ఐపీఎల్-2026 సీజన్ తుది దశకు చేరుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి టీమిండియా బిజీ షెడ్యూల్‌పై పడింది.ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత 'మెన్ ఇన్ బ్లూ' వరుస ద్వైపాక్షిక సిరీస్‌లతో బిజీబిజీగా గడపనుంది. తొలుత స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్ట్, మూడు వన్డేల సిరీస్‌లతో భారత్ తలపడనుంది.
ఆ తర్వాత ఐర్లాండ్, ఇంగ్లండ్, జింబాబ్వేలలో టీమిండియా పర్యటించనుంది. అయితే ఈ ఏడాది భారత్‌కు అత్యంత కీలకమైన టోర్నమెంట్లలో ఆసియా క్రీడలు (Asian Games) ఒకటి. ఈ ఏషియన్ గేమ్స్ సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా జరగనున్నాయి. అయితే ప్రతిష్టత్మక ఈవెంట్ కోసం 30 మంది ఆటగాళ్లతో కూడిన ప్రాబబుల్స్ జాబితాను బీసీసీఐ సెలక్షన్ కమిటీ సిద్దం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
'అమర్ ఉజాలా' కథనం ప్రకారం.. ఈ జాబితాలో భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు చోటు దక్కపోయినట్లు తెలుస్తోంది. కానీ ఐపీఎల్‌లో దుమ్ములేపిన వైభవ్ సూర్యవంశీని బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసినట్లు సదరు వార్త పత్రిక తమ కథనంలో పేర్కొంది.
వైభవ్‌తో పాటు యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్ వంటి స్టార్ క్రికెటర్లు కూడా ఈ ఏడాది ఆసియా గేమ్స్‌లో ఆడనున్నట్లు సమాచారం. కాగా ఈ 30 మంది జాబితా నుంచే తుది 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ ఆసియా క్రీడల కోసం జట్టును ప్రకటించడానికి జూన్ 10 చివరి తేదీగా నిర్ణయించినట్లు సమాచారం.
ఇక ఇది ఇలా ఉండగా.. ఈ టోర్నీ సమయంలోనే భారత సీనియర్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య విండీతో 5 టీ20లు, 3 వన్డేలు టీమిండియా ఆడనుంది. సెప్టెంబర్ 27న టీమిండియా విండీస్ పర్యటన ప్రారంభం కానుంది.
అయితే తొలుత వన్డే సిరీస్ జరగనుంది. అనంతరం అక్టోబర్ 6 నుంచి టీ20లు మొదలు కానున్నాయి. ఈ సిరీస్ సమయానికి అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వంటి స్టార్ ప్లేయర్లు జపాన్ టూర్‌ను ముగించుకుని భారత జట్టుతో చేరే అవకాశముంది.
ఆసియా క్రీడలు 2026 కోసం ప్రాబుబుల్స్ లిస్ట్(అమర్ ఉజాలా ప్రకారం)
తిలక్ వర్మ, ఆయుష్ బదోని, హర్షిత్ రానా, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, శ్రేయస్ అయ్యర్, నితీష్ కుమార్ రెడ్డి, ఖలీల్ అహ్మద్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, ప్రసిద్ద్ కృష్ణ, రుతురాజ్ గైక్వాడ్, అనుకుల్ రాయల్, వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్, హర్ష్ దూబే, యష్ ఠాకూర్, వైభవ్ సూర్యవంశీ, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, అభిషేక్ శర్మ, రిషబ్ పంత్


