుగందిక బౌలింగ్‌లో మూడు, నాలుగు బంతుల్లో సిక్సర్లు బాదిన స్మృతి. స్మృతి 13 బంతుల్లో 20, షఫాలి ఐదు బంతుల్లో ఐదు పరుగులతో ఉన్నారు.రెండు ఓవర్లలో భారత్ స్కోరు: 12-0👉మిథాలి అయోధ్య పొదుపుగా బౌలింగ్ చేయడంతో ఈ ఓవర్లో కేవలం మూడు పరుగులే వచ్చాయి. స్మృతి 8, షఫాలి 4 పరుగులతో ఉన్నారు. తొలి ఓవర్లో భారత్ స్కోరు: 9-0👉సుగందిక కుమారి తొలి ఓవర్ వేయగా.. స్మృతి మంధాన 8 (4,4), షఫాలి వర్మ ఒక పరుగుతో ఉన్నారు. తుదిజట్లుభారత మహిళల జట్టుస్మృతి మంధాన, షఫాలీ వర్మ, గుణాలన్ కమలిని, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), భారతి ఫుల్మలి, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, శ్రీచరణి, నందిని శర్మ, క్రాంతి గౌడ్.శ్రీలంక మహిళల జట్టుఇమేషా దులాని, చమరి ఆటపట్టు (కెప్టెన్), హన్సిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, కవిశా దిల్హరి, హన్సిమా కరుణరత్నె, కౌశాని నూత్యాంగన (వికెట్ కీపర్), మిథాలి అయోధ్య, కావ్యా కవింది, చముది ప్రబోద, సుగందిక కుమారి. -
Asian Games 2026: క్రికెట్లో పాక్‌కు కాంస్య పతకం
ఏషియన్ గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో పాకిస్తాన్‌కు కాంస్య పతకం లభించింది. ఇవాళ జరిగిన ఈ పతక పోరులో పాక్ బంగ్లాదేశ్‌ను 31 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ లక్ష్యానికి 32 పరుగుల దూరంలో నిలిచిపోయింది.పాక్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ఫాతిమా సనా (45) రాణించగా.. షవాల్ జుల్ఫికర్ (17), గుల్ ఫెరోజా (31), ఆలియా రియాజ్ (25) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. బంగ్లా బౌలర్లలో నహిద అక్తర్, షోర్నా అక్తర్, రితూ మోనీ తలో 2 వికెట్లు తీయగా.. సంజిద అక్తర్ ఓ వికెట్ దక్కించుకుంది.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ చతికిలపడింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు తరఫున వారి కెప్టెన్ షర్మిన్ అక్తర్ (46 నాటౌట్) ఒంటరిపోరాటం చేసినా, ప్రయోజనం లేకుండా పోయింది. పాక్ బౌలర్లలో ఉమ్-ఏ-హనీ (4-1-10-3) బంగ్లాదేశ్‌ను భారీ దెబ్బ తీసింది. ఫాతిమా సనా, తస్మియ రుబాబ్, నష్రా సంధు, అయేషా జాఫర్ కూడా తలో చేయి వేసి బంగ్లా పతనంలో తమవంతు పాత్ర పోషించారు.ఈ క్రీడల్లో ఇవాళే స్వర్ణ పతకం మ్యాచ్ కూడా జరుగనుంది. ఆ పోరులో భారత్, శ్రీలంక తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు స్వర్ణం కైవసం చేసుకుంటే, ఓడిన జట్టు రజతంతో సరిపెట్టుకుంటుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇదీ చదవండి: ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా జొనాథన్ ట్రాట్ -
జపాన్‌లో క్రికెట్‌కు జై
సానో: ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ జట్లలో ఒకటి, డిఫెండింగ్ వరల్డ్ చాంపియన్ భారత్ తమ టి20 చరిత్రలో ఒక చారిత్రాత్మక పోరుకు సిద్ధమైంది. సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్లో నేడు భారత్, జపాన్ మధ్య ఏకైక టి20 మ్యాచ్ జరగనుంది. నంబర్‌వన్ టీమ్ భారత్, 41వ ర్యాంక్ టీమ్ జపాన్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బలాబలాల్లో భూమ్యాకాశాల మధ్య ఉన్నంత తేడా ఉంది. అయితే తొలిసారి జపాన్ గడ్డపై భారత్ ఆడుతుండటంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి పెరిగింది. పైగా టీమిండియా తమ పూర్తి స్థాయి బరిలోకి దిగుతుండటం మరో విశేషం. ‘జపాన్‌లో జపాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడతానని నా జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు’ అంటూ భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్య దీని గురించి చెబుతోంది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ప్రధానమంత్రుల మధ్య జరిగిన భేటీలో ఈ మ్యాచ్ ఖరారైంది. జపాన్ కోణంలో చూస్తే ఈ మ్యాచ్ ఆ జట్టుకు ఎంతో ప్రత్యేకం కానుంది. అందుకే జపాన్ క్రికెట్ అసోసియేషన్ కూడా అభిమానుల కోసం ఈ మ్యాచ్‌కు మంచి ప్రచారాన్ని కలి్పంచింది. మంగళవారం ఆ దేశంలో సెలవు దినం కాగా... 3,000–10,000 జపాన్ యెన్లు (సుమారు రూ. 1800–6000) ధరలతో టికెట్లు అమ్మకానికి ఉంచింది. అయితే భారీ వర్షం కారణంగా ఈ మ్యాచ్ జరగడం సందేహంగా మారింది. సోమవారం పడిన వానకు భారత జట్టు ప్రాక్టీస్ కూడా రద్దయింది. జపాన్ టి20 జట్టుకు కెండెల్ కడోవాకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. -
మళ్లీ గోల్స్ వర్షం...
కాకామిగహారా: ఆసియా క్రీడల హాకీ ఈవెంట్లో భారత మహిళల జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గోల్స్ వర్షం కురిపించింది. పూల్ ‘బి’లో భాగంగా సోమవారం ఇండోనేసియాతో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 17–1 గోల్స్ తేడాతో ఘనవిజయం అందుకుంది. ఆదివారం ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 19–0తో గెలిచిన సంగతి తెలిసిందే. ఇండోనేసియాతో పోరులో భారత్‌కు ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. భారత్ తరఫున రుతుజా పిసాల్ (15వ, 20వ, 38వ ని.లో), దీపిక సెహ్రావత్ (8వ, 28వ, 40వ ని.లో), నవ్‌నీత్ కౌర్ (35వ, 56, 57వ ని.లో) మూడు గోల్స్ చొప్పున సాధించి ‘హ్యాట్రిక్’ నమోదు చేశారు. సునెలితా టొప్పో (11వ, 30వ ని.లో), లాల్రెమ్సియామి (12, 16వ ని.లో), సాక్షి రాణా (25, 57వ ని.లో) రెండు గోల్స్ చొప్పున చేశారు. కెపె్టన్ సలీమా టెటె (35వ ని.లో), ఇషిక (36వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. భారత జట్టుకు 11 పెనాల్టీ కార్నర్లు లభించగా...ఏడింటిని గోల్స్‌గా మలిచింది. ఇండోనేసియా జట్టుకు అదితియా ఇనెస్ (32వ ని.లో) ఏకైక గోల్ అందించింది. బుధవారం జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో భారత్ తలపడుతుంది. సవితా పూనియా రికార్డు ఈ మ్యాచ్‌తో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన భారత మహిళా హాకీ క్రీడాకారిణిగా సీనియర్ గోల్‌కీపర్ సవితా పూనియా రికార్డు నెలకొలి్పంది. 320 మ్యాచ్‌లతో వందన కటారియా పేరిట ఉన్న ఈ రికార్డున 321 మ్యాచ్‌లతో సవితా సవరించింది. వరల్డ్ చాంపియన్ ఖాతాలో మరొకటి... రెండు సార్లు ప్రపంచ చాంపియన్... వరల్డ్ కప్‌లలో 2 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు, ఆసియా చాంపియన్‌షిప్‌లో 5 స్వర్ణాలు, 2 కాంస్యాలు, 2022 ఆసియా క్రీడల్లో స్వర్ణం... జపాన్‌లో పోటీలకు ముందే రుద్రాంష్ పాటిల్ పతకాల జాబితా ఇది. ఇప్పుడు వీటికి తోడు సోమవారం మరో రజతం, కాంస్యం అతని ఖాతాలో చేరాయి. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న షూటర్‌గా 23 ఏళ్లు రుద్రాంష్ గుర్తింపు పొందాడు. నాలుగేళ్ల క్రితమే వరల్డ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన అతను అభినవ్ బింద్రా తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత్ రైఫిల్ షూటర్‌గా నిలిచాడు. మహారాష్ట్రలోని థానేకు చెందిన రుద్రాంష్ గత ఆసియా క్రీడల్లో వరల్డ్ రికార్డు స్కోరు కూడా నమోదు చేశాడు. అయితే ఇన్ని రికార్డుల తర్వాత కూడా రుద్రాంష్ కు కనీసం ‘అర్జున అవార్డు’ కూడా దక్కలేదు. గత మూడేళ్లుగా దరఖాస్తు చేస్తున్నా తనను ఎంపిక చేయలేదంటూ నిరాశ వ్యక్తం చేసిన అతను... తాజా ఆసియా క్రీడల ప్రదర్శనతోనైనా అవార్డు వరిస్తుందని ఆశిస్తున్నాడు. రెజ్లింగ్ నుంచి షూటింగ్ వైపు... జూనియర్ ఆసియా చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన హిమాన్షు ఢిల్లాన్‌కు సీనియర్ స్థాయిలో ఇదే తొలి అంతర్జాతీయ పతకం కావడం విశేషం. ఈ నెల 29న తన 21వ పుట్టిన రోజు జరుపుకోనున్న హిమాన్షు వారం రోజుల ముందు తనకు తానే ప్రత్యేక కానుక ఇచ్చుకున్నాడు. హరియాణాలోని కైథల్ అతని స్వస్థలం. చిన్నప్పుడు క్రమశిక్షణ తప్పుతున్నాడని అతని తల్లిదండ్రులు గురుకుల పాఠశాలకు పంపించి చదివించారు. మరోవైపు 2016 రియో ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో బరిలోకి దిగిన అతని బాబాయ్ హర్దీప్ సింగ్ ఢిల్లాన్ ప్రోత్సాహంతో హిమాన్షుకు రెజ్లింగ్ కూడా నేర్పించే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రీడ చాలా కష్టంగా ఉందని, తన వల్ల కాదంటూ అతను తప్పుకున్నాడు. ఆ తర్వాత కోవిడ్ సమయంలో షూటింగ్‌పై ఆసక్తి కలిగి అతను గన్ పట్టుకున్నాడు. ఇక్కడ మాత్రం ఉదాసీనత కనబర్చలేదు. కోచ్, కుటుంబ సభ్యుల అండదండలతో తీవ్రంగా శ్రమించిన అతను దూసుకుపోయాడు. జూనియర్ స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆసియా క్రీడల పతకం వరకు చేరాడు.మరో కొత్త కెరటం... భారత షూటింగ్లో 19 ఏళ్ల పార్థ్ మానే కూడా కొత్తగా దూసుకొచ్చాడు. సరిగ్గా రెండేళ్ల క్రితం జూనియర్ వరల్డ్ చాంపియన్‌లో చాంపియన్‌గా నిలిచి వెలుగులోకి వచి్చన అతను అదే జోరును సీనియర్ స్థాయిలోనూ కొనసాగించాడు. ఈ క్రమంలో ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టులోకి ఎంపికైన పార్థ్ తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ టీమ్ ఈవెంట్లో భారత్ రజత విజయంలో తన పాత్ర పోషించాడు. మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన పార్థ్... పోలీసు అయిన తండ్రి ప్రోత్సాహంతో షూటింగ్‌లోకి వచ్చాడు. ముంబైలో ఒలింపియన్ సుమా శిరూర్ వద్ద శిక్షణ తీసుకుంటూ తన ఆటకు మరింత మెరుగులు దిద్దుకున్న అతను ఇప్పుడు తొలి ప్రయత్నంలోనే ఏషియాడ్ పతకం గెలుచుకున్నాడు. త్వరలో ఖతర్‌లో జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్‌కు, ఆపై 2028 ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే తన ప్రస్తుత లక్ష్యమని పార్థ్ వెల్లడించాడు. -
తొలి స్వర్ణంపై గురి
నిషిన్: ఆసియా క్రీడల్లో తొలి రెండు రోజులు రజత, కాంస్యాలకే పరిమితమైన భారత్‌కు మంగళవారం తొలి స్వర్ణం గెలుచుకునే చాన్స్ ఉంది. మహిళల క్రికెట్లో స్వర్ణపతకం కోసం జరిగే ఫైనల్ పోరులో నేడు శ్రీలంకతో భారత్ తలపడనుంది. గత ఆసియా క్రీడల ఫైనల్లోనూ శ్రీలంకనే ఓడించి హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల ఫామ్ ప్రకారం చూస్తే టీమిండియాదే పైచేయిగా కనిపిస్తోంది. ఇటీవలే ఆసియా కప్ ఫైనల్లో కూడా లంకను చిత్తు చేసి విజేతగా నిలిచిన భారత్... అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. ఆసియా క్రీడల్లో రెండు టీమ్‌లూ ప్రత్యర్థులపై అలవోక విజయాలతో ఫైనల్‌కు చేరాయి. ఓపెనర్లుగా చెలరేగుతున్న షఫాలీ వర్మ, స్మృతి మంధానలను నిలువరించడం లంకకు సాధ్యం కాకపోవచ్చు. మిడిలార్డర్లో హర్మన్ తదితరులు కొంత తడబడుతున్నా... రిచా ఘోష్ దూకుడు భారత్‌కు సానుకూలాంశం. బౌలింగ్‌లో శ్రీచరణి ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపిస్తోంది. క్రాంతి, నందని, దీప్తి శర్మ కూడా బ్యాటర్లపై ఆధిపత్యం ప్రదర్శించగలరు. మరోవైపు లంక ఆశలన్నీ కెపె్టన్ చమరి అటపట్టుపైనే ఉన్నాయి. ఆమె బాగా ఆడితేనే జట్టుకు విజయావకాశాలు ఉన్నాయి. పాక్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆడిన తరహాలోనే ఆమె నుంచి జట్టు మరో మంచి ప్రదర్శనను ఆశిస్తోంది. హర్షిత, కవీషా దిల్హారీ, సుగంధిక ఇతర కీలక ప్లేయర్లు. భారత్‌తో ఆడిన గత 7 మ్యాచ్‌లలోనూ శ్రీలంక ఓడింది. అయితే ఈ మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. అదే జరిగి మ్యాచ్ రద్దయితే మాత్రం మెరుగైన సీడింగ్ ఉన్న జట్టు (భారత్) విజేతగా ఖరారవుతుంది. -
హిమాన్షు, రుద్రాంష్ ‘డబుల్’ ధమాకా
ఆసియా క్రీడల్లో వరుసగా రెండో రోజు భారత షూటర్ల జోరు కొనసాగింది. షూటింగ్ తొలి రోజు రెండు రజతాలు అందించగా... సోమవారం మన ఖాతాలో మరో రెండు రజతాలు, ఒక కాంస్యం చేరాయి. వీటికి తోడు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఎ)లో భారత్‌కు కాంస్యం దక్కింది. భారత్ తరఫున రుద్రాంష్ పాటిల్, హిమాన్షు ఢిల్లాన్, పార్థ్ మానే, సుచిక పతకధారులుగా నిలిచారు. ఎప్పటిలాగే అంచనాలకు అనుగుణంగా బ్యాడ్మింటన్, కబడ్డీ, హాకీలతో పాటు టేబుల్ టెన్నిస్‌లో భారత ఆటగాళ్లు కీలక విజయాలు సాధించి పతక రేసులో మరో అడుగు ముందుకు వేశారు.నగోయా: అంచనాలను అందుకుంటూ షూటింగ్లో మరోసారి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ భారత్ రెండు రజత పతకాలు సొంతం చేసుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత్ రెండో స్థానంలో (1890.1 పాయింట్లు) నిలిచింది. రుద్రాంష్ పాటిల్, హిమాన్షు ఢిల్లాన్, పార్థ్ మానే ఈ జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఈ ముగ్గురి వ్యక్తిగత స్కోర్లు మొత్తం కలిపి వచ్చిన మొత్తం పాయింట్లతో భారత్‌కు రజతం దక్కింది. రుద్రాంష్ 631.8 పాయింట్లు, హిమాన్షు 630 పాయింట్లు, పార్థ్ 628.3 పాయింట్లు స్కోర్ చేశారు. ఈ ఈవెంట్లో చైనా స్వర్ణం (1899 పాయింట్లు) గెలుచుకోగా, దక్షిణ కొరియాకు కాంస్యం (1884.2 పాయింట్లు) లభించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలోనూ హిమాన్షు, రుద్రాంష్ సత్తా చాటారు. హిమాన్షు (252.4 పాయింట్లు) రజతం గెలుచుకోగా, రుద్రాంష్ (230.9 పాయింట్లు)కు కాంస్యం దక్కింది. ఈ ఈవెంట్లో లిహోవా షెంగ్ (చైనా–254.2 పాయింట్లు) స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. అయితే రజతం నెగ్గిన భారత జట్టులో ఉన్న మూడో షూటర్ పార్థ్ మానేకు మాత్రం వ్యక్తిగత ఈవెంట్ కలిసి రాలేదు. క్వాలిఫయింగ్‌లో 11వ స్థానంలో నిలిచిన అతను ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయాడు.700 గ్రామ్‌ల తేడాతో... మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఎ) మహిళల 60 కేజీల విభాగంలో భారత ఫైటర్ సుచిక తరియాల్ను దురదృష్టం వెంటాడింది. సోమవారం జరిగిన సెమీఫైనల్ పోరులో సింగపూర్‌కు చెందిన హుయ్ హూన్ టియో చేతిలో సుచిక పరాజయం పాలైంది. దాంతో ఆమె కాంస్య పతకానికే పరిమితమైంది. ఫైనల్ చేరే లక్ష్యంతో సోమవారం బరిలోకి దిగిన సుచిక పైచేయి సాధించినట్లు కనిపించినా... చివరకు 0–2తో ఓటమిపాలైంది. ముగ్గురు జడ్జీల సమక్షంలో రెండేసి నిమిషాల పాటు జరిగిన తొలి రెండు రౌండ్ల తర్వాత ఇద్దరు ప్లేయర్లు 1–1తో సమంగా నిలిచారు. ఒక జడ్జీ 19–19తో సమంగా పాయింట్లు ఇవ్వగా, మరొకరు సుచితకు 20–19తో ఆధిక్యం అందించారు. మూడో జడ్జీ సింగపూర్ ప్లేయర్‌కు అనుకూలంగా 20–19 పాయింట్లు ఇచ్చారు. అయితే అదనపు నిమిషంలో ఇద్దరు జడ్జీలు 10 చొప్పున పాయింట్లు ఇవ్వడంతో సింగపూర్ ప్లేయర్ విజేతగా నిలిచింది. కానీ ఈ ఫలితాన్ని భారత బృందం సవాల్ చేసింది. నిబంధనల ప్రకారం ఇందుకు 1000 డాలర్లు (సుమారు రూ. 96 వేలు) ఆర్బిటేషన్ ఫీజు కూడా చెల్లించింది. దాంతో అదనంగా మరో ముగ్గురు జడ్జీలను కేటాయించి వీడియో రీప్లేల ద్వారా మళ్లీ స్కోరింగ్ చేయించారు. అన్ని పరిశీలించిన తర్వాత ఈ న్యాయ నిర్ణేతల బృందం ఈ పోరు సమంగా సాగిందంటూ ‘డ్రా’గా ప్రకటించింది. అయితే ఇలాంటి స్థితిలో నిబంధనలను అనుసరించి తక్కువ బరువు ఉన్న ఫైటర్‌ను విజేతగా ప్రకటించారు. సుచిక (59.20 కేజీలు)తో పోలిస్తే టియో (58.50 కేజీలు) 700 గ్రామ్లు తక్కువ బరువు ఉంది. దాంతో టియో ఫైనల్‌కు చేరగా, భారత ప్లేయర్ ఆవేదనతో ని్రష్కమించింది. -
ఓన్లీ ఫర్ లేడీస్ ఆల్ హ్యాపీస్
భర్తలు టెన్నిస్‌కు వెళ్లడం... అపార్ట్మెంట్ ఏరియాలో బాడ్మింటన్ ఆడటం... భార్యలు వంట చేసుకుంటూ ఇంట్లోనే ఉండిపోవడం... ఈ రొటీన్ నడ్డి విరగ్గొట్టారు కోయంబత్తూరు స్త్రీలు. ఇక్కడి ‘యమునా నగర్ గ్రౌండ్’ అచ్చంగా పెళ్లయిన స్త్రీల ఆటస్థలం. కొత్త వధువులతో మొదలు అమ్మమ్మల వరకు అందరూ సాయంత్రమైతే ఆడటానికి వస్తుంటే భర్తలు మైదానం బయట వెయిట్ చేస్తుంటారు. ఆసియన్ గేమ్స్‌లో తెచ్చే మెడల్సు అవసరమే. ఇలాంటి గ్రౌండ్స్ వల్ల వివాహితలు పొందే హ్యాపీనెస్ మెడల్స్ అంతకు తక్కువ కాదు.సాయంత్రపు చలిగాలి మొదలవుతుండగానే ఆ గ్రౌండ్లో వేడి మొదలైపోతుంది. ఫ్లడ్‌లైట్లు వెలుగుతాయి. ఒక కోర్టులో త్రోబాల్, పక్క కోర్టులో షటిల్. ‘ఏయ్, గట్టిగా కొట్టవే’ అని ఒకామె కేక పెడితే, అవతలివైపు నుంచి ఒకామె బంతిని నేలకు బాదుతుంది. పాయింట్ వచ్చినా పోయినా ఒకటే సీన్– కేరింతలు, నవ్వులు, గట్టిగా హైఫైవ్‌లు. ఇక్కడ స్కోర్ బోర్డు లేదు. ఎవరూ ఓడరు. గెలిచినట్టు ఫీలవ్వడమే రూల్. అదే ఈ గ్రౌండ్ మ్యాజిక్.నుదుటి చెమటను కొంగుతో తుడుచుకుంటూ ముత్తమ్మ అనే ఆమె చెప్పిన మాట– ‘స్కూల్ రోజుల్లో వాలీబాల్ అంటే నాకు ప్రాణం. పెళ్లయ్యాక ఆ కలలన్నీ వంటింటి గోడల మధ్యే మగ్గిపోయాయి. 35 ఏళ్ల తర్వాత ఈ గ్రౌండ్‌తో నా నిరీక్షణ తీరింది. నేను, నా కూతురు, నా మనవరాలు ముగ్గురం ఒకే కోర్టులో ఆడుతున్నాం. ఒకే టీమ్‌లో. ఇంతకంటే ఏం కావాలి?’ ఈ మాట అనేవాళ్లు ప్రతి ఊళ్లో వేలమంది ఉన్నారు. కానీ వాళ్లకు ఒక యమునా నగర్ ఉందా... అన్నదే ప్రశ్న.వంటింటి అలసటకు చెక్ఆడవాళ్లకు రోజంతా ఒకటే లూప్. ఇల్లు, పిల్లలు, ఆఫీసు, మళ్లీ ఇల్లు. దీంతో చిన్నవయసులోనే డయాబెటిస్, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు, అంతకుమించి ఎవరికీ చెప్పుకోలేని మానసిక ఒంటరితనం. డాక్టర్లు రాసే మందు చీటీల కంటే ఈ గ్రౌండ్ బాగా పని చేస్తుందని యమునా నగర్ నిరూపిస్తోంది. అక్కడే ఆడుతున్న ఒక వర్కింగ్ ఉమన్ ఏమందంటే– ‘నాలుగున్నరకి గ్రౌండ్లోకి అడుగుపెడితే చాలు ఇల్లు, ఆఫీసు, టెన్షన్లన్నీ గేటు బయటే వదిలేస్తాం. రాత్రి తొమ్మిది వరకు ఆడుతాం. బంతిని నెట్ అవతలికి కొట్టిన ప్రతిసారీ బుర్రలోని భారం కూడా అవతల పడినట్టు ఉంటుంది’. నిజమే. నవ్వుతూ, అరుస్తూ, తోటివారితో కలిసి ఆడే ఆట ఇచ్చే ఫిట్నెస్, మెంటల్ పీస్ జిమ్‌లో రాదు. ఆరోగ్య నిపుణులు కూడా చెప్పేది అదే కదా.‘ఈ వయసులోనా?’ బిడియానికి బ్రేక్మొదట్లో ఈ గ్రౌండ్లో ఒకరిద్దరే ఉండేవారు. చాలామంది ఆడవాళ్లకు ఒకటే భయం – ‘ఈ వయసులో షార్ట్స్ వేసుకుని ఆడితే ఏమనుకుంటారు? నా వల్ల అవుతుందా?’ కానీ యమునా నగర్ గ్రౌండ్ ఆ భయాన్ని పోగొట్టింది. ఇక్కడ చుట్టూ ఉన్నవాళ్లంతా తనలాంటి ఇల్లాళ్లే. జడ్జ్ చేసేవాళ్లు ఎవరూ లేరు. అందుకే ట్రాక్‌సూట్ లేకపోయినా చీరతోనే, కంఫర్ట్‌గా ఉండే డ్రెస్‌తోనే మైదానంలోకి దూకేశారు. గ్రౌండ్లోకి రాగానే వయసు, హోదా అన్నీ మర్చిపోయి అందరూ ఒకటే టీమ్ అయిపోతున్నారు.ఈ గ్రౌండ్ ఎలా పుట్టింది?దీని వెనుక ఒక 75 ఏళ్ల పెద్దాయన మంచి మనసు ఉంది. ఆయన పేరు ఎస్.ఆర్.అరుచామి. కోయంబత్తూరు యమునా నగర్‌కే చెందిన మాజీ నేషనల్ లెవల్ వాలీబాల్ ప్లేయర్. పెళ్లయ్యాక ఆడవాళ్ల ఆట జీవితం ఎలా ముగిసిపోతుందో ఆయన చాలా దగ్గర్నుంచి చూశాడు. అందుకే తన సొంత స్థలాన్ని గ్రౌండ్‌గా మార్చాడు. రెండు త్రోబాల్ కోర్టులు, ఒక వాలీబాల్ కోర్టు వేశాడు. ఆడవాళ్లు పనులు ముగించుకుని సాయంత్రం వచ్చి ఆడుకునేలా ఫ్లడ్ లైట్లు పెట్టాడు. ఇప్పటికీ లైట్బిల్లు, మెయింటెనెన్స్ అంతా తన సొంత ఖర్చుతోనే భరిస్తున్నాడు. రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఒకరిద్దరి తో మొదలైన ఆ చిన్న ప్రయత్నం ఇప్పుడు 65 మంది గృహిణుల పెద్ద కుటుంబంగా మారింది.భర్తలు బయట ఉండాలిఈ మైదానంలో అందమైన రూల్ ఒకటుంది. కోర్టులో ఆడేది ఆడవాళ్లే. భర్తలు గ్రౌండ్ బయటే ఉండాలి. పిల్లల్ని చూసుకోవాలి, వాటర్ బాటిల్ అందించాలి. ఇన్నాళ్లూ భర్త ఆడి వస్తే భార్య కాఫీ కప్పుతో ఎదురు చూసేది. ఇప్పుడు భార్య హుషారుగా స్మాష్ కొడుతుంటే భర్త చప్పట్లు కొడుతూ ఎదురు చూస్తున్నాడు. భార్య సంతోషం కోసం భర్త సపోర్ట్‌గా మారడం ఇంతకంటే సమానత్వం ఏముంటుంది? ఒక గృహిణి మనసు హ్యాపీగా ఉంటేనే ఆ ఇల్లు స్వర్గమవుతుంది. అందుకే యమునా నగర్ లాంటి చిన్న గ్రౌండ్స్ ప్రతి కాలనీ లో, ప్రతి పల్లెలో వెలియాలి. అప్పుడే ప్రతి స్త్రీ మెడలో ఒక హ్యాపీనెస్ మెడల్ పడుతుంది. ∙ -
ఫైటర్ విత్ ఫైర్
పన్నెండేళ్ల వయసులో ఒక సెలూన్‌కు వెళ్లిన సుచికను చూసి అక్కడ పనిచేసే వ్యక్తి వెకిలిగా నవ్వాడు. అసభ్యకరంగా తాకాడు. ఆ చేదు అనుభవం సుచికను మార్షల్ ఆర్ట్స్ వైపు నడిపించడం ఒక ఎత్తయితే, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా దూసుకెళ్లడం మరో ఎత్తు.తాజాగా... ఆసియా గేమ్స్‌లో తొలిసారి ప్రవేశ పెట్టిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(ఎంఎంఏ)లో... మహిళల 60కేజీల విభాగంలో సుచికా తరియాల్ కాంస్య పతకం గెలుచుకుంది. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది...ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుధానాలో పుట్టిన సుచికా తరియాల్ హరియాణాలోని రోహ్తక్లో పెరిగింది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకున్నప్పుడు కుటుంబ సభ్యుల నుంచి మొదట్లో వ్యతిరేకత వచ్చినా ఆ తరువాత ఒప్పుకున్నారు. మార్షల్ ఆర్ట్స్‌లోకి అడుగు పెట్టడంతో తన సత్తా చాటే అవకాశం సుచికకు వచ్చింది. జూడో, కురాష్, జూజిట్స్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఎనిమిది సార్లు నేషనల్ జూడో ఛాంపియన్‌గా నిలిచింది.ఆర్థిక కష్టాలుసుచిక తండ్రి రిటైర్డ్ ఉద్యోగి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. తన క్రీడా ప్రయాణంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. ‘నాకు ఆర్థికంగా సమస్యలు ఉండేవి. అలాంటి సమయంలో నా భర్త సహాయం చేసేవారు. ధైర్యం చెప్పేవారు. అందుకే ఈ విజయాన్ని నా తల్లిదండ్రులకు, భర్తకు అంకితం చేస్తున్నాను’ అంటుంది 36 ఏళ్ల సుచిక.జర్నీ ఉమెన్మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో 2017లో అరంగేట్రం చేసింది సుచిక. ఆ తరువాత జూడో, జూజిట్స్ క్రీడలలో విజయవంతంగా రాణిస్తూనే ‘ఎంఎంఏ’కు కొన్ని సంవత్సరాల పాటు విరామం ఇచ్చింది. 2024లో బహ్రేయిన్లో జరిగిన బ్రేవ్ సీఎఫ్ 92 ఈవెంట్ ద్వారా ‘ఎంఎంఏ’లోకి తిరిగి అడుగు పెట్టింది. సుచికను ‘జర్నీ ఉమెన్’ అని కూడా పిలుస్తుంటారు. జూడో నుండి కురాష్, జూ–జిట్స్ మీదుగా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లోకి మారింది.ఆరాధ్య దేవత‘నాకు చిన్నప్పటి నుంచి అక్కడ మేరీ కోమ్ అక్క అంటే చాలా ఇష్టం. భోపాల్‌లో జరిగిన జాతీయ జూడో శిక్షణ శిబిరంలో ఆమెను చూశాను. ఆమె వేసుకున్న దుస్తులు, ప్రవర్తించే తీరు ఎంతో ఆకర్షణీయంగా అనిపించాయి. ఆమె నా ఆరాధ్యదేవత. నేను ఆమెతో ఎప్పుడూ వ్యక్తిగతం గా మాట్లాడలేదు. ఒకవేళ అవకాశం దొరికితే ఆమెతో మాట్లాడాలనుకుంటున్నాను’ అంటుంది సుచిక.యస్... రాణించగలను...సాధించగలను!ఎంఎంఏలో ప్రత్యేక శిక్షణ, ఆ క్రీడలో మునపటికంటే మెరుగైన నైపుణ్యంతో ఆసియా గేమ్స్ బరిలోకి దిగి కాంస్యాన్ని సాధించింది సుచిక. క్వార్టర్ ఫైనల్స్‌లో మంగోలియాకు చెందిన అల్తాన్ చిమెగ్ను ఓడించింది.బరువైన నిర్ణయం!కంబాట్ స్పోర్ట్స్‌లో పోటీకి ముందు ప్రతి అథ్లెట్ బరువు తూచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను రిఫరీలు నిర్వహిస్తారు. బరువు తూచడానికి ఒక గంట ముందు వరకు ట్రయల్ వెయిట్–ఇన్ల కోసం అధికారిక తూనిక యంత్రాలను ఉపయోగించుకునే హక్కు అథ్లెట్లకు ఉంటుంది. బరువు ఎక్కువైనా, బరువు తూచడంలో పాల్గొనకపోయినా పోటీ నుండి అనర్హులుగా ప్రకటిస్తారు. ఈ బరువు తూచడాలు ఆటలో కీలక పాత్ర పోషిస్తాయి. డ్రా అయిన పోటీలో ఇవి అంతిమంగా విజేతను నిర్ణయిస్తాయి. తక్కువ బరువు ఉన్న అథ్లెట్‌ను విజేతగా నిర్ణయిస్తారు.ఎందుకలా?!ఫైనల్లోకి అడుగు పెట్టేందుకు సింగపూర్‌కు చెందిన హుయ్ హూన్ టియోతో తలపడింది సుచిక. హుయ్‌ను విజేతగా ప్రకటించిన తరువాత తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన సుచిక తన ప్రత్యర్థితో కరచాలనం చేయడానికి నిరాకరించింది. రిఫరీ, టియో చేతిని పైకి ఎత్తగానే మ్యాట్‌పై మోకాళ్లపై కూలబడి విలపించింది సుచిక. ఫలితాలు ప్రకటించిన తీరు ఆమెకు తీవ్రమైన నిరాశను కలిగించింది. ఇద్దరు ఫైటర్లు హోరాహోరీ తల పడిన ఆ పోరులో, నిర్ణీత సమయంలో విజేత ఎవరనేదీ స్పష్టంగా తెలియలేదు. రిఫరీలు మొదట సింగపూర్ క్రీడాకారిణిని విజేతగా ప్రకటించడంతో భారత బృందం తీవ్ర నిరాశకు గురైంది. ‘జడ్జ్‌ల నిర్ణయంతో నేను ఎంత మాత్రం ఏకీభవించలేదు. వారి నిర్ణయం న్యాయంగా లేదు. మా అంతర్జాతీయ ఫెడరేషన్ సింగపూర్‌కు చెందింది. ఆమె కూడా సింగపూర్‌కు చెందిన అమ్మాయే’ అంటుంది సుచిక. రిఫరీ నిర్ణయాన్ని భారత బృందం సవాలు చేయగా, ఆ ఫైట్‌ను డ్రాగా ప్రకటించారు. దీంతో బరువు నిబంధనల ప్రకారం టియోను విజేతగా ప్రకటించారు. సుచిక తన ప్రత్యర్థి కంటే 700 గ్రాములు ఎక్కువ బరువు ఉంది. దీంతో టియో ఫైనల్‌కు చేరుకోగా, సుచిక కాంస్యంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బరువు నిబంధనల కారణంగా ఆమె ఫైనల్లోకి అడుగు పెట్టే అపూర్వమైన అవకాశాన్ని కోల్పోయింది. సుచిక దుఃఖం సంగతి ఎలా ఉన్నప్పటికీ ఆసియా క్రీడలలో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఇదే మొట్టమొదటి పతకం కావడం విశేషంగా మారింది.‘ ఇది నా జీవితం కంటే విలువైనది. జపాన్‌కు వచ్చి నా దేశానికి పతకం తీసుకువెళుతున్నానన్న విషయాన్ని ఎప్పుడూ మరచిపోలేను. ఇక నేను సంతోషంగా చనిపోవచ్చు. ఆసియా గేమ్స్ తరువాత ఎంఎంఏకి స్వప్తి పలకాలని అనుకున్నాను. అయితే ఇప్పటికీ నాలో శక్తి ఉందని అనిపిస్తోంది. ఈరోజు నా పెర్ఫార్మెన్స్ను విశ్లేషించుకున్న తరువాత ఇంకా రాణించగలనని అనిపిస్తోంది’ భావోద్వేగంతో... ఆత్మవిశ్వాసంతో నిండిన గొంతుతో అంటుంది సుచికా తరియాల్.– యాకుబ్ పాషా -
IND: జపాన్, లంక, ఆసీస్‌తో.. రేపు రెండు టీ20లు, ఒక ‘టెస్టు’!
భారత క్రికెట్ అభిమానులకు మంగళవారం (సెప్టెంబరు 22) పండుగే!.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు మ్యాచ్‌లకు రేపు షెడ్యూల్ ఖరారైంది. ఆసియా క్రీడలు-2026 మహిళల టీ20 టోర్నీ ఫైనల్లో భాగంగా భారత్ శ్రీలంకతో తలపడేందుకు సిద్ధమైంది.ఈ పసిడి పతక పోరులో హర్మన్ సేన- చమరి ఆటపట్టు బృందం అమీతుమీ తేల్చుకుంటాయి. మరోవైపు.. చారిత్రక మ్యాచ్‌లో టీమిండియా (పురుషుల జట్టు) జపాన్‌తో తొలిసారి టీ20 మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది.మరో మ్యాచ్‌లో భారత్-‘ఎ’ జట్టు ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్‌లో భాగంగా మంగళవారమే తొలి మ్యాచ్ మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో భారత జట్లకు సంబంధించిన మూడు మ్యాచ్‌ల వేదికలు, షెడ్యూల్, టైమింగ్స్, జట్లు, ప్రత్యక్ష ప్రసారం వివరాలు తెలుసుకుందామా?!ఆసియా క్రీడలు- 2026 మహిళల ఫైనల్- భారత్ వర్సెస్ శ్రీలంకవేదిక: నిశిన్, కరోగి స్పోర్ట్స్ పార్కు, జపాన్మ్యాచ్ ఆరంభ సమయం: ఉదయం 10.30 నిమిషాలకు ప్రారంభంలైవ్ స్ట్రీమింగ్: సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్, సోనీలివ్భారత జట్టుస్మృతి మంధాన, షఫాలీ వర్మ, గుణాలన్ కమలిని, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), రిచా ఘోష్(వికెట్ కీపర్), భారతీ ఫుల్మాలి, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, శ్రీ చరణి, నందినీ శర్మ, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్.శ్రీలంక జట్టుఇమేషా దులానీ, చమరి ఆటపట్టు (కెప్టెన్), హాసిని పెరెరా, హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, హన్సిమా కరుణరత్నే, కౌషని నుత్యాంగన(వికెట్ కీపర్), మిథాలీ అయోధ్య, కావ్య కవింది, చాముది ప్రభోద, సుగందిక కుమారి, రష్మిక సెవ్వాంది, నిమషా మేపగే, సంజన కవింది, అనుష్క సంజీవని.టీమిండియా వర్సెస్ జపాన్వేదిక: సనో అంతర్జాతీయ క్రికెట్ మైదానం, జపాన్భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 నిమిషాలకు మ్యాచ్ ఆరంభంప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ (టీవీ), ఫ్యాన్‌కోడ్ యాప్, వెబ్సైట్ (డిజిటల్).టీమిండియాశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయి, రవి బిష్ణోయి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, యశ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్.జపాన్కెండెల్ కడోవాకీ ఫ్లెమింగ్ (కెప్టెన్), చార్లీ హరా హింజే, బెంజమిన్ ఇటో-డేవిస్, కొయి కుబోటా, వటారు మియాచి, రియో సకురనో-థామస్, అలెక్స్ శిరాయి-పాట్మోర్, షోమా సుగయా-స్లేటర్, డెక్లాన్ సుజుకి, ఇబ్రహీం తకహషి, మకొటో తానియమా, లచ్లాన్ యమామొటో, అలెస్టెర్ కడోవాకీ-ఫ్లెమింగ్, జేక్ కుసుడ-నైర్, సుయోషి తకడా.భారత్- ‘ఎ’ వర్సెస్ ఆస్ట్రేలియా- ‘ఎ’ అనధికారిక తొలి టెస్టువేదిక: పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన సిచెమ్ గ్రౌండ్, పుదుచ్చేరి, ఇండియాభారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 నిమిషాలకు మ్యాచ్ ఆరంభంజియోహాట్స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారంభారత్- ‘ఎ’ జట్టుఅమన్ మోఖడే, ఆయుశ్ పాండే, దేవదత్ పడిక్కల్ (కెప్టెన్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), యశ్ రాథోడ్, షేక్ రషీద్, కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), షామ్స్ ములాని, తనుష్ కొటియాన్, తుషార్ దేశ్‌పాండే, అన్షుల్ కాంబోజ్, ప్రఫుల్ హింగే, నారాయణన్ జగదీశన్ (వికెట్ కీపర్), నచికేత్ భూటే, వి వైశాక్* (ఫిట్నెస్ ఆధారంగా).ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుబ్రెండన్ డాగెట్, జాక్ ఎడ్వర్డ్స్, పీటర్ హ్యాండ్స్కోంబ్, సామ్ హార్పర్, లియామ్ హాచర్, కాంప్‌బెల్ కెల్లావే, సామ్ కొన్‌స్టాస్, నాథన్ మెక్‌స్వీనీ, టాడ్ మర్ఫీ, ఫెర్గూస్ ఓ నీల్, జోష్ ఫిలిప్, జై రిచర్డ్సన్, కోరే రొచిసియోలి, జేసన్ సంఘా, లియామ్ స్కాట్.చదవండి: ప్రభుత్వం ఇచ్చిన భూమిలో టీమిండియా స్టార్ రూ. 7 కోట్ల బంగ్లా! -
జపాన్‌తో చారిత్రక మ్యాచ్.. చిక్కుల్లో భారత క్రికెటర్!
టీమిండియా యువ క్రికెటర్ విప్రజ్ నిగమ్ చిక్కుల్లో పడ్డాడు. ప్రస్తుతం ఆసియా గేమ్స్ ఆడేందుకు విప్రజ్ టీమిండియాతో పాటు జపాన్ చేరుకున్నాడు. జపాన్‌తో టీమిండియా ఆడే చారిత్రక మ్యాచ్‌కు కూడా విప్రజ్ ఎంపికయ్యాడు. ఈ చారిత్రక మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్న తరుణంలో విప్రజ్ నిగమ్‌పై వచ్చిన తాజా ఆరోపణలు అతడిని ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. విషయంలోకి వెళితే.. విప్రజ్ ఇంట్లో లేని సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఉన్న అతడి నివాసానికి సోమవారం ఒక యువతి వెళ్లడం కలకలం రేపింది. ఆ సమయంలో విప్రజ్ తల్లి ఇంట్లోనే ఉన్నారు. విప్రజ్ ఇంటి ముందు కూర్చొని తనకు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగడం సంచలనం కలిగించింది. అయితే ముందస్తు సమాచారం లేకుండా ఆమె ఇంటికి వచ్చి దాదాపు రెండు నుంచి మూడు గంటలపాటు నిరీక్షించడం చర్చనీయాం శంగా మారింది. కాగా గతంలో విప్రజ్ నిగమ్ ఒక యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలేం జరిగింది?నవంబర్ 8, 2025న విప్రజ్ నిగమ్.. హైదరాబాద్‌కు చెందిన ఒక యువతి తనను వేధిస్తోందని, ఫోన్ చేసి రకరకాలుగా బెదిరింపులకు పాల్పడుతుందని ఆరోపిస్తూ బారాబంకి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే విప్రజ్ తనపై కేసు పెట్టిన కొద్ది రోజులకే ఆ యువతి కూడా తిరగబడింది. గౌతమ్‌బుద్ధ నగర్ ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్లో విప్రజ్ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ రివర్స్ కేసు దాఖలు చేసింది.ఆ యువతి తన ఫిర్యాదులో.. తాము ఇంటర్నెట్ ద్వారా 2025 మే నెలలో పరిచయం అయ్యామని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి జూలై 29న నోయిడాలోని ఒక హోటల్‌కు తీసుకెళ్లి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. అంతేకాకుండా తనపై భౌతిక దాడి కూడా చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. తాజాగా సదరు యువతి విప్రజ్ ఇంట్లో లేని సమయంలో అతడి ఇంటి ముందు బైఠాయించి న్యాయం చేయాలని నిరసనకు దిగడం సంచలనం కలిగించింది. ప్రస్తుతం ఆసియా గేమ్స్ ఆడేందుకు జపాన్ వెళ్లిన విప్రజ్ నిగమ్‌ను తాజా వివాదం అతడిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఈ పరిణామం అతడి కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది చూడాల్సి ఉంది.ఇదీ చదవండి: దుమ్మురేపిన యశ్.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం -
Asian Games 2026: జపాన్ను చిత్తుగా ఓడించిన భారత్
ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల కబడ్డీ జట్టు శుభారంభం చేసింది. గ్రూప్-ఏలో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 49-24తో ఆతిథ్య జపాన్ను చిత్తుగా ఓడించింది. ఎనిమిది సార్లు కబడ్డీ చాంపియన్ అయిన భారత్ ముందు జపాన్ ఆటలు సాగలేదు. హాఫ్ టైమ్ ముగిసేసరికే భారత్ 31-9తో జపాన్‌పై స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. రెండో హాఫ్లోనూ 40-12తో దూకుడు కనబరిచింది. ఆశూ మాలిక్, దేవాంక్ దలాల్ తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో సీనియర్లు పవన్ సెహ్రావత్, అర్జున్ దేశ్వాల్, అస్లామ్ ఇనామ్దార్లు కొద్దిసేపు మాత్రమే పాల్గొన్నప్పటికీ, బలమైన ఇంపాక్ట్ చూపించారు. ఆశూ సూపర్ రైడ్‌తో మూడు టాకిల్ పాయింట్లు సాధించాడు. ఇక భారత్ సాధించిన 49 పాయింట్లలో 36 పాయింట్లను నేరుగా పొందగా, జపాన్ మాత్రం తాను సాధించిన మొత్తం పాయింట్లలో మూడో వంతు బోనస్ లైన్ నుంచే రాబట్టడం గమనార్హం. గ్రూప్-ఏలో ఉన్న భారత్ తమ తర్వాతి మ్యాచ్‌లో ఇదే వేదికపై రిపబ్లిక్ ఆఫ్ కొరియాతో తలపడనుంది. 2018 జకర్తా ఆసియా గేమ్స్‌లో ఇరాన్ స్వర్ణం మినహా మిగతా అన్ని ఎడిషన్లలో భారత్ స్వర్ణ పతకాలు సాధించింది. ఇక ప్రపంచకప్‌లో భారత పురుషుల జట్టు రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు చాంపియన్‌గా నిలిచింది.క్వార్టర్స్‌లో భారత్ఇక బ్యాడ్మింటన్ విభాగంలో భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. బంగ్లాదేశ్‌తో జరిగిన ప్రిక్వార్టర్స్‌లో భారత్ 3-0తో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో లక్ష్యసేన్ 21-4, 21-12తో జమాన్ అయ్మన్పై, రెండో మ్యాచ్‌లో ఆయుశ్ శెట్టి 21-4, 21-13తో గౌరబ్ సింఘాపై, చివరి మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్ 21-15, 21-9తో జుమర్ అల్ అమిన్పై విజయాలు సాధించారు. సెప్టెంబర్ 22న జపాన్ జట్టుతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ ఖాతాలో కనీసం కాంస్యం ఖాయమవుతుంది.ఇదీ చదవండి: IND vs JPN T20I: జట్లు, టైమింగ్, ప్రత్యక్ష ప్రసారం.. వివరాలు ఇవే -
మరో చరిత్ర సృష్టించనున్న వైభవ్ సూర్యవంశీ..!
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మరో చరిత్ర సృష్టించేందుకు సిద్దంగా ఉన్నాడు. ఏషియన్ గేమ్స్ 2026లో అతడు బరిలోకి దిగితే, ఈ గేమ్స్‌లో పాల్గొనే అన్ని దేశాల సభ్యుల (అథ్లెట్ లేదా క్రికెటర్) కంటే అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పుతాడు.ఏషియన్ గేమ్స్‌లో భారత్ క్రికెట్ జట్టు ఆడబోయే తొలి మ్యాచ్ సమయానికి (సెప్టెంబర్ 29, రెండో క్వార్టర్ ఫైనల్) వైభవ్ వయసు 15 ఏళ్ల 178 రోజులుగా ఉంటుంది. ఇంత కంటే చిన్న వయసు సభ్యుడు ఎవరూ ప్రస్తుత ఆసియా క్రీడల్లో పాల్గొనడం లేదు. మరోవైపు ఈ ఏషియన్ గేమ్స్‌లో అత్యంత పెద్ద వయస్కురాలైన అథ్లెట్ కూడా భారత్ నుంచే బరిలోకి దిగుతుండటం విశేషం. 55 ఏళ్ల 8 నెలల వయసున్న భారత అశ్వ క్రీడాకారిణి శృతి వోరా ఈ ఘనత సాధించారు.కాగా, ఇటీవలికాలంలో వైభవ్ వయసు విషయంలో దాదాపు అన్ని పాత రికార్డులను బద్దలు కొడుతున్నాడు. ఏషియన్ గేమ్స్‌లో కూడా అతడికి తుది జట్టులో చోటు దక్కితే మరో రికార్డు ఖాతాలో వేసుకుంటాడు.అయితే తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. మరి ఏషియన్ గేమ్స్‌లో అయినా అవకాశం దక్కుతుందో లేదో చూడాలి.ఏషియన్ గేమ్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా పూర్తి స్థాయి జట్టుతోనే బరిలోకి దిగుతుంది. ఓపెనర్లుగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మ బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైనట్లే. వీరిద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో వైభవ్ తుది జట్టు బెర్త్‌పై అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రీడల్లో భారత్ గరిష్టంగా మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడగలుగుతుంది. ఏదో ఒక మ్యాచ్‌లో వైభవ్‌కు ఆడే అవకాశం వచ్చినా, ఏషియన్ గేమ్స్ అతి పిన్న వయస్కుడి రికార్డు అతడి ఖాతాలో వచ్చి పడుతుంది. ఇదీ చదవండి: రాజకీయాల్లోకి షమీ..? -
Asian Games 2026: పాకిస్తాన్‌కు భారీ షాక్
ఏషియన్ గేమ్స్-2026 మెన్స్ క్రికెట్ పోటీల ఆరంభానికి ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ సల్మాన్ మీర్జా గాయం కారణంగా ఈ టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. 32 ఏళ్ల సల్మాన్ ప్రస్తుతం చేతి వేలి గాయంతో బాధపడుతున్నాడు.అతడు కోలుకోవడానికి మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆసియా గేమ్స్ స్క్వాడ్ నుంచి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తప్పించింది. అతడి స్దానాన్ని పేసర్ మహ్మద్ వసీం జూనియర్‌తో పీసీబీ భర్తీ చేసింది. సల్మాన్ మీర్జా ఏషియన్ గేమ్స్‌కు దూరం కావడంతో పాక్‌కు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. అతడు గత కొంత కాలంగా పాక్ టీ20 జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. పవర్‌ప్లేతో పాటు డెత్ ఓవర్లలో పరుగులు కట్టడి చేయడం అతడి స్పెషాలిటి. ఇప్పటివరకు పాక్ తరపున 17 టీ20లు ఆడిన సల్మాన్.. 6.43 ఎకానమీ రేటుతో 23 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా మీర్జా 49 T20 మ్యాచ్‌లలో 68 వికెట్లు తీశాడు. ఇక అతడి స్ధానంలో జట్టులోకి వచ్చిన వసీం కూడా టీ20ల్లో ఫర్వాలేదనిపించాడు. పాక్ తరపున 34 టీ20లు ఆడి 42 వికెట్లు పడగొట్టాడు. అయితే లోయార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి మెరుపులు మెరిపించే సత్తా అతడికి ఉంది. ఈ ఏషియన్ గేమ్స్‌లో పాక్ జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.పాక్ జట్టుసాహిబ్జాదా ఫర్హాన్ (కెప్టెన్), అబ్దుల్ సమద్ (వైస్ కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియాల్, అకిఫ్ జావేద్, అలీ రజా, అరాఫత్ మిన్హాస్, హైదర్ అలీ, హసన్ నవాజ్, మాజ్ సదాకత్, వసీం జూనియర్, సాద్ మసూద్, సైమ్ అయూబ్, సుఫ్యాన్ మొకిమ్, ఉస్మాన్ ఖాన్ -
Asian Games 2026: షూటింగ్లో డబుల్ ధమాకా.. మొత్తం 6 పతకాలు
ఏషియన్ గేమ్స్ 2026లో రెండో రోజు భారత్‌కు పతకాల పంట పండింది. షూటింగ్లో భారత షూటర్లు సత్తా చాటారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో హిమాంశు ధిల్లాన్ రజతం, రుద్రాంక్ష్ పాటిల్ కాంస్యం సాధించారు.ఇదే ఈవెంట్లో అంతకుముందు వీరిద్దరూ పార్త్ మానేతో కలిసి టీమ్ విభాగంలో రజతం గెలుచుకున్నారు. దీంతో రెండో రోజు భారత్ ఖాతాలో మూడు షూటింగ్ పతకాలు చేరాయి.తొలి రోజు కూడా భారత్ ఖాతాలో రెండు షూటింగ్ పతకాలు చేరాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఎలావెనిల్ వలరివన్.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో సోనమ్ మస్కర్, విదర్సా వినోద్, ఎలావెనిల్ వలరివన్ రజత పతకాలు సాధించారు. ఇప్పటివరకు భారత్ ఖాతాలో కేవలం షూటింగ్‌లోనే ఐదు పతకాలు చేరాయి. ఇప్పటివరకు భారత్ మొత్తం 6 పతకాలు గెలిచింది.ఇవాళే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మహిళల సంప్రదాయ 60 కేజీల విభాగంలో సుచికా తరియాల్ కాంస్య పతకం సాధించింది. ఏషియన్ గేమ్స్ చరిత్రలో ఎంఎంఏలో భారత్‌కు ఇదే తొలి పతకం.మరోవైపు ఇవాళ జరిగిన మహిళల టేబుల్ టెన్నిస్‌లో భారత జట్టు పాకిస్తాన్‌ను 3-0తో చిత్తు చేసి, క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది.ఇదీ చదవండి: Asian Games 2026: మహిళల ఎంఎంఏలో భారత్‌కు తొలి పతకం -
Asian Games 2026: మార్షల్ ఆర్ట్స్‌లో భారత్‌కు తొలి పతకం
ఏషియన్ గేమ్స్‌లో భారత మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) అథ్లెట్ సుచికా తరియాల్ చరిత్ర సృష్టించింది. మహిళల సంప్రదాయ 60 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించి, ఏషియన్ గేమ్స్ ఎంఎంఏలో భారత్‌కు తొలి పతకాన్ని అందించింది.సెమీఫైనల్లో ఓటమిసుచికా తరియాల్ సెమీఫైనల్లో సింగపూర్‌కు చెందిన హుయ్ హూన్ టియో చేతిలో 0-2తో ఓటమి పాలైనప్పటికీ.. భారత్‌కు ఈ క్రీడలో తొలి పతకాన్ని అందించి చరిత్రలో నిలిచింది.ఆదివారం జరిగిన క్వార్టర్ఫైనల్లో సుచికా.. మంగోలియాకు చెందిన ఆల్టాన్చిమెగ్ బైగల్మాను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకుంది. ఈ విజయంతోనే భారత్‌కు ఏషియన్ గేమ్స్ ఎంఎంఏలో తొలి పతకం ఖాయమైంది.ఇదీ చదవండి: ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మూడో పతకం -
Asian Games 2026: పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్
ఆసియా క్రీడల్లో భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు సత్తా చాటింది. గ్రూప్-ఎఫ్ రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను 3-0తో చిత్తు చేసింది. వరుసగా రెండు విజయాలతో క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఆదివారం సింగపూర్‌పై హోరాహోరీ పోరులో 3-2తో గెలిచిన భారత్.. తాజాగా పాక్‌పై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత్ తమ బెంచ్ బలాన్ని పరీక్షించుకుంది. స్టార్ ప్లేయర్లు దియా చితాలే, యశస్విని ఘోర్పడేలకు విశ్రాంతినిచ్చి సుతీర్థ ముఖర్జీ, సిండ్రెలా దాస్‌లకు అవకాశం కల్పించింది.తొలి మ్యాచ్‌లో సుతీర్థ ముఖర్జీ 11-3, 11-3, 11-4తో అలీనా ఖాన్‌ను చిత్తు చేసి భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్‌లో సిండ్రెలా దాస్ 11-6, 11-7, 11-5తో కల్సూమ్ ఖాన్‌పై విజయం సాధించింది. దీంతో భారత్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.ఇక మూడో మ్యాచ్‌లో ఆకుల శ్రీజ 11-4, 11-4, 11-5తో ఫాతిమా ఖాన్‌ను ఓడించి భారత విజయాన్ని ఖరారు చేసింది. దీంతో భారత్ 3-0తో పాక్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.సింగపూర్‌పై ఉత్కంఠ విజయంఆదివారం సింగపూర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత ప్లేయర్లు అద్భుతంగా పోరాడారు. ఒక దశలో 1-2తో వెనుకబడిన భారత్.. ఓటమి అంచు నుంచి తిరిగి వచ్చింది. ఆకుల శ్రీజ, యశస్విని ఘోర్పడే కీలక మ్యాచ్‌ల్లో విజయాలు సాధించడంతో భారత్ 3-2తో గెలుపొందింది.ఇదీ చదవండి: ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మూడో పతకం -
ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మూడో పతకం
జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలు-2026లో భారత అథ్లెట్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. రెండో రోజు పోటీల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు మరో రజత పతకం లభించింది. హిమాంశు ధిల్లాన్, పార్థ్ మానే, రుద్రాంక్ష్ పాటిల్‌తో కూడిన భారత జట్టు రెండో స్థానంలో నిలిచి రజతంతో సరిపెట్టుకుంది. ఈ ఈవెంట్లో చైనా ప్రపంచ రికార్డు నెలకొల్పి స్వర్ణం గెలిచింది.తాజా పతకంతో ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరింది. పోటీల తొలి రోజు కూడా భారత్ ఖాతాలో రెండు రజత పతకాలే చేరాయి. అవి కూడా షూటింగ్‌లోనే రావడం విశేషం. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఎలావెనిల్ వలరివన్.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో సోనమ్ మస్కర్, విదర్సా వినోద్, ఎలావెనిల్ వలరివన్ రజత పతకాలు సాధించారు.కాగా, ఇదే ఈవెంట్ వ్యక్తిగత విభాగంలోనూ భారత షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధించారు. దీంతో షూటింగ్లో భారత్ పతకాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఏషియన్ గేమ్స్‌లో స్టార్ హీరో తనయుడు.. ఎవరో తెలుసా? -
తొలి స్వర్ణం జపాన్‌దే...
ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణ పతకం ఆతిథ్య జపాన్‌కే లభించింది. మూడు క్రీడాంశాల సమాహారమైన పురుషుల ట్రయాథ్లాన్ (స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్)లో జపాన్ ట్రయాథ్లెట్ టకుమి హోజో పసిడి పతకం సాధించాడు. టకుమి హోజో (750 మీటర్లు స్విమ్మింగ్, 20 కిలోమీటర్ల సైక్లింగ్, 5 కిలోమీటర్ల రన్నింగ్) మూడు ఈవెంట్స్‌ను 52 నిమిషాల 56 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. బంగారు పతకం సాధించిన టకుమి హోజో 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను కూడా సంపాదించాడు. జిరుయ్ జాంగ్ (చైనా; 53ని:05 సెకన్లు) రజతం, అర్లాన్ (కజకిస్తాన్; 53ని:11 సెకన్లు) కాంస్యం సాధించారు. -
భారత్ 19 ఉజ్బెకిస్తాన్ 0
కాకామిల్గహారా: లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ బెర్త్ లక్ష్యంగా ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన భారత మహిళల, పురుషుల జట్లు తమ తొలి మ్యాచ్‌లో గోల్స్ వర్షం కురిపించారు. పూల్ ‘బి’లో భారత మహిళల జట్టు ఏకంగా 19–0 గోల్స్ తేడాతో ఉజ్బెకిస్తాన్ను చిత్తు చేసింది. భారత స్టార్ డ్రాగ్ ఫ్లికర్ దీపిక సెహ్రావత్ 8 గోల్స్‌తో (8వ, 22, 25వ, 33వ, 36వ, 38వ, 41వ, 54వ నిమిషాల్లో) హడలెత్తించింది. ఈ క్రమంలో ఆసియా క్రీడల ఒకే మ్యాచ్‌లో అత్యధిక గోల్స్ చేసిన భారత మహిళా క్రీడాకారిణిగా దీపిక రికార్డు నెలకొలి్పంది. ఇషిక (11వ, 42వ, 54వ నిమిషాల్లో) మూడు గోల్స్... లాల్థాన్లువాంగి (43వ, 51వ నిమిషాల్లో), నవ్‌నీత్ కౌర్ (23వ, 45వ నిమిషాల్లో) రెండు గోల్స్ చొప్పున చేశారు. లాల్రెమ్సియామి (7వ ని.లో), బల్జీత్ కౌర్ (12వ ని.లో), నేహా (18వ ని.లో), సాక్షి రాణా (43వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఈ మ్యాచ్‌తో సీనియర్ గోల్‌కీపర్ సవితా పూనియా భారత్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు (320) ఆడిన ప్లేయర్‌గా వందన కటారియా పేరిట ఉన్న రికార్డును సమం చేసింది. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో ఇండోనేసియాతో భారత్ ఆడుతుంది.దిల్‌ప్రీత్ నాలుగు గోల్స్... మరోవైపు భారత పురుషుల జట్టు పూల్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో 13–1 గోల్స్ తేడాతో ఇండోనేసియాను ఓడించింది. భారత్ తరఫున దిల్‌ప్రీత్ సింగ్ (18వ, 19వ, 37వ, 49వ నిమిషాల్లో) నాలుగు గోల్స్‌తో మెరిశాడు. శిలానంద్ లాక్రా (6వ, 35వ ని.లో), సుఖ్జీత్ సింగ్ (38వ, 48వ ని.లో) రెండు గోల్స్ చొప్పున చేశారు. అభిõÙక్ (12వ ని.లో), మన్దీప్ సింగ్ (21వ ని.లో), కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (28వ ని.లో), జుగ్రాజ్ సింగ్ (47వ ని.లో) ఒక్కో గోల్ నమోదు చేశారు. ఇండోనేసియా జట్టుకు ఆలియా అల్ అర్ధ్ (33వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. భారత జట్టుకు ఏడు పెనాల్టీ కార్నర్లు రాగా... మూడింటిని మాత్రమే సద్వినియోగం చేసుకుంది. మంగళవారం జరిగే రెండో మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ తలపడుతుంది. -
త్రుటిలో పతకాలు చేజారె...
నగోయా: ఆసియా క్రీడల్లో తొలిసారి నిర్వహిస్తున్న టెక్బాల్ క్రీడాంశంలో ఒకేరోజు భారత్‌కు రెండు కాంస్య పతకాలు త్రుటిలో చేజారాయి. మహిళల వ్యక్తిగత కాంస్య పతక మ్యాచ్‌లో భారత ప్లేయర్ క్విమ్సీ డిసౌజా 11–12, 11–12తో యునా సాకామోటో (జపాన్) చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ కాంస్య పతక మ్యాచ్‌లో క్విమ్సీ డిసౌజా–అనస్ బేగ్ (భారత్) జోడీ 9–12, 6–12తో హోంగ్ మిన్ టాన్ నుగుయెన్–గియా ట్రిన్ (వియత్నాం) జంట చేతిలో పరాజయం పాలైంది. భారత టీటీ జట్లకు మిశ్రమ ఫలితాలుటేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ ఈవెంట్లో భారత మహిళల జట్టు తొలి మ్యాచ్‌లో 3–0తో ఇండోనేసియాపై, రెండో మ్యాచ్‌లో 3–2తో సింగపూర్‌పై గెలిచింది. ఇండోనేసియాతో జరిగిన గ్రూప్ ‘ఎఫ్’ తొలి లీగ్ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 3–0తో గెలిచి...ఇరాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 0–3తో ఓటమి చవిచూసింది. వుషులో నిరాశ: మార్షల్ ఆర్ట్స్‌లో భాగమైన వుషు క్రీడాంశంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. పురుషుల చాంగ్‌క్వాన్ ఈవెంట్లో భారత ప్లేయర్ సూరజ్ సింగ్ 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. సాండా ఈవెంట్లో భారత ప్లేయర్లు అపర్ణ దహియా (52 కేజీలు)... విక్రాంత్ (75 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. స్విమ్మర్ రిషభ్‌కు ఆరో స్థానం పురుషుల స్విమ్మింగ్‌లో తొలిరోజు భారత్ ఆశించిన ఫలితం లభించలేదు. 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో భారత స్విమ్మర్ రిషభ్ దాస్ ఫైనల్ చేరినా పతకానికి సుదూరంలో నిలిచాడు. ఫైనల్లో రిషభ్ 54.77 సెకన్లలో గమ్యానికి చేరి ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
వేధింపుల బాధితురాలి నుంచి...
పన్నెండేళ్ల వయసులో కుర్రాళ్లు ఏడిపిస్తుంటే... వారికి తగిన బుద్ధి చెప్పాలని ఆత్మరక్షణ విద్య నేర్చుకున్న ఆ చిన్నది... ఇప్పుడు 36 ఏళ్ల వయసులో ఆసియా క్రీడల్లో దేశానికి పతకం ఖాయం చేసింది. ‘ఆడపిల్లలు లేడి పిల్లలుగా కాకుండా... పులి పిల్లలుగా మారాలని’ బలంగా నమ్మి ఏళ్ల పాటు దాని కోసం కృషి చేసిన హరియాణాకు చెందిన సుచికా తరియాల్... ఏషియన్ గేమ్స్‌లో కనీసం కాంస్య పతకం ఖరారు చేసుకుంది.వేధింపులు ఎదురైతే మౌనంగా ఉండిపోకుండా... పోరాడటం నేర్చుకోవాలని కరాటేలో శిక్షణ తీసుకున్న సుచికా... తాజా ఆసియా క్రీడల్లో సాంప్రదాయ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) 60 కేజీల విభాగంలో సెమీఫైనల్‌కు అర్హత సాధించి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. ‘దేశానికి పతకం అందించబోతుండటం ఆనందంగా ఉంది. సోమవారం స్వర్ణ పతకం కోసం పోరాడతా. చిన్నప్పటి నుంచి ఏదో ఒక రకమైన ఫైటింగ్ నేర్చుకోవాలనే కల ఉండేది. అందుకే తొలుత జూడోను ఎంచుకున్నా. ఆ ప్రయాణం నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. మాది సంప్రదాయ కుటుంబం కావడంతో మొదట ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా... ఆ తర్వాత నా పట్టుదల చూసి అంతా సహకరించారు. ఇక్కడి వరకు చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. దీని వెనక కఠోర శ్రమ దాగి ఉంది’ అని సుచిక వెల్లడించింది. ఆసియా క్రీడల్లో తొలిసారి ఎంఎంఏ క్రీడాంశాన్ని ప్రవేశ పెట్టారు. ఇందులో స్ట్రైకింగ్, టేక్‌డౌన్, గ్రాప్లింగ్, గ్రౌండ్ ఫైటింగ్ ఆధారంగా పాయింట్లు కేటాయించి విజేతను ప్రకటిస్తారు. జూడో నుంచి మొదలై... రోహ్తక్కు చెందిన సుచిక మొదట జూడోలో శిక్షణ తీసుకుంది. అక్కడి నుంచి జు–జుట్సుకు మారిన ఆమె... ఇప్పుడు ఎంఎంఏలో సత్తా చాటింది. భోపాల్ ‘సాయ్’ కేంద్రంలో రాటుదేలిన సుచిక... ఇప్పటి వరకు 20కి పైగా అంతర్జాతీయ ఈవెంట్లలో పోటీపడింది. ఎనిమిదిసార్లు జాతీయ చాంపియన్‌గా నిలవడంతో పాటు పలు పతకాలు ఖాతాలో వేసుకుంది. 2019 కామన్వెల్త్ జూడో చాంపియన్‌షిప్, 2019 దక్షిణాసియా గేమ్స్‌లో పసిడి పతకాలు సాధించిన ఈ హరియాణా ఫైటర్... 2018 కామన్వెల్త్ జూడో చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచింది. 2022 కామన్వెల్త్ క్రీడల్లో త్రుటిలో పతకం సాధించే అవకాశం కోల్పోయిన సుచిక... ఎట్టకేలకు తాజా ఆసియా క్రీడల్లో పోడియంపై నిలవనుంది. జూడో నుంచి జు–జుట్సుకు మారిన అనంతరం... 2024 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం నెగ్గింది. 2017లోనే ఎంఎంఏలో అరంగేట్రం చేసిన ఆమె జూడో మీద దృష్టి పెట్టేందుకు ఏడేళ్ల పాటు ఎంఎంఏకు దూరమైంది. 2024లో ఎంఎంఏలో పునరాగమనం చేసిన సుచిక... బహ్రెయిన్‌లో జరిగిన బ్రేవ్ సీఎఫ్ 92లో విజయం సాధించింది. సీఐఎస్ఎఫ్లో హెడ్ కానిస్టేబుల్‌గా సేవలందించిన సుచికా... ప్రస్తుతం హరియాణా క్రీడా శాఖలో జూనియర్ కోచ్‌గా వ్యవహరిస్తోంది. -
బుల్లెట్ దించారు
మరోసారి ‘శతక’ పతకాల మైలురాయిని అందుకోవాలనే లక్ష్యంతో ఆసియా క్రీడల బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభం లభించింది. తొలి రోజే భారత్ ఖాతాలో రెండు రజత పతకాలు చేరాయి. మరో రెండు పతకాలు ఖరారయ్యాయి. షూటింగ్లో భారత మహిళా షూటర్ ఇలవేనిల్ వలారివన్ రెండు రజత పతకాలతో మెరిసింది. ముందుగా సోనమ్, విదర్శలతో కలిసి ఇలవేనిల్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో భారత్‌కు రజత పతకాన్ని అందించింది. ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో ఇలవేనిల్ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో మహిళా ఫైటర్ సుచిక తరియాల్ 60 కేజీల విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించి స్వర్ణం లేదా రజత పతకాన్ని అందుకోనుంది. హాకీలో భారత జట్లు ఘనవిజయాలతో బోణీ కొట్టగా... టేబుల్ టెన్నిస్‌లో మనోళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. బ్యాడ్మింటన్‌లో భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. నగోయా: పసిడి ఖాతా తెరువకపోయినా... ఆసియా క్రీడల తొలి రోజే భారత్ రెండు రజత పతకాలు సాధించింది. అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత షూటర్లు ఈ రెండు పతకాలను అందించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో ఇలవేనిల్ వలారివన్, సోనమ్ మస్కర్, విదర్శ వినోద్‌లతో కూడిన భారత జట్టు 1898 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకుంది. 1904.2 పాయింట్లతో చైనా జట్టుకు స్వర్ణం దక్కగా... 1897.1 పాయింట్లతో జపాన్‌కు కాంస్యం లభించింది. క్వాలిఫయింగ్‌లో భారత షూటర్లు సోనమ్ మస్కర్ 634.1 పాయింట్లతో మూడో స్థానంలో, ఇలవేనిల్ వలారివన్ 633.5 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. భారత్‌కే చెందిన మరో షూటర్ విదర్శ వినోద్ 640.4 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచింది. క్వాలిఫయింగ్‌లో టాప్–8లో నిలిచిన వారు మాత్రమే ఫైనల్స్‌కు అర్హత పొందుతారు. క్వాలిఫయింగ్‌లో ఆయా దేశాల షూటర్లు సాధించిన పాయింట్ల ఆధారంగా టీమ్ ఈవెంట్ పతకాలను ఖరారు చేశారు. ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఫైనల్లో ఇలవేనిల్ 252.4 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని అందుకుంది. హినాటా తైచీ (జపాన్; 253 పాయింట్లు) బంగారు పతకం నెగ్గగా... హైజిన్ బాన్ (దక్షిణ కొరియా; 230.4 పాయింట్లు) కాంస్య పతకాన్ని సాధించింది. భారత షూటర్ సోనమ్ 167 పాయింట్లతో ఆరో స్థానంతో సంతృప్తి పడింది. మరోవైపు మహిళల మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ 60 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో భారత ఫైటర్ సుచిక తరియాల్ 2–0తో బైగల్మా అల్తాన్‌చిమెగ్ (మంగోలియా)పై నెగ్గి సెమీఫైనల్‌కు చేరింది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో సెమీఫైనల్లో ఓడిన వారికి కాంస్య పతకాలు ఖాయమవుతాయి. -
క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన సింధు బృందం
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026లో భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన రౌండ్ ఆఫ్ 16 (ప్రీక్వార్టర్స్) పోరులో భారత్ 3-0తో కజకిస్థాన్‌ను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో భారత షట్లర్లు పి.వి. సింధు, ఉన్నతి హుడా, తన్వి శర్మలు అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టించారు. వీరి ధాటికి కజకిస్థాన్ ఆటగాళ్లు చేతులెత్తేశారు.మొదటి సింగిల్స్‌లో కామిలా స్మాగులోవాపై 21-7, 21-9 తేడాతో పి.వి. సింధు ఘనవిజయం సాధించింది. అనంతరం రెండో సింగిల్స్‌లో అలెస్సా కులేషోవాను 21-7, 21-10 తేడాతో ఉన్నతి హుడా ఓడించి భారత ఆధిక్యాన్ని 2-0కి పెంచింది. ఇక మూడో సింగిల్స్‌తో డయానా నమేనోవాపై 21-5, 21-10 తేడాతో తన్వి శర్మ విజయం సాధించి 3-0తో క్లీన్ స్వీప్ పూర్తి చేసింది. ఈ భారత త్రయం కేవలం 65 నిమిషాల్లోనే ప్రత్యర్థులను మట్టికరిపించడం విశేషం. మంగళవారం రోజున క్వార్టర్ఫైనల్లో ఆతిథ్య జపాన్ జట్టుతో భారత బృందం తలపడనుంది. మొదటి రౌండ్లో 'బై' పొందిన జపాన్, క్వార్టర్స్‌లో భారత జట్టుకు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధంగా ఉంది.చదవండి: IND vs NZ: టీమిండియాకు కొత్త కెప్టెన్? -
టీమిండియా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. ఫాస్టెస్ట్ సెంచరీ!
ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్ పోటీల్లో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన రెండో సెమీఫైనల్లో 114 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి తుది పోరుకు భారత్ అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్‌ప్రీత్ బృందం నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోర్ సాధించింది. యువ ఓపెనర్ షెఫాలీ వర్మ విధ్వంసకర సెంచరీతో చెలరేగింది. షెఫాలీ 49 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్సర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమెతో పాటు హర్మన్‌ప్రీత్ కౌర్ (40), స్మృతి మంధాన(37) రాణించారు. అనంతరం ఈ భారీ లక్ష్య చేధనలో బంగ్లా జట్టు భారత బౌలర్ల ధాటికి 81 పరుగులకు కుప్పకూలింది. ఇక ఈ మ్యాచ్‌లో తుపాన్ సెంచరీతో విరుచుకుపడ్డ షెఫాలీ వర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.షెఫాలీ సాధించిన రికార్డులు ఇవే👉మహిళల ఆసియా గేమ్స్ క్రికెట్ చరిత్రలో సెంచరీ సాధించిన తొలి ప్లేయర్‌గా షెఫాలీ రికార్డు సృష్టించింది.👉మహిళల టీ20ల్లో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ రికార్డును షాఫాలీ సమం చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఇంతకుముందు న్యూజిలాండ్‌పై 49 బంతుల్లోనే శతక్కొట్టింది.👉టీ20 సెంచరీ చేసిన మూడో భారత మహిళా బ్యాటర్‌గా షెఫాలీ నిలిచింది. ఆమె కంటే ముందు స్మృతి మంధాన (2 సెంచరీలు), హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ ఫీట్ సాధించారు.👉మహిళల టీ20 క్రికెట్లో 100 సిక్సర్ల మార్కును అందుకున్న రెండో భారత బ్యాటర్‌గా షెఫాలీ రికార్డులకెక్కింది. ఓవరాల్‌గా ప్రపంచంలో ఐదో బ్యాటర్‌గా ఆమె నిలిచింది.👉మహిళల టీ20 క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా షాఫాలీ వర్మ (104) రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఈ ఫీట్ మంధాన(100) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్‌తో ఆమెను షెఫాలీ అధిగమించింది.👉మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఒక క్యాలెండర్ ఈయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా షెఫాలీ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది టీ20ల్లో షెఫాలీ వర్మ ఏకంగా 35 సిక్సర్లు బాదింది. ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు (32 సిక్సర్లు, 2024) పేరిట ఉండేది.👉ఒక క్యాలెండర్ ఇయర్లో భారత మహిళల జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా షెఫాలీ నిలిచింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఆమె 815 పరుగులు చేసింది. ఇంతకుముందు ఈ రికార్డు స్మృతి మంధాన (763 పరుగులు, 2024) పేరిట ఉండేది. తాజా నాక్‌తో మంధాన ఆల్‌టైమ్ రికార్డును షెఫాలీ బ్రేక్ చేసింది.చదవండి: టీమిండియాతో సిరీస్‌కు వెస్టిండీస్ జట్ల ప్రకటన -
షఫాలీ సెంచరీ, బౌలర్ల విజృంభణ.. ఫైనల్స్‌కు టీమిండియా
ఏషియన్ గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో భారత్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఇవాళ జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా బంగ్లాదేశ్‌పై 115 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి, రెండో ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. ఇవాళ ఉదయమే జరిగిన తొలి సెమీఫైనల్లో పాకిస్తాన్‌ను చిత్తు చేసి శ్రీలంక తొలి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. సెప్టెంబర్ 22న స్వర్ణ పతకం కోసం జరిగే ఫైనల్లో శ్రీలంక టీమిండియాను ఢీకొంటుంది. అదే రోజు కాంస్య పతకం కోసం పాకిస్తాన్, బంగ్లాదేశ్ పోటీపడతాయి. ఫైనల్లో ఓడిన జట్టు రజతంతో సరిపెట్టుకుంటుంది.భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (49 బంతుల్లో 100 నాటౌట్; 3 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.భారత ఇన్నింగ్స్‌లో స్మృతి మంధన (19 బంతుల్లో 37; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (33 బంతుల్లో 40; 6 ఫోర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. మిగతా ప్లేయర్లలో కమలిని (3), రిచా ఘోష్ (2) నిరాశపరిచారు. బంగ్లా బౌలర్లలో షంజిద అక్తర్, రబేయా ఖాన్, నహిద అక్తర్, మరుఫా అక్తర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ భారత బౌలర్ల ధాటికి పూర్తిగా చేతులెత్తేసింది. పేసర్ నందిన శర్మ (4-0-25-3) అద్భుతంగా బౌలింగ్ చేసి బంగ్లా పతనాన్ని శాశించింది. ఆమెకు స్పిన్నర్లు శ్రీచరణి (3-1-7-2), శ్రేయాంక పాటిల్ (3-0-22-1), దీప్తి శర్మ (2.4-0-7-3) సహకరించారు. మరో పేసర్ క్రాంతి గౌడ్ (3-0-20-1) కూడా తన పాత్రకు న్యాయం చేసింది. మొత్తంగా వీరి ధాటికి బంగ్లాదేశ్ 15.4 ఓవర్లలో 81 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో దిల్హర అక్తర్ (27), షర్మిన్ అక్తర్ (10), సుల్తానా ఖాతూన్ (12 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన మంధన -
Asian Games 2026: భారత్ ఖాతాలో రెండో పతకం
ఏషియన్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు పతకాల వేట కొనసాగుతోంది. తొలి రోజే షూటింగ్లో భారత్‌కు మరో పతకం దక్కింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఎలావెనిల్ వలరివన్ రజతం సాధించింది. దీంతో ఈ ఏషియన్ గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య రెండుకు చేరింది.ఇప్పటికే సోనమ్ మస్కర్, విదర్సా వినోద్‌తో కలిసి మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో రజతం గెలిచిన ఎలావెనిల్.. వ్యక్తిగత విభాగంలోనూ సత్తా చాటింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య జరిగిన ఫైనల్లో రాణించి మరోసారి పోడియంపై నిలిచింది.మరో పతకం ఖాయంషూటింగ్లో రెండు రజత పతకాలు కైవసం చేసుకున్న భారత్.. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ)లోనూ మరో పతకం ఖాయం చేసుకుంది. మహిళల సంప్రదాయ 60 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో మంగోలియా క్రీడాకారిణి ఆల్టాంచిమెగ్ బైగల్మాను ఓడించిన సుచికా తరియాల్ సెమీఫైనల్‌కు చేరింది. దీంతో భారత్‌కు ఈ క్రీడలో తొలి పతకం ఖాయమైంది.తొలి రోజు భారత అథ్లెట్ల ఫలితాలువుషు: పురుషుల చాంగ్‌క్వాన్ ఫైనల్లో సూరజ్ సింగ్ మయాంగ్లంబం 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.టెక్బాల్: మహిళల సింగిల్స్ కాంస్య పతక పోరులో జపాన్ క్రీడాకారిణి యుయినా సకమోటో చేతిలో క్విమ్సీ డిసౌజా ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ కాంస్య పతక పోరులోనూ క్విమ్సీ డిసౌజా, మహమ్మద్ అనస్ బేగ్ జోడీకి నిరాశ ఎదురైంది. వియత్నాం జోడీ చేతిలో ఓటమి పాలైంది.స్విమ్మింగ్: పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ హీట్స్‌లో రిషబ్ దాస్ ఐదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఉత్కర్ష్ పాటిల్ 12వ స్థానంలో నిలిచాడు. పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టైల్ హీట్స్‌లో బెనెడిక్షన్ బెనిస్టన్ 12వ స్థానంలో, ఆకాష్ మణి 23వ స్థానంలో నిలిచారు.టేబుల్ టెన్నిస్: మహిళల టీమ్ గ్రూప్ ఎఫ్ మ్యాచ్‌లో ఇండోనేషియాపై భారత్ 3-0తో విజయం సాధించింది. పురుషుల టీమ్ గ్రూప్ ఎఫ్ మ్యాచ్‌లోనూ భారత్ 3-0తో ఇండోనేషియాను ఓడించింది.ఎంఎంఏ: మహిళల సంప్రదాయ 60 కేజీల క్వార్టర్ ఫైనల్లో సుచికా తరియాల్ విజయం సాధించి భారత్‌కు పతకం ఖాయం చేసింది.హాకీ: ఉజ్బెకిస్థాన్‌తో జరిగిన పూల్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 19-0తో ఘన విజయం సాధించింది. దీపికా సెహ్రావత్ ఏకంగా 9 గోల్స్ చేసి టోర్నీలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.మహిళల క్రికెట్: సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతోంది. ఫైనల్ బెర్త్ కోసం భారత జట్టు పోరాడుతోంది.ఇదీ చదవండి: Asian Games 2026: షూటింగ్ 'సిల్వర్'తో ఖాతా తెరిచిన భారత్ -
షఫాలీ విధ్వంసకర శతకం.. టీమిండియా భారీ స్కోర్
ఏషియన్ గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో భాగంగా ఇవాళ జరుగుతున్న రెండో సెమీఫైనల్లో భారత్, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (49 బంతుల్లో 100 నాటౌట్; 3 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివరి బంతికి సింగిల్ తీసి షఫాలీ తన సెంచరీ పూర్తి చేసుకుంది. భారత ఇన్నింగ్స్‌లో స్మృతి మంధన (19 బంతుల్లో 37; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (33 బంతుల్లో 40; 6 ఫోర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. మిగతా ప్లేయర్లలో కమలిని (3), రిచా ఘోష్ (2) నిరాశపరిచారు. బంగ్లా బౌలర్లలో షంజిద అక్తర్, రబేయా ఖాన్, నహిద అక్తర్, మరుఫా అక్తర్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో శ్రీలంక పాక్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ విజేత స్వర్ణ పతకం కోసం జరిగే ఫైనల్లో శ్రీలంకతో తలపడుతుంది. ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన మంధన -
చరిత్ర సృష్టించిన మంధన
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన మరో ఘనత సాధించింది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించింది. ఇవాళ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ రెండో సెమీఫైనల్లో ఈ రికార్డు నెలకొల్పింది.ఈ రికార్డు సాధించే క్రమంలో మంధన న్యూజిలాండ్ మాజీ స్టార్ సుజీ బేట్స్‌ను అధిగమించింది. బంగ్లాదేశ్ మ్యాచ్‌లో 8 పరుగుల వద్ద మంధన ఈ రికార్డు సొంతం చేసుకుంది.మహిళల అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లుస్మృతి మంధన- 4788సుజీ బేట్స్- 4758హర్మన్‌ప్రీత్ కౌర్- 4287చమారి ఆటపట్టు- 4282సోఫీ డివైన్- 3817మంధన ఇప్పటికే మహిళల అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లు కలిపి) అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ కొనసాగుతుంది.మరో అరుదైన రికార్డుఈ మ్యాచ్‌లో మంధన మరో ప్రత్యేక ఘనతను కూడా నమోదు చేసింది. మహిళల టీ20 అంతర్జాతీయాల్లో 600 ఫోర్లు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచింది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా.. ఓపెనర్లు మంధన (19 బంతుల్లో 37; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), షఫాలీ వర్మ (28 బంతుల్లో 55 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) తమ సహజ శైలిలో రెచ్చిపోవడంతో భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 11 ఓవర్లు ముగిసే సరికి జట్టు స్కోర్ 101-2గా ఉంది. మంధన, కమలిని (3) ఔట్ కాగా.. షఫాలీ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో శ్రీలంక పాక్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్‌కు దూసకెళ్లింది. భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ విజేత ఫైనల్లో శ్రీలంకతో తలపడుతుంది. ఇదీ చదవండి: Asian Games Cricket: ఫైనల్స్‌కు దూసుకెళ్లిన శ్రీలంక -
Asian Games 2026: షూటింగ్ 'సిల్వర్'తో ఖాతా తెరిచిన భారత్
జపాన్‌లో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్‌లో భారత్ పతకాల వేట ప్రారంభమైంది. క్రీడల తొలి రోజే మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ఎలావెనిల్ వలరివన్, సోనం మస్కర్, విదర్సా వినోద్ రజత పతకం సాధించారు. ఈ ఈవెంట్లో చైనా స్వర్ణం సాధించగా.. ఆతిథ్య జపాన్ కాంస్యంతో సరిపెట్టుకుంది.మరో పతకం ఖాయంమహిళల ట్రెడిషనల్ MMA (మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్) 60 కేజీల విభాగంలో సుచికా తరియాల్ సెమీఫైనల్‌కు చేరుకోవడంతో భారత్‌కు మరో పతకం ఖాయమైంది.హాకీ జట్టుకూ అదిరిపోయే ఆరంభంభారత మహిళల హాకీ జట్టుకు అదిరిపోయే అరంభం లభించింది. ఉజ్బెకిస్తాన్‌పై టీమిండియా 19-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. దీపిక 9 గోల్స్‌తో చెలరేగగా.. ఇషిక హ్యాట్రిక్ సాధించింది.టేబుల్ టెన్నిస్‌లోనూ ఘనంగా బోణీమహిళల టేబుల్ టెన్నిస్ ఈవెంట్లోనూ భారత్ ఘనంగా బోణీ కొట్టింది. ఆకుల శ్రీజ, సుతిర్థ ముఖర్జీ, సిండ్రెల దాస్ జోడీ ఇండోనేషియా జోడీపై 3-0తో విజయం సాధించింది.నేడు భారత్ కీలక ఈవెంట్లుమహిళల క్రికెట్: బంగ్లాదేశ్‌తో సెమీఫైనల్పురుషుల హాకీ: ఇండోనేషియాతో తొలి మ్యాచ్షూటింగ్: మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఫైనల్బ్యాడ్మింటన్: కజకిస్థాన్‌తో మహిళల టీమ్ మ్యాచ్వుషు: భారత్ ఆటగాళ్లకు నాకౌట్ పోటీలుఇదీ చదవండి: మరో ముగ్గురికి టీమిండియా నుంచి పిలుపు -
Asian Games Cricket: ఫైనల్స్‌కు దూసుకెళ్లిన శ్రీలంక
ఏషియన్ గేమ్స్ మహిళల క్రికెట్లో శ్రీలంక జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇవాళ జరిగిన తొలి సెమీస్‌లో పాకిస్తాన్‌ను 8 వికెట్ల తేడాతో చిత్త చేసి, తుది బెర్త్ దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అయేషా జాఫర్ (71), షవాల్ జుల్ఫికర్ (54) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. మిగతా ప్లేయర్లలో గుల్ ఫెరోజా డకౌట్ కాగా.. సైరా జబీన్ 17, కెప్టెన్ ఫాతిమా సనా 20 (నాటౌట్), ఎయ్మాన్ ఫాతిమా 5 (నాటౌట్) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో కావ్యా కవిండి, కెప్టెన్ చమారీ ఆటపట్టు, సుగంధిక కుమారి తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో శ్రీలంక బ్యాటర్లు రెచ్చిపోయారు. చమారీ ఆటపట్టు (50 బంతుల్లో 83 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఆమెకు హాసిని పెరీరా (42), ఇమేషా దులానీ (27), హర్షిత సమరవిక్రమ (20 నాటౌట్) సహకరించారు. పాక్ బౌలర్లలో ఫాతిమా సనా, నష్రా సంధుకు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో ఓడినా, పాక్ జట్టు బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌కు అర్హత సాధించింది. ఇవాళే భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్లో ఓడిన జట్టుతో పాక్ సెప్టెంబర్ 22న బ్రాంజ్ మెడల్ మ్యాచ్ ఆడుతుంది. భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ విజేత సెప్టెంబర్ 22నే జరిగే ఫైనల్లో శ్రీలంకను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు స్వర్ణ పతకం సాధిస్తుంది. ఓడిన జట్టు రజతంతో సరిపెట్టుకుంటుంది. ఇదీ చదవండి: మరో ముగ్గురికి టీమిండియా నుంచి పిలుపు -
మరో ముగ్గురికి టీమిండియా నుంచి పిలుపు
టీమిండియా జపాన్ పర్యటన కోసం మరో ముగ్గురికి పిలుపు వచ్చింది. జపాన్‌తో జరగనున్న టీ20 మ్యాచ్, అలాగే ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనేందుకు జపాన్ వెళ్లనున్న భారత క్రికెట్ జట్టుకు ముగ్గురు యువ బౌలర్లు నెట్ బౌలర్లుగా ఎంపికయ్యారు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన రసిఖ్ సలామ్ దార్, మహారాష్ట్రకు చెందిన విక్కీ ఓస్త్వాల్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్తిక్ త్యాగిలను జాతీయ సెలెక్టర్లు ఎంపిక చేశారు.ఈ ముగ్గురిని శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టుతో అనధికారిక సభ్యులుగా జత చేశారు. వీరు ప్రాక్టీస్ సెషన్లలో జట్టు సభ్యులకు బౌలింగ్ చేస్తారు. నిన్న (సెప్టెంబర్ 19) రాత్రే వీరు న్యూఢిల్లీ నుంచి టోక్యోకు బయల్దేరారు.సెప్టెంబర్ 21న ప్రాక్టీస్.. 22న జపాన్‌తో మ్యాచ్భారత జట్టు సెప్టెంబర్ 21న సానో ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేయనుంది. అనంతరం సెప్టెంబర్ 22న జపాన్‌తో టీ20 మ్యాచ్ ఆడుతుంది. ఆ మ్యాచ్ తర్వాత కూడా టీమిండియా మరికొన్ని రోజులు సానోలోనే ఉండి సాధన చేయనుంది. ఈ సమయంలో ముగ్గురు నెట్ బౌలర్లు జట్టుకు ఉపయోగపడనున్నారు.ఆ తర్వాత భారత జట్టు నాగోయాకు వెళ్లి ఆసియా గేమ్స్‌లో పాల్గొంటుంది. ఈ మెగా ఈవెంట్లో భారత్ తొలి మ్యాచ్ సెప్టెంబర్ 28న జరగనుంది.నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో అదనపు బౌలర్లుఏషియన్ గేమ్స్ కోసం తొలుత ఎంపిక చేసిన భారత జట్టులో 15 మంది ఉండగా, నితీశ్ కుమార్ రెడ్డిని వెస్టిండీస్‌తో జరిగే స్వదేశీ వన్డే సిరీస్ కోసం టీమిండియాలోకి తీసుకున్నారు. దీంతో ఏషియన్ గేమ్స్ జట్టులో సభ్యుల సంఖ్య 14కు తగ్గింది. ఈ నేపథ్యంలో నెట్ ప్రాక్టీస్ కోసం ముగ్గురు అదనపు బౌలర్లను జట్టుతో కలిపారు.సెప్టెంబర్ 23న రిపోర్టింగ్మరోవైపు, వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టును సెప్టెంబర్ 23న తిరువనంతపురంలో రిపోర్ట్ చేయాలని బీసీసీఐ ఆదేశించింది. ఈ సిరీస్‌లోని తొలి వన్డే సెప్టెంబర్ 27న తిరువనంతపురంలోనే జరగనుండగా, రెండో వన్డే సెప్టెంబర్ 30న గువాహటిలో, మూడో వన్డే అక్టోబర్ 3న న్యూ చండీగఢ్‌లో జరగనున్నాయి. అనంతరం అక్టోబర్ 6 నుంచి లక్నో వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.ఇదీ చదవండి: బీసీసీఐ కీలక నిర్ణయం.. 31 ఏళ్ల తర్వాత స్పెషల్ మ్యాచ్? -
క్రికెట్ ఎలా ఆడతారంటే..!
నగోయా: ఆసియా క్రీడల్లో వరుసగా రెండో సారి క్రికెట్ భాగమైంది. అయితే చైనాలో జరిగిన గత క్రీడల తరహాలోనే ఈ సారి జపాన్‌లో కూడా ఆటపై పెద్దగా అవగాహన లేదు. జపాన్ జట్టు ఇప్పటికే ఐసీసీ గుర్తింపు పొంది 61 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడినా... సగటు క్రీడాభిమానికి అది ఇంకా చేరువ కాలేదు. ఇలాంటి స్థితిలో జపాన్‌లో ఆసియా క్రీడల్లో క్రికెట్ మ్యాచ్‌లు కూడా జరుగుతున్నాయి. ఈ మెగా ఈవెంట్లో వేర్వేరు క్రీడలను ప్రత్యక్షంగా చూసేందుకు సిద్ధమైన జపాన్ అభిమానులు క్రికెట్ మ్యాచ్‌లకు కూడా వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు ఆటపై మరింత అవగాహన కలి్పంచాలని నిర్వాహకులు భావించారు. ఆటకు సంబంధించి ప్రాధమిక అంశాలను వివరిస్తూ ప్రత్యేకంగా బుక్లెట్లు తయారు చేశారు. క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న కరోగీ స్పోర్ట్స్ పార్క్‌లో వీటిని పంచుతున్నారు. జట్టులోని ఆటగాళ్ల సంఖ్య, ఫీల్డింగ్ స్థానాలు, పరుగుల లెక్క, అవుటయ్యే తీరు... ఇలా అంపైర్ల సైగలతో సహా ఈ బుక్‌లెట్‌లో ముద్రించారు. ఇవన్నీ కూడా స్థానిక జపానీ భాషలోనే ఉండటం విశేషం. -
జపాన్ గుండె చప్పుడు
ఆసియా క్రీడల ఆరంభం సంబరం అద్భుతంగా సాగింది... తమ దేశ సంస్కృతి ప్రదర్శన మాత్రమే కాకుండా పారిశ్రామిక ప్రగతిలో తమ ఘనతను చూపిస్తూ జపాన్ ఈ క్రీడల ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా ప్రదర్శించింది. ప్రముఖ దర్శకుడు యుకిహికు సుసుమి నేతృత్వంలో రూపొందిన ఈ ప్రత్యేక కార్యక్రమం అన్ని రకాలుగా అలరించింది. రంగులు, హంగులతో మిరుమిట్లుగొలిపిన కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలిచాయి. క్రీడల్లో పాల్గొంటున్న వేర్వేరు దేశాల ఆటగాళ్ల మధ్య బంధాన్ని చూపేలా ‘హృదయాన్ని’ నేపథ్యంగా ఎంచుకున్న నిర్వాహకులు కార్యక్రమం ఆసాంతం దాన్ని ప్రతిఫలిస్తూ వినూత్న తరహాలో వేడుకలను ప్రపంచం ముందు ఉంచడం విశేషం. శనివారం మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో సుమారు రెండు గంటల పాటు సాగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైలైట్స్‌ను చూస్తే...అలా సాగింది... ప్రారంభోత్సవ కార్యక్రమం జపాన్ జాతీయగీతంతో మొదలైంది. ఆ తర్వాత ఆ దేశ రక్షణ దళానికి చెందిన సైనికులు జపాన్ జాతీయ పతాకాన్ని స్టేడియంలోకి తీసుకొచ్చారు. ఐషీ రాష్ట్రంలో పర్యాటకపరంగా ఎంతో గుర్తింపు ఉన్న ‘నగోయా క్యాజిల్’ నమూనాను స్టేడియం మధ్యలో ప్రదర్శిస్తూ కార్యక్రమాలను నిర్వహించారు. ఆతిథ్య దేశానికి చెందిన ప్రముఖ వయోలినిస్ట్ టారో హకాసే తన సంగీత ప్రావీణ్యాన్ని ప్రదర్శించగా, నాలుగు భిన్నమైన రంగులతో 240 మంది డాన్సర్లు చేసిన ప్రత్యేక సంగీత కార్యక్రమం అందరిని ఆకట్టుకుంది. జపాన్ చారితక్ర, సాంస్కృతిక ‘కబూకీ’ ప్రదర్శన సమయంలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచి్చంది. ప్రఖ్యాత మ్యూజిక్ బ్యాండ్ ‘ఐఎన్ఐ మ్యూజిక్ గ్రూప్’ కూడా తమ ప్రదర్శనతో అలరించింది. ఈ క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్న 43 క్రీడాంశాలకు చెందిన ఆడియో విజువల్ షోను కూడా ప్రదర్శించారు. కుటుంబ సమేతంగా హాజరైన జపాన్ రాజు నరుహిటో అధికారికంగా క్రీడలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షురాలు క్రిస్టీ కొవెంట్రీ తదితరులు పాల్గొన్నారు.తండ్రీ కొడుకులు కలిసి... ఆసియా క్రీడల జ్యోతిని ఇద్దరు జపాన్ స్టార్ ఆటగాళ్లు కలిసి వెలిగించారు. 2004 ఏథెన్స్ ఒలింపిక్ క్రీడల హ్యామర్ త్రోలో స్వర్ణం సాధించిన మురోఫుషు కోజి, అతని తండ్రి షిగెనొబు కలిసి ఈ లాంఛనం పూర్తి చేశారు. షిగెనొబు కూడా హ్యామర్త్రోలనే ఆసియా క్రీడల్లో ఐదు స్వర్ణాలు గెలుచుకున్నాడు. 46 జట్ల పరేడ్... ప్రారంభోత్సవంలో జరిగిన మార్చ్‌పాస్ట్‌లో మొత్తం 45 దేశాలకు చెందిన అథ్లెట్లు పాల్గొన్నారు. వీటితో పాటు నలుగురు సభ్యుల ఆసియా రెఫ్యూజీ టీమ్ కూడా పరేడ్‌లో భాగమైంది. ఆసియా క్రీడల్లో రెఫ్యూజీ జట్టు పాల్గొనడం ఇదే తొలిసారి. అక్షర క్రమంలో అఫ్గానిస్తాన్ జట్టు అందరికంటే ముందుగా రాగా, సంప్రదాయాన్ని అనుసరించి ఆతిథ్య జట్టు జపాన్ అన్నింటికంటే ఆఖరిగా వచి్చంది. జపాన్ తరఫున 900 మందికి పైగా అథ్లెట్లు పోటీల్లో పాల్గొంటుండటం విశేషం. అంతా హృదయమయం...ఆసియా క్రీడల థీమ్ హార్మోనిక్ ‘హార్ట్’ బీట్... వేదికపై పెద్ద సైజులో ‘హార్ట్’ నమూనా ఏర్పాటు...స్వాగత సంగీతం పేరు అవేకనింగ్ ఆఫ్ ద స్పేస్ అండ్ రెజొనేటింగ్ ‘హార్ట్’ బీట్... మార్చ్‌పాస్ట్‌లో వివిధ దేశాల పేర్ల ప్లకార్డ్‌లు కూడా ‘హార్ట్’ రూపంలోనే...సంగీత కచేరీ చేస్తున్న వయోలినిస్ట్ వేసుకున్న దుస్తులపై కూడా గుండె గుర్తులే... డ్రోన్ షోలో ఏంజెల్స్ రెక్కలూ అదే ఆకారంలో... ఇలా ఆసియా క్రీడల నిర్వాహక బృందం అన్ని చోట్లా హృదయాన్ని నింపేసింది. కబుకీ ప్రదర్శనలోనూ ‘హార్ట్’ బీట్ ఆఫ్ ట్రెడిషన్ అంటూ పరిచయం జరిగింది. ఆటగాళ్ల మధ్య అనుబంధం, ఏకత్వం, స్నేహం పెంపొందించడమే క్రీడల లక్ష్యమంటూ పదే పదే గుర్తు చేసేలా ఈ కార్యక్రమ రూపకల్పన జరగడం విశేషం.సాంకేతిక సత్తా చూపిస్తూ... ప్రఖ్యాత మోటో కార్ప్ కంపెనీ టయోటా ప్రధాన కార్యాలయం ఈ క్రీడలు జరుగుతున్న ఐషీ రాష్ట్రంలోనే ఉంది. అలాంటప్పుడు దాని ప్రాధాన్యతను గురించి చెప్పకపోతే ఎలా! క్రీడల నిర్వాహకులు కూడా అదే తరహాలో ఆలోచించారు. అందుకే ‘హార్మొనీ కనెక్టింగ్ టు ద ఫ్యూచర్’ పేరుతో తమ సాంకేతిక పురోగతిని ప్రదర్శించారు. ఐషీలో ఉన్న ఉత్పాదక కంపెనీలు, అవి తయారు చేసే వస్తువులువంటి అంశాలను తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఎన్నో ఏళ్ల క్రితం ప్రారంభమైన తమ ఇండస్ట్రియల్ టెక్నాలజీ అంచెలంచెలుగా ఎలా ఎదిగిందో, ఎప్పటికిప్పుడు కొత్త ఉత్పాదనలతో భవిష్యత్తు కోసం ఎలా తాము దూసుకు పోతున్నామో ఇందులో వివరించారు.మనూ, పవన్ పతాకధారులుగా...మార్చ్‌పాస్ట్‌లో భారత బృందానికి యువ షూటర్ మనూ భాకర్, కబడ్డీ ఆటగాడు పవన్ సెహ్రావత్ నేతృత్వం వహించారు. ఈ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా రూపొందించిన నీలం రంగు డిజైనర్ డ్రెస్‌లలో భారత అథ్లెట్లు మెరిశారు. బంద్గలాతో కూడిన ఆకర్షణీయమైన చీరలను మహిళా అథ్లెట్లు ధరించగా, అదే తరహాలో సిద్ధం చేసిన జోధ్‌పురి డ్రెస్‌లో పురుష క్రీడాకారులు పాల్గొన్నారు. పతాకధారుల విషయంలో చివరి నిమిషంలో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. మనూ భాకర్‌తో పాటు షాట్‌పుటర్ తజీందర్‌పాల్ సింగ్ ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించాల్సి ఉండగా...అతని స్థానంలో పవన్ వచ్చాడు. ఓపెనింగ్ సెరెమనీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన డ్రెస్ తజీందర్కు అందకపోవడంతో మార్పు తప్పలేదు. తజీందర్ మాత్రమే కాకుండా భారత అథ్లెటిక్స్ బృందంలో ఎవరికీ ప్రారంభోత్సవ కిట్ అందలేదు. దాంతో 75 మంది భారత ఆటగాళ్లు కూడా ఈ కార్యక్రమానికి దూరమయ్యారు! -
భారత్ X బంగ్లాదేశ్
నిషిన్ (జపాన్): ఆసియా క్రీడల్లో పసిడి పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారత మహిళల క్రికెట్ జట్టు ఆదివారం సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌తో అమీతుమీకి సిద్ధమైంది. క్వార్టర్ ఫైనల్లో ఆతిథ్య జపాన్‌పై అలవోక విజయం సాధించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు... అదే జోరు కొనసాగిస్తూ ఫైనల్ చేరాలని భావిస్తోంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా... స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చితే ఈ మ్యాచ్‌లో విజయం నల్లేరుపై నడకే. బంగ్లాతో జరిగిన గత తొమ్మిది మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించడం గమనార్హం. ఇటీవల ఆసియా కప్‌లో కూడా బంగ్లాదేశ్‌పై భారత జట్టు సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్, భారతి ఫూల్మాలి, దీప్తి శర్మతో కూడిన భారత జట్టును ఎదుర్కోవాలంటే బంగ్లా శక్తికి మించి పోరాడాల్సి ఉంటుంది. బౌలింగ్‌లో ఆంధ్ర స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా మారగా... దీప్తి శర్మ, షఫాలీ, రాధ, నందని ఆమెకు సహకారం అందిస్తున్నారు. మరోవైపు కెపె్టన్ నిగార్ సుల్తానా, నహీద అక్తర్, రాబియా ఖాన్ రూపంలో బంగ్లా జట్టులోనూ అనుభవజు్ఞలు అందుబాటులో ఉన్నారు.ఏషియాడ్‌లో నేటి భారత షెడ్యూల్ -
‘రాత్రంతా నిద్రపోలేదు.. పొద్దునే ఇలా.. నాకిది గర్వకారణం’
జపాన్ వేదికగా ఆసియా క్రీడలు- 2026 ఘనంగా మొదలయ్యాయి. ఈ ఆరంభ వేడుకల్లో ఒలింపిక్ పతకాల విజేత, షూటర్ మనూ భాకర్‌తో పాటు.. కబడ్డీ ఆటగాడు పవన్ సెహ్రావత్ ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరించారు. నిజానికి తొలుత మనూ భాకర్‌తో కలిసి షాట్‌పుటర్ తజిందర్ పాల్ సింగ్ తూర్ ఫ్లాగ్ బేరర్‌గా ఎంపికయ్యాడు.ఊహించని అవకాశంఅయితే, కిట్ ఆలస్యంగా రావడం వల్ల మనూకు జతగా ఉన్న మరో భారత పతాకధారిని మార్చాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పవన్ సెహ్రావత్‌కు ఊహించని విధంగా ఫ్లాగ్ బేరర్‌గా అవకాశం వచ్చింది. మనూ భాకర్‌తో కలిసి అతడు భారత పతాకధారిగా వ్యవహరించాడు.రాత్రి అసలు నిద్రపోనేలేదుఈ నేపథ్యంలో పవన్ సెహ్రావత్ మాట్లాడుతూ.. ‘‘నాకిది అత్యంత గర్వించదగ్గ క్షణం. నిజానికి మాకు ప్రాక్టీస్ షెడ్యూల్ ఉంది. అందుకు తగినట్లుగానే మేమంతా ప్రాక్టీస్‌కు సిద్ధమయ్యాము. రాత్రి అసలు నిద్రపోనేలేదు.పొద్దునే జిమ్‌కు వెళ్లి నేరుగా స్టేడియానికి వచ్చేశాను. రాత్రంతా నేను మేల్కొనే ఉన్నాను. అయినా సరే జాతీయ పతాకాధారిగా వస్తున్నానని తెలిసి ఎక్కడా లేని ఉత్సాహం, శక్తి వచ్చాయి. నిజంగా నాకు ఇది గర్వకారణం.ఆమె ఒక స్ఫూర్తిదాయక అథ్లెట్నిజానికి నాకు ఫ్లాగ్ బేరర్‌గా అవకాశం వచ్చిందని ఈరోజు ఉదయమే అందరికీ చెప్పాను. అయితే, మా అన్నయ్య అంకుర్‌కు మాత్రం గత రాత్రే మెసేజ్ చేశాను. ఇక మనూ భాకర్ గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది ఏమీ లేదు.ఆమె ఒక స్ఫూర్తిదాయక అథ్లెట్. ఇంతకు ముందే ఆమెను ఓసారి కలిశాను. ఒలింపిక్ పతక విజేతతో కలిసి ఫ్లాగ్ బేరర్‌గా ఉండటం గర్వించదగ్గ విషయం. మా జట్టును ఉద్దేశించి మనూ గతంలో స్ఫూర్తిదాయక ప్రసంగం ఇచ్చారు. ఇప్పుడిలా ఆమెతో కలిసి నేను పతాకధారిగా ఉండటం ఊహించని విషయం’’ అని పేర్కొన్నాడు. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం పవన్ సెహ్రావత్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేసింది.POV : You’re walking out along with our flag bearers at the Opening Cermony. 🥹🥹The incredible moments as our contingent marches during the Opening Ceremony! As the @asiangames_2026 are officially open, here’s wishing our contingent the very best on a successful games ahead.… pic.twitter.com/Kipe4elYGv— Team India (@WeAreTeamIndia) September 19, 2026చదవండి: Asian Games 2026: ఎవరీ క్వి మ్సీ డిసౌజా? -
అతడి కోసం పట్టుబట్టిన వీవీఎస్ లక్ష్మణ్- గంభీర్.. ఆఖరికి!
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసి జోరు మీదున్న టీమిండియా.. తదుపరి వెస్టిండీస్‌తో తలపడేందుకు సిద్ధమైంది. సొంతగడ్డపై విండీస్ జట్టుతో సెప్టెంబరు 27- అక్టోబరు 17 మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది.ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే జట్లను ప్రకటించింది. అయితే, శుబ్‌మన్ గిల్ సారథ్యంలో వన్డే జట్టు స్వదేశంలో విండీస్‌తో తలపడనుండగా.. అదే సమయంలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని టీ20 జట్టు జపాన్ వేదికగా ఆసియా క్రీడలు ఆడేలా షెడ్యూల్ ఖరారైంది.ఇక్కడ గంభీర్.. అక్కడ లక్ష్మణ్ఈ నేపథ్యంలో విండీస్‌తో సిరీస్‌కు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మార్గదర్శనం చేయనుండగా.. ఆసియా క్రీడల్లో వీవీఎస్ లక్ష్మణ్ భారత టీ20 జట్టుకు తాత్కాలిక హెడ్‌కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలో టీమిండియా యువ ఆల్‌రౌండర్‌కు సంబంధించి గంభీర్- గిల్... వీవీఎస్ లక్ష్మణ్ మధ్య గట్టి వాదనలు జరిగినట్లు సమాచారం.అందుకే ఇద్దరూ అతడినే కోరుకున్నారుదైనిక్ జాగరణ్ కథనం ప్రకారం.. ఆఫ్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను విండీస్‌తో వన్డేల్లో ఆడించాలని గంభీర్- గిల్ భావించినట్లు సమాచారం. కరేబియన్ జట్టులో ఐదుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నందున వాషీ సేవలు కోరుకున్నట్లు తెలుస్తోంది.PC: BCCIఅయితే, ఇప్పటికే వాషీ ఆసియా క్రీడల జట్టులో ఉన్నాడు. ప్రతిష్టాత్మక టోర్నీలో నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు చేరిన టీమిండియా.. నేపాల్‌తో తలపడటం దాదాపుగా ఖాయమే. ఆ జట్టులోనూ ఐదుగురు లెఫ్టాండర్ బ్యాటర్లు ఉన్నారు. కాబట్టి వాషీ తమతో పాటే జపాన్‌కు రావాలని వీవీఎస్ లక్ష్మణ్ బోర్డు వద్ద తన వాదన వినిపించినట్లు తెలుస్తోంది.ఎవరి మాట నెగ్గిందంటేఈ నేపథ్యంలో గంభీర్- గిల్‌తో జరిగిన వాదనలో లక్ష్మణ్ నెగ్గినట్లు తెలుస్తోంది. విండీస్‌తో వన్డేలకు ఎంపిక చేయకుండా.. ఆసియా క్రీడల జట్టుతోనే వాషింగ్టన్ సుందర్‌ను కొనసాగించడం ఇందుకు నిదర్శనం. అయితే, ఆసియా క్రీడలు ముగించుకున్న తర్వాత శ్రేయస్ సేన స్వదేశంలో విండీస్‌తో టీ20 సిరీస్‌లో తలపడనుండగా.. ఈ జట్టులో మాత్రం వాషీకి చోటు దక్కింది. కాగా ఎడమచేతి వాటం బ్యాటర్లను తిప్పలు పెట్టడంలో వాషీకి మంచి రికార్డే ఉంది. ఇప్పటి వరకు వన్డే, టీ20లలో కలిపి 5.67 ఎకానమీ రేటుతో అతడు 37సార్లు లెఫ్టాండర్లను అవుట్ చేశాడు. చదవండి: నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన భారత బ్యాటర్ అతడే: కమిన్స్ -
మరోసారి టీమిండియాకు అదే ‘గండం’.. స్పందించిన బీసీసీఐ
భారత మహిళా, పురుష క్రికెట్ జట్లకు మరోసారి ‘నక్వీ గండం’ ఎదురయ్యే అవకాశం ఉంది. ఆసియా కప్ తర్వాత ఆసియా క్రీడలు-2026 టోర్నీలోనూ అతడి చేతుల మీదుగానే ట్రోఫీ అందుకోవాల్సి వస్తే పరిస్థితి ఏమిటనే చర్చ మొదలైంది. కాగా ఆసియా క్రికెట్ మండలి (ACC) అధ్యక్షుడిగా పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి, పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోసిన్ నక్వీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.రెండుసార్లు నిరాకరణఅయితే, భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా టీ20 కప్-2025లో విజేతగా నిలిచిన భారత పురుషుల జట్టు, ఇటీవల 2026లో ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకున్న భారత మహిళల జట్టు నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు నిరాకరించాయి. దీంతో ఇంతవరకు ట్రోఫీలు భారత్‌కు అందకుండా నక్వీ పావులు కదుపుతున్నాడు.హాట్ ఫేవరెట్‌గా భారత జట్లుఈ నేపథ్యంలో ఆసియా క్రీడల్లోనూ ఇదే తరహా పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. జపాన్ వేదికగా ఈ టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే. క్రికెట్ విభాగంలో టీ20 ఫార్మాట్లో మ్యాచ్‌లు నిర్వహిస్తుండగా.. డిఫెండింగ్ చాంపియన్లు టీమిండియా, భారత మహిళా జట్టు హాట్ ఫేవరెట్‌గా ఉన్నాయి.ఇక్కడా అదే గండం.. నిరాకరిస్తే కష్టమే!ప్రస్తుతం అత్యంత పటిష్టంగా ఉన్న ఇరుజట్లు దాదాపు స్వర్ణం గెలవడం ఖాయమే. ఈ నేపథ్యంలో ఆసియా ఒలింపిక్ మండలి (OCA)లో భాగమైన నక్వీకి గనుక పతకాలు ప్రదానం చేసే అవకాశం వస్తే.. భారత జట్లు తప్పక అతడి చేతుల మీదుగానే మెడల్స్ స్వీకరించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆసియా క్రీడలనే అవమానించినట్లుగా అవుతుంది. తద్వారా పతకాలు నిరాకరించిన జట్లపై క్రమశిక్షణా చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది.స్పందించిన బీసీసీఐఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా స్పందించారు. ‘‘ముందుగా మ్యాచ్‌లు గెలవడంపైనే మా దృష్టి ఉంది. భారత జట్లు స్వర్ణ పతకం గెలిచి పోడియం వద్దకు వెళ్లాలి. అప్పుడే మేము దీని గురించి నిర్ణయం తీసుకుంటాము.ప్రస్తుతం మా దృష్టి మొత్తం మ్యాచ్‌లు గెలవడం మీదే ఉంది. బోర్డు, ఆటగాళ్లకు ఇదే మొదటి ప్రాధాన్యం. ఇప్పటి వరకు జరగని దాని గురించి పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు’’ అని సైకియా పేర్కొన్నారు.నిబంధనలు ఇవేకాగా ఆసియా ఒలింపిక్ మండలి నియావళిలోని ఆర్టికల్ 66 ప్రకారం.. ‘విజయాలు, పతకాల ప్రదానోత్సం’లో భాగంగా విజేతలకు OCA అధ్యక్షుడు నేరుగా మెడల్ ప్రదానం చేయవచ్చు. లేదంటే.. మండలిలో భాగమైన ఇతర సభ్యులకు ఆ బాధ్యతను అప్పగించవచ్చు. ఇక్కడ ఎలాంటి రాజకీయ, మతపరమైన, వాణిజ్యపరమైన అంశాలకు తావు ఉండదు.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన భారత బ్యాటర్ అతడే: కమిన్స్ -
సెమీస్‌లో ఓటమి.. అయినా మరో అవకాశం!
ఆసియా క్రీడలు-2026లో భారత టెక్బాల్ స్టార్ క్విమ్సీ డిసౌజాకు చేదు అనుభవం ఎదురైంది. మహిళల సింగిల్స్‌లో ఆది నుంచి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ ముంబైకర్ సెమీ ఫైనల్లో మాత్రం ఓటమిపాలైంది.ఇండోనేషియాకు చెందిన ఇమా సుమయతో సెమీస్‌లో తలపడ్డ క్విమ్సీ తొలి సెట్‌ను 12-7తో గెలుచుకుంది. అయితే, సుమయ అనూహ్య రీతిలో పుంజుకుని రెండో సెట్‌ను 12-9తో సొంతం చేసుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్లో పట్టువదలని సుమయ 12-7తో క్విమ్సీపై పైచేయి సాధించింది.ఫలితంగా సుమయా ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే, సెమీస్‌లో ఓడినప్పటికీ క్విమ్సీకి పతకం గెలిచేందుకు మరో అవకాశం ఉంది. ఆదివారం జరిగే కాంస్య పతక పోరులో ఆమె జపాన్‌కు చెందిన యియునా సకామొటోతో అమీతుమీ తేల్చుకుంటుంది. ఎవరీ క్విమ్సీ డిసౌజా?ముంబైకి చెందిన క్విమ్సీ పదమూడేళ్ల వయసులో మిడిల్ డిస్టాన్స్ రన్నర్‌గా తన క్రీడా ప్రయాణం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఫుట్‌బాల్‌పై మక్కువ పెంచుకున్న 24 ఏళ్ల ఈ అమ్మాయి ఏజ్ గ్రూప్‌లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహించింది.అయితే, ఆశించిన రీతిలో కెరీర్ కొనసాగే పరిస్థితి లేకపోవడంతో క్విమ్సీ.. చదువు మీద శ్రద్ధ పెట్టింది. స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేసి.. క్రీడా వస్తువుల రీటైలర్ డెకథ్లాన్లో ఉద్యోగంలో చేరింది. అక్కడే ఆమెకు టెక్బాల్ పరిచయమైంది.బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం రినాల్డిన్హో ఇన్స్టాగ్రామ్ వీడియోలో టెక్బాల్ ఆటను వీక్షించిన క్విమ్సీకి ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో కఠోర శ్రమతో క్రమక్రమంగా భారత టెక్బాల్ స్టార్‌గా ఎదిగింది. అంతర్జాతీయ స్థాయిలో టెక్బాల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన తొలి మహిళా టెకర్గా నిలిచింది.ఏడుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన క్విమ్సీ.. బెంగళూరులో టెక్బాల్ క్లబ్ స్థాపించి.. క్రీడను ప్రోత్సహిస్తోంది. ఇటీవల రొమేనియాలో జరిగిన టెక్బాల్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో క్విమ్సీ తొమ్మిదో స్థానంలో నిలిచింది.ఇక తాజాగా ఆసియా క్రీడల్లో మహిళల సింగిల్స్‌లో గ్రూప్-ఎ నుంచి తలపడ్డ క్విమ్సీ.. తొలుత జపాన్ టెకర్ యియునా సకామొటోపై 2-1తో గెలిచింది. ఆ తర్వాత కాంబోడియా టెకర్ కొయెమైయన్ను ఓడించింది. ఈ క్రమంలో గ్రూప్-ఎ టాపర్‌గా నిలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. అయితే, సెమీస్‌లో మాత్రం ఓటమి ఎదురైనప్పటికీ.. కాంస్య పతక పోరులో నిలవగలిగింది.ఏమిటీ టెక్బాల్?ఫుట్‌బాల్, టేబుల్ టెన్నిస్‌ల కలయికే ఈ గేమ్. వాలుగా ఉన్న టేబుల్ పైనున్న నెట్ మీదుగా.. ఆటగాళ్లు తమ పాదాలు, కాళ్లు, ఛాతీ, తలతో ఫుట్‌బాల్‌ను కొడుతుంటారు. చేతులు, భుజాలు కాకుండా శరీరంలోని ఏ భాగంతోనైనా ఫుట్‌బాల్‌ను హిట్ చేయొచ్చు. సింగిల్స్, డబుల్స్ ఫార్మాట్లలో దీనిని నిర్వహిస్తారు. హంగేరీలో 2014లో ఈ క్రీడను కనుగొన్నారు. -
ఆసియా...ఆటాడుకుందాం రా..!
46 దేశాలు... 43 వేర్వేరు క్రీడలు... 71 క్రీడాంశాలు... 469 మెడల్ ఈవెంట్లు... 17 వేలకు పైగా అథ్లెట్లు, క్రీడాధికారులు... ఆటగాళ్ల సంఖ్యాపరంగా చూస్తే ఒలింపిక్స్‌కంటే పెద్ద క్రీడా సంబరం... రెండు వారాల పాటు ఉత్కంఠభరిత పోటీలు... నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు నేటితో తెర లేవనుంది. 75 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పోటీల్లో 20వ సారి ఈ ఆటల సంబరాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. మూడోసారి ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న జపాన్... ఆరంభ విఘ్నాలను దాటి అద్భుతంగా నిర్వహిస్తామని హామీ ఇస్తోంది. నగోయా: ఆసియా ఖండపు క్రీడాకారుల సత్తాకు పరీక్షగా నిలిచే క్రీడా పోటీలకు విజిల్ మోగింది. అధికారికంగా నేటి నుంచి 20వ ఆసియా క్రీడలు జరగనున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా శనివారమే నిర్వహిస్తారు. అక్టోబర్ 4న పోటీలు ముగుస్తాయి. ఐషీ రాష్ట్ర రాజధాని నగోయా నగరంతో పాటు నగోయా శివార్లలోని ఇతర ప్రాంతాల్లో వేర్వేరు వేదికల్లో పోటీలు జరుగుతాయి. ఆసియా క్రీడల కోసం సుమారు 2.4 బిలియన్ డాలర్ల బడ్జెట్ కేటాయించారు. అయితే సాధ్యమైనంత తక్కువ ఖర్చులో క్రీడలను నిర్వహించే క్రమంలో శాశ్వత కట్టడాలేమీ ఎక్కువగా లేకుండా జపాన్ ప్రభుత్వం జాగ్రత్త పడింది. దాంతో ప్రత్యేకంగా ఆటగాళ్ల కోసం ‘గేమ్స్ విలేజ్’ ఏర్పాటు చేయకుండా అందుబాటులో ఉన్న సౌకర్యాలలోనే వసతి, ఇతర ఏర్పాట్లు చేసింది. ఈ విషయంలో ఆటగాళ్ల నుంచి కొంత అసంతృప్తి కనిపిస్తున్నా... నిర్వాహకులు మాత్రం తమ ప్రణాళికలకే కట్టుబడి గేమ్స్‌ను విజయవంతం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆర్చరీ, హాకీ, టెన్నిస్, స్క్వాష్ లలో ఆసియా క్రీడల ప్రదర్శన ఆధారంగా 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యేందుకు అవకాశం ఉంది. భారత జెండా ఎగిరింది... ఆసియా క్రీడల సాంప్రదాయాన్ని అనుసరించి శుక్రవారం ప్రధాన వేదిక వద్ద వివిధ దేశాల జాతీయ పతాకాలను ఎగురవేశారు. ఆసియా ఒలింపిక్ కౌన్సిల్, క్రీడల నిర్వహణ కమిటీ మధ్య సమన్వయ లోపం కారణంగా ఈ కార్యక్రమం షెడ్యూల్‌కంటే ఆలస్యంగా జరిగింది. జపాన్ సాంప్రదాయ శైలి సాంస్కృతిక కార్యక్రమాల మధ్య వేడుకను నిర్వహించారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే సమయంలో భారత చెఫ్ డి మిషన్ సహదేవ్ యాదవ్‌తో పాటు నలుగురు డిప్యూటీ చెఫ్ డి మిషన్లు శరత్ కమల్, తోటన్, అలకనంద, అంజలి భగవత్ హాజరయ్యారు.ఫ్లాగ్ బేరర్లుగా తజీందర్, మనూ... ప్రారంభోత్సవ వేడుకల్లో భారత్ తరఫున ఇద్దరు ఆటగాళ్లు ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరించనున్నారు. షాట్‌పుట్ డిఫెండింగ్ చాంపియన్ తజీందర్ పాల్ సింగ్ తూర్, షూటర్ మనూ భాకర్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. మను భాకర్ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలుచుకుంది. ఆసియాడ్‌లో ఎక్కువ పతకాలు సాధించే క్రీడాంశాలైన షూటింగ్, అథ్లెటిక్స్ ప్రతినిధులుగా వీరిద్దరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.భారత్ నుంచి 501 మంది బరిలో...ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇన్నేళ్లుగా మంచి రికార్డు ఉంది. 1951 నుంచి 2023 వరకు జరిగిన 19 ఏషియాడ్‌లలో పాల్గొన్న భారత్ ఓవరాల్‌గా ఆల్‌టైమ్ పతకాల జాబితాలో ఐదో స్థానంలో ఉంది. భారత్ ఇప్పటి వరకు 183 స్వర్ణాలు, 238 రజతాలు, 357 కాంస్యాలు కలిపి మొత్తం 778 పతకాలు గెలుచుకుంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఇరాన్ మన కంటే ముందున్నాయి. చైనాలోని హాంగ్జూలో జరిగిన గత ఆసియా క్రీడల్లో 106 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచిన (28 స్వర్ణాలు, 38 రజతాలు, 40 కాంస్యాలు) భారత్ ఈసారి అంతకంటే మెరుగైన ప్రదర్శన కనబర్చాలనే లక్ష్యంతో సిద్ధమైంది. 2018 క్రీడలతో పోలిస్తే ఏకంగా 36 పతకాలు ఎక్కువ గెలిచి తొలిసారి సెంచరీ దాటిన మన దేశం ఈసారి మరింత పెద్ద లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఎప్పటిలాగే అథ్లెటిక్స్, షూటింగ్లలో భారత్‌కు ఎక్కువ పతకాలు లభించే అవకాశం ఉంది. మొత్తం 501 మంది సభ్యుల బృందంతో భారత్ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. వీరిలో 267 మంది పురుష అథ్లెట్లు, 234 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. ఆసియా క్రీడల్లో 43 వేర్వేరు క్రీడలు ఉండగా... భారత్ 36 క్రీడల్లో పాల్గొంటోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 21 మంది ఆటగాళ్లు ఏషియాడ్‌లో పోటీ పడుతున్నారు. మన ఆటగాళ్ల శిక్షణ, ఎక్విప్మెంట్, కోచ్‌లు, ఆర్థిక సహకారం తదితర అంశాలు కలిపి ఆసియా క్రీడల సన్నద్ధత కోసం రూ. 703 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది ఆసక్తికరం.సమస్యలు సహజమే: నిర్వాహకులుపెద్ద క్రీడా ఈవెంట్ల నిర్వహణలో పలు సవాళ్లు ఉంటాయని, కొన్ని సమస్యలు సహజంగానే వస్తాయని ఆసియా క్రీడల నిర్వహణ కమిటీ స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా వసతి, ఇతర సౌకర్యాల విషయంలో తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కమిటీ చైర్మన్ తయ్యబ్ ఇక్రమ్ వివరణ ఇచ్చారు. ‘క్రీడల్లో కలి్పంచే సౌకర్యాల విషయంలో కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమే. అయితే వీటిని రాజకీయం చేయవద్దు. కొందరు ప్రతీ విషయంలో ఫిర్యాదు చేస్తున్నారు. ఏ క్రీడల్లో సమస్యలు లేకుండా ఉంటాయి. వాటిని మేం ఎలా పరిష్కరిస్తామనేది ముఖ్యం. గేమ్స్ విలేజ్ ఏర్పాటు చేయాల్సిందనే వాదన వినిపించింది. అయితే మనం వాస్తవిక దృష్టితో ఆలోచించాలి. ఖర్చు తగ్గించుకోవాలి కదా. ఆటల తర్వాత దానిని ఏం చేస్తాం. 2030, 2034 ఆసియా క్రీడల్లో గేమ్స్ విలేజ్‌లు ఉంటాయి’ అని ఆయన వివరించారు. మరోవైపు 2038 ఆసియా క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇచ్చే అంశంపై 2028లోనే స్పష్టత వస్తుందని ఒలింపిక్ కౌన్సిల్ ఆసియా (ఓసీఏ) పేర్కొంది. ఈ క్రీడల కోసం భారత్‌తో పాటు మరో ఐదు దేశాలు కూడా పోటీ పడుతున్నాయని, ఇప్పుడే దీనిపై ఏమీ చెప్పలేమని ఓసీఏ అధికారులు చెప్పారు. -
మహిళా అథ్లెట్, పురుష కోచ్‌కు ఒకే గది కేటాయింపు!
2026 ఆసియా క్రీడల కోసం జపాన్‌లోని నగోయాకు చేరుకున్న భారత బృందానికి వసతి సంబంధిత సమస్యలు కొనసాగుతున్నాయి. తాజాగా జిమ్నాస్ట్ ప్రణతి నాయక్, ఆమె కోచ్ అశోక్ మిశ్రాకు ఎదురైన ఘటన కలకలం రేపింది. అధికారిక వసతి కోసం క్రూయిజ్ షిప్‌కు చేరుకున్న సమయంలో నిర్వాహకులు వారిద్దరికీ ఒకే గదిని కేటాయించారు. అథ్లెట్, కోచ్ ఒకే గదిలో ఉండేలా ఏర్పాట్లు చేయడంపై ఇద్దరూ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక నిర్వాహకులు, భారత బృందం అధికారులతో సంప్రదింపులు జరిపినప్పటికీ సమస్య పరిష్కారం కావడానికి గంటల సమయం పట్టింది.భారత ఒలింపిక్ సంఘం (IOA) జోక్యంతో చివరకు ప్రత్యామ్నాయ వసతి ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో ప్రణతి, అశోక్ మిశ్రాకు వేర్వేరు గదులు కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే కోచ్ అశోక్ మిశ్రాకు మరో సమస్య ఎదురైంది. తనకు కేటాయించిన గది తాళాలు తీసుకునేందుకు వెళ్లగా, హోటల్ రిజిస్టర్లో తన బుకింగ్ కనిపించలేదని సిబ్బంది తెలిపారు. రికార్డుల్లో ఆయన పేరులోని ‘I’ అక్షరం తప్పిపోవడంతో ఈ సమస్య తలెత్తినట్లు గుర్తించారు.అధికారిక రికార్డుల్లో జరిగిన పొరపాటును సరిచేసి, అశోక్ మిశ్రా అక్రిడిటేషన్‌ను ధృవీకరించేందుకు మరో 45 నిమిషాలు పట్టింది. దీంతో ఆయన తెల్లవారుజామున 2 గంటలు దాటిన తర్వాతే గదికి చేరుకుని విశ్రాంతి తీసుకోగలిగారు. ఈ ఘటనను ప్రణతి నాయక్ కూడా ధృవీకరించారు.ఇదీ చదవండి: వ్యభిచారం చేసినందుకు మహిళకు వంద కొరడా దెబ్బలు! -
టీ20 క్రికెట్లో షఫాలీ వర్మ అరుదైన ఫీట్
భారత మహిళా క్రికెటర్ షఫాలీ వర్మ టీ20 క్రికెట్లో అరుదైన రికార్డు సాధించింది. ఒక క్యాలండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో షఫాలీ వర్మ రెండో స్థానంలో నిలిచింది. 2026లో షఫాలీ వర్మ 26 సిక్సర్లు కొట్టింది. అయితే ఈ జాబితాలో శ్రీలంక కెప్టెన్ చమేరీ ఆటపట్టు (32 సిక్సర్లు, 2024 ఏడాదిలో) తొలి స్థానంలో కొనసాగుతోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ (2018లో 25 సిక్సర్లు), సోఫీ డివైన్ (2018లో 21 సిక్సర్లు, 2020లో 21 సిక్సర్లు) మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.మహిళల టీ20 క్రికెట్లో బంతుల పరంగా భారత్ 90 బంతులు మిగిలి ఉండగానే జపాన్ విజయం సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో జింబాబ్వే మహిళల జట్టు (108 బంతులు వర్సెస్ ఎస్వాటిని), ఐర్లాండ్ మహిళలు (104 బంతులు వర్సెస్ ఫ్రాన్స్ ), జింబాబ్వే మహిళలు (98 బంతులు వర్సెస్ నైజిరీయా) రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన జపాన్ మహిళల జట్టు 19.5 ఓవర్లలో 57 పరుగులకు ఆలౌటైంది. అయకా కాటో స్టాఫోర్డ్ (25) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో శ్రీ చరణి 4 వికెట్లతో చెలరేగగా, షఫాలీ వర్మ 2, శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ 5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. షఫాలీ వర్మ (15 బంతుల్లో 40 నాటౌట్) దనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా, రిచా ఘోష్ (12 నాటౌట్) ఆకట్టుకుంది. జపాన్ బౌలర్లలో నొనొహా యుమొటొ, అయ్కా కాటో చెరొక వికెట్ తీశారు.𝙎𝙝𝙪𝙧𝙪 𝙝𝙤𝙩𝙚 𝙝𝙞 𝙠𝙝𝙖𝙩𝙖𝙢 😅 Japan were bowled out for 58, and India wrapped it up in just 4.6 overs - with Shafali Verma putting the finishing touch with a six✨Catch India vs Japan at the Asian Games, LIVE NOW on Sony Sports Network & Sony LIV.… pic.twitter.com/nTfQ1rVlx5— Sony Sports Network (@SonySportsNetwk) September 18, 2026ఇదీ చదవండి: ఉత్తర కొరియా వల్ల 1,399 భూకంపాలు! -
భారత్ ఘన విజయం.. సెమీ ఫైనల్లో ప్రత్యర్థి ఎవరంటే?
ఆసియా క్రీడలు-2026 మహిళల టీ20 క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. ఆతిథ్య జపాన్ మహిళా జట్టుతో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది.. సెమీస్‌కు దూసుకువెళ్లింది.అదరగొట్టిన కడప అమ్మాయినిశిన్లోని కరోగి స్పోర్ట్స్ పార్కులో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన జపాన్ 57 పరుగులకే కుప్పకూలింది. Sree Charani keeps it tight and bowls a brilliant maiden over! 👏Catch India vs Japan at the Asian Games, LIVE NOW on Sony Sports Network & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #AsianGames #AichiNagoya2026 #BaarBaarBharatHarBaarBharat pic.twitter.com/HZFN7vGlYr— Sony Sports Network (@SonySportsNetwk) September 18, 2026భారత బౌలర్లలో కడప అమ్మాయి శ్రీచరణి (4/10) అద్భుత ప్రదర్శన కనబరచగా.. షఫాలి వర్మ (2/13), శ్రేయాంక పాటిల్ (1/9), దీప్తి శర్మ (1/14) కూడా రాణించారు. ఇక జపాన్ విధించిన 58 పరుగుల లక్ష్యాన్ని భారత్ రెండు వికెట్లు కోల్పోయి కేవలం ఐదు ఓవర్లలోనే ఊదేసింది. షఫాలి విధ్వంసంవైస్ కెప్టెన్ స్మృతి మంధానకు బదులుగా ఓపెనర్ వచ్చిన 18 ఏళ్ల గుణాలన్ కమిలిని డకౌట్ కాగా.. మరో ఓపెనర్ షఫాలి వర్మ తనదైన శైలిలో దూకుడుగా ఆడింది. కేవలం 15 బంతుల్లోనే ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో చెలరేగి.. 40 పరుగులతో అజేయంగా నిలిచింది. ఐదో ఓవర్లో ఆఖరి బంతికి సిక్సర్ బాది టీమిండియా గెలుపును ఖరారు చేసింది.మిగిలిన వారిలో వన్‌డౌన్‌లో వచ్చిన భారతి ఫుల్మలి ఆరు పరుగులు చేసి అవుట్ కాగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ 6 బంతుల్లో 12 పరుగులతో అజేయంగా నిలిచింది. జపాన్ బౌలర్లలో నొనొహ యసుమొటో, అయాక కాటో- స్టఫోర్ట్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా సెమీ ఫైనల్లో భారత్ బంగ్లాదేశ్‌ను ఎదుర్కోనుంది.సెమీస్ చేరిన జట్లు ఇవేనిశిన్ వేదికగా గురువారం బంగ్లాదేశ్- చైనా మధ్య తొలి క్వార్టర్ ఫైనల్ వర్షం వల్ల రద్దు కాగా.. ర్యాంకింగ్స్ ఆధారంగా బంగ్లా సెమీస్‌కు చేరింది. రెండో క్వార్టర్ ఫైనల్లో థాయ్‌లాండ్‌పై పాకిస్తాన్ గెలిచి.. టాప్-4కు అర్హత సాధించింది. తాజాగా శుక్రవారం నాటి మూడో క్వార్టర్ ఫైనల్లో మలేషియాపై శ్రీలంక.. జపాన్‌పై భారత్ గెలిచి సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి.సెమీ ఫైనల్ షెడ్యూల్ ఇదేసెప్టెంబరు 20 (ఆదివారం)- తొలి సెమీ ఫైనల్- పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక- భారత కాలమానం ప్రకారం ఉదయం 5.30 గంటలకు మ్యాచ్ ఆరంభంసెప్టెంబరు 20 (ఆదివారం)- రెండో సెమీ ఫైనల్- భారత్ వర్సెస్ బంగ్లాదేశ్- భారత కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు మ్యాచ్ ఆరంభంవేదిక: కరోగి స్పోర్ట్స్ పార్కు, నిశిన్, జపాన్.చదవండి: సంజూను పక్కన పెట్టాను.. అతడు వేచి చూడాల్సిందే: గంభీర్ -
చెలరేగిన భారత స్పిన్నర్.. జపాన్ 57 ఆలౌట్
జపాన్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళా బౌలర్ శ్రీ చరణి అద్భుత ప్రదర్శన కనబరిచింది. నాలుగు వికెట్లతో చెలరేగిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేసింది. శ్రీ చరణితో పాటు షఫాలి వర్మ, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్ కూడా రాణించారు. ఫలితంగా జపాన్ మహిళా క్రికెట్ జట్టు కేవలం 57 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసియా క్రీడలు-2026 మహిళల టీ20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా నాలుగో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్- జపాన్ పోటీకి దిగాయి. జపాన్‌లోని నిశిన్ వేదికగా టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టుకు మెరుగైన ఆరంభం లభించింది.ఓపెనర్లు హరునా ఇవాసాకి పది పరుగులు చేయగా.. అయాక కాటో- స్టఫోర్డ్ 25 పరుగులతో సత్తా చాటింది. అయితే, హరూనాను అవుట్ చేసి శ్రీ చరణి వికెట్ల వేట మొదలుపెట్టగా.. అయాకను షఫాలి వర్మ పెవిలియన్‌కు పంపింది.ఇక వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ మైయ్ యనగిడను శ్రీ చరణి డకౌట్ చేయగా.. ఎరికా ఓడా (5)ను దీప్తి శర్మ వెనక్కి పంపింది. ఐదో స్థానం నుంచి మిగిలిన బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారు. షిమాకో కాటో 3, అకారి నిశిముర కానో 2, వికెట్ కీపర్ బ్యాటర్ హినాసే గోటో 1, అహిల్య చందేల్ 0, ఆయుమి ఫుజికావా 4 (నాటౌట్), ఎరికా టొగుచి క్విన్ 0, నొనొహ యసుమొటో 0 పరుగులు చేశారు.శ్రీచరణి నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 10 పరుగులే ఇచ్చి.. హరునా, మైయ్, అకారి, ఎరిక వికెట్లు పడగొట్టింది. షఫాలి వర్మ నాలుగు ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీయగా.. శ్రేయాంక పాటిల్ 3.5 ఓవర్లలో తొమ్మిది పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టింది. దీప్తి శర్మ పూర్తి కోటా బౌలింగ్ చేసి 14 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకుంది. నిజానికి పసికూన జపాన్ 19.5 ఓవర్ల పాటు ఆలౌట్ కాకుండా ఉండటమే విశేషం.తుదిజట్లుభారత్స్మృతి మంధాన, షఫాలి వర్మ, గుణాలన్ కమలిని, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), భారతి ఫుల్మలి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్, క్రాంతి గౌడ్, నందిని శర్మజపాన్హరునా ఇవాసాకి, ఆకారి నిశిముర కానో, మైయ్ యనగిడ (కెప్టెన్), ఎరిక ఓడా, అహిల్య చందేల్, షిమాకో కాటో, అయాక కాటో- స్టఫోర్డ్, ఆయుమి ఫుజికావా, హినాసే గోటో (వికెట్ కీపర్), ఎరిక టొగుచి క్విన్, నొనొహా యసుమొటో. -
సెమీ ఫైనల్లో శ్రీలంక.. పాకిస్తాన్‌తో ఢీ!
ఆసియా క్రీడలు-2026 మహిళల టీ20 క్రికెట్ టోర్నమెంట్లో శ్రీలంక జట్టు సత్తా చాటింది. జపాన్‌లోని నిశిన్ వేదికగా జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మలేషియాను చిత్తుగా ఓడించింది. తద్వారా సెమీస్‌కు అర్హత సాధించింది.ఆటపట్టు మెరుపు అర్ధ శతకంకరోగి స్పోర్ట్స్ పార్కులో శుక్రవారం ఉదయం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక మహిళా క్రికెట్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో ఇమేషా దులాని (2) విఫలమైనప్పటికీ.. కెప్టెన్ చమరి ఆటపట్టు మెరుపు అర్ధ శతకంతో సత్తా చాటింది. కేవలం 37 బంతుల్లోనే ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో ఆటపట్టు 63 పరుగులు సాధించింది.కవిశా ధనాధన్మిగిలిన వారిలో హాసిని పెరీరా (26 బంతుల్లో 23) ఫర్వాలేదనిపించగా.. కవిశా దిల్హరి ధనాధన్ (27 బంతుల్లో 44 నాటౌట్) దంచికొట్టింది. ఆఖర్లో హర్షిత సమరవిక్రమ (18 బంతుల్లో 25) కూడా వేగంగా ఆడింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది.74 పరుగులకే పరిమితంమలేషియా బౌలర్లలో నురిన్ ఇమానైనా మూడు వికెట్లు తీసి సత్తా చాటింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన మలేషియా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 74 పరుగులు మాత్రమే చేసింది. శ్రీలంక బౌలర్లు మిథాలి అయోధ్య, కవిశా దిల్హరి, చమరి ఆటపట్టు అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి.. తలా రెండు వికెట్లు కూల్చి.. ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు.సెమీస్‌లో పాక్‌తో ఢీమలేషియా బ్యాటర్లలో వినిఫ్రెడ్ దురైసింగం (28), మహిరా ఇజాతి ఇస్మాయిల్ (24) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఇక మలేషియాపై 86 పరుగుల తేడాతో జయభేరి మోగించిన శ్రీలంక.. సెమీ ఫైనల్ బెర్తు ఖాయం చేసుకుంది. ఇక ఇప్పటికే బంగ్లాదేశ్, పాకిస్తాన్ కూడా సెమీస్ చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే తొలి సెమీ ఫైనల్లో పాకిస్తాన్- శ్రీలంక తలపడేందుకు సిద్ధమయ్యాయి.చదవండి: సంజూను పక్కనపెట్టాను.. వైభవ్ వేచి చూడాల్సిందే: గంభీర్ -
టాస్ గెలిచిన భారత్.. తొలుత బౌలింగ్
ఆసియా క్రీడలు-2026 మహిళల టీ20 టోర్నీలో భాగంగా నాలుగో క్వార్టర్ ఫైనల్లో భారత్- జపాన్ పోటీకి దిగాయి. నిశిన్లోని కరోగి స్పోర్ట్స్ పార్క్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.మూడు సెమీస్ బెర్తులు ఖరారుకాగా సెప్టెంబరు 17- 22 మధ్య ఆసియా క్రీడల-2026 మహిళల టీ20 టోర్నీకి షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో గురువారం నాటి తొలి క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్- చైనా తలపడాల్సి ఉండగా.. వర్షం వల్ల టాస్ పడకుండానే మ్యాచ్ రద్దైపోయింది. ఫలితంగా ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా బంగ్లాదేశ్ సెమీ ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించింది.ఇక రెండో క్వార్టర్ ఫైనల్లో థాయ్‌లాండ్‌పై మూడు వికెట్ల తేడాతో గట్టెక్కి పాకిస్తాన్ సెమీస్‌కు చేరింది. మరోవైపు.. మూడో క్వార్టర్ ఫైనల్లో శ్రీలంక మలేషియాపై 86 పరుగుల తేడాతో గెలిచి టాప్-4లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో తొలి సెమీ ఫైనల్లో పాకిస్తాన్- శ్రీలంక తలపడనుండగా.. భారత్- జపాన్ మధ్య మ్యాచ్ విజేతతో బంగ్లాదేశ్ రెండో సెమీస్ మ్యాచ్‌లో పోటీకి దిగనుంది.తుదిజట్లుభారత్స్మృతి మంధాన, షఫాలి వర్మ, గుణాలన్ కమలిని, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), భారతి ఫుల్మలి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్, క్రాంతి గౌడ్, నందిని శర్మ జపాన్హరునా ఇవాసాకి, ఆకారి నిశిముర కానో, మైయ్ యనగిడ (కెప్టెన్), ఎరిక ఓడా, అహిల్య చందేల్, షిమాకో కాటో, అయాక కాటో- స్టఫోర్డ్, ఆయుమి ఫుజికావా, హినాసే గోటో (వికెట్ కీపర్), ఎరిక టొగుచి క్విన్, నొనొహా యసుమొటో. -
గదులు...గందరగోళం!
నగోయా: అంతా బాగుంది అంటూ ఆసియా క్రీడల్లో ఏర్పాట్లు, వసతి సౌకర్యాలపై గత రెండు రోజులుగా ఆటగాళ్లు, అధికారులు కొంత సంతృప్తి చెందినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే అంతా మొదటికొచ్చినట్లు కనిపిస్తోంది. ఇరుకైన గదులు, ఇద్దరికే కష్టమైన చోట మూడో వ్యక్తికి చోటు, బయట ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్న అధికారులు... ఇలా అన్ని వైపుల నుంచి సమస్యలు కనిపిస్తున్నాయి. రేపు ఆసియా క్రీడల్లో ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ఆటగాళ్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎంతో గొప్పగా చెప్పుకున్న ‘కోస్టా సెరెనా క్రూజ్ షిప్’లో వసతి ఏమాత్రం బాగా లేదని ఆటగాళ్లు చెబుతున్నారు. సమన్వయ లోపంతో పురుష, మహిళా ఆటగాళ్లకు కలిపి ఒకే గదిలో వసతి కల్పించినట్లుగా కూడా వినిపిస్తోంది. వీరిలో జపాన్ అథ్లెట్లు కూడా ఉండటం విశేషం. ‘కోచ్‌లు, టీమ్ అధికారులు, అథ్లెట్లకు కలిపి ఒకే గది ఇచ్చారు. పురుషులు, మహిళలకు కలిపి ఒకే గది ఇస్తూ పది మంది ఆటగాళ్లకు కలిపి ఐదు రూమ్‌లు కేటాయించిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ వాళ్లు అంకె మాత్రమే చూశారు. వాస్తవికంగా చూస్తే ఇలా వాడుకోవడం అసాధ్యం. ఎంతో భారీ సామగ్రి ఉండే ట్రైనర్లు, మెడికల్ సిబ్బందికి కూడా ఆటగాళ్లతో కలిపి ఇస్తే ఎలా సరిపోతుంది’ అని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు భారత వుషు, రోయింగ్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు ఇప్పటికే క్రూజ్ షిప్‌లోకి చేరుకున్నారు. వారు కూడా తమ సమస్యను చెప్పుకున్నారు. గది కోసం భారత రోయర్లు 12 గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది. థాయ్‌లాండ్ సెపెక్‌తక్రా ప్లేయర్లయితే గది లభించకపోవడంతో వెల్కమ్ సెంటర్లో నేలపైనే పడుకున్నారు. ‘ఇద్దరికే కేటాయించాల్సిన ఒక గదిలో ముగ్గురిని పంపించారు. అసలే అవి చిన్నవి కాగా, ఇప్పుడు మరింత సమస్యగా మారింది. తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సిన అథ్లెట్లను ఇలాంటివి ఇబ్బంది పెడతాయి. అయితే ఇప్పటికిప్పుడు ఫిర్యాదు చేయాలనే ఆలోచన లేదు. వాటికి అనుగుణంగా సర్దుకునే ప్రయత్నం చేస్తున్నాం’ అని భారత క్రీడాకారులు స్పందించారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని భారత చెఫ్ డి మిషన్ సహదేవ్ యాదవ్ వివరణ ఇచ్చారు. సాధారణంగా ఇలాంటి మెగా ఈవెంట్లలో వసతికి దగ్గర్లోనే ప్రాక్టీస్ ఏర్పాట్లు కూడా ఉంటాయి. కానీ నగోయాలో పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. అథ్లెటిక్స్ విలేజ్ లేకపోవడంతో 17 వేల మందికి వేర్వేరు చోట్ల వసతి సౌకర్యం కల్పించారు. ఇవన్నీ ప్రాక్టీస్ మైదానాలకు చాలా దూరంగా ఉన్నాయి. దాంతో సుదీర్ఘ ప్రయాణం తర్వాతే తమ ప్రాక్టీస్ వేదికలకు అథ్లెట్స్ వెళ్లగలుగుతున్నారు. ఆటగాళ్లు ఉన్న క్రూజ్ షిప్ నుంచి రోయర్లు, వుషు, టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు 30 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుండగా, మార్షల్ ఆర్ట్స్ హాల్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరోవైపు ఇప్పటికే బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన కంటెయినర్ తరహాలో వసతి గృహాల్లో భారత ఆటగాళ్లు ఉండటానికి ఇష్టపడటం లేదు. ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్, కురా‹Ùవంటి క్రీడాంశాల్లో పాల్గొనే అథ్లెట్ల కోసం ప్రధానంగా ఈ ఏర్పాట్లు ఉండగా...ఒక్క కురాష్ ఆటగాళ్లు మాత్రమే కంటెయినర్లలో ఉంటున్నారు. -
మన మహిళా క్రికెటర్లు బరిలోకి
నగోయా: ఆసియా క్రీడల మహిళల క్రికెట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ పతక వేటలో నేడు తొలి పోరులో బరిలోకి దిగనుంది. ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్న భారత జట్టు ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్ను ఎదుర్కొంటుంది. ఇటీవలే ఆసియా కప్‌ను గెలుచుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ బృందానికి ఈ మ్యాచ్‌లో గెలుపు నల్లేరు మీద నడకలాంటిదే. అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న భారత్‌ను నిలువరించడం ప్రత్యరి్థకి అసాధ్యం. మరోవైపు ఏడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి 61 టి20 మ్యాచ్‌ల అనుభవం ఉన్నా... పెద్ద జట్లతో ఎప్పుడూ ఆడని జపాన్ ఈ ఆసియా క్రీడల్లో ఒక్క మ్యాచ్‌లోనైనా ప్రభావం చూపించాలని ఆశగా ఉంది. 2028 లాస్ ఏంజెలిస్‌లో జరిగే ఒలింపిక్ క్రీడలకు సన్నాహకంగా ఈ ఆసియా క్రీడలు పనికొస్తాయని భారత కోచ్ అమోల్ మజుందార్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్‌తో పెద్దగా పరిచయం లేని జట్లతో కూడా ఆడుతున్న తమకు ఒలింపిక్స్‌లోనూ ఇదే తరహా పరిస్థితులు ఎదురవుతాయని అతను వ్యాఖ్యానించాడు. నేడు జరిగే మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మలేసియాతో శ్రీలంక తలపడుతుంది. సెమీస్‌లో పాక్, బంగ్లాదేశ్... ఆసియా క్రీడల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ మహిళల జట్లు సెమీస్‌లోకి అడుగు పెట్టాయి. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో థాయ్‌లాండ్‌పై 3 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. బంగ్లాదేశ్, చైనా మధ్య జరిగిన మరో క్వార్టర్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా...ర్యాంకింగ్ ప్రకారం బంగ్లాదేశ్ ముందంజ వేసింది. -
చచ్చీ చెడి సెమీస్‌కు చేరిన పాక్
ఏషియన్ గేమ్స్ మహిళల క్రికెట్లో పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో ఆ జట్టు థాయ్‌లాండ్‌పై అతికష్టం మీద 3 వికెట్ల తేడాతో గెలుపొంది, ఫైనల్-4కు అర్హత సాధించింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో పాక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.నన్నపట్ కొంచరోయెంకై (49) రాణించడంతో థాయ్‌లాండ్ 4 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో ఫాతిమా సనా 2, నష్రా సంధు ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం 92 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు పాక్ నానా కష్టాలు పడింది. మరో 2 బంతులు మాత్రమే మిగిలుండగా, 7 వికెట్లు కోల్పోయి అతి కష్టం మీద గెలుపు తీరాలు చేరింది. ఒకట్రెండు బంతులు అటుఇటైనా పాక్‌కు ఘోర పరాభవం ఎదురయ్యేది. చచ్చీ చెడి తృటిలో ఆ పరాభవాన్ని తప్పించుకొని సెమీస్‌కు చేరింది.షవాల్ జుల్ఫికర్ (25), ఫాతిమా సనా (21) ఓ మోస్తరు స్కోర్లు చేసి, పాక్ గెలుపుకు జీవం పోశారు. ఆఖర్లో తుబా హసన్ (13) బ్యాట్ ఝులిపించడంతో పాక్ బయటపడింది. థాయ్‌లాండ్ బౌలర్లు ఒన్నిచా కాంచోంపు (3-0-37-3), సులీపోర్న్ లావోమీ (2-0-3-1), సునిద (2-0-23-2) పాక్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు.వాష్ అవుట్‌తో సెమీస్‌కు బంగ్లాదేశ్మరో క్వార్టర్ఫైనల్లో బంగ్లాదేశ్, హాంకాంగ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ తడి అవుట్‌ఫీల్డ్ కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. అధిక సీడింగ్ కారణంగా బంగ్లాదేశ్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.ఇదీ చదవండి: ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ రద్దు.. సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ -
ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ రద్దు.. సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టును అదృష్టం వరించింది. మ్యాచ్ ఆడే అవసరం లేకుండానే ఆసియా క్రీడల సెమీ ఫైనల్లో బంగ్లా అడుగుపెట్టింది. అసలేం జరిగిందంటే.. జపాన్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 4 మధ్య ఆసియా క్రీడల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే.చైనాతో మ్యాచ్ఇందులో భాగంగా మహిళల క్రికెట్ జట్ల మధ్య సెప్టెంబరు 17 నుంచి సెప్టెంబరు 22 వరకు టీ20 ఫార్మాట్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా తొలి క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్- చైనా మహిళా జట్లు మ్యాచ్ ఆడాల్సి ఉంది.ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ రద్దుఅయితే, వర్షం కారణంగా టాస్ పడకుండానే ఈ మ్యాచ్ రద్దై పోయింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం.. చైనా కంటే మెరుగైన స్థితిలో ఉన్న బంగ్లాదేశ్ నేరుగా సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. మరోవైపు.. ఒక్క బంతి కూడా పడకుండానే చైనా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.చైనా జట్టు (PC: X)సెమీస్‌కు బంగ్లాదేశ్ అర్హతకాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ మహిళా జట్టు పదో స్థానంలో ఉండగా.. చైనా 36వ స్థానంలో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. రెండో క్వార్టర్ ఫైనల్లో థాయ్‌లాండ్- పాకిస్తాన్ జట్లు గురువారమే తలపడనున్నాయి.మరోవైపు.. మూడో క్వార్టర్ ఫైనల్లో మలేషియా- శ్రీలంక మహిళా జట్లు పోటీ పడనుండగా.. నాలుగో క్వార్టర్ ఫైనల్లో భారత్- జపాన్ జట్లు తలపడతాయి. కరోగి స్పోర్ట్స్ పార్క్‌లో సెప్టెంబరు 18న జరిగే నాలుగో క్వార్టర్ ఫైనల్లో గెలిచిన జట్టును బంగ్లాదేశ్ సెమీస్‌లో ఢీకొంటుంది. సెమీ ఫైనల్లో భారత్‌తో ఢీబలాబలాలు, ర్యాంకింగ్స్ ఆధారంగా హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత మహిళా క్రికెట్ జట్టు జపాన్ కంటే పటిష్ట స్థితిలో ఉంది. కాబట్టి సెప్టెంబరు 20న జరిగే తొలి సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ టీమిండియాను ఎదుర్కొనే అవకాశం ఉంది.చదవండి: అగార్కర్ అవుట్.. టీమిండియాకు కొత్త చీఫ్ సెలక్టర్! -
‘వసతి సమస్యే కాదు’
న్యూఢిల్లీ: నాలుగేళ్లకోసారి జరిగే ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో సత్తా చాటేందుకు భారత అథ్లెట్లు సిద్ధంగా ఉన్నారని ఏషియన్ గేమ్స్ డిప్యూటీ చెఫ్ డి మిషన్, టేబుల్ టెన్నిస్ (టీటీ) దిగ్గజం ఆచంట శరత్ కమల్ వెల్లడించాడు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో... అథ్లెట్ల వసతి కోసం కంటైనర్లను సిద్ధం చేయగా... దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో శరత్ కమల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కంటైనర్ రూమ్‌లు, క్రూయిజ్‌షిప్ వసతులకు భారత అథ్లెట్లు సులువుగా అలవాటు పడతారని... వారి ప్రదర్శనపై ఇది ఎలాంటి ప్రభావం చూపదని ఆశాభావం వ్యక్తం చేశాడు. శనివారం ప్రారంభం కానున్న ఏషియన్ గేమ్స్‌లో భారత్ నుంచి 501 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. వీరితో పాటు 265 మంది అధికారులు కూడా జపాన్‌కు చేరుకున్నారు. వీరిని షిప్పింగ్ కంటైనర్లు, క్రూయిజ్ షిప్‌లు, హోటల్స్‌లో వసతి ఏర్పాటు చేశారు. దీనిపై దక్షిణ కొరియాతో పాటు ఆసియా క్రికెట్ కౌన్సిల్‌లోని పలు సభ్య దేశాలు గతంలో అభ్యంతరాలు వ్యక్తంచేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శరత్ కమల్ మాట్లాడుతూ... ‘ఇలాంటి వసతి ఏర్పాట్లతో భారత అథ్లెట్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. అలాంటి పరిస్థితులకు అలవాటు పడేందుకు అథ్లెట్లకు ప్రత్యేక శిక్షణ సైతం అందించాం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన పలు కేంద్రాల్లో కంటైనర్ రూమ్‌లు ఏర్పాటు చేసి అథ్లెట్లకు అందులో వసతి ఏర్పాటు చేశాం. దీంతో వారు పరిస్థితులకు త్వరగా అలవాటు పడతారు. జపాన్‌కు వచి్చంది ఏషియన్ గేమ్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడానికి. అథ్లెట్ల అందరి లక్ష్యం అదే’ అని వివరించాడు. ఐదు ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన శరత్ కమల్... నాలుగుసార్లు ఆసియా క్రీడల్లో పాల్గొని రెండు పతకాలు గెలిచాడు. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో పురుషుల టీమ్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో కాంస్య పతకాలు నెగ్గాడు. గతేడాది ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన శరత్... ప్రస్తుతం క్రీడా పరిపాలన అంశాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నాడు. ‘ఈసారి ఆసియా క్రీడల్లో భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్టు తప్పక పతకాలు గెలుస్తుంది. పురుషుల డబుల్స్ జోడీ మానవ్ ఠక్కర్–మనుశ్ షా... మిక్సడ్ డబుల్స్‌లో మనుశ్ షా–దియా జోడీలపై భారీ అంచనాలు ఉన్నాయి’ అని శరత్ వివరించాడు. ఏషియన్ గేమ్స్ టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్ తరఫున ఐదుగురు మహిళా ప్లేయర్లు, ఐదుగురు పురుష ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు. ఈ నెల 20 నుంచి 28 వరకు టీటీ పోటీలు జరగనున్నాయి. -
ఆసియా గేమ్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం
జపాన్ వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్‌లో పాల్గొనే టీమిండియా జట్టులో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. ఇప్పటికే గాయం కారణంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తప్పించిన బీసీసీఐ తాజాగా స్టార్ ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డిని కూడా జట్టు నుంచి విడుదల చేసింది. ఇక గాయపడిన వరుణ్ చక్రవర్తి స్థానంలో విప్రజ్ నిగమ్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఇదే సమయంలో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు మాత్రం నితీశ్‌రెడ్డి అందుబాటులో ఉంటాడని బీసీసీఐ తెలిపింది. అయితే ఆసియా గేమ్స్ నుంచి నితీశ్ కుమార్ రెడ్డిని తప్పించడం వెనుక బీసీసీఐ స్పష్టమైన సమాచారం ఇవ్వనప్పటికీ, రాబోయే ఏడాదిలో టీమిండియా వన్డే ప్రపంచకప్ ఆడనుంది. హార్దిక్ పాండ్యాకు బ్యాకప్‌గా భావిస్తున్న నితీశ్‌రెడ్డికి వీలైనంత ఎక్కువగా వన్డే మ్యాచ్‌ల్లో అవకాశాలు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే టెస్టుల్లో తానేంటో నిరూపించుకున్న నితీశ్‌రెడ్డి వన్డేల్లోనూ అదే తరహా ప్రదర్శన చేయాలని బీసీసీఐ ఆశిస్తోంది. ఇప్పటివరకు ఆరు వన్డేలు మాత్రమే ఆడిన నితీశ్‌రెడ్డి వంద పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లు తీశాడు. వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌కు మాత్రం నితీశ్‌కుమార్ రెడ్డిని ఎంపిక చేయడం జరిగింది.ఆసియా గేమ్స్‌కు టీమిండియా:శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, యశ్ ఠాకూర్, విప్రజ్ నిగమ్. -
టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్..!
ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో టీ20కి ముందు టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయపడిన (సైడ్ స్ట్రెయిన్) విషయం తెలిసిందే. గాయం పెద్దది కావడంతో వరుణ్ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌తో పాటు ఏషియన్ గేమ్స్‌కు కూడా దూరమయ్యాడని తెలుస్తోంది.ఈ క్రమంలో భారత మేనేజ్మెంట్ ఏషియన్ గేమ్స్ కోసం వరుణ్ ప్రత్యామ్నాయంగా ఎవరూ ఊహించని ప్లేయర్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. 22 ఏళ్ల రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఆల్‌రౌండర్ విప్రాజ్ నిగమ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.వరుణ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు విప్రాజ్ నిగమ్‌తో పాటు కుల్దీప్ యాదవ్ పేరును కూడా పరిశీలించినట్లు తెలుస్తోంది. అయితే కుల్దీప్ యాదవ్ ఈ నెలాఖర్లో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఆడనున్న నేపథ్యంలో విప్రాజ్ నిగమ్‌ను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ విషయమై అతి త్వరలో అధికారిక సమాచారం రావొచ్చు.ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విప్రాజ్ ఐపీఎల్లో ఇప్పటివరకు 19 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అతడు తన సత్తా చాటాడు. ఐపీఎల్ కెరీర్లో అతడి బ్యాటింగ్ స్ట్రైక్‌రేట్ సుమారు 176గా ఉంది.సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభంజపాన్లోని ఐచి-నగోయాలో సెప్టెంబర్ 19 నుంచి ఆసియా గేమ్స్ ప్రారంభం కానున్నాయి. అయితే పురుషుల క్రికెట్ పోటీలు మాత్రం సెప్టెంబర్ 24 నుంచి మొదలవుతాయి. భారత్ నేరుగా క్వార్టర్‌ఫైనల్ దశలో బరిలోకి దిగనుంది.ఇదీ చదవండి: శతక్కొట్టిన హ్యారీ బ్రూక్.. ప్రపంచ రికార్డు -
గీత దాటితే వేటే..
న్యూఢిల్లీ: ఈ నెల 19 నుంచి జపాన్ వేదికగా ప్రారంభం కానున్న ఆసియా క్రీడల కోసం ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ) ప్రత్యేక ‘సేఫ్ గార్డింగ్ కోడ్ ఆఫ్ కండక్ట్’ను తీసుకొచ్చింది. క్రీడాకారులు, అధికారుల భద్రత, క్రమశిక్షణకు సంబంధించిన వివరాలను ఈ నియమావళిలో పొందుపరిచింది. నిబంధనలను ఉల్లంఘిస్తే క్రీడల నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా... మరిన్ని కఠిన చర్యలు ఉంటాయని ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ ముందే హెచ్చరిస్తోంది. భారత సాఫ్ట్‌బాల్ సంఘం అధ్యక్షురాలు నీతల్ నారంగ్... ఈ క్రీడల్లో మన అథ్లెట్ల బృందానికి ‘సేఫ్ గార్డింగ్ ఆఫీసర్’గా వ్యవహరించనున్నారు. ఆసియా క్రీడల సందర్భంగా ఎలాంటి ఆధిపత్యం, అధికార దుర్వినియోగానికి తావులేకుండా నియామావళిని రూపొందించారు. హోదాను ఉపయోగించి వేధింపులకు గురిచేయడంపై తీవ్ర ఆంక్షలు విధించారు. క్రీడాకారులు, అధికారులు అవమానకరమైన, అసభ్యకరమైన భాషను ఉపయోగించకుండా నిషేధం విధించారు. కేవలం మైదానంలో అథ్లెట్ల ప్రదర్శననే కాకుండా... వారి సోషల్ మీడియాను సైతం ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ ఓ కంట కనిపెడుతూ ఉండనుంది. క్రీడల సందర్భంగా అథ్లెట్లు, సహాయక సిబ్బంది సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు ఇతరుల గౌరవాని భంగం కలిగించకుండా బాధ్యతాయుతంగా ఉండేలా చూసుకోవాలని సూచించింది. ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న ప్రతీ అథ్లెట్, అధికారి ఈ నియామావళిపై సంతకం చేయడం తప్పనిసరి కాగా... వీటి గురించి భారత అథ్లెట్లకు ఇదివరకే వర్క్ షాప్ నిర్వహించారు. అక్టోబర్ 4తో ఏషియన్ గేమ్స్ ముగియనుండగా... హాకీ, స్క్వాష్ విభాగాల్లో ఇక్కడ పసిడి పతకాలు సాధించిన వారు 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధిస్తారు. -
టీమిండియా షెడ్యూల్లో మార్పులు
2026 ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు మ్యాచ్‌ల సమయాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పురుషుల నాకౌట్ మ్యాచ్‌ల్లో కొన్ని మ్యాచ్‌లను అరగంట ముందుకు మార్చారు. రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం, మధ్యాహ్నం జరగాల్సిన మ్యాచ్‌లు ఇకపై స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతాయి. గతంలో ఈ మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండింది. మహిళల క్రికెట్ మ్యాచ్‌ల సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.సెప్టెంబర్ 28న తొలి మ్యాచ్ఐచి-నగోయా (జపాన్) వేదికగా జరిగే ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల జట్టుకు నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్ లభించింది. సెప్టెంబర్ 28న జరిగే రెండో క్వార్టర్ ఫైనల్లో భారత్ బరిలోకి దిగనుంది.ఈ మ్యాచ్ జపాన్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత్ కంటే జపాన్ 3 గంటల 30 నిమిషాలు ముందుండటంతో.. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ రాత్రి 10 గంటలకు మొదలవుతుంది.అలాగే అక్టోబర్ 1న జరిగే రెండో సెమీఫైనల్, అక్టోబర్ 3న జరిగే గోల్డ్ మెడల్ మ్యాచ్ కూడా మధ్యాహ్నం 1.30 గంటలకే ప్రారంభం కానున్నాయి. భారత్ సెమీఫైనల్‌కు చేరితే ఆ మ్యాచ్ కూడా భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది.జపాన్‌లో ముందుగానే చీకటి పడటమే కారణంమ్యాచ్ల సమయాలను మార్చడానికి ప్రధాన కారణం జపాన్‌లో త్వరగా చీకటి పడటమేనని సమాచారం. మ్యాచ్‌లు జరిగే వేదికలో ఫ్లడ్‌లైట్లు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.పురుషుల మ్యాచ్‌లు సాధారణంగా ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉండటంతో.. చీకటి పడేలోపు మ్యాచ్‌లను పూర్తి చేసేందుకు ఈ మేరకు నిర్ణయించినట్లు సమాచారం.ముందుగా మరో మ్యాచ్ఏషియన్ గేమ్స్‌లో తమ తొలి అధికారిక పోటీకి ముందు భారత్ ఆతిథ్య జట్టు జపాన్‌తో ఓ టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 22న సానో ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుంది.ఇదీ చదవండి: ఇషాన్ గాయంపై అప్డేట్ ఇచ్చిన శ్రేయస్ -
ఆసియా క్రీడల నుంచి తప్పించడంపై భారత అథ్లెట్ ఆవేదన
18 ఏళ్ల భారత వుషు క్రీడాకారిణి దివ్యాంశి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆసియా క్రీడల జట్టు నుంచి చివరి నిమిషంలో తప్పించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో తనకు ఆత్యహత్యే శరణ్యమంటూ ఓ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేసింది.भारतीय खिलाड़ी दिव्यांशी चौधरी ने आत्महत्या करने की बात कही है।वुशु खिलाड़ी दिव्यांशी चौधरी का नाम जापान एशियन गेम्स 2026 से आखिरी वक्त में काट दिया गया। जून में टीम में जगह और जर्सी मिलने के बाद 11 सितंबर के अपडेट में जगह नाओरेम रोशिबीना देवी को दे दी गई। टीम से गलत तरीके से… pic.twitter.com/kXXGhv3qzH— Madan Mohan Soni (@madanmohansoni) September 11, 2026తొలుత 60 కేజీల సాండా విభాగంలో దివ్యాంశి ఆసియా క్రీడలకు ఎంపికైంది. అయితే చివరి నిమిషంలో ఆమెను జట్టు నుంచి తొలగించి, ఆమె స్థానంలో అనుభవజ్ఞురాలైన రోషిబినా దేవిని ఎంపిక చేశారు. రోషిబినా.. ఎంపిక ట్రయల్స్‌లో దివ్యాంశి చేతిలో ఓడిపోయింది.దివ్యాంశిని తొలగించి రోషిబినాను జట్టులోకి తీసుకోవడంపై ఆమె కోచ్ అశోక్ గౌతమ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దివ్యాంశి గత ఏడాది కాలంలో జరిగిన ఐదు ఎంపిక ట్రయల్స్‌లోనూ మొదటి స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు. రోషిబినా తన పలుకుబడిని ఉపయోగించి జట్టులో చోటు సంపాదించిందని ఆరోపించారు.ఈ ఉదంతంలో వుషు ఫెడరేషన్ వాదన మరోలా ఉంది. దివ్యాంశిని జట్టు నుంచి తొలగించడానికి కారణం ఆమె ఫిట్నెస్ అని ఫెడరేషన్ తెలిపింది. దివ్యాంశి మోకాలి గాయాన్ని దాచిపెట్టిందని, ఏషియన్ గేమ్స్‌కు ముందు సరిగా శిక్షణ కూడా తీసుకోలేదని పేర్కొంది. అందుకే ఆమె స్థానంలో రోషిబినా దేవిని ఎంపిక చేసినట్లు వివరించింది. ఇదీ చదవండి: వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్! -
‘ఫెన్సింగ్’ ఆట ఎలా ఆడతారో తెలుసా?
పిల్లలూ! పాత కాలం సినిమాల్లో రాజులు కత్తులతో యుద్ధాలు చేయడం చూశారు కదా! ఆధునిక కాలంలో ఇది ఒలింపిక్స్‌లో ఒక అద్భుతమైన ఆటగా మారిపోయింది. దీనినే ‘ఫెన్సింగ్’ (Fencing) లేదా మన భాషలో ‘కత్తియుద్ధం’ అంటారు. ఇక్కడ మన దేశానికి చెందిన జోయ్స్ అషితా స్టాలిన్రాజ్(Joys Ashitha Stalinraj) పంజాబ్‌లోని పాటియాలాలో శిక్షణ తీసుకుంటూ ఇలా కత్తి తిప్పుతోంది. జపాన్‌లో జరగబోయే ’ఏషియన్ గేమ్స్–2026’లో భారతదేశం తరఫున మెడల్ గెలవడమే ఆమె లక్ష్యం.ఇంతకీ ఆ కత్తిని ఏమంటారు? ఆట ఆడే విధానాన్ని బట్టి కత్తులను మూడు రకాలుగా పిలుస్తారు. అవి... ‘ఫాయిల్’ (Foil), ‘ఎపే’ (epee), ‘సేబర్’ (Sabre). ఇవి చాలా తేలికగా, వంగుతూ ఉంటాయి. వీటి చివర మొన ఉండదు కాబట్టి అస్సలు గాయాలు అవ్వవు. కత్తి తాకితే సెన్సర్స్‌ను బట్టి నోట్ అయ్యి పాయింట్స్ వస్తాయి. ఫెన్సింగ్‌లో ‘డాలు’ (Shield) వాడరు. ప్రత్యర్థి కత్తిని మన కత్తితోనే అడ్డుకోవాలి.ఈ క్రీడలో ప్రపంచంలో అత్యధికంగా మెడల్స్ సాధించి టాప్‌లో ఉన్న దేశం ఏదో తెలుసా? ఇటలీ. ఫ్రాన్స్ రెండో స్థానంలో ఉంది. మన దేశం నుండి కూడా మహిళలు ఇలాంటి అరుదైన ఆటల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదగడం నిజంగా మనకందరికీ ఎంతో గర్వకారణం!ఇదీ చదవండి: 'పతకం తెస్తా.. నాన్నకు బహుమతిగా ఇస్తా' -
ఆసియా గేమ్స్‌కు కొత్త రంగు జెర్సీలో టీమిండియా!
సెప్టెంబర్ 19 నుంచి అధికారికంగా మొదలుకానున్న ఆసియా క్రీడలకు టీమిండియా కొత్త జెర్సీతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. సంప్రదాయ నీలం రంగు (Blue) జెర్సీకి బదులు నారింజ రంగు (Orange) జెర్సీ ధరించి టీమిండియా మ్యాచ్‌లు ఆడనున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల కానప్పటికీ, ఆసియా క్రీడలకు మాత్రం టీమిండియా జెర్సీలో మార్పు ఖాయమన్న విషయం స్పష్టమవుతోంది. అయితే ఇటీవలే భారత హాకీ జట్టు మాత్రం కాషాయ రంగు జెర్సీ నుంచి బ్లూ జెర్సీలోకి మారిన సంగతి తెలిసిందే. రాబోయే ఆసియా క్రీడలకు కూడా మన హాకీ జట్టు ఆటగాళ్లు నీలం రంగు జెర్సీలతోనే బరిలోకి దిగనున్నట్లు ఇప్పటికే హాకీ ఇండియా స్పష్టం చేసింది. ఇప్పటికే వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్‌లు కాషాయ రంగు జెర్సీ ధరించిన ఫొటోలు (ఏఐ) సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో నిజమెంత అనేది పక్కనబెడితే.. అభిమానులు మాత్రం నారింజ రంగు వద్దని, అచ్చొచ్చిన నీలం రంగు జెర్సీతోనే ఆసియా గేమ్స్‌లో పాల్గొనాలని కామెంట్లు చేశారు. కొందరు మాత్రం నారింజ, నీలం రంగులు కలిసిన జెర్సీని ధరిస్తే బాగుంటుందని సలహాలు ఇస్తున్నారు.ఇక జపాన్‌లోని నగోయా వేదికగా సెప్టెంబర్ 10 నుంచే ఆసియా గేమ్స్ ప్రారంభమైనప్పటికీ అధికారికంగా మాత్రం సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానున్నాయి. మొత్తం 43 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇక పురుషుల క్రికెట్ సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 మధ్య, మహిళల క్రికెట్ సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు జరగనున్నాయి. టాప్-10లో ఉండడంతో భారత్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 28న ఆడనుంది. ఇక మహిళల క్రికెట్లో మాత్రం నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరగనుండగా, సెప్టెంబర్ 18న జరగనున్న క్వార్టర్ ఫైనల్లో జపాన్‌తో భారత్ తలపడనుంది.🚨 NEW JERSEY FOR TEAM INDIA IN ASIAN GAMES 2026 !🧡🇮🇳- According to reports, Team India are set to move away from their iconic blue jersey and feature a new orange kit at the upcoming Asian Games. [News Arena] pic.twitter.com/3NpG2VXkDT— lndian Sports Network (@IS_Netwrk29) September 12, 2026చదవండి: యూఏఈ క్రికెటర్‌పై నేపాల్ ఆటగాళ్ల దౌర్జన్యం! -
శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరో తెలీదు
జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ క్రీడలకు బీసీసీఐ, పీసీబీలు తమ పూర్తి స్దాయి జట్లను పంపుతుంటే.. శ్రీలంక మాత్రం తమ ద్వితీయ శ్రేణి జట్టును ఎంపిక చేసింది.శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్, స్టార్ ఓపెనర్ పాథుమ్ నిస్సాంక, వనిందు హసరంగా, కమిందు మెండీస్, పతిరానా, తీక్షణ వంటి సీనియర్ ప్లేయర్లను సెలక్టర్లు పక్కన పెట్టారు. నువాన్ తుషార, బినుర ఫెర్నాండో , దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్ వంటి కొంతమంది రెగ్యులర్ ఆటగాళ్లకే ఈ జట్టులో చోటు దక్కింది. అయితే దాదాపు ఐదేళ్ల తర్వాత వెటరన్ వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లాకు శ్రీలంక టీ20 జట్టులో చోటు దక్కింది. అతడితో పాటు ఆల్‌రౌండర్ చమిక కరుణరత్నే కూడా సెలక్టర్లు పిలుపునిచ్చారు. లంకా ప్రీమియర్ లీగ్‌లో రాణించిన లసిత్ క్రూస్‌పుల్లె, సహన్ అరచ్చిగే, తరిందు హసంక, వనుజ సహన్ కుమార, కేశన్ తత్సర వంటి యువ ఆటగాళ్లకు సెలక్టర్లు జాతీయ జట్టులో చోటు కల్పించారు. అయితే శ్రీలంక క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించినప్పటికి.. అధికారికంగా కెప్టెన్ పేరును మాత్రం ఇంకా వెల్లడించలేదు. టోర్నమెంట్‌కు కెప్టెన్ ఖరారు చేసే అవకాశముంది. డిక్వెల్లా జట్టును ముందుండి నడిపించనున్నట్లు శ్రీలంక క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ ఏషియన్ గేమ్స్‌లో క్రికెట్ పోటీలు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి.2026 ఆసియా క్రీడల కోసం శ్రీలంక జట్టునిరోషన్ డిక్వెల్లా, చమిక కరుణరత్నే, నువాన్ తుషార, బినుర ఫెర్నాండో, అషెన్ బండార, నువానీదు ఫెర్నాండో, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, విజయకాంత్ వియస్కాంత్, లసిత్ క్రూస్పుల్లే, సహన్ అరాచ్చిగే, తరిందు హసంక, వనుజ సహన్ కుమార, కేషన్ తత్సర డి లివెరా, సినీత్ జయవర్దనచదవండి: IND vs AFG: రేపే మ్యాచ్.. అంతలోనే డబుల్ సెంచరీ వీరుడికి గాయం! -
ఆసియా క్రీడల భారత అథ్లెటిక్స్ జట్టు నుంచి నిత్య తొలగింపు
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత అథ్లెటిక్స్ బృందంలో కీలక మార్పు చోటు చేసుకుంది. గురువారం ముగిసిన ఇండియన్ అథ్లెటిక్స్ సిరీస్‌లో ప్రదర్శనను బట్టి ముగ్గురు ఆటగాళ్లపై భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) వేటు వేసింది. గతంలో ప్రకటించిన 77 మంది బృందంలో ముగ్గురిని తప్పించి 74 మందిని మాత్రమే ఆసియా క్రీడలకు పంపనున్నారు. తెలంగాణకు చెందిన స్ప్రింటర్ నిత్య గంధె, లాంగ్‌జంపర్ షానవాజ్ ఖాన్‌తో పాటు గత ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన జావెలిన్ త్రోయర్ అన్నూరాణిని కూడా తప్పించడం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారమే దీనిపై నిర్ణయం తీసుకున్న ఏఎఫ్ఐ కారణం వెల్లడిస్తూ వివరణ ఇచ్చింది. ‘ఫైనల్ ట్రయల్స్‌లో ఏఎఫ్ఐ నిర్దేశించిన అర్హతా ప్రమాణాన్ని అన్ను అందుకోలేకపోయింది. పేలవ ప్రదర్శనతో పాటు వైద్యపరమైన కారణాలతో నిత్య, షానవాజ్‌లను కూడా ఆసియా క్రీడలకు పంపించడం లేదు’ అని ఏఎఫ్ఐ అధ్యక్షుడు, సెలక్షన్ కమిటీ చైర్మన్ ఆదిల్ సుమరివాలా వెల్లడించారు. -
అనాహత్‌పై ఆశలు
న్యూఢిల్లీ: భారత యువ స్క్వాష్ ప్లేయర్ అనాహత్ సింగ్ ఆసియా క్రీడల్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తూ వరుస టైటిల్స్ సాధిస్తున్న 18 ఏళ్ల అనాహత్ .. జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల్లో పసిడి పతకం సాధించాలని కృత నిశ్చయంతో ఉంది. తద్వారా 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల 19 నుంచి జరగనున్న ఆసియా క్రీడల మహిళల స్క్వాష్ సింగిల్స్‌లో అనాహత్‌కు మూడో సీడ్ దక్కింది. ఇక పురుషుల సింగిల్స్‌లో భారత ప్లేయర్ అభయ్ సింగ్ రెండో సీడ్‌గా బరిలోకి దిగనున్నాడు. ఈ ఏడాది జూలై 13 నాటి ర్యాంకింగ్‌ల ఆధారంగా ఆసియా క్రీడల నిర్వాహకులు గురువారం ‘సీడ్’లు కేటాయించారు. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు మూడు స్వర్ణ పతకాలు సాధించింది. ఏషియన్ గేమ్స్‌లో బంగారు పతకం గెలిచిన ప్లేయర్లు 2028 ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించనున్నారు. దీంతో ఈ గేమ్స్‌లో పోటీ మరింత తీవ్రతరం కానుంది. జూనియర్ ప్రపంచ చాంపియన్ టైటిల్ నెగ్గిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన అనాహత్... ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 20వ స్థానంలో కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న అనాహత్‌కు ఏషియన్ గేమ్స్‌లో మలేసియా ప్లేయర్, ప్రపంచ ఐదో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ శివసంగరి సుబ్రమణియం, జపాన్‌కు చెందిన ఆరో ర్యాంకర్ సతోమి వతనాబెతో ప్రధాన పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన లండన్ క్లాసిక్ క్వార్టర్ ఫైనల్లో శివసంగరి చేతిలో అనాహత్ ఓటమి పాలైంది. కాగా... అనాహత్ ప్రస్తుత ఫామ్ కొనసాగిస్తే సింగిల్స్‌లో ఇప్పటి వరకు భారత్‌కు అందని ద్రాక్షలా ఊరిస్తున్న పసిడి పతకం ఈసారి దరిచేరే అవకాశాలున్నాయి. ఇక మహిళల సింగిల్స్‌లో పోటీ పడుతున్న మరో భారత ప్లేయర్ తన్వీ ఖన్నాకు ఏడో సీడ్ లభించింది. పురుషుల సింగిల్స్‌లో అభయ్కు రెండో సీడ్ దక్కగా... వీర్ చొత్రాని నాలుగో సీడ్‌గా బరిలోకి దిగనున్నాడు. వరుసగా ఏడోసారి ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న సీనియర్ ప్లేయర్ జోష్నా చినప్ప... మిక్స్డ్ డబుల్స్, మహిళల టీమ్ ఈవెంట్లలో పోటీపడనుంది. అభయ్, వీర్, సెంథిల్‌కుమార్, సూరజ్ కుమార్ చంద్‌లతో కూడిన భారత పురుషుల జట్టుకు టాప్ సీడ్ దక్కగా... అనాహత్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు మూడో సీడ్‌గా బరిలోకి దిగనుంది. 2022 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టు, మిక్స్డ్ డబుల్స్ జోడీ పసిడి పతకాలు గెలిచాయి. -
తొమ్మిది రోజుల ముందే...
టోక్యో: నాలుగేళ్లకోసారి జరిగే ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలు అధికారికంగా ప్రారంభం కాకపోయినా... కొన్ని క్రీడాంశాల్లో పోటీలు మొదలయ్యాయి. జపాన్ వేదికగా ఈ నెల 19 నుంచి ఏషియన్ గేమ్స్ ప్రారంభం కావాల్సి ఉండగా... బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, క్రికెట్, హాకీ, మోడర్న్ పెంటాథ్లాన్ క్రీడల్లో పోటీలు ముందే మొదలవుతున్నాయి. ప్రధాన పోటీల ప్రారంభానికి తొమ్మిది రోజుల ముందు గురువారం పురుషుల బాస్కెట్‌బాల్‌లో ఖతార్ జట్టు ఇరాన్‌పై విజయం సాధించింది. గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన ఈ పోరులో ఖతార్ 59–35 పాయింట్ల తేడాతో ఇరాన్‌ను చిత్తు చేసింది. ఒలింపిక్స్ కన్నా ఎక్కువ మంది అథ్లెట్లు ఆసియా క్రీడల్లో పాల్గొంటున్నారు. 43 క్రీడాంశాల్లో 17 వేల మందికి పైగా అథ్లెట్లు, క్రీడాధికారులు భాగస్వాములు కానున్నారు. సెపె్టంబర్ 19న క్రీడల ఆరం¿ోత్సవం నిర్వహించనుండగా... మరుసటి రోజు నుంచి పతక పోటీలు జరుగుతాయి. 1994 తర్వాత తొలిసారి జపాన్ ఈ క్రీడలకు ఆతిథ్యమిస్తుండగా... అనేక క్రీడాంశాల్లో 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు ఈ పోటీలు అర్హత ప్రమాణాలు కానున్నాయి. అయితే ప్రస్తుతం జపాన్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో అథ్లెట్లకు ఇబ్బందులు తప్పేలాలేవు. మంగళవారం భారీ వర్షం కారణంగా అథ్లెట్ల ప్రాక్టీస్‌కు తీవ్ర అంతరాయం వాటిల్లింది. అక్టోబర్ 4 వరకు ఆసియా క్రీడలు కొనసాగనున్నాయి. భారత యువ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, చైనాకు చెందిన 13 ఏళ్ల స్విమ్మర్ యూ జిది, ఫిలిప్పైన్ టెన్నిస్ సంచలనం అలెగ్జాండ్రా ఇయాలా ఈ క్రీడల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. -
గంభీర్ ఫేవరెట్ ప్లేయర్ అవుట్.. రీప్లేస్మెంట్ ప్రకటించిన బీసీసీఐ
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ప్రియ శిష్యుడిగా పేరొందిన యువ పేసర్ హర్షిత్ రాణా ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గాయపడిన ఈ ఢిల్లీ బౌలర్.. ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో పునరావాసం పొందుతున్నాడు.మరోసారి గాయంఈ క్రమంలో హర్షిత్ రాణా గాయం నుంచి కోలుకోవడంతో అఫ్గాన్‌తో సిరీస్‌కు టీమిండియా సెలక్టర్లు ఎంపిక చేశారు. ఫిట్నెస్ ఆధారంగా టీ20 సిరీస్ ఆడతాడని పేర్కొన్నారు. కానీ హర్షిత్ రాణా మరోసారి గాయపడ్డాడు. మ్యాచ్ ఫిట్నెస్ నిరూపించుకునే క్రమంలో సోమవారం బౌలింగ్ చేస్తున్న సందర్భంగా హర్షిత్‌కు మరోసారి తొడ కండరాలు పట్టేసినట్లు సమాచారం. దీంతో అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌తో పాటు ఆసియా క్రీడలు-2026 టోర్నీకి కూడా దూరమయ్యాడు.హర్షిత్ స్థానంలో అతడేఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా ధ్రువీకరించింది. హర్షిత్ రాణా స్థానంలో యశ్ ఠాకూర్‌ను అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌తో పాటు.. ఆసియా క్రీడల జట్టుకు ఎంపిక చేసినట్లు గురువారం ప్రకటన విడుదల చేసింది.ఇరవై ఏడేళ్ల యశ్ ఠాకూర్ కుడిచేతి వాటం ఫాస్ట్ మీడియం పేసర్. విదర్భకు చెందిన ఈ యువ బౌలర్ ఇటీవలే టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జింబాబ్వే పర్యటన సందర్భంగా అరంగేట్రం చేసిన యశ్ ఠాకూర్,, ఇప్పటికి రెండు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు.దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 50 మ్యాచ్‌లు ఆడిన యశ్ ఠాకూర్.. మొత్తంగా 81 వికెట్లు కూల్చి సత్తా చాటాడు. ఐపీఎల్లో ఇప్పటికి 22 మ్యాచ్‌లు ఆడిన యశ్ ఠాకూర్ 27 వికెట్లు కూల్చాడు. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు యశ్. గోల్డెన్ ఛాన్స్ఇక పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇటీవలే భారత టీ20 జట్టు సారథిగా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యశ్ ఠాకూర్ అరంగేట్రం చేశాడు. తాజాగా హర్షిత్ రాణా దూరం కావడంతో అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌తో పాటు.. ఆసియా క్రీడలు-2026లో పాల్గొనే జట్టుకు ఆడే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు (అప్డేటెడ్)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సింగ్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ ఠాకూర్.ఆసియా క్రీడలు-2026 టోర్నీకి భారత జట్టు (అప్డేటెడ్)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సింగ్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ ఠాకూర్.చదవండి: ‘జింబాబ్వేతో మ్యాచ్ పెట్టండి.. మా కింగ్ ఆడతాడు’ -
వెస్టిండీస్‌తో సిరీస్.. టీమిండియాలోకి ఆర్సీబీ కెప్టెన్?
ఈ ఏడాది అక్టోబర్‌లో భారత క్రికెట్ అభిమానులకు డబుల్ ధమాకా లభించనుంది. ఒకవైపు జపాన్‌లో జరిగే ఆసియా క్రీడలులో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఒక భారత జట్టు బరిలోకి దిగుతుండగా.. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో మరో జట్టు తలపడనుంది. ఏషియన్ గేమ్స్‌లో నేరుగా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టిన భారత జట్టు సెప్టెంబర్ 28న క్వార్టర్స్, అక్టోబర్ 1న సెమీఫైనల్స్ ఆడనుంది. పతక పోరు (ఫైనల్, మూడో స్థానం మ్యాచ్) అక్టోబర్ 3న జరగనుంది.ఇదే సమయంలో వెస్టిండీస్ జట్టు 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ కోసం భారత్‌లో పర్యటించనుంది. తొలి రెండు వన్డేలు సెప్టెంబర్ 27, 28 తేదీల్లో జరగనుండగా.. ఆఖరి వన్డే అక్టోబర్ 3న షెడ్యూల్ అయింది. అయితే భారత్ ఒకవేళ ఆసియా క్రీడల్లో ఫైనల్/మెడల్ రౌండ్‌కు అర్హత సాధిస్తే.. అక్టోబర్ 3న ఒకే రోజు వేర్వేరు వేదికలపై రెండు భారత జట్లు ఆడే అరుదైన దృశ్యం ఆవిష్కృతమవుతుంది.శ్రేయస్ అయ్యర్ దూరంకాగా ఆసియా క్రీడల బాధ్యతల కారణంగా స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ పేరును బీసీసీఐ సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. పాటిదార్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో కూడా అతడు దుమ్ములేపాడు. శ్రేయాస్ లాగే మిడిలార్డర్లో రాణించే సత్తా పాటిదార్ ఉంది.మరోవైపు ఆసియా క్రీడల కోసం పయనమవుతున్న భారత క్రీడాకారుల బృందానికి బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ శుభాకాంక్షలు తెలిపారు. భారత అథ్లెట్లు, క్రికెట్ జట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి పసిడి పతకాలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.ఆసియా క్రీడలకు భారత పురుషల జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ. -
ఏషియన్ గేమ్స్.. టీమిండియా బసపై బీసీసీఐ కీలక ప్రకటన!
ఆసియా క్రీడల్లో ఆటగాళ్లకు కల్పించే వసతి సౌకర్యాలు బాగా లేవని, భారత క్రికెటర్లు అలాంటి చోట ఉండటానికి ఇష్టపడటం లేదని ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై క్రీడల నిర్వాహక కమిటీ అవసరమైతే ప్లేయర్లు తమకు నచి్చన హోటళ్లలో ఉండవచ్చంటూ వెసులుబాటు కూడా కల్పించింది.అయితే ఈ అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పుడు స్పష్టతనిచ్చింది. టీమిండియా ఆటగాళ్లు నిర్వాహకులు కలి్పంచిన వసతి సౌకర్యాలనే వాడుకుంటారని, ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. జపాన్‌లోని నగోయాలో నిర్వాహకులు మెరుగైన సౌకర్యాలే కల్పిస్తారని నమ్ముతున్నట్లు ఆయన చెప్పారు. "విదేశీ పర్యటనల్లో మనకు లభించే ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాలు ఇప్పుడు ఉండకపోవచ్చనేది వాస్తవం. అయితే నిర్వాహకులు ఎలాంటి వసతి కల్పించినా మన ఆటగాళ్లు అక్కడే ఉంటారు. అద్భుతంగా కాకపోయినా అవి సౌకర్యంగానే ఉంటాయని నమ్ముతున్నాం. నగోయాలో ఉండే వసతి, వారు ఎంచుకున్న చిన్న తరహా హోటల్ గదులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూశాం. అవి బాగానే ఉన్నాయి. కాబట్టి టీమిండియా ఆటగాళ్లు వాటినే వాడుకుంటారు. ఇక్కడ మేం ప్రత్యేకంగా తీసుకోవాలనుకున్నా ఎలాంటి పెద్ద హోటల్స్ లేవు. ఈవెంట్‌కు చాలా దూరంలో ఉండే ఒసాకా లేదా టోక్యోలలో బస చేయడానికి అవకాశం లేదు" అని శుక్లా పేర్కొన్నారు. అయితే వసతికంటే పిచ్, గ్రౌండ్, డ్రెస్సింగ్ రూమ్వంటి అంశాల విషయంలోనే తమకు కొంత సమస్య అనిపించిందని, దీనిని సమావేశంలో నిర్వాహకుల దృష్టికి తీసుకొచ్చామని శుక్లా అన్నారు. చదవండి: Asia Cup: టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఖరారు -
భారత హాకీ జట్టు జెర్సీ మార్పు..?
భారత హాకీ జట్ల జెర్సీ రంగుపై నెలకొన్న చర్చకు తెరపడింది. త్వరలో (సెప్టెంబర్ 18 నుంచి) ప్రారంభం కానున్న ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు సంప్రదాయ నీలం రంగు జెర్సీతోనే బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో హాకీ ఇండియా కాషాయం రంగు జెర్సీని పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ చర్య అప్పట్లో వివాదాస్పదమైంది. భారత మాజీ కెప్టెన్ వీరెన్ రాస్కిన్హా సహా పలువురు ఈ నిర్ణయంపై ప్రశ్నలు లేవనెత్తారు. అయితే జెర్సీ రంగు మార్పునకు విజిబులిటి కారణమని హాకీ ఇండియా వివరణ ఇచ్చింది. నీలం రంగు సింథటిక్ టర్ఫ్‌తో కలిసిపోయే అవకాశం ఉండటంతో ఆటగాళ్లను స్పష్టంగా గుర్తించేందుకు ప్రత్యామ్నాయ రంగును ఎంచుకున్నట్లు తెలిపింది.నీలం రంగే ముద్దుఆసియా క్రీడల నేపథ్యంలో భారత ఒలింపిక్ సంఘం జట్టు జెర్సీపై హాకీ ఇండియా అభిప్రాయాన్ని కోరగా, నీలం రంగును తొలి ఎంపికగా, కాషాయాన్ని రెండో ఎంపికగా సూచించినట్లు హాకీ ఇండియా కోశాధికారి శేఖర్ మనోహరన్ తెలిపారు.చదవండి: వీరంగం సృష్టించిన ముంబై ఇండియన్స్ బ్యాటర్ -
ఏషియన్ గేమ్స్.. బీసీసీఐ సంచలన నిర్ణయం!?
జపాన్‌లో జరగనున్న ఏషియన్ గేమ్స్-2026కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. సెప్టెంబర్ 19 నుంచి ఈ ప్రతిష్టాత్మక క్రీడలు ప్రారంభం కానుండగా.. మెన్స్ క్రికెట్ పోటీలు సెప్టెంబర్ 24 నుంచి షెడ్యూల్ అయ్యాయి. అయితే మ్యాచ్‌లు జరగనున్న ఐచి-నగోయాలోని వసతులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ప్రధానంగా క్రికెట్ జట్లకు సరైన 5-స్టార్ హోటల్ వసతి లేకపోవడం, తాత్కాలిక టెంట్లను డ్రెస్సింగ్ రూమ్‌లుగా కేటాయించడంపై వివాదం రేగింది. ఇటీవల జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ మీటింగ్‌లోనూ ఈ ఏర్పాట్లపై బీసీసీఐతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులు కూడా తమ నిరసనను వ్యక్తం చేశాయి. క్రికెటర్లకు ప్రత్యేక ప్రత్యేక వసతి కల్పించాలని ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియాను డిమాండ్ చేశాయి. కానీ ఓసీఎ మాత్రం క్రికెటర్లకు ప్రత్యేక వసతి కల్పించబడదని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఇండియన్ ఒలింపిక్ అసోయేషిన్ కూడా (ఐఓఏ) ధ్రువీకరించింది.ఈ క్రమంలో భారత క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ తమ పురుష, మహిళల జట్ల వసతి, ఫుడ్, రవాణా ఏర్పాట్లను స్వయంగా చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాగా ఏషియన్ గేమ్స్ నిర్వాహకులు భారత పురుషుల క్రికెట్ జట్టుకు త్రీ-స్టార్ హోటల్, ఉమెన్స్ టీమ్‌కు ఫోర్-స్టార్ హోటల్‌ను కేటాయించారు.అయితే ఒకే గదిని ఇద్దరు ప్లేయర్ షేర్ చేసుకోవాల్సి ఉండడతో బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే సాధారణంగా భారత క్రికెటర్లకు అంతర్జాతీయ టోర్నీల్లో విడిగా సింగిల్-ఆక్యుపెన్సీ 5-స్టార్ రూమ్‌లు ఇస్తుంటారు. అదేవిధంగా ఆటగాళ్ల భారీ కిట్‌బ్యాగ్‌లు, ఇతర క్రీడా పరికరాలు ఉంచుకోవడానికి ఈ చిన్న గదులు సరిపోవని బీసీసీఐ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అయితే సౌకర్యాలను పరిశీలించడానికి జపాన్‌కు ఓ బృందాన్ని బీసీసీఐ పంపనుంది. వారి రిపోర్ట్ మేరకు తమ ఆటగాళ్ల వసతుల విషయంలో బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది.చదవండి: సౌతాఫ్రికా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. వైభవ్ సూర్యవంశీకి ఛాలెంజ్! -
‘కంటెయినర్’లో నివసిస్తూ...
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత ఆటగాళ్లు ఎప్పటిలాగే పోటీల కోసం సిద్ధమవుతున్నారు. అయితే ఈ సారి తమ ఆటకు తోడు మరో విషయంలో వారు సన్నద్ధం కావాల్సి వస్తోంది. ఆశ్చర్యకరంగా గేమ్స్ సమయంలో తాము ఉండాల్సిన వసతికి సంబంధించిన సన్నాహకం ఇది! జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో ఈ సారి ప్రత్యేకంగా ‘క్రీడా గ్రామం’ ఏర్పాటు చేయడం లేదు. ప్రత్యేకంగా సిద్ధం చేసిన కంటెయినర్లలోనే ఆటగాళ్లకు వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. ఆరడుగుల పొడవు మాత్రమే ఉండే ఈ కంటెయినర్లలో ఉండటం అథ్లెట్లకు అంత సులువు కాదు. అయితే పోటీల కోసం వెళ్లినప్పుడు వాటిపై ఫిర్యాదు చేసి కూడా లాభం లేదు. అందుకే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కాస్త భిన్నంగా ఆలోచించింది. గేమ్ ప్రాక్టీస్ మాత్రమే కాకుండా వసతి విషయంలో కూడా ప్రాక్టీస్ చేయించడం అనివార్యంగా భావించింది. అందుకే ఆసియా క్రీడల తరహాలో ఉండే కంటెయినర్లను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)కు పంపించింది. ఆటగాళ్లు ఇందులోనే ఉండి తమ ప్రాక్టీస్‌ను సాగిస్తే జపాన్ వెళ్లాక ఇబ్బంది ఉండదని అధికారులు అంటున్నారు. ఆసియా క్రీడల్లోకి అడుగు పెట్టాక అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు సమస్య వస్తుంది కాబట్టి అలాంటి వాతావరణమే ఇక్కడా అందిస్తున్నారు! కొంత కాలం క్రితం ఆసియా క్రీడల ఏర్పాట్లను చూసేందుకు జపాన్‌కు వెళ్లిన భారత బృందం కంటెయినర్ల అవసరాన్ని గుర్తించింది. ఎన్ఐఎస్లో పురుషులు, మహిళల కోసం ఒక్కో కంటెయినర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఇద్దరు ప్లేయర్లు ఉండే విధంగా రెండు బెడ్లు, రెండు ఏసీలతో పాటు చిన్నపాటి లాండ్రీ ఏరియా, కిచెన్ కూడా ఉన్నాయి. చిన్నపాటి సామాన్లు ఉంచుకునేందుకు వీలుగా నాలుగు క్యాబిన్లు ఉండగా, బెడ్ల కింది భాగం ఆటగాళ్ల కిట్లు ఉంచుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఎనిమిది మంది అథ్లెట్లు ఇందులో నివాసం ఉండి పరిస్థితులపై ఒక అంచనాకు వచ్చారు. షాట్‌పుటర్ తజీందర్ పాల్ సింగ్ తూర్, డిస్కస్ త్రోయర్ సీమా కాలిరామ్నా దీనిపై సంతృప్తి వ్యక్తం చేశారు. -
ఆర్సీబీకి ప్లేయర్లకు లక్కీ ఛాన్స్.. టీమిండియాతో పాటు?
జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడలను బీసీసీఐ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి భారత క్రికెట్ బోర్డు తమ పూర్తి స్థాయి జట్లను రంగంలోకి దింపుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగుతున్న పురుష, మహిళల జట్లు ఈసారి కూడా స్వర్ణ పతకాలను నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉన్నాయి.ఈ నేపథ్యంలో బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల ప్రాక్టీస్ కోసం ముగ్గురు నెట్ బౌలర్లను ఎంపిక చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన రసిఖ్ సలాం దార్, యువ స్పిన్నర్ విక్కీ ఓస్త్వాల్లు ఈ జాబితాలో ఉన్నారని 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కథనం పేర్కొంది.మరోవైపు ఈ ఆసియా క్రీడలకు ముందు ఆతిథ్య దేశమైన జపాన్‌తో టీమిండియా ఓ టీ20 మ్యాచ్ ఆడనుంది. భారత్-జపాన్ దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తి కావస్తుందున ఈ మ్యాచ్ చారిత్రత్మక మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 22న సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.ఆసియా క్రీడల కోసం భారత పురుషుల జట్టు : శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి, రవి బిష్ణోయ్, హర్షిత్ రానా, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాభారత మహిళల జట్టుహర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), G. కమలిని (వికెట్ కీపర్), భారతీ ఫుల్మాలి, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్*, రాధా యాదవ్, నందిని శర్మచదవండి: క్రికెట్ హిస్టరీలోనే తొలిసారి.. జపాన్‌తో టీ20 మ్యాచ్ ఆడనున్న టీమిండియా -
అలుపెరుగని పోరాటం
న్యూఢిల్లీ: భారత వెటరన్ షూటర్ మేరాజ్ అహ్మద్ ఖాన్... ఆసియా క్రీడల్లో తొలి పతకం సాధించాలనే పట్టుదలతో సాధన చేస్తున్నాడు. ఒలింపిక్స్‌లో పోటీపడిన తొలి భారత స్కీట్ షూటర్‌గా గుర్తింపు సాధించిన 50 ఏళ్ల మేరాజ్... ప్రస్తుతం ఆసియా క్రీడల కోసం సిద్ధమవుతున్నాడు. ఈ నెల 19 నుంచి జపాన్ వేదికగా ఆసియా క్రీడలు ప్రారంభం కానుండగా... 12 మంది షాట్‌గన్ షూటర్ల బృందం ప్రస్తుతం ఢిల్లీలోని కర్ణీ సింగ్ షూటింగ్ రేంజ్లో సాధన చేస్తోంది. గతంలో రెండుసార్లు ఆసియా క్రీడల్లో పాల్గొన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన మేరాజ్... ముచ్చటగా మూడోసారి అయినా పతకం సాధించాలని పట్టుదలగా ఉన్నాడు. ‘ప్రతీ ఒక్కరూ పతకం సాధించాలనే లక్ష్యంతోనే పోటీ పడతారు. అయితే ఎక్కువ అంచనాలు లేకుండా బరిలోకి దిగడమే మేలు అని నేను అనుకుంటాను. ఎందుకంటే అంచనాలు పెరిగితే మనం కలల్లో విహరిస్తూ వాస్తవానికి దూరమవుతాం. ముందు చేయవల్సిన దానిపై దృష్టి పెట్టడం ముఖ్యం’ అని మేరాజ్ అన్నాడు. 1994 నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్న మేరాజ్ రెండు ఒలింపిక్స్ క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. సెపె్టంబర్ 14 వరకు జాతీయ శిక్షణ శిబిరం కొనసాగనుండగా... దీని వల్ల షూటర్లకు ఎంతో మేలు జరుగుతుందని మేరాజ్ అన్నాడు. ‘ఆసియా క్రీడల కోసం బాగా సన్నద్ధమవుతున్నాం. హెడ్ కోచ్ అమరీందర్ సింగ్‌తో పాటు విదేశీ కోచ్ రిచార్డో ఫిలిపెల్లి, ఫిజియో థెరపిస్ట్, స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్ ఇలా అందరూ దగ్గరుండి శిక్షణను పర్యవేక్షిస్తున్నారు. దీని ఫలితాలు ఆసియా క్రీడల్లో తప్పక వస్తాయి. భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) షూటర్లకు అన్నీ ఏర్పాట్లు చేసింది. ఈ సాధన తప్పక ఫలితాన్నిస్తుందనే నమ్మకముంది’ అని మేరాజ్ అన్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ పట్టణానికి చెందిన మేరాజ్(Mairaj Ahmad Khan) అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నీల్లో మూడు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం సాధించాడు. ఆసియా చాంపియన్‌షిప్‌లో ఒక రజతం, ఒక కాంస్యం గెలిచాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో 9వ స్థానంలో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 25వ స్థానంలో నిలిచాడు. 2006 దోహా ఆసియా క్రీడల్లో 28వ స్థానంలో, 2010 గ్వాంగ్జౌ ఆసియా క్రీడల్లో 13వ స్థానంలో, 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో 5వ స్థానంలో నిలిచాడు. భారత భవిష్యత్తు బంగారం మూడు దశాబ్దాలకు పైగా పోటీల్లో పాల్గొంటున్న మేరాజ్ ఖాన్... ఇటీవలి కాలంలో దేశంలో వచ్చిన మార్పులు మంచి భవిష్యత్తుకు సంకేతమని అన్నాడు. ఒకప్పుడు దేశంలో షూటింగ్‌కు పెద్దగా ఆదరణ దక్కేది కాదని... అలాంటిది ఇప్పుడు మౌలిక వసతుల నుంచి మొదలుకొని సంస్థాగతంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్నాడు. ‘మేం షూటింగ్ ప్రారంభించినప్పుడు ఇవన్నీ లేవు. అందుకే ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేందుకు చాలా సమయం పట్టింది. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రాథమిక స్థాయి నుంచే అన్నీ వనరులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం షూటర్ల కోసం సకల ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల దేశంలో షూటింగ్‌కు ఆదరణ పెరిగింది. కేంద్ర క్రీడా శాఖ ఖేలో ఇండియా వంటి మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీని ఫలితాలు రానున్న రోజుల్లో దేశమంతా చూస్తుంది. ఇలాంటి వ్యవస్థ వల్ల సహజ నైపుణ్యం ఉన్న చాంపియన్లు వెలుగులోకి వస్తారు. భవిష్యత్తులో భారత షూటింగ్ మరింత ఉన్నత శిఖరాలకు చేరడం ఖాయం’ అని మేరాజ్ వివరించాడు. ఇటీవల షాట్‌గన్ ప్రపంచకప్‌లో ట్రాప్ విభాగంలో పసిడి పతకం గెలిచిన యువ షూటర్ నీరూ ధండా కూడా ఖేలో ఇండియా క్రీడల ద్వారానే వెలుగులోకి వచ్చాడని మేరాజ్ గుర్తు చేసుకున్నాడు. -
ఏషియాడ్‌లో ‘సేఫ్గార్డింగ్ ఆఫీసర్’
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బృందంతో పాటు ప్రత్యేకంగా ‘సేఫ్గార్డింగ్ ఆఫీసర్’ను పంపిస్తున్నారు. ఈ తరహాలో క్రీడల కోసం అధికారిని నియమించడం ఇదే తొలిసారి. ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) సూచనలతో ఈ ఏర్పాటు అనివార్యమైంది. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు నీతల్ నారంగ్ (Neetal Narang) ‘సేఫ్గార్డింగ్ ఆఫీసర్’ హోదాలో జట్టుతో పాటు ప్రయాణిస్తారు. వేధింపులు, దుర్భాషలు వంటి సమస్యలతో పాటు సౌకర్యాల విషయంలో ఏదైనా నిర్లక్ష్యం కనిపిస్తే అథ్లెట్ల తరఫున వాటి పరిష్కారం కోసం నీతల్ పని చేస్తారు. గతంలో భారత బాక్సింగ్ సమాఖ్యలో కూడా పని చేసిన నీతల్... సేఫ్గార్డింగ్ ఆఫీసర్‌గా పని చేసేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఓసీ) అందించే సర్టిఫికెట్ కోర్సును పూర్తి చేశారు. మరోవైపు ఆసియా క్రీడల్లో భారత్ నుంచి మొత్తం 246 మంది సహాయక సిబ్బంది పాల్గొంటుండగా, వీరిలో 56 మంది మాత్రమే మహిళలు ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. కేవలం మహిళా ఆటగాళ్లే పాల్గొంటున్న జూడో, గోల్ఫ్ టీమ్‌లతో కూడా ఒక్క మహిళా అధికారిని పంపకపోవడం చర్చనీయాంశంగా మారింది. -
టీమిండియా హెడ్‌కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
ఆసియా క్రీడలు-2026 టోర్నీలో పాల్గొనబోయే భారత పురుషుల క్రికెట్ జట్టుకు.. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ క్రికెట్ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ మార్గదర్శనం చేయనున్నాడు. జపాన్‌లో టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో గౌతం గంభీర్‌కు బదులు లక్ష్మణ్ హెడ్‌కోచ్‌గా వ్యవహరించనున్నాడు. కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.గత ఎడిషన్‌లోనూ..కాగా చైనా వేదికగా ఆసియా క్రీడల గత ఎడిషన్‌లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి భారత జట్టు పాల్గొంది. అప్పుడు కూడా లక్ష్మణ్ మార్గదర్శనం చేయగా.. భారత్ స్వర్ణ పతకం సాధించింది. అయితే, ఈసారి మాత్రం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ప్రధాన టీ20 జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జపాన్‌కు పంపేందుకు సిద్ధమైంది.PC: BCCI/Xఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా ఆసియా క్రీడల్లో వీవీఎస్ లక్ష్మణ్ భారత టీ20 జట్టుకు మార్గదర్శనం చేయనుండగా.. గంభీర్ స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌తో బిజీగా ఉండనున్నాడు.అసిస్టెంట్ కోచ్‌లు వీరేఇక కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఆసియా క్రీడల్లో టీమిండియాకు లక్ష్మణ్ హెడ్‌కోచ్‌గా వ్యవహరించనుండగా.. సునిల్ జోషి, హృషికేశ్ కనితక్కర్, శుభదీప్ ఘోష్ అతడికి అసిస్టెంట్లుగా పనిచేయనున్నారు. కాగా జపాన్‌లోని ఐచి- నగోయా వేదికగా సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 4 మధ్య ఆసియా క్రీడల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల టీ20 క్రికెట్ జట్టుశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివం దూబే, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ.చదవండి: IND vs AFG: అతడిని ఎందుకు తప్పించారో సెలక్టర్లకే తెలియాలి


